Thursday, September 19, 2024

పొలం దున్నుతుండగా.. రైతుకి ధగధగా మెరుస్తూ కనిపించిన రాయి.. దగ్గరకెళ్లి చూడగా.!

శాసనాలు చరిత్రకు ఆనవాళ్లు.. ఆ కాలంలో రాజులు, దాతలు రాయించిన శాసనాలు మన చరిత్ర, సమాజం, సంస్కృతిని తెలియచేస్తాయి. క్రీస్తు శకం ప్రారంభంలో ఎక్కడ ఏం జరిగిందో, ఎందుకు జరిగిందో..
తెలియ చెప్పేందుకు ప్రత్యేకంగా గ్రంధస్థం చేసే వ్యవస్థలేని సమయంలో ఈ శాసనాలే ఆనాటి చరిత్రకు ఆనవాళ్లగా పరిగణించాల్సి ఉంటుంది. అలాంటి చరిత్రకు ఆనవాళ్లుగా భావించే శాసనాలు ఆంధ్రప్రదేశ్‌లో అక్కడక్కడా తెలుగు లిపిలో బయటపడుతున్నాయి. అలాంటి వాటిలో తాజాగా మరో తెలుగుశాసనం బయటపడింది. ప్రకాశం జిల్లా బాపనపల్లిలో 8వ శతాబ్దం నాటి తెలుగు శాసనం ఒకటి పొలాల్లో బయటపడింది.

వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్‌లో ఎనిమిదవ శతాబ్ధం నాటి మరో తెలుగు శాసనం లభ్యమైంది. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం బాపనపల్లి సమీపంలోని పొలాల్లో ఓ రాయి రైతులకు కనిపించింది. అయితే దానిపై తెలుగు అక్షరాలు లిఖించి ఉండటంతో ఏదో గుప్తనిధికి సంబంధించిన వివరాలు ఉన్నాయేమో అన్న ఆసక్తితో స్థానికులు చరిత్ర పరిశోధకుడిగా ఉన్న తురిమెళ్ళ శ్రీనివాసప్రసాద్‌కు సమాచారం అందించారు. దీనిని పరిశీలించిన ఆయన వీటి ఫోటోలను ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ కె. మునిరత్నంకు పంపించారు. దీన్ని పరిశీలించిన మునిరత్నం ఈ రాతిపై లిఖించింది శాసనంగా గుర్తించారు. 8 – 9 శతాబ్దాల కాలంలో ఈ శాసనంపై లిఖించినట్టుగా భావిస్తున్నారు. దీనిపై 8వ శతాబ్దపు కాలం నాటి తెలుగు అక్షరాలు ఉన్నట్టు గుర్తించారు. ఈ శాసనంలో మకరద్వజ అను బిరుదును కలిగిన శ్రీ త్రిపురాంతకుడు అనే రాజు ఈ ప్రాంతాన్ని పాలించినప్పుడు రాయించినట్టుగా భావిస్తున్నారు. కైలాస భగవంతుడిగా కీర్తించబడిన శ్రీ ఉమరవెయిధీశ్వర దేవుడికి దండియమ్మ అను ఆమె ” పన్నాస ” అనే భూమి, ఇంటిని బహుమతిగా ఇచ్చినట్లు ఈ శాసనంలో రాసి ఉంది.

బాపనపల్లికి సమీపంలో అయ్యంబొట్లపల్లి గ్రామంలో రామలింగేశ్వరస్వామివారి గుడిలో కూడా ఇలాంటి అక్షరాలతో కూడిన శాసనం, అలాగే గోళ్ళవిడిపిలో గ్రామంలో కూడా ఇదే తరహా లిపితో ఉన్న మరో శాసనం కూడా గతంలో బయటపడినట్టు చెబుతున్నారు. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుంచి క్రీస్తుశకం 4వ శతాబ్దం వరకు శాసనాలను ప్రాకృతంలో, 5వ శతాబ్దంలో సంస్కృతంలో రాసేవారు.. ఆ తరువాత రేనాటి చోళుల కాలంలో తెలుగులో శాసనాలు వేయడం ప్రారంభించారు.

స్వీట్స్ ఎక్కువగా తినడం వల్ల క్యాన్సర్ వస్తుందా.. నిపుణలు ఏం చెప్తున్నారంటే..?!

స్వీట్స్ ఇష్టపడని వారంటే ఎవరు ఉండరు. ఆ పేరు తలుచుకోగానే నోట్లో నీళ్లు ఊరుతూ ఉంటాయి. అయితే దాదాపు అన్ని స్వీట్లు పంచదారతోనే తయారు చేస్తూ ఉంటారు.
కాగా పంచదారను ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెప్తున్నారు. షుగర్ పేషెంట్లు మాత్రమే కాదు ఎవరు స్వీట్లను ఎక్కువగా తిన్న షుగర్ కంటే భయంకరమైన వ్యాధులు కూడా వస్తున్నాయని.. ఇటీవల సర్వేలో వెళ్లడయింది. అవేంటో ఒకసారి చూద్దాం. సాధారణంగా టీ, కాఫీ, స్వీట్లు ఇలా మనం నిత్యం తీసుకునే ఏదో ఒక దానిలో చక్కెరను వాడుతూనే ఉంటాం.

చాలామంది షుగర్ ఎక్కువ వేసుకొని మరి టీ, కాఫీలను ఆస్వాదిస్తూ ఉంటారు. కొందరు ఏకంగా స్వీట్లు ఎక్కువగా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. కేకులు, చాక్లెట్లు, ఐస్క్రీమ్లు ఇలా వేటిలోనైనా ఇప్పుడు అదనపు చెక్కర ఉంటూనే ఉంటుంది. చక్కెరతో చేసిన వాటిని అధికంగా తీసుకోవడం వల్ల హైకొల స్ట్రాల్‌, షుగర్ లాంటి సమస్యలు ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తున్నాయి. చెక్కెరను మితిమీరు తీసుకుంటే క్యాన్సర్ కూడా వస్తుందని తాజాగా బెల్జియం నిపుణులు పరిశోధనలో వివరించారు.

షుగర్ కలిపిన స్వీట్న ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో క్యాన్సర్ గడ్డలు పెరిగే అవకాశాలు ఉన్నాయని.. 9 ఏళ్ల సుదీర్ఘ అధ్యయనం తర్వాత నిపుణులు కనుగొన్నారు. తినుబండారాలు, మిఠాయిలు ఇతర ఆహార పదార్థాలలో చక్కెర పులిసిపోవడంతో శరీరంలో క్యాన్సర్ కణాల శక్తిని పుంజుకుంటున్నాయని.. నిపుణులు ధ్రువీకరించారు. క్యాన్సర్ కణాలు పెరుగుదలకు చక్కెర పులిసిపోవడం ప్రధాన కారణంగా ఉందని.. తీయగా ఉండే షుగర్ లో ఎన్నో ప్రమాదాలు ఉన్నాయని.. సాధారణంగా పంచదారను చాలా తక్కువ లిమిట్ లో వాడడం మంచిదంటూ నిపుణులు చెబుతున్నారు.

PAK vs NZ: సిక్సర్‌ కొట్టిన బంతితో ఉడాయించిన ప్రేక్షకుడు.. నిలిచిపోయిన మ్యాచ్.. వీడియో చూస్తే నవ్వాగదు

న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను కివీస్‌ కైవసం చేసుకుంది. హామిల్టన్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో 21 పరుగుల తేడాతో గెలుపొంది సిరీస్‌లో ఆతిథ్య జట్టు 2-0 ఆధిక్యం సంపాదించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 194 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్థాన్ 173 పరుగులు మాత్రమే చేయగలిగింది. పాక్‌ తరఫున బాబర్‌ అజామ్‌, ఫకర్‌ జమాన్‌ హాఫ్‌ సెంచరీ చేసినా జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు. అయితే వీరిద్దరూ నాలుగు బౌండరీ సిక్సర్లు బాది ప్రేక్షకులను అలరించారు. అదే సమయంలో మ్యాచ్‌కు ఉపయోగించిన బంతి చోరికి గురైన సంఘటన కూడా చోటుచేసుకుంది. దీంతో కాసేపు ఆట నిలిచిపోయింది. నిజానికి న్యూజిలాండ్‌లోని హామిల్టన్‌లో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లోనూ తొలి మ్యాచ్‌లానే వర్షం కురిసింది. ఫిన్ అలెన్ 74 పరుగుల సహకారంతో న్యూజిలాండ్ 20 ఓవర్లలో 194 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్థాన్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. అయితే బాబర్, ఫఖర్ జమాన్ ధాటిగా బ్యాటింగ్ చేసి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఓ వైపు బాబర్ బౌండరీలు కొడుతుంటే, మరోవైపు ఫఖర్ భారీ పెద్ద సిక్సర్లు బాదాడు. అయితే పాకిస్థాన్ ఇన్నింగ్స్ జరుగుతుండగా.. ఆట చూసేందుకు మైదానానికి వచ్చిన ఓ ప్రేక్షకుడు బంతిని దొంగిలించి పారిపోయాడు.

న్యూజిలాండ్ పేసర్ బెన్ సియర్స్ వేసిన 6వ ఓవర్లో ఫఖర్ జమాన్ భారీ సిక్సర్ బాదాడు. బంతి స్టేడియం నుంచి నేరుగా వెళ్లి రోడ్డుపై పడింది ఇది చూసిన కొందరు అభిమానులు బంతిని తీసుకుని పరుగులు తీశారు. ఈ సమయంలో, ఒక ప్రేక్షకుడు బంతిని తీసుకొని మైదానంలోకి విసిరేయకుండా రోడ్డుపై పరుగెత్తడం ప్రారంభించాడు. అతను తిరిగి వస్తాడని అందరూ ఎదురుచూశారు. కానీ బంతిని అందుకున్న వ్యక్తి మళ్లీ మైదానంలోకి రాలేదు. దీంతో మైదానంలో ఉన్న అంపైర్ మరో బంతిని తీసుకుని మ్యాచ్‌ను తిరిగి ప్రారంభించాడు. ఇప్పుడు ప్రేక్షకుడు బంతిని దొంగిలించి పరుగు తీస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

సిక్సర్లతో రెచ్చిపోయిన ఫఖర్ జమాన్..

ఉద్యోగులకు మరో తీపి కబురు.. ఈ నిబంధనలు సవరిస్తూ ప్రభుత్వ కీలక ఉత్తర్వులు..

2023 జూలై 25 కంటే ముందు చేపట్టిన చర్యలకు ఈ సవరణ వర్తిస్తుందని పేర్కొంది. ఉద్యోగులపై చర్యలకు సంబంధించి చార్జ్‌ట్లను డిస్పోజ్‌ చేసేటప్పుడు ఉమ్మడి జిల్లా డిప్యూటీ సీటీఎంలను కమిటీ సభ్యులుగా చేర్చడం, అప్పీళ్లను డిస్పోజ్‌ చేసేటప్పుడు రివ్యూ అథారిటీలో ఉమ్మడి జిల్లా రీజనల్‌ మేనేజర్‌ను సభ్యుడిగా చేర్చడం, ఆ పైస్థాయిలో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌కు మెర్సీ పిటిషన్‌ను పరిశీలించేందుకు అనుమతించింది.
రెండేళ్లుగా అప్పీళ్లు, రివ్యూ అథారిటీ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులకు ప్రభుత్వ ఉత్తర్వులతో ఊరట లభించింది. వారి కేసుల సత్వర పరిష్కారానికి మార్గం సుగమమైంది. 2023 జులై 25 తరువాత వచ్చిన కేసులకు మాత్రం తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు వేచి ఉండాలని అధికారులు పేర్కొన్నారు.

సర్విసు నిబంధనలను సవరించడంపై ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వానికి పలు సంఘాల నేతలు కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్సార్‌ ఆర్టీసీ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు చల్లా చంద్రయ్య, కార్యనిర్వహణ అధ్యక్షుడు జీఏం నాయుడు, ప్రధాన కార్యదర్శి డీఎస్‌పీ రావు, నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీవీ రమణారెడ్డి, వై.శ్రీనివాసరావు శుక్రవారం వేర్వేరు ప్రకటనల్లో కృతజ్ఞతలు తెలియజేశారు.

రేవంత్ మంత్రివర్గంలోకి కోదండరామ్ – విస్తరణ ముహూర్తం ఫిక్స్, లిస్టులో..!!

ముఖ్యమంత్రి రేవంత్ పార్టీలో పదవుల పంపకం పైన కసరత్తు చేస్తున్నారు. లోక్ సభ ఎన్నికలకు ముందే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాలని భావిస్తున్నారు. తెలంగాణలో మెజార్టీ లోక్ సభ సీట్లు గెలవటం ఇప్పుడు రేవంత్ కు సవాల్ గా మారుతోంది.
దీంతో, మంత్రివర్గ విస్తరణకు హైకమాండ్ అనుమతి కోరారు. తన కేబినెట్ లోకి ప్రొఫెసర్ కోదండరామ్ ను తీసుకోవాలని రేవంత్ ఆలోచనగా తెలుస్తోంది. దీని పైన హైకమాండ్ తుది ఆమోదం రావాల్సి ఉంది.

రేవంత్ కసరత్తు : రేవంత్ రెడ్డి పాలనలో..పార్టీలో కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. పార్టీలో ముఖ్య నిర్ణయాలకు హైకమాండ్ అనుమతితోనే అమలు చేయనున్నారు. ఈ క్రమంలో భాగంగా మంత్రివర్గ విస్తరణ దిశగా కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ మంత్రివర్గంలో మరో ఆరుగురికి అవకాశం ఉంది. వారి కోసమే కొన్ని ప్రధాన శాఖలను పెండింగ్ పెట్టారు. అందులో హోం శాఖతో పాటుగా విద్యా, సాంఘిక సంక్షేమం, మున్సిపల్ వంటి కీలక శాఖలు ఉన్నాయి. ప్రస్తుత కేబినెట్ లో నిజామాబాద్, అదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కలేదు. లోక్ సభ ఎన్నికలకు ముందే ఈ జిల్లాలకు ప్రాధాన్యత ఇస్తూ మంత్రివర్గ విస్తరణ పూర్తయ్యేలా రేవంత్ ప్లాన్ చేస్తున్నారు.
కోదండరాం కు ఛాన్స్ : ఈ నెలాఖరులోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని పార్టీలో ప్రచారం సాగుతోంది. నామినేటెడ్ పోస్టులను కొన్నింటిని ప్రకటించేందుకు కసరత్తు తుది దశకు చేరినట్లు సమాచారం. ఇక మంత్రి వర్గ విస్తరణలో ప్రొఫెసర్ కోదండరాం కు అవకాశం ఇవ్వాలనేది రేవంత్ ఆలోచనగా తెలుస్తోంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల్లో ఒకటి కోదండరాం కు ఖరారు అయింది. తెలంగాణ ఉద్యమ సమయంలో కోదండరాం క్రియాశీలకంగా వ్యవహరించారు. పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేసి అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెచ్చారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచారు. దీంతో, కోదండరాం కు మంత్రిని చేసి విద్యాశాఖ అప్పగించటం ద్వారా ప్రొఫెసర గా ఆయన అనుభవం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
త్వరలో విస్తరణ : కోదండరాంకు మంత్రి పదవి ఇవ్వటం ద్వారా బీఆర్ఎస్ పైన నైతికంగా పై చేయి సాధించవచ్చనేది రేవంత్ వ్యూహంగా కనిపిస్తోంది. ఇక, మిగిలిన అయిదు మంత్రి పదవుల్లో షబ్బీర్ అలీకి ఖాయమని చెబుతున్నారు. ఆదిలాబాద్ నుంచి గడ్డం బ్రదర్స్ మధ్యే పోటీ నడుస్తోంది. చెన్నూరులో గెలిచిన వివేక్, బెల్లంపల్లిలో గెలిచిన వినోద్ కేబినెట్ బెర్త్ కోసం సోనియాను కలిసారు. రేవంత్ తనకు అవకాశం ఇస్తారని వివేక్ నమ్మకం తో ఉన్నారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్ రావ్ కూడా కేబినెట్ ప్రయత్నాల్లో ఉన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి పేరు పరిశీలనలో ఉన్నాయి. హైదరాబాద్ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థులు ఎవరూ గెలవలేదు. అయినప్పటికీ మైనార్టీ కోటాలో ఫిరోజ్‌ఖాన్‌ పోటీలో ఉన్నా..షబ్బీర్ అలీకి ఓకే అయితే ఫిరోజ్‌ఖాన్‌కి అవకాశాలు సన్నగిల్లుతాయి. అదే సమయంలో కీలకమైన హోం శాఖ ఎవరికి అప్పగిస్తారనేది తేలాల్సి ఉంది.

ఫైనాన్షియల్‌ లిటరసీలో విద్యార్థులకు అవగాహన కల్పించాలి: సీఎం జగన్‌

విద్యాశాఖపై తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌. సురేష్ కుమార్‌, పాఠశాల విద్యాశాఖ(మౌలిక వసతులు కల్పన) కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

విద్యాశాఖలో అమలు చేస్తున్న పలు కార్యక్రమాల ప్రగతిని సీఎంకు అధికారులు వివరించారు. ఐబీ విద్యా బోధనపై సీఎం సమీక్షించారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఐబీ బోధనపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. విద్యాశాఖలో టీచర్ల సహా సిబ్బంది, అధికారులకు ఐబీ ప్రతినిధులు శిక్షణ ఇవ్వనున్నారు. టీచర్లు, ఎంఈఓలు, డీఈఓలు సహా సిబ్బంది శిక్షణ పొందనున్నారు. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఐబీ విద్యా బోధన ఒకటో తరగతితో ప్రారంభం కానుంది. ఐబీ.. జాయింట్‌ సర్టిఫికేషన్‌ ఇవ్వనుంది.
ఫ్యూచర్‌ స్కిల్స్‌లో ముందడగుపై సీఎం సమీక్ష
ప్రభుత్వ పాఠశాలల్లో ఫ్యూచర్‌ స్కిల్స్‌లో ముందడగుపై సీఎం సమీక్ష జరిపారు. ప్రతి మూడు పాఠశాలలకు ప్యూచర్‌ స్కిల్స్‌పై ఒక నిపుణుడు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు.. ఇప్పటికే 2066 మంది ఫ్యూచర్‌ స్కిల్స్‌ ఎక్స్‌పర్ట్‌లను వివిధ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో గుర్తించామని వెల్లడించారు. వారికి గౌరవవేతనం చెల్లిస్తున్నామని అధికారులు తెలిపారు.

ఫ్యూచర్‌ స్కిల్స్‌ అంశాన్ని పాఠ్య ప్రణాళికలో పొందుపరిచే కార్యక్రమాన్నీ త్వరగా పూర్తిచేయాలన్న సీఎం.. దీనిలో భాగంగా ఫైనాన్షియల్‌ లిటరసీలో కూడా విద్యార్థులకు అవగాహన కల్పించాలని.. దీనివల్ల ఆర్థిక వ్యవహారాలపై అవగాహన ఏర్పడుతుందని సీఎం అన్నారు. 8వ తరగతి నుంచి ఒక సబ్జెక్టుగా ఫ్యూచర్‌ స్కిల్స్‌ బోధించేందుకు చర్యలు తీసుకున్నామన్న అధికారులు. ఇప్పటికే ఒక సెమిస్టర్‌కు సంబంధించి సిలబస్‌ రూపొందించామని అధికారులు వెల్లడించారు.

ఏపీ హైకోర్టు లో సివిల్‌ జడ్జి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల ముఖ్య తేదీలివే

AP High Court Recruitment 2024 : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి ఉద్యోగ ప్రకటన విడుదలైంది. రాష్ట్ర జ్యుడీషియల్‌ సర్వీసెస్‌లో భాగంగా 39 సివిల్‌ జడ్జి పోస్టుల(జూనియర్‌ డివిజన్‌)ను భర్తీ చేయనున్నారు.
ఆన్‌లైన్ దరఖాస్తులు జనవరి 31వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్య వివరాలు చూస్తే…..

ముఖ్య వివరాలు:

రిక్రూట్ మెంట్ ప్రకటన – ఏపీ హైకోర్టు (ఏపీ స్టేట్‌ జ్యుడీషియల్‌ సర్వీసు).

ఉద్యోగాలు – సివిల్‌ జడ్జి (జూనియర్‌ డివిజన్‌)

మొత్తం ఖాళీలు – 39 పోస్టులు( ఇందులో 32 ఖాళీలు డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన భర్తీ చేస్తారు. మరో 7 ఖాళీలు ట్రాన్స్‌ఫర్‌ ద్వారా అవుతాయి)

అర్హత -లా డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి – 35 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌లకు అయిదేళ్లు; దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు -ఆన్ లైన్ విధానంలో చేయాలి.

అప్లికేషన్ ఫీజు – రూ.1500 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులు రూ.750 చెల్లించాలి.

దరఖాస్తులు ప్రారంభం – 31 జనవరి 2024.

దరఖాస్తులకు తుది గడువు 01 మార్చి 2024.

స్క్రీనింగ్ టెస్ట్ హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్ – 15 మార్చి 2024.

స్క్రీనింగ్ పరీక్ష తేదీ (కంప్యూటర్ ఆధారిత పరీక్ష)- 13 ఏప్రిల్ 2024.
ఎంపిక ప్రక్రియ – స్క్రీనింగ్ టెస్ట్, రాత పరీక్ష, వైవా-వాయిస్ టెస్ట్ తదితరాల ఆధారంగా తుది జాబితా ఉంటుంది.

ఎగ్జామ్ టైం – 2 గంటలు

స్క్రీనింగ్ టెస్ట్ పరీక్ష కేంద్రాలు – గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖ.

వెబ్ సైట్ – https://aphc.gov.in/index.html

చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. ఒకే ఒక్కడిగా..!

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. అఫ్గానిస్థాన్‌తో ఇండోర్ వేదికగా జరుగుతున్న రెండో టీ20తో హిట్‌మ్యాన్ ఈ ఫీట్ సాధించాడు.
2007లో భారత్ తరపున అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేసిన హిట్ మ్యాన్ తాజా మ్యాచ్‌తో 150 టీ20 మ్యాచ్‌ల మైలు రాయిని అందుకున్నాడు.

అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్లలో రోహిత్ శర్మ తర్వాత ఐర్లాండ్ ప్లేయర్ స్టిర్లింగ్ ఉన్నాడు. ఇప్పటి వరకు స్టిర్లింగ్ 134 మ్యాచ్‌లు ఆడాడు. మరో ఐర్లాండ్ ప్లేయర్ డాకర్లెల్ (128), పాకిస్థాన్ బ్యాటర్ షోయబ్ మాలిక్ (124), న్యూజిలాండ్ బ్యాటర్ మార్టిన్ గప్తిల్ (122) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

 

2010లోనే అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేసిన విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 116 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 44 పరుగులు చేస్తే టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన టీమిండియా కెప్టెన్‌గా రికార్డు సాధిస్తాడు. మరో 147 పరుగులు చేస్తే టీ20ల్లో నాలుగు వేల పరుగుల మార్క్‌ను అందుకున్న రెండో భారత ప్లేయర్‌గా నిలుస్తాడు.

భారత్ తరపున విరాట్ కోహ్లి మాత్రమే ఈ ఘనతను అందుకున్నాడు. అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేస్తే టీ20ల్లో విజయవంతమైన కెప్టెన్‌గా రోహిత్ చరిత్రకెక్కుతాడు. ఇప్పటివరకు 53 మ్యాచ్‌లకు టీమిండియా సారథిగా కొనసాగిన రోహిత్ శర్మ 40 మ్యాచ్‌ల్లో జట్టును గెలిపించాడు.

తాజా మ్యాచ్‌తో పాటు చివరి మ్యాచ్ గెలిస్తే.. 54 మ్యాచ్‌ల్లో 42 విజయాలు నమోదు చేస్తాడు. అప్పుడు ధోనీ పేరిట ఉన్న రికార్డును సమం చేస్తాడు. మహేంద్ర సింగ్ ధోనీ 42 మ్యాచ్‌ల్లో విజయాన్ని అందించాడు. అతనితో పాటు అస్గర్ (అఫ్గానిస్థాన్), బాబర్ అజామ్ (పాకిస్థాన్), ఇయాన్ మోర్గాన్ (ఇంగ్లాండ్), బ్రెయిన్ మసబా (ఉగాండ) ఈ రికార్డును కలిగి ఉన్నారు.

 

రిలయన్స్‌లో గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ ప్రోగ్రామ్.. అర్హతలు ఇవే..

గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ (Graduate Engineer Trainee) 2024లో భాగంగా వివిధ విభాగాల్లో యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తోంది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ తదితర వివరాలు ఇవే..
ఉండాల్సిన అర్హతలు :
ఏదైనా ఏఐసీటీఈ (AICTE) గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుంచి 2024లో బీటెక్‌/బీఈ పూర్తి చేసే విద్యార్థుల నుంచి రిలయన్స్‌ ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కెమికల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ వంటి స్ట్రీమ్‌లలో ఈ నియామకాలు ఉంటాయి. అలాగే విద్యార్థులకు ఇంజనీరింగ్‌లో కనీసం 60% లేదా అంతకంటే ఎక్కువ మార్కులు ఉండాలి. 10వ తరగతి, 12వ తరగతి డిప్లొమా కోర్సుల్లో కనీసం 60% లేదా 6 క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్ యావరేజ్ సాధించి ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా..

ఎంపిక విధానం: అప్లికేషన్‌ షార్ట్‌లిస్టింగ్‌, ఆన్‌లైన్‌ అసెస్‌మెంట్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
జీతం :
ఉద్యోగంలో చేరిన ఐఐటీ గ్రాడ్యుయేట్లకు ఫిక్స్‌డ్ పే కింద సంవత్సరానికి రూ.7.50 లక్షలు, 12 నెలలు పూర్తయిన తర్వాత ఫిక్స్‌డ్ పే కింద సంవత్సరానికి రూ.8.00 లక్షలు ఉంటుంది. అలాగే వార్షిక బోనస్ కింద సంవత్సరానికి రూ.88 వేలు ఇస్తారు. ఉద్యోగం పర్మినెంట్ అయిన తరువాత సంస్థ నిబంధనల ప్రకారం ఇంక్రిమెంట్లు, ఇతర భత్యాలు ఉంటాయి. కన్‌ఫర్మేషన్ అనంతరం రెండేళ్లు పూర్తయితే రూ.3 లక్షల వన్-టైమ్ డిఫర్డ్ బోనస్ ఉంటుంది.

ఉద్యోగంలో చేరిన నాన్ ఐఐటీ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగంలో చేరినప్పుడు ఫిక్స్‌డ్ పే కింద సంవత్సరానికి రూ.9.00 లక్షలు, సంవత్సరం పూర్తయిన తర్వాత ఫిక్స్‌డ్ పే కింద రూ.9.50 లక్షలు ఉంటుంది. వార్షిక బోనస్ కింద సంవత్సరానికి సంవత్సరానికి రూ.1.05 లక్షలు ఇస్తారు. ఉద్యోగం పర్మినెంట్ తర్వాత సంస్థ నిబంధనల ప్రకారం ఇంక్రిమెంట్లు, ఇతర భత్యాలు ఉంటాయి. కన్‌ఫర్మేషన్ అనంతరం రెండేళ్లు పూర్తయిన
తర్వాత రూ.5 లక్షల వన్-టైమ్ డిఫర్డ్ బోనస్ ఇస్తారు.
ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ : 11-01-2024 నుంచి 19-01-2024 వరకు.

ఆన్‌లైన్ అసెస్‌మెంట్ : 05-02-2024 నుంచి 08-02-2024 వరకు.

ఇంటర్వ్యూ : 23-02-2024 నుంచి 01-03-2024 వరకు.

తుది ఎంపిక: మార్చి, 2024 చివరి నాటికి పూర్తవుతాయి.

వెబ్‌సైట్‌:https://relianceget2024.in/

ఆర్మీలో NCC స్పెషల్ ఎంట్రీ స్కీమ్.. ఈ అర్హతలుండాలి.. నెలకు రూ.56,100 జీతం

ఇండియన్ ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 56వ కోర్సు అడ్మిషన్స్​కు అర్హులైన అవివాహిత పురుషులు, మహిళల నుంచి అప్లికేషన్స్​ కోరుతోంది.
కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత ఉన్నవారైనా, ప్రస్తుతం ఫైనల్​ ఇయర్​ చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. మూడు అకడమిక్‌ సంవత్సరాలు ఎన్‌సీసీ సీనియర్‌ డివిజన్‌ వింగ్‌లో కొనసాగి ఉండాలి. ఎన్‌సీసీ సి సర్టిఫికెట్‌లో కనీసం బి గ్రేడ్‌ పొంది ఉండాలి. సెలెక్షన్​ ప్రాసెస్​: అప్లికేషన్‌ షార్ట్‌లిస్ట్, స్టేజ్-1, స్టేజ్-2 టెస్టులు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ట్రైనింగ్​: ఎంపికైన అభ్యర్థులకు ఆఫీసర్స్‌ ట్రెయినింగ్‌ అకాడెమీ చెన్నైలో 49 వారాలు ట్రైనింగ్​ ఇస్తారు. ఈ సమయంలో ప్రతి నెలా రూ.56,100 స్టైఫండ్‌ చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నవారికి పీజీ డిప్లొమా ఇన్‌ డిఫెన్స్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ స్ట్రాటజిక్‌ స్టడీస్‌ డిగ్రీని మద్రాస్‌ యూనివర్సిటీ ప్రదానం చేస్తుంది. వీరిని లెఫ్టినెంట్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు.
దరఖాస్తులు : ఆన్​లైన్​లో ఫిబ్రవరి 6 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.joinindianarmy.nic.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.

మంగళగిరి ఎయిమ్స్ లో టీచింగ్ పోస్టులు, ఇలా అప్లై చేసుకోండి!

AIIMS Mangalagiri Jobs : మంగళగిరి ఎయిమ్స్(AIIMS)లో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎయిమ్స్ లో మెడికల్ సూపరింటెండెంట్, రిజిస్ట్రార్, నర్సింగ్ సూపరింటెండెంట్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉండాలి. ఇంటర్య్వూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.2,18,200 జీతాభత్యాలు ఇస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 4వ తేదీలోపు మంగళగిరి ఎయిమ్స్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్ లో తెలిపారు.

ఖాళీల వివరాలు

ఎయిమ్స్ మంగళగిరిలో మెడికల్ సూపరింటెండెంట్, రిజిస్ట్రార్, నర్సింగ్ సూపరింటెండెంట్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఐదు పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించారు. మూడేళ్ల కాలానికి కాంట్రాక్టు ప్రాతిపదికన పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 56 సంవత్సరాలుగా నిర్ణయించారు.

జీతం వివరాలు

మెడికల్ సూపరింటెండెంట్- ఎంపికైన అభ్యర్థులకు రూ.1,44,200 నుంచి రూ.2,18,200లు నెలవారీ జీతంగా చెల్లిస్తారు. .
రిజిస్ట్రార్ పోస్టుకు- ఎంపికైన అభ్యర్థులకు రూ. 78,800 నుంచి రూ. 2,09,200లు నెలవారీ జీతం చెల్లిస్తారు.
నర్సింగ్ సూపరింటెండెంట్- ఎంపికైన అభ్యర్థులకు రూ. 67,700 నుంచి రూ.2,08,700 నెలవారీ జీతం
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్- ఎంపికైన అభ్యర్థులకు రూ. 56,100 నుంచి రూ.1,77,500 నెలవారీ జీతం
ఎలా దరఖాస్తు చేయాలి

అర్హత కలిగిన అభ్యర్థులు ఎయిమ్స్ మంగళగిరి అధికారిక వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆ దరఖాస్తు ఫామ్ ప్రింటౌట్ తీసుకొని చివరి తేదీకి ముందుగా మంగళగిరి ఎయిమ్స్ చిరునామాకు పంపాలి.

ఆ చిరునామా- “రిక్రూట్‌మెంట్ సెల్, అడ్మిన్ మరియు లైబ్రరీ బిల్డింగ్, ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మంగళగిరి, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్- 522503”. ఆన్‌లైన్ దరఖాస్తు ఫామ్‌ను సమర్పించడానికి చివరి తేదీ ఫిబ్రవరి 4, 2024.

ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్ పోస్టులు

మంగళగిరి ఎయిమ్స్ లో ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్ పోస్టుల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 125 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. మెడికల్ పీజీ, ఎండీ, ఎంఎస్, ఎంసీహెచ్, డీఎం ఉత్తీర్ణతతో పాటు వర్క్ ఎక్స్ పీరియన్స్ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు జనవరి 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్థులు రూ.3,100, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు రూ.2,100, దివ్యాంగులకు రూ.100 ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తుకు జనవరి 29 చివరి తేదీకాగా, దరఖాస్తుల హార్డ్ కాపీలను ఫిబ్రవరి 8వ తేదీలోపు మంగళగిరి ఎయిమ్స్ అడ్రస్ కు పంపించాల్సి ఉంటుంది.
మొత్తం ఖాళీలు

ప్రొఫెసర్- 20 పోస్టులు

అసిస్టెంట్ ప్రొఫెసర్- 73 పోస్టులు

అడిషనల్‌ ప్రొఫెసర్- 10 పోస్టులు

అసోసియేట్ ప్రొఫెసర్- 22 పోస్టులు

నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో 119 పోస్టుల భర్తీ, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చంటే..

నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) డిప్యుటేషన్ ప్రాతిపదికన 119 ఇన్‌స్పెక్టర్,సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు: 119
ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు: 43
సబ్‌-ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు: 51 పోస్టులు
అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు: 13
హెడ్‌ కానిస్టేబుల్‌ పోస్టులు: 12

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో జరుగుతుంది(సంబంధిత విభాగంలో అర్హులైన అభ్యర్థులు న్యూడిల్లీలోని లోధి రోడ్‌లోని CGO కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న NIA హెడ్‌ క్వార్టర్స్‌కి వెళ్లి సంబంధిత పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది)

దరఖాస్తుకు చివరి తేదీ: 20.02.2024
వెబ్‌సైట్‌: https://nia.gov.in/

పది అర్హత తో జాబ్స్.. అర్హతలు, జీతం పూర్తి వివరాలు..

బ్యాకులో ఉద్యోగం చెయ్యాలని అనుకొనేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్- దేశ వ్యాప్తంగా ఉన్న సీబీఐ శాఖల్లో సఫాయి కర్మచారి కమ్ సబ్-స్టాఫ్/ సబ్-స్టాఫ్ పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులను కోరుతుంది..
పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు జనవరి 16 వ తేదీలోగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.. ఈ పోస్టుల గురించి అర్హతలు, జీతం గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం..

పోస్టుల వివరాలు..

సఫాయి కర్మచారి కమ్ సబ్-స్టాఫ్/ సబ్-స్టాఫ్: 484 పోస్టులు
జోన్ల వారీగా ఖాళీలు: అహ్మదాబాద్- 76,లక్నో-78,ఢిల్లీ-76, భోపాల్- 38, కోల్‌కతా- 2, ఎంఎంజడ్‌వో & పుణె- 118, పట్నా- 96..

అర్హతలు..

ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి 10వ తరగతి లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. అంతేకాకుండా స్థానిక భాషపై కూడా పరిజ్ఞానం ఉండాలి..
వయస్సు..

31.03.2023 నాటికి 18 – 26 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్ల, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది..

వేతనం..

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు నెలకు రూ.14,500- రూ.28145..

ఎంపిక ప్రక్రియ..

ఆన్‌లైన్ పరీక్ష(70 మార్కులు), లోకల్ లాంగ్వేజ్ టెస్ట్(30 మార్కులు), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ పరీక్ష ఆంగ్ల మాధ్యమంలో ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. ఇంగ్లిష్ లాంగ్వేజ్‌ నాలెడ్జ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, ఎలిమెంటరీ అరిథ్‌మెటిక్‌, సైకోమెట్రిక్ టెస్ట్(రీజనింగ్) అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు..

అప్లికేషన్ ఫీజు..

ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం అభ్యర్థులకు రూ.175. ఇతరులకు రూ.850..
ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 20.12.2023.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 16.01.2024.

ఆన్‌లైన్ పరీక్ష: ఫిబ్రవరి 2024.

పరీక్ష ఫలితాల వెల్లడి: ఫిబ్రవరి 2024..

ఈ ఉద్యోగాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే అధికార వెబ్ సైట్ ను పరిశీలించగలరు..

సమగ్ర శిక్ష ఉద్యోగి మృతితో ఉద్రిక్తత

అనకాపల్లి రూరల్‌, జనవరి 9: నిరవధిక సమ్మెలో పాల్గొంటున్న సమగ్ర శిక్ష అభియాన్‌ ఉద్యోగి మృతి అనకాపల్లిలో మంగళవారం ఉద్రిక్తతకు దారితీసింది. ఆయన మృతదేహంతో కుటుంబ సభ్యులు, ఉద్యోగులు జిల్లా విద్యా శాఖాధికారి కార్యాలయం ఎదుట ఐదు గంటలపాటు ఆందోళన చేశారు.
వివరాలిలా ఉన్నాయి. మునగపాక మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్న జడ్డు వాసుదేవరావు(ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగి) సమ్మెలో భాగంగా గతనెల 23న అనకాపల్లి మండలం కొండకొప్పాకలోని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట దీక్షా శిబిరంలో కూర్చున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా కుప్పకూలడంతో వెంటనే ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఆయనకు బ్రెయున్‌ స్ర్టోక్‌ వచ్చినట్టు వైద్యులు గుర్తించి శస్త్ర చికిత్స చేశారు.

అప్పటి నుంచి ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్న వాసుదేవరావు మంగళవారం మృతిచెందారు. ఆయన మృతదేహాన్ని కొండకొప్పాకలో సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన దీక్షా శిబిరం వద్దకు తీసుకొచ్చారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సుమారు 5గంటల పాటు ఆందోళన చేయడంతో


’ఉద్రిక్తత నెలకొంది. సమాచారం తెలుసుకున్న మంత్రి

బొత్స స్పందించి తక్షణం
రూ.2.25 లక్షలు ఇవ్వాల్సిందిగా జిల్లా అధికారులకు ఆదేశాలిచ్చారని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ వివరించారు. మరొక రూ.10 లక్షలు కుటుంబానికి ఇస్తామని, వాసుదేవరావు భార్యకు సమగ్ర శిక్షలో ఉద్యోగం ఇస్తామని బొత్స హామీ ఇచ్చినట్టు పీలా తెలిపారు. ఆ తర్వాత ఆందోళన విరమించి, మృతదేహాన్ని తరలించారు.

ఆంగ్ల మాధ్యమమే మంచిదనే భ్రమలొద్దు

రాష్ట్రంలో 40 వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉండడం దురదృష్టకరంకర్నూలులో ఎస్టీయూ వజ్రోత్సవాల్లో సుప్రీంకోర్టు విశ్రాంత సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ
కర్నూలు: రాష్ట్రంలో 40 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తన దృష్టికి తెచ్చారని, ఇది దురదృష్టకరమని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ఆవేదన వ్యక్తం చేశారు.
కర్నూలులోని ఎగ్జిబిషన్‌ మైదానంలో శుక్రవారం నిర్వహించిన రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) వజ్రోత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఐదో తరగతి చదివేవారిలో సగానికి సగం మంది రెండంకెల కూడికలు, తీసివేతలు చేయలేకపోతున్నారని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు మాతృభాషలో బోధించాలని ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేశారు.

‘పిల్లలు ఆంగ్ల మాధ్యమంలో చదివితేనే బాగుపడతారని, ఇతర దేశాలకు వెళతారని, డాలర్లు వస్తాయన్న భ్రమల్లో ఉన్నారు. అది చాలా తప్పు’ అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇతర శాఖల ఉద్యోగులతో పోలిస్తే ఉపాధ్యాయుల స్థాయిగానీ, జీతభత్యాలుగానీ సరిపడా లేవని ఆయన పేర్కొన్నారు. ‘పోటీ తట్టుకోలేక, సీట్లు రాలేవన్న ఆవేదనతో కొందరు పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పిల్లల్ని కనేది చంపడానికా?’ అని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నవారు బాధ్యతగా ప్రవర్తిస్తున్నారని, సమాజం గురించి ఆలోచిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి రాలేకపోయారని.. ప్రభుత్వ ప్రతినిధులు ఎవరైనా వచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఎస్టీయూ ఉద్యమపథాన్ని ప్రశంసించారు.

పాలకులు వారి వర్గ స్వభావానికి అనుగుణంగా విద్యా విధానాలు తయారుచేస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. రాజ్యాంగ, లౌకికవాద స్ఫూర్తికి భిన్నంగా రామాయణం, భారతం, భాగవతం బోధించాలని పాలకులు చెబుతున్నారని.. ఇదేంటని అడిగితే పిల్లల్లో దేశభక్తి లేక విదేశాలకు వెళ్లిపోతున్నారని పేర్కొంటున్నారని వాపోయారు. ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.సాయిశ్రీనివాస్‌ మాట్లాడుతూ విద్యావిధానం భ్రష్టు పట్టిపోయేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించారు.ప్రభుత్వాలు మారినప్పుడల్లా విధానాలు మారకుండా విద్యారంగాన్ని ఒక స్వతంత్ర వ్యవస్థగా మార్చాల్సిన అవసరముందని పేర్కొన్నారు. వేదికపై ఎస్టీయూ వజ్రోత్సవ సావనీర్‌, ఉపాధ్యాయవాణి ప్రత్యేక సంచిక, వజ్రోత్సవ లోగోను జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, అతిథులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ తెలంగాణ నేత చాడ వెంకటరెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌, అన్ని జిల్లాలనుంచి పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

గుడ్‌న్యూస్, త్వరలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్, ఎన్ని పోస్టులంటే

DSC Notification: ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్, సంక్రాంతి పండుగ తరువాత మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమౌంది. ఈ విషయాన్ని స్వయంగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.
ఎన్ని పోస్టులుంటాయి, ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేయనున్నారనే వివరాలతో నోటిఫికేషన్ ఉంటుంది.

ఏపీ ప్రభుత్వం త్వరలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇప్పటికే ఈ విషయమై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో చర్చించామని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మెగా డీఎస్సీలో ఎన్ని పోస్టులుంటాయి, ఉద్యోగాల భర్తీ విధి విధానాలు త్వరలో వెల్లడి కానున్నాయి. చాలాకాలంగా డీఎస్సీ నోటిఫికేషన్ లేకపోవడంతో నిరుద్యోగ అభ్యర్ధులు నిరాశతో ఉన్నారు. ఈ నోటిఫికేషన్‌లో భారీగా అంటే10 వేలకు పైగా పోస్టులు భర్తీ చేయనున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా మార్చ్ నాటికి డీఎస్పీ రిక్రూట్‌మెంట్ పూర్తయ్యేలా షెడ్యూల్ ఉండవచ్చని సమాచారం. మరోపు గ్రూప్ 2 దరఖాస్తుల గడువు తేదీని ఏపీ ప్రభుత్వం జనవరి 17 వరకూ పొడిగించింది. ఆన్‌లైన్ దరఖాస్తుల్లో ఇబ్బందులు ఎదుర్కోవడంతో గడువు తేదీని ప్రభుత్వం పొడిగించింది. ప్రస్తుతం దరఖాస్తులు స్వీకరిస్తున్న గ్రూప్ 2 నోటిఫికేషన్ ద్వారా 897 పోస్టులు భర్తీ కానున్నాయి

అందాల హరివిల్లు బల్లాల రాయనదుర్గ కోట

బనశంకరి: బల్లాల రాయనదుర్గ అనేది చిక్‌మగళూరు పశ్చిమ కనుమల మధ్య పర్వతం మీద ఉన్న కోట. సముద్ర మట్టానికి 1509 మీటర్ల ఎత్తులో ఉన్న వాన్టేజ్‌ పాయింట్‌.
లోయలు, ప్రవాహాలు, రోలింగ్‌ పొగమంచు పర్వతాలతో నయమనోహరంగా ఉంటుంది. అన్నింటి కంటే మించి ఇక్కడ తేమతో కూడిన మేఘాలు పర్యాటకులను కనువిందు చేస్తాయి.
ట్రెక్కింగ్‌ స్వర్గధామం కనువిందు చేసే పర్వతాలు చిక్‌మగళూరుకు చారిత్రక నేపథ్యం కొండపై నుంచి జాలువారుతున్న జలపాతం

బల్లాల రాయన దుర్గ చేరుకోవడానికి దట్టమైన అడవులు పచ్చిక భూములు మధ్య ట్రెక్కింగ్‌ చేయాలి. రాయన దుర్గ ప్రాంతంలో అడుగుపెట్టగానే కొండల అంచున కిలోమీటర్లు దూరంలో నిర్మించిన కోటగోడను చూడవచ్చు. కోట బయటి గోడపై నిలబడి సూర్యుడి రంగుల కాంతులు వీక్షిస్తూ సందడి చేయవచ్చు. బల్లాల రాయనకొండలు హొయసల రాజవంశానికి చెందిన వీర బల్లాల మొదటి భార్య నిర్మించిన కోట నిలయం. 12వ శతాబ్దంలో కర్ణాటక ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించారు. చారిత్రకంగా, సాంస్కృతికంగా ప్రఖ్యాతి పొందింది. కానీ నేడు కోట శిథిలాలు అంటే పగిలిన గోడలు, తోరణాలు, నేలమాళిగ మాత్రమే ఉంది. దుర్గాదహళ్లిలోని కోట పాదాల వద్ద ఉన్న కాల బైరవేశ్వర దేవాలయం వద్ద నుంచి ట్రెక్కింగ్‌ ప్రారంభమౌతుంది. ఇది బల్లాల రాయనదుర్గ శిఖరానికి నాలుగు కిలోమీటర్లు మేర ఉండటంతో రెండు గంటలు సమయం పడుతుంది. ట్రెక్‌లో కొన్ని నిమిషాల తరువాత ఒకటవ పాయింట్‌కు చేరుకుని దిగువన గల గ్రామం పట్టణాన్ని వీక్షించవచ్చు. అధికంగా పచ్చని గడ్డితో కూడిన పచ్చిక బయళ్లలో అటవీమార్గంలో ట్రెక్కింగ్‌ చేయాలి. రెండు పర్వతాలను దాటి బల్లాల రాయనదుర్గ చేరుకుంటారు. రాయన దుర్గ ట్రెక్‌ వర్షాకాలం చివరి వరకు వెళ్లవచ్చు. లోయ మొత్తం పచ్చదనంతో కూడుకుని ఉంటుంది. గడ్డిభూములు, హిమాలయాల నుంచి నేరుగా ఉన్నట్లు దర్శనమిస్తాయి. బెంగళూరు నుంచి హొరనాడు లేదా మూడగెరెకు బస్సులో వెళ్లవచ్చు. అక్కడ నుంచి స్థానిక బస్సులు, లేదా జీపుల్లో 30 కిలోమీటర్ల దూరంలోని సుంకసాలేకి చేరుకుని బల్లాల రాయనదుర్గ ట్రెక్‌ ప్రారంభ ప్రాంతం నుంచి దుర్గాదహళ్లికి ఆటో, రిక్షాలో చేరుకోవాలి

Kabaddi Player Success Story: కబడ్డీ క్రీడాకారిని.. అర్జునా అవార్డు విజేత.. రీతు నేగి సక్సెస్‌ స్టోరీ!

జనవరీ 9, 2024న అర్జునా అవార్డులను అందుకున్న క్రీడాకారులలో ఒకరు భారతీయ కబడ్డీ క్రీడాకారిని, హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన రీతూ నేగి, 30 మే 1992లో జన్మించింది.
క్రీడాజీవితంలో తన 16 ఏళ్ల తరువాత ఇండియన్‌ వుమెన్స్‌ కబడ్డీ టీం కి కెప్టెన్‌గా వహించింది. 2022లో జరిగిన ఆశియ గేమ్స్‌లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఈమె 7 అక్టోబర్ 2023లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో చైనీస్ తైపీ జట్టును ఓడించి భారత జట్టును గెలిపించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముచే అర్జునా అవార్డును దక్కించుకుంది. ఇప్పుడు ఈ కథనంతో తన విజయగాధను తెలుసుకుందాం..


హిమాచల్‌ ప్రదేశ్‌లోని ఒక చిన్న గ్రామంలో నివసిస్తున్న ఒక రైతు కూతురు ఈ క్రీడాకారిని రీతూ నేగి.. ప్రస్తుతం అందుకున్న విజయంతో తన రెండు రాష్ట్రాలకు గర్వకారణంగా నిలిచింది. ఒకటి తన పుట్టిల్లు అయిన హిమాచల్‌తో పాటు తన మెట్టనిల్లైన హర్యానాను కూడా గర్వపడే స్థాయికి ఎదిగింది. హిమాచల్‌లోని గిరిపర్‌ అనే మారుమూల ప్రాంతంలో జన్మించింది. అప్పట్లో వారికి లభించే వసతులు చాలా తక్కువ. చిన్న చిన్న అవసరాలకోసం కూడా గంటలు నడవాల్సిన పరిస్థితి ఉండేది. బస్సుల వసతులు కూడా చాలా పరిమితంగా ఉండేవి. తనది నిరుపేద కుటుంబం అయిన్నప్పటికీ చదువుపై చాలానే కోరిక ఉండేది. తను కష్టపడి తన విద్యా జీవితాన్ని నడిపించింది. కానీ, తనకి చదువుపై ఉన్న ధ్యాసలాగే క్రీడలపై కూడా ఎంతో ఆసక్తి ఉండేది. ఈ కారణంగానే తను క్రీడల్లోకి రావాలనుకుంది. అలా, కబడ్డీపై ఉన్న ఆసక్తితో క్రీడా జీవితాన్ని ప్రారంభించింది.
క్రీడా జీవితం..

రీతు తన క్రీడా జీవితాన్ని ప్రారంభించిన 16 సంవత్సరాల తరువాత ఇండియన్‌ వుమెన్‌ కబడ్డీ టీం కి కెప్టెన్‌గా ఎంపికైంది. మంగళ దెసాయి అనే కోచ్‌ చేత ట్రైనింగ్‌ తీసుకుంది. తన కెప్టెన్సీలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ చైనీస్ తైపీతో తలపడి నెగ్గి బంగారు పతకాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌ అనంతరం 2006లో రీతు బిల్స్‌పూర్‌ స్పోర్ట్‌ హాస్టల్‌కు ఎంపికైంది.

తరువాత రీతు 2011 సంవత్సరంలో మలేష్యాలో జరిగిన ఇండియన్‌ జూనియర్‌ ఆమెన్స్‌ కబడ్డీ టీం కి కెప్టెన్‌గా వ్యవహరించి అండర్‌ 20 కబడ్డీలో బంగారు పతకాన్ని గెలిచింది. ఇలా ఆశియా గెమ్స్‌లో దేశాన్ని గెలిపించిన మొదటి మహిళగా పేరు పొందింది. కానీ, గతంలో జరిగిన ఆశియా గెమ్స్‌లో మూడు పాయిట్ల తేడాతో భారత్‌ కబడ్డీ మ్యాచ్‌ ఓడిపోయింది. అయినప్పటికీ, తన కాతాలో గెలిచిన మ్యాచులే ఎక్కువ ఉన్నాయి. ప్రస్తుతం, జనవరీ 9, 2024న రాష్ట్రపతిచే అర్జునా అవార్డును గెలుచి అందరికీ స్పూర్తిగా నిలిచారు.
వ్యక్తిగత జీవితం

హరియానాకు చెందిన కబడ్డీ ప్లేయర్‌ రోహిత్‌ గులియాతో తనకు 22 ఏప్రిల్‌, 2022లో వివాహం జరిగింది. తన వివాహం సమయంలో మ్యాచ్‌ ఉండగా కేవలం నాలుగు రోజుల సెలవు మాత్రమే లభించింది. కానీ, కరోనా కారణంగా మ్యాచ్‌ను వాయిదా వేసారు.
తన గెలుపుపై రీతు నేగితో..

తను గెలిచిన ప్రతీ మ్యాచ్‌లో తన టీం సహకారం, కుటుంబ సభ్యుల ఆశీసులు, తన కోచ్‌ల ఆశీసులు ఉన్నాయన్నారు. తన కృషి, ఆశయమే తనకు పతకాలను గెలిచే స్పూర్తిని ఇచ్చిందని తెలిపింది. తన ప్రతీ గెలుపుకు టీం ఎప్పుడూ తన వెంటే ఉన్నట్లు చెప్పారు. ఏనాడు తన ఆశలను వదులుకోలేదని, అనుక్షణం పట్టుదలతోనే ఉండేదానినని తెలిపారు.

Virat Kohli: అతడితో కాఫీ తాగాలని ఉంది.. టెన్నిస్ దిగ్గజం కోసం కోహ్లీ ఎదురు చూపులు

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ పరుగుల వీరుడు గ్రౌండ్ లోకి వస్తే స్టేడియం మొత్తం హోరెత్తిపోతుంది.
కోహ్లీని ఒక్కసారి కలిస్తే చాలు జన్మ ధన్యం అనుకునేవారు చాలా మందే ఉన్నారు. అయితే కోహ్లీ మాత్రం ఒక వ్యక్తిని కలవాలని తెగ ఆరాటపడుతున్నాడు. అతనితో కాఫీ తాగాలని కోరుకుంటున్నాడు. అతడెవరో కాదు టెన్నిస్ దిగ్గజం నోవాక్ జొకోవిచ్.

సెర్బియా దిగ్గజ టెన్నిస్ ఆటగాడు నొవాక్ జకోవిచ్.. తనకు క్రికెటర్ విరాట్ కోహ్లీతో ఉన్న సన్నిహిత్యం గురించి ఇటీవలే సోనీ స్పోర్ట్స్​ ఛానెల్​లో తెలిపాడు. కోహ్లీతో కొంతకాలంగా తనకు పరిచయం ఉందని.. అతనితో కమ్యూనికేట్ అయ్యే అవకాశం రావడం తన అదృష్టమని చెప్పాడు. ‘కోహ్లీతో కొంతకాలంగా చాట్ చేస్తున్నా. అయితే, అతన్ని ఇప్పటివరకు కలిసే అవకాశం రాలేదు. అతను నా గురించి మాట్లాడటం గౌరవంగా భావిస్తున్నా. కోహ్లీ తన కెరీర్‌లో ఎన్నో విజయాలు సాధించాడు. అతడిని నేను ఎప్పుడూ అభినందిస్తా.’ అని జకోవిచ్ చెప్పాడు.
దీనిపై తాజాగా విరాట్ స్పందించాడు. బీసీసీఐ టీవీతో జకోవిచ్​తో ఉన్న బాండింగ్​​ గురించి కోహ్లీ మాట్లాడుతూ..’వరల్డ్​టాప్ క్లాస్​ అథ్లెట్​తో కనెక్ట్​ అవ్వడం హ్యాపీ. ఫిట్​నెస్ పట్ల అతడికి ఉన్న ప్యాషన్, నన్ను కూడా ప్రభావితం చేస్తుంది. అతడు త్వరలోనే భారత్ వస్తానన్నాడు. ఒకవేళ నేను భారత్​లో ఉన్నప్పుడు జకోవిచ్ ఇక్కడకు వచ్చినా లేదా అతడు ఆడే దేశంలో నేను అక్కడ ఉన్నా కలిసేందుకు వెళ్తాను. కచ్చితంగా జకోవిచ్​తో కలిసి కప్ కాఫీ తాగుతా’ అని విరాట్ అన్నాడు. జొకోవిచ్ కొన్ని రోజుల క్రితమే ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ తో టెన్నిస్ కోర్ట్ లో సందడి చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ ఇద్దరు దిగ్గజాలు ఎప్పుడు కలుస్తారో చూడాలి.

Sourav Ganguly Biopic: త్వరలో తెరపైకి దాదా బయోపిక్‌.. హీరో ఎవరంటే?

Sourav Ganguly Biopic Updates: గత కొన్నాళ్లుగా బయోపిక్స్ ట్రెండ్స్ నడుస్తోంది. క్రీడాకారుల జీవితాల ఆధారంగా తెరకెక్కే బయోపిక్స్ బాక్సాఫీస్ వద్ద కోట్లు కొల్లగొట్టాయి.
ఎం.ఎస్. ధోని, మిల్కా సింగ్, మేరీకామ్ బయోపిక్స్ ఎంత పెద్ద హిట్ అయ్యాయో మనందరికీ తెలిసిందే. త్వరలో దిగ్గజ క్రికెటర్ బయోపిక్ త్వరలో వెండితెరపై ఆవిష్కృతం కానుంది. టీమిండియా మాజీ కెప్టెన్, దాదా అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే సౌరవ్ గంగూలీ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. గంగూలీ పాత్రలో నేషనల్‌ అవార్డు విన్నర్, బాలీవుడ్ నటుడు అయుష్మాన్‌ ఖురానా కనిపించబోతున్నాడు. ఈ మూవీకి ప్రముఖ దర్శకుడు విక్రమాదిత్య మోత్వాని దర్శకత్వం వహిస్తున్నాడు. దాదా బయోపిక్ ఈ ఏడాది చివరిలో రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తయిందట. లవ్‌ రంజన్‌, అంకుర్‌ గార్గ్‌లు నిర్మాతలుగా వ్యవహారిస్తున్నారు. ప్రస్తుతం గంగూలీ హావబావాలు, అతడు ఆడే విధానం, తదితర అంశాలపై ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు ఆయుష్మాన్. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ను మెుదలుపెట్టి.. ఈ ఏడాది చివరలో రిలీజ్ చేసేందుకు దర్శక నిర్మాతలు ఫ్లాన్ చేస్తున్నారు. భారత క్రికెట్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్స్ లో గంగూలీ కూడా ఒకరు. దాదా జీవితంలో కాంట్రవర్సీలకు కొదవ లేదు. గంగూలీ బయోపిక్ ను మోత్వానీ ఎలా తెరకెక్కిస్తాడోనని అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే స్పోర్ట్స్ పర్సన్ జీవితాల ఆధారంగా తెరకెక్కిన బయోపిక్స్ ఎంత పెద్ద సక్సెస్ అయ్యాయో మనందరికీ తెలిసిందే.

భారత్‌లోనే కాదు ఈ దేశాల్లోనూ సంక్రాంతి పండుగ.. కానీ పేర్లే వేరు

ఇండియాలో సంక్రాంతి పండుగను అత్యంత వైభవంగా జరుపుకొంటారు. ఈ పండుగను వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో పిలుస్తారు. సూర్యుడు తన దిశను మార్చుకుంటాడు..
కాబట్టి ఈ పండుగ చాలా ముఖ్యమైనది. అయితే ఈ పండుగను ఎక్కడెక్కడ నిర్వహిస్తారో తెలుసా?

చాలా దేశాలు మకర సంక్రాంతిని జరుపుకొంటాయి. కానీ కొన్ని చోట్ల రోజులు మారుతూ ఉంటాయి. భారతదేశంలో చాలా పేర్లు ఉన్నాయి. తమిళనాడులో పొంగల్ అని, గుజరాత్‌లో ఉత్తరాయణం అని, పంజాబ్‌లో మాఘి అని, అస్సాంలో బిహు అని, ఉత్తరప్రదేశ్‌లో ఖిచ్డీ అని పిలుస్తారు. ఈ మకర సంక్రాంతి పండుగను భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని అనేక ఇతర దేశాలలో కూడా ఆనందంగా జరుపుకొంటారు.

శ్రీలంకలో మకర సంక్రాంతి పండుగను ఉజాహవర్ తిరానల్ పేరుతో నిర్వహిస్తారు. అధిక సంఖ్యలో తమిళులు ఇక్కడ నివసిస్తున్నందున దీనిని పొంగల్ అని కూడా పిలుస్తారు. అయితే, శ్రీలంకలో మకర సంక్రాంతిని జరుపుకునే విధానం భారతీయ సంస్కృతికి కొద్దిగా భిన్నంగా ఉంటుంది. ఇక్కడి ప్రజలు వివిధ సంప్రదాయాలను పాటిస్తున్నారు.

కంబోడియాలోని మకర రాశిని మోహ సంక్రాణం అంటారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఈ పండుగను జరుపుకుంటారని నమ్ముతారు. ఇందులో ప్రతి ఒక్కరూ వివిధ పూజలు నిర్వహిస్తారు. సంవత్సరం పొడవునా సంతోషకరమైన వాతావరణం కోసం ప్రార్థిస్తారు.

మకర సంక్రాంతి పండుగను నేపాల్‌లోని అన్ని ప్రావిన్స్‌లలో వివిధ పేర్లతో నిర్వహిస్తారు. ఈ రోజు వివిధ ఆచారాలను అనుసరించి భక్తి, ఉత్సాహంతో జరుపుకొంటారు. మకర సంక్రాంతిని ఇక్కడ మాఘే-సంక్రాంతి అని, తరు సమాజంలో సూర్యోత్తరయన్ మరియు మాఘి అని పిలుస్తారు. ఈ రోజున తీర్థయాత్ర స్థలంలో స్నానం చేసి దానం చేస్తారు. ఇంట్లో నువ్వులు, నెయ్యి, పంచదార, కూరగాయలు తింటారు. ఇక్కడ కూడా లక్షలాది మంది నదుల సంగమంలో స్నానాలు చేసేందుకు వెళుతుంటారు.

భారతదేశం, నేపాల్ కాకుండా, ఆగ్నేయాసియా దేశాల ప్రజలు మకర సంక్రాంతి పండుగను వివిధ రకాలుగా జరుపుకుంటారు. థాయ్‌లాండ్‌లో ఈ పండుగను సంకర్ణ అని పిలుస్తారు. థాయ్‌లాండ్ సంస్కృతి భారతీయ సంస్కృతిలా కాదు, పూర్తిగా భిన్నమైనది. ఇక్కడ కూడా ఈ ప్రత్యేక సందర్భంలో గాలిపటాలు ఎగరేసే సంప్రదాయం ఉంది. వాస్తవానికి, థాయ్‌లాండ్‌లో ప్రతి రాజుకు తన స్వంత ప్రత్యేక గాలిపటం ఉందని నమ్ముతారు. దేశంలో శాంతి, శ్రేయస్సు కోసం శీతాకాలంలో సన్యాసులు, పూజారులు దీనిని ఎగురవేస్తారు. థాయ్‌లాండ్ ప్రజలు తమ ప్రార్థనలను దేవునికి తెలియజేయడానికి గాలిపటాలు ఎగురవేస్తారు.
మయన్మార్‌లో ఈ మకర సంక్రాంతి పండుగ ఒకటి రెండు రోజులు కాదు మూడు నాలుగు రోజులు. మకర సంక్రాంతికి భిన్నమైన రూపాన్ని ఇక్కడ చూడవచ్చు. ఈ రోజున జరుపుకునే పండుగను థినాగ్యాన్ అంటారు. ఇది బౌద్ధులకు సంబంధించిన ఆచారం. కొత్త సంవత్సరం రాకను పురస్కరించుకుని ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా నిర్వహిస్తారు
మకర సంక్రాంతిని పాకిస్తాన్‌లో లాల్ లోయి పేరుతో జరుపుకుంటారు. లాల్ లోయి అనేది పంజాబీ జానపద పండుగ లోహ్రీకి సింధీ పదం. పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని కొన్ని ప్రాంతాలలో హిందువులు దీనిని జరుపుకుంటారు. లాల్ లోయి రోజున, రాత్రిపూట కట్టెలకు నిప్పు పెడతారు. అగ్ని చుట్టూ సంప్రదాయ నృత్యం చేస్తారు.

ఈ ఆలయంలో బొట్టు పెడితే.. కోరిన కోరికలన్నీ తీరుతాయట..

ఈ ఆలయంలోని అమ్మవారికి బొట్టు పెట్టి ఏదైనా కోరుకుంటే కచ్చితంగా నెరవేరుతుందట. అయితే ఆ ఆలయం ఎక్కడ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.. చతుర్భుజాలతో దర్శనమిస్తూ భక్తుల కోరికలను తీర్చే కొంగుబంగారమైన ఇష్టకామేశ్వరి ఆలయం ( Ishtakameshwari Temple ) ఎక్కడ ఉందంటే?
దాని ప్రాముఖ్యత ఏమిటి? అన్న విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ అమ్మవారు అడవిలో కొలువై ఉన్నారు. రాళ్లు, ముళ్ళు దాటి ప్రయాణం చేయాల్సి వచ్చినా కూడా భక్తులు ఈ అమ్మవారి దగ్గరకు వెళుతూ ఉంటారు.

ఎందుకంటే మనసులో ఎంతో భారంతో, కష్టంతో అక్కడికి వెళ్లి అమ్మను దర్శించుకుని వచ్చాక ఆ సమస్యలు వెంటనే తీరిపోతాయని, లేదా వాటిని ఎదుర్కునే శక్తి కూడా వస్తుందని భక్తులు చెబుతున్నారు.

కాబట్టి అమ్మవారిని ఇష్టకామేశ్వరి అని కూడా పిలుస్తారు. ఇక శ్రీశైలం మల్లన్నకు ( Srisailam Mallanna )చేరువలో ఈ అమ్మవారి దేవాలయం కొలువై ఉంది. శ్రీశైలం నుండి దోర్నాల వెళ్లే మార్గానికి సమీపంలో ఈ ఆలయం ఉంది. ఇక దట్టమైన నల్లమల్ల అడవిలో కష్టతరమైన ప్రయాణం చేసి అమ్మవారి ఆలయానికి భక్తులు చేరుకుంటారు.

ఇక పక్షుల కిలకిల రాగాలు, జలపాతాల మధ్య సాగే ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది. అయితే ఈ ఆలయంలో అమ్మవారు 4 చేతులతో దర్శనమిస్తుంది. ఇక రెండు చేతులతో తామర పువ్వులు, మిగిలిన రెండు చేతుల్లో జపమాల, శివలింగం ధరించి కనిపిస్తుంది. ఇక విష్ణు ధర్మోత్తర పురాణంలో పార్వతి దేవి రుద్రాక్ష మల శివలింగాన్ని ధరించి ఉంటుందని పండితులు చెబుతున్నారు.

అయితే ఇష్టకామేశ్వరి పార్వతి దేవి స్వరూపంగా కొలుస్తారు. ఆమెకు కుంకుమ పెట్టి మనసులో కష్టాన్ని, కోరికను చెప్పుకుంటే 41 రోజుల్లో నెరవేరుతుందట. ఇక ఈ ఆలయంలోని అమ్మవారి కి బొట్టు పెట్టినప్పుడు విగ్రహం మామూలుగానే ఉన్నా కూడా నుదురు మాత్రం మెత్తగా అనిపిస్తుందని కూడా చెబుతున్నారు.
సాయంత్రం 5 దాటితే ఎవ్వరిని కూడా ఆలయంలోకి ప్రవేశించరు. ఇక చిన్న గుహలో ఉండే అమ్మవారిని దర్శించుకోవాలంటే పాకుతూ వెళ్ళాలి. ఎందుకంటే గర్భగుడిలో కేవలం నలుగురు మాత్రమే కూర్చునే వీలు ఉంటుంది.

Laxmidevi:రావి,తులసి ఆకులతో ఇలా చేస్తే కోరిక తప్పక నెరవేరుతుంది.!

మన భారతదేశంలో తులసి రావి చెట్లను దేవతల్లా భావిస్తారు. అలాంటి చెట్ల ఆకులతో మనం కోరిన కోరికలను నెరవేర్చుకోవచ్చని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.. మనం ప్రతి రోజు స్నానం చేసే నీళ్లలో నాలుగు తులసి ఆకులు వేసుకుని చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. అలా స్నానం చేసిన తర్వాత ఇంట్లోని తులసి కోట వద్ద మట్టిని తీసుకొని మంచి గంధంతో కలిపి నుదుట బొట్టు లాగా పెట్టుకోవాలి.

అంతేకాకుండా తులసి కోటలో కొన్ని నల్ల ఉమ్మెత్త గింజలను చల్లితే అవి చిన్న చిన్న మొక్కలుగా పెరుగుతాయి. అలా పెరగడం వల్ల మీకు లక్ష్మీదేవి కటాక్షం కలిగి విపరీతమైన ధన ప్రాప్తి లభిస్తుందని అంటున్నారు. అంతేకాకుండా రావి ఆకుతో కూడా మీకున్న కోరికలు నెరవేరుతాయట. గురువారం లేదా శుక్రవారం రోజు ఒక రావి ఆకు తీసుకొని, ఆకును శుభ్రంగా నీళ్లతో కడిగి ఆ తర్వాత రావి చెట్టు పుల్ల తీసుకొని, దాన్ని తడి పసుపులో ముంచి రావి ఆకు పైభాగాన ఓం అని రాసి, ఆ తర్వాత మీ మనసులో ఉన్న కోరికను ఆకుపై రాయండి, ఆ తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ అని రాయండి.
ఆ తర్వాత రావిఆకును మీ పూజ గదిలో సాయంత్రం వరకు పెట్టండి. ఇక సాయంకాల సమయంలో ఆ రావి ఆకుకు దూపం చూపించి, ఆ తర్వాత దాన్ని తీసుకొని చెట్టు మొదట్లో లేదంటే ఏదైనా పారే నీళ్లలో వేయండి. ఇది ఎవరు కూడా తొక్కనిచోట వేస్తే కోరిక తప్పకుండా నెరవేరుతుందని శాస్త్ర పండితులు తెలియజేస్తున్నారు.

Saindhav Movie Review: వెంకటేష్ యాక్షన్ ఎమోషన్ థ్రిల్లర్‌

విక్టరీ వెంకటేష్ (Venkatesh) కెరీర్ మైల్ స్టోన్ 75వ మూవీ సైంధవ్ (Saindhav). హిట్ సీరిస్తో టాలెంటెడ్ డైరెక్టర్గా గుర్తింపు పొందిన శైలేష్ కొలను (Sailesh Kolanu) ఈ సినిమాను తెరకెక్కించడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.
ఇవాళ (జనవరి 13న) సంక్రాంతి కానుకగా థియేటర్లో ప్రేక్షకుల ముందుకొచ్చింది సైంధవ్. యాక్షన్ స్పార్క్..తండ్రి కూతురి ఎమోషన్స్ డ్రామాగా రూపొందిన ఈ మూవీ..అన్ని వర్గాల ఆడియాన్స్ను ఆకట్టుకుందో లేదో రివ్యూలో తెలుసుకుందాం.

కథేంటంటే:

సైంధవ్ ప్రధాన కథ అంతా చంద్రప్రస్థ అనే ఫిక్షనల్‌ టౌన్‌ లో జరిగే డ్రగ్ సరఫరా, గన్ బిజినెస్..వంటి అంశాల చుట్టూ తిరుగుతుంది. చంద్రప్రస్థ లో జరిగే అసాంఘిక కార్యక్రమాలకు కార్టెల్ లీడర్ విశ్వామిత్ర (ముఖేష్ రిషి) నిర్వహణలో ప్రతిదీ జరుగుతుంటుంది. ఇక్కడ చంద్రప్రస్థ లో జరిగే బిజినేస్ ను చూసుకోవడానికి విశ్వామిత్ర దగ్గర పనిచేసే మాఫియా లీడర్‌ వికాస్ మాలిక్(నవాజుద్దీన్ సిద్ధిఖి)కి బాధ్యతలు అప్పగిస్తాడు. వికాస్ మాలిక్ తన అనుచరురాలు జాస్మిన్ (ఆండ్రియా)తో ఈ డీల్‌ పనులన్నిటినీ జరిగేలా చూస్తుంది. అలా ఓ రోజు వారికి పెద్ద బిజినెస్ డీల్ కుదురుతుంది. 20 వేలమంది యువతతో పాటు గన్స్‌, డ్రగ్స్‌ సరఫరా చేసే ఈ డీల్‌ ను సక్రమంగా పూర్తి చేయాలనీ విశ్వామిత్ర వికాస్ కు బాధ్యతలు అప్పగిస్తాడు. అలా డ్రగ్స్ డీల్ జరిగే క్రమంలో సైంధవ్ కోనేరు అలియాస్‌ సైకో(వెంకటేష్‌) చంద్రప్రస్థ టౌన్‌ పోర్టులో ఉద్యోగిగా పనిచేయడానికి వస్తాడు.

అతనికి కూతురు గాయత్రి(సారా పాలేకర్‌) అంటే ఎంతో ప్రాణం. పక్కింట్లో నివాసం ఉంటున్న మనో(శ్రద్ధా శ్రీనాథ్‌) ప్రతిక్షణం ఎప్పుడు తన కూతురిని జాగ్రత్తగా చూసుకుంటుంది. తన కూతురి కోసం కష్టపడే సైంధవ్‌ అంటే మనోకి ఇష్టం. మనో భర్త (గెటప్‌ శ్రీను) తరుచూ కొట్టడంతో.. అతనిపై పోలీసు కేసు పెట్టి, ఒంటరిగా ఉంటుంది. అలా గాయత్రిని సొంత కూతురిలా చూసుకుంటుంది. ఒకసారి అనుకోకుండా స్కూల్ లో కళ్ళు తిరిగి పడటంతో ఆసుపత్రికి తీసుకెళతారు. అపుడు గాయత్రి కి ఉన్న నరాల సంబంధించిన స్పైనల్ మస్కులర్ అట్రోపి అనే అరుదైన వ్యాధి ఉన్నట్లు చెబుతారు డాక్టర్స్.
కూతురి గాయత్రికి అర్జెంటు గా ఒక ఇంజక్షన్ కావాలి. సరైన టైం లో ఇంజక్షన్ ఇవ్వకపోతే బతకడం కష్టం అని డాక్టర్స్ చెబుతారు. కూతురిని కాపాడటానికి 17 కోట్ల ఖరీదైన ఓ ఇంజెక్షన్ అవసరమవుతుంది. చంద్రప్రస్థ లో ఉద్యోగిగా ఉన్న సైంధవ్.. డబ్బు కోసం విశ్వామిత్ర, వికాస్ మాలిక్‌ను చంపడానికి.. మైఖేల్ (జిషు సేన్ గుప్తా)తో బిగ్ డీల్‌ కుదుర్చుకుంటాడు. అలా ఒకరోజు పోర్టులో జరిగే పెద్ద డీల్ ను సైంధవ్ ఆపడంతో..పెద్ద ఫైట్ జరుగుతుంది.అక్కడ జరిగిన వార్ లో సైంధవ్ కాస్తా సైకో అంటూ రివీల్ అవుతాడు. అసలు సైంధవ్‌ ఫ్లాష్‌ బ్యాక్‌ ఏంటి? సైకో..సైంధవ్ గా ఎలా మారాడు? ఐదేళ్ల క్రితం ఏం జరిగింది? ఇంతకు విశ్వామిత్ర, వికాస్ మాలిక్‌లను చంపేందుకు మైఖేల్‌ ఎందుకు ప్రయత్నించాడు? చివరికి సైంధవ్ తన కూతురు ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఏం చేశాడు? కూతుర్ని రక్షించుకున్నాడా? లేదా? అనేదే మిగతా స్టోరీ.

ఎలా ఉందంటే:

తండ్రీకూతుళ్ల అనుబంధానికి.. ఫిక్షనల్ యాక్షన్ అంశాలను జోడించి.. డైరెక్టర్ శైలేష్ కొలను సైంధవ్ కథ రాసుకున్నారు. భారీ యాక్షన్ సీక్వెన్స్‌,స్టైలిష్ మేకింగ్‌తో ఆడియెన్స్‌కు విజువల్ ట్రీట్‌లా సినిమాను మలిచాడు. చంద్రప్రస్థ అనే ఫిక్షనల్ వరల్డ్‌… తమ అక్రమాలకు పిల్లలను పావులుగా వాడుకోవాలని ప్రయత్నించే డేంజరస్‌ గ్యాంగ్‌..వారిని ఎదిరించే ఓ సగటు తండ్రి .. అతడికో పవర్‌ఫుల్ ఫ్లాష్‌బ్యాక్ టెంప్లేట్ స్టోరీలైన్‌ను తీసుకుని వెంకటేష్ క్యారెక్టరైజేషన్‌, ఎలివేషన్స్ పాస్ మార్కులు కొట్టేశారు. ప్రాణాపాయంలో ఉన్న కూతురును రక్షించుకునేందుకు.. అన్నివిధాలుగా సైంధవ్ ప్రయత్నించే సీన్స్ ఆకట్టుకుంటాయి. చివరికి కార్టెల్‌లోకి అడుగు పెట్టాల్సి రావడం.. డబ్బు అందినట్టే అంది, అంతలోనే ఎదురయ్యే చిక్కుముళ్లతో ఫస్టాఫ్ సాగుతుంది. ఇలాంటి క్రమంలోనే ఇంటర్వెల్ లో ఇచ్చే ట్విస్ట్..అక్కడ జరిగే ఫైట్ ఆడియన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తుంది.
ఇలాంటి ఎమోషనల్ యాక్షన్ సినిమాలకు సెకండాఫ్ పై ఇంట్రెస్ట్ పెంచడం ముఖ్యమని డైరెక్టర్ ఆలోచించిన తీరు బాగుంది. సైంధవ్ ఫ్లాష్‌బ్యాక్ మొదలుకుని..తన కూతురు పడే స్ట్రగుల్ చూసి బాధపడే సైంధవ్ కి ఇంకా చాలా మంది చిన్నారులు కూడా ప్రమాదంలో ఉన్నారని తెలియటంతో.. కంటైనర్ల కోసం విలన్ సైంధవ్‌ని వెంటాడటం ఇవన్నీ ఆడియాన్స్ కు ఇంట్రెస్ట్ కలిగిస్తాయి. వెంకీ తన యాక్షన్ ఎపిసోడ్లతో..మాస్ యాక్షన్ ఫ్యాన్స్ కు భలే ఫెస్టివల్ ట్రీట్ ఇస్తాడు. ఎమోషన్ సీన్స్ లో ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పిస్తాడు. విలన్ గా చేసిన నవాజుద్దీన్ సిద్ధిఖీ క్యారెక్టర్ లో.. కామెడీతో పాటు ఇంటెన్స్ చూపించాడు డైరెక్టర్. అతనిపై వచ్చే సన్నివేశాలు ఆడియన్స్ కు భలే అనిపిస్తాయి.

ఎవరెలా చేశారంటే:

సైంధవ్ సినిమా వెంకటేష్ నుంచి వచ్చిన మరో డిఫరెంట్ యాక్షన్ ఎమోషన్ ఫిల్మ్. వెంకీ యాక్టింగ్‌, యాక్షన్, ఎమోషన్ కోసం ఈ సినిమా చూడొచ్చు. సైంధవ్ అలియాస్ సైకో క్యారెక్టర్ లో వెంకటేష్ చెలరేగిపోయాడు. ఒక్కమాటలో చెప్పాలంటే వెంకీ సైంధవ్‌ పాత్రలో ఒదిగిపోయాడు. వెంకటేశ్‌ తర్వాత ఈ సినిమాలో బలంగా ఇంపాక్ట్ చూపించిన క్యారెక్టర్ నవాజుద్దీన్‌. తన వర్సటైల్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. శ్రద్ధా శ్రీనాథ్‌, రుహాణిశర్మ తమ పాత్ర మేరకు మెప్పిస్తారు. జాస్మిన్‌గా ఆండ్రియా యాక్షన్‌ సీన్‌ అదరగొట్టేసింది.

టెక్నీషియన్స్:

మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్‌ నారాయణన్‌ బుజ్జికొండవే సాంగ్ ఆడియన్స్ ను మెప్పిస్తుంది. అంతేకాకుండా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సినిమాటోగ్రఫీ మణికందన్ ఇంద్రప్రస్థను చూపించిన తీరు ఆకట్టుకుంటుంది. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్. డైరెక్టర్ శైలేష్ కొలను జోనర్ లో డిఫరెంట్ ఫిల్మ్ సైంధవ్ అని చెప్పుకోవాలి.

Naa Saami Ranga Twitter Review: నా సామిరంగ ట్విటర్ రివ్యూ.. నాగ్ సినిమాకు ఊహించని పరిస్థితి.. కీరవాణి మ్యూజిక్ అలా!

Naa Saami Ranga Twitter Review: టాలీవుడ్ కింగ్, మన్మథుడు అక్కినేని నాగార్జున నటించిన లేటెస్ట్ మాస్, యాక్షన్, రొమాంటిక్ చిత్రం నా సామిరంగ. మలయాళంలో సూపర్ హిట్ కొట్టిన పొరింజు మరియమ్ జోస్ అనే చిత్రానికి రీమేక్‌గా నా సామిరంగ సినిమాను తెరకెక్కించినట్లు సమాచారం.
అయితే, కథను తెలుగు నెటివిటీకి తగినట్లుగా మార్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ఇదివరకు కొరియోగ్రాఫర్‌గా పని చేసిన విజయ్ బిన్ని తొలిసారి మెగా ఫోన్ పట్టుకుని దర్శకత్వం వహిస్తున్నారు.

అంటే.. నా సామిరంగ సినిమాతో విజయ్ బిన్నీ దర్శకుడిగా తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇలా ఇప్పటికీ నాగార్జున చాలా మంది కొరియోగ్రాఫర్స్‌కి డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చి కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేశారు. ఇదివరకు మాస్ మూవీతో రాఘవ లారెన్స్‌ను దర్శకుడిగా నాగార్జున పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఇక శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్‌తో నా సామిరంగ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పిస్తున్నారు.

నా సామిరంగ సినిమాలో నాగార్జునకు జోడీగా బ్యూటిఫుల్ ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా చేసింది. అలాగే, అల్లరి నరేష్, రాజ్ తరుణ్, రుక్సార్ ధిల్లాన్, మిర్నా మీనన్ సైతం ప్రధాన పాత్రలు పోషించారు. వీరి పాత్రలకు సంబంధించిన పోస్టర్స్, స్పెషల్ గ్లింప్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. నా సామిరంగ చిత్రానికి శివేంద్ర దాశరధి సినిమాటోగ్రఫీ అందించగా.. రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ కథ, మాటలు అందించారు. ఆస్కార్ విన్నర్ ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించారు.

నా సామిరంగ మూవీ భారీ అంచనాలతో సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే, సోషల్ మీడియాలో నా సామిరంగ హడావుడి పెద్దగా కనిపించడం లేదు. గుంటూరుకారం, హనుమాన్, సైంధవ్ మూవీలకు ముందుగా ప్రీమియర్ షోలు పడినట్లుగా నా సామిరంగ సినిమాకు పడనట్లు తెలుస్తోంది. దాంతో నా సామిరంగ సినమాకు షోలు ఇంకా పడలేదా.. ఏంటీ అప్డేట్ లేదు.. సినిమా టాక్ ఎలా ఉంది, ఇంకా ఎవ్వరూ చూడలేదా అని ట్విటర్‌లో నెటిజన్స్ ట్వీట్స్ పోస్ట్ చేస్తున్నారు.

అయితే, ఐదు గంటల సమయంలో మాత్రం ఇప్పుడు షో స్టార్ట్ అంటూ అక్కినేని ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. సినిమా టైటిల్ కార్డ్ వీడియో పోస్ట్ చేసి తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

2 రోజుల్లోనే టార్గెట్ ఫినీష్.. అప్పుడే అన్ని కోట్లా.. గుంటూరు కారం కంటే!

సాధారణంగా ఏదైనా సినిమా దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అవ్వాలంటే పెద్ద పెద్ద స్టార్లు ఉండాల్సిన అవసరం లేదు. కంటెంట్ కరెక్టుగా ఉంటే ఎంతటి చిన్న చిత్రమైనా భారీ స్థాయిలో ప్రభావాన్ని చూపిస్తుంది.
దీనికి చక్కని ఉదాహరణే ‘హనుమాన్’. పేరుకు తెలుగు సినిమానే అయినా దేశ వ్యాప్తంగా ఇది ఎఫెక్టును చూపిస్తోంది. ఫలితంగా భారీ రెస్పాన్స్‌తో అత్యధిక వసూళ్లను సాధిస్తూ సత్తా చాటుతోంది. ముఖ్యంగా ఓవర్సీస్‌లోనూ ఈ సినిమా హవాను చూపిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ అసలైన మైలురాయిని చేరుకుంది. ఆ వివరాలను మీరే చూసేయండి మరి!

హనుమాన్ ఆగమనంతో : తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన రియల్ సూపర్ హీరో మూవీనే ‘హనుమాన్’. ఈ మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా చేయగా.. వరలక్ష్మి శరత్‌కుమార్ సహా పలువురు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి అనుదీప్ దేవ్, హరి గౌర, కృష్ణ సౌరభ్‌లు సంగీతాన్ని సమకూర్చారు.
ఇక్కడి కంటే ఎక్కువగా : తేజ సజ్జా – ప్రశాంత్ వర్మ కలయికలో రూపొందిన ‘హనుమాన్’ సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2000లకు థియేటర్లకు పైగానే తీసుకు వచ్చారు. దీనికి పోటీ వల్ల తెలుగు రాష్ట్రాల్లో పెద్ద స్క్రీన్లు లభించకున్నా.. హిందీతో పాటు ఓవర్సీస్‌లో ఇది అదిరిపోయే రీతిలో గ్రాండ్‌గా రిలీజ్ అయింది.

గుంటూరు కారం కంటే : రియల్ సూపర్ హీరో హనుమంతుడి కథతో రూపొందిన ‘హనుమాన్’ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్‌లో ఈ చిత్రం మొదటి రోజు నుంచే భారీగా పుంజుకుంది. అదే సమయంలో ‘గుంటూరు కారం’ కంటే ఎక్కువ కలెక్షన్లను వసూలు చేస్తోంది.
అప్పుడే అన్ని డాలర్లు : క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన ‘హనుమాన్’ మూవీకి ఓవర్సీస్‌లో సైతం భారీ స్పందన దక్కింది. ఈ సినిమాకు ప్రీమియర్స్ ద్వారానే 386K డాలర్స్ గ్రాస్ వచ్చింది. ఆ తర్వాత మొదటి రోజు ఇది 520K డాలర్లు వరకూ రాబట్టింది. తద్వారా ప్రీమియర్స్ ప్లస్ మొదటి రోజు కలెక్షన్లు కలిపి అక్కడ 900K డాలర్లు వరకూ రాబట్టింది. అంటే రూ. 7.45 కోట్లు వసూలు చేసింది.

రెండో రోజు ఊచకోత : ‘హనుమాన్’ మూవీ ప్రీమియర్స్‌ను పక్కన పెడితే మొదటి రోజు 520K డాలర్ల కంటే ఎక్కువ రాబట్టింది. ఇక, రెండో రోజు ఈ సినిమా ఏకంగా 620K డాలర్ల వరకూ రాబట్టింది. ఇలా ప్రీమియర్స్‌తో కలిపి 1.5 మిలియన్ డాలర్లను ఈ సినిమా వసూలు చేసింది. అంటే భారత కరెన్సీలో ఈ చిత్రం రెండు రోజుల్లోనే ఓవర్సీస్‌లో రూ. 12.43 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.
టార్గెట్ ఫినీష్ చేసేసి : ‘హనుమాన్’ మూవీ పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైంది. ఇది ఓవర్సీస్‌లో 1 మిలియన్ డాలర్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలాంటిది రెండు రోజుల్లోనే ఈ మార్కును చేరుకోవడంతో పాటు లాభాల బాటలో నడుస్తోంది. ఇలా ఈ చిత్రం అప్పుడే అక్కడ కొన్ని కోట్ల లాభాలను అందుకుంది. దీంతో ఎన్నో రికార్డులను సైతం నమోదు చేసుకుంది.

Cyber Crime: అయోధ్యకు వీఐపీ టికెట్లు కావాలా.. లింక్‍లు పంపుతున్న సైబర్ నేరగాళ్లు.. క్లిక్ చేస్తే అంతే..

జనవరి 22 తేదీ కోసం యావత్ భారతదేశం ఎదురు చూస్తోంది. ఆ రోజు అయోధ్య రామమందిరం ప్రారంభం కానుంది. గుడి ప్రారంభోత్సవానికి మరో 9 రోజులే గడువు ఉండటంతో ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
శ్రీరాముడి ప్రతిష్ఠాపన ప్రధాని మోదీ చేతుల మీదుగా నిర్వహించనున్నారు. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు తరలి రానున్నారు. ఈ క్రమంలో అయోధ్యకు ట్రైన్, బస్, విమాన ప్రయాణాలు పెరిగాయి.

రాముడి చూడాలని ఆశతో ఉన్న భక్తులే టార్గెట్ గా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అయోధ్యకు రామమందిర ప్రారంభోత్సవానికి వీఐపీ టికెట్లు కావాలా అంటూ మోసాలకు పాల్పడుతున్నారు. వీఐపీ టికెట్ కావాలా అంటూ సాధారణ మెసేజ్ లు, వాట్సాప్ మెసేజ్ ల్లో లింక్ లు పంపుతున్నారు.

ఇక మరికొందరైతే డైరక్ట్ ​గా ఈ ఏపీకే ఫైల్​ ను డౌన్​లోడ్​ చేసుకుంటే వీఐపీ యాక్సెస్‌ దొరుకుతుందని మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరగాళ్లు పంపిన లింక్ లు క్లిక్ చేస్తే అంతే సంగతి అని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

 

ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రజలను అప్రమత్తం చేశారు. మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంక్​ వివరాలన్నీ తస్కరించి మోసాలకు తెగబడుతారని, జాగ్రత్తగా ఉండాలని కోరారు. కాగా అయోధ్యరామందిరానికి సంబంధించి దర్వాజాలను హైదరాబాద్ కు చెందిన ఓ టింబర్ డిపో వారు తయారు చేశారు. అలాగే శ్రీరాముడి పాదుకలను హైదరాబాద్ కు చెందిన పిట్టంపల్లి రామలింగా చారి తయారు చేశారు. రామ పాదుకల కోసం పంచ లోహాలను ఉపయోగించారు.
అయోధ్యలో ఈ నెల 22న శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకల నేపథ్యంలో ప్రధాని మోదీ శుక్రవారం ప్రత్యేక దీక్షను ప్రారంభించిన సంగతి తెలిసిందే. 11 రోజుల పాటు తాను నియమ నిష్టలతో ఉంటానని మోడీ పేర్కొన్నారు.

పొలాల్లో మాయం.. OLXలో ప్రత్యక్షం! హైదరాబాద్‌ శివారుల్లో సరికొత్త చోరీలు

పొలాల గట్ల వెంట.. వ్యవసాయ బావుల వద్ద సేదతీరే ట్రాక్టర్లే వాళ్ల టార్గెట్‌. గుట్టుచప్పుడు కాకుండా మాయం చేసి.. రాత్రికి రాత్రే రాష్ట్రం దాటించేస్తారు.
ఆపై సెకండ్‌ హ్యాండ్‌ కింద ఆన్‌లైన్‌లోనే దర్జాగా వాటిని అమ్మేస్తారు. అయితే దొంగ ఎప్పటికైనా దొరకాల్సిందే కదా. హైదరాబాద్‌ శివారుల్లో చోటు చేసుకున్న సరికొత్త చోరీల కేసుల్ని పోలీసులు ఎట్టకేలకు చేధించగలిగారు.

ట్రాక్టర్ ట్రాలీలను చోరీ చేస్తున్న ఇద్దరు అంతర్‌ జిల్లా దొంగలను అరెస్ట్‌ చేసినట్లు రాచకొండ సీపీ సుధీర్‌ బాబు తెలిపారు. వ్యవసాయ కూలీలుగా పని చేసే సంపంగి మహేష్.. ఉర్సు వెంకన్నలు ఆర్థిక ఇబ్బందులతో దొంగతనాలకు దిగారు. రాత్రుల్లో బావుల వద్ద ఉంచిన ట్రాక్టర్‌ ట్రాలీలను ఎత్తుకెళ్లి.. రాత్రికి రాత్రే రాష్ట్రం దాటించేవారు. ఆ తర్వాత వాటిని నేరుగా అమ్మితే దొరికిపోతామని ఓఎల్‌ఎక్స్‌ తరహా ఆన్‌లైన్‌ సైట్లలో అమ్మకానికి ఉంచారు. అలా అమ్మేయగా వచ్చిన డబ్బుతో విలాసాలకు అలవాటు పడ్డారు. ఈ క్రమంలో..
మాడ్గుల్ మండలం(రంగారెడ్డి జిల్లా) పరిధిలో డిసెంబర్‌ 31న ట్రాక్టర్‌ దొంగతనం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేయగా దొంగలు దొరికిపోయారు. వాళ్ల దగ్గరి నుంచి సుమారు 20 లక్షలు విలువ చేసే 13 ట్రాక్టర్‌ ట్రాలీలను స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ కమిషనరేట్ లో 10 దొంగతనాలు.. నల్గొండలో ఒకటి.. నాగర్ కర్నూల్లో ఒక కేసు నమోదైనట్టు పోలీసులు వెల్లడించారు.

అలా నమ్మించాడు.. ఇలా ఉడాయించాడు.. కోటి రూపాయలతో పరార్‌

రోజుకో కొత్త మోసాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. కష్టపడి సంపాదించుకున్న డబ్బుల్ని కాజేస్తే ఆ బాధ వర్ణణాతీతం. ఇంతా జరుగుతున్నా కూడా ప్రజల్లో అవగాహన రాకపోవడం శోచనీయం.
అలవల పాడు గ్రామంలో షేక్‌ మస్తాన్‌వలి బాగా నమ్మకం ఏర్పరుచుకున్నాడు. 10 ఏళ్లుగా చీటీ పాటలు కట్టిస్తూ, అవసరమైన వారికి డబ్బులు సాయం చేస్తూ అందరిలో కలిసి పోయాడు. రూ. 50 వేల చీటీ పాటల నుంచి రూ. 2 లక్షల చీటీ వరకు వేసేవాడు. అతడ్ని నమ్మి గ్రామంలో చాలా మంది చీటీలు కట్టారు. బంగారం వ్యాపారం చేస్తున్నానంటూ నమ్మ బలికి లక్షలాది రూపాయలు అప్పులు చేశాడు. వారిలో కొంత మందికి 2,3 నెలల పాటు వడ్డీలు చెల్లించాడు. అది చూసి చాలా మంది ఆశపడి డబ్బులు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. దీన్ని ఆసరాగా తీసుకొని నెల రోజుల నుంచి గ్రామంలో కనిపించకుండా వెళ్లిపోయాడు.

జే.పంగులూరు: మండల పరిధిలోని అలవలపాడు గ్రామానికి చెందిన షేక్‌ మస్తాన్‌వలి గ్రామంలో చీటీ పాటలు నిర్వహిస్తుంటాడు. అతడ్ని నమ్మి 160 మంది వరకు నెలకు రూ. 10 వేలు చొప్పున చీటీ కట్టారు.అందరూ ముస్లిం కాలనీకి చెందిన వారు. చీటీ పాటలు కట్టిన వారంతా కూలీనాలీ చేసుకునే వారే. చీటీ కట్టేవారిలో కొందరు పిల్లల చదువు కోసం, కొందరు కూతురు పెళ్లి నిమిత్తం కట్టినవారు ఉన్నారు. ఇలా ఎంతోమంది కష్టపడి డబ్బులు కట్టుకున్నారు. వారిలో అతి కొద్ది మందికి మాత్రమే తిరిగి అందాయి. ఎనిమిది చీటీ పాటల్లోనూ కొందరికి మాత్రమే డబ్బులు చెల్లించాడు. తప్పుడు చీటీ పాటలు చూపి డబ్బులు మొత్తం అతనే వాడుకున్నాడని బాధితులు వాపోతున్నారు.

రూ. 50 లక్షలు వరకు అప్పులు
చీటీ పాటలే కాక గ్రామంలో కొంత మందికి దొంగ బంగారం కొంటున్నానని షేక్‌ మస్తాన్‌వలి నమ్మబలికించి రూ. 50 లక్షలు వరకు అప్పులు చేశాడు. వారిలో కొంత మందికి నెలనెలావడ్డీ డబ్బులు చెల్లించాడు. అలవలపాడు గ్రామంలో గతంలో కొంత మంది దొంగ బంగారం వ్యాపారం చేసి కోట్లాది రూపాయలు గడించారన్న నానుడి ఉంది. బొంబాయి నుంచి బంగారం కొంటున్నానని, డబ్బులు తగ్గాయని గ్రామంలో ఉన్న కొంత మంది వద్ద అప్పులు చేశాడు. మరికొంత మంది అతడ్ని నమ్మి డబ్బులు ఇచ్చారు. కొంత మంది ఇల్లు, పొలం తనఖా పెట్టి లక్షలు లక్షలు తెచ్చి షేక్‌ మస్తాన్‌వలి చేతిలో పోశారు. గ్రామానికి చెందిన డోలా గోవిందమ్మ అనే వృద్ధురాలు రూ. 13 లక్షలు తెచ్చి ఇచ్చింది. వాటిలో రూ.8 లక్షలు బ్యాంకు నుంచి లోను తీసుకోగా, ఇల్లు కట్టుకోవాలని రూ.5 లక్షలు దాచుకుంది. మొత్తం తెచ్చి మస్తాన్‌వలి చేతిలో పెట్టింది. పారిపోయాడన్న విషయం తెలుసుకున్న గోవిందమ్మ భోరున విలపించింది. ఇలా మస్తాన్‌వలి మోసాలకు బలైన వారు ఎందరో ఉన్నారు.

నమ్మి రూ. 6 లక్షలు ఇచ్చా
మా కాలనీలో అంతా షేక్‌ మస్తాన్‌వలిని పూర్తిగా నమ్మాం. అందరితో పాటు నేను నమ్మి అతని వద్ద రూ. 2 లక్షల చీటి పాటలు రెండు వేశా. రెండు పాటలు చివరికి వచ్చాయి. అదీ కాక బంగారం కొంటానని చెప్తే మరో రూ. 6 లక్షలు ఇచ్చా. వాటికి సంబంధించి నాకు మూడు నెలలు పాటు వడ్డీ చెల్లించాడు. అది చూసి కొంత మంది అతనికి డబ్బులు ఇచ్చారు. నాకు రెండు నెలల నుంచి వడ్డీ డబ్బులు ఇవ్వడం లేదు.
-షేక్‌ నన్నేసా, బాధితుడు

రూ. 5.50 లక్షల చీటీ పాటలు కట్టా
షేక్‌ మస్తాన్‌ వలి గ్రామంలో బాగా నమ్మకం ఏర్పచుకున్నాడు. గత 10 సంవత్సరాల నుంచి చీటీలు వేస్తున్నాడు. అది నమ్మి మేము కొంతమంది కలిసి లక్షలాది రూపాయలు కట్టాం. నేను మూడు పాటలకు గాను ఇప్పటికి రూ. 5.50 లక్షలు చెల్లించాను. పాటలు చివరికి వచ్చాయి. గత నెల 20వ తేదీన డబ్బులు ఇస్తాన్నాడు. చివరికి గ్రామంలోనే లేకుండా పరారయ్యాడు.
-షేక్‌ సైదా, బాధితుడు
రూ. 9.50 లక్షలు మోసపోయా
మస్తాన్‌ వలిని నమ్మి ఎలాంటి నోటు లేకుండా నోటి మాట మీద గత నెల 5న రూ. 9.50 లక్షలు ఇచ్చాను. నేను డబ్బులు ఇచ్చిన తరువాత రెండు రోజులకు గ్రామం వదిలి కుటుంబ సభ్యులతో వెళ్లిపోయాడు. ఫోన్‌ చేస్తే ఫోన్‌ కలవలేదు. దానితో పాటు రూ. 1.50 లక్షల చీటీ పాట డబ్బులు కట్టా. అవి కూడా నాకు ఇవ్వలేదు.
– షేక్‌ దస్తగిరి, అలవలపాడు, బాధితుడు

అలా నమ్మించాడు.. ఇలా ఉడాయించాడు రూ.1 కోటి చీటీ పాట డబ్బులతో పరార్‌ 160 మంది వరకు బాధితులు బంగారం కొనుగోలు పేరుతో బురిడీ కుటుంబ సభ్యులతో పరారైన షేక్‌ మస్తాన్‌వలి

షేక్‌ మస్తాన్‌వలి రాసిన నోటు
షేక్‌ మస్తాన్‌వలి

అతను డ్రైవింగ్‌.. ఆమె స్నాచింగ్‌!

నల్లగొండ: చైన్‌ స్నాచింగ్‌లు మగాళ్లే చేస్తారని భ్రమలో ఉన్నవాళ్లకు ఈ వార్త ఓ కనువిప్పు. ఓ యువతి ఓ యువకుడి సహకారంతో గొలుసు దొంగతనాలకు ప్రయత్నించింది.
ఈ క్రమంలో స్థానికులు కేకలు వేయడంతో వాళ్లిద్దరూ పలాయనం చిత్తగించారు. నల్లగొండ జిల్లా దేవరకొండలో జరిగిన ఈ ఘటన తాలుకా వీడియో ఇప్పడు వాట్సాప్‌లలో వైరల్‌ అవుతోంది.

శుక్రవారం మధ్యాహ్న సమయంలో ఓ వ్యక్తి.. యువతి స్కూటీ మీద వచ్చారు. అక్కడ ఓ మహిళ మెడలో గొలుసును వెనక ఉండే యువతి లాగే యత్నం చేసింది. సదరు మహిళ గట్టిగా కేకలు వేయడంతో.. స్థానికులు బైక్‌పై ఉన్నవాళ్లను వెంబడించే యత్నం చేశారు. ఈ క్రమంలోనే ఛేజ్‌ చేస్తూ వాళ్లను వీడియో తీశారు.అయితే వాళ్లు దొరకలేదు.

ఇక బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మర్రిగూడ పోలీసులు.. ఆ ఇద్దరినీ పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.

Health

సినిమా