ఆ పాత కాయిన్‌ మీ దగ్గర ఉంటే.. పదికోట్లు మీ సొంతం..!!

పాత నాణేలు, పాత వస్తువులు, పాత నోట్లు ఇలాంటివి దాచుకోవడం చాలా మందికి అలవాటుగా ఉంటుంది. అవి ఇప్పుడు కాకపోయినా.. ఏదో ఒకరోజు అదృష్టాన్ని తెచ్చిపెడతాయని వారి నమ్మకం. అలాగే.. చాలాసార్లు అలాంటి కాయిన్స్‌, నోట్లు మీ దగ్గర ఉంటే లక్షల్లో డబ్బులు ఇస్తామని ఆఫర్లు కూడా వస్తుంటాయి. అలాంటి ఓ ఆఫరే ఇప్పుడు మార్కెట్లో ఉంది. మీ వద్ద కేవలం ఆ 5 రూపాయిల నోట్ ఉందా..ఉంటే ఇంట్లో కూర్చునే కోట్లకు పడగెత్తవచ్చు. ఇంట్లో కూర్చునే కోటీశ్వరులు కావడమంటే వింటేనే అతిశయోక్తిగా ఉంది కదూ. ఆ 5 రూపాయల నోట్‌తో మీరు ఏ వ్యాపారం లేదా ఏ పనీ చేయాల్సిన అవసరం లేకుండానే ఒక్క ఫోటో తీసి..అప్‌లోడ్ చేస్తే చాలు. ఇంకా పాత 1 రూపాయి నాణెం ఉన్నా సరే..పది కోట్లు మీ సొంతం కానున్నాయి. ఎలా అంటారా..?
మీరు చేయాల్సిందల్లా మీ వద్ద ఉన్న కరెన్సీకు నిర్ధిష్టంగా సూచించిన ప్రత్యేకతలున్నాయా లేదా చెక్ చేసుకోవడమే. 1885లో బ్రిటీషు కాలంలో ముద్రించిన ఈ నాణెం ఉంటే..పది కోట్లు సాధించవచ్చు. ఈ కాయిన్ మీ వద్ద కూడా ఉంటే ఆన్‌లైన్ ఆక్షన్‌లో మీ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటిదే కాయిన్ పది కోట్లకు అమ్ముడైంది.
ఏం చేయాలి, ఎలా చేయాలంటే..
మీ దగ్గర కాయిన్‌ ఉన్నట్లేతే..ముందుగా ఇండియా మార్ట్ అధికారిక వెబ్‌సైట్ www.indiamart.com సందర్శించాలి.
మీ వద్ద ఉన్న ఉన్న పాత కరెన్సీ ఫోటో తీసి అప్‌లోడ్ చేయాలి.
కంపెనీ మీ ప్రకటనను ఫీచర్ చేస్తుంది. ఆసక్తి కలిగినవారు మిమ్మల్మి సంప్రదిస్తారు. మీరు నేరుగా పార్టీతో డీల్ ఫిక్స్ చేసుకోవచ్చు.
అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా..పాత నోట్లు లేదా కాయిన్లను ఆన్‌లైన్‌లో క్రయవిక్రయాలు చేయడంపై హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని అసాంఘిక శక్తులు మోసపూరింగా ఆర్బీఐ పేరు, లోగోను వాడుతూ..క్రయ విక్రయాలకు సంబంధించి కమీషన్, ఛార్జీలు, ట్యాక్స్ వసూలు చేస్తున్నారని తెలిపింది. ఆర్బీఐ ఇలాంటి వ్యవహారాలపై ఎప్పుడూ కమీషన్ లేదా ట్యాక్స్ అడగదని స్పష్టం చేసింది. ఒకవేళ మీ దగ్గర కాయిన్‌ ఉంటే.. జాగ్రత్తగా మోసపోకుండా క్యాష్‌ చేసుకోవాలి.!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *