Saturday, November 16, 2024

‘కరుంగాలి దండ’ ధరించాక నా జీవితమే మారిపోయింది.. సీక్రెట్‌ రివీల్‌

చాలామంది ప్రముఖులు తమ మెడలో స్పటిక,రుద్రాక్ష, కరుంగాలి మాల ఇలా వారి నమ్మకం కొద్ది వివిధ దండలు ధరిస్తూ ఉంటారు. ప్రస్తుతం కోలీవుడ్‌కు చెందిన స్టార్స్‌ లోకేష్ కనగరాజ్, ధనుష్, శివకార్తికేయన్ వంటి వారు కరుంగాలి దండను తమ మెడలో ఎప్పటికి ధరించే ఉంటారు. వారు పలు వేదికల మీదికి వెళ్లినా సరే ఈ దండను మాత్రం తొలగించరు. అంతలా ఈ కరుంగాలి దండకు వారు ప్రాముఖ్యత ఇస్తారు. అది ఎందుకు ధరిస్తున్నారో అనే విషయాన్ని డైరెక్టర్‌ లోకేష్‌ కనగరాజ్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

కారణం ఏమిటంటే..: లోకేష్‌ కనగరాజ్‌
‘విక్రమ్‌ సినిమా షూటింగ్‌ జరుగుతుండగా.. ఒక సందర్భంలో షూటింగ్‌ ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాను. అప్పుడు నా మిత్రుడు ఆర్ట్ డైరెక్టర్ సతీష్ నాకు ఈ దండను ఇచ్చాడు. అప్పుడు ఈ మాల గురించి నాకు పెద్దగా ఎలాంటి సమాచారం తెలియదు. కానీ ఈ దండను ధరించమని అతను చెప్పడంతో నేను తీసుకున్నాను. ఇక నుంచి నీకు అన్నీ మంచే జరుగుతాయి.. ఎలాంటి ప్రమాధాలు జరగవు అని చెప్పాడు. నాకు అలాంటి వాటి పట్ల పెద్దగా నమ్మకం లేదు. కానీ ఆయన కోరిక మేరకు ఆ మాలను ధరించాను. కానీ ఆ సమయం నుంచి నాకు ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు. విక్రమ్‌ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఎంతో పేరుప్రతిష్ఠలు వచ్చాయి. దీంతో ఆ దండను నేను ఎప్పడూ తొలగించలేదు.’ అని ఆయన చెప్పారు.


కరుంగాలి మాల అంటే..
కరుంగాలి అంటే జమ్మి చెట్టు అని అర్థం. ఆ చెట్టు కాండం నుంచి ఈ దండను తయారు చేస్తారు. జ్యోతిషశాస్త్ర రీత్యా, కరుంగాలి మాల అంగారక గ్రహానికి చెందినది. అంగారక గ్రహ ప్రభావాలను నియంత్రించే శక్తి ఈ మాలకు ఉందని, అలాగే ఈ హారం ధరించిన వ్యక్తి వారి జాతకంలో అంగారక గ్రహం చెడు ప్రభావాన్ని తగ్గిస్తుందని జ్యోతిష్య నిపుణుల నమ్మకం. అలాగే విద్యార్థులు తమ జ్ఞాపకశక్తి , మేధో శక్తులను మెరుగుపరచడానికి , విద్యలో రాణించడానికి ఈ మాలన ధరిస్తారని చెబుతారు.వ్యాపారస్తులతో పాటు నిరుద్యోగులు, జాబ్ హోల్డర్లు కూడా ఈ దండను ధరిస్తారు. అందుకే ఈ దండలకు భారీ డిమాండ్‌ పెరిగింది.

ఆన్‌లైన్‌‌లో దొరికే మాలలన్నీ డూప్లికేట్‌ ఉండొచ్చని.. వాటి వల్ల మంచి కన్నా చెడు జరిగే అవకాశాలు ఎక్కువని జ్యోతిష్య నిపుణులు పలు సందర్భాల్లో హెచ్చరిస్తున్నారు. ఒరిజినల్ మాలను తమిళనాడులోని పాతాళ శంభు మురుగన్‌ ఆలయం దగ్గర మాత్రమే తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. రాత్రి నిద్రపోయే ముందు ఈ హారాన్ని తీసి ఇంట్లో దేవుడు దగ్గర పెట్టుకుని.. ఉదయం స్నానం చేసిన తర్వాత మళ్లీ ఈ మాలను ధరించవచ్చని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తారు. తమిళనాడులోని సోలైమలై కొండల దిగువన ఈ ఆలయం ఉంది. మదురై నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రసిద్ధ ఆలయంలో సుబ్రమణ్య స్వామి ఉన్నారు.

శివకార్తికేయన్, ధనుష్ కూడా కరుంగాలి అభిమానులే
కరుంగాలి మాలను కోలీవుడ​ నుంచి శివకార్తికేయన్, ధనుష్‌ కూడా ధరిస్తారు. ఒక ఇంటర్వ్యూలో ఈ దండ గురించి మాట్లాడుతూ.. ‘ఈ కరుంగాలి మాల ధరించిన సమయం నుంచి నా జీవితం మారిపోయింది. సినిమాల పరంగా మంచి అవకాశాలు దక్కాయి.’ అని చెప్పాడు. పలుమార్లు ఈ ఆలయానికి ధనుష్‌ కాలినడక ద్వారా వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. చుట్టూ కొండల మధ్యలో ఈ ఆలయం ఉంటుంది.

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. రూ.500లకే గ్యాస్ సిలిండర్.. ఎవరు పొందవచ్చంటే?

ప్రస్తుతం నిత్యవసర వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఇళ్లలో వాడే గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. పెరిగిన ధరలతో సామాన్యుడు అల్లడిపోతున్నాడు. గ్యాస్ బండ..మధ్యతరగతి వాడికి గుదిబండగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే పలు రాష్ట్రాలు ప్రజలకు ఊరట కలిగించే చర్యలు తీసుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం.. రూ.500లకే గ్యాస్ అందించేలా తెలంగాణ సర్కార్ చర్యలు తీసుకుంటుంది. ఇక అదే విధంగా ఏపీలో అమలు అయితే బాగుండని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను ప్రసన్నం చేసుకునే పని పడ్డాయి. ఈ క్రమంలోనే సామాన్యుడికి గుది బండగా మారిన సిలిండర్ పై పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించిన సంగతి తెలిసిందే. రూ.400 మేర గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించింది. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ను బుక్ చేసుకోవడంతో ద్వారా తగ్గింపు బెనిఫిట్స్ పొందవచ్చు. అలానే కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉజ్వల్ స్కీమ్ లబ్ధిదారులకు కూడా భారీ డిస్కౌంటే లభించింది. ఈ స్కీమ్ ద్వారా గ్యాస్ సిలిండర్ ను బుకింగ్ చేసుకున్న వాళ్లకు రూ.560 కే గ్యాస్ బండను పొందవచ్చు.

ఎలాంటి స్కీమ్ ఆధారంలేకుండానే ఉజ్వల్ స్కీమ్ కింద దరఖాస్తు చసుకున్న వాళ్లకు బెనిఫిస్ట్ లభఇస్తాయి. అయితే ఈ స్కీమ్ కింద లేని ప్రజలకు మాత్రం 860 రూపాయలకు సిలిండర్ లభిస్తుంది. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ లేని వాళ్లు ఉజ్వల స్కీమ్ ద్వారా గ్యాస్ సిలిండర్ కోసం అప్లయ్ చేసుకోవచ్చు. ఏపీలో కూడా ఈ స్కీమ్ కింద అర్హులైన వారు 500లకే గ్యాస్ సిలిండర్ పొందవచ్చని తెలుస్తోంది. అయితే దీని బీపీఎల్ కింద ఉన్నవారే అర్హులు. అంతేకాక ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. మొత్తంగా త్వరలో ఏపీలో కూడా రూ.500లకే గ్యాస్ సిలిండర్ లభించనున్నట్లు తెలుస్తోంది. మీరు ఉజ్వల స్కీమ్ కింద కనెక్షన్ పొంది ఉంటే.. అప్పుడు మీకు మరింత తగ్గింపు అందుబాటులో ఉంటుంది.

ఇలా సబ్సిడీ, తాజా తగ్గింపు కలుపుకుంటే వీరికి భారీగా లాభం ఉందని చెప్పుకోవచ్చు. ఉజ్వల స్కీమ్ లబ్ధిదారులకు ఇప్పుడు గ్యాస్ సిలిండర్ బుకింగ్‌పై ఏకంగా రూ. 300 తగ్గింపు ఉన్న విషయం తెలిసేందే. అంటే ఈ స్కీమ్ కింద సిలిండర్ పొందిన వారు బుక్ చేసుకుంటే తిరిగి రూ. 300 బ్యాంక్ అకౌంట్లలోకి వచ్చి చేరుతుంది. ఉజ్వల స్కీమ్ లబ్ధిదారులకు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ కేవలం రూ. 560కే లభిస్తుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వచ్చే ఏడాది మార్చి చివరి వరకు సబ్సిడీ అందుబాటులో ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది.

Business Ideas: తక్కువ పెట్టుబడి.. ప్రతిసారీ లాభం పొందే బిజినెస్.. నో రిస్క్..

Business Ideas: ఆధునిక కాలంలో బతకాలంటే రెండు చేతులా సంపాదించాలనే పరిస్థితులు వచ్చేశాయి. అందుకే ఉద్యోగాలతో పాటు ఏదైనా వ్యాపారం చేసుకోవాలని చాలా మంది భావిస్తున్నారు. అలాంటి వారికి ఒక చక్కటి అవకాశం వచ్చేసింది. లాభదాయకమైన వ్యాపార అవకాశం కోసం వెతుకుతున్నవారికి.. కొంచెం సృజనాత్మకత ఉన్నట్లయితే డెకరేషన్ వ్యాపారంలో మంచి అవకాశాలు ఉన్నాయి. ప్రజలు బయట ఆఢంబరంగా ఫంక్షన్లు చేసుకోవటం పెరగటం ఈ వ్యాపారంలో అనేక అవకాశాలను తీసుకొచ్చింది. ప్రత్యేక తేదీల్లో ప్రపోజ్ చేయటం నుంచి కొత్త ఆఫీసుల ప్రారంభం, బేబీ షవర్‌లు, నిశ్చితార్థాలు, వివాహాలు, వార్షికోత్సవాలు, సంతోషకరమైన సమావేశాలను నిర్వహించడం వరకు అన్ని కార్యక్రమాలకు ఆకర్షనీయమైన డెకరేషన్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారు.

ఇందుకోసం లైట్లు, పూలు, ఆకర్షనీయమైన బెలూన్ల వంటివి ఎక్కువగా వినియోగిస్తున్నారు. అయితే ఈ వ్యాపారాన్ని కనీసం రూ.25,000 పెట్టుబడి నుంచి కూడా ప్రారంభించవచ్చు. మెుదట్లో అవసరమైన వస్తువులను అద్దెకు తెచ్చుకోవటం ద్వారా నిర్వహించవచ్చు. అయితే తర్వాతి కాలంలో సొంత పెట్టుబడి ద్వారా సామాగ్రిని కొనుగోలు చేస్తే ఖర్చులు తక్కువవుతాయి. ఆన్ లైన్ ఆర్డర్లు లేదా షాపు ఏర్పాటు ద్వారా దీనిని ప్రారంభించవచ్చు. ప్రారంభంలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పటికీ.. తర్వాతి కాలంలో 35 నుంచి 40 శాతం లాభాలను పొందవచ్చు. పండుగలతో సంబంధం లేకుండా 365 రోజులూ ఏదో ఒక వేడుకలు ఉంటూనే ఉంటాయి కాబట్టి ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటూనే ఉంటుంది. ప్రత్యేకించి పెళ్లిళ్లు, శుభకార్యాల కాలంలో అధిక డిమాండ్ ఉంటుంది. దీనికోసం పువ్వులు, ఆకులు, మంత్రముగ్ధులను చేసే లైట్లు, సొగసైన బొకేలు, LED డిస్‌ప్లేలు వంటి వస్తువులు ఎక్కువగా వినియోగిస్తుంటారు.

Dark Circles Problems: కళ్లకింద డార్క్‌ సర్కిల్స్‌ సమస్యా.. ఇలా సులువుగా తొలగించుకోండి..

Dark Circles Problems: ఎండాకాలం వచ్చిందంటే కళ్ల కింద నల్లటి వలయాల సమస్య మరింత పెరుగుతుంది. వీటివల్ల పార్టీలకు, ఫంక్షన్లకు వెళ్లలేకపోతారు. ఇవి ఒక వ్యక్తి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. వీటిని తొలగించుకోవడానికి చాలామంది మార్కెట్‌లో లభించే అన్ని బ్యూటీ ప్రొడక్ట్స్‌ వాడుతారు. కానీ వాటివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు పైగా సైడ్‌ ఎఫెక్స్‌ ఎదురవుతాయి. అందుకే సహజసిద్దంగా వాటిని ఎలా తొలగించుకోవాలో ఈ రోజు తెలుసుకుందాం.
నిమ్మరసం నిమ్మరసం నల్లటి వలయాలను తగ్గించడంలో సూపర్‌గా పనిచేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. నల్లటి వలయాల పై నిమ్మరసం రాసి 15 నుంచి 20 నిమిషాల తర్వాత కడిగేయాలి.

బంగాళాదుంప రసం బంగాళదుంపలో ఉండే విటమిన్ ఇ చర్మాన్ని మెరుగుపరుస్తుంది. ఇది డార్క్ సర్కిల్స్‌ని తగ్గించడంలో సాయపడుతుంది. దీని కోసం బంగాళాదుంపను రుబ్బి దాని రసాన్ని తీయాలి. డార్క్ సర్కిల్స్ మీద 15 నిమిషాల పాటు అప్లై చేయాలి. తర్వాత ముఖాన్ని కడగాలి.

పెరుగు, శనగపిండి శెనగపిండిలో కొంచెం నిమ్మరసం కలిపి, పెరుగు వేసి పేస్ట్‌లా చేయాలి. దీన్ని ముఖంపై అప్లై చేసి తర్వాత కడిగేయాలి. నల్లటి వలయాలకు ఇది చాలా మేలు చేస్తుంది.

అలోవెరా జెల్ అలోవెరా జెల్ నల్లటి వలయాలను తగ్గించడంలో సాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. తాజా కలబంద జెల్‌ను తీసి బ్లాక్ సర్కిల్‌ పై అప్లై చేసి 15 నుంచి 20 నిమిషాల తర్వాత కడగాలి. ఇలా చేస్తే కళ్లకింద నల్లటి వలయాలు త్వరగా పోతాయని నిపుణులు చెబుతున్నారు.

ఇప్పటివరకు బీఆర్ఎస్‌ను వీడిన కీలక నేతలు వీరే.. ఇంకా ఏం జరుగుతోందో తెలుసా?

BRS: పార్టీ మీద అవినీతి, ఆరోపణలు, ఫోన్ ట్యాపింగ్ ఇష్యూతో పార్టీ ప్రతిష్ట దిగజారిపోయిందని కారణం చెప్తూ కాంగ్రెస్‌ గూటికి..

లోక్‌సభ ఎన్నికల వేళ ఒక్కో బీఆర్ఎస్ నేత పార్టీని వీడుతుండటం అటు క్యాడర్‌ను.. ఇటు లీడర్లను నిరాశ పరుస్తోంది. పార్టీ పవర్‌లో ఉన్నప్పుడు ఎంపీలుగా, మంత్రులుగా పదవులు అనుభవించి.. కేసీఆర్, కేటీఆర్‌ను ప్రశంసలతో ముంచెత్తిన నేతలంతా ఇప్పుడు పలాయనం బాట పట్టారు. ఒక్కొక్కరుగా కండువాలు మారుస్తున్నారు. ఏమైనా అడిగితే అభివృద్ధి కోసం అధికార పార్టీలోకి వెళ్తున్నామని చెబుతున్నారు. పనిలో పనిగా గులాబీ బాస్ కేసీఆర్‌తో పాటు అతని ఫ్యామిలీపై విమర్శలు చేస్తున్నారు.

ఇప్పటికే పలువురు నేతలు బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పారు. సిట్టింగ్‌ ఎంపీలు వెంకటేష్ నేత, బీబీ పాటిల్, రాములు, రంజిత్ రెడ్డి, పసునూరి దయాకర్ కారు దిగి జాతీయ పార్టీల్లోకి వెళ్లారు. దానం నాగేందర్‌ కాంగ్రెస్‌లో చేరి సికింద్రాబాద్‌ బరిలో నిలుస్తున్నారు. మాజీ ఎంపీలు నగేశ్, సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, జలగం వెంకట్రావు, తాటికొండ రాజయ్య కూడా జంప్ అయ్యారు. బొంతు రామ్మోహన్, బాబా ఫసియుద్దిన్, డిప్యూటీ మేయర్ శ్రీలత దంపతులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు మాజీమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా హస్తం గూటికి చేరుతారని ప్రచారం జరుగుతోంది.

పార్టీ అన్ని విధాలుగా గౌరవించినా..
పార్టీలో నెంబర్.2గా కొనసాగిన కే. కేశవరావు కేసీఆర్‌కు హ్యాండిచ్చారు. రెండుసార్లు రాజ్యసభకు నామినేట్ అవడమే కాదు.. కూతురును బీఆర్ఎస్ నుంచి కార్పొరేటర్‌గా నిలబెట్టి GHMC మేయర్‌ను చేసుకున్నారు కేకే. పార్టీ అన్ని విధాలుగా ఆయనను గౌరవించినా చివరకు గులాబీబాస్‌కు చెప్పి మరీ కాంగ్రెస్ గూటికి చేరేందుకు రెడీ అయ్యారు కేకే. సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షి కేకే ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. కూతురు గద్వాల విజయలక్ష్మీతో కలసి శనివారం నాడు కాంగ్రెస్‌ గూటికి చేరనున్నారు కేకే.

ఇక కేసీఆర్ అవినీతిపరుడు అంటే తాను ఒప్పుకోనంటున్నారు కేకే. జేబులో ఉన్న చివరిపైసా కూడా పక్కోడికి ఇచ్చే రకమని చెప్పారు. కేసీఆర్ చేసినంత అభివృద్ధి దేశంలో ఎవరూ చేయలేదన్నారు కేకే. పనిచేసేవాడు అన్నీ సహించినా ఆత్మగౌరవం దెబ్బతింటే మాత్రం ఊరుకోడని చెప్పుకొచ్చారు కేకే.

కడియం శ్రీహరి ఫ్యామిలీ
మరోవైపు మాజీమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫ్యామిలీ బీఆర్‌ఎస్ పార్టీకి షాకిచ్చింది. పట్టుబట్టి తన కూతురు కావ్యకు టికెట్ ఇప్పించుకున్న కడియం శ్రీహరి.. తీరా టికెట్ అనౌన్స్ చేశాక.. ఇప్పుడు హ్యాండ్ ఇచ్చారు. పార్టీ మీద అవినీతి, ఆరోపణలు, ఫోన్ ట్యాపింగ్ ఇష్యూతో పార్టీ ప్రతిష్ట దిగజారిపోయిందని కారణం చెప్తూ కాంగ్రెస్‌ గూటికి చేరారు. వాస్తవానికి కడియం కావ్యకు టికెట్ ఇస్తున్నారనే ఆరూరి రమేష్, పసునూరి దయాకర్ ఇద్దరు బీఆర్ఎస్‌ను వీడారు. అయినా కడియం కూతురుకు పెద్దపీట వేశారు గులాబీ బాస్. దాన్ని నిలబెట్టుకోకుండా ఉన్నఫలంగా కారు దిగి హస్తంతో షేక్ హ్యాండ్ ఇచ్చింది కడియం ఫ్యామిలీ.

మినిస్టర్ క్వాటర్స్‌లో కడియం శ్రీహరి ఇంటికి వెళ్లిన కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షి, కాంగ్రెస్‌ నేతలు ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. శనివారం నాడు రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నారు కడియం శ్రీహరి, అతని కూతురు.

నేతల జంపింగ్స్‌పై స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కేకే, కడియం లాంటి వెళ్లిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోయేవాళ్లు ఎలాగు రాళ్లు వేసి వెళ్తారని వాటిని పట్టించుకోవద్దని క్యాడర్‌కు సూచించారు. రంజిత్‌రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డిని మళ్లీ బీఆర్ఎస్‌లో చేర్చుకునే ప్రసక్తే లేదన్నారు కేటీఆర్.

కొంతమంది రాజకీయ అవకాశవాదులు, పవర్ బ్రోకర్లు పార్టీని వీడినా నష్టమేమి లేదన్నారు మాజీమంత్రి హరీశ్‌రావు. బీఆర్ఎస్ పార్టీకి ఇదేం కొత్తకాదన్నారు. కష్టకాలంలో పార్టీకి ద్రోహం చేస్తే కన్నతల్లికి ద్రోహం చేసినట్టేనన్నారు హరీశ్. వెళ్లినవారిని కాళ్ళు మొక్కినా మళ్ళీ తీసుకోవద్దని పార్టీ నిర్ణయించిందన్నారు.

కడియం శ్రీహరి పార్టీ మార్పుపై తీవ్రస్థాయిలో స్పందించారు ఓరుగల్లు బీఆర్ఎస్ నేతలు. ఎంతోమంది నిబద్దత గల నాయకులను కడియం తొక్కేశారని మండిపడ్డారు. పసునూరి దయాకర్, ఆరూరి రమేష్ పార్టీ మారడానికి కడియమే కారణమని ఆరోపించారు. విలువల గురించి మాట్లాడే శ్రీహరికి విలువలే ఉంటే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు.

కోహ్లీ, గంభీర్ హగ్‌ వీడియో వైరల్..వారికి ఆస్కార్ ఇవ్వాలన్న సునీల్ గవాస్కర్

Bengaluru vs Kolkata: మూమెంట్‌ ఆఫ్ ది మ్యాచ్‌.. కోహ్లీకి గంభీర్‌ హగ్‌
ఐపీఎల్‌ – 2024లో బెంగళూరు, కోల్‌కతా జట్ల మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఉప్పు, నిప్పులా ఉండే విరాట్‌ కోహ్లీ, గౌతమ్‌ గంభీర్‌లు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని, పలకరించుకున్నారు. కోల్‌కతా ఫీల్డింగ్‌ స్ట్రాటజిక్ టైమ్ అవుట్ సమయంలో ఇది జరిగింది. కోహ్లీ వద్దకు గంభీర్ వచ్చి హగ్‌ చేసుకున్నాడు. గతేడాది వీరి మధ్య జరిగిన వాగ్వాదం ఒక్కసారిగా అభిమానులను షాక్‌కు గురిచేసిన విషయం తెలిసిందే. కోహ్లీ బెంగళూరు తరఫున ఆడుతుండగా.. గంభీర్‌ కోల్‌కతా టీమ్‌కు మెంటార్‌గా ఉన్నాడు.

రామచిలుకలకు టికెట్ కొట్టిన ఆర్టీసీ కండక్టర్

తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మహాలక్ష్మీ పథకం కింద ఆర్టీసీ బస్సులో మహిళలకు ప్రభుత్వం ఉచిత ప్రయాణాన్ని అమలు చేస్తోంది. అయితే మంగళవారం కర్ణాటక రాష్ట్రంలోని ఓ ఆర్టీసీ బస్సులో ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ, ఆమె మనవరాలు బెంగళూరు నుంచి మైసూరుకు ప్రయాణిస్తున్నారు. వారితోపాటు నాలుగు చిలుకలు కూడా తీసుకెళ్తున్నారు. KSRTC బస్సు కండక్టర్ ఆ చిలుకలను రూ.444 లు బస్సు ఛార్జీ టికెట్ కొట్టాడు. వారికి మాత్రం శక్తి యోజన స్కీం కింద ఫ్రీ టికెట్ తీశాడు. ఈ టాపింగ్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది. ఆ టికెట్, రామచిలుకలు ఉన్న ఫొటో చూసిన వారందరూ షేర్ చేసుకుంటున్నారు.
కర్ణాటక ప్రభుత్వం పబ్లిక్ ట్రాన్స్‪పోర్ట్‌లో పెంపుడు జంతువులకు అనుమతిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు మాత్రం కుక్కలు, పిల్లులు, పక్షులు వంటి పెట్ ఆనియల్స్ ను బస్సులోని తీసుకురానివ్వరు. కర్ణాటక రాష్ట్రంలో వైభవ, రాజహంస, నాన్ ఏసీ, స్లీపర్, ఏసీ బస్సుల్లో పెంపుడు జంతువుల్ని తీసుకెళ్లనివ్వరు. మిగిలిన బస్సుల్లో పెంపుడు జంతువులకు అనుమతి ఉంటుంది. పెంపుడు కుక్కలకు పెద్దల ఛార్జీలో హాఫ్ టికెట్, కుందేళ్లు, పక్షులు, పిల్లులకు మాత్రం చిన్న పిల్లలకు తీసుకునే హాఫ్ టికెట్‌లో సగం ఛార్జీ చెల్లించాలి. పెట్ ఆనిమల్స్ కు టికెట్ కొట్టకుంటే.. నిధుల దుర్వినియోగం చేసినట్లు పరిగణించి కండక్టర్ పై క్రిమినిల్ కేసు నమోదు చేస్తారు. డ్యూటీ నుంచి సస్పెండ్ చేస్తారు. టికెట్ తీయని యజమానులకు టికెట్ ధరలో 10శాతం ఫైన్ విధిస్తారు. దీంతో రామ చిలుకలతో 444 రూపాయల టికెట్ కొట్టాడు కండక్టర్.

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు లో 4,660 ఎస్సై, కానిస్టేబుల్ ప్రభుత్వ ఉద్యోగాలు

దేశవ్యాప్తంగా అన్నీ రైల్వే రీజియన్లలో భారీగా కొలువుల భర్తీకి రంగం సిద్ధమైంది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు (ఆర్‌పీఎఫ్‌) / రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ (ఆర్‌పీఎస్‌ఎఫ్‌) లో మొత్తం 4,660 ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రైల్వే శాఖ (రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు) సంక్షిప్త ఉద్యోగ ప్రకటనను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్‌ 15వ తేదీ నుంచి మే 14వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రాత, శారీరక దార్ఢ్య, వైద్య పరీక్షలు తదితరాల ఆధారంగా ఉద్యోగాల ఎంపిక ఉంటుంది.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
ఆర్‌ఆర్‌బీ రీజియన్లు: అహ్మదాబాద్, అజ్‌మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీఘడ్‌, చెన్నై, గువాహటి, జమ్ము అండ్‌ శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌పూర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం, గోరఖ్‌పూర్.

ప్రకటన వివరాలు:

1. కానిస్టేబుల్: 4,208 పోస్టులు

2. సబ్ ఇన్‌స్పెక్టర్: 452 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 4,660.

అర్హత: కానిస్టేబుల్ పోస్టులకు పదో తరగతి, ఎస్సై ఉద్యోగాలకు డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

వయోపరిమితి: 01.07.2024 నాటికి కానిస్టేబుల్ పోస్టులకు 18-28 ఏళ్ల మధ్య; ఎస్సై పోస్టులకు 20-28 ఏళ్ల మధ్య ఉండాలి.

ప్రారంభ వేతనం: నెలకు ఎస్సై పోస్టులకు రూ.35,400; కానిస్టేబుల్ పోస్టులకు రూ.21,700.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్‌మెంట్‌ టెస్ట్, మెడికల్ స్టాండర్డ్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్‌, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులకు రూ.250. ఇతరులకు రూ.500.

ముఖ్య తేదీలు:

ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు, దరఖాస్తులు ప్రారంభం: ఏప్రిల్ 15, 2024

ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు, దరఖాస్తుకు చివరి తేదీ: మే 14, 2024

వెబ్ సైట్ : Click Here
నోటిఫికేషన్ : Click Here

ప్రయాణికులకు గుడ్ న్యూస్!.. త్వరలోనే టోల్ గేట్లు మాయం?

దేశంలోని టోల్ గేట్లను రద్దు చేస్తూ వాహాన ప్రయాణికులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఇకపై టోల్ గేట్ల వద్ద ఎక్కువ సేపు ఆగాల్సిన పని లేకుండా నూతన వ్యవస్థను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న టోల్ వ్యవస్థను మారుస్తున్నట్లు కేంద్ర రవాణా శాఖమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. త్వరలో అదునాతన టెక్నాలజీతో ఉపగ్రహ ఆధారిత టోల్ వసూలు విధానాన్ని ప్రవేశ పెట్టనున్నట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు. దీనికోసం త్వరలో ఇప్పుడున్న టోల్ గేట్ వ్యవస్థ రద్దు పరిచనున్నారు. అనంతరం శాటిలైట్ బేస్‌డ్ టెక్నాలజీతో టోల్ సిస్టం అమల్లోకి వస్తుంది. దీంతో వాహన యజమానులు హైవేపై ప్రయాణించేటప్పుడు జీపీఎస్ ఆధారంగా డైరెక్టుగా వారి బ్యాంకు ఖాతా నుంచి టోల్ వసూలు కానుంది. ఈ కొత్త సౌకర్యంతో ప్రయాణికులు టోల్ గేట్ల వద్ద పడిగాపులు కాస్తు సమయం వృధా చేయాల్సిన పనిలేకుండా పోనుంది.

AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?

ఏపీలో ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి ఇప్పటివరకు 16 డీఎస్సీ నోటిఫికేషన్లు వెలువడ్డాయి. ఇందులో 13 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వెలువడగా.. తెలంగాణ విడిపోయాక 3 పర్యాయాలు నోటిఫికేషన్లు జారీచేశారు.
AP DSC Details: ఆంధప్రదేశ్‌ రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి ఇప్పటివరకు 16 డీఎస్సీ నోటిఫికేషన్లు వెలువడ్డాయి. ఇందులో 13 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వెలువడగా.. తెలంగాణ విడిపోయాక 3 పర్యాయాలు నోటిఫికేషన్లు జారీచేశారు. అయితే అంతకు ముందు 1977, 1978, 1982 డీఎస్సీలు నిర్వహించినప్పటికీ ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్, 1982 అమల్లోకి వచ్చాక మొదటి డీఎస్సీ నోటిఫికేషన్ ఎన్టీఆర్ హయాంలో 1984లో వెలువడింది. ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో కోట్ల విజయ భాస్కర రెడ్డి, చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలలో నోటిఫికేషన్లు వెలువడగా.. చివరగా కిరణ్ కుమార్ రెడ్డి 2012లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇక రాష్ట్ర విభజన తర్వాత 2014, 2018లలో డీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేశారు.

ఎన్టీఆర్‌తో ప్రారంభం..
ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మొదటిసారి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుంది. ఎన్టీఆర్ తన పదవీకాలంలో 1984, 1986, 1989 సంవత్సరాల్లో మొత్తం 3 డీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేశారు. ఆ తర్వాత కోట్ల విజయ భాస్కర రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో 1994లో డీఎస్సీ నోటిఫికేట్ వెలువడింది.


చంద్రబాబు రికార్డు..
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో అత్యధికత డీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేసిన సీఎంగా చంద్రబాబు నాయుడు ఘనత సాధించారు. ఈయన ఏలుబడిలో మొదటిసారి 8 సంవత్సరాల్లో 6 నోటిఫికేషన్లు, రెండో పర్యాయం రాష్ట్ర విభజన తర్వాత 2014 నుంచి 2019 మధ్యకాలంలో 2సార్లు డీఎస్సీ నోటిఫికేషన్లు వెలువడ్డాయి. మొత్తంగా చూస్తే చంద్రబాబు జమానాలో 1996, 1998, 2000, 2001, 2002, 2003, 2014, 2018 సంవత్సరాల్లో నోటిఫికేషన్లు వెలువడ్డాయి.

➥ ఇక 2004 నుంచి 2009 వరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం 2006, 2008లో రెండు డీఎస్సీ నోటిఫికేష్లను విడుదల చేసింది. 2009లో ఆయన మరణాంతరం ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి 2012లో DSC నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలువడిన చిట్టచివరి డీఎస్సీ నోటిఫికేషన్.

రాష్ట్రవిభజన తర్వాత.. వేర్వేరుగా..

➥ 2014లో ఏపీ నుంచి తెలంగాణ విడిపోయాకా.. రెండు ప్రభుత్వాలు డీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేశారు. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 2014, 2018 సంవత్సరాల్లో నోటిఫికేషన్లు విడుదల చేయగా..ఆ తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఎన్నికల ఏడాదిలో 2024లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు.

➥ ఇక తెలంగాణలోను రెండుసార్లు డీఎస్సీ నోటిఫికేషన్లు వెలువడ్డాయి. 2018లో కేసీఆర్ ప్రభుత్వం డీఎస్సీని టీఆర్టీగా నిర్వహించింది. ఆ తర్వాత 2023 చివరలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయగా.. ఎన్నికల కారణంగా పరీక్షలు వాయిదావేశారు. ఫలితాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కొత్త ప్రభుత్వం డీఎస్సీ 2023 నోటిఫికేషన్ రద్దుచేసి, డీఎస్సీ-2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

➥ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో టెట్, డీఎస్సీ పరీక్షల వాతావరణం నెలకొంది. ఏపీలో టెట్ పరీక్షలు నిర్వహించగా.. డీఎస్సీ కోసం షెడ్యూలు విడుదలైంది. ఎన్నికల షెడ్యూలుతో పరీక్షలు వాయిదాపడే అవకాశం కనిపిస్తుంది.

➥ ఇక తెలంగాణలో టెట్ కంటే ముందు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో డీఎస్సీ కంటే ముందుగానే టెట్ నిర్వహించాల్సిందిగా కోర్టుల ఆదేశించింది. దీంతో అప్పటికప్పుడు టెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం టెట్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది.

కేంద్ర ప్రభుత్వం నుండి బంపర్ ఆఫర్. ఈ పథకం నుండి సంవత్సరానికి ₹ 36,000

కేంద్ర ప్రభుత్వం నుండి బంపర్ ఆఫర్. ఈ పథకం నుండి సంవత్సరానికి ₹ 36,000

ఈ పథకం వీధి వ్యాపారులు, ఆటో డ్రైవర్లు, తోలు కార్మికులు, గృహ కార్మికులు మరియు విడిభాగాల తయారీదారులు వంటి అసంఘటిత రంగ కార్మికులను లక్ష్యంగా చేసుకుంటుంది.

ఈ పథకం ప్రయోజనాలు
పథకం కింద, 60 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న లబ్ధిదారులు ₹36,000 వార్షిక పెన్షన్ పొందవచ్చు. ఈ పెన్షన్‌ను ప్రతిరోజూ కేవలం ₹2 కనీస పెట్టుబడితో పొందవచ్చు, ఇది నెలకు ₹55కి సమానం.

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు
– వయస్సు: 18 నుండి 40 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
– జాయింట్ అకౌంట్: భార్యాభర్తలు ఉమ్మడి ఖాతాను తెరవవచ్చు.
– ఆదాయం: నెలవారీ ఆదాయం ₹15,000 మించకూడదు.
– ఉపాధి: దరఖాస్తుదారులు ప్రభుత్వ ఉద్యోగాలు లేదా సంఘటిత రంగంలో ఉద్యోగం చేయకూడదు.
– పన్ను చెల్లింపుదారు: దరఖాస్తుదారులు ఆదాయపు పన్ను చెల్లింపుదారులు కాకూడదు.
– ప్రస్తుత ప్రయోజనాలు: లబ్ధిదారులు పిఎఫ్ లేదా ఎన్‌పిఎస్ వంటి ప్రభుత్వ పథకాల గ్రహీతలు కాకూడదు.

అవసరమైన పత్రాలు
– ఆదాయ ధృవీకరణ పత్రం
– కుల ధృవీకరణ పత్రం
– చిరునామా రుజువు
– రేషన్ కార్డు
– ఆధార్ కార్డు
– బ్యాంకు ఖాతా వివరాలు

దరఖాస్తు ప్రక్రియ
PM-SYM స్కీమ్ కోసం దరఖాస్తు చేయడానికి, సమీపంలోని సేవా కేంద్రాన్ని సందర్శించి, అవసరమైన పత్రాలను సమర్పించండి. మరింత సమాచారం కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ https://labour.gov.in/pm-sym లో చూడవచ్చు.

సర్వైవర్ బెనిఫిట్స్
అరవై ఏళ్ల తర్వాత పెట్టుబడిదారుడు అకాల మరణం చెందితే, వారి జీవిత భాగస్వామికి పెన్షన్ మొత్తం అందించబడుతుంది.

మొత్తంమీద, PM-SYM పథకం అసంఘటిత రంగ కార్మికులకు వారి పదవీ విరమణ అనంతర సంవత్సరాలకు పెన్షన్‌ను అందించడం ద్వారా వారి ఆర్థిక భవిష్యత్తును కనీస పెట్టుబడితో సురక్షితం చేసుకోవడానికి ఒక ముఖ్యమైన అవకాశాన్ని అందిస్తుంది.

Forever Glow: నిత్యయవ్వనంగా కనిపించాలనుకుంటున్నారా? ఇలా చేసి మీ చర్మం కొల్లాజెన్‌ను పెంచుకోండి..

చర్మం, ఎముకలు, కండరాలు, స్నాయువులు, మృదులాస్థికి నిర్మాణాన్ని ఇస్తుంది. అటువంటి పరిస్థితిలో చర్మంలో దాని స్థాయి తగ్గడం ప్రారంభించినప్పుడు ముడతలు కనిపించడం మొదలవుతుంది. కొల్లాజెన్ తగ్గడానికి కారణం ఏమిటి? వృద్ధాప్యం కాకుండా, మీ చర్మంలో కొల్లాజెన్ స్థాయిలను తగ్గించే మూడు ప్రధాన విషయాలు సూర్యరశ్మి, ధూమపానం, చక్కెర వినియోగం. అటువంటి పరిస్థితిలో ఈ కారకాలకు దూరంగా ఉండటం ద్వారా కొల్లాజెన్ లోపాన్ని నివారించవచ్చు. అంతేకాకుండా కొల్లాజెన్ స్థాయిని పెంచడంలో కొన్ని ఆహారాలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
వదులుగా ఉండే చర్మం వయస్సు పెరగడానికి ముఖ్యమైన సంకేతం. కానీ కొన్నిసార్లు కొందరు వ్యక్తులు చిన్న వయస్సులోనే వృద్ధాప్యంగా కనిపించడం ప్రారంభిస్తారు. దీనికి కారణం వారి శరీరంలోని కొల్లాజెన్‌ ఉత్పత్తి.. తక్కువ కొల్లాజెన్ సమస్య కారణంగా చిన్న వయసులోనే చర్మం ముడతలతో పెద్దవారిగా కనిపిస్తుంటారు. ఇది శరీరంలో ఉండే ఒక రకమైన ప్రోటీన్. ఇది కణజాలానికి కణజాలాన్ని కలుపుతుంది. చర్మం, ఎముకలు, కండరాలు, స్నాయువులు, మృదులాస్థికి నిర్మాణాన్ని ఇస్తుంది. అటువంటి పరిస్థితిలో చర్మంలో దాని స్థాయి తగ్గడం ప్రారంభించినప్పుడు ముడతలు కనిపించడం మొదలవుతుంది. కొల్లాజెన్ తగ్గడానికి కారణం ఏమిటి? వృద్ధాప్యం కాకుండా, మీ చర్మంలో కొల్లాజెన్ స్థాయిలను తగ్గించే మూడు ప్రధాన విషయాలు సూర్యరశ్మి, ధూమపానం, చక్కెర వినియోగం. అటువంటి పరిస్థితిలో ఈ కారకాలకు దూరంగా ఉండటం ద్వారా కొల్లాజెన్ లోపాన్ని నివారించవచ్చు. అంతేకాకుండా కొల్లాజెన్ స్థాయిని పెంచడంలో కొన్ని ఆహారాలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

సిట్రస్‌ పండ్లు..

నివేధికల ప్రకారం.. విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తికి మద్దతు ఇస్తుంది. కాబట్టి సిట్రస్ పండ్లను తరచూగా తీసుకోవటం ద్వారా శరీరంలో కొల్లాజెన్‌ ఉత్పత్తి సరిగా జరుగుతుంది. అందుకోసం మీరు మీరు ప్రతిరోజూ మీ ఆహారంలో నారింజ, ద్రాక్ష, నిమ్మకాయలను చేర్చుకోవచ్చు.
బెర్రీలు..

కొల్లాజెన్‌ను పెంచడానికి బెర్రీలు గొప్ప ఎంపిక. స్ట్రాబెర్రీలు నిజానికి నారింజ కంటే ఎక్కువ విటమిన్ సిని అందిస్తాయి. దీనితో పాటు రాస్ప్బెర్రీస్, బ్లూబెర్రీస్, బ్లాక్బెర్రీస్ కూడా భారీ మోతాదులో కొల్లాజెన్‌ను అందిస్తాయి.

ఆకు కూరలు..

బచ్చలికూర, పాలకూర, మెంతి, కాలే ఆకులు వంటివి కొల్లాజెన్‌ ఉత్పత్తికి మంచివి. ఇది యాంటీఆక్సిడెంట్ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. కొన్ని అధ్యయనాలు క్లోరోఫిల్ తీసుకోవడం వల్ల చర్మంలో కొల్లాజెన్ స్థాయి పెరుగుతుందని తేలింది.

వెల్లుల్లి..

వెల్లుల్లిలో సల్ఫర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ విచ్ఛిన్నతను సంశ్లేషణ చేయడంలో, నిరోధించడంలో సహాయపడే ట్రేస్ మినరల్. అయితే, మీరు ఎంత మోతాదులో తింటారు… అనే విషయంలో జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం.

గుడ్లు…

గుడ్డులోని తెల్లసొనలో పెద్ద మొత్తంలో ప్రోలిన్ ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి అవసరమైన అమైనో ఆమ్లాలలో ఒకటి. మీరు మీ చర్మం బిగుతుగా ఉండాలని కోరుకుంటే, గుడ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది.

SBI Debit Card Charges: ఎస్బీఐ కస్టమర్లకు భారీ షాక్, మీ కార్డులు మాకొద్దు మహాప్రభో అనేలా ఉన్నారు

SBI Debit Card Charges From 01 April 2024: దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ బ్యాంక్‌ ఎస్‌బీఐకి చెందిన కోట్లాది మంది ఖాతాదార్లకు పెద్ద షాక్ తగలబోతోంది. ఈ ప్రభుత్వ బ్యాంక్‌, తన వివిధ డెబిట్ కార్డ్‌ల ‍‌(ATM కార్డ్‌) వార్షిక నిర్వహణ ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించింది. వచ్చే వారం నుంచి ఇది అమల్లోకి వస్తుంది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India) అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం ప్రకారం, వివిధ SBI డెబిట్ కార్డుల వార్షిక నిర్వహణ ఛార్జీని రూ. 75 వరకు బ్యాంక్‌ పెంచబోతోంది. డెబిట్ కార్డ్‌ల కొత్త వార్షిక నిర్వహణ ఛార్జీలు (Annual maintenance charges) 01 ఏప్రిల్ 2024 (కొత్త ఆర్థిక సంవత్సరం) నుంచి అమలులోకి వస్తాయి. మన దేశంలో కోట్లాది మంది ప్రజలు SBI డెబిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు. కస్టమర్ల సంఖ్య పరంగా SBI దేశంలోనే అతి పెద్ద బ్యాంక్.

ఎస్‌బీఐ డెబిట్‌ కార్డ్‌లపై చార్జీల బాదుడు ఈ విధంగా ఉంటుంది..
— క్లాసిక్, సిల్వర్, గ్లోబల్, కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డ్ యూజర్లు 01 ఏప్రిల్‌ 2024 నుంచి నిర్వహణ ఛార్జీ రూపంలో రూ. 200 + GST చెల్లించాలి. ప్రస్తుతం ఈ ఛార్జీ రూ. 125 + GSTగా ఉంది.
— యువ, గోల్డ్, కాంబో డెబిట్ కార్డ్, మై కార్డ్ (ఇమేజ్ కార్డ్) యూజర్ల నుంచి ప్రస్తుతం ఉన్న రూ. 175 + GSTకి బదులుగా రూ. 250 + GSTని బ్యాంక్‌ వసూలు చేస్తుంది.
— ప్లాటినం డెబిట్ కార్డ్ వినియోగదార్ల నుంచి ఇప్పుడున్న రూ. 250 + GSTకి బదులుగా రూ. 325 + GSTని వసూలు చేస్తుంది.
— ప్రైడ్, ప్రీమియం బిజినెస్ డెబిట్ కార్డ్‌ల వార్షిక నిర్వహణ ఛార్జీ ప్రస్తుత రూ. 350 + GST నుంచి రూ. 425 + GSTకి పెరుగుతుంది.

రివార్డ్‌ పాయింట్లు కూడా రద్దు
SBI క్రెడిట్ కార్డ్ విషయంలో కూడా కొన్ని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. స్టేట్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డులను జారీ చేసే సంస్థ ఎస్‌బీఐ కార్డ్‌ (SBI Card), తన కొన్ని క్రెడిట్ కార్డుల రివార్డ్ పాయింట్లకు సంబంధించి, ఏప్రిల్ 01 నుంచి కొత్త రూల్స్‌ అమలు చేయబోతున్నట్లు సమాచారం. ఈ అప్‌డేట్‌ ప్రకారం, కొంతమంది ప్రత్యేక క్రెడిట్ కార్డ్ హోల్డర్లు ఇకపై క్రెడిట్ కార్డ్‌ చెల్లింపులపై రివార్డ్ పాయింట్‌ ప్రయోజనాన్ని పొందలేరు.

ఇప్పటికే కూడబెట్టిన రివార్డ్ పాయింట్లపైనా ప్రభావం
అదే సమయంలో, SBI క్రెడిట్ కార్డ్ హోల్డర్లు మరో నష్టాన్ని కూడా చవిచూడబోతున్నారు. SBI కార్డ్‌ వెబ్‌సైట్‌ ప్రకారం, ప్రభావిత కార్డ్‌ల ద్వారా అద్దె చెల్లించడం ద్వారా వచ్చిన రివార్డ్ పాయింట్‌ల గడువు 15 ఏప్రిల్ 2024తో ముగుస్తుంది. అంటే, ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డ్‌ ద్వారా మీరు అద్దె చెల్లించి, అందుకోసం కొన్ని రివార్డ్ పాయింట్‌లను పొందినట్లయితే, వాటిని ఇప్పుడే ఉపయోగించండి. లేకపోతే, 15 ఏప్రిల్ 2024 తర్వాత ఆ రివార్డ్‌ పాయింట్లు చెల్లుబాటు కావు.

AP పదో తరగతి ఫలితాలు

AP SSC Results 2024 @bse.ap.gov.in; Check AP 10th Class Results 20

SSC Board Official  Website https://bse.ap.gov.in/

Eenadu ఈనాడు Website link 1

Eenadu ఈనాడు Website link 2 

Manabadi (మన బడి ) Web link 

Sakshi (సాక్షి ) Website  link

AP SSC Results 2024 Date : ఏపీ పదో తరగతి ఫలితాలు వచ్చేస్తున్నాయ్, ఈ నెల 22న విడుదల


 

AP SSC Results 2024 Date : ఏపీ పదో తరగతి ఫలితాలు వచ్చేస్తున్నాయ్. ఈ నెల 22వ తేదీన టెన్త్ రిజల్ట్స్ విడుదల చేయనున్నట్లు ఎస్ఎస్సీ బోర్డు ప్రకటించింది.

AP SSC Results 2024 Date : ఏపీ పదో తరగతి ఫలితాల(AP SSC Results 2024) తేదీ, సమయాన్ని విద్యాశాఖ ప్రకటించింది. ఏప్రిల్ 22 ఉదయం 11 గంటలకు పదో తరగతి ఫలితాలను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఎల్లుండి(సోమవారం) ఉదయం 11 గంటలకు విద్యాశాఖ కమిషన్ ఎస్.సురేష్ కుమార్ టెన్త్ ఫలితాలను విజయవాడలో విడుదల చేయనున్నారు. విద్యార్థులు ఫలితాలను https://bse.ap.gov.in/  వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు.

ఏపీ పదో తరగతి పరీక్షల ఫలితాలు(AP SSC Results 2024) విడుదలపై అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ నెల 22 ఫలితాలు ప్రకటిస్తామని విద్యాశాఖ ప్రకటించింది. ఏపీలో మార్చి 18 నుంచి 30 వరకు టెన్త్ పబ్లిక్ పరీక్షలు (AP 10th Exams)జరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది దాదాపు 6.30 లక్షలకు పైగా విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షల అనంతరం మూల్యాంకనం చేపట్టిన విద్యాశాఖ అధికారులు.. ఏప్రిల్ 8 నాటికి ప్రక్రియ పూర్తి చేశారు. విద్యార్థులు నేరుగా ఎస్.ఎస్.సి బోర్డులో ఫలితాలు చెక్ చేసుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. గతేడాది మే 6న పదో తరగతి ఫలితాలు విడుదల చేయగా… ఈసారి ఎన్నికల కారణంగా చాలా తొందరగానే ఫలితాలు విడుదల చేస్తున్నారు.

జవాబు పత్రాలను మరోసారి పరిశీలించి, మార్కులు కంప్యూటీకరణ చేసే ప్రక్రియ అధికారులు పూర్తిచేశారు. పదో తరగతి ఫలితాల విడుదలకు ఈసీ అనుమతిని ఇచ్చింది. దీంతో ఏప్రిల్ 22న ఫలితాలు(AP 10th Results Date) విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ డి.దేవందర్ రెడ్డి ప్రకటించారు.

How To Download AP 10th Results 2024 : ఏపీ పదో ఫలితాలను ఇలా చెక్ చేసుకోవచ్చు?
విద్యార్థులు ఎస్.ఎస్.సి బోర్డు అధికారిక వెబ్Website https://www.bse.ap.gov.in/ లోకి వెళ్లాలి.

హోమ్ పేజీలో కనిపించే “AP SSC Results 2024” లింక్‌పై క్లిక్ చేయాలి.
విద్యార్థి హాల్ టికెట్ నంబర్ ను నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి.
విద్యార్థి ఫలితాలు, మార్కుల వివరాలు డిస్ ప్లే అవుతాయి.
మార్కుల మెమోను డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ ను పొందవచ్చు.

 

 

 

 

AP SSC Results 2024 Updates : ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు(AP SSC Exams 2024) కొనసాగుతున్నాయి. మార్చి 18వ తేదీన మొదలైన ఈ ఎగ్జామ్స్… ఈనెల 30వ తేదీతో పూర్తి కానున్నాయి. ఈ నేపథ్యంలో…. జవాబు పత్రాల మూల్యాంకానికి సంబంధించి ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది విద్యాశాఖ. ఎనిమిది రోజుల్లోనే పూర్తిస్థాయిలో స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియను పూర్తి చేసే దిశగా కార్యాచరణను రూపొందించింది.

ఏప్రిల్ 1 నుంచి స్పాట్ వాల్యూయేషన్…!
AP SSC Exam Papers Valuation 2024: ఏపీలో మార్చి 30వ తేదీతో పరీక్షలు పూర్తి కానున్నాయి. దీంతో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియను(AP SSC Exam Papers Valuation 2024) ప్రారంభించనుంది పరీక్షల విభాగం. ఈ వాల్యూయేషన్ ప్రక్రియను ఏప్రిల్ 8వ తేదీలోపు పూర్తి చేసేలా షెడ్యూల్ రూపొందించినట్లు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల కేంద్రాల్లో ఈ మూల్యాంకన ప్రక్రియ జరగనుంది. సిబ్బంది కొరత లేకుండా పరీక్షల విభాగం చర్యలు చేపట్టింది. ఇందులో కూడా సీనియర్‌ ఉపాధ్యాయులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. స్పాట్ కు సంబంధించి సమాచారం అందుకున్న ఉపాధ్యాయులు తప్పనిసరిగా విధులకు హాజరుకావాల్సి ఉంటుందని విద్యాశాఖ కూడా స్పష్టం చేసింది.

AP 10th Results 2024: ఈసారి ఫలితాలు ఎప్పుడంటే..?
గత ఏడాదితో పోల్చితే…ఈసారి ఏపీ పదో తరగతి ఫలితాలు(AP 10th Results 2024) ముందుగానే రానున్నాయి. గత షెడ్యూల్ చూస్తే… ఏప్రిల్ 3 నుంచి పరీక్షలు ప్రారంభమై…. 18వ తేదీ వరకు కొనసాగాయి. మే6వ తేదీన ఫలితాలు వచ్చాయి. కానీ ఈసారి చూస్తే…. మార్చి 18వ తేదీనే ఎగ్జామ్స్ ప్రారంభమైన… మార్చి 30వ తేదీతోనే ముగియనున్నాయి. దీంతో ఈసారి పదో తరగతి ఫలితాలు తొందరగానే రానున్నాయి. అన్ని కుదిరితే… ఏప్రిల్ మూడో వారంలోనే ఫలితాలను రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇది కుదరకపోతే చివరి వారంలో దాదాపుగా ప్రకటించే ఛాన్స్ ఉంది.

ఇలా అయితే.. విద్యావ్యవస్థ నాశనం-రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డ హైకోర్టు జీవో 76 జారీ చేసిన అధికారిని జైలుకు పంపాలి ఏప్రిల్‌ 1న హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశం

బోధనేతర సిబ్బందికి ప్రిన్సిపల్స్‌గా పదోన్నతులా?
మోటార్‌సైకిల్‌ నడపడం వచ్చని విమానం నడిపిస్తారా?
రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డ హైకోర్టు
జీవో 76 జారీ చేసిన అధికారిని జైలుకు పంపాలి
ఏప్రిల్‌ 1న హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశం
పదోన్నతులపై సింగిల్‌ జడ్జి ఉత్తర్వులు సస్పెన్షన్‌…

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో బోధనేతర సిబ్బంది (లైబ్రేరియన్లు, ఫిజికల్‌ డైరెక్టర్లు) ప్రిన్సిపల్స్‌గా పదోన్నతి పొందేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 76 జారీ చేయడంపై హైకోర్టు నిప్పులు చెరిగింది. విద్యా వ్యవస్థను నాశనం చేసే ఇలాంటి చర్య ఆత్మహత్యా సదృశమేనని ఘాటుగా వ్యాఖ్యానించింది. బోధన సామర్థ్యం లేని వారిని విద్యా సంస్థలకు అధిపతులుగా నియమిస్తే వాటి తలరాత ఏమవుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తోందంటూ ఆగ్రహం ప్రకటించింది. లైబ్రేరియన్లు, ఫిజికల్‌ డైరెక్టర్లు లాంటి బోధనేతర సిబ్బందిని కశాశాల ప్రిన్సిపల్స్‌గా నియమిస్తే.. సిలబస్‌ గురించి వారికేం అవగాహన ఉంటుంది, ఏ లెక్చరర్‌ ఏ సబ్జెక్టు చెబుతున్నారో వారికెలా తెలుస్తుందని నిలదీసింది. 2021 డిసెంబరు 8న జీవో 76 జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ అప్పటి ముఖ్యకార్యదర్శిని జైలుకు పంపాలని ఘాటుగా వ్యాఖ్యానించింది.

విద్యా ప్రమాణాలను దెబ్బతీసేలా ఉన్న ఈ జీవో మరే ఇతర కారణాలతోనో ఇచ్చినట్లు ప్రాథమికంగా కనిపిస్తోందని తెలిపింది. పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ఏప్రిల్‌ 1న కోర్టు ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 197 మంది లెక్చరర్లకు.. ప్రిన్సిపల్స్‌గా పదోన్నతి కల్పిస్తూ ఇంటర్‌ విద్య కమిషనర్‌ ఈ నెల 15న జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను సస్పెండ్‌ చేస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఈ నెల 18న ఇచ్చిన ఉత్తర్వులను ధర్మాసనం సస్పెండ్‌ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్‌ 1కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ జి.నరేందర్‌, జస్టిస్‌ ఎన్‌ హరినాథ్‌తో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 197 మంది లెక్చరర్లకు ప్రిన్సిపల్స్‌గా పదోన్నతి కల్పిస్తూ ఇంటర్‌ విద్య కమిషనర్‌ ఈ నెల 15న ఉత్తర్వులిచ్చారు.

ప్రిన్సిపల్‌ పోస్టుల పదోన్నతిలో జూనియర్‌ లెక్చరర్ల (లైబ్రరీ సైన్స్‌)ను పరిగణనలోకి తీసుకోకపోవడం 2021లో ప్రభుత్వం ఇచ్చిన జీవో 76కి విరుద్ధమంటూ ప్రభుత్వ జూనియర్‌ లెక్చరర్స్‌ (లైబ్రరీ సైన్స్‌) అసోసియేషన్‌ అధ్యక్షుడు కె.సంజీవరావు, మరికొందరు హైకోర్టులో వ్యాజ్యం వేశారు. విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి.. ప్రిన్సిపల్స్‌ పదోన్నతిపై కమిషనర్‌ ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్‌ చేశారు. దీన్ని సవాలు చేస్తూ ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ కె.శ్యామ్‌కుమార్‌ హైకోర్టు ధర్మాసనం ముందు అప్పీల్‌ వేశారు. బోధనేతర సిబ్బంది తరఫు న్యాయవాది ఠాగూర్‌ యాదవ్‌ వాదనలు వినిపిస్తూ.. ప్రిన్సిపల్‌ విద్యాసంస్థ పరిపాలన వ్యవహారాలను మాత్రమే పర్యవేక్షిస్తారన్నారు. అందువల్ల బోధనేతర సిబ్బందిని ప్రిన్సిపల్స్‌గా నియమించొచ్చన్నారు.

గురువారం జరిగిన విచారణలో నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌కు ప్రిన్సిపల్స్‌గా పదోన్నతి కల్పించే వ్యవహారం, అందుకు సంబంధించిన జీవో 76పై ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. ఏ రకంగా చూసినా ఫిజికల్‌ డైరెక్టర్లు, లైబ్రేరియన్ల వంటి బోధనేతర సిబ్బందిని టీచర్లుగా పరిగణించలేమని వ్యాఖ్యానించింది. ఇలాంటి జీవోను ఇప్పటి వరకు ఎందుకు సవాలు చేయలేదని అప్పీలుదారు తరఫు సీనియర్‌ న్యాయవాది కేజీ కృష్ణమూర్తిని ప్రశ్నించింది. ఎవరిని పడితే వారిని కళాశాల ప్రిన్సిపల్‌గా నియమిస్తే విద్యావ్యవస్థకు నష్టం జరగదా, భవిష్యత్తులో ఎదురయ్యే ప్రతికూల పరిణామాలను పట్టించుకోరా అని ప్రభుత్వ న్యాయవాదిని నిలదీసింది.

Padmarajan | 238 సార్లు ఓడినా మళ్లీ బరిలోకి!.. విక్రమార్కుడిని మించిపోన పద్మరాజన్‌

ఎందులోనైనా ఓటమిని అంగీకరించకుండా మళ్లీ మళ్లీ ప్రయత్నించే మనిషిని విక్రమార్కుడితో పోలుస్తుంటారు. మన చందమామ కథల్లోని విక్రమార్కుడి కథ వినని వారుండరు. తమిళనాడుకు చెందిన పద్మరాజన్‌ విక్రమార్కుడిని మించిపోయాడు.

ఎందులోనైనా ఓటమిని అంగీకరించకుండా మళ్లీ మళ్లీ ప్రయత్నించే మనిషిని విక్రమార్కుడితో పోలుస్తుంటారు. మన చందమామ కథల్లోని విక్రమార్కుడి కథ వినని వారుండరు. తమిళనాడుకు చెందిన పద్మరాజన్‌ విక్రమార్కుడిని మించిపోయాడు. ఇతను ఇప్పటి వరకు 238 సార్లు ఎన్నికల్లో ఓడిపోయినా.. మళ్లీ లోకసభ ఎన్నికల్లో పోటీకి సిధ్ధమయ్యాడు. తమిళనాడులోని మెట్టూరుకు చెందిన కే పద్మరాజన్‌ 1988లో మొదటిసారి మెట్టూరు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.
ప్రపంచంలోనే ఎక్కువసార్లు ఓడిపోయిన వ్యక్తిగా రికార్డు సాధించాడు. ఇతని పేరు లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్టులో కూడా నమోదైంది. టైర్‌ పంచర్‌ షాప్‌ నడిపిస్తూ జీవనం సాగించే 65 ఏండ్ల కే పద్మరాజన్‌ ఈసారి తమిళనాడులోని ధర్మపురి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. స్థానిక ఎన్నికల నుంచి రాష్ట్రపతి ఎన్నికల వరకు అన్ని ఎన్నికల్లో పోటీ చేసిన ఘనుడు పద్మరాజన్‌.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ, టీఏ, హెచ్‌ఆర్‌ఏ, మరో 6 అలవెన్సులు పెంపు

డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ పెంపు)లో 4 శాతం పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినందున మార్చి నెల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అనూహ్యంగా అనుకూలంగా మారింది. డియర్‌నెస్ అలవెన్స్ పెంపుతో ఇప్పుడు అది 50 శాతం పెరిగింది. HRA కూడా సవరించబడింది. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ), హెచ్‌ఆర్‌ఏ కాకుండా మరో ఏడు అలవెన్స్‌లను కూడా కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఏయే అలవెన్సులు పెంచారు? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) సహా 9 అలవెన్సులు గణనీయంగా పెరిగాయి. ఇంటి అద్దె అలవెన్స్ (HRA) పిల్లల విద్యా భత్యం (CAA) పిల్లల సంరక్షణ ప్రత్యేక భత్యం హాస్టల్ సబ్సిడీ TA బదిలీపై (వ్యక్తిగత ప్రభావాల రవాణా) గ్రాట్యుటీ దుస్తుల అలవెన్స్ సొంత రవాణా కోసం మైలేజ్ అలవెన్స్ డైలీ అలవెన్స్ డియర్‌నెస్ అలవెన్స్ గణన ఎలా మారుతుంది? 2016లో, 7వ వేతన సంఘం అమలులోకి వచ్చినప్పుడు, కరువు భత్యం (డీఏ) సున్నాకి సెట్ చేయబడింది. నిబంధనల ప్రకారం, డియర్‌నెస్ అలవెన్స్ 50 శాతానికి చేరిన తర్వాత, అది సున్నాకి సెట్ చేయబడుతుంది మరియు ఉద్యోగులు అలవెన్స్‌గా పొందే డబ్బు ప్రాథమిక జీతం, అంటే డియర్‌నెస్ అలవెన్స్ మెర్జర్ బేసిక్ శాలరీకి జోడించబడుతుంది. ఒక ఉద్యోగి ప్రాథమిక వేతనం రూ. 18,000 అనుకుందాం, అప్పుడు అతను 50 శాతం డీఏగా రూ.9,000 అందుకుంటాడు. అయితే, డీఏ 50 శాతానికి చేరిన తర్వాత, అది మళ్లీ బేసిక్ జీతంకి జోడించబడుతుంది, ఇది డియర్‌నెస్ అలవెన్స్ సున్నా అవుతుంది. అంటే మూల వేతనం రూ.27,000కి సవరించబడుతుంది. అయితే దీని కోసం ప్రభుత్వం ఫిట్‌మెంట్‌లో మార్పులు చేయాల్సి రావచ్చు. డియర్‌నెస్ అలవెన్స్ ఎప్పుడు సున్నాకి సెట్ చేయబడుతుంది? నిపుణుల అభిప్రాయం ప్రకారం, కొత్త డియర్‌నెస్ అలవెన్స్ జూలైలో లెక్కించబడుతుంది. ఎందుకంటే ప్రభుత్వం ఏడాదికి రెండుసార్లు డియర్‌నెస్ అలవెన్స్‌ను పెంచుతుంది. జనవరి నుంచి మార్చి వరకు ఆమోదం లభించింది. ఇప్పుడు తదుపరి పునర్విమర్శ జూలై 2024 నుండి అమలులోకి వస్తుంది. ఈ సందర్భంలో, జనవరి నుండి జూన్ 2024 వరకు AICPI ఇండెక్స్ డియర్‌నెస్ అలవెన్స్ 3 శాతం, 4 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఉంటుందా అని నిర్ణయించినప్పుడు మాత్రమే డియర్‌నెస్ అలవెన్స్ విలీనం చేయబడుతుంది. ఈ పరిస్థితి తేటతెల్లమైన తర్వాత, ఉద్యోగుల మూల వేతనంలో 50 శాతం డియర్‌నెస్ అలవెన్స్‌ను కలుపుతారు.

AP News: సలహదారు పదవి నుంచి చంద్రశేఖరరెడ్డిని తొలగించండి..!

అమరావతి: జగన్ ప్రభుత్వం( YS Jagan Govt)లో సలహదారుగా వ్యవహరిస్తున్న చంద్రశేఖర్ రెడ్డిని వెంటనే ఆ పదవిలో నుంచి తొలగించాలని రాష్ట్ర ఎన్నికల సీఈవో ముఖేష్ కుమార్ మీనా (MK Meena)కు ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ విజ్జప్తి చేసింది.
ఎన్నికల వేళ చంద్రశేఖర్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేసింది. ఆయన్ని వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలంటూ.. సీఈవో మీనాను కలిసి విజ్జప్తి చేసింది. అనంతరం ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు సుబ్బరాయన్ మాట్లాడుతూ.. ఉద్యోగుల సంక్షేమం చూడాల్సిన సలహదారు చంద్రశేఖర్ రెడ్డి రాజకీయ పరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాలను విమర్శిస్తూ.. వైసీపీకి ఓట్లు వేయాలంటూ ఉద్యోగులు, వాలంటీర్లను ఆయన ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారని విమర్శించారు. చంద్రశేఖరరెడ్డి హయాంలో ఉద్యోగుల సంక్షేమం ఏ మాత్రం జరగలేదని ఆయన స్పష్టం చేసింది.

ఉద్యోగులకు రివర్స్ పీఆర్సీ రావడం, క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పోవడం, డీఏ బకాయిలు, పీఆర్సీ బకాయిలు వంటి సమస్యలు ఎన్నో ఉన్నాయని.. వాటి వేటిని ఆయన అసలు పట్టించుకోలేదని మండి పడ్డారు. అయితే ఆయన తన జీతభత్యాల కోసం, టీఏ, డీఏల కోసం తన హోదాను చూపించుకోవడం కోసం ప్రభుత్వ సలహదారుడిగా ఉంటున్నారని తెలిపారు. ఇక పెన్షనర్స్ కోసం, ఉద్యోగుల కోసం ఆయన ఏ మాత్రం పని చేయలేదని చెప్పారు.

చంద్రశేఖరరెడ్డి ఉద్యోగ సంఘం నేతగా, మాజీ ఉద్యోగిగా ఉద్యోగులను ప్రలోభపెడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలో తన కార్యాలయాన్ని దుర్వినియోగం చేసి రాజకీయ పరమైన వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్ నిబంధనలను అనుసరించి వెంటనే ఆ పదవి నుంచి చంద్రశేఖరరెడ్డిని తప్పించాలని ఎన్నికల సంఘం సీఈవోని కోరినట్లు చెప్పారు. ఈ విషయంలో గవర్నర్, ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి కలుగ చేసుకొని చంద్రశేఖర్ రెడ్డిని ప్రభుత్వ సలహదారు పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

Bank Holidays: ఏప్రిల్ 2024లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే

వచ్చే నెలలో అంటే ఏప్రిల్‌లో బ్యాంకులకు భారీగా సెలవులు(Bank Holidays) రానున్నాయి. దాదాపు సగం రోజులు మాత్రమే బ్యాంకులు(banks) పనిచేయనున్నాయి. మరికొన్ని రోజుల్లో ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం ముగియనుంది.
కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ 1తో ప్రారంభమవుతుంది. అయితే ఏప్రిల్ 2024లో ఎన్ని రోజులు బ్యాంకులకు సెలవులు ఉంటాయి, ఎన్ని రోజులు పనిదినాలు ఉంటాయనేది ఇక్కడ తెలుసుకుందాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జాబితా ప్రకారం ఏప్రిల్ 2024లో 14 రోజుల పాటు బ్యాంకులు మూసివేయబడతాయి. అయితే ఈ సెలవుల్లో వారాంతాల్లో రెండవ, నాల్గవ శనివారం, ఆదివారం, పండుగల సెలవులు కూడా ఉన్నాయి. ఆ సెలవుల జాబితాను ఇప్పుడు చుద్దాం.

ఏప్రిల్ 1: ఆర్థిక సంవత్సరం చివర 31న బ్యాంకులు మూసివేయబడనందున ఏప్రిల్ 1న బ్యాంకుకు సెలవు ఉంటుంది

ఏప్రిల్ 5: బాబు జగ్జీవన్ రామ్ పుట్టినరోజు, జుమాత్ ఉల్ విదా కారణంగా శ్రీనగర్, జమ్మూ, తెలంగాణలో బ్యాంకులకు సెలవు

ఏప్రిల్ 7: ఆదివారం కారణంగా బ్యాంకులకు సెలవు

ఏప్రిల్ 9: గుడి పడ్వా/ఉగాది పండుగ/తెలుగు నూతన సంవత్సరం కారణంగా బేలాపూర్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఇంఫాల్, జమ్ము, ముంబై, నాగ్‌పూర్, పనాజీ, శ్రీనగర్‌లలో బ్యాంకులకు సెలవు

ఏప్రిల్ 10: రంజాన్ ఈద్ కారణంగా కొచ్చి, కేరళలో బ్యాంకులకు సెలవు

ఏప్రిల్ 11: ఈద్ కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు

ఏప్రిల్ 13: రెండవ శనివారం కారణంగా బ్యాంకులు మూసివేయబడతాయి.

ఏప్రిల్ 14: ఆదివారం కారణంగా బ్యాంకులకు సెలవు

ఏప్రిల్ 15: హిమాచల్ డే కారణంగా గౌహతి, సిమ్లా జోన్లలో బ్యాంకులకు సెలవు

ఏప్రిల్ 17: శ్రీరామ నవమి కారణంగా అహ్మదాబాద్, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, డెహ్రాడూన్, గాంగ్‌టక్, హైదరాబాద్, జైపూర్, కాన్పూర్, లక్నో, పాట్నా, రాంచీ, సిమ్లా, ముంబై, నాగ్‌పూర్‌లలో బ్యాంకులకు సెలవు

ఏప్రిల్ 20: గరియా పూజ కారణంగా అగర్తలాలో బ్యాంకులకు సెలవు

ఏప్రిల్ 21: ఆదివారం కారణంగా బ్యాంకులకు వారపు సెలవు

ఏప్రిల్ 27: నాల్గవ శనివారం కారణంగా బ్యాంకులకు సెలవు

ఏప్రిల్ 28: ఆదివారం కారణంగా బ్యాంకులకు వారపు సెలవు

New Rules: ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్.. తెలుసుకోకుంటే నష్టపోతారు?

ఏప్రిల్ 1, 2024 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం(new financial year) మొదలవబోతుంది. ఈ నేపథ్యంలో కొన్ని ఐటీ నిబంధనలు(it rules) కూడా మారిపోయాయి. కొత్త వ్యాపార సంవత్సరం 1 ఏప్రిల్ 2024 నుంచి అనేక ఆర్థిక నియమాలలో మార్పులు వచ్చాయి.
ఈ ఆర్థిక నియమాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇవి సామాన్య ప్రజలపై ప్రత్యక్షంగా ప్రభావం చూపనున్నాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫాస్టాగ్ KYC అప్‌డేట్

ఫాస్టాగ్‌కి సంబంధించిన నియమాలు ఏప్రిల్ 1, 2024 నుంచి మారుతున్నాయి. ఈ క్రమంలో మీరు మార్చి 31, 2024లోపు Fastag KYCని అప్‌డేట్ చేయకుంటే, మీరు వచ్చే నెల నుంచి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఎందుకంటే KYC లేకుంటే బ్యాంకులు ఫాస్టాగ్‌ని డీయాక్టివేట్ చేస్తున్నాయి. అంటే ఫాస్టాగ్‌లో బ్యాలెన్స్ ఉన్నా దాని ద్వారా చెల్లింపు జరగదు. NHAI ఫాస్టాగ్ KYC అప్‌డేట్ తప్పనిసరి చేసింది.

పాన్, ఆధార్ లింక్

మీరు ఇంకా ఆధార్ కార్డుతో పాన్ కార్డును(pan- aadhar) అనుసంధానం(link) చేయలేదా. అయితే వెంటనే చేసుకోండి. ఎందుకంటే పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి గడువు మార్చి 31, 2024 వరకు మాత్రమే ఉంది. ఒకవేళ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయకపోతే, పాన్ నంబర్ రద్దు చేయబడుతుంది. అంటే పాన్ డాక్యుమెంట్‌గా ఉపయోగించుకోవడానికి వీల్లేదు. ఏప్రిల్ 1 తర్వాత పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి, వినియోగదారులు రూ. 1,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

EPFO కొత్త రూల్

EPFO నిబంధనలు కూడా ఏప్రిల్ 1, 2024 నుంచి మారబోతున్నాయి. వాస్తవానికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కొత్త నిబంధన వచ్చే నెల నుంచి అమలు కాబోతుంది. ఈ నియమం ప్రకారం ఎంప్లాయ్ ఉద్యోగం మారిన తర్వాత PF ఖాతా ఆటో మోడ్‌లో బదిలీ చేయబడుతుంది. అంటే వినియోగదారుల ఖాతాను బదిలీ చేయడానికి అభ్యర్థన ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ నిబంధన అమలులోకి వచ్చిన తర్వాత వినియోగదారుల ఇబ్బందులు చాలా వరకు తగ్గనున్నాయి.
SBI క్రెడిట్ కార్డ్

SBI క్రెడిట్ కార్డ్ కలిగి ఉన్న వినియోగదారులకు ఏప్రిల్ 1, 2024 నుంచి కొత్త మార్పులు అమల్లోకి రానున్నాయి. మీరు SBI క్రెడిట్ కార్డ్ ద్వారా అద్దె చెల్లింపు చేస్తే, ఏప్రిల్ 1 నుంచి అద్దె చెల్లింపుపై మీకు ఎటువంటి రివార్డ్ పాయింట్లు ఉండవు. ఈ నియమం కొన్ని క్రెడిట్ కార్డ్‌లపై ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. మరికొన్నింటికి ఇది ఏప్రిల్ 15, 2024 నుంచి వర్తిస్తుంది.

LPG గ్యాస్ ధర

LPG సిలిండర్ గ్యాస్ ధరలు దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1, 2024న మారనున్నాయి. అయితే 2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వాటి ధరల్లో మార్పు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంది.

కొత్త పన్ను విధానం
మీరు పన్ను చెల్లింపుదారులై ఉండి ఇంకా పన్ను విధానాన్ని(new tax) ఎంచుకోకపోతే వెంటనే ఎంచుకోండి. ఎందుకంటే ఏప్రిల్ 1, 2024 నుంచి కొత్త పన్ను విధానం డిఫాల్ట్ పన్ను విధానంగా మారుతుంది. ఈ క్రమంలో కొత్త పన్ను విధానంలో నిబంధనల ప్రకారం పన్ను చెల్లింపుదారులు ఆటోమేటిక్‌గా పన్ను చెల్లించాల్సి వస్తుంది.

PMMVY: ప్రధాన మంత్రి మాతృ వందన యోజన గురించి తెలుసా.. 11000 వస్తాయి

భారత ప్రభుత్వం విభిన్న వర్గాల ప్రజల కోసం అనేక పథకాలు ప్రారంభించింది. అటువంటి పథకం ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (PMMVY). ఇది జనవరి 1, 2017 నుండి అమలులోకి వచ్చింది.
ఈ పథకం జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA)లోని సెక్షన్ 4 ప్రకారం అమలు చేస్తున్నారు. ఈ పథకం గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులకు మద్దతుగా రూపొందించారు. మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖకు సంబంధించిన పథకం ఇది.

గతంలో ఇందిరా గాంధీ మాతృత్వ సహ్యోగ్ యోజన అని ఈ పథకాన్ని పిలిచేవారు.. ఇప్పుడు ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (PMMVY) అని పిలుస్తూ ఉన్నారు. 2010లో ప్రారంభించిన మెటర్నిటీ బెనిఫిట్ ప్రోగ్రామ్ కు 2017లో పేరు మార్చారు. గర్భం దాల్చిన మహిళల కోసం భారత ప్రభుత్వ మహిళా, శిశు అభివృద్ధి శాఖ PMMVY ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి, బిడ్డ పుట్టే వరకూ మూడు విడతలుగా రూ.11,000 ఆర్థిక సాయం అందించనున్నారు. డీబీటీ ద్వారా మహిళ బ్యాంకు అకౌంట్ లోకి డబ్బులు చేరుతాయి.
ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (PMMVY) కు సంబంధించి అర్హత ప్రమాణాలు:

లబ్ధిదారురాలికి కనీసం 19 సంవత్సరాలు వయస్సు ఉండాలి.

ప్రధాన్ మంత్రి మాతృ వందన యోజన (PMMVY) మొదటి ప్రసవానికి మాత్రమే వర్తిస్తుంది.

బిడ్డ పుట్టిన 270 రోజులలోపు దరఖాస్తుదారు PMMVY స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

నిబంధనల ప్రకారం, ఒక లబ్ధిదారురాలు తన రెండవ గర్భంలో కవలలు.. అంతకంటే ఎక్కువ పిల్లలను ప్రసవిస్తే . ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఆడపిల్లలు అయినట్లయితే, ఆమె రెండవ ఆడబిడ్డకు కూడా ప్రోత్సాహకాన్ని అందుకుంటుంది.

లబ్ధిదారులు https://pmmvy.wcd.gov.in లో నమోదు చేసుకోవాలి.
రిజిస్ట్రేషన్ కోసం, ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (PMMVY) మొబైల్ యాప్ ను కూడా ఉపయోగించుకోవచ్చు

బీరకాయే కదా అని చీప్‌గా చూడకండి.. ఎండాకాలంలో తింటే ఆ సమస్యల బాధే ఉండదట..

బీరకాయ అనేది భారతదేశంలో తినే చాలా సాధారణమైన కూరగాయ.. దీనిలో అనేక రకాల పోషకాలు సమృద్ధిగా నిండి ఉన్నాయి. వాస్తవానికి బీరకాయ నుంచి తయారుచేసిన వంటకాలను చాలా మంది ఇష్టపడతారు.
దీన్ని ఉడికించడానికి ఎక్కువ శ్రమ అవసరం లేదు.. ఎందుకంటే ఇది మృదువైన స్వభావం కలది.. సులభంగా ఉడుకుతుంది.. నిమిషాల్లోనే కూర అవుతుంది.. బీరకాయను పలు రకాలుగా వండుకుని తింటారు. చాలామంది పచ్చడిని తినేందుకు ఇష్టపడతారు. అత్యధిక నీటిశాతం కలిగిన బీరకాయను ఎండాకాలంలో తింటే చాలా మంచిదని ఆరోగ్యనిపుణులు పేర్కొంటున్నారు. ఎన్నో పోషకాలు దాగున్న బీరకాయను క్రమం తప్పకుండా తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి..

పోషకాహారం సమృద్ధిగా ఉంటుంది..

బీరకాయ అనేది పోషకాలతో నిండిన కూరగాయ.. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ కె, ఫోలేట్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు దాగున్నాయి. ఇవి మన శారీరక, మానసిక ఆరోగ్యానికి చాలా అవసరం.

బరువును నియంత్రిస్తుంది..
బీరకాయ ముఖ్యంగా తక్కువ కేలరీలు కలిగి ఉండటంతోపాటు శక్తి వనరు. ఇది అధిక మొత్తంలో నీరు, ఫైబర్ కలిగి ఉంటుంది. ఇది ఆహారాన్ని నిల్వ చేయడంలో సహాయపడుతుంది. ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. అందువల్ల, బీరకాయ కూరగాయ బరువు నియంత్రణకు గొప్ప ఎంపికగా పరిగణిస్తారు.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది..

బీరకాయలో మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇది తిన్న తర్వాత, సాధారణంగా గ్యాస్ లేదా అజీర్ణం గురించి ఆందోళన ఉండదు.

గుండెకు మేలు చేస్తుంది..
బీరకాయలో మంచి మొత్తంలో పొటాషియం ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి ప్రయోజనకరంగా పరిగణిస్తారు. ఎందుకంటే ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. ఇంకా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

పేగులను శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది..

బీరకాయ పేగులను శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే అనేక లక్షణాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ ఎ, ఫైబర్ ఉన్నాయి. ఇది పొట్టను శుభ్రపరచడంలో సహాయపడుతుంది. కడుపు సంబంధిత సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం..

Health Tips: వీటిని రోజుకు రెండు తీసుకుంటే చాలు.. ఒంట్లో కొవ్వు మొత్తం మంచులా కరిగిపోతుంది..

అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారింది.. బరువు పెరగడం వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.. అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి..
అందుకే చాలా మంది బరువు తగ్గించుకోవడం కోసం వింత ప్రయోగాలు చేస్తుంటారు.. అయితే కొన్ని డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు.. అలాంటి డ్రై ఫ్రూట్స్ లలో ఒకటి అప్రికాట్.. దీన్ని ఎలా తీసుకుంటే బరువు తగ్గుతారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

అప్రికాట్ గురించి అందరికి తెలుసు.. వీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి.. ముఖ్యంగా విటమిన్ ఎ, సిలు అధికంగా ఉంటాయి.. బీటా కెరోటిన్, లుటీన్, పోటాషియం, యాంటి ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి.. వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి.. అందుకే వీటిని రోజు మీ డైట్ లో చేర్చుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.. అంతేకాదు కండరాల సంకోచాన్ని తగ్గిస్తుంది.. ఎముకల ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది..
హైబీపిని కంట్రోల్ చెయ్యడంలో ఇవి సహాయ పడతాయి.. అంతేకాదు గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.. ఇక వీటిలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగు పడుతుంది.. అలాగే ఎక్కువ సేపు కడుపు నిండిన భావనను కలిగిస్తాయి.. దాంతో ఎక్కువసేపు తినకుండా ఉంటారు.. కొవ్వు మొత్తం కరిగిపోతుంది.. వీటిని నానబెట్టి తీసుకోవడం వల్ల మంచి బెనిఫిట్స్ ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.

రెండో శనివారం సెలవు ఎందుకో తెలుసా?

సెలవు వచ్చిందంటే చాలు చాలా మంది ఫుల్ హ్యాప్పీ గా ఉంటారు. స్కూల్ పిల్లల నుంచి ఉద్యోగుల వరకు సెలవుల కోసం వెయిట్ చేస్తుంటారు. అయితే ప్రతి వారంలో ఆదివారం సెలవు అనేది కామన్.
మళ్లీ ఏవైనా పండుగలైతే సెలవు తీసుకుంటాము. కానీ మనకు రెండో శనివారం కూడా హాలిడే ఉటుంది. భారతదేశంతో సహా అనేక దేశాల్లో ప్రతి నెల రెండో శనివారం బ్యాంకులకు, ప్రభుత్వ కార్యాలయాలకు, కొన్ని ప్రైవేటు కంపెనీలకు హాలిడే ఉంటుంది. అయితే ఈ రెండో శనివారం సెలవు ఎందుకు ఉంటుందన్న సందేహం మీలో చాలామందికి వచ్చే ఉంటుంది. మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు రెండో శనివారం సెలవు ఎందుకు? అసలు రెండో శనివారం సెలవు ఇవ్వడానికి గల కారణం ఏమిటి? కాగా, దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం.

19వ శతాబ్దంలో ఒక బ్రిటిష్ అధికారి, ఒక అసిస్టెంట్ ఉండేవాడు. అతను సెలవుల్లో మాత్రమే తన వృద్ధ తల్లిదండ్రులను కలిసేందుకు స్వగ్రామానికి వెళ్లేవాడు. కొన్ని రోజులకు అది కూడా కుదిరేది కాదట. దీంతో అతని తల్లిదండ్రులు కొడుకును చూసేందుకు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న బ్రిటిష్ అధికారి ప్రతి నెలలో రెండో శనివారం అతని స్వగ్రామానికి వెళ్లటానికి సెలవు ఇచ్చాడట. దీంతో అప్పటి నుంచి బ్రిటీష్ ప్రభుత్వం అధికారికంగా సెలవు ఇవ్వడం ప్రారంభించింది.స్వాతంత్య్రం తర్వాత కూడా భారత ప్రభుత్వం ఈ సెలవును అనుసరిస్తూనే వస్తోంది.

బరితెగించిన ఉద్యోగుల సలహాదారు. కోడ్‌ను విస్మరించి మరీ ఉద్యోగులపై ఒత్తిడి చంద్రశేఖర్‌రెడ్డి తీరుపై సర్వత్రా విమర్శలు

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సలహాదారు ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కారు. కోడ్‌ను ఉల్లంఘించి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగుల సంఘం నాయకుడిగా ఉన్న సమయంలోనే వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించిన ఆయన ఇప్పుడు పూర్తిగా ముసుగు తొలగించేశారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న విషయాన్ని ఉద్దేశ పూర్వకంగానే విస్మరించి..

వైసీపీకి ఓటు వేయాలంటూ ఉద్యోగులపై పరోక్షంగా ఒత్తిడి తేవడం ప్రారంభించారు. ప్రభుత్వ ఉద్యోగులందరూ జగన్‌ సర్కార్‌కు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. మే 13న జరిగే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఉద్యోగులంతా ఓటు వేసి, జగన్‌ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఇదే సమయంలో తాము అధికారంలోకి వచ్చాక తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటామంటున్న విపక్ష నేతలకు సైతం హెచ్చరికలు చేశారు.”ఉద్యోగులు ప్రభుత్వ ఆదేశాలను పాటించకుండా.. ప్రతిపక్షాల మాట వింటారా? రూల్స్‌ అనేవి ప్రభుత్వం పెడుతుందా? ప్రతిపక్షాలు రూపొందిస్తాయా?

ఉద్యోగుల జోలికి వస్తే.. సహించేది లేదు” అని తీవ్రంగా హెచ్చరించారు. మంగళవారం అమరావతి సచివాలయంలో తన చాంబర్‌లో మీడియా సమావేశం నిర్వహించి, ప్రతిపక్ష పార్టీల నేతలకు తీవ్ర హెచ్చరికలు చేయడం గమనార్హం. ఇదేసమయంలో కోడ్‌ను ఉల్లంఘించి ప్రభుత్వ కార్యాలయంలో కూర్చుని ఉద్యోగులు ప్రభుత్వానికి మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు.రాష్ట్రాన్ని బాగు చేయాలనే ఉద్దేశంతో ప్రస్తుత సీఎం వలంటీర్‌, గ్రామ సచివాలయ వ్యవస్థ తెచ్చారని తెలిపారు. దీనికి మంచి పేరు రావడంతో ప్రతిపక్ష పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయన్నారు. ప్రభుత్వాన్ని తప్పు పట్టడం ఫ్యాషన్‌ అయిపోయిందన్నారు. కాగా, చంద్రశేఖర్‌రెడ్డి వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సలహాదారుగా ఉన్న ఆయన వైసీపీ నాయకుడిగా మారి ఇలా ప్రచారం చేయడం ఏంటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

బూడిద గుమ్మడితో ఇన్ని లాభాలా? కానీ వీళ్లు మాత్రం జాగ్రత్త!

ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్నపేరు బూడిద గుమ్మడికాయ. వడియాలకోసమో, లేక గుమ్మానికి దిష్టికోసమో, స్వీట్‌కోసమే వినియోగించే గుమ్మడికాయ అనుకుంటే పొరబాటే.
శరీరంలోని వ్యర్ధాలను తొలగించేందుకు అద్భుతంగా పనిచేస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. పరగడుపున దీని జ్యూస్‌ తాగితే.. సర్వరోగ నివారిణిగా పనిచేస్తుందంటున్నారు ఆయుర్వేద నిపుణులు.

దీన్నే వింటర్‌మిలన్‌ అనీ, సంస్కృతంలో కుష్మాండ , బృహత్ఫల, ఘృణావాస, గ్రామ్యకర్కటి, కర్కారు అని కూడా అంటారు. ఇది ఆరిజన్‌ ఎక్కడ అనేదానిపై స్పష్టత లేనప్పటికీ జపాన్, ఇండోనేషియా, చైనా లేదా ఇండో-మలేషియాలో పుట్టిందని ఊహిస్తున్నారు.

అపారమైన ఔషధ గుణాలకు గుమ్మడికాయ ప్రసిద్ధి చెందింది. ఆయుర్వేద పానీయంగా భావించే గుమ్మడికాయ జ్యూస్‌తో ప్రస్తుతం, పొట్ట సమస్యలు, కాలేయ సమస్యలు , చర్మ సమస్యల చికిత్సలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఇది ఉదయం ఖాళీ కడుపుతో తాగితే మంచి ఫలితం ఉంటుంది. చాలా మందికి రుచి నచ్చకపోవచ్చు, కానీ సప్లిమెంట్లు ఇతర ఆహార పదార్థాలలో లేని ఔషధ విలువలు ఇందులో చాలా ఉన్నాయి.
గుమ్మడికాయ జ్యూస్‌ రూపంలో తీసుకుంటే అద్భుత ఔషధంగా పనిచేస్తుంది. చాలా సహజంగా శక్తినిచ్చే ఆహారాలలో ఒకటి ఇందులోని బయో యాక్టీవ్ న్యూట్రియంట్స్ దీర్ఘకాలిక వ్యాధుల నుండి కూడా ఉపశమనం ఇస్తుందని నమ్మకం.

బూడిద గుమ్మడికాయలో 96 శాతం నీరు ఉంటుంది. 4 శాతంలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, జింక్, కాల్షియమ్, ఐరన్, ఫాస్పరస్, మెగ్నీషియం, మాంగనీస్ , కాపర్, నియాసిన్, థయామిన్, రిబోఫ్లావిన్ విటమిన్ బి1, బి 2, బి3, బి5, బి6, విటమిన్ సీ ఉంటాయి.

బూడిద గుమ్మడికాయ ప్రోబయోటిక్ అంటే కడుపులో మంచి బ్యాక్టీరియాను ఉత్పత్తి చేస్తుంది.జీర్ణక్రియను సమర్ధవంతంగా నిర్వహిస్తుంది. యాంటాసిడ్‌గా పనిచేస్తుంది. అజీర్ణం, మలబద్ధకం, గ్యాస్ మొదలైన సమస్యలను తగ్గిస్తుంది శరీరంలో పేరుకుపోయిన విష వ్యర్ధాలను బయటికి పంపిస్తుంది. లివర్ పని తీరును మెరుగు పరుస్తుంది
బూడిద గుమ్మడికాయ రసంలో యాంజియోలైటిక్ లక్షణాలున్నాయి. ఇది నాడీ వ్యవస్థకుమంచిది. డిప్రెషన్‌, ఆందోళనతో బాధపడేవారికి చాలా మంచిది. మూర్ఛవ్యాధితో బాధపడేవారికి కూడా మేలు చేస్తుంది.

బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్‌ ఆప్షన్ బూడిద గుమ్మడికాయ జ్యూస్‌. కేలరీలు , కార్బోహైడ్రేట్లు తక్కువ, జీరో ఫాట్ లక్షణాలు పైగా ఫైబర్‌ ఎక్కువ. మధుమేహం ఉన్న వారికి మంచిది. ఉబకాయాన్ని నిరోధిస్తుంది కాబట్టి గుండె జబ్బుల రిస్క్ ను తగ్గిస్తుంది. గుండెకు మేలు చేస్తుంది.గుమ్మడికాయలో విటమిన్ B3 అధికం. శక్తినిస్తుంది. రక్తంలో గ్లూకోజ్‌లెవెల్స్ ను తగ్గించడంలో సహాయపడుతుంది.

చర్మ ఆరోగ్యానికి , సౌందర్యానికి మేలు చేస్తుంది. యాంటి ఏజింగ్‌గా పనిచేస్తుంది. ఫ్లవనాయిడ్స్ ఉన్నందున యాంటీ కేన్సర్‌గా పని చేస్తుంది. ఇది ఫ్రీ రాడికల్స్‌తో పోరాడే శక్తి పెంపొందిస్తుంది.

ఎవరు తాగకూడదు.
ఈ ప్రపంచంలో ప్రతిదానికీ లాభాలు, నష్టాలు రెండూ ఉంటాయి. దీర్ఘంకాలం తీసుకుంటే లోహ మూలకాలు పేరుకు పోతాయి. జ్వరంతో బాధపడుతున్నవారు, చలువ గుణం కలిగి ఉన్నందున జలుబుతో బాధపడుతున్న వారు తినకూడదు. బ్రోన్కైటిస్ ,ఆస్తమా పేషంట్లు దూరంగా ఉండాలి. మరీ ముఖ్యంగా గర్భిణి స్త్రీలు వైద్యుల సలహా మేరకే దీన్ని తీసుకోవాలి. మితంగా తీసుకున్నంతవరకే ఏ ఆహారమైనా ఔషధంగా పనిచేస్తుంది. ‘అతి సర్వత్రా వర్జయేత్‌’ దీన్ని మర్చిపోకూడదు.

ఎస్‌బీఐ కస్టమర్లకు షాక్‌.. ఏప్రిల్‌ 1 నుంచి..

దేశంలో అతిపెద్ద బ్యాంక్‌ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ డెబిట్ కార్డ్‌ల వార్షిక నిర్వహణ ఛార్జీలను పెంచేసింది. బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం ఎస్‌బీఐ డెబిట్ కార్డ్‌లపై వార్షిక నిర్వహణ ఛార్జీలను రూ.75 పెంచింది. దీనికి జీఎస్టీ అదనంగా ఉంటుంది. పెరిగిన చార్జీలు ఏప్రిల్ 1 నుండి అమలులోకి వస్తాయి.

ఎస్‌బీఐ తమ కస్టమర్లకు అనేక రకాల డెబిట్ కార్డ్‌లను అందిస్తుంది. వాటికి తదనుగుణంగా వార్షిక నిర్వహణ రుసుమును వసూలు చేస్తుంది. ఎస్‌బీఐ వెబ్‌సైట్ ప్రకారం, దాని క్లాసిక్, సిల్వర్, గ్లోబల్, కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డ్‌లకు వర్తించే ప్రస్తుత వార్షిక నిర్వహణ ఛార్జీలు రూ. 125 ప్లస్‌ జీఎస్టీ ఉండగా ఏప్రిల్‌ 1 నుండి రూ. 200 ప్లస్ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.

అదేవిధంగా యువ, గోల్డ్, కాంబో డెబిట్ కార్డ్‌ల నిర్వహణ రుసుములు రూ. 175 ప్లస్ జీఎస్టీ ఉండగా ఏప్రిల్ 1 తర్వాత రూ. 250 ప్లస్ జీఎస్టీ ఉంటుంది. ఇక ప్లాటినం డెబిట్ కార్డ్ వార్షిక నిర్వహణ రుసుము ఏప్రిల్ 1 తర్వాత రూ. 250 ప్లస్ జీఎస్టీ నుండి రూ. 325 ప్లస్‌ జీఎస్టీకి పెరుగుతుంది.

Viral ప్రేమించిన వ్యక్తి కోసం రూ.2484 కోట్ల ఆస్తిని వదిలేసుకున్న మహిళ

మనిషిని బంధించే భావాలలో ప్రేమ ఒకటి.. దీని ముందు ఏదీ ఎక్కువ కాదు అనిపిస్తుంది. ఎంతటి త్యాగం అయినా చిన్నగానే అనిపిస్తుంది. అయితే ఈరోజుల్లో అంత స్వచ్ఛమైన ప్రేమ ఎక్కడ ఉంది భయ్యా..
అందరూ ప్రేమించామని మాటలు చెప్పేవాళ్లే..నిజంగా ప్రేమించే వాళ్లను మనం ఎక్కడో అరుదుగా చూస్తుంటాం.. ప్రేమించిన వ్యక్తి కోసం.. కుటుంబాన్ని వదులుకోవడానికి చాలా మంది మహిళలు ధైర్యం చేయరు.. వారిని ఆ బంధం కట్టిపడేస్తుంది. కానీ ప్రేమించిన వ్యక్తి కోసం 2500 కోట్ల ఆస్తిని వదిలేసుకున్న మహిళ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..!

మలేషియాకు చెందిన కోటీశ్వర కుటుంబానికి చెందిన ఓ మహిళ తన ప్రేమకు కుటుంబం అంగీకరించకపోవడంతో కుటుంబ ఆస్తులను వదిలేసి వచ్చింది. ఏంజెలిన్ ఫ్రాన్సిస్ మలేషియా వ్యాపారవేత్త కూ కే పెంగ్, మాజీ మిస్ మలేషియా పౌలిన్ సాయ్ కుమార్తె. చాలా ధనిక కుటుంబానికి చెందిన ఆమె అయినప్పటికీ ఓ సాధారణ వ్యక్తితో ప్రేమలో పడింది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలో చదువుతున్నప్పుడు, ఏంజెలిన్ తన క్లాస్‌మేట్ అయిన జెడిడియాతో ప్రేమలో పడింది. ఏంజెలిన్ తన ప్రేమ గురించి తల్లిదండ్రులకు చెప్పగా, వారు అంగీకరించలేదు.
ఏంజెల్ తండ్రి డబ్బు, ఆస్తి, హోదా వంటి కారణాలతో ఏంజెల్ ప్రేమను అంగీకరించలేదు. ఫలితంగా, ఆమె తన కుటుంబాన్ని విడిచిపెట్టి, తన ప్రేమికుడిని వివాహం చేసుకోవడం ద్వారా కొత్త జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకుంది. కాబట్టి ఆమె తన ప్రేమికుడు జెడిడియా ఫ్రాన్సిస్‌ను వివాహం చేసుకోవడానికి వారసత్వంగా వచ్చిన $300 మిలియన్లను (దాదాపు రూ. 2,484 కోట్లు) తిరస్కరించింది.

ఏంజెలిన్, జెడిడియా 2008లో వివాహం చేసుకున్నారు. వారి కుటుంబాలకు దూరంగా నివసిస్తున్నారు. ఏంజెలిన్ మాదిరిగానే, జపాన్ యువరాణి మాకో కూడా 2021లో తన కళాశాల ప్రియుడు అయిన కీ కొమురోవాను వివాహం చేసుకోవడానికి తన రాయల్ బిరుదును వదులుకున్నారు. ప్రేమ కోసం ప్రజలు తమ జీవితంలో అత్యంత విలువైన వస్తువులను కూడా త్యాగం చేయగలరని ఇది చూపిస్తుంది. నిజమైన ప్రేమ అనేది భౌతిక ఆస్తులు లేదా ఆర్థిక స్థితి గురించి కాదు, ప్రేమ మరియు ఐక్యత వంటి ప్రాథమిక మానవ అవసరాలకు సంబంధించినది అని ఏంజెలిన్ కథ ద్వారా మరోసారి రుజువైంది.

Home loans: హోమ్ లోన్ ఉన్న వారికి గుడ్ న్యూస్.. ఈ చిట్కాతో వడ్డీ భారమే లేకుండా చేయొచ్చు..

సొoతిల్లు కట్టుకోవడం ప్రతి ఒక్కరి కల. దాన్ని సాకారం చేసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా హోమ్ లోన్లపై ఎక్కువగా ఆధారపడతారు. మీకు వచ్చే ఆదాయం ఆధారంగా వివిధ బ్యాంకులు మీకు రుణాలను మంజూరు చేస్తాయి.
వాటితో మీరు సొంతింటిని కోనుగోలు చేసుకోవచ్చు. ఆ రుణానికి కొంత వడ్డీ కలిపి ప్రతినెలా బ్యాంకు లేదా రుణం ఇచ్చిన సంస్థకు ఈఎమ్ఐలు చెల్లించాలి. ఇది దాదాపు 20 ఏళ్ల వరకూ మీ ఎంచుకున్న కాలాన్ని బట్టి ఉంటుంది. అంతకాలం పాటు ఈఎంఐలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే కొంత కాలం చెల్లించిన దానిని మధ్యలో భారాన్ని తగ్గించుకోవడానికి మరో హోమ్ లోన్ తీసుకుని ఇది క్లియర్ చేయొచ్చా? అంటే చేయచ్చని నిపుణులు చెబుతున్నారు. అదెలా అంటే ప్రస్తుతం ఉన్న బ్యాంకు అందిస్తున్న వడ్డీ కంటే తక్కువ వడ్డీకి ఏదైనా బ్యాంక్ రుణం ఇస్తుందేమో తెలుసుకొని దానికి మీ రుణమొత్తాన్ని బదిలీ చేసుకోవచ్చని సూచిస్తున్నారు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

ఈ ఉదాహరణ చూడండి..

మీ వార్షిక ఆదాయం రూ.22 లక్షలు అనుకుందాం. మీరు 2021లో రూ. 70 లక్షల హోమ్ లోన్ తీసుకున్నారు. దానికి 9 శాతం వడ్డీతో కలిసి నెలకు 55 వేలు ఈఎమ్ఐ కడుతున్నారు. మీ బాకీ తీరాలంటే దాదాపు 30 ఏళ్లు వాయిదాలు కట్టాలి. ఇక మీకు నెలకు రూ. 30 వేలు మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హోమ్ లోన్ వడ్డీరేటు, ఈఎమ్ఐ భారాన్ని తగ్గించుకోవడానికి, రుణదాతలను మార్చడానికి మీకు అవకాశం ఉంటుంది. అదెలా అంటే..

ముందుగా కొత్త రుణదాత వసూలు చేసే వడ్డీరేటు, మారడానికి విధించే అదనపు రుసుములు, మీ రుణం కాలవ్యవధి, మీ ఆర్థిక పరిస్థితి వంటి వాటిని పరిశీలించాలి.
పైనే తెలిపిన వివరాల ప్రకారం కొత్త రుణదాతకు మారడం వల్ల ప్రయోజనం కలుగుతుంది. రూ. 70 లక్షల రుణం, 30 ఏళ్ల కాలపరిమితిని పరిగణనలోకి తీసుకుంటే వాయిదాల మొత్తం ఈ విధంగా ఉంటుంది.
మీ సిబిల్ 800 నుంచి 850 మధ్య ఉంటే మీకు 8.4 శాతం వడ్డీరేటు పడుతుంది. తద్వారా నెలవారీ ఈఎమ్ఐ రూ. 52,005గా ఉంటుంది. పాత ఈఎమ్ ఐతో పోల్చితే మీకు నెలకు రూ.2,995 ఆదా అవుతుంది.
మీ సిబిల్ స్కోర్ 740 నుంచి 799 మధ్య ఉంటే మీ తీసుకున్న రుణానికి 8.75 శాతం వడ్డీ రేటు విధిస్తారు. మీ ఈఎమ్ ఐ నెలకు 53,745 పడుతుంది. అంటే మీకు నెలకు రూ. 1,255 ఆదా అవుతుంది.
మీ వార్షిక ఆదాయం రూ. 22 లక్షలు, నెలవారీ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి రూ. 30 వేలు కాబట్టి ఈఎమ్ఐ తక్కువగా ఉంటే మీ పొదుపు పెరుగుతుంది.
ముఖ్యంగా అదనపు ఖర్చులను పరిగణించాలి. ప్రస్తుత రుణదాతతో కూడా చర్చలు జరపాలి. రుణదాతను మార్చడం వల్ల కలిగే ప్రయోజనాన్ని కచ్చితంగా లెక్కవేయగలగాలి. దీర్ఘకాలిక ఉపయోగాలు, ఖర్చుల ఆధారంగా నిర్ణయం తీసుకోండి.

Motivation: పక్కవారిని నమ్మితే పనులు జరగవు, మిమ్మల్ని మీరే నమ్ముకోండి, ఈ పక్షి కథ అదే చెబుతోంది

Motivation: ఒక పక్షి పొలంలో గూడు కట్టుకుని పిల్లలతో హాయిగా నివసిస్తోంది. కొంతకాలానికి పంట కోతకు వచ్చింది. పక్షి, దాని పిల్లలు ఏ క్షణమైనా పొలం విడిచి వెళ్లేందుకు సిద్ధమవ్వాలి.
ఒకరోజు తల్లి పక్షి ఆహారం కోసం వెళ్ళింది. ఆ సమయంలో పిల్లలు మాత్రమే గూడులో ఉన్నాయి. వాటికి రైతు మాటలు వినిపించాయి. ‘రేపు నా స్నేహితుడుతో కలిసి వచ్చి కోతలు పూర్తి చేయాలి’ అని అన్నాడు. రైతు అన్న ఆ మాటలను పక్షి పిల్లలు తమ తల్లికి చెప్పాయి. ‘అమ్మా… ఈ రోజే మనమిక్కడ నుంచి వెళ్లిపోవాలి. రేపు ఉదయం రైతు తన స్నేహితుడుతో వచ్చి పంటలను కోసేస్తాడు’ అని చెప్పాయి.

దానికి తల్లి పక్షి ‘రేపు కోతలు జరగవు. భయపడకండి. రేపు మనం ఇక్కడ ఉండవచ్చు’ అని చెప్పింది. మరుసటి రోజు నిజంగానే కోతలు జరగలేదు. ఆరోజు రైతు మళ్లీ పొలానికి వచ్చాడు. తల్లి పక్షి ఆహారానికి వెళ్ళింది. అప్పుడు రైతు ‘స్నేహితులతో పని కావడం లేదు. ఈసారి బంధువులను ఎవరినైనా పిలిచి రేపు కోతలు పూర్తి చేస్తాను’ అని అన్నాడు. ఆ మాటలు విన్న పక్షిపిల్లలు తల్లి గూడుకు తిరిగి వచ్చాక చెప్పాయి. అప్పుడు కూడా తల్లి పక్షి ‘రేపు కూడా కోతలు జరగవు. నిశ్చింతగా ఉండండి’ అని అంది. నిజంగానే రైతు కోతలు మొదలుపెట్టలేదు. రైతు బంధువుల రాకపోవడంతో వాటిని ఆపేశాడు .

మరుసటి రోజు మళ్లీ తల్లి పక్షి ఆహారానికి వెళ్ళింది. రైతు పొలానికి వచ్చాడు. అతను చాలా అసహనంగా ఉన్నాడు. ‘స్నేహితులు రాలేదు, బంధువులు రాలేదు. వీళ్ళని నమ్ముకుంటే పనులు జరగవు. ఈసారి నేనే రేపు కోతలు కోసేస్తాను’ అని అన్నాడు. అదే విషయాన్ని పక్షి పిల్లలు తల్లికి చెప్పాయి. తల్లి ‘మనం ఇక్కడ నుంచి వెళ్లాల్సిన సమయం వచ్చింది. ఈరోజు రాత్రికి మనం కొత్త గూడు కట్టుకొని వెళ్ళిపోదాం’ అని అంది

పక్షపిల్లలు ‘అమ్మా… రైతు రెండు రోజులు నుంచి బంధువులను, స్నేహితులను తీసుకువచ్చి కోతలు కోయిస్తానని అంటున్నాడు. ఆ విషయం మేము మీకు చెప్పినా మీరు కంగారు పడలేదు. కానీ ఇప్పుడు తానే కోస్తానని సిద్ధమయ్యాడు. అది మాత్రం ఎలా నమ్మారు’ అని అడిగాయి.

తల్లి పక్షి ‘ఇంతవరకు రైతు ఇతరుల సహాయం మీద ఆధారపడ్డాడు. వారి వల్ల పనులు జరగవని అర్థమైంది. ఈసారి తనే కోతలు కోసేందుకు సిద్ధమయ్యాడు.కాబట్టి కచ్చితంగా పంటను కోసేస్తాడు. ఇతరుల మీద ఆధారపడిన వ్యక్తి ఏ పనిని పూర్తి చేయలేడు. తనని తాను నమ్ముకుంటేనే పనిని పూర్తి చేయగలడు. అలాగే విజయం అయినా ఇతరుల సహాయం మీద ఆధారపడితే దక్కదు. మన మీద మనకు నమ్మకం ఉండి ముందుకు సాగితేనే దక్కుతుంది. ఈ రైతు కూడా తనని తాను నమ్ముకుని పొలంలోకి దిగుతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా కోతలు కోస్తాడు. మీరు కూడా పెద్దయ్యాక మిమ్మల్ని మీరే నమ్ముకోండి. ఎదుటివారిని నమ్మి గుడ్డిగా నిర్ణయాలు తీసుకోకండి’ అని చెప్పింది తల్లి పక్షి

ఇది అందరికీ వర్తిస్తుంది. స్నేహితులను, బంధువులను నమ్మి ముందుకు సాగే బదులు మిమ్మల్ని మీరు నమ్ముకుని ముందుకు సాగండి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తట్టుకునే శక్తి మీకు వస్తుంది. ఇతరుల సాయంతో సాధించిన విజయం కంటే… మిమ్మల్ని మీరు నమ్ముకొని కష్టపడి సాధించిన విజయం తీయటి గుర్తుగా మిగిలిపోతుంది.

Health

సినిమా