New Rules: ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్.. తెలుసుకోకుంటే నష్టపోతారు?

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Facebook Link Click Link
Google News Click Link

ఏప్రిల్ 1, 2024 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం(new financial year) మొదలవబోతుంది. ఈ నేపథ్యంలో కొన్ని ఐటీ నిబంధనలు(it rules) కూడా మారిపోయాయి. కొత్త వ్యాపార సంవత్సరం 1 ఏప్రిల్ 2024 నుంచి అనేక ఆర్థిక నియమాలలో మార్పులు వచ్చాయి.
ఈ ఆర్థిక నియమాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇవి సామాన్య ప్రజలపై ప్రత్యక్షంగా ప్రభావం చూపనున్నాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫాస్టాగ్ KYC అప్‌డేట్

ఫాస్టాగ్‌కి సంబంధించిన నియమాలు ఏప్రిల్ 1, 2024 నుంచి మారుతున్నాయి. ఈ క్రమంలో మీరు మార్చి 31, 2024లోపు Fastag KYCని అప్‌డేట్ చేయకుంటే, మీరు వచ్చే నెల నుంచి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఎందుకంటే KYC లేకుంటే బ్యాంకులు ఫాస్టాగ్‌ని డీయాక్టివేట్ చేస్తున్నాయి. అంటే ఫాస్టాగ్‌లో బ్యాలెన్స్ ఉన్నా దాని ద్వారా చెల్లింపు జరగదు. NHAI ఫాస్టాగ్ KYC అప్‌డేట్ తప్పనిసరి చేసింది.

పాన్, ఆధార్ లింక్

మీరు ఇంకా ఆధార్ కార్డుతో పాన్ కార్డును(pan- aadhar) అనుసంధానం(link) చేయలేదా. అయితే వెంటనే చేసుకోండి. ఎందుకంటే పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి గడువు మార్చి 31, 2024 వరకు మాత్రమే ఉంది. ఒకవేళ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయకపోతే, పాన్ నంబర్ రద్దు చేయబడుతుంది. అంటే పాన్ డాక్యుమెంట్‌గా ఉపయోగించుకోవడానికి వీల్లేదు. ఏప్రిల్ 1 తర్వాత పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి, వినియోగదారులు రూ. 1,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

EPFO కొత్త రూల్

EPFO నిబంధనలు కూడా ఏప్రిల్ 1, 2024 నుంచి మారబోతున్నాయి. వాస్తవానికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కొత్త నిబంధన వచ్చే నెల నుంచి అమలు కాబోతుంది. ఈ నియమం ప్రకారం ఎంప్లాయ్ ఉద్యోగం మారిన తర్వాత PF ఖాతా ఆటో మోడ్‌లో బదిలీ చేయబడుతుంది. అంటే వినియోగదారుల ఖాతాను బదిలీ చేయడానికి అభ్యర్థన ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ నిబంధన అమలులోకి వచ్చిన తర్వాత వినియోగదారుల ఇబ్బందులు చాలా వరకు తగ్గనున్నాయి.
SBI క్రెడిట్ కార్డ్

SBI క్రెడిట్ కార్డ్ కలిగి ఉన్న వినియోగదారులకు ఏప్రిల్ 1, 2024 నుంచి కొత్త మార్పులు అమల్లోకి రానున్నాయి. మీరు SBI క్రెడిట్ కార్డ్ ద్వారా అద్దె చెల్లింపు చేస్తే, ఏప్రిల్ 1 నుంచి అద్దె చెల్లింపుపై మీకు ఎటువంటి రివార్డ్ పాయింట్లు ఉండవు. ఈ నియమం కొన్ని క్రెడిట్ కార్డ్‌లపై ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. మరికొన్నింటికి ఇది ఏప్రిల్ 15, 2024 నుంచి వర్తిస్తుంది.

LPG గ్యాస్ ధర

LPG సిలిండర్ గ్యాస్ ధరలు దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1, 2024న మారనున్నాయి. అయితే 2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వాటి ధరల్లో మార్పు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంది.

కొత్త పన్ను విధానం
మీరు పన్ను చెల్లింపుదారులై ఉండి ఇంకా పన్ను విధానాన్ని(new tax) ఎంచుకోకపోతే వెంటనే ఎంచుకోండి. ఎందుకంటే ఏప్రిల్ 1, 2024 నుంచి కొత్త పన్ను విధానం డిఫాల్ట్ పన్ను విధానంగా మారుతుంది. ఈ క్రమంలో కొత్త పన్ను విధానంలో నిబంధనల ప్రకారం పన్ను చెల్లింపుదారులు ఆటోమేటిక్‌గా పన్ను చెల్లించాల్సి వస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *