Sunday, November 17, 2024

Broccoli : బ్రోకలీ తినడం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..

పోషకాహార సూపర్‌స్టార్ అనగానే అందరికీ గుర్తు వచ్చేది బ్రోకలీ. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో కేలరీలు తక్కువ ఉంటాయి, అలాగే శరీరానికి అవసరమైన పోషకాలనిచ్చే, విటమిన్స్, యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి.
ఇక క్రూసిఫెరస్ జాతికి చెందిన క్యాలీఫ్లవర్, బస్సెల్స్, క్యాబెజీలో.. బ్రోకలీ ఒకటి. ఇది ఆరోగ్యాన్ని శక్తివంతగా ఉంచడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి, అలాగే క్యాన్సర్ కణాల పెరుగుదలను అణిచి వేయడానికి ఇది తోడ్పడుతుంది.
పోషకాహార సూపర్‌స్టార్ అనగానే అందరికీ గుర్తు వచ్చేది బ్రోకలీ. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో కేలరీలు తక్కువ ఉంటాయి, అలాగే శరీరానికి అవసరమైన పోషకాలనిచ్చే, విటమిన్స్, యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి.
ఇక క్రూసిఫెరస్ జాతికి చెందిన క్యాలీఫ్లవర్, బస్సెల్స్, క్యాబెజీలో.. బ్రోకలీ ఒకటి. ఇది ఆరోగ్యాన్ని శక్తివంతగా ఉంచడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి, అలాగే క్యాన్సర్ కణాల పెరుగుదలను అణిచి వేయడానికి ఇది తోడ్పడుతుంది.
అందువలన ఆరోగ్యానికి శక్తినిచ్చే దీన్ని మన ఆహారంలో చేర్చుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయటున్నారు వైద్యులు. సూప్ లేదా ఉడకబెట్టి, ప్రైగా దీన్ని మనం తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చునంట. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది

క్రూసిఫెరస్ కూరగాయలలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా బ్రోకలీలో సల్పోరాఫేస్ అనే బయోయాక్టివ్ సమ్మేళనం ఇందులో అధికంగా ఉంటుంది. అయితే సల్ఫోరాఫేన్ క్యాన్సర్ కణాల పెరుగుదలను అనిచివేయడంలో ఇది ముఖ్యపాత్ర పోషిస్తుందంట. అలాగే ఇందులో ఇండోల్-3-కార్బినోల్ యాంటీ ట్యూమర్‌గా పని చేస్తుంది.

ఎముకల పుష్టి

ఎముకలు బలంగా ఉండటానికి కాల్షియం ఉన్న ఆహారం తీసుకోవాలి అంటారు. అయితే బలమైన ఎముకలను తయారు చేయడంలో బ్రోకలీ కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో 99 శాతం కాల్షియం, అలాగే శరీరాని కావాల్సిన విటమిన్ సి, విటమిన్ కే అధికంగా ఉంటాయి.ఇవి , రక్తం గడ్డకట్టడం , ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిది.

యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ (USDA) ప్రకారం, 76 గ్రాముల ట్రస్టెడ్ సోర్స్ (g) బరువున్న ఒక కప్పు బ్రోకలీలో ఒక వ్యక్తి యొక్క రోజువారీ కాల్షియం అవసరంలో 3% నుండి 3.5% వరకు ఉంటుంది, 45-54% వారి రోజువారీ విటమిన్ అవసరం . వారి వయస్సు , లింగాన్ని బట్టి వారి రోజువారీ విటమిన్ K యొక్క 64-86% అవసరం.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

రోగనిరోధక శక్తిని పెంచడంలో బ్రోకలీ కీలక పాత్రపోషిస్తుంది. ఇందులో విటమిన్ సి, యాంటిఆక్సిడెట్స్ ఎక్కువగా ఉంటాయి.ఇవి కంటిశుక్లం, రక్తహీనత, సాధారణ వ్యాధులను జయించడానికి సహాయపడుతుంది.

చర్మ సంరక్షణ

బ్రోకలీని ఆహారంగా తీసుకోవడం వలన చర్మ సమస్యల నుంచి బయటపడవచ్చు. వృధ్యాప్యం కారణంగా వచ్చే మడతలు, స్కిన్ క్యాన్సర్‌ వంటి వాటి నుంచి బయటపడటానికి ఇది ఉపయోగపడుతుంది.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

మలబద్ధకం తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరచడంలో బ్రోకలీ కీలకంగా వ్యవహరిస్తుంది. జీర్ణవ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో పెద్దపేగు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.2015లో ఓ సర్వేలో పీచు పదార్థాలు తినే వారికంటే, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకునే వారిలో కొలొరెక్టల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని తేలింది.అయితే బ్రోకలీలో ఒక వ్యక్తికి రోజూ వారి అవసరం అయ్యే ఫైబర్ 5.4 నుంచి 7.1 వరకు ఉంటుంది.

మధుమేహం తగ్గుదల

బ్రోకలీని ఆహారంలో తీసుకోవడం ద్వారా టైప్ 2 డయాబెటీస్ నుంచి బయటపడవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను సరైన విధంగా ఉంచడంలో బ్రోకలీ కీలకంగా వ్యవహారిస్తుంది. ఇందులో ఉండే సల్పోరాఫేన్, ఫైబర్ కారణంగా దీన్ని తినే వారిలో టైప్ 2 డయాబెటీస్ వచ్చే అవకాశం తక్కువ అంటున్నారు వైద్యులు.

హృదయ సంబంధ వ్యాధుల నుంచి రక్షణ

బ్రోకలీలో ఉండే ఫైబర్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. క్రూసిఫరస్ కూరగాయలు తినడం వలన మహిళలకు,వృద్ధ మహిళలకు అథెరోస్క్లెరోసిస్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉందని ఇది నిరూపించింది. బ్రోకలీని ఆహారంగా తీసుకోవడం ద్వార రక్తపోటు తగ్గడమే కాకుండా హృదయ సంబంధ వ్యాధుల నుంచి కూడా కాపాడుతుంది.

Hallmark Gold: మీరు కొన్న గోల్డ్ పై హాల్ మార్క్ నిజమైనదేనా..? బీ కేర్ ఫుల్ అంటున్న పోలీసులు

భారతీయులు, బంగారానిది విడదీయలేని సంబంధం. అనాదిగా మన దేశంలో బంగారానికి గిరాకీ అధికమే. బంగారాన్ని సాక్షాత్తూ శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా కొలుస్తారు. కాబట్టి పండగలు, శుభకార్యాలు పెళ్లిళ్లు, పేరంటాలకు బంగారం కొనుగోలు చేయడంసర్వ సాధారణం బంగారం కొందరు అలంకరణకు మరి కొందరు వారి స్థాయిని ప్రదర్శించటం కోసం ధరిస్తారు.

ఎంతలేని వారైనా తులం బంగారమైన కొనుగోలు చేస్తుంటారు. రైతులు మధ్యతరగతి ప్రజలు బంగారాన్ని ధరించటానికి కాకుండా ఆర్ధిక భద్రత కొరకు కూడా కొంటూ ఉంటారు. ఏదయినా అవసరం వస్తే బంగారం కుదవ పెట్టుకొని వారి అవసరాలను తీర్చుకొంటారు. అందుకే రాజుల కాలం నుండి భారతీయులకి బంగారానికి విడదీయలేని అవినాభావ సంబంధముంది అంటారు

ఐతే ఇప్పుడు బంగారం ధర పెరగటం తో ఆభరణాల విక్రయ కర్తలు నాణ్యత లో తేడా చేస్తున్నారు. అందుకే భారత ప్రభుత్వం ఇప్పుడు బీఐఎస్ హాల్ మార్క్ పద్దతిని ప్రవేశపెట్టింది. హాల్ మార్క్ ఉన్న నగలు కొన్నట్లయితే వాటి నాణ్యతలో రాజీలేనట్లే. కానీ ఈ నకిలీల బెడద బంగారు హాల్ మార్క్ ను కూడా వదలలేదు. మనం కొన్న బంగారు ఆభరణాలు హాల్ మార్క్ కలిగినవి అని నిశ్చంతగా బీరువాలో పెట్టుకునే కాలం పోయింది.

కొంతమంది కిలాడీలు నాణ్యత లేని ఆభరణాలపై కూడా హాల్ మార్క్ వేసి కొనుగోలుదారులను మోసం చేస్తున్నారు. కొంతమంది కొనుగోలుదారుల ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకొని బీఐఎస్ అధికారులు గుంటూరులోని నకిలీ నగలపై హాల్ మార్కులు వేసేవారిని పట్టుకున్నారు. మంగళగిరికి చెందిన ముగ్గురు వ్యక్తులు గుంటూరుకు చెందిన వ్యక్తి కలసి హాల్ మార్క్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేసి బంగారు నగల తయారీదారులకు హాల్ మార్క్ వేస్తుంటారు.

ఈ హాల్ మార్క్ 916 ఉన్న బంగారు ఆభరణాలకు వేయాలి. కానీ ఈ కేటుగాళ్లు నకిలీ బంగారానికి కూడా హాల్ మార్క్ వేస్తున్నారు. ఐతే అధికారులు పక్కా సమాచారంతో ఈ హాల్ మార్క్ తనిఖీ కేంద్రంపై దాడి చేసి వారిని పోలీసులకు అప్పగించారు.

కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్లు కేటుగాళ్లు లోగోలను కూడా కాపీ కొట్టేస్తూ జనాన్ని బురిడీ కొట్టిస్తున్నారు. వేలాది రూపాయలు పొసి కొనుగోలు చేసే బంగారంపైనా దాగా చేస్తూ అడ్డంగా దొచేస్తున్నారు. ఇలాంటివారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Parenting Tips: 10 ఏళ్లలోపు పిల్లలకు తప్పక నేర్పించాల్సిన 5 విషయాలు.. లేదంటే..

పిల్లల అభివృద్ధి కోసం, తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే పిల్లలకు మంచి విషయాలు, కొన్ని మంచి అలవాట్లను నేర్పించాలి. అటువంటి పరిస్థితిలో 10 సంవత్సరాల వయస్సు వరకు నేర్పాల్సిన కొన్ని విషయాలు, అలవాట్లు ఉన్నాయి.

చిన్నతనంలో పిల్లలకు కొన్ని మంచి అలవాట్లను నేర్పిస్తే, భవిష్యత్తులో వారు మంచి వ్యక్తిగా ఎదగడానికి కూడా సహాయపడుతుంది. ఈరోజు ఈ ఆర్టికల్‌లో మీ పిల్లలకు చిన్నతనంలో నేర్పించాల్సిన కొన్ని విషయాల గురించి మేం మీకు చెప్పబోతున్నాం..

పిల్లల అభివృద్ధికి ఈ మంచి అలవాట్లు అవసరం..

ప్రతి ఒక్కరినీ గౌరవించడం పిల్లలకు నేర్పండి..

అందరినీ గౌరవించడం పిల్లలకు నేర్పాల్సిన మొదటి అలవాటు. ఈ అలవాటు వారు పెద్దయ్యాక కూడా వారి అభివృద్ధికి, వారిని మంచి వ్యక్తిగా మార్చడానికి సహాయపడుతుంది. పిల్లలు ప్రతి ఒక్కరినీ గౌరవిస్తే, ప్రజలు కూడా వారికి చాలా ప్రేమ, గౌరవం ఇస్తారు.

వ్యక్తిగత పరిశుభ్రత గురించి చెప్పాలి..

వ్యక్తిగత పరిశుభ్రత గురించి పిల్లలకు నేర్పించడం కూడా చాలా ముఖ్యం. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే, చేతులు కడుక్కోవడం, రోజూ స్నానం చేయడం వంటి ప్రాథమిక పరిశుభ్రత గురించి వారికి సమాచారం ఇవ్వాలి.

మంచి ప్రభావాల గురించి పిల్లలకు నేర్పండి..

పిల్లల అభివృద్ధికి పునాది బాల్యంలోనే వేయాలి. అలాగే వారి అభివృద్ధిలో స్నేహితులు పెద్ద పాత్ర పోషిస్తారు. ఇటువంటి పరిస్థితిలో పిల్లలు ఎల్లప్పుడూ మంచి పిల్లలతో స్నేహంగా ఉండాలని పిల్లలకు చెప్పాలి. ఎందుకంటే మంచి, నిజమైన స్నేహితుడు మిమ్మల్ని ఎల్లప్పుడూ పురోగతి మార్గంలో తీసుకువెళతాడు.

పిల్లలకు ప్రేమతో ప్రతిదీ వివరించాలి..

చాలా సార్లు తల్లిదండ్రులు పిల్లలను ఏదైనా విషయంలో కోప్పడుతుంటారు. కానీ, అలా చేయడం వల్ల వారి మనస్సుపై తప్పు ప్రభావాన్ని చూపుతుంది. ఇటువంటి పరిస్థితిలో వారికి ప్రేమతో ప్రతిదీ వివరించడానికి ప్రయత్నించండి.

యుద్ధం మొదలైందా..?జగన్ కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు రేవంత్ రె ‘ఢీ’

ఆంధ్రప్రదేశ్ లో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల సమరం మొదలవబోతుంది. ఈ సారి ఎట్టి పరిస్థితుల్లో గెలిచి అధికారం చేపట్టి తీరాలని టీడీపీ-జనసేన కూటమి అన్ని ప్రయత్నాలు చేస్తుండగా..టార్గెట్ 175 అంటూ వైసీపీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తుంది.
అయితే ఒకప్పుడు టీడీపీ స్కూల్ లోనే రాజకీయ పాఠాలు నేర్చిన ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..తన మాజీ బాస్ చంద్రబాబుకి పరోక్షంగా సహకరించేందుకు రెడీ అవుతున్నట్లు ప్రస్తుత పరిణామాలు కనబడుతున్నాయి. దీనికి కారణం తాజాగా సీఎం రేవంత్ రెడ్డి నీటి జలాల వివాదంలో సీఎం జగన్ ను డైరెక్ట్ గా ఎటాక్ చేయడమే.

రేవంత్ రెడ్డి సీఎం అయి దాదాపు 2 నెలలు కావొస్తుంది. అయితే ఏపీ సీఎం జగన్ కనీసం తనకు ఫోన్ చేసి అభినందనలు తెలపలేదని రేవంత్ రెడ్డి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పడం బట్టి చూస్తే..రేవంత్ రెడ్డి ఇంకా చంద్రబాబు మనిషే అని జగన్ భావిస్తున్నాడని..అందుకే రేవంత్ రెడ్డికి ఆయన దూరంగా ఉంటున్నట్లు అర్థమవుతోంది. అయితే సీఎం అయినప్పటి నుంచి ఇప్పటివరకు నేరుగా జగన్ పేరు ప్రస్తావించి కామెంట్ చేయని రేవంత్ రెడ్డి..మరికొద్ది రోజుల్లో ఏపీ ఎన్నికలు జరుగున్న ఈ సమయంలో జగన్ పై డైరెక్ట్ అటాక్ మొదలుపెట్టారు. అది కూడా ఘాటు వ్యాఖ్యలే చేశారు. గతేడాది డిసెంబర్ లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు ఒకరోజు ముందు తెలంగాణ భూభాగంలో ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టును ఏపీ పోలీసుల సాయంతో జగన్ ఆక్రమించుకోవాలనుకుంటే కేసీఆర్ మారు మాట్లాడలేదని విమర్శించారు. దమ్ముంటే ఇప్పుడు రావాలని జగన్ కు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.

గతంలో వైఎస్ఆర్ తెలంగాణకు అన్యాయం చేశారని, పోతిరెడ్డిపాడు నుంచి నీటిని ఆంధ్రాకు నీటిని తరలించుకుపోయారని,ఆయన తనయుడు జగన్… తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికి వచ్చి పంచభక్ష పరమాన్నాలు తిన్నారని, కృష్ణా నీటిపై దాదాపు 6 గంటల పాటు చర్చించి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 8 టీఎంసీల నీటిని తరలించేందుకు అనుమతి తీసుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యల వెనుక రెండు వ్యూహాలు ఉన్నట్లు కనబడుతోంది. మొదటిది.. జగన్ తో కుమ్మక్కై తెలంగాణ నీటి జలాల విషయంలో కేసీఆర్ అన్యాయం చేశారని ప్రజల్లోకి తీసుకెళ్లి తద్వారా మరికొద్ది రోజుల్లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో లాభపడటం..మరొకటి 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ-కాంగ్రెస్ కూటమి ఓడిపోవడం..టీఆర్ఎస్(ప్రస్తుత బీఆర్ఎస్)అధికారంలోకి రావడం కోసం జగన్ ప్రయత్నించాడన్న ఆరోపణలున్న నేపథ్యంలోె అప్పుడు తమ ఓటమికి కారణమైన జగన్ కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం రేవంత్ రెడ్డి ఆలోచనలాగా కనబడుతున్నది. అందులో భాగంగానే జగన్ పై డైరెక్ట్ ఎటాక్ మొదలుపెట్టి ఏపీ-తెలంగాణ మధ్య స్నేహాకపూర్వక వాతావరణం ఉండాలంటే చంద్రబాబు సీఎం అయితేనే సాధ్యం అనే రీతిలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నట్లు కనబడుతోంది. జగన్ మళ్లీ ఏపీలో గెలిచి సీఎం అయితే తెలంగాణ-ఆంధ్ర మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంటుందనే ఆలోచనను ప్రజల ముందుంచే వ్యూహంగా రేవంత్ రెడ్డి తాజాగా జగన్ పై ఎటాక్ చేయడం తెలియజేస్తుంది. ఏది ఏమైనప్పటికీ రేవంత్ రెడ్డి దూకుడు ఏపీ రాజకీయాల్లో చంద్రబాబుకి కలిసి వస్తుందా?లేదా అన్న విషయం మరికొద్ది రోజుల్లో తేలిపోతుంది.

ఇక,ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీకి దూరంగా ఉండి.. కాంగ్రెస్ కు అనధికారిక మద్దతు ఇఛ్చిన విషయం అందరికి తెలిసిందే. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. అయితే టీడీపీ మద్దతుదారులు ఎక్కువగా ఉండే హైదరాబాద్ ప్రాంతంలో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. అయినప్పనటికి టీడీపీ మద్దతు తమకు కలిసివచ్చిందని..తమ విజయంలో టీడీపీ పాత్ర మరువలేనిదని కాంగ్రెస్ మంత్రులు,నేతలు బహిరంగంగానే అంటున్నారు. దీంతో గత ఎన్నికల్లో తమకు అండగా ఉన్న టీడీపీ రుణం తీర్చుకోవాలని రేవంత్ రెడ్డి మనసులో ఉన్నట్లు తాజాగా జగన్ పై ఎటాక్ వ్యాఖ్యలు తెలియజేస్తున్నాయి. రేవంత్ రెడ్డి తీర్చుకుంటారని..జగన్ పై బాణం ఎక్కుపెట్టి తమకు మేలు చేస్తాడని టీడీపీ శ్రేణులు గట్టిగా నమ్ముతున్నారు.

Hair Cut : హెయిర్ కటింగ్ ఎప్పుడంటే అప్పుడు కాదు.. వారంలో ఈ రోజుల్లోనే చేయించుకోవాలి..

Hair Cut : మనం నిత్య జీవితంలో చేసే ప్రతి పనికి మన పెద్దలు ఒక విధివిధానాన్ని నిర్దేశించారు. అలాగే క్షవరం కూడా కొన్ని నిర్దేశించిన రోజుల్లో మాత్రమే చేయించుకోవాలి.

మన శరీరంలో బయో ఎలక్ట్రిసిటీ అన్ని అవయవాలకు నిరంతరాయంగా ప్రవహిస్తూ ఉంటుంది. అదే విధంగా మన జుట్టులో కూడా విద్యుత్ ఉంటుంది. ఎప్పుడైతే జుట్టును మనశరీరం నుండి వేరు చేస్తామో ఆ సమయంలో మన శరీరం కొంతమేర ప్రాణశక్తిని కోల్పోతుందట. అందుకే పూర్వం మునులు, ఋషులు, యోగులు జుట్టున కత్తిరించుకునే వారు కాదట. 

కానీ ప్రస్తుత కాలంలో మనం జుట్టును అలానే ఉంచుకోలేము కనుక మనలోని ప్రాణ శక్తిని చెడు రోజుల్లో బయటకు పంపించకూడదు. కనుక క్షుర కర్మను నిర్దేశించిన రోజుల్లో మాత్రమే చేయించుకోవాలి. క్షవరాన్ని వారంలో సోమ, బుధ, గురు వారాల్లో మాత్రమే చేయించుకోవాలి. మంగళ, శుక్ర, శని వారాల్లో క్షవరాన్ని చేయించకూడదు. ఆదివారం క్షవరాన్ని చేయించుకోవచ్చు కానీ ఆ రోజున చేయించుకుంటే స్వల్ప ఆయుక్షీణం అవుతుందట.

Hair Cut

అలాగే గ్రహణం పట్టిన రోజుల్లో, అమావాస్య, పౌర్ణమి రోజుల్లో, ఏకాదశి, ద్వాదశి, చవితి, అష్టమి, నవమి తిథుల్లోనూ క్షవరం చేయించుకోకూడదు. క్షవరం ఎప్పుడూ ఉదయం భోజనానికి ముందే చేయించుకోవాలి. మిట్ట మధ్యాహ్నం, రాత్రి వేళల్లో చేయించుకోకూడదు. పుణ్య క్షేత్రాల్లో గుండు చేయించుకునే వారికి, రోజూ గడ్డం చేసుకుని ఉద్యోగాలకు వెళ్లే వారికి శాస్త్రాల్లో మినహాయింపు ఉంటుంది. అదే విధంగా ఈ నియమాలు గోర్లు తీసుకోవడానికి కూడా వర్తిస్తాయి.

Telangana Geyam : అందెశ్రీ పాట కేసీఆర్ కు ఎదురుదెబ్బెనా?

Telangana Geyam : జయ జయహే తెలంగాణ.. జనని జయకేతనం.. ముక్కోటి గొంతుకలు ఒక్కటైన జనచేతనం.. తెలంగాణ ఉద్యమ సమయంలో అందరిని ఏకం చేసిన పాట ఇది. జనాలలో తెలంగాణ ఉద్యమకాంక్షను జ్వలింప చేసిన పాట ఇది.
అంతటి ఉద్యమ సమయంలో తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ పాటను వినిపించేవారు. ఉద్యమం జరుగుతున్నప్పుడు పలు వేదికలలో కేసీఆర్ ఈ పాటను ఆలపించేవారు. కానీ తర్వాత ఏం జరిగిందో తెలియదు.. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఈ గేయం రాష్ట్ర గేయం అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ అలాంటిది జరగలేదు. పైగా రాష్ట్రానికి ఒక గేయం అంటూ ఏదీ లేదని 2021 సంవత్సరం నిండు అసెంబ్లీలో అప్పటి మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అడిగిన ప్రశ్నకు కేసిఆర్ ఒక సమాధానంగా చెప్పారు.

ఎప్పుడైతే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి ఒక గేయం అంటూ లేదని చెప్పారో.. అప్పుడే రేవంత్ రెడ్డి స్పందించారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రానికి గేయం అంటూ లేకపోవడం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ అమరవీరులకు పూర్తిగా న్యాయం చేయలేదని, తెలంగాణ అమరవీరుల లెక్క ప్రభుత్వం వద్ద లేదని, కనీసం తెలంగాణ రాష్ట్రానికి ఒక అధికారిక గేయమంటూ కూడా లేదని ఆయన అప్పట్లో ప్రశ్నించారు. ఇదే విషయాలను ప్రస్తావిస్తూ పలు సందర్భాలలో వివిధ వేదికల వద్ద ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి నిలదీశారు.. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన సమాధానం రాలేదు. దీంతో అప్పటి అధికార భారత రాష్ట్ర సమితి డిఫెన్స్ లో పడిపోయింది. ఇదే కాకుండా తెలంగాణ ఉద్యమ సమయంలో అందెశ్రీని పలు సందర్భాల్లో పొగిడిన కేసీఆర్.. ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు పట్టించుకోలేదు. ఒకానొక దశలో తెలంగాణ సాహిత్య అకాడమీకి అందెశ్రీని అధ్యక్షుడిని చేస్తారని వ్యాఖ్యలు వినిపించాయి. కానీ అలాంటివి జరగకపోగా.. 10 సంవత్సరాలుగా కెసిఆర్ ఆయనను పట్టించుకోలేదు. పైగా తనకు భజన చేసే వారికి మాత్రమే పదవులు ఇచ్చారనే అపవాదు కూడా కెసిఆర్ మూట కట్టుకున్నారు. ఇలా 10 సంవత్సరాలు గడిచిన తర్వాత ఎన్నికలు రానే వచ్చాయి. ఎన్నికల సమయంలో తెలంగాణకు రాష్ట్ర గేయాన్ని ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.
ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి అందెశ్రీతో ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా అందెశ్రీ తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవం ఉద్దేశాన్ని రేవంత్ ముందు ఉంచారు. అంతేకాదు పాలకుడికి ఎటువంటి సోయి ఉండాలి? కళాకారులపై ఎలాంటి గౌరవం ఉండాలి? కళాకారులను గుర్తించకపోతే వచ్చే నష్టమేంటి? వ్యక్తిగత ప్రతిష్టకు పోతే జరిగే పరిణామాలు ఏంటి? ఇలా అన్ని విషయాలపై రేవంత్ రెడ్డితో అందెశ్రీ మాట్లాడారు. అందె శ్రీ మాటలు రేవంత్ రెడ్డిని కదిలించినట్లు ఉన్నాయి. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం విజయం సాధించింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరగానే ఎన్నికల సమయంలో ఇచ్చిన నిర్ణయాన్ని ఆదివారం రాష్ట్ర క్యాబినెట్లో చర్చించి అమల్లో పెట్టారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రానికి అధికారిక గేయాన్ని అమల్లోకి తెచ్చారు. అందెశ్రీకి ఇచ్చిన మాట నిలుపుకున్నారు. కెసిఆర్ చేసిన తప్పును రేవంత్ గుర్తుచేసి మరీ సరిదిద్దారు.. ఒక రకంగా కేసీఆర్ ను రేవంత్ తెలంగాణ సెంటిమెంటుతో కొట్టారు. సెంటిమెంట్ కాపీరైట్ భారత రాష్ట్ర సమితికి మాత్రమే సొంతం కాదని నిరూపించారు. మరి ఈ పరిణామాలతో భారత రాష్ట్ర సమితి ఎలాంటి కౌంటర్ ఇస్తుందో వేచి చూడాలి.

సంఖ్యాశాస్త్రం: మీ ఫోన్ నెంబర్లో ఈ నంబర్స్ ఉన్నాయా.. ఏ స్థానంలో ఉంటే ఏం జరుగుతుందో తెలుసా..

మొబైల్​ నంబర్లలో పిల్లర్​ నంబర్స్​ ఏమిటంటే 1,4,5,6,9 ఇవి చాలా ముఖ్యమైన నంబర్లు .. ప్రతి మొబైల్​ నంబర్లలో ఈ ఐదు నంబర్లు ఉండాలి. మొబైల్​ నంబర్లలో ఈ ఐదు పిల్లర్లు ఉండాలి.

అసలు ఈ నంబర్లు ఎందుకు ఉండాలో తెలుసుకుందాం.

1 నంబర్​ మొబైల్​ నంబర్లలో ఉంటే .. వృత్తి. వ్యాపారాలతో పాటు భార్య భర్తల అన్యోన్య సంబంధమైన విషయాల్లో చాలా అద్భుతంగా రాణించగలుగుతారు. ఈ నంబర్​ లీడర్​ షిప్​ క్వాలిటీస్​ సూచిస్తుంది. మీ మొబైల్​ నంబరులో 1 ఉంటే ఏ రంగంలో ఉన్నా.. నంబర్​ 1 పొజిషన్​ కు వెళతారు. మీ దగ్గర ఎంత శక్తి సామర్ద్యాలు ఉన్నా.. మీ మొబైల్​ నంబర్​ లో 1 లేకపోతే అత్యున్నత స్థాయికి చేరుకొనే అవకాశం లేదని సంఖ్యా శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.కాని ఈ నెంబరు ఎండింగ్​ లో ఉండకూడదని పండితులు సూచిస్తున్నారు.

4వ నంబర్​ : సంఖ్యా శాస్త్ర నిపుణుల ప్రకారం …ఈ నెంబర్​ రాహువును ఇండికేట్​ చేస్తుంది. ఇది మనీకి సంబంధించిన సంఖ్య.. మీ మొబైల్​ నంబర్లలో 4 వ నెంబర్​ ఉంటే వృత్తి వ్యాపారాల్లో డబ్బులను ఆకర్షిస్తుంది. మీ మొబైల్​ నంబర్లలో 4 వ నంబర్​ లేకపోతే మీకు డబ్బు వచ్చినా ఉండదంటున్నారు పండితులు. మీ బ్యాంక్​ అక్కౌంట్​ నంబర్లలో 4 వ నెంబర్ ఉన్నదో లేదో ఒకసారి చెక్​ చేసుకోండి… అలాగే మీ బ్యాంక్​ ఖాతాలకు లింక్​ అయిన ఫోన్​ నంబర్లలో 4 నెంబర్​ ఉండేలా చూసుకోమని పండితులు సూచిస్తున్నారు. ఇది కూడా ఎండింగ్​ లో అంటే 10 వ నంబర్​గా ఉండకూడదట..

5 వ నెంబర్​.. ఇది బుధ గ్రహానికి సంబంధించిన నంబర్​… ఈ నంబర్​ కమ్యూనినేషన్​ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. మీ మొబైల్​ నంబర్లలో 5 ఉన్నట్లయితే మీరు ఎక్కడ ఉన్నా.. కుటుంబంలో, వృత్తిలో, వ్యాపారంలో, ఉద్యోగంలో , సమాజంలో, రాజకీయంలోగాని … ఏరంగంలోనైనా రాణించాలంటే కమ్యూనికేషన్​ చాలా అవసరం. కమ్యూనికేషన్​ లోపిస్తే ఏ ప్రాజెక్ట్​ కూడా చేపట్టలేరు. మీరు చేయాలనుకున్నది ఇతరులకు చెప్పలేరు. మీ మొబైల్​ నంబర్లలో 5 వ నెంబర్​ లేకపోతే.. మీరు చెప్పేది ఇతరులు పట్టించుకోరు. భార్య భర్తల మధ్య కమ్యూనికేషన్​ లోపిస్తుందని అంటున్నారు సంఖ్యాశాస్త్ర నిపుణులు.

6 వ నెంబర్​.. ఇది యోగాన్ని సూచిస్తుంది. ఇది విలాసాలను సూచిస్తుంది. డబ్బు ఉన్నా…. అధికారం ఉన్నా.. కొంతమంది ఎప్పుడు జీవితంలో ఏదో పోగొట్టుకున్నవారి వలె జీవిస్తారు. మీ మొబైల్​ నంబర్లలో 6 అనే అంకె లేకపోతే ఇలాంటి నిస్సత్తువైన జీవితాన్ని గడపాల్సి వస్తుంది. . మొబైల్​ నంబర్లలో 6 సంఖ్య ఉంటే.. సంఖ్యా శాస్త్రం ప్రకారం లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తారు. మీ మొబైల్​ నంబర్లలో 6 లేకపోతే మీరు ఎంత కష్టపడ్డా… లగ్జరీని అనుభవించే అవకాశం ఉండదని పండితులు చెబుతున్నారు.

9 వ నెంబర్​ : ఇది ఆస్తులకు, ధైర్యానికి సంబంధించి నంబర్… మీరు ఏరంగంలో కూడా ధైర్యం లేకపోతే రాణించలేదు.. అందుకే ధైర్యే సాహసే లక్ష్మీ అన్నారు.. అందుకే మీ మొబైల్​ నంబర్లలో 9 నంబర్​ ఉండేలా చూసుకోండి. 9 వ నెంబర్​ పోరాట పటిమను సూచిస్తుంది.

ఎండింగ్​ లో 10 వ నంబర్​ స్థానంలో ఏ నంబర్లు ఉండకూడదంటే….

మొబైల్​ నంబర్​ ఎండింగ్​ లో మాత్రం 0,4,7,8,1,2,3 ఈ నెంబర్లు ఉండకూడదని సంఖ్యశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
0 ఉంటే మీరు ఎంత కష్టపడినా జీరో పొజిషన్​ కే వస్తారుమొబైల్​ నంబర్​ ఎండింగ్​ లో 4 ఉంటే చాలా డేంజరస్​ … ఎంత డబ్బు సంపాదించినా.. ఆర్ధికంగా ఇబ్బందులు పడతారని సంఖ్యాశాస్త్రనిపుణులు చెబుతున్నారు. వీరికి ఎలాంటి ఆలోచన రాదు.. ఎవరైనా చెప్పినా వినరని పండితులు చెబుతున్నారు. వీరికి సమాజంలో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అందువలన ఫోన్​ నెంబర్లలో 4 సంఖ్య 10 వ స్థానంలో ఉండకుండా చూసుకోండి.
ఫోన్​ నెంబర్లలో 10 వ అంకెగా 7 ఉంటే భార్యభర్తల మధ్య గొడవలు, ఆర్ధిక ఇబ్బందులు వస్తాయని సంఖ్యశాస్త్రం చెబుతోంది.
పోన్​ నెంబర్​ ఎండింగ్​ 8 నెంబర్​ ఉంటే కోర్టు వివాదాలు… అనుకున్న పనులు నిదానంగా జరగడం.. లాంటివి జరుగుతాయి.
ఫోన్​ నెంబరు ఎండింగ్​ లో1,2,3 లాంటి లో ఫ్రీక్వెన్సీ నంబర్లు ఉండకూడదు. ఎప్పుడూ రైజింగ్​ నంబర్లు ఉండాలి.
5, 6,9 ఈ నెంబర్లు మాత్రమే ఎండింగ్​లో అనగా 10 వ నెంబర్​ స్థానంలో ఉండే విధంగా చూసుకోవాలని సంఖ్యా శాస్త్రనిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా.. మీపుట్టిన తేది.. మీ వృత్తి ని ఆధారంగా చేసుకొని సంఖ్యా శాస్త్ర నిపుణుల సూచనల మేరకు ఫోన్​ నంబర్​ తీసుకొంటే చాలా అద్భుతాలు కలిసి వస్తాయని సంఖ్యశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

`అంబాజీపేట మ్యారేజి బ్యాండు` కలెక్షన్లు.. రెండు రోజుల్లో ఎంత వచ్చాయంటే?

కంటెంట్‌ బాగుంటే కాస్టింగ్‌తో సంబంధం లేకుండా సినిమాలను ఆదరిస్తున్నారు తెలుగు ఆడియెన్స్. అందుకు నిదర్శమనే మొన్న వచ్చిన `హనుమాన్‌`. అంతకు ముందు వచ్చిన `బేబీ`.
ఇప్పుడు అలాంటిదే `అంబాజీపేట మ్యారేజి బ్యాండు`. సుహాస్‌ హీరోగా నటించిన మూవీ ఇది. దుశ్యంత్‌ దర్శకత్వం వహించారు. తెలుగమ్మాయి శివానీ నాగారం హీరోయిన్‌గా నటించింది. `పుష్ప` జగదీష్‌, శరణ్‌ ప్రదీప్‌ కీలక పాత్రలు పోషించారు. శుక్రవారం విడుదలైన ఈ మూవీకి విశేష స్పందన లభించింది. ముందుగా ప్రదర్శించిన ప్రీమియర్స్ తోనే సత్తా చాటింది.

ఇప్పుడు ఈ మూవీ మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది. మొదటి రోజు రెండున్నర కోట్ల గ్రాస్‌ సాధించింది. రెండో రోజు కాస్త పెరిగాయి. రెండు రోజుల్లో ఈ మూవీ రూ.5.16కోట్ల గ్రాస్‌ కలెక్ట్ చేయడం విశేషం. సాధారణంగా రెండో రోజు కలెక్షన్లు తగ్గుతాయి. కానీ పెరగడం విశేషం. అది సినిమా జనాల్లోకి వెళ్తుందనే సందేశాన్ని ఇస్తుంది. ఈ మూవీకి కూడా పాజిటివ్ టాక్‌ అనేది ఆడియెన్స్ లోకి వెళ్తుందని అర్థమవుతుంది. దీంతో మూడో రోజు(ఆదివారం) ఈ మూవీకి మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఆదివారం రోజు చాలా చోట్ల హౌజ్‌ ఫుల్‌ బోర్డులు పడుతున్నాయని చిత్ర బృందం తెలిపింది. సినిమా మున్ముందు పెద్దరేంజ్‌కి వెళ్లబోతుందని చెప్పొచ్చు.

సినిమా కథ విషయానికి వస్తే.. అంబాజీపేట విలేజ్‌లో సుహాస్‌, శరణ్య కవలలు. సుహాస్‌ మ్యారేజీ బ్యాండ్‌ వాయిస్తుంటాడు. శరణ్య స్కూల్‌ టీచర్‌గా చేస్తున్నారు. ఊర్లో పెద్దింటికి చెందిన నితిన్‌ ఫ్యామిలీ వీరిని తక్కువగా చూస్తుంటారు. అవమానిస్తుంటారు. దీంతో ఇద్దరి మధ్య గొడవలవుతుంటాయి. అది పోలీస్‌ స్టేషన్‌ వరకు వెళ్తుంది. దీంతో శరణ్యని బట్టలూడదీసి అవమానిస్తాడు విలన్‌. దీంతో సుహాస్‌ విలన్‌ పైకి వెళ్తారు. వాళ్ల మనసులంతా కలిసి సుహాస్‌ని కొట్టి గుండు గీయిస్తాడు. దీంతో వీరి ఫ్యామిలీ న్యాయం కోసం విలన్‌ ఇంటిముందు ధర్నాకి దిగుతారు. మరోవైపు సుహాస్‌.. ఆ విలన్‌ చెల్లిని ప్రేమిస్తాడు. ఆ విషయం అతనికి తెలుస్తుంది. వీరి ప్రేమని ఎలా బ్రేక్‌ చేశాడు, సుహాస్‌, శరణ్‌ లకు న్యాయం జరిగిందా ? చివరికి ఎలాంటి ముగింపు చోటు చేసుకుంది అనేది మిగిలిన కథ.
ఇందులో సుహాస్‌ చాలా నేచురల్‌గా చేశాడు. మరోవైపు శరణ్య చాలా బాగా చేసింది. ఆమె పాత్రకి మంచి పేరు వస్తుంది. సినిమాలో హైలైట్‌గా నిలిచింది. కొత్త అమ్మాయి అయిన శివానీ చాలా బాగా నటించింది. విలేజ్‌ గర్ల్ గా బాగా సూట్‌ అయ్యింది. మలయాళ నటుడు నితిన్‌ అదరగొట్టాడు. ఆర్టిస్టులు సినిమాకి పెద్ద ప్లస్‌. మ్యూజిక్‌ కొత్తగా ఉంది. ఈ మూవీని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించారు.

చంద్రబాబు హెలిప్యాడ్ వద్ద మోగిన బాంబు బజర్..తవ్వి చూస్తే తేలింది ఇదే

ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు రా.. కదలి రా పేరుతో ఎద్దుఎత్తున బహిరంగ సభలు నిర్వహిస్తూ.. అధికార వైసీపీపై విమర్శనాస్త్రాలు సందిస్తున్నారు.
ఈ సభల్లో సీఎం జగన్ అవినీతిని ప్రజాముఖంగా ఎండగడుతున్నారు. ఈ నేపధ్యంలోనే ఏలూరు జిల్లా చింతలపూడిలో ఏర్పాటు చేసిన రా.. కదలిరా సభకు చంద్రబాబు హాజరుకానున్నారు.

ఈ సభ ప్రాంగణంలో తనిఖీలు చేస్తుండగా.. చంద్రబాబు దిగేందుకు ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద బాంబ్ బజర్ మోగడం కలకలం రేపింది. దీంతో అప్రమత్తమైన బాంబ్ స్క్వాడ్ టీం విస్తృత తనీఖీలు చేశారు. బజర్ మోగిన తవ్వి చూడగా అందులో నుండి ఒక రాడ్ బయటపడింది. ఎటువంటి ప్రాణాపాయం లేదని తెలియడంతో ఇక్కసారిగా అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా చంద్రబాబు చేపడుతున్న రా.. కదలి రా సభలకు అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వస్తుండటంతో అధికారులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు.

Business Idea: అదిరిపోయే బిజినెస్.. వీటిని అమ్మి నెలకు రూ. 5 లక్షలు సంపాదించవచ్చు..

బిజినెస్ చెయ్యాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది.. అయితే సరైన బిజినెస్ ను ఎంపిక చేసుకుంటే మంచి లాభాలను పొందవచ్చు.. ఈరోజుల్లో ఎక్కువగా పాపు్లారిటీ సంపాదించుకున్న ఫుడ్ అంటే పానీపూరి..
సాయంత్రం 4 గంటలు అయితే చాలు వైన్ షాపుల కన్నా కూడా పానీపూరి బండి చుట్టు సందు లేకుండా ఉంటారు.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కంటే ఎక్కువగా పానీపూరి బండి వాళ్లు, మ్యాగి బండి వాళ్లు సంపాదిస్తున్నారని. దీనికి చదువక్కర్లేదు. కేవలం పానీపూరీ ఎలా చేయాలో తెలిస్తే చాలు. నిజానికి ఇది కూడా ఒక మంచి బిజినెస్‌ ఐడియానే. అయితే పానీపూరి బండి కాకుండా అందులో వాడే పూరిలు అమ్మి ఓ కుటుంబం నెలకు 5 లక్షలు సంపాదిస్తుంది. మీకు పానీపూరి చేయడం రాకపోతే.. ఇలాంటి వ్యాపారం చేయొచ్చు.. ఆ కుటుంబం గురించి ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

వివరాల్లోకి వెళితే.. పుత్తూరు తాలూకాలోని దారందకుక్కు మానే గ్రామానికి చెందిన మనోజ్‌ని పానీపూరీ బిజినెస్ చేస్తున్నాడు. ఇతను రుచికరంగా అనేక వెరైటీలలో పానీపూరీలను సిద్ధం చేసి ఫుడ్ లవర్స్ కోసం విక్రయిస్తున్నాడు.. గతంలో ఎన్నో బిజినెస్ లను చేశాడు.. జాబ్ లు చేశాడు.. కానీ ఏ ఒక్కటి కూడా సరైన ఆదాయాన్ని ఇవ్వలేక పోయాయి.. పానీపూరికి డిమాండ్ ఉందని ఇంట్లో చర్చించి ఇంట్లో పూరీలు తయారు చేసి పానీ-పూరీ అమ్మేవారికి విక్రయించడం ప్రారంభించాడు. అతను ఆటో రిక్షా నడపడం ఆపలేదు. కుటుంబం ప్రతిరోజూ 5 కిలోల పూరీలను మాన్యువల్‌గా తయారు చేసి కొంత అదనపు డబ్బుకు విక్రయించేవాడు..

ఈ వ్యాపారంలో లాభాలు మెరుగ్గా ఉండటంతో ఇదే బిజినెస్ ను పూర్తిగా ప్రారంభించాడు..టెక్నాలజీతో సౌరశక్తితో నడిచే పూరీ తయారీ యంత్రాన్ని కొనుగోలు చేశాడు. యంత్రం ఖరీదు రూ.2.9 లక్షలు. కానీ సోలార్ కావడంతో రూ.70 వేలు సబ్సిడీ వచ్చింది. యంత్రాన్ని సెల్కో విక్రయిస్తుంది. సబ్సిడీని కూడా పొందేలా కంపెనీ అతనికి మార్గనిర్దేశం చేసింది. అతను తన పెరట్లో ఒక చిన్న పూరీ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రతిరోజూ కనీసం 40 కిలోల పూరీలను తయారు చేసేవాడు.. మొత్తానికి అతను చుట్టు పక్కల కూడా పాపులర్ అయ్యాడు.. ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలిచాడు..

Tirumala శ్రీవారి భక్తులకు శుభవార్త: ఇకపై వారికి మొబైల్ కే దర్శనం టికెట్లు!!

తిరుమల శ్రీవారి భక్తులకు టిటిడి ఓ గుడ్ న్యూస్ చెప్తుంది. తాజాగా టిటిడి మరో కీలక నిర్ణయం తీసుకుంది . తిరుమల శ్రీవారి విఐపి బ్రేక్ దర్శనానికి కేటాయించే టికెట్లను భక్తులు ఇకపై ఆన్లైన్లోనే కొనుగోలు చేసేలా టిటిడి కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ కౌంటర్ వద్ద టికెట్ల కోసం భక్తులు క్యూలైన్లో నిరీక్షించే పరిస్థితికి చెక్ పెడుతూ టిటిడి ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
తిరుమలలో ఎంబీసీ 34 లోని కౌంటర్ వద్ద విఐపి బ్రేక్ దర్శనం కోసం భక్తులు ఎక్కువ సమయం క్యూలైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితులతో, భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సిఫార్సు లేఖలను అందజేసిన భక్తుల మొబైల్ ఫోన్లకు ఒక లింకుతో కూడిన మెసేజ్ ను పంపుతోంది. ఆ లింకును ఓపెన్ చేస్తే అందులోనే పేమెంట్ ఆప్షన్ వస్తుంది.
దీంతో మొబైల్ ఫోన్ నుండి నగదు చెల్లించి టిక్కెట్ ను మొబైల్ లోని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా టిటిడి రెండు రోజుల నుంచి అమలు చేస్తోంది. అయితే ఈ విధానంపై భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ కూడా తీసుకుంటున్న టిటిడి ఆ తర్వాత పూర్తిస్థాయిలో ఈ విధానంపై నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.

ఇదిలా ఉంటే మరోవైపు తిరుమలలో ఆస్థాన మండపంలో ధార్మిక సదస్సు కొనసాగుతుంది. ధార్మిక సదస్సుకు 57 మంది స్వామీజీలు రాగా, నిన్న ఈ ధార్మిక సదస్సులో టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు. తాను అభ్యుదయ రాజకీయాల్లో ఉన్న సమయంలో కూడా భగవంతుడిని సనాతన హిందూ ధర్మాన్ని వ్యతిరేకించలేదని నిన్న టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు.
ధార్మిక సదస్సులో పాల్గొన్న ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామి దయతో తాను రెండుసార్లు టీటీడీ చైర్మన్ గా, మూడుసార్లు టిటిడి బోర్డు సభ్యుడిగా అయ్యానని తెలిపారు. తన ద్వారా ఇటువంటి గొప్ప పనులు చేయించాలనే స్వామి వారు తనకీ అదృష్టాన్ని ఇచ్చారని, ధార్మిక సదస్సులో మఠాధిపతులు, పీఠాధిపతులు చెప్పిన సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని సనాతన హైందవ ధర్మం ఫరిడవిల్లేలా కార్యక్రమాలు చేస్తామని ఆయన పేర్కొన్నారు.

Realme Narzo 60X 5G: రియల్‌మీ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. రూ. 10 వేలకే 5జీ ఫోన్‌..

వినియోగదారులను ఆకర్షించే క్రమంలో స్మార్ట్ ఫోన్‌ కంపెనీలు దూకుడుమీదున్నాయి. భారీ ఆఫర్లను డిస్కౌంట్స్‌ను ప్రకటిస్తూ మార్కెట్‌ను పెంచుకుంటున్నాయి. ఇందులో భాగంగానే కొన్ని స్మార్ట్‌ ఫోన్స్‌పై డిస్కౌంట్స్‌ను ప్రకటిస్తున్నాయి. తాజాగా రియల్‌ ఫోన్‌పై భారీ ఆఫర్‌ను అందిస్తోంది. రియల్‌మీ నార్జో 60ఎక్స్‌ స్మార్ట్‌ ఫోన్‌పై భారీ ఆఫర్‌ను అందిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్‌పై ఎంత డిస్కౌంట్ లభిస్తోంది.? ఫీచర్లు ఎలా ఉన్నాయి.? ఇప్పుడు చూద్దాం..
చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం రియల్‌మీ గతేడాది నార్జో 60ఎక్స్‌ పేరుతో 5జీ ఫోన్‌ను లాంచ్‌ చేసిన విషయం తెలిసిందే. తక్కువ ధరలో 5జీ నెట్‌వర్క్‌కు సపోర్ట్ ఫోన్‌ను లాంచ్‌ చేశారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ను రెండు వేరియంట్స్‌లో తీసుకొచ్చారు.
4జీబీ ర్యామ్‌, 6జీబీ ర్యామ్‌ వేరియంట్‌లో ఈ స్మార్ట్‌ ఫోన్‌ను తీసుకొచ్చారు. ధర విషయానికొస్తే రియల్‌మీ నార్జో 60 ఎక్స్‌ రూ. 14,999గా ఉంది. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఫ్లిప్‌కార్ట్‌లో 18 శాతం డిస్కౌంట్‌తో లభిస్తోంది. దీంతో ఈ ఫోన్‌ను రూ. 12,225కే సొంతం చేసుకోవచ్చు.
అయితే ఆఫర్స్‌ ఇక్కడితోనే ఆగలేదు.. ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేస్తే పలు బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా ఉన్నాయి. వన్‌కార్డ్‌ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ. 750 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్ చెల్లించి 5 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు.
దీంతో పాటు ఎస్‌ బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ను వినియోగిస్తే రూ.1,500 వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. ఇలా అన్ని రకాల డిస్కౌంట్స్‌ వర్తిస్తే ఈ ఫోన్‌ను కేవలం అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను కేవలం రూ.10,725కే ఈ స్మార్ట్‌ ఫోన్‌ను సొంతం చేసుకోచవ్చు.
ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. 6.6 ఇంచెస్‌తో కూడి హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇచ్చారు. ఈ స్మార్ట్ ఫోన్‌ మీడియా టెక్‌ డైమెన్షన్‌ 810 ప్రాసెసర్‌పై పనిచేస్తేంది. ఇందులో 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని ఇచ్చారు. 50 ఎంపీ రెయిర్‌ కెమెరాను ఇందులో అందించారు.

AP FA – IV Syllabus 2023-24

AP FA – IV Syllabus 2023-24

AP FA – IV Syllabus 2023-24 Formative IV Syllabus February 2024 formative-assessment-IV-f.a-II-exams-syllabus-schedule AP Formative assessment IV for classes 1 to Class 10 Syllabus, Timetable for the Academic year 2023-24 AP FA II Exams Class 1 to Class 10 Primary, UP, High Schools Syllabus Download for Telugu, Hindi, English, EVS, Math’s, Science, Physics PS, Biology BS NS, SS Social Formative Assessment-4 Syllabus for Academic Year 2023-24 AP Formative Assessment 4

AP FA – IV 2023-24 Syllabus for the academic year 2023-24 Download

Bank Jobs: పీఎన్‌బీలో 1,025 ఉద్యోగాలు.. జీతం ఎంతో తెలుసా?

PNB Recruitment 2024 : బ్యాంకు ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న వారికి గుడ్‌న్యూస్‌. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో 1,025 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ వెలువడింది.
అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 7 నుంచి 25 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ పరీక్ష మార్చి/ఏప్రిల్‌లో నిర్వహించే అవకాశం ఉంది.
నోటిఫికేషన్‌లో కొన్ని వివరాలివే..

మొత్తం 1,025 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల కాగా.. వీటిలో ఆఫీసర్‌ -క్రెడిట్‌ (జేఎంబీ స్కేల్‌-1) ఉద్యోగ ఖాళీలు 1000 ఉన్నాయి. ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.36,000- 63,840వరకు వేతనం చెల్లిస్తారు. అలాగే, మేనేజర్‌ -ఫోరెక్స్‌ (ఎంఎంజీ స్కేల్‌ -II) 15 పోస్టులు ఉండగా.. వేతనం రూ.48,170 – రూ.69,810; మేనేజర్‌ సైబర్‌ సెక్యూరిటీ (ఎంఎంజీ స్కేల్‌ -II) పోస్టులు 5 ఉండగా.. రూ.48,170 – 69,810; సీనియర్‌ మేనేజర్‌ సైబర్‌ సెక్యూరిటీ (ఎంఎంజే స్కేల్‌ -III) 5 పోస్టులు ఉండగా.. రూ. 63,840 – 78,230 వరకు వేతనం చెల్లిస్తారు. ఇతర సౌకర్యాలు వీటికి అదనం.
వయో పరిమితి: ఆఫీసర్‌ (క్రెడిట్‌) పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులకు జనవరి 1, 2024 నాటికి 21-28 ఏళ్లు మించరాదు. మేనేజర్‌ పోస్టులకైతే 25-35 ఏళ్లు; సీనియర్ మేనేజర్ పోస్టులకు 27-38 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ ఆధారంగా ఆయా వర్గాల వారికి వయో సడలింపు అవకాశం ఉంది.
విద్యార్హత: ఉద్యోగ ఖాళీలను అనుసరించి సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీజీఏ /బీఈ/ బీటెక్‌, ఎంఈ/ ఎంటెక్‌, ఎంసీఏ, ఎంబీఏ, ఉత్తీర్ణతతో పాటు గతంలో పనిచేసిన అనుభవం ఉండాలి.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ఉద్యోగంలో చేరే ముందు బాండ్‌ రాయాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ₹59, మిగతా అభ్యర్థులకు ₹1180.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలివే..: విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్.
ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. పూర్తి సమాచారం కోసంhttps://www.pnbindia.in/Recruitments.aspx క్లిక్‌ చేయండి

Google Pay నుండి 1 లక్ష వరకు లోన్ పొందండి..! ఇలా దరఖాస్తు చేసుకోండి..! పూర్తి సమాచారం ఇదిగో

హలో ఫ్రెండ్స్ ఈరోజు కథనంలో గూగుల్ పే నుండి 1 లక్ష వరకు లోన్ పొందడం ఎలా. ఈ కథనాన్ని చివరి వరకు చదవండి… డబ్బు అవసరం కూడా ఎల్లప్పుడూ అత్యవసర పరిస్థితుల్లో వస్తుంది, అప్పుడు మేము బ్యాంకుల నుండి వ్యక్తిగత రుణాన్ని పొందుతాము.

కానీ అది అధిక వడ్డీ రేట్ల వద్ద వస్తుంది. ఇప్పుడు మీరు Google Payతో అత్యవసర పరిస్థితుల్లో మీకు అవసరమైన డబ్బును కూడా పొందవచ్చు.

ఇది మీకు 1 లక్ష వరకు రుణ సదుపాయాన్ని అందిస్తుంది. మీకు Google Payతో ఇప్పటికే పరిచయం ఉంది. Google Pay యాప్ ఆన్‌లైన్ నగదు బదిలీకి అనుకూలమైన యాప్ మరియు మంచి భద్రతను కలిగి ఉంది.

మొబైల్ నుండి లోన్ పొందండి
Google Pay యాప్ ఇప్పుడు భారతదేశంలోని కస్టమర్‌లకు తక్షణ రుణాలను అందిస్తోంది. ఈ యాప్ కొన్ని నిమిషాల్లో 15,000 నుండి 1,00,000 వరకు లోన్ సదుపాయాన్ని అందిస్తుంది.

ఈ లోన్ పొందడానికి మీరు తప్పనిసరిగా Google Pay అప్లికేషన్‌ని ఉపయోగించాలి మరియు మీ క్రెడిట్ స్కోర్ బాగా ఉండాలి. మీకు అర్హత ఉంటే మీ దరఖాస్తును తనిఖీ చేయండి మరియు అవసరమైన నిధులు తక్షణమే మీ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయబడతాయి.

Google Pay లోన్ గురించిన సమాచారం:
Google Pay loan ఆన్‌లైన్ బ్యాంకింగ్‌కు ప్రసిద్ధి చెందిన గూగుల్ పే ఇప్పుడు తన కస్టమర్లకు అత్యవసర నగదును అందిస్తోంది. 15 వేల నుండి 1 లక్ష రూపాయల వరకు, మీరు కొన్ని నిమిషాల్లో Google Pay అప్లికేషన్ నుండి లోన్ పొందవచ్చు.

ఈ రుణం ముఖ్యంగా చిన్న వ్యాపారులకు వారి అవసరాలను తీర్చడంలో సహాయపడుతుంది.

Google Pay యాప్ తన వినియోగదారులకు సులభమైన మార్గంలో రుణాలను అందిస్తోంది. ఈ కంపెనీ కస్టమర్ యొక్క అర్హత ప్రకారం భౌతిక పత్రాలను (వ్యక్తిగత పత్రాలు) అడుగుతుంది. మీ క్రెడిట్ స్కోర్ మరియు ఆదాయం ఆధారంగా మీకు 15 వేల నుండి 1 లక్ష వరకు రుణం ఇవ్వబడుతుంది.

Loan పొందడానికి అర్హతలు
Google Payలో లోన్ పొందడానికి దరఖాస్తుదారులు తప్పనిసరిగా నిర్దేశించిన అవసరాలను పూర్తి చేయాలి. దాన్ని పూర్తి చేసిన తర్వాత ఒకరు లోన్ పొందవచ్చు. అవి ఏంటో కింద తెలుసుకుందాం.

దరఖాస్తు చేసే అభ్యర్థి భారతదేశ నివాసి అయి ఉండాలి.
దరఖాస్తుదారులు తప్పనిసరిగా Google Pay కస్టమర్‌లు అయి ఉండాలి మరియు కొత్త ఖాతాను కలిగి ఉండకూడదు.
దరఖాస్తుదారు క్రెడిట్ స్కోరు బాగా ఉండాలి.
రుణం కోసం దరఖాస్తు చేసుకునే దరఖాస్తుదారు వయస్సు 21 ఏళ్లు పైబడి ఉండాలి.
దరఖాస్తుదారులు తప్పనిసరిగా యాక్టివ్ బ్యాంక్ ఖాతాను కలిగి ఉండాలి
ఇతర బ్యాంకులు లేదా కంపెనీల నుంచి రుణం పొంది ఉండకూడదు.
Google Payలో వ్యక్తిగత రుణాన్ని ఎలా పొందాలి?
మీ Google Pay యాప్‌లో మనీ ట్యాప్‌పై క్లిక్ చేయండి.
తర్వాత లోన్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
ఇప్పుడు అప్లికేషన్ లోన్ సెక్షన్ పేజీ ఓపెన్ అవుతుంది.
ముందస్తు ఆమోదం లోన్ ఆఫర్‌ల కేటగిరీ కింద వస్తుంది.
ఆఫర్‌లు మీ అవసరాలకు సరిపోతుంటే EMIపై క్లిక్ చేయండి.
EMIలో అడిగిన వివరాలను సరిగ్గా పూరించండి. సమర్పించండి.
సమర్పించిన తర్వాత మీరు O.T.P.
మీరు అందుకున్న O.T.Pని నమోదు చేయండి.
ఆపై మీ దరఖాస్తును సమర్పించి, బ్యాంక్ ధృవీకరణ కోసం వేచి ఉండండి.
మీరు ఈ దశలన్నింటినీ పూర్తి చేసిన తర్వాత మీరు లోన్ పొందేందుకు అర్హులు మరియు అవసరాన్ని బట్టి డబ్బు నేరుగా మీ ఖాతాలో జమ చేయబడుతుంది.

Krishna-Vijaya Nirmala : రాజబాబు అన్న సరదా మాట.. కృష్ణ రెండో పెళ్లికి బీజం అయ్యింది..

సూపర్ స్టార్ కృష్ణ(Krishna).. విజయనిర్మలను(Vijaya Nirmala) రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తెలుగు ఇండస్ట్రీలో ఈ జంట డేరింగ్ అండ్ డాషింగ్ కపుల్ గా పిలిపించుకున్నారు.
ఈ జోడికి మరో పేరు కూడా ఉండేది. వీరిద్దర్నీ ‘ఆంధ్రా ప్రేమ్‌ నజీర్‌-షీలా’గా పిలిచేవారు. కాగా కృష్ణ, విజయనిర్మల ప్రేమ వెనుక.. ఒకప్పటి స్టార్ కమెడియన్ రాజబాబు(Rajababu) అన్న ఓ సరదా మాట ఉందట. ఆ మాటతోనే కృష్ణ-విజయనిర్మల పెళ్ళికి బీజం పడింది. ఇంతకీ ఆ మాట ఏంటి..?

ఈ విషయాన్ని స్వయంగా కృష్ణనే ఓ సందర్భంలో తెలియజేశారు. కృష్ణ, విజయనిర్మల కలిసి మొదటిసారి ‘సాక్షి’ అనే సినిమాలో నటించారు. 1967లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని బాపు తెరకెక్కించారు. ఈ సినిమాలో రాజబాబు ఓ ముఖ్య పాత్ర చేశారు. కాగా ఈ మూవీ షూటింగ్ అంతా రాజమండ్రి దగ్గరలోని పులిదిండిలో జరిగిందట. ఇక ఈ సినిమాలోని ‘అమ్మ కడుపు చల్లగా’ అనే సూపర్ హిట్ సాంగ్ షూటింగ్ ఆ ఊర్లో ఉన్న ‘మీసాల కృష్ణుడు’ గుడిలో జరిగిందట.
పెళ్లి వేడుక నేపథ్యంతో ఈ సాంగ్ చిత్రీకరణ ఉంటుంది. ఇక సినిమా షూటింగ్ అయినా.. ప్రతి విషయాన్ని శాస్త్రోక్తంగా చేసే బాపు.. ఆ పెళ్లి తతంగం మొత్తాన్నీ నిజమైన పెళ్లిలా జరిపించారు. ఈక్రమంలోనే కృష్ణ-విజయనిర్మలకు శాస్త్రోక్తంగా ఆ గుడిలో అబద్ధపు పెళ్లి జరిగింది. ఇక ఆ పాటని తెరకెక్కిస్తున్న సమయంలో కృష్ణతో రాజబాబు ఇలా అన్నారట.. “ఈ గుడి చాలా మహిమగలది అంట. ఇప్పుడు అబద్ధపు పెళ్లి చేసుకున్న మీరు. త్వరలోనే నిజం పెళ్లి చేసుకుంటారు” అంటూ సరదాగా మాట్లాడారట.

ఆ మాటలకు సెట్స్ లోని ప్రతి ఒక్కరు నవ్వుకున్నారట. కానీ ఆ తరువాత రెండేళ్లకే 1969 మార్చి 24న కృష్ణ-విజయనిర్మల తిరుపతిలో పెళ్లి చేసుకున్నారు. ఒక సందర్భంలో కృష్ణ తమ పెళ్లి గురించి మాట్లాడుతూ.. రాజబాబు మాటల్ని గుర్తు చేసుకున్నారు. “నేను సెంటిమెంట్స్ ని నమ్మను. కానీ రాజబాబు అన్న మాటలు నిజంగా జరిగినప్పుడు ఆశ్చర్యపోయాను” అంటూ కృష్ణ చెప్పుకొచ్చారు.

Best Scholarship : విదేశాల్లో చదువు కోసం అప్పు చేస్తున్నారా. ఉచితంగా 83 లక్షల స్కాలర్ షిప్ పొందండిలా..!

Best Scholarship : ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తున్న భారత విద్యార్థుల సంఖ్య రోజురోజుకు గణనీయంగా పెరుగుతుంది. మరి ముఖ్యంగా అమెరికా, బ్రిటన్, కెనడా వంటి దేశాలకు భారతీయ విద్యార్థులు అధిక సంఖ్యలో వెళుతున్నారు.
అయితే విదేశాల్లో చదువుకోవడం కోసం చాలామంది విద్యార్థులు పెద్ద ఎత్తున అప్పులు చేస్తుంటారు. మరికొందరికి అయితే స్తోమత లేక అమెరికా బ్రిటన్ లేదా యూరప్ వెల్లి చదువుకోవాలనె కల కలలాగానే మిగిలిపోతున్నాయి. అయితే ఆర్థిక స్తోమత లేకపోయినా ప్రతిభావంతులైన వారికి అనేక రకాల స్కాలార్ షిప్ అందించి వాటి సహాయంతో విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకోవచ్చు. ఇక అలాంటి స్కాలర్ షిప్ భారతీయ విద్యార్థులకు అందుబాటులోకి వచ్చింది. అదే ఇన్ లెక్స్ శివ దాసాని స్కాలర్షిప్. ఈ స్కాలర్షిప్ Inlex శివ దాసాని ఫౌండేషన్ ద్వారా అందించడం జరుగుతుంది. ప్రతిభావంతులైన విద్యార్థులు విదేశాల్లో చదువుకోడానికి ఈ స్కాలర్ షిప్ సహాయపడుతుంది.ఈ ట్రెండు 1976 నుండి కోనసాగుతుంది. అయితే ఫౌండేషన్ వెబ్ సైట్ లో ఇచ్చిన సమాచారం ప్రకారం స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు ఫిబ్రవరి 6న తెరవబడుతుంది. ఇక దీనిని మార్చి 22 లోపు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
inlex శివదాసాన స్కాలర్షిప్ కింద భారతీయ విద్యార్థులకు దాదాపు లక్ష డాలర్లు అంటే 82 లక్షల 97 వేలు పొందుతారు. ఇక ఈ స్కాలర్షిప్ జీవనవ్యాయాలు, ఆరోగ్య సంరక్షణ వన్ వే వివాహన ప్రయాణాలను కవర్ చేస్తుంది. INLAX శివదాసాని ఫౌండేషన్ కు ఇంపీరియల్ కాలేజ్, లండన్, రాయల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్ (RCA), లండన్, యూనివర్శిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ (కేంబ్రిడ్జ్ ట్రస్ట్), సైన్సెస్ పో, పారిస్, కింగ్స్ కాలేజ్ లండన్ ,హెర్టీతో ఉమ్మడి స్కాలర్‌షిప్ ఏర్పాట్లు కలిగి ఉన్నారు. దరఖాస్తు కోసం కావాల్సిన పత్రాలు. : పాస్పోర్ట్ , ఫోటో , అడ్మిషన్/ఆఫర్ లెటర్, డిగ్రీ సర్టిఫికెట్ , అదనపు నిధుల రుజువు , రుసుము ప్రకటన , కోర్సు సంబంధిత కోర్టు పోలియో, TOEFL/IELTS/GRE స్కోర్ షీట్ ,అకడమిక్ డిస్టింక్షన్, గ్రాంట్లు, స్కాలర్‌షిప్‌ల పత్రాలు.
అర్హులు ఎవరంటే.: విద్యార్థి జనవరి 1 1994 లేదా ఆ తర్వాత జన్మించి ఉండాలి. భారతదేశంలో గుర్తింపు పొందిన విద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికెట్ పొంది ఉండాలి. విదేశీ విద్యాలయం నుండి డిగ్రీ ని పొందాలంటే గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత కనీసం రెండు సంవత్సరాలపాటు భారతదేశంలోనేే ఉండాలి. తప్పనిసరిగా TOEFL మరియు ILETS పరీక్షలలో ఉత్తీర్ణులై ఉండాలి. సోషల్ సైన్సెస్, హ్యుమానిటీస్, లా, ఫైన్ ఆర్ట్స్, ఆర్కిటెక్చర్,సంబంధిత సబ్జెక్టుల అభ్యర్థులు గ్రాడ్యుయేషన్‌లో కనీసం 65%, CGPA 6.8/10 లేదా GPA 2.6/4అకడమిక్ గ్రేడ్ కలిగి ఉన్నవారు అర్హులు.

స్కాలర్షిప్ ప్రక్రియ : ఈ స్కాలర్షిప్ కోసం విద్యార్థులను స్వతంత్రంగా ఇన్ లేక్స్ సెలెక్ట్ కంపెనీ ఎంపిక చేయడం జరుగుతుంది .ఇక ఈ సెలెక్ట్ కమిటీ దరఖాస్తుదారులను వారి ప్రస్తుత మరియు గత విజయాలను , భవిష్యత్తు అవకాశాలను దృష్టిలో పెట్టుకొని అంచనా వేసి ప్రధానంగా వారి పోర్టు పోలియో , స్కాలర్షిప్ కోసం ఎంపిక చేస్తారు .ఇక ఈ ప్రక్రియలో మూడు దశలు ఉంటాయి.

1. అప్లికేషన్స్ సమీక్ష

2. ఆన్ లైన్ ప్రిలిమ్స్ ఇంటర్వ్యూ…

3. ప్రిలిమ్స్ ఇంటర్వ్యూలో ఉత్తీర్ణులైన వారు చివరి వ్యక్తి ఇంటర్వ్యూ.

తెలంగాణతల్లి విగ్రహ రూపం, రాష్ట్ర చిహ్నంలో మార్పులు.. కేబినెట్‌ నిర్ణయాలివే!

హైదరాబాద్‌: సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అధ్యక్షతన సమావేశమైన తెలంగాణ కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈనెల 8 నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల నిర్వహణకు ఆమోదం తెలిపింది.
సమావేశం అనంతరం కేబినెట్‌ తీర్మానాలను మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. 2లక్షల ఉద్యోగాల భర్తీకి ఇవాళ్టి నుంచి ప్రక్రియ మొదలైందని వివరించారు. గత పాలనలో రాచరిక పోకడలే తప్ప.. తెలంగాణలో ప్రజాస్వామ్యం కనిపించలేదన్నారు.

కేబినెట్‌ కీలక నిర్ణయాలివే..

తెలంగాణతల్లి విగ్రహ రూపం, రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేయాలని నిర్ణయం.
వాహనాల రిజిస్ట్రేషన్లలో టీఎస్‌.. టీజీగా మార్పు.
రాష్ట్ర అధికారిక గీతంగా ‘జయ జయహే తెలంగాణ’.
ఆరు గ్యారంటీల అమలుపై సుదీర్ఘ చర్చ. రెండు గ్యారంటీల అమలుకు నిర్ణయం.
రాష్ట్రంలో కులగణన జరపాలని నిర్ణయం.
అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగానికి ఆమోదం.
కొడంగల్‌ ప్రాంత అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయం.
తెలంగాణ హైకోర్టుకు 100 ఎకరాలు కేటాయింపునకు నిర్ణయం
65 ఐటీఐ కళాశాలలను అడ్వాన్స్‌ టెక్నాలజీ కేంద్రాలుగా అప్‌డేట్‌ చేయాలని నిర్ణయం.
సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు క్షమాభిక్ష ఇచ్చి విడుదల చేయాలని నిర్ణయం.

Angkor wat : అంగోర్ వాట్.. ఈ హిందూ దేవాలయం కూడా కాలగర్భంలోకి..

Angkor wat : అయోధ్యలో ఏళ్ల సంవత్సరాలుగా పోరాడితే రామాలయం నిర్మాణం సాధ్యమైంది. అక్కడ బాల రాముడు ప్రాణ ప్రతిష్ట చేసుకొని పూజలు అందుకుంటున్నాడు.
లక్షలాదిమంది భక్తులు స్వామివారిని రోజూ దర్శించుకుంటున్నారు. వారణాసి కోర్టు తీర్పు ఇస్తే జ్ఞానవాపీ మసీదులో పూజలు మొదలయ్యాయి. రేపో, మాపో అక్కడి కాశీ విశ్వనాథుడు వెలుగులోకి వస్తాడు. ఒకవేళ కోర్టు అనుకూలంగా తీర్పు ఇస్తే అక్కడ కూడా స్వామివారికి కోవెల ఏర్పాటు అవుతుంది. మనదేశంలో అందులోనూ హిందువులు మెజారిటీగా ఉన్న దేశంలో ఆలయాలను రక్షించుకునేందుకు ఇంత ప్రయాస పడుతుంటే.. ఎక్కడో పొరుగున ఉన్న కంబోడియాలో అది కూడా ప్రపంచ ఎనిమిదవ వింతగా వినతికెక్కిన హిందూ దేవాలయం ఎవరికీ పట్టడం లేదు. పైగా ఇన్ని రోజులు ముస్లింలు, క్రిస్టియన్ ల చేతిలో ధ్వంసమైన ఆలయాలు.. తాజాగా బౌద్ధుల చేతులోనూ ధ్వంసానికి గురవుతున్నాయి. హిందూ దేవతల ప్రతిమలు, చారిత్రాత్మక ఆనవాళ్లు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. శాంతానికి మారుపేరుగా ఉండే బౌద్ధులు ఇలా చేయడం పట్ల సర్వత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ఎనిమిదవ వింతగా ప్రసిద్ధి చెందిన అంగోర్ వాట్ ఆలయం ఆనవాళ్ళను కోల్పోతోంది. క్రీస్తుశకం 900 సంవత్సరంలో తమిళ రాజు సూర్య వర్మన్ ఈ ఆలయాన్ని నిర్మించారని తెలుస్తోంది. అనంత పద్మనాభ స్వామి ఎలా అయితే ఉంటారో..ఈ అంగోర్ వాట్ ఆలయంలో విష్ణుమూర్తి కూడా అలానే ఉంటారు. కాకపోతే ఈ ఆలయాన్ని బౌద్ధులు ఆక్రమించుకున్న తర్వాత నాటి ఆనవాళ్లను క్రమంగా చేరిపేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆలయ నిర్వహణ సరిగా లేకపోవడంతో ఎక్కడికక్కడ కళావిహీనంగా కనిపిస్తోంది. అంతేకాదు ఆలయంలో బౌద్ధ మతానికి చెందిన దేవుళ్ల విగ్రహాలను ప్రతిష్టించారు. ఆ దేవుళ్లకు పంది తనను నైవేద్యంగా సమర్పిస్తున్నారు. హిందూ ఆచారాల ప్రకారం పూజలు జరిపిస్తున్నప్పటికీ ఎక్కడికక్కడ బౌద్ధ సంస్కృతి విలసిల్లే విధంగా మార్పులు చేస్తున్నారు. కంబోడియాలో ఉన్న ఈ ఆలయాన్ని తెలుగు నాట ప్రసిద్ధి చెందిన యూట్యూబర్ “నా అన్వేషణ” అన్వేష్ ఈ ఆలయాన్ని సందర్శించాడు. అక్కడ విశేషాలను పంచుకున్నాడు.

అతడు చెప్పిన వివరాల ప్రకారం ఆలయం చాలా విస్తారంగా ఉంది. ప్రధాన ద్వారం, ప్రధాన ఆలయం, ఇతర ఉపాలయాలు నాటి సంస్కృతికి నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. నిర్వహణ సరిగా లేకపోవడంతో అరుదైన శిల్పాలు, దేవుళ్ళ ప్రతిమలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. పర్యాటకులు భారీగా వస్తున్నప్పటికీ.. వారి ద్వారా వచ్చే ఆదాయంపై దృష్టి సారించిన కంబోడియా ప్రభుత్వం.. ఆలయ నిర్వహణపై ఏమాత్రం శ్రద్ధ చూపించడం లేదు. పైగా బౌద్ధ మతానికి ప్రాధాన్యమిస్తోంది. ముఖ్యంగా విష్ణుమూర్తికి పాన్పు లాగా ఉండే ఆదిశేషు, ఇతర విగ్రహాలు కళా విహీనంగా కనిపిస్తున్నాయి. వందల ఎకరాల్లో విస్తరించిన ఈ ఆలయాన్ని పరిరక్షించాలంటే కోట్లల్లో నిధులు కావాలి. అన్ని నిధులు కంబోడియా వద్ద లేవు. ఒకవేళ ఉన్నా ఆలయాన్ని పరిరక్షించే ఉద్దేశం ఆ దేశానికి లేదు. బౌద్ధులు కూడా క్రమక్రమంగా ఆలయంలో ఆనవాళ్లను మార్చుతున్నారు. ఇలానే ఉంటే అంగోర్ వాట్ ఆలయం కాల గర్భంలో కలిసి పోవడం ఖాయమని పర్యాటకులు వాపోతున్నారు. ఈ ఆలయంలో వ్లాగ్ చేసిన అన్వేష్ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అంగోర్ వాట్ ఆలయానికి సంబంధించి అతను చేసిన వ్లాగ్ ప్రస్తుతం యూ ట్యూబ్ లో ఇప్పటికే లక్షల్లో వ్యూస్ నమోదు చేసింది.

అబ్బాయి కావాలన్న తండ్రికి వరుసగా ఏడుగురు అమ్మాయిలు.. ఈ కథ కన్నీళ్లు తెప్పిస్తుంది..

ఆడపిల్ల అంటే కుటుంబంలో దుఃఖమే తన్నుకువస్తుంది కొన్ని కుటుంబాల్లో.. ప్రాచీన కాలంలోనే కాదు, నేటికీ ఈ మనస్తత్వం దేశంలోని ప్రతి మూలలోనూ ఉంది. మగబిడ్డను కనాలనే ఆశతో ఒకదాని తర్వాత మరొకటి ప్రసవించిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి.
ఈ దేశంలో రోజు రోజుకు ఆడ పిండాలను చంపడం వంటి నేరాలు జరుగుతున్నాయి.

బీహార్‌లో జరిగిన ఈ ఘటన అక్కడికి నిజంగానే ఉదాహరణగా నిలిచింది. ఈరోజు ఏడుగురు కూతుళ్ల విజయాల కారణంగా పిండి మిల్లు కార్మికుడు రాజు ఆనందంగా జీవిస్తున్నాడు. రాజ్‌కుమార్ సింగ్ బీహార్‌లోని సరన్ జిల్లా నివాసి. రాజుకు ఏడుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఇరుగు పొరుగు వారి మాటల కారణంగా ఈ ఏడుగురు కూతుళ్ల పెళ్లి ఎలా చేస్తారన్న ఆందోళన ఎప్పుడూ ఉండేది. పెళ్లి ఖర్చుల నుంచి మొదలుకొని, వరుడి ఇంటివారు తనఖా డిమాండ్ చేస్తే, ఆ ఖర్చులన్నీ ఆ తండ్రి ఎలా భరిస్తాడు? చుట్టుపక్కల వారు ఆ అమ్మాయిలను భారంగా భావించారు.
పిండి మిల్లు నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు రాజు. కానీ ఈరోజు ఆయన కూతుళ్లంతా పోలీసులే. ఈ కుమార్తెలు తమ తండ్రికి రెండు ఇళ్లు కట్టించారు. ఒకప్పుడు తన కూతుళ్ల భవిష్యత్తు గురించి ఆందోళన చెందే ఓ తండ్రి ఇప్పుడు కూతుళ్లతోనే సరికొత్త జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు.

పోలీసు పరీక్షలో ఉత్తీర్ణులై ఆ ఏడుగురు అమ్మాయిలకు ఉద్యోగాలు వచ్చాయి. పెద్ద కూతురు రాణి బీహార్ పోలీసు డిపార్ట్‌మెంట్‌లో.. రెండవ అమ్మాయి SSBలో, మూడో అమ్మాయి సోని CRPFలో, ప్రీతి క్రైమ్ బ్రాంచ్‌లో, నాల్గవ అమ్మాయి పింకీ ఎక్సైజ్ పోలీసుగా, ఐదవ అమ్మాయి బీహార్ పోలీస్‌లో, ఆరవ అమ్మాయి GRPలో ఏడవ అమ్మాయి కూడా పోలీసే.. ఇలా రాజు కూతుళ్లు అందరూ వివిధ డిపార్ట్’మెంట్‌లలో పోలీసులు అవ్వడంతో.. ఇప్పుడు చుట్టుపక్కల ప్రజలు యువరాజును తిట్టడం లేదు, కానీ అతని కుమార్తెలను ఉదాహరణగా చూపుతున్నారు.. కూతురిని భారంగా భావించే వారికి ఈ ఏడుగురు సోదరీమణుల కథ సరైన సమాధానంగా నిలుస్తోంది.

ఈ ఉంగరం ధరిస్తే.. మీకు బాగా కలిసి రావడం ఖాయం..

ప్రస్తుత సమాజంలో చాలామంది ప్రజలు జ్యోతిష్య శాస్త్రాన్ని( Astrology ), వాస్తు శాస్త్రాన్ని నమ్ముతున్నారు. అయితే జ్యోతిష శాస్త్రం ప్రకారం భక్తులు తాబేలను శుభప్రదంగా భావిస్తారు.
కాబట్టి తాబేలు చిత్రాన్ని ఇంట్లో ఉంచుకుంటారు. ఇంట్లో తాబేలు( Tortoise ) ఉంటే అన్ని భౌతిక దోషాలు తొలగిపోయి, సంతోషాకరమైన జీవితాన్ని గడుపుతారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. తాబేలు ఒక శుభ సంకేతంగా పరిగణిస్తారు. ప్రస్తుత రోజులలో చాలామంది వేలికి తాబేలు ఉంగరం ధరించడం మనం చూస్తూ ఉంటాం.

ఈ ఉంగరాన్ని ధరించడం వల్ల ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయని చాలామంది ప్రజలు నమ్ముతారు.

తాబేలు ఉంగరం( Tortoise Ring ) ధరించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. విష్ణు యొక్క రెండవ అవతారం తాబేలు. దీనిని ధరించడం వల్ల విష్ణుమూర్తి( Lord Vishnu Murthy ) అనుగ్రహం లభిస్తుంది.

దీని వల్ల ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయని చాలామంది ప్రజలు నమ్ముతారు. ఇంకా చెప్పాలంటే తాబేలు ఉంగరాన్ని ధరించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒక వ్యక్తి తాబేలు ఉంగరం ధరించడం వల్ల తన జీవితంలో పురోగతిని సాధిస్తాడు. అలాంటి వ్యక్తికి జీవితంలో ఎప్పుడూ డబ్బుకు కొరత ఉండదు.

తాబేలు ఉంగరం ధరించే వ్యక్తికి విశ్వాసం, సానుకూల శక్తి ఎక్కువగా ఉంటుంది. దీనిని ధరించడం వల్ల ప్రతి వ్యక్తి తన పనిలో విజయం సాధిస్తాడు. కానీ తాబేలు ఉంగరం ధరించేటప్పుడు ఈ విషయాలను కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. తాబేలు ఎల్లప్పుడూ వెండితోనే తయారు చేసి ఉండాలి.

ఉంగరాన్ని ఒకసారి ధరిస్తే పదేపదే తీయకూడదు. దీంతోపాటు తాబేలు ఉంగరం ధరించేటప్పుడు ఎప్పుడు ఎడమచేతి మధ్య వేలుకు లేదా చూపుడు వేలుకు మాత్రమే ధరించాలి. ఇంకా చెప్పాలంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మేషం, కర్కటకం,వృశ్చికం మరియు మీన రాశి( Meena Rashi ) వారు తాబేలు ఉంగరం ధరించడం మంచిది కాదు. ఈ రాశి చక్రం నీటి మూలకంతో ముడిపడి ఉందని, వారు తాబేలు ఉంగరం ధరిస్తే వారికి గ్రహదోషాలు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు.

DGP Ravi Gupta: డబ్బులకు ఆశపడ్డ డిజిపి.. వీడియోలకు లైకులు కొడితే జరిగిందిదీ!

DGP Ravi Gupta: డబ్బు ఎవరికీ చేదు కాదు. అగర్బ శ్రీమంతుడైన ముఖేష్ అంబానీ నుంచి రోజు కూలీ కి వెళ్లే వారి దగ్గర వరకు.. ఇలా ప్రతి ఒక్కరికి డబ్బు కావాలి.
కొందరికి డబ్బంటే విలాసం. ఇంకొందరికి డబ్బు అంటే అవసరం. అందుకే ధనం మూలం ఇదం జగత్ అనే సామెత పుట్టింది. ఇక ఈ డబ్బు సంపాదనకు కొంతమంది సన్మార్గాలు ఎంచుకుంటే.. చాలామంది దొడ్డిదారులు ఎంచుకుంటారు. అలా దొడ్డిదారులు ఎంచుకున్న క్రమంలో బోర్లా పడుతుంటారు. కొన్నిసార్లు మోసపోతుంటారు. అయితే ఈ జాబితాలో తెలంగాణ డిజిపి రవి గుప్తా కూడా ఉన్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ.. ఇది ముమ్మాటికి నిజం. పైగా ఈ విషయాన్ని స్వయంగా ఆయన ఒప్పుకున్నారు. డబ్బు తేరగా వస్తుంది అని చెబితే నమ్మకూడదని.. దాని వెనుక పెద్ద పన్నాగం ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన తన అనుభవంలో జరిగిన విషయాన్ని వివరించారు.

శుక్రవారం హైదరాబాదులో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో సైబర్ నేరాల నియంత్రణపై సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డిజిపి రవిగుప్త తన అనుభవాలు పంచుకున్నారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఒక మాజీ డిజిపి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడ్డారని తెలిపారు. నేరగాళ్లు అతడి ఖాతా నుంచి కొల్లగొట్టిన డబ్బును తిరిగి తీసుకురావడానికి పోలీసులకు చాలా సమయం పట్టిందని రవి గుప్తా వివరించారు. అంతేకాదు ఉచితంగా డబ్బు వస్తుందని ఎవరైనా చెప్తే నమ్మకూడదని.. ఒకవేళ నమ్మితే దొంగ చేతికి తాళం చేతులు ఇచ్చిన సామెత తీరుగానే ఉంటుందని ఆయన వివరించారు. అందుకే వ్యక్తిగత బ్యాంకు ఖాతా వివరాలను ఎవరికీ చెప్పకూడదని.. చివరికి కుటుంబ సభ్యులకు కూడా తెలియనీయకూడదని ఆయన పేర్కొన్నారు. ఎవరో కాదు ఉచితంగా డబ్బు వస్తుందని చెబితే తానే కొన్ని వీడియోలకు లైకులు కొట్టానని.. తీరా అసలు విషయం తెలిసి నాలుక కరుచుకున్నానని రవి గుప్తా వివరించారు.
రవి గుప్తా ఓసారి ఏదో పనిమీద ఇతర ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చింది. ఆయన వెళ్లాల్సిన విమానం ఆలస్యంగా నడుస్తుండడంతో విమానాశ్రయంలో ఎదురుచూస్తున్నారు. ఈలోగా వీడియోలకు లైక్లు కొడితే డబ్బులు ఇస్తామని కొందరు ఆయనకు ఫోన్ చేశారు. దానికి గుప్త సమ్మతం తెలపడంతో వారు కొన్ని లింకులు పంపించారు. అలా వారు పంపిన వీడియోకు లైక్ లు కొట్టడంతో.. సంబంధిత వ్యక్తులు రవి గుప్తా బ్యాంకు వివరాలు తీసుకున్నారు. ఆయనను ప్రలోభ పెట్టేందుకు ముందుగా 150 రూపాయలు ఆయన ఖాతాలో వేశారు. అయితే ఇక్కడే రవి గుప్తా ఒక తెలివైన నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా ఆయన దగ్గర రెండు బ్యాంక్ ఖాతాలుంటాయి. ఒకటేమో జీరో బ్యాలెన్స్.. మరొకటేమో మెయిన్ ఎకౌంటు. ఆన్లైన్ చెల్లింపులకు ఆయన మెయిన్ ఖాతా లో నుంచి జీరో ఖాతాకు డబ్బులు బదిలీ చేసుకుంటారు. అయితే సైబర్ నేరగాళ్లు రవి గుప్త జీరో ఖాతాలో డబ్బులు తక్కువగా ఉండటంతో ఆయనను వదిలేశారు. అంతేకాదు రవి గుప్తా కూడా సైబర్ నేరగాళ్లకు జీరో ఖాతా వివరాలు అందించారు. దీంతో ఆయన వారి నుంచి బయటపడ్డారు. రవి గుప్త ఏదో డబ్బులు సంపాదించడం కోసం అలా చేయలేదు. సైబర్ నేరగాళ్ల ఆట కట్టించేందుకు ఆయన వీడియోలకు లైకులు కొట్టే వ్యక్తిగా కొంతసేపు నటించాల్సి వచ్చింది.

ఇక ఈ విషయాన్ని అధికారులతో పంచుకుని సమాజంలో సైబర్ నేరగాళ్లు ఎలా రెచ్చిపోతున్నారో వివరించే ప్రయత్నం చేశారు డీజీపీ రవి గుప్త. ఇక తెలంగాణ రాష్ట్రం సైబర్ నేరగాళ్ల నుంచి డబ్బులను ఫ్రీజ్ చేయడంలో.. అలాగే బాధితులకు తిరిగి ఇవ్వడంలో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంది. అంతేకాదు సైబర్ నేరగాళ్ల నుంచి ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఒక విభాగాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఈ విభాగానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కేటాయించింది. అన్ని పోలీస్ స్టేషన్లో ఈ విభాగాన్ని అనుసంధానించింది. రాష్ట్రంలో ఏ మూల సైబర్ నేరం నమోదైనా వెంటనే ఈ విభాగానికి తెలియజేసేలాగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 1 9 3 0 టోల్ ఫ్రీ నెంబర్ కి ఇప్పటి వరకు 90 వేల ఫోన్ కాల్స్ వచ్చినట్టు పోలీస్ శాఖ చెబుతోంది. ప్రజల నుంచి సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టిన డబ్బులో 128 కోట్లు ఫ్రీజ్ చేసినట్టు వివరిస్తోంది.

Causes of Baldness : మగవారికి బట్టతల రావడానికి కారణాలు ఇవే.. చికిత్సలు ఏంటంటే..?

ఈ రోజుల్లో జుట్టు రాలిపోయి బట్టతల రావడం అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. మరీ ముఖ్యంగా మగవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తోంది.
ఒకప్పుడు 45 లేదా 50 ఏళ్లు దాటిన వారిలో ఈ బట్టతల కనిపించేది. కానీ ఇప్పుడు మాత్రం 25 నుంచి 30 ఏళ్ల వయసు వారిలో కూడా ఇది కనిపిస్తోంది. దాంతో వారందరూ పెద్ద వయసు వారిలాగా కనిపిస్తున్నారు. బట్టతలను కవర్ చేయడం కోసం అనేక రకాల పాట్లు పడుతుంటారు. కొందరు అయితే డాక్టర్ల వద్దకు క్యూ కడుతుంటారు. ఇలా రకరకాల పనులు చేసి చివరకు విసిగి వేసారిపోతారు. అసలు ఈ బట్టతల రావడానికి కారణం ఏంటి, చికిత్సలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.

అలవాట్లు…
అలవాట్లు అనేవి కూడా బట్టతల వచ్చే విధంగా ప్రభావం చూపిస్తాయి. అందుకే జీవన శైలి అనేది మన ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. నిద్రలేమి, మద్యపానం, పొగతాగడం లాంటివి చాలా ప్రమాదకరం. వీటివల్లనే బట్టతల వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మాదకద్రవ్యాల వాడకం వల్ల కూడా బట్టతల వచ్చే అవకాశముంది.

ఆహారం…

ఆహారం తీసుకోవడం వల్ల మన బాడీకి ఎన్నో పోషకాలు అందుతాయి. సరైన ఆహారం తీసుకోవడం వల్లనే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. కాబట్టి మన ఆహారంలో అన్ని రకాల పోషకాలు ఉండే విధంగా చూసుకోవాలి. ఒకవేళ మీరు తీసుకునే ఆహారంలో పోషకాలు సరిగ్గా లేకపోతే జుట్టు రాలుతుంది. దాని వల్ల బట్టతలకు దారి తీస్తుంది.

హెయిర్ కేర్ ప్రొడక్ట్స్…

హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ అనేవి కూడా మన జుట్టు రాలడాన్ని ప్రభావితం చేస్తుంటాయి. చాలా మంది జుట్టు స్టైలింగ్ కోసం రకరకాల పరికరాలను వాడుతుంటారు. ఇవి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇవి జుట్టును బలహీన పరుస్తాయి. దాంతో జుట్టు విపరీతంగా రాలిపోయేందుకు అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి వీలైనంత వరకు వీటికి దూరంగా ఉండాలి.

ఒత్తిడి…

ఈ రోజుల్లో అందరూ రకరకాల సమస్యలతో బాధపడుతుంటారు. నిద్రలేమి, టెన్షన్లు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఇబ్బందులు లాంటివి తీవ్రమైన ఒత్తిడికి దారి తీస్తుంటాయి. దాని వల్ల మన జుట్టు విపరీతంగా రాలిపోతుంది. జుట్టు మాత్రమే కాదు మీ చర్మం కూడా పాడైపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఒత్తిడి లేకుండా చూసుకోవాలి.

అంటువ్యాధులు…

చాలామందికి తెలియని విషయం ఏంటంటే అంటువ్యాధులు కూడా జుట్టు రాలిపోవడానికి కారణం అవుతుంటాయి. జుట్టు రాలిపోయేందుకు ఇవి అతిపెద్ద కారణంగా ఉంటాయి. తలలోఉంటే కొన్ని అంటు వ్యాధుల వల్ల కూడా బట్టతల సమస్య వస్తుంది. కాబట్టి చర్మవ్యాధి నిపుణుడిని ముందే సంప్రదించి తగు చికిత్స తీసుకోవాలి.

చికిత్సలు…

బట్టతల వచ్చిన తర్వాత అందించే చికిత్సలు చాలానే ఉన్నాయి. ఈ ఆధునిక యుగంలో అవి కాస్త ఎక్కువగానే ఉన్నాయి. పోషకాహార చికిత్స, తక్కువ-స్థాయి లైట్ థెరపీ, మైక్రో-నీడ్లింగ్తో మీసోథెరపీ, ప్లేట్లెట్ అధికంగా ఉండే ప్లాస్మా, జుట్టు పునరుద్ధరణ లేదా జుట్టు మార్పిడి లాంటివి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి డాక్టర్ ను సంప్రదించి వీటిపై అవగాహన పెంచుకోవాలి.

కామారెడ్డి ఎంఎల్ఎ సంచలన నిర్ణయం

కామారెడ్డి బిజెపి ఎంఎల్ఎ కాటిపల్లి వెంకటరమణారెడ్డి మరో సంచలనానికి తెర తీశారు. ప్రజల కష్టాలు, సమస్యలు తెలుసుకునేందుకు కంప్లైంట్ బాక్సులను ఏర్పాటు చేశారు.నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు ఫిర్యాదు పెట్టెలను పంపించారు.
పది రోజులకు ఒకసారి తానే స్వయంగా వచ్చి వాటిని తీసుకెళ్లాలని నిర్ణయించారు. సమస్యలు చెప్పుకోవడానికి ప్రజలు తనకోసం వేచి చూడకుండా సులువుగా పరిష్కారం లభించేందుకు ఈ విధానాన్ని తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు.వెంకటరమణారెడ్డి తీసుకున్న నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు

Lakshmi Devi kataksham : ఆడవాళ్లు నిద్ర లేవగానే ఈ 3 పనులు చేయండి చాలు.. మీ ఇంట లక్ష్మీదేవి తిష్ట వేస్తుంది.!

Lakshmi Devi kataksham : ముఖ్యంగా ఆడవారు ఉదయం నిద్ర లేవగానే కొన్ని ముఖ్యమైన పనులు కచ్చితంగా చేయాల్సి ఉంటుంది. అప్పుడే లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి రావడానికి ఇష్టపడుతుంది.
అలాగే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా మన ఇంట్లోనే ఉంటుంది. ముఖ్యంగా ఉదయం నిద్ర లేవగానే స్త్రీలు మొట్టమొదటిగా చేయాల్సిన పని ఇది స్త్రీలు పురుషులు ఇద్దరు చేయాల్సి ఉంటుంది. మన అరచేతులను చూసుకోవాలి. ఈ విధంగా చూసుకుంటే గనక లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటుంది. ఎందుకంటే మన వేళ్ళ చివరిలో లక్ష్మీదేవి ఉంటుంది. అలాగే మధ్యలో సరస్వతి. అలాగే క్రింది భాగంలో వెంకటేశ్వర స్వామి కొలువై ఉంటారు. అందుకే ఉదయం నిద్ర లేవగానే అరచేతులను రుద్ది ముందుగా మన వేళ్ళ వైపు చూడాలి. ఇలా కళ్ళు తెరవ గానే అరచేతిని చూడటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం సరస్వతి దేవి యొక్క జ్ఞానం వెంకటేశ్వరుని యొక్క కృపా మనపై కలుగుతుందని పండితులు చెబుతున్నారు. నెగిటివ్ ఎనర్జీ కూడా మీ ఇంట్లోకి కానీ ప్రవేశించదు.

ఈ విధంగా ముఖ్యంగా ఆడవారు నిద్రలేవగానే మీ యొక్క స్మార్ట్ ఫోన్ పక్కనపెట్టి పని ఏదైతే ఉందో అదంతా చేసుకోండి. ముఖ్యంగా మీరు చేయవలసినటువంటి పని ఏమిటి అంటే కనుక బయట కూడా మీరు గచ్చు కానీ లేకపోతే వాకిలి కాని ఏది ఉంటే అది శుభ్రంగా క్లీన్ చేసుకొని అలాగే లక్ష్మీదేవికి ఇష్టమైన ముగ్గులు వేసుకోండి. అంటే ఎంత అందంగా కనక మీ యొక్క వాకిలిని మీరు తీర్చిదిద్దితే అంతగా లక్ష్మీదేవి ఇష్టతను కనపరుస్తుంది. మీపైన లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. అలాగే మీ ఇంట్లోకి లక్ష్మీ దేవి రావడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అంటే లక్ష్మీదేవి ఎప్పుడు కూడా ఈ విధంగా సూచిక శుభ్రంగా కనిపిస్తుందో అటువంటి ఇంట్లోకి ప్రవేశించడానికి ఉంటుంది.

కాబట్టి మీరు ఈ విధంగా మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఎక్కడ కూడా దుమ్ము, ధూళి, క్రిమి, కీటకాలు, ఎలుకలు, బొద్దింకలు, పురుగులు ఇటువంటివి ఏమి తిరగకుండా మీ ఇల్లంతా కూడా ఎప్పుడో శుభ్రంగా ఉంచుకోవాలి.ముఖ్యంగా వంట గది పై ప్రత్యేకమైన శ్రద్ధను పెట్టాలి. అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కచ్చితంగా లభిస్తుంది. ముఖ్యంగా స్త్రీలు ఉదయం లేచి మీ అరచేతులను చూసుకొని అలాగే మీరు కచ్చితంగా ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని చక్కటి ముగ్గులు వేసుకోవాలి. ఈ విధంగా ప్రతిరోజు గనక మీరు చేస్తారంటే ఆ లక్ష్మీ అనుగ్రహం మీకు ఖచ్చితంగా లభిస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో నుండి వెళ్లిపొమ్మన కానీ వెళ్లిపోదు.

Paramporul OTT: ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. ‘పరంపోరుల్’ మూవీ ఎక్కడ చూడొచ్చంటే..

ప్రస్తుతం థియేటర్లలో చిన్న లు సందడి చేస్తున్నారు. గత శుక్రవారం ఎన్నో చిత్రాలు అడియన్స్ ముందుకు వచ్చి మెప్పించాయి. అటు ఓటీటీలోనూ ఎప్పటికప్పుడు కొత్త లు రిలీజ్ అవుతున్నాయి.
సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్స్, కామెడీ ఎంటర్టైన్మెంట్స్, హారర్ మూవీస్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక నిన్న వెంకటేశ్ నటించిన సూపర్ హిట్ సైంధవ్ ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. ప్రముఖ ఓటీటీ ప్లాట్ పామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే ఆహా ఓటీటీలో హారర్ మూవీ పిండం స్ట్రీమింగ్ అవుతుంది. అటు ఫ్యామిలీ మాస్ యాక్షన్ డ్రామా.. ఇటు భయంతో వెన్నులో వణుకు పుట్టించే హారర్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇక ఇప్పుడు మరో మూవీ అడియన్స్ ముందుకు వచ్చింది. తమిళంలో ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న గా విడుదలై భారీ హిట్ అందుకుంది. అదే పరంపోరుల్. గతేడాది కోలీవుడ్ లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది.

ఈ లో సీనియర్ హీరో శరత్ కుమార్, అమితాశ్ ప్రధాన్ ప్రధాన పాత్రలలో నటించగా.. అరవింద్ రాజ్ దర్శకత్వం వహించారు. అలాగే ఈ కశ్మీరా పరదేశి కథానాయికగా నటించింది. బాలాజీ శక్తివేల్, టి.శివ విన్సెంట్ అశోఖన్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందంచారు. గతేడాది సెప్టెంబర్ 1న విడుదలైన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాదాపు రూ. 6 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ దాదాపు రూ. 15 కోట్లు రాబట్టింది. కథ, కథనం స్క్రీన్ ప్లే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఈ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఫిబ్రవరి 1నుంచి ఈ మూవీ తెలుగు భాషలోనూ స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఇప్పటివరకు ఓటీటీలో అత్యధిక రెస్పాన్స్ అందుకున్న ల్లో పరంపోరుల్ ఒకటి. పురాతన విగ్రహాల అక్రమ రవాణా నేపథ్యంలో ఈ మూవీ కథ తిరుగుతుంది. వెయ్యేళ్ల చరిత్ర కలిగిన ఓ విగ్రహం మెయిన్ స్టోరీనే ఈ పరంపోరుల్ అన్నట్లుగా తెలుస్తోంది. మరీ థియేటర్లలో ఈ క్రైమ్ థ్రిల్లర్ మిస్ అయిన వారు ఇప్పుడు నేరుగా ఓటీటీలో చూసేయ్యండి.

వసంత పంచమికి.. శివునికి గల సంబంధం ఏమిటి..

హిందూ మతంలో వసంత పంచమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున సరస్వతి మాతను పూజించడంతో పాటు కామదేవుడిని కూడా పూజిస్తారు. వివాహాలకు ఈ రోజు శుభప్రదమని పండితులు చెబుతున్నారు.
వివాహం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారికి వసంత పంచమి శుభదినం. ప్రతి సంవత్సరం లక్షలాది జంటలు వసంత పంచమి నాడు పెళ్లి చేసుకుంటారు. వసంత పంచమి రోజు వివాహానికి అత్యంత అనుకూలమైన సమయం అని చెబుతారు.

వసంత పంచమి వివాహానికి శుభప్రదం..

వసంత ఋతువు వసంత పంచమితో ప్రారంభమవుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 14న వసంత పంచమి రాబోతోంది. ఈ రోజున, జ్ఞాన దేవత అయిన సరస్వతి మాతను ఆచార వ్యవహారాలతో పూజిస్తారు. వసంత పంచమి రోజు సరస్వతీ దేవికి అంకితం చేస్తారు. ఈ రోజున వివాహం చేసుకోవడం శుభప్రదం. ఈ రోజు వివాహానికి వివరించలేని శుభ సమయం అని నమ్ముతారు. వసంత పంచమి రోజు వివాహానికి ఎందుకు ఉత్తమంగా పరిగణిస్తారో తెలుసుకుందాం.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం వసంత పంచమి రోజంతా దోషరహితమైన, అద్భుతమైన యోగం ఉంటుంది. ఇది కాకుండా, ఈ రోజున రవియోగం శుభ యాదృచ్చికం కూడా ఉంది. శాస్త్రాల ప్రకారం, వసంత పంచమి రోజున, శివుడు పార్వతి తిలకోత్సవం జరిగి వారి వివాహ ఆచారాలు ప్రారంభమయ్యాయి. ఈ కోణం నుండి కూడా, వసంత పంచమి రోజు వివాహానికి పవిత్రమైనదిగా పరిగణిస్తారు.

వసంత పంచమి రోజు ఎలాంటి జాతకం కలవారు వివాహం చేసుకోవచ్చు..

వసంత పంచమి రోజున వివాహంలో నిరంతర సమస్యలను ఎదుర్కొంటున్న వ్యక్తులు వివాహం చేసుకోవచ్చు.

ఇరువర్గాలు వివాహానికి అంగీకరించాలి, లక్షణాలు సరిపోలకూడదు.
పెళ్లికి అంతా ఫిక్స్ అయిపోయి దానికి శుభ ముహూర్తం దొరకని వారు.

వెంటనే పెళ్లి చేసుకోవాలనుకునే వారికి వసంత పంచమి అత్యంత అనుకూలమైన రోజు.

వసంత పంచమి నాడు ఏమి చేస్తే మంచిది ?

జ్ఞానం, జ్ఞానానికి దేవత అయిన సరస్వతిని వసంత పంచమి నాడు పూజిస్తారు. అలాగే వసంత పంచమి నాడు వివాహమే కాకుండా గృహ ప్రవేశం, కొత్త ఉద్యోగం ప్రారంభించడం, ఏదైనా కొత్త పని ప్రారంభించడం, భూమి పూజ, పిల్లల చదువులు ప్రారంభించడం, శిరోముండనం మొదలైన శుభ కార్యాలకు కూడా ఉత్తమమైనదిగా పరిగణిస్తారు.

Poha Breakfast Benefits : అల్పాహారంగా పోహా తింటే చెప్పలేనన్నీ ఆరోగ్య ప్రయోజనాలు

రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం మంచి ఆహారం తీసుకోవాలి. అందులో భాగంగా పోహాను బ్రేక్ ఫాస్ట్‌గా తీసుకోండి. రోజంతా ఉత్సాహంగా ఉండటమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు.
పోహాను దక్షిణ భారతదేశంలోనూ చాలా మంది చేసుకుని తింటారు. దీని నుంచి కలిగే ఉపయోగాలను చూద్దాం..

బరువు తగ్గాలని ప్రయత్నించే, ఆరోగ్య స్పృహ ఉన్న వ్యక్తులు పోహాను తినొచ్చు. ఇది తింటే కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. అనవసరమైన ఆహారాన్ని తినకుండా నిరోధించవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలికి సహాయపడుతుంది. కొద్దిగా నిమ్మరసం, పచ్చిమిర్చి కలిపి తీసుకుంటే పోహా రుచి అమోఘం.

పోహా సులభంగా జీర్ణమవుతుంది. ఇది తింటే మిగతా రోజంతా ఎప్పుడూ కడుపు ఉబ్బరం అనిపించదు. అనవసరమైన ఆహారం తినాలని అనిపించదు. అల్పాహారంలో పోహా తీసుకోవడం మంచి ఎంపిక.

పోహా శక్తినిస్తుంది

అల్పాహారంలో తినే ఆహారం లంచ్ సమయం వరకు ఇంధనాన్ని అందించేలా ఉండాలి. పోహా ఈ అవసరాలను తీరుస్తుంది. ఎందుకంటే ఇది మధ్యాహ్న భోజనం వరకు శక్తి కొరత లేకుండా చేస్తుంది. అన్ని కార్యకలాపాలకు అవసరమైన శక్తిని దీని ద్వారా పొందవచ్చు. శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉండగలుగుతారు.

ఐరన్ దొరుకుతుంది

పోహాలో మంచి ఐరన్ కంటెంట్ ఉంటుంది. అంటే అల్పాహారంగా తినేవారికి ఎప్పటికీ రక్తహీనత రాదు. ఐరన్ ఎక్కువగా అవసరమయ్యే గర్భిణులు, చిన్న పిల్లలకు ఇది మంచి అల్పాహారం. ఐరన్ మన రక్తంలో హిమోగ్లోబిన్ కంటెంట్‌ను అవసరమైన స్థాయిలో నిర్వహించడానికి అవసరమైన మూలకం. పోహాతో ఐరన్ లభిస్తుంది.

మీ శరీరంలో కార్బోహైడ్రేట్ అవసరాల కోసం పోహాపై ఆధారపడవచ్చు. కార్బోహైడ్రేట్ల ఆహారాల జాబితాలో పోహా మొదటి స్థానంలో ఉంది. రోజువారీ శారీరక కార్యకలాపాలకు కార్బోహైడ్రేట్లు చాలా అవసరం.పోహాలో కరగని ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మరింత ఆరోగ్యకరమైన ఆహారంగా మారుతుంది.

ఇవి కూడా కలిపి చేసుకోవచ్చు

పోహాలో కొన్ని కూరగాయలు కలిపితే పోషకాలు మరింత బలాన్నిస్తాయి. వేరుశెనగ లేదా మొలకెత్తిన గింజలతో చేసుకోవచ్చు. ప్రొటీన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. కొంతమంది ప్రోటీన్ కోసం పోహాలో గుడ్లు కూడా కలుపుతారు.

పోహాలో విటమిన్ బి1 పుష్కలంగా దొరుకుతుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి అల్పాహారం. ఈ విటమిన్ మధుమేహ వ్యాధిగ్రస్తులలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

బరువు తగ్గేందుకు మంచి ఆహారం

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం బరువు తగ్గడానికి ప్రయత్నించే వారికి పోహా ఆహారం సరైనది.అల్పాహారం కోసం తీసుకోవడం వల్ల లంచ్ సమయం వరకు నిండుగా ఉండేలా చేస్తుంది. ఎలాంటి అనారోగ్యకరమైన రెడీమేడ్ ఫుడ్ తినకుండా ఉండొచ్చు.

పోహాలో మంచి ప్రొటీన్లు ఉంటాయి. కండరాల పెరుగుదలకు లేదా గాయపడిన కండరాల మరమ్మత్తు, బలోపేతం చేయడానికి ప్రోటీన్లు అవసరం. వ్యాయామం తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత తీసుకునే ఆహారంగా పోహా ఉత్తమ ఎంపిక.

ఎముకలకు బలం

పోహాను పెరుగుతో కలిపి తీసుకుంటే మన ఎముకలు క్యాల్షియం మొత్తాన్ని గ్రహిస్తాయి. ఎముకలు, దంతాలు బలంగా, ఆరోగ్యంగా ఉంటాయి. అందుకే అల్పాహారంలోకి పోహాను చేర్చుకోండి. ప్రయోజనాలు పొందండి.

Dhaniya Water: నానబెట్టిన దనియాల నీటిని తాగడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు

కొత్తిమీరతో అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కొత్తిమీర అనేది ప్రతి వంటకాల్లో ఉపయోగిస్తుంటారు. ఈ కొత్తమీరను క్రీ.పూ. 5000 సంవత్సరాల క్రితం నుంచే ఉపయోగిస్తున్నట్లు చెబుతుంటారు.

దీనిని మొదట ఇటలీలో ఉపయోగించినట్లు తెలుస్తోంది. వంటలలో విస్తృతంగా ఉపయోగించే కొత్తిమీర భారతదేశానికి చెందినది కాదు. అయితే దనియాలను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

థైరాయిడ్‌ను నియంత్రించడంలో దనియాలు గానీ, కొత్తిమీర గానీ ఎంతగానో సహాయపడుతుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగడం వల్ల థైరాయిడ్ సమస్యలు తగ్గుతాయి. థైరాయిడ్ సమస్యలు, కఫం సమస్యలను నివారిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దనియాలలో ఐరన్‌, పొటాషియం, ఫైబర్, విటమిన్లు ఏ,సీ, కే ఉన్నాయి.

దనియాల నీరు జీర్ణక్రియకు సహాయపడే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. నీటిలో నానబెట్టిన దనియాలు జీర్ణశయ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. ఉబ్బరం సమస్య తగ్గుతుంది. పేగు ఆరోగ్యానికి తోడ్పడతాయి. కొన్ని పరిశోధనల ప్రకారం, దనియాలు హైపోగ్లైసీమిక్ లక్షణాలను కలిగి ఉండటం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. ఈ నీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

దనియాలలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ కెమికల్స్ శరీరంలో మంటను తగ్గించగలవు. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఇన్ఫ్లమేటరీ సమస్యలతో బాధపడేవారికి సహాయపడుతుంది. దనియ గింజలు యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి, ఆక్సీకరణ ఒత్తిడి నుండి శరీరాన్ని రక్షించడానికి పని చేస్తాయి. ఇది దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

దనియాలలో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ బరువు నిర్వహణలో సహాయపడుతుంది. బహిష్టు సమయంలో దనియాల నీటిని తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, కడుపు తిమ్మిరి తగ్గుతుంది. కొత్తిమీర చర్మ ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. కొత్తిమీర గింజల్లోని పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యకరమైన చర్మాన్ని అందిస్తాయి. ఈ నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం చర్మ సమస్యలను దూరం చేస్తుంది. దనియాలు సహజంగా విశ్రాంతినిస్తాయి. దనియాల నీటితో మీ రోజును ప్రారంభించడం వలన టెన్షన్, ఆందోళన తగ్గుతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

Inspiration story- CM Apang-చనిపోదాం అనుకున్నవాడు… సీఎం అయ్యాడు!

చనిపోదాం అనుకున్నవాడు… సీఎం అయ్యాడు!

ఆరేళ్లకు అనాథలా మారాడు. పదేళ్లకు కార్పెంటర్‌ అవతారమెత్తాడు. పదకొండేళ్లకు తొలిసారి బడిలో అడుగుపెట్టాడు. ఆపైన నైట్‌ వాచ్‌మన్‌గా పనిచేశాడు. చివరికి బతకలేక ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాడు. కట్‌ చేస్తే… అదే కుర్రాడు పీజీ పూర్తి చేశాడు. ఎమ్మెల్యే అయ్యాడు. 22ఏళ్ల పాటు మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు. ఇటీవలే అరుణాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.

కలిఖో పుల్‌… పాతాళం నుంచి పర్వతం అంచుల దాకా సాగిన ఆయన ప్రయాణం, జీవితానికే కొత్త పాఠాలు నేర్పిస్తుంది.

కలిఖో పుల్‌… ఆ పేరుకు అర్థం ‘మంచి భవిష్యత్తు’ అని. ఏరికోరి తల్లి అతనికి ఆ పేరు పెట్టుకున్నా, వూహ తెలిసినప్పట్నుంచీ అతనికి చీకట్లు తప్ప, రేపటిపైన ఆశ ఎప్పుడూ కనిపించలేదు. పుల్‌ పదమూడు నెలల చిన్నారిగా ఉన్నప్పుడు తల్లి అనారోగ్యంతో కన్నుమూసింది. మరో ఐదేళ్లకు అల్లారు ముద్దుగా చూసుకుంటూ వచ్చిన తండ్రి కూడా అనారోగ్యంతో చనిపోయాడు. అలా ఆరేళ్ల వయసులో తల్లిదండ్రుల్ని పోగొట్టుకొని అనాథలా మిగిలాడు పుల్‌. చుట్టుపక్కల వాళ్లెవరూ పట్టించుకోలేదు. చుట్టాలెవరూ దగ్గరకు తీయలేదు. ఎటెళ్లాలో తెలీక దిక్కుతోచని స్థితిలో ఉన్న పుల్‌ని పక్క వూళ్లొ ఉండే అతడి అత్తయ్య తీసుకెళ్లింది. అదీ అతడి మీద ప్రేమతోనో, చదివించి పెద్ద చేయాలనో కాదు… ఇంట్లో పనులకు పనికొస్తాడని.

• పదేళ్లకు వడ్రంగిగా…

ఆరేళ్ల వరకూ పుల్‌ బడి మొహాన్ని చూడలేదు. ప్రతిరోజూ అడవికెళ్లడం, కట్టెలు కొట్టుకొని రావడమే అత్తయ్యవాళ్లింట్లో అతని పని. పుల్‌ కట్టెలు తీసుకొస్తేనే అతడికి ఆ రోజు అన్నం దొరికేది. ఆటల్లో పడో, ఆరోగ్యం బాలేకో అడవికి వెళ్లలేకపోతే ఆ పూటకి పస్తులే. దాంతో చదువుకీ, అందమైన బాల్యానికీ దూరంగా అడవి చెట్ల మధ్యే పెరిగాడు. పదేళ్ల వయసొచ్చేసరికి పక్క వూళ్లొని ‘హవాయి క్రాఫ్ట్‌ సెంటర్‌’లో వడ్రంగి పని నేర్చుకోవడానికి వెళ్లాడు. అక్కడ రోజుకి రూపాయిన్నర స్టైపెండ్‌ అందేది. అత్తయ్య కుటుంబం మీద ఆధారపడకుండా ఆ డబ్బులతోనే ఎలాగోలా బండి నడిపించేవాడు. పనిలో నైపుణ్యం సాధించే కొద్దీ స్టైపెండ్‌ కూడా పెరుగుతూ వచ్చింది. దాంతో అక్కడే ఉంటూ కుర్చీలూ మంచాలతో మొదలుపెట్టి రెండేళ్ల పాటు చెక్కతో రకరకాల కళాకృతులు తయారు చేసేవరకు నైపుణ్యం పెంచుకున్నాడు. అతడి ప్రతిభ ఆ శిక్షణా కేంద్రం నిర్వాహకులనూ ఆకర్షించింది. అక్కడుండే ట్యూటర్‌ సెలవు మీద వెళ్లడంతో శిక్షణ పూర్తయ్యాక పుల్‌కే మూడు నెలల పాటు జీతమిచ్చి శిక్షకుడిగా పనిచేసే అవకాశం కల్పించారు.

• నేరుగా ఆరులోకి…

పుల్‌ పనిచేస్తోన్న హవాయి క్రాఫ్ట్‌ సెంటర్‌కు ఎక్కువగా ఆర్మీ, పారా మిలటరీ, ప్రభుత్వ అధికారులు వస్తుండేవారు. వాళ్లందరూ హిందీ, ఇంగ్లిష్‌లోనే మాట్లాడేవాళ్లు. పుల్‌కి అస్సమీస్‌ తప్ప మరో భాష రాదు. వినియోగదారులు చెప్పేది తనకు అర్థమవ్వాలంటే హిందీ కానీ, ఇంగ్లిష్‌ కానీ నేర్చుకోవాల్సిందే అనుకున్నాడు. దాంతో తప్పని పరిస్థితుల్లో పదకొండేళ్ల వయసులో ఓ నైట్‌ స్కూల్‌లో ఒకటో తరగతిలో చేరాడు పుల్‌. ఇతర సబ్జెక్టులతో తనకు అవసరం లేదనీ, హిందీ ఇంగ్లిష్‌ మాత్రమే బాగా నేర్పించమనీ టీచర్లని అడిగేవాడు. ఓరోజు పుల్‌ చదువుతోన్న స్కూల్‌కి ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, డిప్యూటి కమిషనర్‌ తనిఖీకి వచ్చారు. అందరికంటే పెద్దవాడు, చురుగ్గా ఉంటాడు కాబట్టి వాళ్లని ఆహ్వానించే బాధ్యతని స్కూల్‌ పుల్‌కే అప్పగించింది. స్కూల్లో చదువు ఎలా చెబుతున్నారంటూ మంత్రి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన పుల్‌, చివర్లో ఓ ప్రార్థన గీతాన్నీ పాడాడు. చెక్క పని నేర్చుకునే పిల్లాడు అంత బాగా మాట్లాడటం, పాడటం డిప్యూటీ కమిషనర్‌ దృష్టిని ఆకర్షించింది. వెంటనే అతడి గురించి ఆరా తీశాడు. విషయం తెలుసుకొని ఆయనే చొరవ తీసుకుని పుల్‌ని డే స్కూల్‌కి మార్పించి, నేరుగా ఆరో తరగతిలో అడ్మిషన్‌ ఇప్పించాడు. అదే పుల్‌ జీవితానికి కీలక మలుపు. పొద్దున చదువుకుంటూనే రాత్రుళ్లు హస్తకళల కేంద్రంలో శిక్షకుడిగా పనిచేసేవాడు.

• ఆత్మహత్యవైపు అడుగులు

తరగతులు మారే కొద్దీ పుల్‌కి ఖర్చులూ ఎక్కువయ్యాయి. అతడు పనిచేసే చోట వచ్చే డబ్బులు బతకడానికీ చదువుకీ సరిపోయేవి కావు. దాంతో తెలిసిన వాళ్ల ద్వారా అతికష్టమ్మీద ఓ ప్రభుత్వ కార్యాలయంలో నైట్‌ వాచ్‌మన్‌గా ఉద్యోగం సంపాదించాడు. సాయంత్రం ఐదు గంటలకు ఆ కార్యాలయంలో జాతీయ జెండాను అవనతం చేయడం, ఉదయం ఐదింటికి జెండా ఎగరేయడం, ఆ మధ్యలో కార్యాలయానికి కాపలా కాయడం అతడి పని. నెలకు రూ.212 జీతం వచ్చేది. రాత్రి ఉద్యోగం, పొద్దున స్కూలుతో రోజుకి నాలుగైదు గంటలకు మించి నిద్ర ఉండేది కాదు. ఆ జీతం కూడా సరిపోకపోవడంతో ఖాళీ సమయంలో సిగరెట్లూ, పాన్‌లూ అమ్ముతూ ఎంతో కొంత సంపాదించుకునేవాడు. కానీ దురదృష్టం పుల్‌ని మరోసారి దెబ్బకొట్టింది. అనుభవిస్తోన్న పేదరికానికి తోడు కడుపులో అల్సర్ల సమస్య అతడిని మరింత బాధపెట్టింది. వైద్యం చేయించుకోవడానికి డబ్బుల్లేక ఆరేళ్లపాటు అలానే భరించాడు. కానీ చివరికి ఆపరేషన్‌ చేయించుకోకుంటే సమస్య పూర్తిగా ముదిరిపోయే పరిస్థితి వచ్చింది. డబ్బుల కోసం బంధువుల్ని ఆశ్రయిస్తే ఒకరు రెండు రూపాయలూ, మరొకరు ఐదు రూపాయలూ చేతిలో పెట్టారు. ఆ క్షణం తనకంటూ ఎవరూ లేరనీ, తాను బతికి సాధించేది ఏమీ లేదనీ పుల్‌కి అనిపించింది. ఆత్మహత్య చేసుకుందామని దగ్గర్లోని ఓ నదిమీదున్న బ్రిడ్జి పైకెక్కాడు. కానీ చుట్టూ మనుషులు ఉండటంతో దూకడానికి అతడికి ధైర్యం సరిపోలేదు. దాదాపు నలభై నిమిషాలు అక్కడే ఎదురు చూశాక, చనిపోవడం తనవల్ల కాదనిపించి వెనుతిరిగాడు.
చదువుకుంటూనే పని
జీవితంలో డబ్బు ఎంత అవసరమో బంధువుల ప్రవర్తనతో పుల్‌కి అర్థమైంది. ఎలాగైనా ఆపరేషన్‌ చేయించుకోవాలనీ, బతికి సాధించి తానేంటో నిరూపించాలనీ అనుకున్నాడు. నేరుగా తనని స్కూల్లో చేర్పించిన డిప్యూటీ కమిషనర్‌ నేగి దగ్గరకు వెళ్లి తన పరిస్థితి వివరించాడు. అతడిని చూసి జాలిపడ్డ నేగి చేతిలో రెండువేల ఐదొందలు పెట్టి పంపించాడు. ఆ డబ్బుతో చికిత్స చేయించుకున్న పుల్‌, తరవాత ముఖ్యమంత్రికి అభ్యర్థన పెట్టుకొని, దాన్నుంచి వచ్చిన మెడికల్‌ గ్రాంట్‌తో నేగి డబ్బులు తిరిగిచ్చేసి జీవితాన్ని మళ్లీ కొత్తగా మొదలుపెట్టాడు. క్రమంగా పుల్‌ ఆరోగ్యం మెరుగు పడింది. చేతిలో ఎంతో కొంత నైపుణ్యం ఉంది. చదువును కొనసాగిస్తూనే డబ్బులు సంపాదించడానికి వచ్చే ఏ ఒక్క అవకాశాన్నీ వదిలిపెట్టకూడదని నిర్ణయించుకున్నాడు. పుల్‌కి వెదురుతో ఫెన్సింగ్‌ నిర్మించడం, గుడిసెలు అల్లడం బాగా వచ్చు. అదే విషయాన్ని తనకు పరిచయమున్న వాళ్లందరికీ చెబుతూ, ఏదైనా అవసరముంటే కబురుపెట్టమనేవాడు. అలా ఓ జూనియర్‌ ఇంజినీర్‌ ఇంటిచుట్టూ వెదురుతో ఫెన్సింగ్‌ నిర్మించే పని దొరికింది. మూడ్రోజుల పాటూ ఒక్కడే అడవికి వెళ్లి వెదురుని నరుక్కొని వచ్చి ఆ నిర్మాణాన్ని పూర్తిచేశాడు. దానికి అతడికి దక్కిన మొత్తం నాలుగొందల రూపాయలు. ఆ తరవాత ఆరొందల రూపాయలకు ఓ గుడిసె నిర్మించే పని దొరికింది. కొన్ని రోజులకు రెండు వేల రూపాయలకు ఓ వెదురు ఇంటిని నిర్మించే పనీ ఒప్పుకున్నాడు. అలా చదువుకుంటూనే ఓ చిన్నస్థాయి కాంట్రాక్టర్‌గా మారాడు. పనికీ, చదువుకీ మధ్య పుల్‌ నిద్రనీ, వ్యక్తిగత జీవితాన్నీ త్యాగం చేశాడు తప్ప పుస్తకాలని ఏ రోజూ పక్కకి పెట్టలేదు. ఓవైపు ఇంటర్‌ చదువుతూనే మరోపక్క తాను సంపాదించుకున్న డబ్బులతో నాలుగు సెకండ్‌ హ్యాండ్‌ ట్రక్కులనీ కొని వాటిని అద్దెకి తిప్పేవాడు.

• పాతికేళ్లకే ఎమ్మెల్యే

చిన్న కాంట్రాక్టర్‌గా మొదలుపెట్టి డిగ్రీకి వచ్చేనాటికి పక్కా ఇళ్లు నిర్మించే కాంట్రాక్టులూ చేసే స్థాయికి పుల్‌ ఎదిగాడు. చదువూ, కాంట్రాక్టులకి తోడు కాలేజీ విద్యార్థి సంఘానికి జనరల్‌ సెక్రటరీ బాధ్యతలతో పుల్‌ క్షణం తీరికలేకుండా గడిపేవాడు. డిగ్రీ చివరి సంవత్సరానికి వచ్చేనాటికి పుల్‌ మూడు లక్షల ఖర్చుతో ఓ సొంత ఇంటినీ నిర్మించుకున్నాడు. అల్సర్‌ నుంచి బయటపడ్డ నాటి నుంచీ అతడి సంపాదనలో సగం సొంతానికీ, మిగతా సగం పేద రోగుల వైద్యానికీ కేటాయిస్తూ వస్తున్నాడు. కాంట్రాక్టర్‌గా మారాక ప్రభుత్వాసుపత్రులకు వెళ్తూ రోగుల అవసరాలు తెలుసుకొని ఆర్థిక సాయం చేసేవాడు. అలా క్రమంగా అతడి ఔదార్యం గురించి ఆనోటా ఈనోటా అందరికీ తెలియడం మొదలుపెట్టింది. విద్యార్థి సంఘం నాయకుడిగానూ మంచి పేరు సంపాదించాడు. డిగ్రీ పూర్తయ్యాక, లా కాలేజీలో చేరాడు. మరోవైపు కాంట్రాక్టర్‌గా ఎదుగుతూ 37 ప్రభుత్వ భవనాలూ, డజనుకు పైగా బ్రిడ్జిలూ, వందల కిలోమీటర్ల రోడ్లూ నిర్మించాడు. అతడు నిర్మించిన భవనాల నాణ్యత నచ్చడంతో ప్రభుత్వం టెండర్లు లేకుండానే అతడికి పనులను అప్పజెప్పేది. చిన్న వయసులోనే స్థానికంగా పుల్‌ సంపాదించిన పేరు కాంగ్రెస్‌ పార్టీ దృష్టిని ఆకర్షించింది. అతడు పార్టీలో సభ్యుడుకాకపోయినా తమ తరఫున పోటీ చేయాలంటూ ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చింది. ప్రభుత్వ కాంట్రాక్టులనే ప్రజా సేవగా భావిస్తూ చేస్తూ వచ్చాడు పుల్‌. అలాంటిది నేరుగా ప్రభుత్వం తరఫునే పనిచేసే అవకాశం వచ్చేసరికి ఆనందంగా ఒప్పుకున్నాడు.

• మంత్రిగా 22ఏళ్లు

తొలి ఎన్నికల్లో పుల్‌ అద్భుతమైన మెజారిటీతో విజయం సాధించి, పాతికేళ్లకే మంత్రిగా మారాడు. ఆ తరవాత జరిగిన అన్ని ఎన్నికల్లో ప్రత్యర్థులపైన 90శాతం కంటే ఎక్కువ ఓట్ల మెజారిటీతోనే గెలుస్తూ వచ్చాడు. మంత్రిగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్నాడు. ‘ఒకప్పుడు ఆపరేషన్‌ కోసం ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుంటే ముఖ్యమంత్రి అపాంగ్‌ రెండువేల ఐదొందలు గ్రాంట్‌ ఇచ్చారు. అదే వ్యక్తి ఈ రోజు నా పెళ్లికి అతిథిగా హాజరవడాన్ని నమ్మలేకపోతున్నా’ అంటూ పుల్‌ తన పెళ్లిలో కన్నీటి పర్యంతమయ్యారు. 23ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో 22ఏళ్లు పుల్‌ మంత్రిగా పనిచేశారంటేనే ప్రజలకూ అధికార పక్షానికీ ఆయనపైన ఎంత నమ్మకమో అర్థమవుతుంది. ఈటానగర్‌లోని పుల్‌ అధికార నివాసం ఓ ఆస్పత్రినే తలపిస్తుంది. నిత్యం ఆయన సాయం కోరి వచ్చే రోగులు ఉండటానికి ఆయన ఇంట్లోనే కొన్ని గదులు కేటాయించారు. ఇరవై నాలుగ్గంటలూ అక్కడ వైద్యులను అందుబాటులో ఉంచి వచ్చిన వాళ్లను పరీక్షించే ఏర్పాట్లు చేశారు. ఇరవై ఏళ్లుగా రాజకీయంగానూ బలపడుతూ వచ్చిన పుల్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌లో అనిశ్చితి కారణంగా కొనసాగిన రాష్ట్రపతి పాలనకు ఇటీవలే తెరదించారు. ఇతర ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ రాష్ట్రానికి తొమ్మిదో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

‘నాకు దేవుడిపైన నమ్మకం లేదు, ఎందుకంటే నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన ఒక్కసారి కూడా నాకు సాయపడలేదు. కానీ కష్టమే దేవుడని నమ్ముతా. అదే జీవితంలో ఎదురుదెబ్బలు తగిలిన ప్రతిసారీ నన్ను నిలబెట్టింది. ఇప్పుడు నా కారుమీద ఎగిరే జెండాను చూస్తున్నప్పుడల్లా ఒకప్పుడు చౌకీదార్‌గా నేను రోజూ జెండాను ఎగరేసిన రోజులు గుర్తొస్తుంటాయి. ఇప్పటికీ నా తొలిరోజుల్నాటి చెక్క పనిముట్లు నా దగ్గర భద్రంగా ఉన్నాయి. నా ఐదుగురు కొడుకులకూ వాటిని చూపిస్తూ నా గతాన్ని గుర్తు చేస్తా. నన్ను మంత్రిగా కాకుండా ఓ మామూలు కార్పెంటర్‌గా, కాంట్రాక్టర్‌గానే చూడమని వాళ్లకు చెబుతా. ఒకప్పుడు రోజుకు పన్నెండు గంటలు ప్రభుత్వ వాచ్‌మన్‌గా పనిచేసిన నేను ఇప్పుడు ఇరవై నాలుగ్గంటలూ ప్రభుత్వాన్ని నడిపించే స్థాయికి చేరుకున్నా. నేను సాధించినప్పుడు మీరెందుకు సాధించలేరు’ అంటూ యువతను ప్రశ్నిస్తారు పుల్‌.

నిజమే… ఎందుకు సాధించలేరు?

• ఇంకొంత

భారత్‌-చైనా సరిహద్దుకు రెండు వైపులా నివసించే కమన్‌ మిష్మి అని ఓ చిన్న తెగలో కలిఖో పుల్‌ పుట్టారు. కుటుంబంలో బడికెళ్లి చదువుకున్న మొదటి వ్యక్తి ఆయనే.

* పుస్తకాలు చదవడం, పర్యటనలకు వెళ్లడం, స్నేహితులతో చదరంగం ఆడటాన్ని బాగా ఇష్టపడతారు. ఖాళీ దొరికనప్పుడల్లా తన పిల్లలను అనాథ శరణాలయాలకు తీసుకెళ్లడం, వాళ్లతో కలిసి స్వచ్ఛంద సంస్థలు నిర్వహించే కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం అలవాటు.

* విద్య, వైద్యం, ఆర్థిక, న్యాయ, విద్యుత్‌, సాంఘిక శిశు సంక్షేమం లాంటి అన్ని ప్రధాన శాఖల్లో ఆ రాష్ట్ర క్యాబినెట్‌ మంత్రిగా పనిచేసిన అనుభవం పుల్‌ సొంతం.

Health

సినిమా