Saturday, November 16, 2024

Walking Benefits: వాకింగ్ చేయడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా.? ఇలా నడవండి మరిన్ని ప్రయోజనాలు

Walking Benefits: ప్రస్తుమున్న రోజుల్లో వ్యాయామం తప్పనిసరి. అలాగే ప్రతి రోజు వాకింగ్‌ చేయడంతో ఎంతో మంచిదని అందరికి తెలిసిందే. ప్రతి రోజు వాకింగ్‌ (Walking )చేయడం వల్ల ఎంతో మంచిదని వైద్యులు కూడా పదేపదే చెబుతుంటారు.

ప్రతి మనిషి ఆరోగ్యంగా (Health) ఉండాలంటే నకడ ఎంతో మంచిది. వాకింగ్‌ వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. ప్రతిరోజు వాకింగ్‌కు కొంత సమయం కేటాయించడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. మన ఆరోగ్యాన్ని మన చేతుల్లో ఉంచుకోవాలంటే కొన్ని నియమాలు పాటిస్తే ఎంతో మంచిది. ఎక్కువ కాలం బతకాలి.. రోగనిరోధక శక్తి పెంపొందించుకోవాలి..అంటే కొన్ని నియమాలు పాటించాల్సిందే. ప్రస్తుతమున్న రోజుల్లో ఎంతో మంది ఏదో ఒక అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇక వాకింగ్‌ వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలున్నాయి.

వేగంగా నడిస్తే అధిక కేలరీలు ఖర్చు అవుతాయి: వేగంగా నడవడం వల్ల మన శరీరంలో కేలరీలు అధికంగా ఖర్చు అవుతాయనే విషయం మనకు తెలిసిందే. ప్రతి రోజు వాకింగ్‌ చేయడం వల్ల డయాబెటిస్‌తో పాటు గుండె జబ్బులు ఇతర రోగాలు దరి చేరకుండా ఉంటాయి. అయితే ఎంత వేగంగా నడిస్తే ఎన్ని కేలరీలు ఖర్చవుతాయి.. అనేది మనకు తెలియదు. తెలిస్తే మరికొన్ని కేలరీలు ఖర్చయ్యేలా నడుస్తాము. నడవడం వల్ల ఎన్ని కేలరీలు ఖర్చుఅవుతాయో వైద్య నిపుణులు వివరిస్తున్నారు.

నిదానంగా నడిస్తే..: మనం నిదానంగా నడవడం వల్ల 15 నిమిషాల్లో 9 కేలరీలు ఖర్చు అవుతాయి. 30 నిముషాల్లో 25 కేలరీలకు ఖర్చుచేయవచ్చు. ఇక నిదానంగా కాకుండా కాస్త సాధారణం కంటే కొంత వేగంతో నడిస్తే 15 నిముషాల్లో 25 కేలరీలు ఖర్చు అవుతుంది. అలాగే అరగంటలో 50 పైగా కేలరీలు ఖర్చవుతాయి. బ్రిస్క్‌ వాకింగ్‌ గానీ రన్నింగ్‌ కానీ చేస్తే మనం అనుకున్నంత ఫలితాన్ని పొందవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. అరగంటలో 250 కేలరీలను ఖర్చుచేయవచ్చు. నడిచే దూరాన్ని బట్టి కూడా కేలరీలు ఖర్చవటం అనేది జరుగుతుంది. కొంతమంది ఒక మైలుతో మొదలుపెట్టి రెండు నుండి నాలుగు మైళ్లవరకు వాకింగ్‌ చేస్తుంటారు.

వాకింగ్‌ ఎలా చేయాలి..?: వాకింగ్‌ మొదలు ప్రారంభించగానే గంటలు గంటలు నడవకుండా శరీరం అలవాటు పడేలా సమయాన్ని పెంచుతూ ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఒకేసారి అరగంట కాకుండా ముందు పావుగంట పాటు నడవాలి. ఆ తర్వాత అరగంట, ఆపైన అరగంట నుంచి ముప్పావు గంటవరకు, తర్వాత గంటవరకు పెంచుతూ పోవాలి. మొదట అరగంటలో ఒక మైలు నడిస్తే చాలని సూచిస్తున్నారు. ఆ తర్వాత ఒక మైలు దూరాన్ని పావుగంటలో నడిచేంత వేగం వరకు ప్రయత్నించవచ్చు. వేగం పెంచుతున్న కొద్దీ మన శరీరంలో శక్తి స్థాయి, మెటబాలిజం పెరుగుతుంటుంది. వారం పాటు ప్రతిరోజూ నడవటం వల్ల అత్యధికంగా 1500 కేలరీల వరకు ఖర్చవుతాయి. వాకింగ్‌ అప్పుడే మొదలుపెట్టినవారికి ఇది మంచి ఫలితం. అయితే ఒకసారి వాకింగ్‌ మొదలుపెట్టాక దాన్ని ఆపకుండా చేస్తుండటం మంచిది. అప్పుడే సరైన ఫలితం కనబడుతుందని చెబుతున్నారు.

వాకింగ్‌ చేయడమే కాదు.. ఆహారం విషయంలో కూడా..: ఎక్కువ మంది బరువు త్వరగా తగ్గాలనే ఉద్దేశంతో వాకింగ్‌ చేస్తుంటారు. వేగంగా నడుస్తుంటారు. అలాంటి వారు ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. చాలా కఠిన మైన నియమాలు పెట్టుకుని వాకింగ్‌ చేస్తున్నా.. తిండి ఆపకపోతే వారు అనుకున్న ఫలితాన్ని సాధించలేరు. వాకింగ్‌ చేసిన పెద్దగా ప్రయోజనం ఉండదు. మరీ ముఖ్యంగా కొంతమంది అవసరం లేకపోయినా అదే పనిగా తింటూ ఉంటారు. వీరు తినే ఆహారం కూడా ఎక్కు వగా జంక్‌ ఫుడే అయి ఉంటుంది. ఇలాంటివారు ఎంతగా వాకింగ్‌ చేసినా.. బరువు తగ్గటం అంటూ ఉండదు. ఆహారాన్ని అదుపులో పెట్టుకోకపోతే శ్రమంతా వృథా అయిపోతుంది. వాకింగ్‌ చేసినా.. బరువు తగ్గాలనుకున్నా.. ఆహార నియమాలు తప్పకుండా పాటించాలి.

బరువు తగ్గాలనుకునే వారు ఎంత సేపు నడవాలి..?: బరువు తగ్గాలనుకునే వారు రోజుకు అరగంట పాటు నడవాలి. అలా నడుస్తున్నకొద్ది రెండు నెలల్లో బరువు అనేది తగ్గడం మొదలవుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే తప్పనిసరిగా ఆ నడక వేగంగా ఉండాలి. కొంతమంది ఒక వారం రెండువారాలు నడిచి ఇంకా బరువు తగ్గటం లేదని నిరాశపడి వాకింగ్‌ చేయడం మానేస్తుంటారు. అలా చేయకూడదు. శరీరంలో పేరుకున్న కొవ్వు కరగాలంటే కొంత సమయం పడుతుంది. ఒపికతో క్రమం తప్పకుండా వాకింగ్‌ చేస్తుండాలి. తర్వాత ఫలితం ఉంటుంది.

రివర్స్‌ నడవడం వల్ల..: వాకింగ్‌ చేసేవారు మలుపుల్లో నడిస్తే ఇంకా మంచిదంటున్నారు నిపుణులు. నడిచేటప్పుడు నేరుగా ఉన్న రోడ్డుమీద కాకుండా మలుపులు ఉన్న బాటలో నడిస్తే మరింత ఎక్కువగా కేలరీలు ఖర్చవుతాయట. అలాగే ముందుకు కాకుండా వెనక్కు నడిస్తే మరింత మంచి ఫలితాన్ని పొందవచ్చట. వెనక్కు నడిస్తే మన గుండె వేగం మరింత ఎక్కువగా ఉంటుందట. దాంతో సాధారణ నడకతో కంటే ఈ రివర్స్‌ నడకతో గుండెకు మరింత మేలు జరుగుతుందని చెబుతున్నారు. అలాగే ఎక్కువ కేలరీలు సైతం ఖర్చవుతాయి. వెనుక నుండి వాహనాలు రావనే నమ్మకం ఉన్న ప్రదేశాల్లో కొంత సమయం ఇలా నడవవచ్చు.

మధుమేహం.. గుండె జబ్బులున్నవారికి..: ప్రతి రోజు వాకింగ్‌ చేయడం వల్ల డయాబెటిస్‌ ఉన్న వారికి మరి మంచిది. ప్రతి రోజు క్రమం తప్పకుండా వాకింగ్‌ చేస్తే షుగర్‌ వ్యాధి అదుపులో ఉంటుంది. అలాగే గుండె జబ్బులున్నవారికి ఎంతో మేలు అని వైద్య నిపుణులు చెబుతున్నారు. వాకింగ్‌ అనేది ఒక్క బరువు తగ్గడానికే కాకుండా ఎన్నో వ్యాధులను దూరం చేస్తుంది. శరీరం హుషారుగా ఉండేటట్లు చేస్తుంది. క్రమం తప్పకుండా వాకింగ్‌ చేసిన వారు చురుకుగా ఉంటారు.

(నోట్‌: అందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వైద్య నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించండి.)

Tinda Benefits: చాలామందికి తెలియని కూరగాయ టిండా.. వేసవిలో షుగర్ పేషేంట్స్‌కు బెస్ట్ ఆహారం..

Tinda Benefits: చాలామందికి తెలియని కూరగాయ దిల్ పసంద్(Dil pasand),టిండా, ఇండియన్ బేబీ పంప్కిన్ (Indina Baby Pumpkin) అని కూడా అంటారు. ఇది షుగర్ పేషేంట్స్ కు బెస్ట్ ఎంపిక.
వేసవి సాగు చేసే కూరగాయ ఈ టిండా. రైతులు మేలైన టిండా విత్తడం ద్వారా లాభాలను పొందవచ్చని.. వ్యవసాయ సాగు పద్ధతుల గురించి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు, అధికారులు చెబుతున్నారు. వీరు చెప్పిన పద్ధతిలో టిండాను సాగు చేస్తే.. వ్యవసాయంలో లాభాలు పొందవచ్చు. వేడి , తేమతో కూడిన వాతావరణం టిండా సాగుకు అనుకూలం. అందుకనే వేసవిలో మాత్రమే దీనిని సాగు చేస్తారు. తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే అన్ని రకాల మట్టిలో సాగు చేయవచ్చు. అయితే మంచి నీటి నిల్వ సామర్థ్యం కలిగిన తేలికపాటి లోమీ నేల టిండా సాగుకు మంచి ఎంపిక.

టిండా ను ఏడాదికి రెండు సార్లు సాగు చేసుకోవచ్చు. ఫిబ్రవరి నుండి మార్చి వరకు , జూన్ నుండి జూలై వరకూ అనుకూల సమయం. దిగుబడి కోసం మేలైన రకాల టిండా విత్తనాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. టిండా పంట సాధారణంగా రెండు నెలల్లో పక్వానికి సిద్ధంగా ఉంటుంది.

దిల్ పసంద్ (టిండా) వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయి. దీనిని ఆయుర్వేద ఔషధాల్లోనూ కూడా వాడుతువుంటారు. ఇంకా చాలా ప్రయోజనాలు వున్నాయి.

బరువు తగ్గడం కోసం: టిండాలో కేలరీలు తక్కువగా ఉంటాయి. పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో నీటి కంటెంట్, డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది తినాలనే కోరికను నియంత్రిస్తుంది. కొవ్వును బర్న్ చేయడంలో సహాయపడుతుంది.

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: టిండాలో కొవ్వు , కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. ఇది గుండెలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. గుండె కండరాల పనితీరు సరైన విధంగా ఉండేలా చేస్తుంది. అధిక కొలెస్ట్రాల్ లేదా గుండె సమస్యలు ఉన్నవారు ఆరోగ్యకరమైన గుండె కోసం టిండాను వారి రోజువారీ ఆహారంలో చేర్చుకోవచ్చు.

జీర్ణవ్యవస్థకు మంచిది:టిండాలో పుష్కలంగా ఉండే ఫైబర్ కంటెంట్ మలబద్ధకం, ఉబ్బరం, కడుపు తిమ్మిరిని నివారిస్తుంది. ఇందులో ఉండే లాక్సిటివ్‌లు ప్రేగు కదలికలను క్రమబద్ధీకరించి, పేగును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: టిండాలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంది. ఇది కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా అవసరం. ఇందులో కెరోటినాయిడ్స్ యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉన్నాయి. లుటీన్, జియాక్సంతిన్, ఇవి రెటీనాలో కీలకమైన భాగాలు.. సున్నితమైన కంటి అవయవాలను రక్షిస్తాయి.

క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది: టిండాలో పాలీఫెనాల్ , కుకుర్బిటాసిన్ యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. అదనంగా, ఈ బయోయాక్టివ్ భాగాలు శరీరం ముఖ్యమైన అవయవాలను హానికరమైన ఫ్రీ రాడికల్స్ , క్యాన్సర్ కలిగించే టాక్సిన్స్ నుండి రక్షిస్తాయి.

Cardamom : ఎంతో ఖరీదు ఉండే యాలకులు.. వీటిని ఇంట్లోనే ఇలా సులభంగా పండించండి..!

Cardamom : మనం ఇంట్లో ఎక్కువగా కూరగాయలు, పండ్లు, పూల మొక్కలను పెంచుకుంటూ ఉంటాం. ఎటువంటి రసాయనాలను వాడకుండా సహజ సిద్దమైన పద్దతిలో పండించుకున్న కూరగాయలను, పండ్లను తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది.
ఇలా కూరగాయలను, పండ్లను పండించుకుని తినడం వల్ల ఖర్చు కూడా తగ్గుతుంది. ఇక మనం వంటల్లో మసాలా దినుసులను కూడా వాడుతూ ఉంటాం. అయితే ఈ మసాలా దినుసుల మొక్కలను మనం ఇంట్లో పెంచుకోలేము అని అందరూ అనుకుంటారు. కానీ మసాలా దినుసులలో ఒకటి అయిన యాలకులను మనం ఇంట్లో చాలా సులువుగా పెంచుకోవచ్చు. ఇంట్లో యాలకుల మొక్కలను ఏ విధంగా పెంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా యాలకులను తీసుకుని వాటి నుండి గింజలను తీసి 12 గంటల పాటు నీటిలో నానబెట్టుకోవాలి. గింజలు నానిన తరువాత తడి లేకుండా తుడిచి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం సాధారణంగా ఇంట్లో మొక్కలను పెంచడానికి వాడే మట్టిని, ఇసుకను సమపాళల్లో తీసుకుని కుండీలో కానీ, ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసుకోవాలి. ప్లాస్టిక్ డబ్బాను వాడే వారు డబ్బా అడుగు భాగంలో రంధ్రాలు చేసుకోవాలి. కుండీలో లేదా డబ్బాలో వేసుకున్న మట్టిలో తగినన్ని నీళ్లను పోసి మట్టిని తడి గా చేసుకోవాలి. ఇప్పుడు పక్కకు పెట్టుకున్న యాలకుల గింజలను తీసి మట్టి పై చల్లుకోవాలి.

ఇలా చల్లిన గింజలపై మళ్లీ మట్టిని వేసుకోవాలి. ఇలా వేసుకున్న మట్టిపై కొద్దిగా నీటిని చల్లి కొద్దిగా ఎండ తగిలే ప్రదేశంలో ఉంచాలి. మట్టి తడి ఆరిపోయినప్పుడల్లా నీటిని చల్లుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల యాలకుల మొలకలు వస్తాయి. తరువాత మొక్కలు పెరుగుతాయి. ఇలా మనం యాలకుల మొక్కలను ఇంట్లోనే పెంచుకోవచ్చు.

యాలకుల మొక్కలకు ఉన్న వేరు వ్యవస్థ వల్ల అవి ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి. యాలకులను వంటల్లో వాడడం వల్ల వంట రుచి పెరగడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి.

Ragi Sangati : రాగి సంగటిని తయారు చేయడం సులభమే.. ఎంతో బలవర్ధకమైంది.. రోజూ తినాలి..!

Ragi Sangati : ప్రస్తుత తరుణంలో మనం రోజూ తీసుకుంటున్న ఆహారాల్లో వచ్చిన మార్పుల కారణంగా మనం అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నాం.
ఈ సమస్యల నుండి బయట పడడానికి మళ్లీ మనం చిరు ధాన్యాలను, వాటితో చేసే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటున్నాం. ఈ చిరు ధాన్యాలల్లో రాగులు ఒకటి. ఈ రాగుల వల్ల కలిగే ప్రయోజనాలు మనందరికీ తెలుసు. బరువు తగ్గడంలో, షుగర్‌, బీపీ వంటి వ్యాధులను నియంత్రించడంలో రాగులు ఎంతగానో సహాయపడతాయి. ఈ రాగులతో తయారు చేసే ఆహార పదార్థాలలో రాగి సంగటి ఒకటి. రాగి సంగటిని తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఈ రాగి సంగటిని ఎలా తయారు చేయాలి, దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Ragi Sangati
రాగి సంగటి తయారీకి కావల్సిన పదార్థాలు..

బియ్యం – ఒక కప్పు, రాగి పిండి – ఒక కప్పు, నీళ్లు -5 కప్పులు, ఉప్పు – ఒక టీ స్పూన్‌.

రాగి సంగటి తయారీ విధానం..

ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి అర గంట పాటు నానబెట్టుకోవాలి. రాగి పిండిలో కొద్ది కొద్దిగా నీటిని పోస్తూ ఉండలు లేకుండా కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు బియ్యాన్ని తీసుకున్న కప్పు పరిమాణంతో 5 కప్పుల నీటిని ఒక గిన్నెలో పోసి బాగా వేడి చేయాలి. ఈ నీళ్లు వేడి అయిన తరువాత ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి ఉడికించుకోవాలి. ఈ బియ్యం 60 శాతం ఉడికిన తరువాత ఉండలు లేకుండా కలిపి పెట్టుకున్న రాగి పిండిని వేసి బాగా కలిపి మూత పెట్టి, మధ్యస్థ మంటపై ఉడికించుకోవాలి. ఇలా అన్నం పూర్తిగా ఉడికిన తరువాత ఒక గంటెను కానీ, పప్పు గుత్తిని కానీ తీసుకుని అన్నాన్ని మెత్తగా చేయాలి. ఇలా చేసిన తరువాత మూత పెట్టి, చిన్న మంటపై 5 నిమిషాల పాటు ఉంచి తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న రాగి సంగటిని చేతికి నెయ్యిని రాసుకుంటూ ముద్దలుగా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రాగి సంగటి త్వరగా చల్లగా అవ్వకుండా ఉంటుంది. మాంసాహారం తినని వాళ్లు దీనిని పప్పు, సాంబార్‌తో కలిపి తీసుకోవచ్చు. నాటు కోడితో చేసిన పులుసుతో రాగి సంగటిని కలిపి తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. దీనితోపాటుగా రాగులల్లో ఉండే పోషకాలు కూడా శరీరానికి లభిస్తాయి. దీంతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. పైగా రాగి సంగటిని ఇలా తయారు చేసి వేసవిలో తీసుకుంటే శరీరం కూడా చల్లగా ఉంటుంది. వేసవి తాపం నుంచి బయట పడవచ్చు. ఎండ దెబ్బ తగలకుండా ఉంటుంది.

Chanakya Niti: మనిషి సంతోషంగా ఉండాలన్నా.. సక్సెస్ అందుకోవాలన్నా.. ఈ 4 విషయాలను గుర్తుంచుకోమన్న చాణక్య

 Chanakya Niti: ఆచార్య చాణక్యుడు (Acharya Chanakya) గొప్ప వ్యూహకర్త. తక్షశిల లో అధ్యాపకుడిగా పనిచేశారు. అంతేకాదు ఎన్నో పుస్తకాలను రాశారు. ముఖ్యంగా చాణుక్యుడు తాను రచించిన నీతి శాస్త్రం (Niti shastra) లో వ్యక్తి జీవితానికి సంబంధించిన అనేక విషయాలను ప్రస్తావించాడు.

నీతిశాస్త్రంలో చెప్పిన విషయాలను అనుసరించడం ద్వారా ఒక వ్యక్తి తన జీవితాన్ని ప్రశాంతంగా గడపవచ్చు. ఆచార్య చాణక్యుడు జీవితంలోని అన్ని రకాల సమస్యలను అధిగమించే మార్గాన్ని నీతి శాస్త్రంలో చూపించాడు. మనిషి సంతోషంగా ఉండటానికి, ప్రతికూలత నుంచి బయటపడడానికి ఒక వ్యక్తి కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలని.. వారికీ వీలైనంత దూరంగా ఉండాలని చాణక్య చూచించాడు. అవి ఏమిటో చూద్దాం..

దూషించే వ్యక్తులు: చాణక్య నీతి ప్రకారం.. మన మంచిని కోరుకోని.. మనల్ని ఎల్లపుడూ చెడు కోరుకుంటూ శపించే వ్యక్తితో ఎప్పుడూ జీవించకూడదు. అలాంటి వ్యక్తి మీలో ప్రతికూలతను కూడా సృష్టించగలడు. అంతేకాదు ఎదుటివారు చేదుకొరుకునే వ్యక్తి.. తాను ఎప్పుడూ దుఃఖంలో మునిగి ఉంటాడు. వారు ఎవరినీ సంతోషపెట్టలేరు. అందువల్ల, మీ ఆనందాన్ని సంతోషాన్ని కాపాడుకోవడానికి.. అలాంటి వ్యక్తులను దూరంగా ఉంచడం మేలు అంటున్నాడు చాణక్య.

మూర్ఖులతో జీవించకండి: చాణక్య నీతి ప్రకారం.. మూర్ఖులతో కలిసి జీవించకూడదు. మూర్ఖులకు దేనినీ వివరించే ప్రయత్నం చేయకూడదు. ఇది మీ సమయాన్ని వృధా చేస్తుంది. ఎందుకంటే మూర్ఖులు ఎవరి మాట వినరు. తమ మాట మాత్రమే సరైనది అంటారు. అతని మాటలు సరైనవి కాదని ఎంత వివరించేందుకు ప్రయత్నించినా ఫలితం ఉండదు. మూర్ఖులు ఎవరి మాట వినరు. కనుక అటువంటి వారితో సమయం గడపడం ఎవరికైనా హానికరం. అలాంటి వారితో మాట్లాడటం మీ శక్తిని వృధా చేసినట్లే.

చెడు ఆలోచనలు కలిగిన స్త్రీ: చెడు ఆలోచనలు ఉన్న మహిళలకు దూరంగా ఉండాలి. అలాంటి మహిళల వలన ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉంటాయి. అంతేకాదు అలాంటి మహిళలు మీ జీవితంలో ఇబ్బందులను కలిగించవచ్చు. కనుక చెడు ఆలోచనల నుండి ఎల్లప్పుడూ దూరం ఉండండి. అంతేకాదు అలాంటి స్త్రీకి సహాయం చేయడం కూడా మీకు హానికరం. మీరు చేసే సహాయాన్ని తప్పుగా ఉపయోగించుకోవచ్చు… కనుక అలంటి మహిళలకు ఎంత దూరం ఉంటె అంత మంచిది.

మూర్ఖుడైన శిష్యుడు: గురువు తన శిష్యుడిని జీవితంలో ముందుకు సాగడానికి, అతని లక్ష్యాలను సాధించడానికి ప్రేరేపిస్తాడు. గురువు తన శిష్యుడికి ప్రతి కష్టాన్ని ఎలా అధిగమించాలో నేర్పుతారు. కానీ గురువుకు మూర్ఖుడైన శిష్యుడు దొరికితే, జ్ఞాని అయిన ఋషి కూడా అతనికి ఏమీ బోధించలేడు. అలాంటి శిష్యుడి వల్ల గురువుకున్న ఇమేజ్ కూడా చెడిపోతుంది.

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మతపరమైన, నమ్మకం, విశ్వాసాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇది సాధారణ ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

Paytm Bank Ban: పేటీయం బ్యాంకుపై ఆర్బీఐ నిషేధం – మీరు వాడుతూ ఉంటే జాగ్రత్త!

Paytm Payment Bank: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) 2024 ఫిబ్రవరి 29వ తేదీ నుంచి పేటీయం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL)పై నిషేధాన్ని ప్రకటించింది.
2024 ఫిబ్రవరి 29వ తేదీ నుంచి పేటీయం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ కొత్తగా కస్టమర్లను ఆన్బోర్డింగ్ చేయడం, వినియోగదారుల ఖాతాలు, వాలెట్లు, ఫాస్టాగ్ల్లో డిపాజిట్లు, టాప్ అప్ చేయకుండా నిషేధించారు.

అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వెబ్సైట్లో పేటీఎంకు సంబంధించిన కొన్ని సేవలను అనుమతిస్తారని తెలిపారు. వినియోగదారులు వాలెట్లో మిగిలిన బ్యాలెన్స్ను వారి సేవింగ్స్ ఖాతాకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ‘నిబంధనలు సరిగ్గా పాటించకపోవడం, బ్యాంకులో మెటీరియల్ పర్యవేక్షణపై ఆందోళనలు తలెత్తడం’ కారణంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. ఎక్స్టర్నల్ పార్టీలు కంపెనీ సిస్టంలపై చేసిన ఆడిట్లో ఈ వివరాలు వెల్లడయ్యాయని ప్రకటించింది.
దీనికి సంబంధించిన ప్రెస్ రిలీజ్ను ఆర్బీఐ జనవరి 31వ తేదీన విడుదల చేసింది. పేటీయం వాలెట్ యూజర్లు దీని కారణంగా కాస్త ఇబ్బంది పడనున్నారు. ఒకసారి గణాంకాలు పరిశీలిస్తే 2018లో దాదాపు మూడు కోట్ల మంది పేటీయం ద్వారా చెల్లింపులు జరిపేవారు. అక్కడి నుంచి ఈ సంఖ్య పెరుగుతూనే వచ్చింది. ఇప్పుడు బ్యాన్ అయింది కాబట్టి వినియోగదారులు వేరే ఆప్షన్లు పరిశీలించక తప్పదు.

ఆర్బీఐ వెబ్సైట్ ప్రకారం పేటీయం కస్టమర్లు సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలు, కరెంట్ ఖాతాలు, ప్రీపెయిడ్ సాధనాలు, ఫాస్టాగ్, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్లలో ఎలాంటి పరిమితి లేకుండా మిగిలిన బ్యాలెన్స్ను విత్ డ్రా చేసుకోవచ్చు లేదా ఉపయోగించుకోవచ్చు.
అన్ని పైప్లైన్ లావాదేవీలు, నోడల్ ఖాతాల (ఫిబ్రవరి 29న లేదా అంతకు ముందు ప్రారంభించిన అన్ని లావాదేవీలకు సంబంధించి) లావాదేవీలను పూర్తి చేసే సమయం మార్చి 15వ తేదీ వరకు పొడిగిస్తామని ఆర్బీఐ జారీ చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. ఆ తర్వాత ఎలాంటి లావాదేవీలు జరగడానికి అవకాశం ఉండదు.

పేటీయం బదులుగా ఏ యాప్లు ఉపయోగించాలి?
భారతదేశంలో ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు చేసేవారికి పేటీయం ఒక పెద్ద ఆప్షన్. పేటీయం ద్వారా ప్రతిరోజూ లక్షలాది మంది చెల్లింపులు చేస్తారు. అటువంటి పరిస్థితిలో పేటీయం పేమెంట్స్ బ్యాంక్ అందించే చాలా ఫీచర్లు నిషేధించిన తర్వాత వినియోగదారులు ఇతర పేమెంట్ యాప్లు, ప్లాట్ఫారమ్లను తప్పక ఉపయోగించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 29వ తేదీ నుంచి ఆన్లైన్ చెల్లింపుల కోసం ఉపయోగించే కొన్ని ప్రధాన చెల్లింపు ప్లాట్ఫారమ్ల జాబితాను చూద్దాం.

1. ఫోన్పే (PhonePe)
2. గూగుల్ పే (Google Pay)
3. అమెజాన్ పే (AmazonPay)
4. వాట్సాప్ పే (WhatsApp Pay)
5. మొబిక్విక్ (Mobikwik)
6. ఫ్రీ ఛార్జ్ (Free Charge)
7. ఎయిర్టెల్ మనీ (Airtel Money)
8. జియో మనీ (Jio Money)

కస్టమర్లకు భారీ గుడ్‌న్యూస్ చెప్పిన ఫ్లిప్‌కార్ట్.. బుకింగ్ రోజే డెలివరీ

ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పింది. కస్టమర్లు ప్రొడక్ట్‌లను బుకింగ్ చేసిన రోజే డెలివరీలను అందించనున్నట్లు ప్రకటించింది.
ఈ సదుపాయం మొదట్లో దేశంలోని ఎంపిక చేసిన నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత దేశం అంతటా ఈ సేవను విస్తరించి, బుకింగ్ చేసిన అదే రోజు డెలివరీ చేస్తామని అధికారులు తెలిపారు.

ఫిబ్రవరి నెలలో ఈ సదుపాయం ప్రారంభమవుతుందని కంపెనీ పేర్కొంది. మొదట 20 నగరాల్లో ఇది అందుబాటులోకి వస్తుంది. హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, భువనేశ్వర్, కోయంబత్తూరు, చెన్నై, ఢిల్లీ, గౌహతి, ఇండోర్, జైపూర్, కోల్‌కతా, లక్నో, లూథియానా, ముంబై, నాగ్‌పూర్, పూణే, పాట్నా, రాయ్‌పూర్, సిలిగురి, విజయవాడలలోని కస్టమర్లకు ఇది అందుబాటులోకి వస్తుంది.

వినియోగదారులు ఒకే రోజు డెలివరీని పొందడానికి, అర్హత ఉన్న వస్తువును మధ్యాహ్నం 1 గంటలోపు ఆర్డర్‌ను చేయవలసి ఉంటుందని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. ఆ వస్తువును 12am (అర్ధరాత్రి) లోపు డెలివరీ చేస్తామని కస్టమర్‌కు హామీ ఇస్తుంది. ఒకవేళ మధ్యాహ్నం 1 గంట తర్వాత చేసిన ఆర్డర్‌ చేసిన వాటిని మాత్రం మరుసటి రోజు డెలివరీ చేస్తామని కంపెనీ తెలిపింది.

ఈ సదుపాయం దేశ వ్యాప్తంగా అందుబాటులోకి రావడానికి కొన్ని నెలలు పడుతుంది. అప్పటి వరకు ఈ నగారాల్లో ఈ సేవను వినియోగించుకోవచ్చు, మొబైల్‌లు, ఫ్యాషన్, బ్యూటీ వస్తువులు, లైఫ్‌స్టైల్ ఉత్పత్తులు, పుస్తకాలు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్‌తో సహా అనేక ఉత్పత్తులు ఒకే రోజు డెలివరీకి అర్హత పొందుతాయని సంస్థ తెలిపింది.

Srimanthudu: నా నవల నుంచి సీన్ టు సీన్ కాపీ కొట్టారు.. కొరటాల జైలుకు వెళ్లాల్సిందే!

Novel Writer Sarath Chandra Demands Jail to koratala Siva: కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన శ్రీమంతుడు సినిమా తాను రాసిన నవలకు కాపీ అని శరత్ చంద్ర అనే రచయిత కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
కొరటాల శివ, నిర్మాత నవీన్ ఎర్నేని, మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ సంస్థల మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆయన నాంపల్లి కోర్టును కోరారు. అయితే కొరటాల శివ కాపీ చేశారు కాబట్టి ఆయన మీద చర్యలు తీసుకోగలరు కానీ నిర్మాతల మీద చర్యలు తీసుకోలేమని నాంపల్లి కోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పు మీద కొరటాల శివ హైకోర్టును ఆశ్రయించారు. తన మీద ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసుకోకుండా చూడాలని కోరారు అయితే చట్టబద్ధంగా విచారణ జరుగుతుందని కోర్టు తేల్చి చెప్పింది.
ఈ విషయం మీద సుప్రీం కోర్టుని కూడా కొరటాల శివ ఆశ్రయించగా అక్కడ కూడా ఆయనకు చుక్కెదురయింది. ఈ నేపథ్యంలో రచయిత శరత్ చంద్రని పలు మీడియా సంస్థలు ఇంటర్వ్యూ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఈ వ్యవహారం గురించి ఓపెన్ అయ్యారు. తాను రాసిన నవల నుంచి సీన్ టు సీన్ కాపీ కొట్టారని, నేను దేవరకొండ అనే గ్రామంలో కథ జరుగుతున్నట్లు రాస్తే ఒక అక్షరం మార్చి దాన్ని దేవరకోట చేశారని చెప్పుకొచ్చారు. ఇప్పటికి కూడా వాళ్లు నాకు 15 లక్షలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు కానీ నాకు ఆ డబ్బు వద్దని అన్నారు. కొరటాల శివ తన తప్పు ఒప్పుకొని జైలుకు వెళ్లాల్సిందేనని, అలాగే ఇలా కాపీ కొట్టారు కాబట్టి సినీ పెద్దలు కల్పించుకుని అతను ఇక మీదట సినిమాలు చేయకుండా బహిష్కరించాలని శరత్ చంద్ర డిమాండ్ చేశారు. అలాగే నా మేధో సంపత్తి వాడుకొని సినిమా చేసి కోట్లు సంపాదించారు కాబట్టి న్యాయంగా నాకు రావలసిన డబ్బు కచ్చితంగా నేను కోరుకుంటా, వాళ్ళు ఇవ్వడానికి రెడీగా లేనప్పుడు అది కోర్టు ద్వారా సాధించుకుంటానని ఆయన పేర్కొన్నారు.

AP Registration Servers Down : ఏపీలో నిలిచిన రిజిస్ట్రేషన్లు, మళ్లీ సర్వర్లు డౌన్!

AP Registrations: ఏపీలో రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సాంకేతిక సమస్యలు నెలకొనడంతో రిజిస్ట్రేషన్‌ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. సర్వర్లు రెండు రోజులుగా మొరాయిస్తుండడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి.
కాసేపు రిజిస్ట్రేషన్లు జరిగితే కాసేపు నిలిచి పోతున్నాయి. అప్లికేషన్ ఓపెన్ అవకపోవటంతో ప్రక్రియ ముందుకు కదలడం లేదు. తాజాగా ఇవాళ సర్వర్లు పూర్తిగా షట్‌డౌన్‌ అయ్యాయి. సర్వర్లు షట్‌డౌన్‌ కావడంతో రిజిస్ట్రేషన్‌ సేవలకు అంతరాయం కలిగింది. రిజిస్ట్రేషన్లు ఆగిపోవడంతో వినియోగదారులు ఆందోళనకు గురవుతున్నారు.
ఉదాహరణకి పటమట రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రోజుకి 70 నుంచి 80 రిజిస్ట్రేషన్లు అవ్వాల్సి ఉండగా 30 నుంచి 40 అవుతున్న పరిస్థితి నెలకొంది. సాంకేతిక సమస్యను ఎప్పటికప్పుడు హెడ్ ఆఫీసుకు సిబ్బంది మెయిల్ చేస్తున్నారు. వారం నుంచి ఇదే సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సాంకేతిక సమస్య పరిష్కరించే పనిని ఎప్పటికప్పుడు టెక్నికల్ టీం చేస్తోంది. త్వరగా ఈ సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

300 యూనిట్ల కరెంట్ ఫ్రీ – నిర్మలా సీతారామన్‌

దేశంలో కోటీ ఇండ్లపై రూఫ్ ఆఫ్ సోలార్ సెట్ అప్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ప్రతి ఇంటికి 3 యూనిట్ల సోలార్ విద్యుత్ ఉచితంగా అందిస్తామని బడ్జెట్లో ప్రకటన చేశారు నిర్మల సీతారామన్. దీంతో ప్రతి కుటుంబానికి ఏటా 15 వేల నుంచి 18 వేల రూపాయలు ఆదా అవుతుందని వివరించారు. వినియోగం పొగ మిగిలిన విద్యుత్తును పంపిణీ సంస్థలకు విక్రయించవచ్చని తెలిపారు.

ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం, దేశాల మధ్య ఉద్రిక్తతలు ప్రపంచ వాణిజ్యాన్ని క్లిష్టతరం చేస్తున్నాయని తెలిపారు. అనేక కొత్త సవాళ్ల మధ్య భారత్‌ నూతన మార్గాన్ని అన్వేషిస్తోందని వెల్లడించారు. పశ్చిమాసియా, యూరప్‌లో ఉన్న యుద్ధ వాతావరణం కొత్త సవాళ్లను మన ముందుంచిందని పేర్కొన్నారు. సవాళ్లను ఎదుర్కొని ప్రపంచాన్ని కొత్త మార్గంలో వెళ్లే దిశగా భారత్ సుదృఢమైన పాత్రను పోషిస్తోందని వివరించారు.

AP | ఏపీ స్కూళ్లలో వచ్చే ఏడాది నుంచి ఐబీ సిలబస్..

ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి అంతర్జాతీయ ఐబీ సిలబస్ ప్రవేశపెట్టేందుకు వీలుగా ప్రభుత్వం ఇవ్వాల చారిత్రక ఒప్పందం చేసుకుంది. ఐబీతో ఏపీ ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు సీఎం జగన్ సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.
దీంతో వచ్చే ఏడాది నుంచి ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు క్రమంగా ఈ సిలబస్‌ను ప్రవేశపెట్టేందుకు ఐబీ ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేయనుంది.

ఏపీ స్కూళ్లలో అంతర్జాతీయ సిలబస్ ప్రవేశపెట్టడానికి ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న ఐబీ డైరెక్టర్ జనరల్ ఓలీ పెక్కా చాలా సంతోషంగా ఉందన్నారు. ఏపీ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందంపై తాము నిబద్ధతతో పనిచేస్తామని, విద్యద్వారా ఉత్తమ ప్రపంచాన్ని, శాంతియుత ప్రపంచాన్ని నిర్మించాలన్నది తమ లక్ష్యమని తెలిపారు. ఇంత పెద్దస్థాయిలో తమ సంస్థ భాగస్వామ్యం కావడం అన్నది కూడా ఇదే ప్రథమం అన్నారు.

రాబోయే తరాలకు నాణ్యమైన విద్యను అందించాలన్నదే తమ ఉద్దేశం అన్నారు. ఇతర దేశాలకు, ప్రాంతాలకు ఈ ఒప్పందం ఒక స్ఫూర్తి కావాలన్నారు. తొలుత ప్లే బేస్డు లెర్నింగ్‌ విధానంతో పిల్లల్లో ఆసక్తిని కలిగించేందుకు ఆర్ట్స్, సైన్స్, మ్యాథ్స్ తో పాటు మాతృ భాషల్లోనే కాకుండా పిల్లలు విదేశీ భాషలను నేర్చుకోవడంపైనా దృష్టిసారిస్తామని ఆయన తెలిపారు. దీనివల్ల కొత్త సామర్థ్యాలు వీరికి అలవడతాయన్నారు.

అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ . ఐబీని ప్రభుత్వ విద్యారంగంలో భాగస్వామ్యం చేయడం తమకు గొప్ప సంతృప్తి ఇస్తోందన్నారు. ఐబీతో భాగస్వామ్యం అత్యంత ముఖ్యమైనదని, ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు ప్రభుత్వ స్కూళ్లను ఐబీతో ఏకీకృతం చేయడం సంతృప్తినిచ్చే కార్యక్రమమన్నారు. నాణ్యమైన విద్యను భవిష్యత్తు తరాలకు అందించడం అన్నది చాలా ముఖ్యమన్నారు. భవిష్యత్తు తరాలు మంచి ఉద్యోగాలు సాధించాలన్నా, భవిష్యత్‌ ప్రపంచంలో నెంబర్‌వన్‌గా నిలవాలన్నా భారత్‌ లాంటి దేశాల్లో నాణ్యమైన విద్య అవసరమన్నారు.

బాలినేని కి వైసీపీ షాక్ – సీఎం జగన్ – సజ్జలపై బాలినేని ఫైర్

ఒంగోలు లోక్ సభ ఇన్చార్జ్‌గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియామకంపై బాలినేని శ్రీనివాసరెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. నిన్న చెవిరెడ్డికి పార్టీ బాధ్యతలు ఇచ్చేది లేదని బాలినేనికి చెప్పిన వైసీపీ పెద్దలు..
24 గంటలు గడవకముందే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రకాశం జిల్లా బాధ్యతలు అప్పగించారు. సీఎం జగన్, సజ్జల రామకృష్ణారెడ్డి తీరుపై భగ్గుమన్న మాజీ మంత్రి బాలినేని సింహపురి ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కి ఒంగోలు నుంచి హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. అనుచరుల ఫోన్లకు అందకుండా తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు.

కాగా వైసీపీ అధిష్టానం బాలినేని శ్రీనివాసుల రెడ్డికి షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రకాశం జిల్లా బాధ్యతలు అప్పగించడంతోపాటు ఒంగోలు పార్లమెంట్ స్థానంలో పోటీ చేసే అవకాశం ఇస్తారని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన సంకేతాలను బాలినేనికి వైసీపీ పెద్దలు ఇచ్చారు. అయితే ఒంగోలు నుంచి చెవిరెడ్డి పోటీని అంగీకరించనని స్పష్టం చేస్తూ.. విజయవాడలో వైసీపీ అధిష్టానం వద్ద పంచాయతీ పెట్టారు. దీంతో చెవిరెడ్డి ఒంగోలులో పోటీ చేసేందుకు అవకాశం ఇస్తామని, పార్టీ బాధ్యతలు అప్పగించమని చెప్పి బాలినేనిని బుజ్జగించారు. నిన్న ఒంగోలు చేరుకున్న బాలినేని.. ఇక్కడ పార్లమెంట్ స్థానంలో ఎవరు పోటీ చేస్తే నాకేంటి? తన పని తాను చూసుకుంటానని మీడియాతో అన్నారు. సాయంత్రానికే చెవిరెడ్డిని ఒంగోలు పార్లామెంట్ ఇన్చార్జ్‌గా నియమిస్తున్నట్లు వైసీపీ ప్రకటించింది. ఈ నేసథ్యంలో తనకు చెప్పిందొకటి.. చేసిందొకటి అంటూ బాలినేని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ హైదరాబాద్‌కు వెళ్లిపోయారు.

LPG Price Hike : బడ్జెట్‌కు ముందు సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన సిలిండర్ ధర

LPG Price Hike : బడ్జెట్‌కు కొన్ని గంటల ముందు ద్రవ్యోల్బణం షాక్ తగిలింది. ఎల్పీజీ సిలిండర్ ధర భారీగా పెరిగింది. చమురు మార్కెటింగ్ కంపెనీలు ఈ రోజు ఫిబ్రవరి 1 నుండి ఎల్పీజీ సిలిండర్ ధరను పెంచాయి.
19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరలో ఈ పెంపుదల చేశారు. గృహోపకరణాల వంటగ్యాస్ అంటే సబ్సిడీతో కూడిన 14 కిలోల ఎల్‌పిజి సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు.

దేశ రాజధాని ఢిల్లీలో ఎల్‌పీజీ సిలిండర్ ధర సిలిండర్‌పై రూ.14 పెరిగి రూ.1769.50కి చేరింది.
కోల్‌కతాలో ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.18 పెరిగి రూ.1887కి చేరుకుంది.
ముంబైలో ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.15 పెరిగి రూ.1723.50కి చేరుకుంది.
చెన్నైలో 19 కిలోల కమర్షియల్ ఎల్‌పిజి సిలిండర్ ధర రూ.12.50 పెరిగి రూ.1937కి చేరింది.

జనవరి 1న 19 కిలోల గ్యాస్‌ ధరలు తగ్గాయి.
ప్రభుత్వ చమురు కంపెనీలు జనవరి 1, 2024న 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను తగ్గించాయి. గత నెలలో ఎల్పీజీ సిలిండర్ ధర తగ్గింపు చాలా తక్కువగా ఉంది. దేశంలోని వివిధ నగరాల్లో జనవరిలో 19 కిలోల కమర్షియల్‌ ఎల్‌పిజి సిలిండర్‌ ధర కేవలం ఒకటిన్నర రూపాయలు మాత్రమే తగ్గింది. జనవరిలో కూడా 14 కిలోల డొమెస్టిక్ ఎల్‌పిజి సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. డొమెస్టిక్ ఎల్పీజీ రేటులో చివరి మార్పు 30 ఆగస్టు 2023న జరిగింది.

నేడు మధ్యంతర బడ్జెట్‌
దేశంలోని లోక్‌సభ ఎన్నికలకు ముందు, మోడీ ప్రభుత్వం రెండవ పర్యాయం చివరి బడ్జెట్‌ను ఈ రోజు సమర్పించనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉదయం 11 గంటలకు పార్లమెంటులో సమర్పించనున్నారు. ఎన్నికల ముందు బడ్జెట్‌ కావడంతో ఇది మధ్యంతర బడ్జెట్‌ కావడంతో పాటు రాబోయే కొద్ది నెలల ప్రభుత్వ ఆదాయ, వ్యయాల లెక్కలను ఇందులో సమర్పించనున్నారు. ఇది ఎన్నికల ముందు బడ్జెట్ కాబట్టి, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సమాజంలోని ప్రతి వర్గాల ఆకాంక్షలను నెరవేర్చడానికి ప్రయత్నించవచ్చు.

Champai Soren: తోటి కోడళ్ల పంచాయతీతో కుటుంబం దాటిన సీఎం పదవి

Champai Soren: రాజకీయాల్లో సీఎం పదవి రావడం అంటే అంత ఈజీ కాదు. అందులోనూ ప్రాంతీయ పార్టీలో అయితే వ్యవస్థాపక కుటుంబానికే ఆ పదవి వరిస్తుంటుంది. కుటుంబ సభ్యులను దాటుకొని బయటి వ్యక్తికి ఆ పదవి దక్కడం కష్టసాధ్యమే.
కానీ పార్టీ వ్యవస్థాపక కుటుంబ సభ్యుల్లో తోటి కోడళ్ల పంచాయతీ కారణంగా జార్ఘండ్ లో సీనియర్ నేత చంపై సోరెన్ సీఎం పదవి వరిస్తొంది. ఇది నిజంగా అదృష్టంగానే భావించాల్సి ఉంటుంది.

భూకుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో విచారణను ఎదుర్కొంటున్న ఝార్ఖండ్ సీం హేమంత్ సోరెన్ ను బుధవారం రాత్రి ఈడీ అధికారులు అరెస్టు చేశారు. అంతకు ముందు ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) సీనియర్ నేత, రవాణా శాఖ మంత్రి చంపై సోరెన్ ను జేఎంఎం సంకీర్ణ శాసనసభాపక్ష నేతగా ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. దీంతో కొత్త సీఎంగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.
తొలుత హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సొరెను సీఎం చేస్తారని ఊహాగానాలు వచ్చాయి. అయితే కల్పనా సొరెన్ సీఎం కాకుండా తోటి కోడలు సీతా సొరెన్ అడ్డుపుల్ల వేశారు. కల్పనా సొరెన్ ను ముఖ్యమంత్రిని చేసేందుకు తాను వ్యతిరేకమంటూ జేఎంఎం అధినేత శిబు సోరెన్ పెద్ద కోడలు ఎమ్మెల్యే సీతా సొరెన్ బహిరంగ ప్రకటన చేశారు.

ఎమ్మెల్యే గా ఎన్నిక కాని, రాజకీయ అనుభవం లేని కల్పననే సీఎంగా ఎందుకు..? పార్టీలో ఎంతో మంది సీనియర్ లు ఉండగా..ఆమె పేరునే ఎందుకు ప్రచారం చేస్తున్నారు..? కుటుంబం నుండే సీఎం ను ఎన్నుకోవాలంటే ఇంట్లో తానే సీనియర్.14 ఏళ్లుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాను అని ప్రకటించారు. హేమంత్ సోరెన్ భార్య కల్పన సొరెన్ ఎమ్మెల్యే కూడా కాదు. వదిన సీతా సొరెన్ 14 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నారు.
ఇప్పుడు ఆమె అభ్యంతరం చెప్పడంతో పార్టీకి మొదటి నుండి విధేయుడుగా ఉన్న సీనియర్ నేత చంపై సొరెన్ ను సీఎం అభ్యర్ధిగా ప్రతిపాదించారు. దీంతో పార్టీ శాసనసభా పక్ష నేతగా చంపై సొరెన్ ను ఎన్నుకున్నారు. ఇంతకూ చంపై సొరెన్ ఎవరు అంటే.. హేమంత్ సోరెన్ తండ్రి జేఎంఎం అధినేత శిబు సొరెన్ తో కలిసి పని చేశారు. పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు. హేమంత్ సొరెన్ కుటుంబానికి నమ్మకమైన నేతగా ఉన్నారు. త్వరలోనే ఝార్ఖండ్ సీఎంగా చెంపై సొరెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం… రేపటి నుంచే భారత్ బియ్యం (Bharat rice )

Bharat rice to hit market, with price tag of Rs 29/kg

To curb rise in prices, the government has decided to sell subsidised grain through retail outlets under the Bharat rice initiative from next week, sources said.

బియ్యం ధరలకు కేంద్ర ప్రభుత్వం కళ్లెం వేస్తూ నిర్ణయం తీసుకుంది. ధరల నియంత్రణ కోసం చర్యలు తీసుకుంది. రేపటి నుంచి మార్కెట్‌లోకి బియ్యం వస్తుంది.
దీనికి భారత్ రైస్ గా నామకరణం చేసింది. కిలో 29 రూపాయల చొప్పున భారత్ రైస్ ను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల సామాన్య, మధ్యతరగతి ప్రజలకు నాణ్యత కలిగిన బియ్యం తక్కువ ధరకే మార్కెట్ లో లభించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

భారత్ రైస్…రేపటి నుంచి మార్కెట్ లోకి వస్తున్న భారత్ రైస్ ను ఎక్కువ ధరకు విక్రయించినా, బ్లాక్ మార్కెట్ కు తరలించేందుకు ప్రయత్నించినా వారిపై కఠిన చర్యలు తప్పవని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఇటీవల బియ్యం ధరలు పెరగడంతో పేద, మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం భారత్ రైస్ ను అందుబాటులోకి తీసుకు రానుంది.

Income Tax – పన్ను చెల్లింపుదారులకు కేంద్రం గుడ్ న్యూస్

ఎన్నో ఆశలతో బడ్జెట్ ప్రసంగాన్ని వీక్షిస్తున్న పన్ను చెల్లింపుదారులకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు. గురువారం బడ్జెట్ ప్రసంగంలో భాగంగా ఆమె పార్లమెంట్‌లో మాట్లాడుతూ..
కొత్త ట్యాక్స్ విధానం ప్రవేశ పెట్టారు. ఈ నూతన విధానంతో ఏడాదికి రూ.7 లక్షల వరకు ట్యాక్స్ మినహాయింపు కల్పిస్తున్నట్లు తెలిపారు. అనుకూల ప్రకటనలు వస్తాయని ఆశించిన పన్ను చెల్లింపుదారులకు ఈ వార్త కాస్త ఉపశమనం ఇచ్చినట్లు తెలుస్తోంది.

కాగా, గత మధ్యంతర బడ్జెట్‌లోనూ 2019లో నాటి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కీలక ప్రకటనలు చేశారు. రూ.5 లక్షల వరకు వార్షిక ఆదాయం కలిగిన వారు ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని మధ్యంతర బడ్జెట్‌లో ప్రకటించారు. అలాగే రూ. 6.50 లక్షల వరకు ఆదాయం ఉన్న వ్యక్తులు ప్రావిడెంట్ ఫండ్స్, స్పెసిఫైడ్ సేవింగ్స్, ఇన్సూరెన్స్ మొదలైన వాటిలో పెట్టుబడులు పెడితే ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని ఉన్నాయని ఆయన చెప్పారు. తాజాగా.. ఈ సారి నిర్మలమ్మ బడ్జెట్‌లో ఏకంగా రూ.7 లక్షలకు పెంచుతూ కీలక ప్రకటన చేశారు.

ఫిబ్రవరి 27న సెలవు ప్రకటించిన ప్రభుత్వం

షబ్-ఎ-మెరాజ్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 27న సెలవు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన క్యాలెండర్‌లో, ఫిబ్రవరి 8న షబ్-ఎ-మెరాజ్‌కి సెలవు ప్రకటించినప్పటికీ ఇది సాధారణ సెలవులు కాకుండా ఐచ్ఛిక సెలవుల క్రింద చేర్చింది.
షబ్-ఇ-మెరాజ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలందరికీ పవిత్రమైన రోజు.

ఈ పర్వాన మస్జిద్ లకు దీపాలతో అలంకరిస్తారు. రాత్రంతా జాగారం జేస్తూ ప్రార్థనలు చేస్తారు. ఇస్రా, మేరాజ్ ల కథ వివరింపబడుతుంది. ఫిబ్రవరి 8 సాధారణ సెలవుదినం కానప్పటికీ, రాష్ట్రంలోని కొన్ని పాఠశాలలు వచ్చే గురువారం (ఫిబ్రవరి 8)మూసివేయబడతాయి. సాధారణంగా, రాష్ట్రంలోని మైనారిటీ విద్యాసంస్థలు షబ్-ఎ-మెరాజ్ మరుసటి రోజున సెలవు పాటిస్తారు.

BREAKING: 30 ఏళ్ల తరువాత జ్ఞానవాపిలో పూజలు ప్రారంభం..

జ్ఞానవాపీ మసీదు ప్రాంగణంలో పూజలు చేసుకునేందుకు వారణాసి కోర్టు హిందువులకు అనుమతిచ్చింది. వారంలోగా హిందువులు మసీదు ప్రాంగణంలో పూజలు చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని చేయాలని సంబంధిత అధికారులను కోర్టు ఆదేశించింది.
ఈ క్రమంలో ఇవాళ ఉదయం భక్తుల కోలాహలం నడుమ జ్ఞానవాపీ దగ్గర పూజలు ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామునే బేస్‌మెంట్‌లో అర్చకులు మందిరాన్ని పూర్తిగా శుభ్రం చేశారు. అనంతరం శివలింగానికి పూజలు చేయడం ప్రారంభించారు. పూజ పూర్తయిన వెంటనే భక్తులు ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా వాళ్లు మాట్లాడుతూ.. 30ఏళ్ల తరువాత పరమ శివుడు జ్ఞానవాపీలో పూజలు అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.

కాగా, ఉత్తరప్రదేశ్‌లోని జ్ఞానవాసీ మసీదు కేసు దేశంలో సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ మసీదు కింద ఆలయం ఉందని.. ఆలయాన్ని కూలగొట్టి ఈ మసీదును నిర్మించారని హిందువులు కోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు మసీదులో సర్వే చేసి నివేదిక ఇవ్వాలని ఏఎస్ఐ డిపార్ట్‌మెంట్‌ను న్యాయస్థానం ఆదేశించింది. మసీదులో సర్వే చేసిన ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ నివేదికను ఇటీవల కోర్టుకు సమర్పించింది. ఏఎస్ఐ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. మసీదు కింద ఆలయం ఉంది నిజమేనని.. ఆలయాన్ని కూలగొట్టే మసీదును నిర్మించినట్లు అధికారులు చేసిన సర్వేలో తేలింది. మసీదు కింద హిందువు దేవుళ్ల విగ్రహాలు, శాసనాలు సైతం లభ్యం అయ్యాయి. ఈ క్రమంలో మసీదు ప్రాంగణంలో హిందువులు పూజలు చేసేకునేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది.

Cheyuta NewRules: పెన్షన్‌ ఉంటే చేయూత లేనట్టే. కొత్త దరఖాస్తులకు బ్రేక్

Cheyuta NewRules: వైఎస్సార్‌ చేయూత పథకం లబ్దిదారులకు ప్రభుత్వం గండి కొట్టింది. కొత్త దరఖాస్తుల్లో నిబంధనల పేరిట భారీగా కోత విధించింది. ఇప్పటి వరకు ఈ పథకంలో సామాజిక పింఛన్లు పొందుతున్న వారికి కూడా లబ్ది చేకూర్చారు.
కొత్త దరఖాస్తుల్లో పెన్షనర్ల పేర్లను తొలగించారు. పెన్షన్ పొందుతున్న మహిళలను ఇకపై పథకానికి అనర్హులుగా పేర్కొన్నారు. వైఎస్సార్‌ చేయూత YSR Cheyuta పథకం ద్వారా ఆర్ధిక సహాయం కోసం రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్న వారు ఆర్ధిక సాయం కోసం కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్నారు.

తాజాగా ప్రభుత్వం లక్షలాది మహిళల ఆశలపై సర్కారు నీళ్లు చల్లింది. ఫిబ్రవరి మొదటి వారంలో చేయూత లబ్దిదారులకు నిధులు విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో వారం రోజుల పాటు పండగలా చేయూత నిధుల విడుదల కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వ యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో లబ్దిదారుల్లో సామాజిక పెన్షనర్లను మినహాయించారు.
ఏపీలో 45 నుంచి 60 ఏళ్ల లోపు వయసు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనార్టీ నిరుపేద మహిళలకు ఏడాదికి రూ.18,750 చొప్పున నాలుగేళ్లల్లో రూ.75 వేల ఆర్థిక సాయం చేసేలా YSR Cheyuta చేయూత పథకాన్ని ప్రకటించారు. 2020లో చేయూత అమలుకు జారీ చేసిన మార్గదర్శకాల్లో ‘వైఎస్ఆర్ పెన్షన్ కానుక’ లబ్దిదారులను చేయూత పథకం నుంచి మినహాయించినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత నిబంధనలను సడలించి వారికి కూడా వర్తింప చేశారు.

2023 జులై, ఆగస్టు నుంచి వాలంటీర్లు తమ పరిధిలో కొత్తగా 45 సంవత్సరాలు నిండిన మహిళలతో దరఖాస్తులు పెట్టించారు. కొత్తగా చేయూతకు దరఖాస్తు చేసుకున్న వారిలో పింఛనర్లకు అర్హత లేదని వారు పథకానికి అనర్హులని స్పష్టం చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షల్లో మహిళలు పథకానికి అనర్హులుగా మారారు.
చేయూత పథకం కోసం ఎదురు చూస్తున్నవారిలో ఎక్కువగా ఒంటరి మహిళలు, వితంతు పింఛన్‌దారులు ఉన్నారు. స్వయం ఉపాధి పథకాల కోసం ప్రభుత్వం ఇస్తున్న డబ్బును వినియోగిస్తున్నారు. తాజాగా పెన్షనర్లకు చేయూత మినహాయించాలనే నిర్ణయం వారికి అశనిపాతమైంది.

చేయూత పథకంలో పెన్షనర్లకుఅర్హత ఉంటుందా లేదా అనే విషయంలో స్పష్టత లేకపోవడంతో దరఖాస్తులు దారులు గందరగోళానికి గురవుతున్నారు. ఈ సంవత్సరం కొత్తగా దరఖాస్తు చేసుకున్న మహిళలు సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు. సరైన సమాధానం చెప్పకపోవడంతో ఆందోళ చెందుతున్నారు.
ప్రభుత్వం నిర్వహిస్తున్న టోల్‌ఫ్రీ కాల్‌ సెంటర్‌ను ఆశ్రయించిన వారికి దరఖాస్తుదారులు పెన్షన్లు పొందితే చేయూత పథకానికి అనర్హులని సమాధానం ఇస్తున్నారు. గతంలో చేయూత పథకం ద్వారా లబ్ది పొందిన వారికి మాత్రం ఈ సారి పథకం వర్తిస్తుందని వివరిస్తున్నారు.

చేయూత ఉద్దేశం ఇది…

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాల్లోని 45-60 సంవత్సరాల మధ్య వయసున్న మహిళలకు వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా ఏడాదికి రూ.18,750 రుపాయల ఆర్ధిక సాయం అందిస్తారు. నాలుగు విడతల్లో రూ.75వేల రుపాయల్ని మహిళల స్వావలంబన కోసం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2022 నాటికి రెండు విడతలుగా ఈ పథకం ద్వారా ఆర్ధిక లబ్ది కల్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 25లక్షల మంది మహిళలకు రూ.9,179.67కోట్ల రుపాయల్ని ప్రభుత్వం చెల్లించింది.

2022 సెప్టెంబర్ 22న రాష్ట్ర ప్రభుత్వం మూడో విడత వైఎస్సార్‌ చేయూత పథకంలో లబ్దిదారులకు నిధులు విడుదల చేసింది. చేయూత పథకంలో చేరాలని భావించే వారు కచ్చితంగా అర్హతులు కలిగి ఉండాలి. 45 ఏళ్ల వయసు తప్పనిసరి. అలాగే 60 ఏళ్ల వరకు వయసు కలిగిన వారు పథకంలో చేరొచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు మాత్రమే జగన్ ప్రభుత్వం అందిస్తున్న ఈ చేయూత స్కీమ్ వర్తిస్తుంది. అలాగే ఆధార్ కార్డులోని వయసును ప్రామాణికంగా తీసుకుంటారు. అందువల్ల ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.

వైఎస్సార్ చేయూత పథకంలో చేరాలని భావించే వారు కొన్ని డాక్యుమెంట్లను కచ్చితంగా కలిగి ఉండాలి. చిరునామా రుజువు, ఆధార్ కార్డ్ కుల ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ పత్రం, వయస్సు ధృవీకరణ, బ్యాంక్ ఖాతా పాస్‌బుక్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు మొబైల్ నంబర్, రేషన్ కార్డు ఉండాలి.

2023లో మూడో ఏడాది వైఎస్సార్‌ చేయూతలో 4949కోట్ల రుపాయల నగదును 26,39,706మంది మహిళల ఖాతాల్లోకి జమ చేశారు. గత ఏడాది చిత్తూరు జిల్లా కుప్పంలో నిర్వహించిన కార్యక్రమంలో సిఎం పాల్గొన్నారు. ఈ ఏడాది మాత్రం భారీగా లబ్దిదారుల్లో కోత విధిస్తారనే ప్రచారం మహిళల్ని ఆందోళనకు గురి చేస్తోంది.

New Rules: పింఛన్ నుంచి గ్యాస్ సిలిండర్ దాకా.. ఫిబ్రవరి 1 నుంచి మారే రూల్స్ ఇవే.. జేబుకు భారీగా చిల్లు పడే ఛాన్స్..!

Changes From 1 February 2024: దేశ బడ్జెట్ రేపు అంటే ఫిబ్రవరి 1న సమర్పించనున్నారు. కొత్త నెల ప్రారంభం కాబట్టి దేశంలో అనేక మార్పులు సర్వసాధారణం.
1వ తేదీ నుంచి దేశంలో అనేక నిబంధనలు మారుతున్నాయి. ఈ నియమాలు మీ జేబుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. ఫిబ్రవరి ప్రారంభం నుంచి, NPS ఉపసంహరణ, IMPS, గ్యాస్ సిలిండర్ ఛార్జీలతో సహా అనేక నియమాలు మారుతున్నాయి.

ఫిబ్రవరి 1 నుంచి PFRDA నుంచి నేషనల్ పెన్షన్ సిస్టమ్‌లో మార్పులు ఉంటాయి. నేషనల్ పెన్షన్ సిస్టమ్ కింద ఖాతాల ఉపసంహరణ నిబంధనలు మార్చారు. PFRDA జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం, కొత్త నిబంధనల ప్రకారం, NPS ఖాతాదారులు మొత్తం డిపాజిట్ చేసిన మొత్తంలో 25 శాతం కంటే ఎక్కువ విత్‌డ్రా చేయడానికి అనుమతించబడరు. ఇందులో ఖాతాదారు, యజమాని సహకారం మొత్తం ఉంటుంది. దీని ప్రకారం, మీకు ఇప్పటికే మీ పేరు మీద ఇల్లు ఉంటే, NPS ఖాతా నుంచి పాక్షిక ఉపసంహరణ అనుమతించబడదు.
ఫిబ్రవరి 1 నుంచి IMPS నిబంధనలలో పెద్ద మార్పు రాబోతోంది. ఇప్పుడు మీరు 1వ తేదీ నుంచి లబ్ధిదారుని పేరును జోడించకుండానే నేరుగా బ్యాంకు ఖాతాల మధ్య రూ. 5 లక్షల వరకు నిధులను బదిలీ చేయవచ్చు. NPCI అక్టోబర్ 31, 2023న సర్క్యులర్ జారీ చేసింది. బ్యాంక్ ఖాతా లావాదేవీలను వేగంగా, మరింత ఖచ్చితమైనదిగా చేయడానికి NPCI IMPS నియమాలను మార్చింది. NPCI ప్రకారం, మీరు గ్రహీత లేదా లబ్ధిదారుడి ఫోన్ నంబర్, బ్యాంక్ ఖాతా పేరును నమోదు చేయడం ద్వారా డబ్బు పంపవచ్చు.

SBI ప్రత్యేక గృహ రుణ ప్రచారాన్ని నిర్వహిస్తోంది. దీని కింద మీరు చౌక ధరలకు గృహ రుణం పొందవచ్చు. SBI వెబ్‌సైట్ ప్రకారం, ఈ ఆఫర్ కింద బ్యాంక్ 65 BPS వరకు తగ్గింపు ప్రయోజనాన్ని పొందుతోంది. ఈ తగ్గింపు Flexipay, NRI, శాలరీ క్లాస్‌తో సహా అన్ని గృహ రుణాలకు చెల్లుబాటు అవుతుంది.
పంజాబ్, సింధ్ బ్యాంక్ కస్టమర్‌లు జనవరి 31, 2024 వరకు ‘ధన్ లక్ష్మి 444 డేస్’ FD సౌకర్యాన్ని పొందవచ్చు. ఫిబ్రవరి 1 తర్వాత, మీరు ఈ పథకం ప్రయోజనాన్ని పొందలేరు. ఈ FD వ్యవధి 444 రోజులు. ఇందులో సాధారణ కస్టమర్లు 7.4 శాతం వడ్డీ ప్రయోజనం పొందుతున్నారు. అదే సమయంలో, సీనియర్ సిటిజన్లకు 7.9 శాతం, సూపర్ సీనియర్ సిటిజన్లకు 8.05 శాతం చొప్పున వడ్డీ లభిస్తోంది.

మీరు కూడా ఫాస్టాగ్ వినియోగదారు అయితే, మీరు దాని KYCని జనవరి 31లోపు పూర్తి చేయాలి. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలు జారీ చేసింది. మీ FASTag KYC పూర్తి కాకపోతే, అది నిషేధించబడుతుంది లేదా బ్లాక్‌లిస్ట్ చేయబడుతుంది.

ప్రతి నెల మొదటి తేదీన, ప్రభుత్వ చమురు కంపెనీలు ఎల్‌పిజి సిలిండర్ల ధరలను సమీక్షిస్తాయి. 1వ తేదీన గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పు ఉంది. ఈసారి బడ్జెట్‌కు ముందు ప్రభుత్వం ఎల్‌పీజీ ధరల్లో సడలింపు ఇవ్వవచ్చని భావిస్తున్నారు.

Hero Splendor : వినియోగదారులకు శుభవార్త చెప్పిన హీరో.. సగం ధరకే స్ప్లెండర్ ప్లస్ బైక్?

తక్కువ ధరలో మంచి బైక్ కొనాలనుకుంటున్నారా?
అయితే ఇది మీకోసమే. కంపెనీ విడుదల చేసిన కొన్ని ప్రత్యేకమైన మిడ్ రేంజ్ బడ్జెట్ బైక్లపై హీరో బంపర్ ఆఫర్ను అందిస్తోంది.
హీరో కంపెనీ స్టోర్లు హీరో స్ప్లెండర్ ప్లస్, ప్లస్ ఎక్స్టెక్, సూపర్ మరియు సూపర్ ఎక్స్టెక్ వేరియంట్లపై భారీ తగ్గింపులను అందిస్తున్నాయి. వీటితో పాటు కొన్ని ప్రత్యేక బహుమతులు కూడా అందజేస్తారు. హీరో ఈ స్ప్లెండర్ ప్లస్ మోటార్సైకిళ్లను రూ.73,400 ప్రారంభ ధరకు విక్రయిస్తోంది. అయితే మేము అందించే కొన్ని చిట్కాలతో మీరు ఈ బైక్ను మరింత తగ్గింపుతో పొందవచ్చు.
ఇక HERO SPLENDOR PLUS ధర విషయానికి వస్తే..

ఈ స్ప్లెండర్ ప్లస్ ప్రస్తుతం మార్కెట్లో చౌక ధరలకు అందుబాటులో ఉంది. మొదటి వేరియంట్ రూ.73,440 వద్ద అందుబాటులో ఉంది. స్ప్లెండర్ ప్లస్ ఎక్స్టెక్ వేరియంట్ విషయానికొస్తే.. రూ. 79,703..సూపర్ స్ప్లెండర్ రూ. 80,756 కంపెనీ మార్కెట్లో విక్రయిస్తోంది.

ప్రస్తుతం ఈ సూపర్ స్ప్లెండర్ అన్ని హీరో షోరూమ్లలో అందుబాటులో ఉంది. ఈ స్ప్లెండర్ మోడల్పై హీరో కంపెనీ ఎక్స్ఛేంజ్ ఆఫర్లను కూడా అందిస్తోంది. దీని కోసం మీరు ముందుగా మీ పాత మోటార్సైకిల్ను షోరూమ్కి తీసుకెళ్లి పరిస్థితిని చెక్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత మీరు ఎక్స్ఛేంజ్ బోనస్ పొందుతారు.

ఆ తర్వాత డీలర్షిప్ ఎగ్జిక్యూటివ్ని సంప్రదించండి. ఆ తర్వాత వారు కొత్త Hero Splendor కొనుగోలుపై అందుబాటులో ఉన్న ధరను తగ్గించడం ద్వారా మీకు కొత్త బైక్ను అందిస్తారు. Hero Splendor Plus యొక్క కొన్ని వేరియంట్లు 97.2cc BS6 ఇంజన్ను కలిగి ఉన్నాయి.
ఇది 8 బిహెచ్పితో పాటు 8.05 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుందని కంపెనీ వెల్లడించింది. మరియు హీరో సూపర్ స్ప్లెండర్ వేరియంట్లో, కంపెనీ 124.7cc BS6 ఇంజన్ను అందిస్తోంది. ఇది మునుపటి వేరియంట్ కంటే 10.72 bhp పవర్ అవుట్పుట్తో పాటు 10.6 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది.

NPS New Rules: పెన్షన్ ఖాతాదారులకు అలర్ట్.. నేటి నుంచి కొత్త రూల్స్.. ఇప్పుడే తెలుసుకోండి.

NPS New Rules: పెన్షన్ ఖాతాదారులకు అలర్ట్.. నేటి నుంచి కొత్త రూల్స్.. ఇప్పుడే తెలుసుకోండి..
మీరు ఈ ఎన్పీఎస్ ఖాతా కలిగి ఉంటే.. మీకో అలర్ట్. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఈ స్కీమ్లో కొన్ని నిబంధనల్లో మార్పులను కేంద్ర ప్రభుత్వం చేసింది. ముఖ్యంగా పాక్షిక ఉపసంహరణలు(పార్షియల్ విత్ డ్రాయల్స్)పై కొత్త రూల్స్ తీసుకొచ్చింది. వాటిని అమలు చేయనుండటంతో అందరూ వీటిపై అవగాహన కలిగి ఉండటం మేలు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్పీఎస్).. ఇటీవల కాలంలో ఎక్కువ మంది వినియోగిస్తున్నారు. పన్ను ప్రయోజనాలు అందించడంతో పాటు పదవీవిరమణ తర్వాత జీవితానికి భద్రత ఇస్తుండటంతో దీనిలో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఒకవేళ ఇప్పటికే మీరు ఈ ఎన్పీఎస్ ఖాతా కలిగి ఉంటే.. మీకో అలర్ట్. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఈ స్కీమ్లో కొన్ని నిబంధనల్లో మార్పులను కేంద్ర ప్రభుత్వం చేసింది. ముఖ్యంగా పాక్షిక ఉపసంహరణలు(పార్షియల్ విత్ డ్రాయల్స్)పై కొత్త రూల్స్ తీసుకొచ్చింది. వాటిని అమలు చేయనుండటంతో అందరూ వీటిపై అవగాహన కలిగి ఉండటం మేలు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

పీఎఫ్ఆర్డీఏ కొత్త మార్గదర్శకాలు ఇవి..
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) నుంచి పాక్షిక ఉపసంహరణల కోసం పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఫిబ్రవరి 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. జనవరి 12న విడుదల చేసిన పీఎఫ్ఆర్డీఏ సర్క్యులర్ ప్రకారం..
ఎన్పీఎస్ ఖాతాదారులు ఇప్పుడు ఉన్నత విద్య, వివాహం, నివాస గృహాల కొనుగోళ్లు, వైద్య ఖర్చుల వంటి ప్రయోజనాల కోసం పాక్షిక ఉపసంహరణలు చేయవచ్చు.
పాక్షిక ఉపసంహరణ ఎంత ఉండాలంటే.. ఖాతాలో ఉన్న మొత్తం నుంచి 25 శాతానికి మించకుండా విత్ డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇది కేవలం ఖాతాదారుడు చెల్లించే మొత్తం నుంచే ఉంటుందని.. దానిపై వచ్చే రిటర్న్‌లు పాక్షిక ఉపసంహరణకు అర్హత కలిగి ఉండవని సర్క్యులర్‌లో పేర్కొన్నారు.
సబ్‌స్క్రైబర్ తన పదవీ కాలంలో గరిష్టంగా మూడు ఉపసంహరణలు చేయడానికి అనుమతి ఉంటుంది. 25 శాతం వరకు పాక్షిక ఉపసంహరణకు అర్హత పొందేందుకు సబ్‌స్క్రైబర్ ఎన్ఫీఎస్ ఖాతా తప్పనిసరిగా మూడు సంవత్సరాలు కాల వ్యవధి నిండి ఉండాలి.
ఈ ప్రత్యేక సమయాల్లో కూడా..
ఎన్పీఎస్ పెట్టుబడిదారులు నివాస గృహం లేదా ఫ్లాట్ కొనుగోలు లేదా నిర్మాణం కోసం పాక్షిక ఉపసంహరణలు చేయడానికి కూడా అనుమతి ఉంటుంది. అయితే, చందాదారు వారి పూర్వీకుల ఆస్తి కాకుండా ఇతర నివాస గృహం లేదా ఫ్లాట్ కలిగి ఉంటే, ఉపసంహరణకు అనుమతి ఉండదు.
క్యాన్సర్, కిడ్నీ ఫెయిల్యూర్, మల్టిపుల్ స్క్లెరోసిస్, గుండె సంబంధిత శస్త్రచికిత్సలు, కోవిడ్-19 మరియు ప్రాణాంతక ప్రమాదాలు వంటి దీర్ఘకాలిక వ్యాధులకు ఆసుపత్రిలో చేరడం, చికిత్స చేయడం వంటి వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల్లో, అటువంటి ఖర్చులను కవర్ చేయడానికి పాక్షిక ఉపసంహరణకు అనుమతి ఉంటుంది.
సబ్‌స్క్రైబర్ తమ ఎన్‌పీఎస్ ఖాతా నుంచి స్కిల్ డెవలప్‌మెంట్ లేదా ఏదైనా ఇతర స్వీయ-అభివృద్ధి కార్యకలాపాల కోసం కూడా పాక్షికంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. మీరు మీ స్వంత వ్యాపారాన్ని లేదా స్టార్టప్‌ను స్థాపించాలనుకుంటే, మీరు డిపాజిట్ చేసిన మొత్తంలో 25 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు.
అర్హత.. ఉపసంహరణ అభ్యర్థన..
పాక్షిక ఉపసంహరణ ప్రయోజనాలకు అర్హత పొందడానికి పెట్టుబడిదారు కనీసం మూడు సంవత్సరాలు ఎన్పీఎస్ లో సభ్యునిగా ఉండాలి. ఇది చందాదారుల మొత్తం సహకారంలో 25 శాతానికి మించకూడదు. ఒక్కో సబ్‌స్క్రైబర్‌కు మూడు పాక్షిక ఉపసంహరణలు చేసుకోవచ్చు. తదుపరి పాక్షిక ఉపసంహరణల కోసం, మునుపటి పాక్షిక ఉపసంహరణ తేదీ నుండి సబ్‌స్క్రైబర్ చేసిన కంట్రీబ్యూషన్ నుంచి మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది.

సబ్‌స్క్రైబర్ తమ ఉపసంహరణ అభ్యర్థనతో పాటు ఉపసంహరణ ఉద్దేశాన్ని పేర్కొంటూ సెల్ఫ్-డిక్లరేషన్‌ను సమర్పించాలి. పత్రాలను వారి సంబంధిత ప్రభుత్వ నోడల్ కార్యాలయానికి సమర్పించాలి.

Budget 2024: బంగారం కొనుగోలు పై బడ్జెట్‌లో కీలక ప్రకటన చేసే ఛాన్స్!

Budget 2024: పాన్ లేకుండా రూ. 5 లక్షల వరకు బంగారం కొనుగోలు.. బడ్జెట్‌లో కీలక ప్రకటన చేసే ఛాన్స్!
బడ్జెట్‌ సమర్పణకు మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న తన 6వ, మొదటి మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ బడ్జెట్‌లో ఎలాంటి విధానపరమైన నిర్ణయం ఉండకపోవచ్చు. సామాన్యులకు మాత్రం ఉపశమనం కలిగించే కొన్ని ప్రకటనలు వెలువడే అవకాశముంది.
ఢిల్లీ, ఫిబ్రవరి 1: బడ్జెట్‌ సమర్పణకు మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న తన 6వ, మొదటి మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ బడ్జెట్‌లో ఎలాంటి విధానపరమైన నిర్ణయం ఉండకపోవచ్చు. సామాన్యులకు మాత్రం ఉపశమనం కలిగించే కొన్ని ప్రకటనలు వెలువడే అవకాశముంది. మోదీ ప్రభుత్వం బడ్జెట్‌లో బంగారం దిగుమతిపై పన్ను తగ్గించి, పాన్ కార్డు లేకుండా రూ.5 లక్షల వరకు బంగారం కొనుగోలు చేసేందుకు అనుమతి ఇవ్వవచ్చని వార్తలు వస్తున్నాయి. దీన్ని తగ్గించాలని పరిశ్రమ వర్గాలు కూడా చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
మధ్యంతర బడ్జెట్‌లో బంగారం దిగుమతులపై బేసిక్ కస్టమ్ డ్యూటీ (బీసీడీ) పెంపును వెనక్కి తీసుకోవాలని డైమండ్స్, ఆభరణాల పరిశ్రమ అభ్యర్థించింది. హేతుబద్ధమైన పన్ను విధానాన్ని అమలు చేయాలని కోరింది. భారతదేశ జిడిపికి ఆభరణాల పరిశ్రమ సుమారు 7 శాతం సహకరిస్తోందని, అందుకే వ్యాపార అనుకూల వాతావరణానికి అర్హులని ఇండస్ట్రీ బాడీ ఆల్ ఇండియా జెమ్ అండ్ జువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ సన్యామ్ మెహ్రా అన్నారు. దీంతో ప్రభుత్వానికి కూడా మేలు జరుగుతుందన్నారు. కేంద్ర బడ్జెట్‌లో బంగారంపై పెంచిన బీసీడీని ఉపసంహరించుకోవాలని ఆర్థిక మంత్రిత్వ శాఖను కోరుతున్నామన్నారు. ఇది కాకుండా, హేతుబద్ధమైన పన్ను విధానాన్ని అమలు చేయాలన్నారు.

ప్రస్తుతం 12.5 శాతం బిసిడి యాడ్ వాలోరమ్‌పై విధిస్తున్నారని, దీని వల్ల దిగుమతి చేసుకున్న బంగారంపై మొత్తం పన్ను 18.45 శాతం ఉంటుందని ఆయన చెప్పారు. పెరుగుతున్న బంగారం ధరల కారణంగా పాన్ కార్డు లావాదేవీల పరిమితిని ప్రస్తుతం రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. బంగారం ధర పెంపుతో పాన్ కార్డు లావాదేవీల పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాల్సిన అవసరం ఉందని మెహ్రా అన్నారు. దీంతో పాటు రోజువారీ కొనుగోలు పరిమితిని కూడా రూ.లక్షకు పెంచాల్సి ఉంది. ఇది కాకుండా, డైమండ్స్, ఆభరణాల పరిశ్రమకు EMI సౌకర్యాన్ని పునరుద్ధరించాలని GJC సిఫార్సు చేసింది.

CM Jagan: వైసీపీ 5వ జాబితా విడుదల.. కీలక మార్పులు చేసిన అధిష్టానం..

ఆంధ్రప్రదేశ్ లో జరిగే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా అభ్యర్థులపై కసరత్తు చేస్తోంది అధికార వైసీపీ. మొన్నటి వరకూ నాలుగు జాబితాలను విడుదల చేసిన వైసీపీ అధిష్టానం తాజాగా ఐదవ జాబితా విడుదల చేసింది. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సీనియర్‌ నేత.. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ లోక్ సభ, అసెంబ్లీ ఇంఛార్జిల మార్పు జాబితాను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్రకార్యదర్శి, ముఖ్యమంత్రి సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా పాల్గొన్నారు. నాలుగు ఎంపీ స్థానాలకు, మూడు ఎమ్మెల్యే నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జిలను మారుస్తూ వారి పేర్లను, నియోజకవర్గాలను ప్రకటించింది.
అరకు వ్యాలీ అసెంబ్లీ అభ్యర్థిని మార్చేశారు. గొట్టేటి మాధవి స్థానంలో రేగా మత్స్య లింగంను నియమించారు. తిరుపతి పార్లమెంట్ సభ్యులు గురుమూర్తికి గతంలో సత్యవేడు అసెంబ్లీ స్థానాన్ని కేటాయించిన అధిష్టానం తిరిగి తిరుపతి పార్లమెంటు అభ్యర్థిగానే ప్రకటించింది. గురుమూర్తికి బదులు సత్యవేడు అసెంబ్లీ అభ్యర్థిగా నూకతోటి రాజేష్‌ ను నియమించింది. ఇక మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌‎ పేరును ప్రకటించి.. అవనిగడ్డ అసెంబ్లీ బరిలో సింహాద్రి చంద్రశేఖరరావును నిలబెట్టబోతోంది.

కాకినాడ ఎంపీగా చలమలశెట్టి సునీల్‌ పేరును ఖరారు చేసింది. ఈయన 2014లో వైయస్సార్‌సీపీ నుంచి పోటీచేసి కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక ఫైర్ బ్రాండ్, జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటుగా ఉండే మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ కు ప్రమోషన్ ఇచ్చింది అధిష్టానం. నెల్లూరు నుంచి కాకుండా నర్సారావుపేట నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో దింపేందుకు రంగం సిద్దం చేసింది. తొలి జాబితాలో 11 నియోజకవర్గాలకు, రెండో జాబితాలో మరో 27 స్థానాలకు, మూడో జాబితాలో 21 స్థానాలకు, నాలుగో జాబితాలో 8 నియోజకవర్గాలకు సమన్వయకర్తలను మారుస్తూ జాబితాలు విడుదల చేసింది వైఎస్సార్‌సీపీ.

ఎన్డీయేలోకి బీఆర్ఎస్‌. కేసీఆర్ – కేటీఆర్ – హరీష్ మధ్య గొడవలు.?

రాజకీయాల్లో ఇది జరగదు ఇది జరుగుతుంది అని చెప్పేందుకు ఏమీ ఉండవు. ప్రస్తుతం రాజకీయాల్లో నైతిక విలువలు పూర్తిగా దిగజారిపోయాయి. ఇందుకు తాజాగా బీహార్ లో జరుగుతున్న పరిణామాలే నిదర్శనం.
నితీష్ కుమార్ గత నాలుగేళ్లలో ఎలా పిల్లి మొగ్గలు వేశాడో ? ఎలా తన సీఎం పదవిని కాపాడుకున్నాడో చూస్తూనే ఉన్నాం. ఇక ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ పరిణామాలు కూడా శరవేగంగా మారుతున్నాయి. గత పదేళ్లుగా కేసీఆర్‌కు తిరుగులేకుండా రాజకీయం నడిచింది. గత ఎన్నికల్లో టిఆర్ఎస్ ఓడిపోయింది.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు.

ఇప్పుడు రేవంత్ రెడ్డి తన ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకోవడానికి. బీఆర్ఎస్‌ను మరింత లోతుగా తొక్కేయటానికి రకరకాల ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. బి ఆర్ ఎస్ ను ఇప్పట్లో కోలుకోకుండా చేయడం.. సీనియర్ల నుంచి తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవడం.. మెజార్టీ తక్కువ ఉంది కాబట్టి బిఆర్ఎస్ తన అపార ధన రాశులతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనకుండా అడ్డుపడటం.. తెలంగాణలో బిజెపి బలపడకుండా చూడటం ఇలా రేవంత్ రెడ్డికి చాలా టాస్కులు ఉన్నాయి. ఇదంతా ఇంతకుముందు కేసీఆర్ నేర్పించిన పాఠమే కాబట్టి రేవంత్ చేసే పనులను కూడా పూర్తిగా తప్పు పట్టలేము.

ఇక మరో రెండు నెలలలో లోక్‌సభ ఎన్నికలు రానున్నాయి. నేను మళ్లీ ఒంటరిగా పోటీ చేస్తాను.. జనం ఆదరిస్తారు అనే బీఆర్ఎస్ / కేసీఆఆర్ ధీమా ఒక డొల్ల అని చెప్పాలి. బిజెపికి ఎలాగూ నాలుగైదు సీట్లు వస్తాయన్న నమ్మకం ఉంది. అయితే ఇప్పుడు బిఆర్ఎస్ ఎన్డీయేలో చేరే అంశంపై చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. టిఆర్ఎస్ ఎన్డీయేకు దగ్గర అయితే తెలంగాణలో ఉన్న మైనార్టీ ఓట్లు తమ పార్టీకి దూరం అవుతాయన్న భయం ఆందోళన కేసీఆర్ లో కనిపిస్తున్నాయట. అయితే బిఆర్ఎస్‌తో ఎన్డీయేలో చేరకపోతే పార్టీ ఫ్యూచర్ కష్టం అని కేటీఆర్, హరీష్ నుంచి కేసీఆర్ పై తీవ్రమైన ఒత్తిళ్లు ఉన్నాయట.
ఈ క్రమంలోనే తన నమస్తే తెలంగాణ పత్రికతో పాటు తమకు పని చేస్తున్న టీంల ద్వారా కేసిఆర్ బిజెపితో కలిస్తే ఏమిటి ? ఒంటరి పోటీతో ఏమిటి ఇలా రకరకాల కోణాల్లో సర్వేలు చేస్తున్నట్టు తెలుస్తోంది. టిఆర్ఎస్ బిజెపి వైపు మొగ్గితే మోడీ ఓకి అంటాడా ? అంటే తెలంగాణలో ఉన్న బిజెపి నేతల పరిస్థితి ఎలా ఉన్నా వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏకు కాస్త సీట్లు తగ్గుతాయి అన్న సర్వేలు వినపడుతున్నాయి. ఈ క్రమంలో నితీష్ లాంటి వాడు రెండు మూడుసార్లు డ్యాన్సులు చేసినా బిజెపి వాళ్లు కళ్ళకు అద్దుకొని మరి ఎన్డీఏలోకి తీసుకున్నారు.

ఇప్పుడు మోడీకి తెలంగాణలో బిజెపి ప్రయోజనాల కన్నా తన ప్రధానమంత్రి పీఠం ముఖ్యం. అందుకే కేసిఆర్ తో దోస్తీ కట్టే విషయంలో ఎలాంటి సందేహాలు ఉండవని చెప్పాలి. ఏది ఏమైనా ఎన్డీఏలో చేరే విషయంలో హరీష్ రావు – కేటీఆర్ ఒకవైపు ఉంటే.. కేసీఆర్ మరోవైపు ఉన్నారని ఒక్కసారి బిజెపి చెంత చెరితే ఆ పార్టీ ఎంత బలమైన పార్టీలను అయినా చీలుస్తుందన్న భయం కెసిఆర్ కు ఉందట. ఇప్పుడు ఎన్డీఏలో చేరే విషయమై కెసిఆర్ ఫ్యామిలీలోనే గడబిడలు మొదలైనట్టు తెలంగాణ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా వచ్చే లోకసభ ఎన్నికలు కేసీఆర్ కు, బి ఆర్ ఎస్ పార్టీకి పెద్ద అగ్ని పరీక్ష లాంటివని చెప్పాలి.

Banana Eating Time : Banana: అరటి మంచిదే.. కానీ ఈ సమయాల్లో తింటే మాత్రం డేంజర్

Health Tips: అరటి.. అందరికీ ఇష్టమైన ఫ్రూట్. తిన్న వెంటనే ఎనర్జీ ఇస్తుంది. ఫుడ్ సులువుగా జీర్ణం చేయడంలోనూ కీ రోల్ పోషిస్తుంది. అరటి పండ్లు చౌకగానే అన్ని ప్రాంతాలలో లభిస్తాయి.

అరటి పండులో మెగ్నీషియం, పొటాషియం, పీచు మొదలైన పోషకాలు దండిగా ఉంటాయి. 100 గ్రాముల అరటి పండులో 258 మిల్లీగ్రాముల పొటాషియం, 2.6 గ్రాముల పీచు, 14 శాతం విటమిన్ సి, 20 శాతం విటమిన్ B6, 6 శాతం మెగ్నీషియంలోపాటు మాంగనీస్, రాగి, బయోటిన్ సమృద్ధిగా ఉంటాయి. పొద్దున్నే ఖాళీ కడుపున వ్యాయామం చేయడం వల్ల శరీరంలోని నీరు చెమట రూపంలో బయటికి వెళ్లిపోతుంది. తద్వారా డీహైడ్రేట్‌ అవుతారు… అలాగే శక్తినీ కోల్పోతారు. ఈ క్రమంలో కోల్పోయిన శక్తిని తిరిగి పొందు అరటి పండు మంచి ఆప్షన్. దీనిని మార్నింగ్‌ డైట్‌(Morning Diet)లో చేర్చుకోవడం వల్ల మరింత ఉత్సాహంగా కసరత్తులు చేయవచ్చు. అదేవిధంగా సాయంత్రం పూట స్నాక్స్‌ రూపంలో అరటి పండ్లను తీసుకోవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో అరటి పండును తీసుకోకపోవడమే ఆరోగ్యానికి శ్రేయస్కరమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఇతర పండ్లతో లేదా పాలతో కలిపి అరటి పండును తీసుకోకూడదు.

నైట్ సాధ్యమైనంతవరకు అరటి పండును తినకపోవడమే మేలు. అలా తీసుకోవడం వల్ల ఒక్కోసారి జలుబు లాంటి సమస్యలు దరిచేరే ఛాన్స్ ఉంది. రాత్రి అరటి పండు తినడం వల్ల శరీరంలో మ్యూకస్ తయారవుతుంది. ఇది శ్వాస కోశ సమస్యలకు కారణం అవుతుంది.

ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌, మధ్యాహ్న భోజనం తర్వాత కూడా అరటి పండును తినకూడదు.

చాలామంది పాలతో కలిపి అరటి పండును తీసుకుంటే, మరికొంతమంది పాలు తాగాక దీనిని తింటుంటారు. అయితే ఈ రెండు పద్ధతులూ ఆరోగ్యానికి అంత మంచిది కాదు.

ఈ పండులో మెగ్నీషియం, పొటాషియం, పీచు మొదలైన పోషకాలు ఉన్నా, పరగడుపున ఈ పండును తినడం శ్రేయస్కరం కాదు. ఆమ్లతత్త్వం కలిగిన అరటిపళ్లు పరగడుపున తింటే జీర్ణసంబంధ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

Belly Fat : రాత్రి పూట దీన్ని నెల రోజుల పాటు తాగితే.. పొట్ట దగ్గర ఉండే కొవ్వు మంచులా కరిగిపోతుంది..!

Belly Fat : మనలో కొంత మందికి శరీరం అంతా సన్నగా ఉండి పొట్ట దగ్గర మాత్రమే లావుగా ఉంటుంది. వీరికి పొట్ట భాగంలో అధికంగా కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది.
దీని వల్ల వీరు ఊబకాయులుగా కనిపిస్తూ ఉంటారు. ఇలాంటి వారు పొట్ట భాగం సన్నగా అవ్వడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వ్యాయామం చేయడం, ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. మార్కెట్ లో దొరికే రకరకాల పదార్థాలను కూడా వాడుతూ ఉంటారు. మార్కెట్ లో దొరికే వాటిని వాడడం వల్ల శరీరానికి హాని కలుగుతుంది. పైగా వీటి వల్ల ఫలితం కూడా ఎక్కువగా ఉండదు. శరీరానికి హాని కలగకుండా మన వంటింట్లో ఉండే వాటితోనే ఓ డ్రింక్ ను తయారు చేసుకుని తాగడం వల్ల పొట్ట భాగంలో అధికంగా ఉండే కొవ్వు తగ్గి పొట్ట భాగం సన్నగా అవుతుంది. ఈ డ్రింక్ ను ఎలా తయారు చేసుకోవాలి, దానికి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Belly Fat
ముందుగా చిన్న ముక్క అల్లాన్ని, నిమ్మకాయను తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీళ్లను పోసి, నీళ్లు కొద్దిగా కాగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం, నిమ్మకాయ ముక్కలతోపాటుగా అర టీ స్పూన్ పసుపును, ఒక దాల్చిన చెక్కను వేసి ఒక గ్లాసు నీళ్లు అయ్యే వరకు మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న నీటిని వడబోసి అందులో ఒకటి లేదా రెండు వేప ఆకుల ముక్కలను కానీ, వాటి పేస్ట్ ను కానీ కలిపి రాత్రి పడుకునే ముందు తాగాలి.

ఇలా తాగడం వల్ల పొట్ట భాగం సన్నగా అవ్వడమే కాకుండా శరీరంలోని ఇతర భాగాలలో పేరుకు పోయిన కొవ్వు కూడా కరిగి ఊబకాయం సమస్య నుండి బయట పడవచ్చు. ఈ డ్రింక్ ను తాగడం వల్ల పొట్ట భాగం సన్నగా అవ్వడమే కాకుండా, రక్తంలో ఉండే చక్కెర స్థాయిలు కూడా నియంత్రించబడతాయి. ఈ డ్రింక్ ను నెలరోజుల పాటు రాత్రి పడుకునే ముందు క్రమం తప్పకుండా తాగడం వల్ల ఫలితం అధికంగా ఉంటుంది.

Oil Test: మీ ఇంట్లో ఉండే వంటనూనె కల్తీదా..? మంచిదా..? చిన్న ప్రయోగంతో తెలుసుకోండి

Oil Test: మన వంటకాల్లో ఎక్కువగా ఉపయోగించేది నూనె. కొన్ని రోజులుగా వంట నూనె ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ధరల నియంత్రణపై కేంద్రం చేపట్టిన చర్యల వల్ల తగ్గుముఖం పట్టగా, ప్రస్తుతం ఉక్రెయిన్‌-రష్యా యుద్ధాల నేపథ్యంలో వంట నూనె ధరలు ( Cooking Oil Prices) ఒక్కసారిగా అకాశాన్నంటాయి.

ధర ఎంత ఉన్నా.. కొనడం మాత్రం తప్పనిసరి. ఎందుకంటే నూనె లేనిదే వంటలు చేయలేము. ఒక వైపు ధరలు మండిపోతుంటే.. మరో వైపు కల్తీ నూనెలు మార్కెట్లోకి వస్తున్నాయి. అయితే అవసరాలను ఆసరా చేసుకుని కొందరు మోసగాళ్లు కల్తీ నూనెలు తయారు చేస్తూ మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ప్రస్తుతం ఆహార పదార్థాల్లో కల్తీ అనేది ప్రధాన సమస్యగా మారింది. కల్తీకి ఎంత చెక్‌ పెట్టినా.. ఏదో విధంగా మార్కెట్లోకి వస్తూనే ఉన్నాయి. ఆహార కల్తీ వల్ల మనకు తెలియకుండానే పలు రోగాలు దరి చేరుతున్నాయి. ఇలాంటి కల్తీ నూనె వల్ల ఎన్నో రోగాలు చుట్టుముట్టి ఆస్పత్రుల చుట్టు తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే నూనె కల్తీ ఉందా..? లేదా అనేది తెలుసుకోవడం ముఖ్యం. మన ఇంట్లోనే చిన్నపాటి ట్రిక్‌ వల్ల వంటల్లో నూనె కల్తీదా..? మంచిదా..? అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. ఇటీవల కాలంలో ఇందుకు సంబంధించిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (ఫుడ్‌ సెఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ ఆఫ్‌ ఇండియా) ఓ వీడియోను తయారు చేసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

ప్రధానంగా వంటనూనెలో ట్రై ఆర్థో క్రెసిల్ ఫాస్ఫేట్‌ అనే రసాయనాన్ని ఉపయోగించి కల్తీ చేస్తారు. ఇది ప్రధానంగా ఫాస్పరస్‌ను కలిగిన పెస్టిసైడ్‌. ఇది వాడడం వల్ల నాడీవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపి పక్షవాతం తదితర రోగాలకు దారితీస్తుంది. అయితే మనం వాడే వంటనూనెలో ఏది స్వచ్ఛమైనది, ఏది కల్తీదో అనేది ఓ చిన్న ప్రయోగం ద్వారా తెలుసుకోవచ్చంటుంది ఫుడ్‌ సెఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ ఆఫ్‌ ఇండియా( ఎఫ్‌ఎస్‌ఎస్‌ఐ).

కల్తీ నూనెను ఎలా గుర్తించాలంటే..

మీరు వాడే నూనెలో ట్రై-ఆర్థో-క్రెసిల్-ఫాస్ఫేట్‌ ఉంది అంటే అది కల్తీని అర్థం. నూనెలో అది ఉందో లేదో తెలుసుకోవాలంటే.. ముందుగా రెండు మి.లీటర్ల నూనెను రెండు చిన్న పాత్రల్లోకి తీసుకుని అందులో పసుపు రంగులో ఉన్న వెన్నను రెండింటిలో వేయాలి. కొద్దిసేపటి తర్వాత చూస్తే పాత్రలోని నూనె రంగుమారకుండా ఉంటే అది స్వచ్ఛమైనదిగా గుర్తించాలి. అందులో ట్రై-ఆర్థో-క్రెసిల్-ఫాస్ఫేట్‌ లేదని అర్థం. అదే నూనె రంగు మారి ఎరుపు రంగు మారితే అది కల్తీ అయినట్లు అర్థం చేసుకోవచ్చు.

PM Kisan : రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్ బడ్జెట్ పెంపు పై కీలక నిర్ణయం.!!

PM Kisan : రైతుల కోసం కేంద్రం ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ సమణయోధ నిధి మొత్తాన్ని పెంచుతామంటూ కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ పథకం కింద ఏడాదికి 600 చొప్పున కేంద్రం అందిస్తుంది.
ఒక్కో విడత 2000 చొప్పున 3 విడతల్లో ఈ మొత్తాన్ని రైతులు ఖాతాలలో జమ చేస్తున్నారు.. అయితే ప్రస్తుతం పీఎం కిసాన్ 15వ విడత నిధులు అర్హులైన రైతులు ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది. ఇప్పుడు రైతులు 16వ విడత డబ్బులు కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో రైతులకు కేంద్రం భారీ శుభవార్త సిద్ధం చేసినప్పుడు తెలుస్తోంది. 2024లో సార్వత్రిక ఎన్నికలు ముందు పీఎం కిసాన్ పథకంలో కొన్ని మార్పులు చేయాలని మోడీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మధ్యంతర బడ్జెట్లో రైతులకు గుడ్ న్యూస్ వినిపించాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

పీఎం కిసాన్ పెట్టుబడి భారీగా పెంచాలి అని సన్నాహాలు చేస్తున్నారట. ఈ పథకం కింద రైతులకు లభించే లబ్ధిని 50% పెంచబోతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. సంవత్సరానికి 6000 నుండి 9000 వరకు పెంచాలని ప్రణాళికలు వేస్తున్నట్టు తెలుస్తుంది.
ఈ తొమ్మిది వేల రూపాయలు ఎప్పటిలాగే 3 విడతలలో అకౌంట్లో వేస్తారు అని చెప్తున్నారు. అంటే ఒక్కొక్క విడతలో 3000 రూపాయలు ఇవ్వాలని ప్రణాళిక వేస్తున్నారట. దీంతో పాటు జాతీయ ఉపాధి హామీ పథకానికి నిధులు పెంపు.. మద్దతు ధర లాంటి వాటిలో కూడా రైతులకు తీపి కబురులు ఉంటాయని కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అదేవిధంగా పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లను సందర్శించి లబ్ధిదారుల స్థితిని కూడా తెలుసుకోవచ్చు.

ఇక్కడ మొదటిగా జిల్లా, మీ రాష్ట్రం, ఉపజిల్లా, పంచాయతీ వంటి వివరాలను ఎంటర్ చేసి గేట్ రిపోర్ట్ బటన్ చేస్తే అన్ని వివరాలు వస్తాయి..పీఎం కిసాన్ కి సంబంధించి మీ ఖాతాలలో డబ్బు కానట్లయితే వెంటనే హెల్ప్ లైన్ నెంబర్ కి ఫోన్ చేయండి. పిఎం కిసాన్ యోజన హెల్ప్ లైన్ నెంబర్ 01123381092,180011526 నెంబర్ కి మీరు ఫిర్యాదు చేయవచ్చు. అయితే పీఎం కిసాన్ 16వ విడత డబ్బును ఫిబ్రవరి చివరిలో కానీ మార్చి నెల మొదటి వారంలో కానీ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ లోగానే అర్హులైన రైతులంతా ఈ కేవైసీ పూర్తి చేయాలి అని ప్రభుత్వం తెలుపుతోంది…

Budget 2024 : రేపే మధ్యంతర బడ్జెట్.. ప్రత్యక్షంగా ఎక్కడ చూడొచ్చంటే ?

Budget 2024 : ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ 2024 సమర్పణ జరగనున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన తొలి మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
ఇది ఆమెకు వరుసగా 6వ బడ్జెట్ కూడా అవుతుంది, దీనిని ఆమె పార్లమెంటు ముందు సమర్పించనున్నారు. అయితే ప్రభుత్వం ఈసారి ఆర్థిక సర్వేను విడుదల చేయలేదు. వచ్చేనెలలో దేశంలో లోక్‌సభ ఎన్నికలు ఉన్నాయి. మేలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆర్థిక సర్వేతో పాటు పూర్తిస్థాయి బడ్జెట్‌ను తీసుకురానుంది. ఈసారి పెద్దగా ప్రకటనలేవీ ఉండవని ఇప్పటికే ఆర్థిక మంత్రితో పాటు దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా చెప్పారు. దేశంలో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. దీని కారణంగా బడ్జెట్‌లో ప్రజాదరణ పొందిన ప్రకటనలు ఉండవచ్చు.

మధ్యంతర బడ్జెట్ 2024 ఫిబ్రవరి 1 ఉదయం 11 గంటలకు ప్రకటించబడుతుంది. నరేంద్ర మోడీ ప్రభుత్వ హయాంలో, మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫిబ్రవరి చివరి పనిదినం రోజున బడ్జెట్‌ను ప్రకటించే సంప్రదాయాన్ని మార్చారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం సంసద్ టీవీ , డీడీ న్యూస్‌లలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) తన అధికారిక YouTube ఛానెల్, వెబ్‌సైట్‌లో బడ్జెట్‌ను ఆన్‌లైన్‌లో ప్రసారం చేస్తుంది.

Health

సినిమా