Friday, November 15, 2024

Acer లో రిపబ్లిక్ డేస్ సేల్ మొదలైంది! ల్యాప్టాప్ లపై ఆఫర్లు, వివరాలు ఇవే.

ప్రముఖ గేమింగ్ ల్యాప్టాప్ తయారీ సంస్థ ఏసర్ తన రిపబ్లిక్ డే సేల్ను భారతదేశంలో ప్రారంభించింది. ఈ సేల్ ప్రస్తుతం కంపెనీ ఆన్లైన్ స్టోర్ మరియు ఎక్స్క్లూజివ్ రిటైల్ స్టోర్లలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతోంది మరియు జనవరి 19 నుండి జనవరి 26 వరకు కొనసాగుతుంది.

ఈ సేల్ సమయంలో అనేక గేమింగ్, నాన్-గేమింగ్ మరియు బిజినెస్ ల్యాప్టాప్లు మరియు మానిటర్ల వంటి పరికరాలపై భారీ తగ్గింపు ధరలు అందుబాటులో ఉన్నాయి.
ప్రసిద్ధ గేమింగ్ ల్యాప్టాప్ సిరీస్ Acer Predator Helios, Nitro సిరీస్, Aspire 5 గేమింగ్ ల్యాప్టాప్లు మరియు Acer TravelMate సిరీస్లు తగ్గింపు ధరలలో జాబితా చేయబడ్డాయి.

Acer యొక్క రిపబ్లిక్ డే స్పెషల్ సేల్ ఉచిత ఉపకరణాలు, పొడిగించిన వారంటీలు మరియు నో-కాస్ట్ EMI ఎంపికలను కూడా అందిస్తుంది. ఇంకా, విద్యార్థులు కొనుగోళ్లపై ప్రత్యేక ఏడు శాతం తగ్గింపు ఆఫర్ను పొందవచ్చు.

75వ గణతంత్ర దినోత్సవానికి ముందు, Acer ఈ ప్రత్యేక రిపబ్లిక్ డే సేల్ను శుక్రవారం (జనవరి 19) నుండి అంటే ఈరోజు ప్రారంభించింది. విక్రయ సమయంలో, కంపెనీ తన ప్రిడేటర్ హీలియోస్, ఆస్పైర్ 5 గేమింగ్ మరియు నైట్రో సిరీస్ ల్యాప్టాప్లపై పొడిగించిన రెండు సంవత్సరాల ఉచిత వారంటీని కూడా అందిస్తోంది.
ఈ తగ్గింపు విక్రయం జనవరి 26న ముగుస్తుంది. ప్రస్తుతం, కొనసాగుతున్న ఈ సేల్లో Acer TravelMate సిరీస్ మోడల్లను కొనుగోలు చేస్తున్న కస్టమర్లు మూడు సంవత్సరాల ఉచిత వారంటీతో పాటు ఆకర్షణీయమైన పరికరాలను పొందవచ్చు. కంపెనీ తన ఏసర్ మానిటర్లను 60 శాతం వరకు తగ్గింపుతో విక్రయిస్తోంది. ఈ మానిటర్లలో కొనుగోలుదారులు రూ.2,000 వరకు అదనపు పొదుపులను కూడా పొందవచ్చు.
Acer యొక్క Aspire మరియు Extensa సిరీస్ ల్యాప్టాప్లు మూడు సంవత్సరాల పాటు ఉచిత వారంటీతో పొందవచ్చు, అయితే Aspire 7 గేమింగ్ ల్యాప్టాప్ మోడల్లు రెండు సంవత్సరాల కాలానికి ఉచిత వారంటీని పొందుతాయని నిర్ధారించబడింది. అదనంగా, దుకాణదారులు కాంప్లిమెంటరీ యాక్సెసరీలు లేదా ప్రిడేటర్ హీలియోస్, నైట్రో సిరీస్, ఆస్పైర్ 5 గేమింగ్, ఆస్పైర్ మరియు ఎక్స్టెన్సా సిరీస్ మరియు ఆస్పైర్ 7 గేమింగ్ ల్యాప్టాప్లపై ఏడు శాతం విద్యార్థుల తగ్గింపును కూడా ఎంచుకోవచ్చు. Acer యొక్క ఆన్లైన్ స్టోర్ మరియు ప్రత్యేకమైన స్టోర్ల ద్వారా చేసే కొనుగోళ్లపై కంపెనీ నో-కాస్ట్ EMI ఎంపికలను కూడా అందిస్తోంది.

ఈ డీల్లన్నింటినీ తనిఖీ చేయడానికి, Acer యొక్క అధికారిక రిపబ్లిక్ డే సేల్ పేజీని సందర్శించండి. అమెజాన్ మరియు ఫ్లిప్కార్ట్ కూడా ప్రస్తుతం తమ రిపబ్లిక్ డే సేల్ను నిర్వహిస్తున్నాయి. ఉత్తమమైన డీల్ను పొందడానికి కొనుగోలుదారులు వివిధ ఇ-కామర్స్ ప్లాట్ఫారమ్ల మధ్య ధరలను కూడా పోల్చవచ్చు!

ఈ Amazon Great Republic Day Sale 2024లో భాగంగా, మీరు Samsung, Xiaomi, Redmi, OnePlus మరియు ఇతర ప్రముఖ బ్రాండ్ల నుండి ట్యాబ్లపై భారీ తగ్గింపులను పొందవచ్చు. ఈ సేల్లో భాగంగా గరిష్టంగా 60 శాతం తగ్గింపును పొందవచ్చు. ఇది కాకుండా, మీరు SBI క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే, మీరు మరో 10 శాతం తగ్గింపు పొందవచ్చు.

Vastu Tips: కొత్త వాహనం కొనే ముందు ఈ వాస్తు నియమాన్ని గుర్తుంచుకోండి..

కొత్త వాహనం కొనడం ప్రతి ఒక్కరికీ ఒక పెద్ద కల. మీరు కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? ఇదే సరైన సమయం అని భావిస్తున్నారా..? మీరు ఏదైనా కొత్త వాహనం కొనుగోలు చేస్తున్నట్లయితే, ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి.
మీరు కొత్త వాహనం కొనుగోలు చేసే ముందు కొన్ని ప్రత్యేక వాస్తు నియమాలను పాటిస్తే, మీ జీవితంలో ఆనందం ఉంటుంది. మీరు దానిని పాటించకపోతే భవిష్యత్తులో అనేక సమస్యలు తలెత్తుతాయి. కొత్త వాహనాన్ని కొనుగోలు చేసేటప్పుడు వాస్తు నియమాలను అనుసరించడం వలన కొత్త వాహనానికి ఎల్లప్పుడూ మంచి ఫలితాలు ఉంటాయి. మీ కోసం కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే ముందు, మీ వాహనానికి సంబంధించి సానుకూల, సామరస్య వాతావరణాన్ని సృష్టించడంలో మీకు సహాయపడే కొన్ని వాస్తు పరిష్కారాలు ఉన్నాయి. కొత్త వాహనం కొనుగోలు చేసే ముందు మీరు గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయాలు తెలుసుకుందాం…

మీరు కొత్త వాహనం కొంటే టైమింగ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. శుభముహూర్తమైన రోజు మాత్రమే కొత్త వాహనం కొనుగోలు చేయాలి. మీరు ఏదైనా నెల పౌర్ణమి నాడు లేదా పౌర్ణమికి 10 రోజుల ముందు లేదా 10 రోజుల తర్వాత ఏదైనా శుభ దినాన కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలి. పౌర్ణమి తర్వాత 11వ రోజు నుండి 15వ రోజు వరకు వాహనం కొనడం మానుకోండి. ఏ నెలలోనైనా శనివారం కొత్త వాహనాన్ని కొనుగోలు చేయవద్దు. అలాగే, అమావాస్య రోజున,చంద్రుడు ఆరు, అష్టమ లేదా పన్నెండవ ఇంట్లో ఉన్నప్పుడు వాహనం కొనుగోలు చేయవద్దు.

రంగు మీ వ్యక్తిగత ఎంపిక అయినప్పటికీ వాస్తు ప్రకారం, కొన్ని రంగులు మరింత పవిత్రమైనవిగా పరిగణించబడతాయి. తెలుపు, వెండి, ఇతర లేత రంగులు సాధారణంగా వాహనాలకు శుభప్రదంగా పరిగణించబడతాయి. ఎందుకంటే అవి సానుకూలత, స్వచ్ఛతకు చిహ్నంగా భావిస్తారు. అంతేకాకుండా, మీరు మీ అదృష్ట సంఖ్య, మీ పుట్టిన తేదీ ప్రకారం శుభప్రదమైన ప్రతి రంగు, వాహనాన్ని కొనుగోలు చేయవచ్చు. ఉదాహరణకు మీ రాశిచక్రం మేషం అయితే, మీరు ఎరుపు లేదా మెరూన్ రంగు వాహనాన్ని ఎంచుకోవాలి.
మీ వాహనం కోసం మంచి పార్కింగ్ స్థలాన్ని ఎంచుకోండి. ఈ స్థలం బాగా గాలి వెలుతురు వచ్చేలా, సులువుగా లోపలకు వెళ్లి బయటకు వచ్చేలా ఉండాలని గుర్తుంచుకోండి. శుభ్రమైన, క్రమమైన పార్కింగ్ స్థలం సానుకూలతను ఇస్తుంది. మీరు కొత్త వాహనాన్ని ప్రతికూల ప్రదేశంలో ఉంచినట్లయితే, ప్రతికూల శక్తి కూడా దానిలోకి రావచ్చు. అది మీకు మంచిది కాదు.

మీకు ఎంపిక ఉంటే, సాధారణంగా మీ వాహనాన్ని వాయువ్య దిశలో పార్క్ చేయమని సలహా ఇస్తారు. ఈ దిశ గాలి మూలకానికి చెందినది. అన్ని వాహనాలకు అనుకూలంగా పరిగణించబడుతుంది. మీ వాహనాన్ని ఎక్కువగా నీడలో లేదా చెట్లకింద ఉండే ప్రదేశాలలో పార్కింగ్ చేయడం మానుకోండి. మంచి వెలుతురు, బహిరంగ ప్రదేశంలో పార్కింగ్ ఉత్తమంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఇది సానుకూల శక్తిని ప్రోత్సహిస్తుంది. మీ ఇంటిని శుభ్రంగా, వాస్తు ప్రకారం క్రమబద్ధంగా ఉంచుకోవడం ఎంత ముఖ్యమో, మీ వాహనం విషయంలో కూడా అదే వర్తిస్తుంది. వాహనాన్ని క్రమం తప్పకుండా శుభ్రపరచడం, నిర్వహించడం దాని జీవితాన్ని పొడిగించడమే కాకుండా దాని చుట్టూ సానుకూల వాతావరణాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది.

How To Create Wealth: జీతమే సరిపోవడం లేదు.. ఇక సేవింగ్స్ ఎక్కడ..? అని వాపోతున్నారా..? ఈ 7 సూత్రాలను పాటిస్తే..!

భద్రమైన భవిష్యత్తు (Future) కోసం ప్రతిఒక్కరూ పరితపిస్తారు. అందుకోసం సరైన ప్రదేశాలలో డబ్బును ఆదా చేయడం మరియు పెట్టుబడి (Investment) పెట్టడం చాలా ముఖ్యమని భావిస్తారు.
ఉద్యోగం, వ్యాపారం లేదా ఇతర రకాల ఆదాయాలు ఎప్పుడైనా ఆగిపోవచ్చు. అలాగే నష్టాలను చవి చూడాల్సి రావచ్చు. అటువంటి పరిస్థితిలో జీవితం తడబడకుండా ఉండాలంటే భవిష్యత్తు ప్రణాళిక (Future planning ) చాలా ముఖ్యం. అలాంటి ప్రణాళిక కోసం ఏడు ముఖ్యమైన సూత్రాలను పాటించాలి. అవేంటో ఒకసారి చూద్దాం..

1)నగదును నిర్వహించే కళ

మీరు ఉద్యోగం, వ్యాపారం.. ఏం చేస్తున్నా సరే అందులో వచ్చే డబ్బును పొదుపు (Saving Money) చేసే కళ నేర్చుకోవాలి. ప్రతి నెలా కుటుంబ బడ్జెట్‌ను సమీక్షించి కొంత డబ్బు ఆదా చేయడానికి ప్రయత్నించాలి.
2)ఆస్తిని కాపాడుకోవడం

మీకు ఉన్న చర, స్థిరాస్తి ఏదైనా సరే దానిని పరిరక్షించుకోవాలి. నగలు, భూమి, బ్యాంకులో నగదును రక్షించుకోవాలి. భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు తలెత్తినపుడు ఈ ఆస్తి దివ్యౌషధంలా పనిచేస్తుంది. అలాగే తప్పనిసరిగా జీవిత భీమా కూడా తీసుకోవాలి.

3)ఆర్థిక భద్రత అవసరం

భవిష్యత్తు ఖర్చులను ముందుగానే ఊహించి ప్రణాళిక వేసుకోవాలి. పదవీ విరమణ తర్వాత ఏం చేయాలి, పిల్లల చదువులకు ఎంత ఖర్చు చేయాలో ముందుగానే ఆలోచించుకోవాలి. అంతే కాకుండా ఆకస్మిక సంఘటనలు ఎదురైతే వాటి నుంచి ఎలా బయటపడాలో కూడా ముందే ప్రణాళిక రూపొందించుకోవాలి.

4)10 శాతం పెట్టుబడి

మీరు ప్రతి నెలా మీ నెలవారీ ఆదాయంలో కనీసం 10 శాతం పెట్టుబడి పెట్టాలి. బాండ్సు, ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్, బంగారం మొదలైన వాటిల్లో దీర్ఘకాలిక, స్వల్పకాలిక సమయాలకు పెట్టుబడి పెడితే కొన్నేళ్లకు రెట్టింపు అవుతుంది.

5)క్రెడిట్ విషయంలో జాగ్రత్త..

వీలైనంత వరకు క్రెడిట్ కార్డుల (Credit Cards) జోలికి వెళ్లకూడదు. అప్పు చేసి ఏ వస్తువులనూ కొనకూడదు. ఒకవేళ్ల క్రెడిట్ కార్డు మీద కొనాల్సి వస్తే.. ఎప్పటికప్పుడు బిల్లలు చెల్లించాలి. లేకపోతే వడ్డీతో సహా అప్పులు పెరిగిపోతాయి.

6)సింపుల్‌గా ఉండండి..
వీలైనంత వరకు సాధారణ జీవితాన్ని గడపడానికి చూడండి. ఖరీదైన వస్తువులు, కార్ల జోలికి వెళ్లకపోవడం ఎంతో ఆదా చేస్తుంది. నిజానికి చాలా మంది బిలియనీర్లు అనవసర ఆర్భాటాల జోలికి పోకుండా సాధారణ జీవితాన్నే గడుపుతారు. డబ్బు ఆదా చేయడానికి ఇది ఉత్తమ మార్గం. షాపింగ్, ట్రావెలింగ్ కోసం వెచ్చించే మొత్తం ఆదా అవుతుంది.

7)వారసత్వాన్ని నిర్ణయించండి..

జీవించి ఉన్నప్పుడే కాద.. మరణం తర్వాత కూడా ప్లాన్ చేసుకోవాలి. అందువల్ల మిగిలిన కుటుంబ సభ్యుల జీవితాలు సాఫీగా సాగుతాయి. సంపాదించిన ఆదాయం, ఆస్తులు ఎవరెవరికి ఎంతెంత దక్కాలో ముందుగానే వీలునామా రాసి ఉంచండి.

Education Loan For Abroad Studies : ఎడ్యుకేషన్​ లోన్​ కావాలా?.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి!

Education Loan For Abroad Studies In Telugu : చాలా మంది విద్యార్థులు ఉన్నత విద్యను విదేశాల్లో చదివేందుకు ఇష్టపడుతుంటారు. అయితే ఇతర దేశాలకు వెళ్లి విద్యను అభ్యసించడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.
అందుకే విద్యారుణం తీసుకోవాలని భావిస్తూ ఉంటారు. అయితే ఈ రుణాలు తీసుకునేముందు కొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందామా?

Education Loan For Abroad Studies : విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు భారతీయ విద్యార్థులు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. అక్కడకు వెళ్లేందుకు ఎంతటి ఖర్చునైనా భరించడానికి సిద్ధపడుతున్నారు. ప్రతి ఏడాది విదేశాలకు వెళ్లి చదివే భారతీయ విద్యార్థుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. వచ్చే ఏడాది నాటికి ఈ సంఖ్య 18 లక్షలకు చేరుకుంటుందంటే విదేశీ విద్యకు ఎంతటి డిమాండ్​ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే విదేశీ విద్య అనేది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఇందుకోసం చాలా మంది విద్యార్థులు ముందుగా ఆశ్రయించేది బ్యాంకులు, బ్యాంకింగేతర రుణ సంస్థలు. అయితే ఇవి అందించే విద్యా రుణాలు (Education Loan For Students) తీసుకునే ముందు.. కొన్ని ముఖ్యమైన విషయాలను కచ్చితంగా పరిశీలించాలి. అప్పుడే భవిష్యత్తులో ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

Education Loan Process : విదేశాలకు వెళ్లే ముందు చాలా మంది విద్యార్థులు.. కోర్సులు, విశ్వవిద్యాలయాల ఎంపిక లాంటి అంశాలను మాత్రమే చూస్తారు. ఇందు కోసం అయ్యే ఖర్చుల గురించి కూడా ముందే అంచనా వేసుకుంటారు. అయితే పెరుగుతున్న విద్యా ద్రవ్యోల్బణం కారణంగా విదేశాల్లో చదువుకోవడం ఖరీదైన వ్యవహారంగా మారింది. ఇది భవిష్యత్తులో రుణం తిరిగి చెల్లించే సమయంలో మనల్ని ఆర్థికంగా ఇబ్బందికి గురి చేసే అవకాశాలు ఉన్నాయి. అందుకే విద్యారుణాల విషయంలో కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

ఖర్చులను అంచనా వేయండి..
Foreign Education Loan Calculator : విదేశాల్లో మనం చేసే కోర్సుకు సంబంధించిన మొత్తం వ్యయాన్ని ముందే అంచనా వేసుకోవాలి. ఇందుకోసం అప్పటికే ఆ దేశంలో చదవిన వారితో మాట్లాడి వివరాలు తెలుసుకోండి. కేవలం కోర్సుకు అయ్యే ఖర్చు మాత్రమే కాకుండా ఇతర ఖర్చులను పరిగణనలోకి తీసుకోండి. అందుకు అనుగుణంగా రుణదాతల నుంచి రుణం పొందండి. అయితే ఇందుకోసం కొన్ని రుణసంస్థలు ఖర్చును అంచనా వేసేందుకు ఉపయోగపడే కాలిక్యులేటర్ల (Student Loan Calculator)ను అందిస్తున్నారు. వాటి సాయం తీసుకోవచ్చు.

అవగాహన తప్పనిసరి..
Education Loan : ఎడ్యుకేషన్​ లోన్​ ఎంచుకునే ముందు సొంతంగా కొంత పరిశోధన చేయాలి. ఇంతకు ముందు రుణాలు తీసుకున్న బంధువులు లేదా స్నేహితులతో మాట్లాడాలి. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు ఈ విషయంలో విద్యార్థులకు సహకారం అందిస్తాయి. విద్యా రుణాల గురించి, అందులో ఉండే ప్రక్రియల గురించి అర్థం చేసుకోవడంలో ఈ సలహాలు ఉపయోగపడతాయి. రుణం కోసం దరఖాస్తు చేసేముందు అర్హత ప్రమాణాలు, దరఖాస్తు విధానం, అవసరమైన పత్రాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.

అలాంటి సంస్థలనే ఎంచుకోండి..
Foreign Education Loan : విద్యార్థులు విద్యా రుణాన్ని (Education Loan Tips) తీసుకునే ముందు కోర్సుకు మాత్రమే అయ్యే ఖర్చులే కాకుండా ఇతర అనుబంధ ఖర్చులను కూడా అంచనా వేయాలి. ఇందుకోసం మీరు తీసుకునే రుణం వీటికి కూడా వర్తించేలా ఉండాలి. ప్రయాణ ఖర్చులు, వసతి ఖర్చులు, ట్యూషన్​ ఫీజులు, ల్యాప్‌టాప్‌లు, పుస్తకాలు సహా ఇతర ఖర్చులను కూడా అందించే రుణసంస్థలనే ఎంచుకోవాలి.

వడ్డీ రేట్లను మాత్రమే కాదు..
Student Loan Interest Rates : ఇతర రుణాలతో పోలిస్తే విద్యా రుణాలు ప్రత్యేకమైనవి. వీటిని అందించేందుకు రుణదాతలు కచ్చితమైన విధానాలను పాటిస్తాయి. అందుకే రుణదాతలను ఎంచుకునేటప్పుడు చేసే చిన్న పొరపాటులు దీర్ఘకాలంలో మనకే భారంగా మారవచ్చు. అందువల్ల కేవలం వడ్డీ రేట్లను మాత్రమే లెక్కలోకి తీసుకోవద్దు. లోన్​తో పాటు బ్యాంకులు అందించే ఇతర ప్రయోజనాలను కూడా చూసుకోండి.

ఇలాంటి రుణసంస్థల ఎంపిక మంచిది..
Education Loan Companies : కొన్ని రుణసంస్థలు విదేశాల్లోని కళాశాలలు, విశ్వవిద్యాలయాలతో ఒప్పందాలు చేసుకుంటాయి. మీరు ఎంచుకునే కాలేజీ లేదా యూనివర్సిటీతో కూడా వీరికి మంచి భాగస్వామ్యం ఉందో, లేదో తెలుసుకోండి. ఒక వేళ ఉంటే.. ఆ ఆర్థిక సంస్థల నుంచి రుణం తీసుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు మీకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా, మీ అర్హతను అనుసరించి సులభంగా రుణాలు మంజూరు అవుతాయి.

ఇది కూడా ముఖ్యమే..
Student Loan Calculator : విద్యా రుణాలను తీసుకునేటప్పుడు వాటిని ఎంత కాలం కొనసాగించాలనుకుంటున్నారు అన్నది కూడా చాలా ముఖ్యం. అందుకే విద్యార్థులు తమకు అనువైన కాల వ్యవధిని ఎంచుకోవాలి. దీనికోసం ముందుగానే బ్యాంకులతో చర్చించడం ముఖ్యం. మారటోరియం వ్యవధిలో విద్యార్థులు సాధారణ/ పాక్షిక వడ్డీని చెల్లిచడం మంచిది. దీనితో విద్యార్థిపై వడ్డీ భారం కూడా తగ్గుతుంది.

Resume: రెజ్యూమ్‌లో ఈ పదాలు వాడితే ఉద్యోగం రావడం పక్కా.. అవేంటో ఓ లుక్కేయండి!

రెజ్యూమ్ అనేది జాబ్‌ (Job) పొందడానికి డోర్స్ ఓపెన్ చేసే ఒక తాళం లాంటిది. ఇదే బాగోలేకపోతే జాబ్ హైరింగ్ (Hiring) ప్రాసెస్‌లో మొదటి మెట్టు వద్దే వెనక్కి తిరగాల్సి వస్తుంది.
హైరింగ్ మేనేజర్లకు స్కిల్స్, ఎక్స్‌పీరియన్స్, అచీవ్‌మెంట్స్ స్పష్టంగా తెలియజేయడానికి రెజ్యూమ్ ఒక చక్కని అవకాశాన్ని అందిస్తుంది. దీనిని సద్వినియోగం చేసుకొని అందరికంటే భిన్నంగా నిలవాల్సిన బాధ్యత అభ్యర్థులపై ఉంటుంది. ఇందుకు CVలో పవర్ వర్డ్స్ ఉపయోగించడం చాలా కీలకం. ముఖ్యంగా కొన్ని పదాలను వాడితే జాబ్ వచ్చే అవకాశం పెరుగుతుంది. అవేంటో తెలుసుకోండి.

అచీవ్డ్‌ (Achieved)

ఉద్యోగార్థులు రెజ్యూమ్‌లో విజయాలు, సాధించిన గొప్ప ఫలితాలను తెలియజేయడానికి ఈ పదం వాడాలి. అచీవ్డ్‌ (Achieved) ఉపయోగించినప్పుడు, తప్పనిసరిగా లక్ష్యాన్ని చేరుకున్నామని లేదా అధిగమించామని చెప్పినట్లు అవుతుంది. అలానే పనులను పూర్తి చేయగల సత్తా ఉన్న హై-అచీవర్ అభ్యర్థిని అని హైరింగ్ మేనేజర్లకు స్పష్టంగా తెలియజేయడం సాధ్యమవుతుంది.

లెడ్‌ (LED)

లీడర్‌షిప్ స్కిల్స్, ఎక్స్‌పీరియన్స్ ఉందని చెప్పడానికి రెజ్యూమ్‌లో లెడ్‌ (LED) పదం వాడాలి. “లెడ్‌” ఉపయోగించి ఒక టీమ్‌ను లీడ్ చేశామని లేదా ప్రాజెక్ట్‌ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేయడానికి సహోద్యోగులను గైడ్ చేశామని చెప్పవచ్చు. తద్వారా బాధ్యతలు స్వీకరించే సామర్థ్యం ఉందని, సాధారణ లక్ష్యాలను సాధించడానికి ఇతరులను ప్రేరేపించగలమని హెచ్ఆర్లకు సింపుల్‌గా తెలియజేయవచ్చు.

ఇన్‌ఫ్లూయన్స్డ్‌ (Influenced)

మార్పు తీసుకురాగల సామర్థ్యం ఉందని చూపించడానికి ఇన్‌ఫ్లూయన్స్డ్‌ (Influenced) వర్డ్ వాడటమే ఉత్తమ మార్గం. Influenced పదంతో ఇతరులు ఆలోచించే లేదా ప్రవర్తించే విధానాన్ని మార్చామని, ఆ మార్చగలమనే శక్తి ఉందని తెలియజేయవచ్చు. ఈ లక్షణం వల్ల అభ్యర్థులు కంపెనీకి విలువైన ఆస్తి అవుతారని హెచ్‌ఆర్ మేనేజర్లు అనుకుంటారు.

ఇన్నొవేటెడ్ (Innovated)

క్రియేటివిటీ, ప్రాబ్లెమ్ సాల్వింగ్ స్కిల్స్ హైలైట్ చేయడానికి ఈ పదం సరైనది. “ఇన్నొవేటెడ్” వర్డ్‌తో ఒక ప్రక్రియ లేదా ప్రొడక్ట్‌ను ఇంప్రూవ్ చేయడానికి కొత్తగా ఆలోచనలు చేసామని లేదా పరిష్కారాలు కనిపెట్టామని చెప్పవచ్చు. ఇది రెజ్యూమ్‌లో రాయడం వల్ల ఔట్ ఆఫ్ ది బాక్సింగ్ థికింగ్‌కు భయపడని, ఫార్వర్డ్‌గా ఆలోచించే అభ్యర్థి అని కంపెనీలు అర్థం చేసుకుంటాయి.

స్ట్రీమ్‌లైన్డ్ (Streamlined)

సామర్థ్యాన్ని, ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేసుకోగలమని చెప్పడానికి “స్ట్రీమ్‌లైన్డ్” అని CVలో స్పష్టంగా రాయాలి. ఈ వర్డ్‌తో ఏ పని అయినా సమర్థవంతంగా చేయడానికి ఒక మార్గాన్ని కనుగొనగలమని తెలియపరచవచ్చు. ఈ పవర్‌ఫుల్ వర్డ్ ఉపయోగించడం వల్ల సదరు అభ్యర్థి కంపెనీ సమయాన్ని, డబ్బును ఆదా చేయడంలో విలువైన ఆస్తి అవుతారని నిర్వాహకులు భావిస్తారు.

రివిటలైజ్డ్ (Revitalized)

టీమ్, ప్రాజెక్ట్ లేదా సంస్థకు కొత్త ఎనర్జీని అందించగలమని చూపించడానికి ఈ పదం వాడాలి. “రివిటలైజ్డ్”తో స్తబ్దుగా ఉన్న లేదా పనితీరు తక్కువగా ఉన్న దాన్ని విజయవంతంగా మెరుగుపరిచామని తెలియజేయవచ్చు. రిస్క్ తీసుకోవడానికి భయపడని అభ్యర్థినని HRs భావించేలా చేయవచ్చు.

ఇంప్లిమెంటెడ్ (Implemented)

ఒక ఆలోచనను కాన్సెప్ట్ నుంచి రియాలిటీకి తీసుకెళ్లగలమని చూపించడానికి ఈ పదం సరైనది. “ఇంప్లిమెంటెడ్” వర్డ్‌తో ఒక ప్లాన్‌ను అమలులోకి తెచ్చామనే విషయాన్ని CVలో హైలెట్ చేయవచ్చు. ఒక పనిని పూర్తి చేయగలమనే నమ్మకాన్ని రిక్రూటర్లలో పెంచి జాబ్ సొంతం చేసుకోవచ్చు.

Mosquitoes : రెండు లవంగాలతో ఇలా చేస్తే ఒక్క దోమ కూడా ఇంట్లో ఉండదు.!!

Mosquitoes : వర్షాకాలం వచ్చిందంటే వీటికి మరింత బలం వస్తుంది. ఇంట్లో ప్రతి మూలన దాక్కుని ప్రత్యేకంగా పగటిపూట కొన్ని రకాల దోమలు కుట్టి మనల్ని వ్యాధుల బారిన పడేస్తాయి.

ఇక మొక్కలు పెంచుకునే వాళ్ళు ఉంటే వాటికి మరింత షెల్టర్ ఇచ్చినట్లు అవుతుంది. మరి ఈ దోమలను ఎలా తరిమికొట్టాలి.. మన ఇంట్లో దోమలు తిష్ట వేయకుండా ఉండడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అనే విషయాలైతే పూర్తిగా తెలుసుకుందాం.. అంతే కాకుండా ఎన్ని రకాల డివైస్లు వాడిన దోమలు పోవడం లేదు కదా.. మార్కెట్లో దొరికే రకరకాల ఆయిల్స్ వలన వాటి ద్వారా క్యాన్సర్ వస్తుందని చాలామంది ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొంతమందికి దోమ కుట్టగానే చేతితో కొట్టడం అలవాటు ఉంటుంది.

ఈ దోమల జాతులు ఆరువైన సమృద్ధిగా ఉన్నప్పటికీ ఈ దోమలు పగటి పూట ఇళ్లలోకి వస్తాయి. ముఖ్యంగా వర్షాకాలంలో దోమల విపరీతంగా ఇళ్లలోకి వస్తాయి. ఈ ప్రాణాంతక వ్యాధులను కలిగించే దోమలను ఇంట్లోంచి ఎలా తరిమికొట్టాలో ఇప్పుడు చూద్దాం.. ముందుగా మన ఇంట్లో రెగ్యులర్గా వాడుకునే లవంగాలు ఉంటాయి కదా.. వాటిని ఒక నాలుగు తీసుకోండి.. అలాగే మూడు కర్పూరం బిళ్ళలు కూడా తీసుకోండి. ఈ రెండింటి నుంచి వచ్చే వాసన దోమలకి అస్సలు గిట్టదు.. మీరు పిలిచిన సరే లోపలికి రానే రావు.. దోమలను తరిమి కొట్టడానికి పూర్వకాలంలో ఈ కర్పూర బిల్లలను నీటిలో వేసి గదిలో ఒక మూల పెట్టుకొని వారు ఆ కర్పూర వాసనకి దోమలు వచ్చేవి కాదట..

కర్పూరం అనేది సహజ సిద్ధంగానే ఒక చెట్టు బెరడు నుంచి తయారయ్యే రసాయనం. కాబట్టి ఇది చాలా అద్భుతంగా దోమలు కొట్టడంలో ఉపయోగపడుతుంది. అందుకే ఈ వాసన మనకు ఎటువంటి హాని చేయదు. ఇప్పుడు ఒక మట్టి పాత్రను తీసుకోండి.. తీసుకుని అందులో కర్పూరం, లవంగాలను జాగ్రత్తగా పేర్చండి. అంటే మనం వీటిని వెలిగించబోతున్నాం.. ఇప్పుడు వీటిని వెలిగించి గదిలో ఎవరికీ ఇబ్బంది లేని ఒకచోట ఉంచి తలుపులు కిటికీలు ద్వారా అన్నీ కూడా మూసేయండి. ఒక పది నిమిషాల పాటు అలా మూసి ఉంచి పది నిమిషాల తర్వాత మెయిన్ డోర్ ఓపెన్ చేసుకోండి. అప్పుడు ఇంట్లో మిగిలిపోయిన దోమలు ఉంటే చనిపోకుండా మిగిలిపోయిన దోమలు ఏమైనా ఉంటే బయటికి వెళ్లిపోతాయి. అలా పది నిమిషాల తర్వాత మళ్లీ తలుపులు వేసేయండి. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే కనుక దోమలు ఇంట్లోకి రమ్మన్నారావు..

How to Apply SBI Mudra Loan in Online : క్షణాల్లో 50 వేల బ్యాంకు రుణం.. ఎలాంటి హామీ పత్రాలు లేకుండానే!

SBI Mudra Loan Rules 2023 :వ్యాపారంలో ప్రవేశించాలనీ, ఎదగాలనీ చాలా మందికి ఉంటుంది. కానీ.. ఆర్థిక సమస్యే ప్రధాన అడ్డుగోడగా నిలుస్తుంది. ఇలాంటి వారికి నేనున్నా అంటోంది SBI ముద్ర లోన్.
మరి, ఆ రుణం ఎలా పొందాలో మీకు తెలుసా..?

How to Get SBI Mudra Loan : చేస్తున్న ఉద్యోగం కన్నా.. బిజినెస్ మీదనే ఆసక్తి ఉంటుంది కొందరికి! ఎలాంటి జాబ్ లేని వారు కూడా.. ఏదైనా చిన్నపాటి వ్యాపారం చేసుకుంటే బాగుండు అనుకుంటారు. కానీ.. డబ్బు సమస్య వారిని ముదుకు అడుగు వేయనీయదు. ఇలాంటి వారి లిస్టులో మీరున్నారా..? అయితే.. మీకోసమే ఎస్​బీఐ ముద్ర లోన్ (SBI Mudra Loan) అందుబాటులోకి తెచ్చింది. ఈ స్కీం ద్వారా.. తక్షణమే 50 వేల నుంచి 10 లక్షల దాకా రుణం పొందే సదుపాయాన్ని కల్పిస్తోంది. ఇది కూడా ఎలాంటి హామీ పత్రాలు లేకుండానే అందిస్తోంది. మరి, ఆ రుణం ఎలా పొందాలి? ఇందుకోసం ఎలాంటి డాక్యుమెంట్లు సమర్పించాలి? ఎలా దరఖాస్తు చేయాలి? వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం.

ముద్ర లోన్ పొందడానికి అర్హతలు..

SBI ముద్ర లోన్ కోసం అప్లై చేయాలనుకునే వారికి.. ఖచ్చితంగా SBIలో అకౌంట్ ఉండాలి.
దరఖాస్తుదారు.. SBIలో ఖాతా (కరెంట్ లేదా సేవింగ్స్) తెరిచి కనీసం 6 నెలలై ఉండాలి.
లోన్ పొందాలనుకునేవారు.. తయారీ లేదా సేవల రంగంలో పనిచేస్తూ ఉండాలి.
దరఖాస్తుదారు ఇప్పుడు ఉంటున్న ఇంట్లో.. కనీసం రెండేళ్లుగా నివసిస్తూ ఉండాలి.

ముద్ర లోన్ కోసం ఏం పత్రాలు కావాలి?

లోన్ కావాలనుకునే వ్యక్తి ఆధార్ కార్డు
నివాస ధ్రువీకరణ పత్రం
కుల ధ్రువీకరణ పత్రం
GST రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్
వ్యాపార స్థాపన సర్టిఫికేట్
పూర్తిచేసిన దరఖాస్తు ఫామ్ పై పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో

ఎంత రుణం ఇస్తారు..?

ముద్ర లోన్ దరఖాస్తు దారుకు తక్షణంగా రూ.50 వేల వరకు రుణం ఇస్తారు.
గరిష్టంగా మాత్రం రూ.10 లక్షల వరకూ రుణం మంజూరు చేసే అవకాశం ఉంది.
రూ.50 వేల లోపు లోన్ కోసం దరఖాస్తు దారు ఇంట్లోనే ఉండి ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
రూ. 50 వేల కంటే ఎక్కువ లోన్ కావాల్సి వస్తే మాత్రం.. దగ్గరలోని SBI శాఖను సందర్శించి.. వివరాలు సమర్పించాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఎలా చేయాలి..?

ముద్ర రుణం కోసం దరఖాస్తు చేసేందుకు SBI అఫీషియల్ వెబ్ సైట్.. emudra.sbi.co.in లోకి ప్రవేశించాలి.
ఇప్పుడు హోమ్ పేజీలో “ప్రొసీడ్ ఫర్ ఇ-ముద్ర” అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
ఇక్కడ నిబంధనలు కనిపిస్తాయి. వాటిని జాగ్రత్తగా చదవిన తర్వాత “ఓకే” బటన్‌పై క్లిక్ చేయాలి.
తర్వాత స్క్రీన్‌పై ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మొబైల్ నంబర్, SBI అకౌంట్ నంబర్, ఇంకా మీకు అవసరమైన రుణం మొత్తాన్ని ఎంటర్ చేయాలి.
సమాచారం ఫిల్ చేసిన తర్వాత “Proceed” పై క్లిక్ చేయాలి.
ఇప్పుడు స్క్రీన్‌పై వ్యక్తిగత సమాచారం నింపమని అడుగుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ నింపి, అడిగిన అర్హతా పత్రాల స్కాన్ కాపీని అప్‌లోడ్ చేయాలి.
ఆ తర్వాత ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేసి, షరతులకు అంగీకరించాలి.
ఇప్పుడు మీ మొబైల్‌ నంబర్ కు OTP వస్తుంది. దాన్ని ఎంటర్ చేయడంతో.. మీ ముద్ర లోన్ అప్లికేషన్ ప్రక్రియ పూర్తయిపోతుంది.

Savings Account: సేవింగ్స్‌ అకౌంట్‌లో ఎంత డబ్బు ఉండొచ్చు? నిపుణుల సూచనలు ఇవే

ఈ రోజుల్లో బ్యాంక్ అకౌంట్ (Bank Account) లేనివారు చాలా అరుదు. వివిధ సంక్షేమ పథకాల రాయితీలను లబ్ధిదారుల సేవింగ్స్ అకౌంట్‌కు (Savings Account) ప్రభుత్వాలు అందజేస్తున్నాయి.
అయితే ప్రతి ఒక్కరి ఫైనాన్షియల్‌ జర్నీ సేవింగ్స్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేయడంతోనే మొదలవుతుంది. ఈ అకౌంట్‌లో డబ్బు సురక్షితంగా ఉంటుంది. అవసరమైనప్పుడు సులభంగా తీసుకోవచ్చు. డిపాజిట్లపై వడ్డీ కూడా అందుతుంది. కానీ సేవింగ్స్‌ అకౌంట్‌లో ఎక్కువ డబ్బు ఉంచుకోవడం సరికాదు. ఆదాయాలను పెంచుకోవడానికి ఇన్వెస్ట్‌మెంట్‌ సరైన మార్గం. అయితే ఒక వ్యక్తి సేవింగ్స్ అకౌంట్‌లో ఎంత డబ్బు ఎంచుకోవడం మంచిది? దీనిపై ఒక నిర్ణయానికి ఎలా రావాలి? వంటి వివరాలు తెలుసుకుందాం.

ఆర్థిక స్థితి

సేవింగ్స్‌ అకౌంట్‌లో ఉంచాల్సిన నిధులను నిర్ణయించేటప్పుడు ఆర్థిక స్థితి, ఆదాయం, ఖర్చులు, అప్పులు, భవిష్యత్తు లక్ష్యాలను రివ్యూ చేయాలి. అప్పులు ఉంటే, సేవింగ్స్‌ అకౌంట్‌కి ఎక్కువ నిధులు కేటాయించే ముందు, వాటిని క్లియర్‌ చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పులు తీరిన తర్వాత సేవింగ్స్‌ పెంచుకోవాలి.
ద్రవ్యోల్బణం

కాలక్రమేణా ద్రవ్యోల్బణం డబ్బు కొనుగోలు శక్తిని తగ్గిస్తుంది. సేవింగ్స్‌ అకౌంట్‌ వడ్డీ ద్రవ్యోల్బణంతో సమానంగా ఉండకపోవచ్చు. అంటే ఇది పొదుపు విలువ క్షీణతకు దారి తీస్తుంది. దీన్ని ఎదుర్కోవడానికి, తక్కువ రిస్క్ ఇన్వెస్ట్‌మెంట్‌లు లేదా మ్యూచువల్ ఫండ్స్ వంటి అధిక రాబడిని అందించే ఆస్తులలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టాలి.

రిటర్న్స్‌

సేవింగ్స్‌ అకౌంట్లతో సేఫ్టీ, కన్వీనియన్స్‌ ఉంటాయి. అయితే వీటిలో పెద్ద మొత్తంలో డబ్బు ఉంచడం వల్ల కలిగే నష్టాన్ని కూడా అంచనా వేయాలి. ఫిక్స్‌డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్‌లు లేదా స్టాక్‌లు వంటి ఇతర పెట్టుబడులతో పోలిస్తే సాధారణంగా సేవింగ్స్‌ అకౌంట్‌ వడ్డీ తక్కువగా ఉంటుంది. అందుకే ఈ నిధులను పెట్టుబడులకు మళ్లించాలి. సేఫ్టీ, పొటెన్షియల్‌ రిటర్న్స్‌ బ్యాలెన్స్‌ చేయడానికి ఆర్థిక ఆకాంక్షలు, రిస్కు తీసుకునే సామర్థ్యం అంచనా వేయాలి.
నెలవారీ ఖర్చులు

తగిన సేవింగ్స్‌ అకౌంట్‌ బ్యాలెన్స్‌ని నిర్ణయించేటప్పుడు నెలవారీ ఖర్చులు, క్యాష్‌ ఫ్లో పరిగణించాలి. రెంట్‌, యుటిలిటీలు, కిరాణా సామగ్రి, ఇన్సూరెన్స్‌ ప్రీమియం వంటి ముఖ్యమైన ఖర్చులను కవర్ చేసే మొత్తాన్ని లెక్కించాలి. ఊహించని ఖర్చులు వచ్చినా కూడా తీర్చగలిగేలా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.

స్వల్పకాలిక లక్ష్యాలు

విహారయాత్ర, ఇంటి డౌన్ పేమెంట్ లేదా ముఖ్యమైన కొనుగోలు వంటి స్వల్పకాలిక లక్ష్యాల కోసం పొదుపు చేయడానికి సేవింగ్స్‌ అకౌంట్‌లో డబ్బును మెయింటెన్ చేయవచ్చు. ఎంత కేటాయించాలనేది నిర్ణయించడానికి నిర్దిష్ట లక్ష్యాలను, వాటి టైమ్‌లైన్‌ని అంచనా వేయాలి. డెడికేటెడ్‌ అకౌంట్ ఉండటం వల్ల ఎమర్జెన్సీ ఫండ్ లేదా దీర్ఘకాలిక పెట్టుబడులు ప్రభావితం కావు.

ఎమర్జెన్సీ ఫండ్‌
సేవింగ్స్‌ అకౌంట్‌ ప్రాథమిక విధి ఎమర్జెన్సీ ఫండ్‌ ఏర్పాటు చేయడం. మూడు నుంచి ఆరు నెలల జీవన వ్యయాలకు సరిపడా మొత్తాన్ని సేవింగ్స్‌ అకౌంట్‌లో ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. వైద్యపరమైన సంక్షోభాలు, ఉద్యోగ నష్టం లేదా పెద్ద మరమ్మతుల వంటి ఊహించలేని పరిస్థితుల నుంచి ఈ డబ్బు రక్షిస్తుంది.
Bankbazaar.com సీఈవో ఆదిల్ శెట్టి ‘ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్‌’తో మాట్లాడుతూ.. ‘డబ్బును సేవింగ్స్‌ అకౌంట్‌లో ఉంచితే సేఫ్టీ, యాక్సెసిబిలిటీ లభిస్తుంది. స్వల్పకాలిక అవసరాలు, అత్యవసర పరిస్థితులు, రోజువారీ ఖర్చుల కోసం ఈ ఖాతా నమ్మదగిన ఆప్షన్‌. అయితే సాధారణంగా సేవింగ్స్‌ అకౌంట్‌లు తక్కువ వడ్డీ రేట్లు ఇస్తాయి. సంపదను నిర్మించడానికి, ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి, స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక అవసరాలకు అనుగుణంగా పెట్టుబడులను డైవర్సిఫై చేయడం అవసరం.’ అని చెప్పారు.

Ayushman Card: రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స సదుపాయం.. ఆయుష్మాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోండిలా!

దేశంలోని ప్రతి వర్గానికి మెరుగైన ఆరోగ్య సౌకర్యాలను అందించడానికి, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రధాన మంత్రి జన్-ఆరోగ్య యోజన అంటే ఆయుష్మాన్ భారత్ యోజనను ప్రారంభించింది.

ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య పథకం. దీని ద్వారా కోట్లాది మంది అల్పాదాయ, మధ్యతరగతి ప్రజలు రూ. 5 లక్షల వరకు ఉచిత చికిత్సను పొందుతున్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఈ పథకాన్ని సెప్టెంబర్ 23, 2018న ప్రారంభించింది. మీరు కూడా ఈ పథకం ప్రయోజనాన్ని పొందాలనుకుంటే మీరు దాని కోసం సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆయుష్మాన్ భారత్ పథకానికి అర్హత ఏమిటి?

ఆయుష్మాన్ భారత్ పథకం కోసం దరఖాస్తు చేయడానికి ముందు, దాని అర్హత గురించి సమాచారాన్ని పొందడం అవసరం. పేద, బలహీన ఆదాయ వర్గాలకు చెందిన వారి కోసం ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఎస్సీ, ఎస్టీ, నిరుపేదలు, కార్మికులు మొదలైనవారు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మీరు మీ అర్హతను తనిఖీ చేయాలనుకుంటే PMJAY అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఇక్కడ Am I Eligible ట్యాబ్‌పై క్లిక్ చేయండి. దీని తర్వాత మీరు మీ అర్హతను సులభంగా తనిఖీ చేయగల పేజీకి దారి మళ్లించబడతారు. ఈ పేజీలో మీరు మీ మొబైల్ నంబర్, రేషన్ కార్డ్ నంబర్‌ను నమోదు చేయాలి. దీని తర్వాత మీరు కొన్ని నిమిషాల్లో మీ అర్హతను తెలుసుకుంటారు.

ఈ సౌకర్యాల ప్రయోజనాలు పథకం కింద అందుబాటులో..

ఈ పథకం కింద, లబ్ధిదారులకు దేశంలోని ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆసుపత్రుల్లో రూ. 5 లక్షల వరకు ఉచిత చికిత్స సౌకర్యం లభిస్తుంది. దీంతో పాటు ఆసుపత్రిలో చేరిన తర్వాత కూడా వచ్చే 15 రోజులకు అయ్యే ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుంది. ఈ పథకం ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులో కుటుంబ సభ్యులందరూ వారి వయస్సు, తదితర వివరాలు అవసరం. ఇందులో ఆయుష్మాన్ యోజన పూర్తిగా నగదు రహిత పథకం కాబట్టి మీరు ఒక్క రూపాయి కూడా నగదుగా చెల్లించాల్సిన అవసరం లేదు.

ఈ పత్రాలు అవసరం

ఆధార్ కార్డు

రేషన్ కార్డు

ఆదాయ ధృవీకరణ పత్రం

కుల ధృవీకరణ పత్రం (అవసరమైతే)

మొబైల్ నంబర్

పాస్‌ పోర్ట్‌ సైజు ఫోటో

పథకం కోసం ఎలా దరఖాస్తు చేయాలి?

ఆయుష్మాన్ భారత్ పథకం కోసం దరఖాస్తు చేయడానికి ముందుగా దాని అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

కొత్త రిజిస్ట్రేషన్ కోసం, ‘కొత్త రిజిస్ట్రేషన్’ లేదా ‘వర్తించు’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.

దీని తర్వాత మీరు మీ పేరు, లింగం, ఆధార్ నంబర్, రేషన్ కార్డు మొదలైన వాటి సమాచారాన్ని నమోదు చేయాలి.

మీరు నమోదు చేసే ఏ సమాచారం అయినా సరైనదేనని గుర్తుంచుకోండి. క్రాస్ చెక్ చేయండి.

అడిగిన అన్ని పత్రాలను అప్‌లోడ్ చేయండి.

మొత్తం దరఖాస్తు ఫారమ్‌ను ఒకసారి తనిఖీ చేసి, ఆపై దానిని సమర్పించండి.

దరఖాస్తు సమర్పించిన తర్వాత, అధికారులు మీ దరఖాస్తును సమీక్షిస్తారు.

దీని తర్వాత మీరు ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఆరోగ్య కార్డును సులభంగా పొందుతారు.

Significance of the Yuga Cycle: కలియుగం అంతమై మళ్లీ సత్యయుగం ఎప్పుడు ప్రారంభమవుతుంది!

The 4 Yugas Time and Yugantham : యుగాలు 4
1. సత్యయుగం

2. త్రేతాయుగం

3. ద్వాపరయుగం

4. కలియుగం

పురాణాల ప్రకారం… సత్య యుగం నుంచి కలియుగానికి చేరుకునే సరికి మానవుల సగటు ఎత్తు, ఆయు:ప్రమాణం, తెలివితేటలు తగ్గుతూ వచ్చాయి.
సత్యయుగంలో లక్ష సంవత్సరాలు జీవిస్తే త్రేతాయుగానికి పదివేలకు చేరుకుంది. వాల్మీకి రామాయణం ప్రకారం రాముడు 11,000 సంవత్సరాలు జీవించాడు. ద్వాపర యుగంలో కృష్ణుడు 125 ఏళ్లు జీవించాడు. కృష్ణుడు మరణంతోనే ద్వాపరయుగం ముగిసి…కలియుగం ప్రారంభమైంది. మొదటి యుగంలో ధర్మం నాలుగుపాదాలపై నడిస్తే..రెండో యుగంలో మూడు పాదాలపై..మూడో యుగంలో రెండు పాదాలపై నడిచింది. ఇక ప్రస్తుతం నడుస్తోన్న కలియుగంలో ధర్మం, మంచి అంటే భూతద్ధం పెట్టుకుని వెతుక్కోవాల్సిందే.

సత్యయుగం (కృతయుగం)

నాలుగు యుగాల్లో మొదటిది సత్యయుగం . దీన్నే కృతయుగం అని కూడా అంటారు. ఈ యుగంలో భగవంతుడు నారాయణుడు, లక్ష్మీ సమేతంగా భూమిని పరిపాలించాడు. దీని కాల పరిమాణం 17 లక్షల 28 వేల సంవత్సరాలు. ఈ యుగంలో ధర్మం నాలుగుపాదాల మీద నడిచిందని శివపురాణం చెబుతోంది. అందుకే ప్రజలు ఎలాంటి బాధలు లేకుండా సుఖసంతోషాలతో ఉన్నారు. అకాల మరణాలు లేవు. కృత యుగానికి రాజు సూర్యుడు, మంత్రి గురువు. గురువు బంగారానికి అధిపతి కాబట్టి ఎటు చూసినా బంగారు మయం. ప్రభువు-ప్రజల మధ్య ఎలాంటి విభేదం లేకుండా కాలం చక్కగా నడిచింది.

త్రేతాయుగం

త్రేతాయుగంలో భగవంతుడు శ్రీ రామచంద్రుడుగా అవతరించి రావణాసురుణ్ణి సంహరించి ధర్మ సంస్థాపన చేసాడు. ఈ యుగం పరిమితి 12 లక్షల96 వేల సంవత్సరాలు. ఈ యుగంలో ధర్మం మూడు పాదాలపై నడిచింది. త్రేతాయుగంలో రాజుగా కుజుడు, మంత్రిగా శుక్రుడు ఉన్నారు. కుజుడు యువకుడు, యుద్ధప్రియుడు, సుక్షిత్రుయుడు, రాజుగా ఆచారాలకు కట్టుబడి ఉండకుండా తిరిగేవాడు. రాక్షస గురువైన శుక్రాచార్యుడు స్త్రీ కారకుడు మాయ మంత్ర తంత్రవాది, కుజుడుకి పరమ శత్రువు. రాజుమాటకి మంత్రి మాటకి పడకపోవడం వల్ల మంత్రులు క్రూర స్వభావులై రాజ్యపాలనను బ్రష్టు పట్టించారు. స్త్రీ వ్యామోహంతో కలహాలు పెంచి దైవకార్యాలు నిర్వహించే వంశాలను అంతరరించేలా చేశారు. ఇలా రాక్షసులు, దుర్మార్గుల వలన త్రేతాయుగంలో ధర్మం ఒకభాగం దెబ్బతిని మూడుపాదాలపై నడిచింది.

ద్వాపరయుగం

మూడోది ద్వాపర యుగం. శ్రీ మహావిష్ణువు శ్రీ కృష్ణుడుగా అవతరించాడు. దీని కాల పరిమాణం 8 లక్షల 64 వేల సంవత్సరాలు. ద్వాపర యుగంలో రాజుగా చంద్రుడు, మంత్రిగా బుధుడు ఉన్నారు. చంద్రుడిది గురు వర్గం, బుధుడిది శనివర్గం. అందుకే వీరిద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు. బుధుడు చెడు విద్యలను రాక్షసులకు , దుర్మార్గులకు ఇచ్చి సాధువులకు, సజ్జనులకు, స్త్రీలకు అపకారం చేయమని పురికొల్పుతాడు. దేవతా కార్యాలు జరగకుండా అడ్డుపడతాడు. చంద్రుడు సకలవిద్యా పారంగతుడు. రాజులకు సకల విద్యలు నేర్పించి దుష్టులను-మాయావులను నాశనం చేయడానికి సహకరిస్తాడు. ఈ విధంగా ద్వాపర యుగంలో ధర్మం రెండు భాగాలు నశించి కలియుగం ప్రారంభమైంది.

కలియుగం

నాలుగోది కలియుగం. దీని కాలపరిమితి 4 లక్షల 32 వేల సంవత్సరాలు. అందులో సుమారుగా ఐదు వేల సంవత్సరాలు గడిచిపోయాయి. సూర్య సిద్ధాంతం ప్రకారం పూర్వ శఖము 3102 ఫిబ్రవరి 18 అర్ధరాత్రి కలియుగం ప్రారంభమైంది. కలియుగానికి రాజు శని. మంత్రులు రాహు-కేతువులు. మంత్రులిద్దరికీ ఒకరకంటే ఒకరికి పడదు. రాహువు శనికి మిత్రుడు. కలియుగం ఆరంభంలో నాలుగు ధర్మ శాస్త్రాలు వాటిని రక్షించే బ్రాహ్మణులను, అగ్రహారాలను , రాజులను నశింపచేస్తూ వచ్చారు. అప్పటి నుంచి క్రూరత్వం, అసత్యం, అప్రమాణం, అధర్మం, అన్యాయం తలెత్తాయి. వావి-వరుసలు తప్పి, వర్ణ సంకరాలు మొదలై దొరలే దొంగలవుతారు. దైవభక్తి తగ్గి హింసా సిద్ధాంతాలు పెరుగుతాయి. స్త్రీని, ధనాన్ని పొందినవాడే గొప్పవాడని అనుకునే రోజులొస్తాయి. అధర్మం, వర్ణద్వేషాలు, మత విద్వేషాలు పెరుగుతాయి. ఈ యుగంలో మానవుడి సగటు ఆయుష్షు వందేళ్ల కన్నా తక్కువే. యుగాంతానికి ఈ వయసు 12 ఏళ్లకు తగ్గిపోతుందని భగవద్గీతలో ఉంది.

కలియుగాంతంలో కల్కి రూపంలో భగవంతుడు అవతరించి తిరిగి సత్య యుగ స్థాపనకు మార్గం సుగమం చేస్తాడని శివపురాణం చెబుతోంది. సత్యయుగం ప్రారంభమైనప్పటి నుంచీ మళ్లీ అంతా మంచే జరుగుతుంది..

Railway Jobs 2024 : రైల్వేలో 1646 యాక్ట్ అప్రెంటిస్ లు..అర్హతలేంటంటే?

రైల్వే జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీకు శుభవార్త..

ఇటీవల రైల్వే 1646 యాక్ట్ అప్రెంటీస్ల కోసం దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం పోస్టుల సంఖ్య.. 1646
డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీసర్ (అజ్మీర్), డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీస్ (బికనీర్), డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీస్ (జైపూర్), డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీస్ (జోధ్పూర్), BTC క్యారేజ్ (అజ్మీర్), BTC లోకో (అజ్మీర్), క్యారేజ్ వర్క్షాప్ (బికనీర్), క్యారేజ్ వర్క్షాప్ (జోధ్పూర్)..

Sectors

ఎలక్ట్రికల్,
కార్పెంటర్,
పెయింటర్,
మేసన్,
పైప్
ఫిట్టర్,
కార్పెంటర్,
డీజిల్ మెకానిక్,
వెల్డర్,
మెకానికల్,
డీజిల్ మెకానిక్,
ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్

Eligibility:

పదో తరగతిలో 50 శాతం మార్కులతో సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

Age:

10.02.2024 నాటికి 15 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ

మెట్రిక్యులేషన్, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ..

మెట్రిక్యులేషన్, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ముఖ్యమైన తేదీలు

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 10.02.2024

వెబ్సైట్: https://www.rrcjaipur.in/

మునగాకుతో మోకాళ్ళ నొప్పులకు బాయ్ చెప్పండి..!

ఈ మధ్యకాలంలో మోకాళ్ళ నొప్పులు,కీళ్ల నొప్పులు లేని వారంటూ ఉండరు.ఈ మోకాళ్ళ నొప్పులను,కీళ్ల నొప్పులను తగ్గించుకోవడానికి ఇంగ్లీష్ మెడిసిన్ వాడినా, అవి కేవలం పెయిన్ కిల్లర్ గా మాత్రమే ఉపయోగపడతాయి.కానీ నొప్పిని మాత్రం లోపలి నుంచి హరించలేవు.పైగా మూత్రపిండాలు కూడా దెబ్బతింటాయి.ఇలా కాకుండా ఆయుర్వేదం ప్రకారం మునగాకుని తీసుకోవడం వల్ల,ఆపరేషన్ చేయాలన్న మోకాళ్లు కూడా తిరిగి బాగుపడతాయని,మోకాళ్లలో గుజ్జు పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
అస్సలు మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా రావడానికి కారణం అధిక అధిక బరువు,నున్నటి గచ్చులపై నడవడం,ఒకే చోట అధిక సమయం కూర్చోవడం,లేదా ఒకే సమయం ఎక్కువగా నిలబడి ఉండడం వాటితో మోకాళ్ళ సమస్యలు ఏర్పడతాయి. వీటిని తగ్గించుకుంటూ,ఆయుర్వేదంలో మునగాకుతో చేసే చిట్కా ఏంటో మనము తెలుసుకుందాం పదండి..

దీనికోసం ముందుగా మునగాకును 100 గ్రామ్స్ తీసుకొని,బాగా శుభ్రం చేసి ఎండబెట్టుకోవాలి.ఆ తరువాత ఈ మునగాకును మెత్తని పొడిలా మిక్సీ పట్టుకోవాలి.ఇప్పుడు 100 గ్రామ్స్ బెల్లం,100 గ్రామ్స్ తేనే తీసుకొని బాయిల్ చేయాలి.ఇది తీగ పాకం వచ్చిన తర్వాత మునగాకు వేసి బాగా కలియబెట్టాలి.ఇలా కలియబెట్టిన లేహ్యంగా తయారవుతుంది.ఈ లేహ్యాన్ని గాలి చొరబడిన సీసాలో బద్రపరచుకుంటే,ఒక నెలరోజుల పాటు వాడుకోవచ్చు.
ఎవరైతే మోకాళ్ళ,నొప్పులు కీళ్ల నొప్పులు,నడుము నొప్పులంటూ బాధపడుతూ ఉంటారో,అలాంటి వారు ఒక స్పూన్ మోతాదులో ఈ లేహ్యాన్ని పరగడుపున తీసుకోవాలి.ఇలా 100 రోజులపాటు చేయడం వల్ల, మోకాళ్ళ కీళ్ల మధ్యలో గుజ్జు పెరిగి మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి.మరియు బోన్స్ స్ట్రెంత్ కి కావాల్సిన కాల్షియం కూడా పుష్కలంగా లభిస్తుంది.

అంతేకాక ఈ లేహ్యము తరచూ తీసుకోవడం వల్ల మధుమేహంతో బాధపడే వారికి కూడా మంచి ఔషధంగా పనిచేస్తుంది.దీనివల్ల రక్తంలోని ఇన్సులిన్ లెవెల్స్ హెచ్చుతగ్గులు కాకుండా ఉపయోగపడి,మధుమేహం కంట్రోల్లో ఉంటుంది.మరియు రోగ నిరోధక శక్తి పెరిగి, రకరకాల బ్యాక్టీరియాల్ వల్ల వచ్చే వ్యాధులు కంట్రోల్లో ఉంటాయి.మరియు ఎటువంటి గాయాలు అయినా కలిగించే ఇన్ఫ్లమెషన కూడా తగ్గుతుంది.కావున మోకాళ్ళ నొప్పులతో బాధపడే వారు,వెంటనే పెయిన్ కిల్లర్లు బదిలు ఈ లేహ్యం వాడితే చాలు.

Barrelakka: బర్రెలక్కా మజాకా..! ఈసారి ఏకంగా ఎంపీగా పోటీ.. ఎక్కడనుంచంటే

బర్రెలక్క ఈ పేరు తెలియని తెలంగాణ ప్రజలు ఉండరేమో.. ఏపీలో కూడా ఆమెకు ఫ్యాన్స్ ఉన్నారు. ఈ మధ్య జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి అందరికి షాక్ ఇచ్చింది.
ఒకే ఒక్క వీడియోతో పాపులర్ అయ్యింది బర్రెలక్క. నిరుద్యోగ సమస్య కారణంగా బర్రెలు కాస్తున్నా అని వీడియో చేసి ఓవర్ నైట్ లో పాపులర్ అయ్యింది. దాంతో ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది. బర్రెలక్క అసలు పేరు కర్నె శిరీష. డిగ్రీ పూర్తి చేసిన ఆమె ఉద్యోగం దొరక్క బర్రెలు కాస్తుంది. ఇక తన వీడియో పాపులర్ అవ్వడంతో ప్రజల సమస్యలు తీర్చడానికి అసెంబ్లీలో అడుగు పెట్టాలని నిర్ణయించుకుంది. తెలంగాణ ఎలక్షన్స్ లో కొల్లాపూర్ స్ధానం నుంచి పోటీ చేసింది.

బర్రెలక్క కు చాలా మంది మద్దతుగా నిలిచారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసి. ప్రచారం కూడా ఆమె విస్తృతంగా చేసింది. కొల్లాపూర్ స్ధానం నుంచి పోటీ చేసిన బర్రెలక్క ఓడిపోయింది. ఆమెకుదాదాపు 6000వేల ఓట్లు పడ్డాయి. కానీ ఆమె క్రేజ్ మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. ఎన్నికల వేళ బర్రెలక్క పేరు మరు మ్రోగింది. సోషల్ మీడియాలో లక్షల్లో ఫాలోవర్స్ పెరిగారు. చాలా మంది పెద్ద వ్యక్తులు ఆమెకు అండగా నిలిచారు. ఆమె ధైర్యాన్ని మెచ్చుకున్నారు.ఆర్థికంగానూ కొందరు సాయం చేశారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన బర్రెలక్క ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల కోసం రెడీ అవుతుందని తెలుస్తోంది. ఎలాగైనా రాజకీయాల్లో ఉండాలని ఫిక్స్ అయిన బర్రెలక్క ఇప్పుడు ఎంపీగా పోటీ చేయడానికి రెడీ అవుతుంది. ఈసారి నాగర్ కర్నూలు నుండి పోటీకి దిగుతానని బర్రెలక్క తెలిపింది. అసెంబ్లీ ఎన్నికలు నేర్పిన పాఠాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి ఆచి తూచి అడుగులేస్తానని తెలిపింది బర్రెలక్క. మరి బర్రెలక్క పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.

ISRO recruitment 2024: ఇస్రోలో సైంటిస్ట్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్

ISRO recruitment 2024: సంస్థలో సైంటిస్ట్ తదితర పోస్ట్ ల భర్తీ కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (Indian Space ResearchOrganisation ISRO) అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ISRO recruitment 2024: సైంటిస్ట్ సహా పలు ఇతర పోస్టులను భర్తీ చేయడానికి ఇస్రో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్ట్ లకు ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో ఫిబ్రవరి 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) కేంద్రాల్లో ఒకటైన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (National Remote Sensing Centre NRSC) లో సైంటిస్ట్/ ఇంజినీర్ ‘ఎస్సీ’ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అభ్యర్థులు ఆన్ లైన్ లో ఎన్ఆర్ ఎస్సీ అధికారిక వెబ్ సైట్ www.nrsc.gov.in ద్వారా ఆన్ లైన్ లో ఫిబ్రవరి 12వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు.

vacancies: ఖాళీల వివరాలు
ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 41 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. వీటిలో సైంటిస్ట్ / ఇంజినీర్ ‘ఎస్సీ’ పోస్ట్ లు 35, మెడికల్ ఆఫీసర్ ‘ఎస్సీ పోస్టు’ 1, నర్సు ‘బి’ పోస్ట్ లు 2, లైబ్రరీ అసిస్టెంట్ ‘ఎ’ పోస్ట్ లు 3 ఉన్నాయి. ఇందులో పోస్ట్ ల వారీగా విద్యార్హతలు, వయోపరిమితులు ఉన్నాయి. పోస్టు కోడ్ 06, 09, 13, 14, 15, 16 పోస్టులకు అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. పోస్టు కోడ్ 07, 08, 10, 11, 12 పోస్టులకు అభ్యర్థుల వయస్సు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. పోస్టు కోడ్ 17, 18, 19 పోస్టులకు అభ్యర్థుల వయసు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ పోస్ట్ లకు అప్లై చేసే అభ్యర్థులు రూ .250 లను అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. ఇది నాన్ రిఫండబుల్ ఫీజు. అయితే, అంతకన్నా ముందు ప్రాసెసింగ్ ఫీజుగా రూ.750 చెల్లించాల్సి ఉంటుంది.

How to apply: ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
ఈ పోస్ట్ లకు ఈ కింది స్టెప్స్ ఫాలో కావడం ద్వారా అప్లై చేసుకోవచ్చు.

ముందుగా ఎన్ఆర్ఎస్సీ అధికారిక వెబ్ సైట్ www.nrsc.gov.in ను ఓపెన్ చేయాలి.
హోమ్ పేజీలో కనిపించే “సైంటిస్ట్ ఇంజనీర్ ‘ఎస్సీ’, మెడికల్ ఆఫీసర్ ‘ఎస్సీ’, నర్సు ‘బి’ , లైబ్రరీ అసిస్టెంట్ ‘ఎ’ పోస్టుల భర్తీ లింక్ పై క్లిక్ చేయండి.
స్క్రీన్ పై ఒక కొత్త పేజీ డిస్ ప్లే అవుతుంది.
అప్లై లింక్ పై క్లిక్ చేయండి.
అప్లికేషన్ ఫారం నింపండి.
అవసరమైన అన్ని డాక్యుమెంట్ లను అప్ లోడ్ చేయండి.
అప్లికేషన్ ఫీజు చెల్లించండి.
అప్లికేషన్ ఫామ్ ను సబ్మిట్ చేయండి.
భవిష్యత్తు రిఫరెన్స్ కొరకు అప్లికేషన్ ఫామ్ ను ప్రింట్ తీసుకోండి.
డిటైల్డ్ నోటిఫికేషన్ కోసం www.nrsc.gov.in వెబ్ సైట్ ను పరిశీలించండి.

Success Story: వాడిన పూలతో రూ.100 కోట్లు సంపాదన.. సూపర్ సక్సెస్ స్టోరీ..

Phool Startup: డబ్బులు సంపాదించాలి, వ్యాపారం చేయాలి అనే ఆలోచన ఉంటే చాలు ఆలోచనలు అవే పుట్టుకొస్తాయని మరోసారి ఒక స్టార్టప్ నిరూపించింది.
మకర సంక్రాంతి రోజున కాన్పూర్‌కు చెందిన అంకిత్ అగర్వాల్ తన చెక్ రిపబ్లిక్ స్నేహితుడితో కలిసి గంగానది ఒడ్డున కూర్చున్నాడు. శుభ్రంగా లేని నీటిలో ప్రజలు వేల సంఖ్యలో స్నానం చేయటంపై అతడి మిత్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ సమయంలోనే ఒక వాహనంలో తీసుకొచ్చిన వాడిపోయిన పూలను నదిలో పోయటం చూసిన అతని మదిలో ఒక వ్యాపార ఆలోచన పుట్టింది. అదే ఫూల్ స్టార్టప్.
ఫూల్ సంస్థ దేశంలోని వివిధ దేవాలయాల్లో దేవుడికి అలంకరించి తీసేసిన పువ్వులను సేకరిస్తుంది. వాటి నుంచి ధూప్ స్టిక్స్, అగర్ బత్తీలు వంటి పూజా ద్రవ్యాలను కంపెనీ ఉత్పత్తి చేస్తోంది. వాస్తవానికి వాడిపోయిన పూలను వ్యర్థాలుగా చేయటం కంటే వాటి నుంచి ప్రీమియం ఉత్పత్తులను తయారు చేయటం ద్వారా రూ.100 కోట్లు విలువైన కంపెనీని నిర్మించారు. ఈ స్టార్టప్ కాన్పూర్, తిరుపతి ఆలయాల నుంచి ప్రతిరోజూ దాదాపు మూడున్నర టన్నుల పూలను సేకరిస్తోంది. తొలుత వీరి వ్యాపారం 2 కేజీల పూలు, రూ.72 వేల పెట్టుబడితో ప్రారంభమైంది.
మిత్రులైన అపూర్వ, అంకిత్ తొలినాళ్లలో దేవాలయాలకు వెళ్లి వినియోగించిన పూలను పారేయకుండా తమకు ఇవ్వమని ఒప్పించటంలో చాలా కష్టపడ్డారు. అయితే వాటిని తిరిగి దేవుని కోసం వినియోగించే వస్తువులను ఉత్పత్తి చేసేందుకు వాడతామని చెప్పటంతో ఒప్పుకున్నారు. తొలుత పూలను సేకరించి కర్మాగారానికి తీసుకెళ్లి వాటిలోని తేమను తొలగించే ప్రక్రియను చేపడతారు. యంత్రాలతో వాటి నుంచి పురుగుమందు అవశేషాలను తొలగిస్తారు. తర్వాత పిండిగా మార్చిన పూలను అగర్ బత్తిల తయారీకి వినియోగిస్తారు. ఫూల్ ప్రారంభంలో సోషల్ ఆల్ఫా, DRK ఫౌండేషన్, IIT కాన్పూర్ సహా మరికొన్ని ఇతర సంస్థల నుంచి రూ.3.38 కోట్లను సేకరించింది. కరోనా లాక్‌డౌన్ అయిన రెండున్నర నెలల కాలంలో కంపెనీకి ఆదాయం లేదు కానీ ఖర్చులు అలాగే ఉన్నాయి. ఆ సమయంలో వారి వద్ద కంపెనీని నడిపేందుకు కేవలం 4 నెలలకు సరిపడా నిధులు మాత్రమే ఉన్నాయి. అలా అనేక కష్టాలను అధిగమించి 2018లో వెబ్‌సైట్ ప్రారంభం ద్వారా తొలుత ఉత్పత్తిని విక్రయించారు. అలా ఈ స్టార్టప్ కంపెనీ ప్రస్తుతం విలువ రూ.100 కోట్లకు పైగా చేరుకుంది.

EdCIL: ఈడీసీఐఎల్‌లో 100 టీచింగ్ పోస్టులు, ఎంపికైతే నెలకు రూ.రూ.1.40 లక్షల వరకు జీతం

EdCIL Recruitment: ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (EDCIL), భూటాన్ ప్రభుత్వం తరఫున కాంట్రాక్ట్ ప్రాతిపదికన పీజీటీ (PGT) టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
దీనిద్వారా మొత్తం 100 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత సబ్జెక్ట్లో బీఈడీ/పీజీ కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఫిభ్రవరి 15 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. షార్ట్లిస్ట్, ఆన్లైన్ ఇంటర్వ్యూ, ఫిజికల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపికలు చేపడతారు. ఉద్యోగాలకు ఎంపికైనవారు విధిగా భూటాన్ దేశంలో ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుంది.

వివరాలు..

* పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) పోస్టులు

ఖాళీల సంఖ్య: 100

కాంట్రాక్ట్ వ్యవధి: 2 సంవత్సరాలు.

➨ కంప్యూటర్ సైన్స్/ICT: 28
➨ ఫిజిక్స్: 18

➨ కెమిస్ట్రీ: 19

➨ మ్యథమెటిక్స్: 35

అర్హతలు:

➥ కనీసం 60% మార్కులతో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉండాలి.

➥ పీజీటీ మ్యాథమెటిక్స్, పీజీటీ కెమిస్ట్రీ మరియు పీజీటీ ఫిజిక్స్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే ఉపాధ్యాయులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బీఎడ్ డిగ్రీ తప్పనిసరి.
➥ పీజీటీ కంప్యూటర్ సైన్స్ / ICT పోస్ట్ కోసం గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బీఎడ్ డిగ్రీ ఉత్తమం(తప్పనిసరి కాదు).

➥ ఆంగ్ల భాష బోధనలో ప్రావీణ్యం కలిగి ఉండాలి.

➥ పీజీటీ టీచర్ తప్పనిసరిగా 11వ మరియు 12వ తరగతులలో సంబంధిత సబ్జెక్టు బోధనలో 5 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి.

➥ ఎడ్యుకేషన్ కోసం టెక్నాలజీ ఉపయోగించడంలో ఎక్కువ నైపుణ్యం కలిగి ఉండాలి.

వయోపరిమితి:16.01.2024 నాటికి 55 సంవత్సరాలు మించరాదు.

దరఖాస్తు విధానం:ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం:షార్ట్లిస్ట్, ఆన్లైన్ ఇంటర్వ్యూ, ఫిజికల్ ఇంటర్వ్యూ ఆధారంగా.

రెమ్యునరేషన్:రూ.1,40,000.

ఆన్లైన్ దరఖాస్తును పూరించడానికి అవసరమైన పత్రాలు..

➥ ఈమెయిల్ ఐడీ

➥ పర్సనల్ మరియు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్(మార్క్షీట్లు X(10వ), XII(12వ) గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్-గ్రాడ్యుయేషన్ యొక్క ఫైనల్ మార్కుషీట్లు)

➥ ఇటీవలి ఫోటోగ్రాఫ్ యొక్క స్కాన్ చేసిన కాపీ(jpg/jpeg ఆకృతిలో 3 వారాల కంటే పాతది కాదు)

➥ బ్లాక్ ఇంక్ పెన్తో సంతకం చేసిన చేసిన స్కాన్ కాపీ (jpg/jpeg ఫార్మాట్లో)
➥ ఇమేజ్ సైజ్ కనీసం 20 kb మరియు గరిష్టంగా 50 kb ఉండాలి.

➥ లాస్ట్ పేతో వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉండాలి.

➥ ఐడీ ఫ్రూఫ్గా పాస్పోర్ట్ లేదా ఓటరు ఐడీ ఉండాలి.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 16.01.2024.

➥ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 15.02.2024. (11:00 PM)

Notification

Website

ఫోన్ స్పీకర్ లో వాల్యూమ్ సరిగ్గా రావడం లేదా.. అయితే ఇలా చేయండి..

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి జీవితంలో మొబైల్ వాడకం ఒక భాగమైపోయింది. ఒక మనిషిని కమ్యూనికేట్ చేసుకోవడానికి మొబైల్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
కాల్స్ చేయడానికి, సందేశాలు పంపడానికి, వీడియోలు చూడటానికి, సంగీతం వినడానికి, అనేక విషయాల కోసం ఫోన్‌లను ఉపయోగిస్తున్నాం. అయితే ఒక్కోసారి ఫోన్ స్పీకర్ సరిగ్గా పనిచేయక వాల్యూమ్ తగ్గుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఫోన్ ఉపయోగించడం చాలా కష్టంగా ఉంటుంది. ఈ సమస్య మీకు వస్తే ఇంట్లో కూర్చొని కూడా పరిష్కరించుకోవచ్చు.

ఫోన్ స్పీకర్ తక్కువ వాల్యూమ్ వెనుక అనేక కారణాలు ఉండవచ్చు. స్పీకర్‌లో దుమ్ము లేదా ధూళి పేరుకుపోవడం లేదా ఏదైనా ఎలక్ట్రానిక్ భాగం దెబ్బతినడం వల్ల, స్పీకర్ సమస్యలను ఎదుర్కోవచ్చు. మీ ఫోన్ స్పీకర్ సౌండ్ తగ్గినట్లయితే, మీరు కొన్ని సులభమైన పద్ధతులతో దాన్ని పరిష్కరించవచ్చు.

స్పీకర్‌ను శుభ్రం చేయడం..
మెరుగైన పనితీరు కోసం స్పీకర్‌ను క్లీన్ చేయడం అవసరమని నిపుణుడు తెలుపుతున్నారు. మీరు మీ ఫోన్ స్పీకర్‌ను శుభ్రం చేయాలి. దీని కోసం మీరు మెత్తని టూత్ బ్రష్ లేదా స్పీకర్ క్లీనర్‌ను ఉపయోగించవచ్చు. స్పీకర్‌ను గట్టిగా కాకుండా కాస్తమెల్లిగా రుద్దాలి. గట్టిగా రుద్దడం వలన స్పీకర్‌కు హాని కలగవచ్చు.

ఫోన్ సెట్టింగ్‌ల నుండి ధ్వనిని సరిచేయండి..

ఫోన్ సెట్టింగ్‌ల వల్ల స్పీకర్‌కు కూడా సమస్యలు ఎదురుకావచ్చని నిపుణులు చెబుతున్నారు. స్పీకర్‌ను క్లీన్ చేసిన తర్వాత కూడా సౌండ్ మెరుగ్గా లేకుంటే, ఫోన్ సెట్టింగ్‌లను మార్చడానికి ప్రయత్నించండి.

ఫోన్ సెట్టింగ్‌లకు వెళ్లి, సౌండ్స్ & వైబ్రేషన్‌ పై ప్రెస్ చేయండి. ఇక్కడ మీరు మీడియా, రింగ్‌టోన్, అలారం మొదలైన వాటి సౌండ్‌ని పూర్తిగా సెట్ చేయాలి. దీని తర్వాత, ధ్వనిని ప్లే చేయండి, ఎంత ధ్వని వస్తుందో చూడండి.
ఫోన్ సెట్టింగ్‌లను మార్చండి..

అంతే కాకుండా, స్పీకర్ క్లీనర్ ఫీచర్ ఫోన్‌లో అందుబాటులో ఉంది. ఫోన్ సెట్టింగ్‌లకు వెళ్లడం ద్వారా ఈ ఎంపికను సక్రియం చేయాలి. ఇది ఆడియో టెస్టింగ్ టూల్. ఇది ప్రారంభమైన వెంటనే, స్పీకర్ లో అధిక సౌండ్‌ రావడం ప్రారంభమవుతుంది. ఇది స్పీకర్‌ను శుభ్రపరచడంలో సహాయపడుతుంది.

సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేయాలి..

చాలా సార్లు సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయకపోవడం వలన కూడా స్పీకర్‌ సమస్యలకు దారితీస్తుంది. అందువల్ల, సాఫ్ట్‌వేర్‌ను సమయానికి అప్డేట్ చేయాలి. ఇది ఫోన్ లోని అనేక సమస్యలను తొలగిస్తుంది. ఈ పద్ధతులన్నింటి ద్వారా ఫోన్ స్పీకర్‌ పనితీరు సుమారుగా మెరుగుపడుతుంది.

ఫ్రూట్స్‌ పైన అంటించే స్టిక్కర్స్‌ అర్థం ఏంటో తెలుసా..?

ఆరోగ్యంగా ఉండాలంటే.. అన్ని రకాల కూరగాయలతో పాటు పండ్లు కూడా తినాలి. రోజూ ఏదో ఒక ఫ్రూట్‌ తినడం అలవాటుగా చేసుకుంటే..ఆరోగ్యంగా ఉండొచ్చు. మనకు మార్కెట్‌లో వివిధ రకాల ఫ్రూట్స్‌ అందుబాటులో ఉంటాయి.
మీరు గమనించే ఉంటారు… కొన్ని ఫ్రూట్స్‌పై స్టిక్కర్స్‌ ఉంటాయి. స్టిక్కర్స్‌ ఉన్నాయంటే.. అవి ఖరీదైన పండ్లు అని మనం అనుకుంటాం. ముఖ్యంగా ఆపిల్స్‌పై ఇలా స్టిక్కర్స్‌ ఉంటాయి. అసలు ఈ స్టిక్కర్స్‌ ఎందుకు అంటిస్తారు, వాటి అర్థం ఏంటో మీకు తెలుసా.? ఆ పండు గురించి మొత్తం ఆ స్టిక్కర్స్‌ చెప్పేస్తాయి. వాటిని ఎలా అర్థం చేసుకోవాలో తెలిస్తే చాలు.. ఈరోజు మనం ఆ స్టిక్కర్స్‌ కథ ఏంటో తెలుసుకుందాం.

 

ఈ స్టిక్కర్స్‌ పండ్లు క్వాలిటీని తెలియజేస్తాయి.. ఇందులో రకరకాల నెంబర్లు ఉంటాయి. 5 డిజిట్స్‌ ఉండి ఆ నెంబర్‌ 9తో స్టాట్‌ అయితే అవి ఆర్గానిక్ ఫామ్‌లో పండించారని 100 శాతం నాచురల్‌ అని అర్థం.

5 డిజిట్స్‌ ఉండి 8తో స్టాట్‌ అయితే సగం ఆర్గానిక్, సగం కమెకిల్స్‌ వాడి పండించారని అర్థం.

అదే ఒక వేళ కోడ్‌ 4 డిజిట్‌ ఉండి 4తో స్టాట్‌ అయితే అది పూర్తిగా ఇన్‌ఆర్గానిక్‌ అని.. మొత్తం కెమికల్స్‌తోనే పండించారని అర్థం.

కానీ కొన్ని స్టిక్కర్స్‌ మీద ఎలాంటి నెంబర్స్ ఉండవు.. అలా ఎలాంటి నెంబర్స్‌ లేవంటే.. ఆ ఫ్రూట్స్‌ అమ్మేవాడు ఏవో స్టైల్‌కు స్టిక్కర్స్‌ వేసి మనల్ని మోసం చేస్తున్నాడని అర్థం. నెక్ట్స్‌ టైమ్ ఫ్రూట్స్‌ కొనేప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి మరీ..!

మార్కెట్‌లో నెంబర్స్‌ ఉన్న స్టిక్కర్స్ కంటే.. కేవలం షోపీస్‌కు వేసే స్టిక్కర్స్‌ ఎక్కువగా ఉంటాయి.. పండ్లు తినడం ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో.. వాటిని పండించే విధానం కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు ప్రజలంతా ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతున్నారు. వీలైనంత వరకూ ఆర్గానిక్‌గా పండించేవి తినడానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఫ్రూట్స్‌ను ఎందుకు వీటి నుంచి మినహాయించాలి..! స్టిక్కర్స్‌ మీద నెంబర్స్ ఉంటే. కాస్త ఖరీదైన పర్వాలేదు..ఆర్గానిక్‌వే తీసుకుందాం..!

NHAI లో 60 డిప్యూటీ మేనేజర్ పోస్టులు, వివరాలు ఇలా ..

National Highways Authority of India (NHAI) invites applications for filling up 60 posts of Deputy Manager (Technical) in the Level 10 of Pay Matrix of 7th CPC (Pre-revised: Pay Band-3 [(Rs.15,600-39,100/-) + Grade Pay of Rs.5400/-)] with Central DA on Direct Recruitment basis from candidates who have appeared for the interview (Personality Test) of Engineering Services (E.S) Examination (Civil), 2023 conducted by UPSC:

HAI: ఎన్‌హెచ్‌ఏఐ లో 60 డిప్యూటీ మేనేజర్ పోస్టులు, వివరాలు ఇవే.
NHAI నోటిఫికేషన్ ద్వారా 60 పోస్టులను భర్తీ చేస్తారు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్ నుండి సివిల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. UPSC 2023లో నిర్వహించే ఇంజినీరింగ్ సర్వీసెస్ పరీక్ష మరియు పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేయబడుతుంది.

వివరాలు..

ఖాళీల సంఖ్య: 60

పోస్టుల కేటాయింపు:

జనరల్- 31,
ఎస్సీ- 09,
ఎస్టీ- 05,
ఓబీసీ(ఎన్సీఎల్)- 11,
ఈడబ్ల్యూఎస్- 04.
పోస్టులు దివ్యాంగులకు -09
* డిప్యూటీ మేనేజర్(టెక్నికల్) పోస్టులు

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుంచి సివిల్ ఇంజినీరింగ్లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

Age Limit :30 సంవత్సరాలు మించకూడదు.

Application mehtod:ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

Selection Process: UPSC 2023లో నిర్వహించిన ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
Pay Scale::రూ.15,600-39,100.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:15.02.2024.

NHAI RECRUITMENT 60 VACANCIES NOTIFICAITON PDF

Balak Ram అయోధ్య రామ్ లల్లా విగ్రహానికి కొత్త పేరు.. ఇక నుంచి ఆ పేరుతోనే దర్శనం

అయోధ్యలో రామాలయంలో సోమవారం ప్రాణ ప్రతిష్ట వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. రామ్ లల్లా విగ్రహానికి ప్రధాని నరేంద్ర మోడీ తన చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ట చేశారు.
ఈ వేడుకను దేశ, విదేశాల్లోనూ భక్తులందరూ టీవీ, సోషల్ మీడియాతో పాటు వివిధ మాధ్యమాల ద్వారా వీక్షించారు. అయోధ్యకు స్వయంగా వెళ్లలేని భక్తులు ఎక్కడిక్కడ పూజలు చేశారు. అయితే ప్రాణ ప్రతిష్ట చేసిన రామ్ లల్లా విగ్రహానికి కొత్త పేరుతో పిలవనున్నారు.
అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట చేసిన రామ్‌ లల్లా విగ్రహం ఐదేళ్ల బాలుడిలా నిలబడిన భంగిమలో ఉన్న రాముడిని సూచిస్తుంది. కాబట్టి ఇక నుంచి ఆ విగ్రాహాన్ని ”బాలక్ రామ్” అని పిలుస్తారు. ముడుపుల కార్యక్రమంలో పాల్గొన్న పూజారి అరుణ్ దీక్షిత్ వార్తా సంస్థ ‘పీటీఐ’తో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. “జనవరి 22 న ప్రతిష్టించిన శ్రీరాముని విగ్రహానికి ‘బాలక్ రామ్’ అని పేరు పెట్టారు. రాముడి విగ్రహానికి ‘బాలక్ రామ్’ అని పేరు పెట్టడానికి కారణం ఆయన ఐదు సంవత్సరాల వయస్సులో ఉన్న చిన్నపిల్లలా కనిపించడమే.” అని స్పష్టం చేశారు.
“నేను మొదటి సారి విగ్రహాన్ని చూసినప్పుడు ఎంతో థ్రిల్ అయ్యాను. నాకు కన్నీళ్లు రావడం ప్రారంభించాయి. ఆ సమయంలో నేను పొందిన అనుభూతిని వివరించలేను. జనవరి 18న నాకు తొలి దర్శనం లభించింది.” అని ఆయన పేర్కొన్నారు. కాగా.. మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించిన ఈ 51 అంగుళాల విగ్రహాన్ని మూడు బిలియన్ ఏళ్ల నాటి రాతిపై చెక్కారు. ఈ శిల్పానికి ఉపయోగించిన నీలిరంగు కృష్ణ శిలే (నలుపు రంగు) ను మైసూరులోని హెచ్.డి.కోట తాలూకా, జయపుర హోబ్లీలోని గుజ్జెగౌడనపుర నుండి వెలికితీశారు. మృదువైన ఉపరితల ఆకృతి కారణంగా సాధారణంగా సోప్ స్టోన్ అని దానిని పిలుస్తారు.
అయోధ్య రామ మందిరం తలుపులు సాధారణ భక్తుల కోసం మంగళవారం తెరుచుకున్నాయి. అయితే సోమవారం అర్థరాత్రి నుంచే ఆలయ సముదాయానికి దారితీసే రామ్ మార్గంలోని ప్రధాన ద్వారం దగ్గర స్థానికులు, ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు గుమిగూడారు. రాముడి చిత్రాలతో కూడిన జెండాలను చేతపట్టుకుని, ‘జై శ్రీరాం’ అంటూ నినాదాలు చేస్తూ, ఆలయ తలుపులు తెరవకముందే భక్తులు కొరికే చలిలో గంటల తరబడి వేచి ఉన్నారు. ఆలయ ద్వారాలు తెరుచుకున్న తరువాత ఆ నీలమేఘశాముడి దర్శనం చేసుకొని తరించారు.

Tax Notice: భార్య-భర్తలు, తండ్రి-కొడుకుల మధ్య డబ్బు ట్రాన్సాక్షన్ టాక్స్ రూల్స్ తెలుసా..?

Cash Transaction Rules: ప్రస్తుత ప్రపంచంలో చిన్న మెుత్తాల నుంచి పెద్ద అమౌంట్స్ వరకు డబ్బును డిజిటల్ రూపంలోనే చెల్లింపులు జరుగుతున్నాయి. అందువల్ల ఇంట్లోవాళ్లతో సైతం యూపీఐ చెల్లింపుల ద్వారానే చాలా మంది డబ్బును చేతులు మార్చుకుంటున్నారు.
తండ్రి-కొడుకుల మధ్య లేదా భార్యా-భర్తల మధ్య కూడా డబ్బు లావాదేవీలు జరుపుతున్నట్లయితే ఈ వార్త ఖచ్చితంగా మీకోసమే. నిజానికి మనం చేసే ప్రతి చెల్లింపుపైనా ఆదాయపు పన్ను అధికారుల కన్ను ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఇలాంటి తరుణంలో ఇంట్లోనివారితో చేసే నగదు లావాదేవీలపై కూడా ఆదాయపు పన్ను నోటీసులు వస్తాయా..? అనే అనుమానం చాలా మందిలో ప్రస్తుతం ఉంది. అసలు వీటికి సంబంధించిన పన్ను చట్టంలోని రూల్స్ ఏమని చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మీరు ఇంటి ఖర్చుల కోసం ప్రతి నెలా డబ్బు ఇస్తే లేదా డబ్బును బహుమతిగా ఇస్తే.. అప్పుడు భార్య ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని పన్ను అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో రెండు రకాల మొత్తాలను భర్త ఆదాయంగా పరిగణిస్తారు. ఇలాంటి సందర్భంలో భార్యకు ఎలాంటి ఆదాయపు పన్ను నోటీసులు రావు. అయితే భార్య ఈ మెుత్తాన్ని వేరే దగ్గర పెట్టుబడిగా పెట్టి దాని నుంచి ఆదాయాన్ని పొందినట్లయితే అప్పుడు వచ్చే ఆదాయంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఏడాది వారీగా లెక్కించిన పెట్టుబడి ఆదాయాన్ని భార్య ఆదాయంగా పరిగణిస్తారు.

ఆదాయపు పన్ను సెక్షన్ 269SS, 269T కింద రూ.20 వేల కంటే ఎక్కువ నగదు లావాదేవీలపై జరిమానా విధించవచ్చు. అయితే చాలా సందర్భాలలో ఇందులో సడలింపులు ఉన్నాయి. ఉదాహరణకు.. తండ్రి-కొడుకు, భర్త-భార్య లేదా కొంతమంది దగ్గరి బంధువుల మధ్య లావాదేవీలపై ఎటువంటి జరిమానా ఉండదు. పన్ను చట్టాల్లో ఇందుకోసం ప్రత్యేకంగా మినహాయింపు ఇవ్వబడింది. అంటే ఇంట్లోని వారి మధ్య జరిగే డబ్బు చెల్లింపులపై ఆదాయపు పన్ను అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వరన్నమాట. అయితే ఆ డబ్బును పెట్టుబడిగా ఉంచి ఆదాయాన్ని సంపాదిస్తే మాత్రం పన్ను తప్పకుండా చెల్లించాల్సిందే.

BREAKING: ఏపీ రాజకీయాల్లో సంచలన పరిణామం.. 9 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు

ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి పార్టీ ఫిరాయించిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం నోటీసులు జారీ చేశారు.
ఇందులో టీడీపీ నుండి గెలిచి వైసీపీలోకి నలుగురు వెళ్లగా.. వైసీపీ నుండి విజయం సాధించిన నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీకి సపోర్ట్‌గా ఉన్నారు. జనసేన నుండి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వైపీసీకి మద్దతుగా ఉన్నారు. ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేష్, రాపాక వరప్రసాద్‌ వైసీపీలోకి రాగా.. శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం నారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి టీడీపీతో టచ్‌లో ఉన్నారు.

ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయించిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ తమ్మినేని సీతారాం ఇవాళ నోటీసులు జారీ చేశారు. పార్టీ మార్పుపై వారంలోగా సమాధానం చెప్పాలని ఎమ్మెల్యేలను స్పీకర్ ఆదేశించారు. ఎమ్మెల్యేల నుండి సరైన సమాధానం రాకపోతే అనర్హత వేటు వేస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు. మరోపక్కా విశాఖ నార్త్ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావు రాజీనామాకు స్పీకర్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ గెజిట్ విడుదల చేశారు. గంటా రాజీనామా ఆమోదం, ఎమ్మెల్యేలకు నోటీసుల వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

భక్తులకు శుభవార్త .. నేటి నుంచి శ్రీవారి దర్శన టికెట్ల కోటా విడుదల

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 9 కంపార్ట్‌మెంట్లు నిండాయి. నిన్న సోమవారం 67,568 మంది స్వామివారిని దర్శించుకోగా 22,084 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.58 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు 4గంటల్లో దర్శనమవుతుండగా, దర్శన టికెట్లు లేని భక్తులకు 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది.

ఏప్రిల్ నెల శ్రీవారి దర్శన టికెట్ల షెడ్యూల్…

శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా టీటీడీ షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ నెల తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తోంది.

► ఆంగప్రదక్షిణం టోకెన్ల కోటాను జనవరి 23వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.
► శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం, గదుల కోటాను జనవరి 23వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు.

► వృద్ధులు, దివ్యాంగులకు దర్శన టోకెన్ల కోటాను జనవరి 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు.

► ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్ల కోటాను జనవరి 24వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.

► తిరుమల, తిరుపతిలో వసతి గదుల బుకింగ్‌ జనవరి 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు.
ఏప్రిల్ నెలకు సంబంధించి జనవరి 27న ఉదయం 11 గంటలకు తిరుమల, తిరుపతికి చెందిన శ్రీవారి సేవ కోటాను, మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ కోటాను, మధ్యాహ్నం 1 గంటలకు పరకామణి సేవ కోటాను విడుదల చేస్తారు.

భక్తులు ఈ విషయాలను గమనించి https://tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ లో సేవా టికెట్లను బుక్ చేసుకోవాలని కోరడమైనది.

Paytm : పేమెంట్స్ టైంలో మీ నంబర్ కనిపించొద్దా.. ఈ ట్రిక్ ఫాలో అవ్వండి ?

Paytm : ఈ రోజుల్లో మీ వ్యక్తిగత వివరాలను ఎవరితోనైనా పంచుకోవడం చాలా ప్రమాదకరం.. అన్ని పత్రాలు లింక్ చేయబడిన వ్యక్తిగత వివరాలలో ఫోన్ నంబర్ ఒకటి.
Paytm ద్వారా చెల్లింపు చేసేటప్పుడు మీలో చాలా మందికి నంబర్‌ను ఎలా దాచాలో తెలియకపోవచ్చు. వాళ్లకు మీ నంబర్ తెలియొద్దు అనుకున్న వాళ్లకు కూడా మీ నంబర్ చాలా సార్లు వెళ్తుంది. ఈ సమస్యను నివారించడానికి మీరు Paytmలో మీ UPI చిరునామాను ఎలా మార్చవచ్చో.. ఇతరులకు కనిపించకుండా ఎలా చేయవచ్చో తెలుసుకుందాం. అందుకు చిన్న ట్రిక్ అనుసరిస్తే చాలు మీ నంబర్ వేరే వాళ్లకు వెళ్లదు.
ఏదైనా UPI ప్లాట్‌ఫారమ్‌లో మీ వర్చువల్ ప్రైవేట్ అడ్రస్ (VPA)ని మార్చడం సులభం. ఈ చిరునామాను VPA ద్వారా Paytmలో మార్చవచ్చు.
* Paytmలో మీ నంబర్‌ను దాచడానికి, మీరు VPAని మార్చాలి. దాన్ని మార్చడానికి, మీరు కొన్ని దశలను అనుసరించాలి. దీని కోసం ముందుగా మీ Paytm యాప్‌ని ఓపెన్ చేయాలి.
* దీని తర్వాత మెనుపై క్లిక్ చేయండి, మీ పేరు ప్రారంభ సంఖ్యలు దాని ఎడమ వైపున చూపబడతాయి.
* ఇప్పుడు UPI, చెల్లింపు సెట్టింగ్‌లకు క్రిందికి స్క్రోల్ చేయండి.
* దీని తర్వాత ఫస్ట్ ఆప్షన్ UPI ID షో, దాని కుడి వైపున ఉన్న సింబల్ పై క్లిక్ చేయాలి.
* తదుపరి విండోలో కొత్త UPI IDని యాడ్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
* ఇక్కడ మీకు మీ ఫోన్ నంబర్, ఖాతా నంబర్, పేరు ఉన్న అనేక ఆప్షన్లు చూపబడతాయి. అత్యంత యాదృచ్ఛికంగా ఉన్న దాన్ని ఎంచుకుని, కంటిన్యూ పై క్లిక్ చేయండి.
* ఈ ప్రక్రియను అనుసరించిన తర్వాత మీ VPA మారుతుంది. అదే విధానాన్ని అనుసరించడం ద్వారా మీరు Google Pay, PhonePe, BHIM ఇతర UPI ప్లాట్‌ఫారమ్‌ల నుండి కూడా మీ నంబర్‌ను దాచవచ్చు.

Gmail Bulk Messages : మీ జీమెయిల్ స్టోరేజీ ఫుల్ అయిందా? సింగిల్ క్లిక్‌తో బల్క్ మెసేజ్‌లన్నీ డిలీట్ చేసుకోవచ్చు..!

Gmail Bulk Messages : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ (Google) గూగుల్ అకౌంట్లలో 15GB ఫ్రీ స్టోరేజీని అందిస్తుంది. ఇందులో గూగుల్ ఫొటోలు, ఇమెయిల్‌లు, గూగుల్ డిస్క్ ఫైల్‌ల కోసం స్టోరేజీని అందిస్తుంది.
కానీ, చాలా మంది వినియోగదారులకు ఈ స్టోరేజీ తరచుగా జీమెయిల్‌లో క్యాంపెయిన్, మార్కెటింగ్ ఇమెయిల్‌లతో నిండిపోతుంది.

దాంతో స్టోర్జీని సేవ్ చేయడానికి, వినియోగదారులు వారి అవాంఛిత ఇమెయిల్‌లను క్రమం తప్పకుండా డిలీట్ చేయాలని గూగుల్ సిఫార్సు చేస్తోంది. బల్క్ ఇమెయిల్‌లను డిలీట్ చేయడానికి గూగుల్ యూజర్లను అనుమతించినప్పటికీ, ఇప్పటివరకు, అన్ని ఇమెయిల్‌లను ఒకేసారి డిలీట్ చేసే ఆప్షన్ లేదు. ఉదాహరణకు.. మీరు అన్ని క్యాంపెయిన్ ఇమెయిల్‌లను డిలీట్ చేయాలనుకుంటే.. మీరు వాటన్నింటినీ ఒకేసారి డిలీట్ చేయలేరు.

మీరు వాటిని ఒక్కో పేజీని ఎంచుకుని డిలీట్ చేయాల్సి ఉంటుంది. అయితే, గూగుల్ ఇప్పుడు మీ అన్ని ఇమెయిల్‌లను డిలీట్ చేయడానికి లేదా సభ్యత్వాన్ని తొలగించడానికి ఆప్షన్లు ఉన్న నిర్దిష్ట కేటగిరీలో అన్ని ఇమెయిల్‌లను డిలీట్ చేయడానికి ఒక మార్గాన్ని అందిస్తున్నట్లు కనిపిస్తోంది.

కొత్త ఆప్షన్ ద్వారా యూజర్లను స్టోరేజీ ఖాళీ చేయడానికి అనుమతించడమే కాకుండా, వారి జీమెయిల్ అకౌంట్లను ఒకసారి, అందరికీ పూర్తిగా క్లీన్ చేసేందుకు ఇమెయిల్‌లను భారీ స్థాయిలో డిలీట్ చేసేందుకు యూజర్లను అనుమతిస్తుంది. జీమెయిల్‌లో బల్క్ డిలీషన్ ఆప్షన్ ఇప్పుడు యూజర్లు ఒకే క్లిక్‌తో అన్ని ఇమెయిల్‌లను డిలీట్ చేసేందుకు అనుమతిస్తుంది.

ఈ సింపుల్ ప్రాసెస్ మీకోసం.. :

* వెబ్ బ్రౌజర్‌లో మీ జీమెయిల్ అకౌంట్‌కు లాగిన్ చేయండి.
* మీ ఇన్‌బాక్స్ ఎగువన, రిఫ్రెష్ బటన్‌కు ఎడమ వైపున ఉన్న చెక్‌బాక్స్‌ని క్లిక్ చేయండి.
* మొదటి పేజీలోని అన్ని ఇమెయిల్‌లను ఎంపిక చేస్తుంది.
* ప్రైమరీ ట్యాబ్‌లో అన్ని X సంభాషణలను ఎంచుకోండి బ్లూ కలర్ టెక్స్ట్ క్లిక్ చేయండి.
* ప్రస్తుతం మొదటి పేజీలో కనిపించకపోయినా మీ ఇన్‌బాక్స్‌లోని అన్ని ఇమెయిల్‌లను ఎంపిక చేస్తుంది.
* ట్రాష్ క్యాన్ మాదిరిగా కనిపించే డిలీట్ బటన్‌ను క్లిక్ చేయండి. ఎంచుకున్న అన్ని ఇమెయిల్‌లను డిలీట్ చేస్తుంది.
* ఇన్‌బాక్స్ కాకుండా, మీరు కేటగిరీలోని అన్ని ఇమెయిల్‌లను డిలీట్ చేసుకోవచ్చు.
* జీమెయిల్ అకౌంట్ ఖాళీ చేసేందుకు ప్రమోషన్, సోషల్ కేటగిరీలో ప్రక్రియను ఫాలో చేయొచ్చు.

ఈ సమయంలో, మీకు మెయిల్ పంపినవారు లేదా సమయ వ్యవధి నుంచి బల్క్ ఇమెయిల్‌లను డిలీట్ చేయాలనుకుంటే.. మీరు ఈ కింది దశలను ఉపయోగించవచ్చు. జీమెయిల్‌కు లాగిన్ చేసి, సెర్చ్ బాక్సులో ఈ కింది విధంగా సెర్చ్ క్వర్రీని టైప్ చేయండి. sender_email_address లేదా to:sender_email_address లేదా తర్వాత :2023-11-01 మీరు ఇమెయిల్‌లను డిలీట్ చేయాలనుకునే ఇమెయిల్ అడ్రస్‌తో sender_email_addressని రీప్లేస్ చేయండి. మీ ఇమెయిల్‌లో 2023-11-01ని డిలీట్ చేయాలనుకునే సమయ వ్యవధి ప్రారంభ తేదీతో రీప్లేస్ చేయండి.

* మీ ఇన్‌బాక్స్ ఎగువన, రిఫ్రెష్ బటన్‌కు ఎడమ వైపున ఉన్న చెక్‌బాక్స్‌ని క్లిక్ చేయండి.
* మీ సెర్చ్ ప్రశ్నకు సరిపోలే అన్ని ఇమెయిల్‌లను ఎంపిక చేస్తుంది.
* ట్రాష్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎంచుకున్న అన్ని ఇమెయిల్‌లను డిలీట్ చేస్తుంది.
ఈలోగా, మీరు అనుకోకుండా ఇమెయిల్‌ను డిలీట్ చేస్తే.. మీరు 30 రోజులలోపు ట్రాష్ ఫోల్డర్ నుంచి రీస్టోర్ చేయొచ్చు.

Washroom : వాష్‌రూమ్‌లో స్మెల్ రాకుండా, టాయిలెట్‌ తెల్లగా మెరవాలంటే 1 చెంచా ఈ పొడి చాలు..

టాయిలెట్ పాట్ శుభ్రం చేయడమంటే నిజంగా పెద్ద తలనొప్పి..ఈ పని వెరే ఎవరైనా చేస్తే బాగుండేది అని ప్రతి ఒక్కరికీ అనిపిస్తుంది. వాస్తవానికి, టాయిలెట్ పాట్ శుభ్రంగా లేకుంటే, పరిశుభ్రత సమస్యలు తలెత్తటమే కాకుండా, బాత్రూంలో అపరిశుభ్రత వ్యాప్తి చెందుతుంది.
టాయిలెట్‌ క్లీనింగ్‌ కోసం మార్కెట్లో వివిధ రకాల టాయిలెట్ క్లీనర్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఆ క్లీనర్‌లు మీ బాత్రూమ్‌కు నిజంగా మంచివని దీని అర్థం కాదు. ఘాటైన వాసనల కారణంగా చికాకు, ఇబ్బదిపడేవాళ్లు మనలో చాలా మంది ఉన్నారు. రకరకాల టాయిలెట్ క్లీనర్‌లను ఉపయోగించలంటే భయపడుతుంటారు. కానీ, ఎలాంటి ఇబ్బంది చికాకు లేకుండా ఒక్క స్పూన్ పౌడర్ తో టాయిలెట్ పాట్ ను ఎలా శుభ్రం చేయాలో ఇక్కడ మనం తెలుసుకుందాం..

టాయిలెట్ పాట్‌లో ఏదైనా కెమికల్ క్లీనర్‌ని ఉపయోగించిన వెంటనే ఒక రకమైన ప్రతిచర్య జరగడం చాలా సార్లు చూస్తుంటాం..ముఖ్యంగా యాసిడ్ తో శుభ్రం చేసే క్రమంలో ఇలాంటి సమస్య వస్తుంది. టాయిలెట్ పాట్‌ను యాసిడ్‌తో శుభ్రపరచడం కూడా ప్రమాదకరం. అందువల్ల మీరు ఎప్పుడైనా సరే.. కొన్ని టాయిలెట్ వాషింగ్ ట్రిక్‌లను ఉపయోగించడం ముఖ్యం. అది మీకు ఎలాంటి సమస్య లేకుండా మీ బాత్రూమ్‌ను శుభ్రం చేస్తుంది.
మీ టాయిలెట్ పాట్‌లో పసుపు రంగు మరకలు ఏర్పడినట్టయితే..మీరు వాటిని సరిగ్గా శుభ్రం చేయలేక పోతే, టాయిలెట్ పాట్‌లో ఒక స్పూన్‌ డిటర్జెంట్‌ పౌడర్‌ను చల్లండి. దాంతో మీరు మెరుపును చూస్తారు. ఇందుకోసం ముందు రోజు రాత్రి టాయిలెట్ పాట్ లో ఒక టేబుల్ స్పూన్ డిటర్జెంట్ పౌడర్ వేస్తే చాలు. మీ బాత్‌రూమ్‌లోని పసుపు మరకలు ఉన్నచోట కాస్త ఎక్కువగా వేయండి.. రాత్రంతా ఇలాగే వదిలేయండి. ఇక్కడ ముఖ్యమైన విషయం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే.. వాష్‌ రూమ్‌లో సర్ఫ్‌ చల్లిన తర్వాత దీని తర్వాత మీరు ఫ్లష్ చేయకూడదు. నీళ్లు కూడా చల్లకూడదని గుర్తుంచుకోండి.

ఇక మర్నాడు ఉదయం నిద్ర లేవగానే కొద్దిగా నీళ్లు పోసి బ్రష్ తో స్ర్కబ్ చేయాలి. అంతే, మీ పని పూర్తైనట్టే.. ఇక్కడ టాయిలెట్ పాట్ పసుపు రంగు పోయి మెరుస్తుండటం మీరు చూస్తారు. వాస్తవానికి, డిటర్జెంట్ పౌడర్ లైమ్‌స్కేల్, హార్డ్ వాటర్‌పై కూడా పని చేస్తుంది. కాబట్టి ఇది మీ టాయిలెట్‌ను శుభ్రం చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది. టాయిలెట్ పాట్ బాగా మురికిగా ఉంటే..మీరు ఈ రెమెడీని రెండు మూడు రోజులు క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే.. ఖచ్చితంగా మీ టాయిలెంట్‌ మెరుస్తుంది. దీన్ని చేయడానికి కేవలం 5 నిమిషాల సమయం పడుతుంది. ఇక మీ కష్టం తీరిపోయినట్టే.

ఇప్పుడు ఇంట్లో ఉన్న ఇతర పౌడర్‌లు మీ టాయిలెట్ వాసనను మార్చేస్తాయి. దీనికోసం మీరు చేయాల్సిందల్లా 1 టీస్పూన్ టాల్కమ్ పౌడర్‌ను టాయిలెట్‌లో చల్లండి. దీంతో కంపు వాసన పోతుంది. బాత్రూమ్ వాసనగా, టాయిలెట్ పాట్ మురికిగా మారినట్లయితే ఇలాంటి ట్రిక్స్‌ మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ విధంగా మీరు మీ టాయిలెట్ పాట్ వాసనను 1 గంటలోపే తొలగించేయవచ్చు. దీని కోసం మీరు పెద్దగా శ్రమపడాల్సిన పనిలేదు.. జస్ట్‌ వాష్‌ రూమ్‌లో టాల్కమ్‌ పౌడర్‌ చల్లితే చాలు..
1 గంట తర్వాత సాధారణంగా ఫ్లష్ చేయండి. మీ టాయిలెట్ పాట్ వాసన ఆగిపోతుంది.
అలాగే, మీ టాయిలెట్ చాలా మురికిగా ఉంటే, మరో రకమైన క్లీనర్‌ని ఉపయోగించవచ్చు. దీనికోసం ముందుగా టాయిలెట్ పాట్‌లో 2:1 నిష్పత్తిలో వైట్ వెనిగర్ నీటిని పోయాలి. అది పోసిన తర్వాత 1-2 స్పూన్ల డిష్ వాష్ లిక్విడ్ వేసి 10 నిమిషాలు అలాగే ఉంచండి. కొంచెం రియాక్షన్‌ ఉంటుంది. కానీ ఆ తర్వాత మీరు దానిని సులభంగా స్క్రబ్ చేయవచ్చు.

టాయిలెట్ పాట్‌లో బాగా మరకలు, మురికి, మచ్చలుగా ఉంటే..అరకప్పు వైట్ వెనిగర్‌లో 2 టీస్పూన్ల బేకింగ్ సోడా కలిపి శుభ్రం చేయండి. ఇలా చేయడం వల్ల టాయిలెట్ సులభంగా శుభ్రం అవుతుంది. పసుపు మరకలు పోకపోతే, ఉప్పు, వైట్‌ వెనిగర్ మిశ్రమాన్ని తయారు చేసి, రాత్రిపూట టాయిలెట్లో చల్లాలి. ఉదయానికి అంతా శుభ్రంగా మారుతుంది. ఇలా చేయటం వల్ల మీరు పెద్దగా శ్రమపడాల్సిన పని తప్పుతుంది.

Best post office schemes : రిస్క్ తక్కువ.. వడ్డీ ఎక్కువ.. దేశంలో బెస్ట్ పోస్టాఫీస్‌ స్కీమ్స్ ఇవే..!

జీవితంలో అన్ని రకాల ఆర్థిక లక్ష్యాలను కేవలం నెలవారీ జీతంతో తీర్చుకోవడం సాధ్యం కాదు. కచ్చితంగా ఇన్వెస్ట్‌ (Invest) చేయాలి. అంతే కాకుండా సురక్షితంగా, స్థిరమైన ఆదాయం అందించే ఇన్వెస్ట్‌మెంట్‌ ఆప్షన్లు సెలక్ట్‌ చేసుకోవాలి.

ఈ ఫీచర్లను అందిస్తూ భారతదేశంలో పోస్టాఫీస్‌ డిపాజిట్‌ స్కీమ్‌లు పాపులర్‌ అయ్యాయి. ఈ ప్లాన్‌లకు ప్రభుత్వం మద్దతు ఇవ్వడమే కాకుండా స్థిరమైన వృద్ధికి హామీ ఇస్తుంది. రిస్క్ తీసుకోవడం ఇష్టం లేని పెట్టుబడిదారులకు ఇది ఆకర్షణీయమైన ఎంపిక. అయితే ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ టాలరెన్స్ ఆధారంగా మీకు పోస్టాఫీస్‌ స్కీమ్‌ బెటరో ఇప్పుడు తెలుసుకుందాం.

* సుకన్య సమృద్ధి అకౌంట్స్‌(SSA)

ఈ స్కీమ్‌ 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలికల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. SSA సంవత్సరానికి 8% వడ్డీ రేటును అందిస్తుంది, ఏటా ఇంట్రెస్ట్‌ కాలిక్యులేట్‌ చేస్తారు.

* కిసాన్ వికాస్ పత్ర (KVP)
కిసాన్‌ వికాస్‌ పత్ర ఇన్వెస్ట్‌మెంట్ 123 నెలల్లో సంవత్సరానికి 7% వడ్డీ రేటుతో రెట్టింపు చేస్తుంది. ఈ లాంగ్‌ టర్మ్‌ సేవింగ్స ఆప్షన్‌ సంపదను స్థిరంగా పెంచుకోవాలని చూస్తున్న వారికి అనువుగా ఉంటుంది.

* నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్‌ (NSC)

ఐదేళ్ల పదవీకాలంతో, NSC సంవత్సరానికి 7.7% వడ్డీ రేటును అందిస్తుంది, ఇంట్రెస్ట్‌ ఏటా కాలిక్యులేట్‌ అవుతుంది, కానీ మెచ్యూరిటీ సమయంలో చెల్లిస్తారు.

* సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS)

పదవీ విరమణ చేసిన వారి కోసం ఈ పథకం రూపొందించారు. SCSSలో ఒకేసారి లంప్‌ సమ్‌ అమౌంట్‌ ఇన్వెస్ట్‌ చేయవచ్చు. క్వార్టర్లీ ఇంట్రెస్ట్‌ అందుతుంది, 2023-24 ఆర్థిక సంవత్సరం సెకండ్‌ క్వార్టర్‌కి 8.2% వడ్డీ అందిస్తోంది. ప్రభుత్వ మద్దతుతో కూడిన ఈ పదవీ విరమణ పథకం సీనియర్ సిటిజన్లకు ఆర్థిక భద్రతను అందిస్తుంది.
* 15-సంవత్సరాల పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్‌(PPF)

లాంగ్‌-టర్మ్‌ ఇన్వెస్టర్లకు ఇది బెస్ట్‌ ఆప్షన్‌. PPF సెక్షన్ 80C కింద పన్ను ప్రయోజనాలను అందిస్తుంది, 7.1% వార్షిక వడ్డీ రేటును పొందవచ్చు, ఎలాంటి పన్ను ఉండదు. యాన్యువల్లీ ఇంట్రెస్ట్‌ కాంపౌండ్‌ అవుతుంది.

* పోస్టాఫీస్‌ టైమ్ డిపాజిట్ అకౌంట్‌

ఫిక్స్‌డ్ డిపాజిట్ల మాదిరిగానే, ఈ పథకం ఒక సంవత్సరం నుంచి ఐదు సంవత్సరాల వరకు వివిధ రకాల వడ్డీ రేట్లను అందిస్తుంది. FY 2023-2024 రెండో త్రైమాసికానికి సంబంధించి 1, 2-3, 5 సంవత్సరాల అకౌంట్‌లకు రేట్లు వరుసగా 6.9%, 7%, 7.5%గా ఉన్నాయి. యాన్యువల్లీ ఇంట్రెస్ట్‌ చెల్లిస్తారు, కానీ క్వార్టల్లీ కాలిక్యులేట్‌ చేస్తారు.

* మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌

లో-రిస్క్ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆప్షన్‌. మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌ సంవత్సరానికి 7.40% వడ్డీ రేటు, రెగ్యులర్‌ మంత్లీ ఇన్‌కమ్‌ అందిస్తుంది. ఐదేళ్ల లాక్-ఇన్ పీరియడ్‌తో, స్థిరమైన రాబడిని అందిస్తుంది.

* పోస్టాఫీస్‌ సేవింగ్స్ అకౌంట్‌

పోస్టాఫీస్‌ సేవింగ్స్ అకౌంట్‌ 4% వార్షిక వడ్డీ రేటు అందిస్తుంది. వడ్డీపై పూర్తిగా పన్ను ఉంటుంది, ప్రయోజనం ఏంటంటే TDS డిడక్షన్‌ ఉండదు.

* 5-ఇయర్‌ పోస్టాఫీస్‌ రికరింగ్ డిపాజిట్ అకౌంట్‌(RD)
చిన్న మొత్తాలతో ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రారంభించాలనుకునే వారికి, 5-ఇయర్‌ RD సరిపోతుంది. నెలవారీ డిపాజిట్లు రూ.100 కంటే తక్కువగా ఉంటాయి. సంవత్సరానికి 6.5% వడ్డీ రేటు అందుకోవచ్చు. వడ్డీ క్వార్టర్లీ కాంపౌండ్‌ అవుతుంది. ఈ పథకం డబ్బును ఆదా చేయడానికి, పెంచుకోవడానికి క్రమశిక్షణతో కూడిన మార్గాన్ని అందిస్తుంది.

Good Luck Plants: ఈ అద్భుత మొక్కలు మీ ఇంట్లో ఉంటే.. ప్రతిరోజూ డబ్బు వర్షమే..!

Lucky Plants in Home: హిందూ మతంలో వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రకృతిలో ప్రతిదానికీ శక్తి ఉంటుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. పాజిటివ్ అయినా..
నెగిటివ్ అయినా ఎంతో ప్రభావం చూపిస్తాయి. మీ ఇంటి దగ్గర లేదా ఆఫీసు చుట్టూ నెగిటివ్ ఎనర్జీ ఉన్న వస్తువును కూడా ఉంచుకోకండి. దీని వల్ల ఆర్థిక ఇబ్బందులు, సంస్థ అభివృద్ధిలో పురోగతికి ఆటంకాలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ సంబంధాలలో విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే పాజిటివ్ ఎనర్జీని ఇచ్చే వస్తువులు ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని చెట్లు, మొక్కలు సంపదను పెంపొందించేందుకు దోహదం చేస్తాయని అంటున్నారు. మరికొన్ని రోజుల్లో 2024 సంవత్సరం ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది మీ ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపరుచుకోవాలంటే.. ఇంట్లో ఈ మొక్కలు తప్పకుండా నాటండి.

మీ ఇంట్లో రాత్రాణి మొక్కను నాటితే.. మీ ఇంటి చుట్టూ వాతావరణానికి సువాసనను అందిస్తుంది. ఈ పూల సువాసన ఒత్తిడిని తగ్గించి మానసిక ఉల్లాసాన్ని కలిగించడంతోపాటు శాంతిని ఇస్తుంది. ఇది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, దాంపత్య సంతోషాన్ని మరింత
పెంచుతుంది. తద్వారా సంపద సంపాదనకు కొత్త మార్గాలను అన్వేషణకు ఉపయోగపడుతుంది.

​​ఎల్లప్పుడు చల్లగా ఉండడం చంపా మొక్కల ప్రత్యేకత. దీని లేత పసుపు పువ్వులు అందంగా ఉండడంతోపాటు నెగిటివ్ ఎనర్జీని తొందరగా దూరం చేస్తాయి. చంపా మొక్క ఉన్న ఇంట్లో ఉంటే ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఎల్లప్పుడూ సంతోషంగా ఆనందంతో గడుపుతారు.

మల్లె మొక్క ఆహ్లాదకరమైన సువాసన, అందమైన పువ్వులకు పేరుగాంచింది. మల్లె మొక్కను వాస్తు శాస్త్రంలో కూడా చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల కుటుంబ సభ్యుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అదేవిధంగా హర్సింగర్ పువ్వులు చాలా అందంగా ఉంటాయి. శ్రీకృష్ణునికి అత్యంత ప్రీతిపాత్రమైన పారిజాతాన్ని హర్సింగర్ అంటారు. పారిజాత చెట్టు ప్రతి కోరికను తీరుస్తుందని చెబుతారు. హర్సింగర్ పువ్వును తాకడం ద్వారా మానసిక ఒత్తిడి తగ్గుతుంది. అలాగే ఇంట్లో ఎప్పుడూ ఆర్థిక సంక్షోభం ఉండదు.

(ముఖ్యగమనిక: ఇక్కడ అందజేసిన సమాచారం సాధారణ నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. దీన్ని మేము ధృవీకరించలేదు.)

Tomato టమాటాలను ఫ్రిడ్జ్ లో పెడుతున్నారా.. అయితే ఎంత ప్రమాదమో తెలుసా..

టమోటా ( Tomato )అనేక రకాల వంటకాలు ఉపయోగపడుతుంది. కానీ టమోటా త్వరగా పాడైపోతుంది. దీనికోసం టమోటాలను సరిగ్గా నిల్వ చేయడం చాలా ముఖ్యం. ఫ్రిడ్జ్ లో పెడితే టమాటాలు ఒక వారం రోజులు అయినా వాడుకోవచ్చు.
అలా ఫ్రిడ్జ్ లో పెట్టడం మంచిది కాదంటున్నారు శాస్త్రవేత్తలు( Scientists ). అయితే ఈ టమాటాలను ఫ్రిడ్జ్ లో పెట్టకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఫ్రిడ్జ్ లో పెట్టడం వలన ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. అలాగే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయని నిపుణులు వివరంగా చెబుతున్నారు.

అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఫ్రిడ్జ్ ( Fridge )లో పెడితే ముందు ఉన్న టమాట సహజ సిద్ధమైన రుచిని కోల్పోతాయని పరిశోధకులు చెబుతున్నారు. ఒకటి రెండు రోజులు ఫ్రిడ్జ్ లో ఉంటే ఏమీ కాదు. కానీ వారం దాకా అలానే ఫ్రిడ్జ్ లో టమోటాలు ఉంటే సహజ లక్షణం కోల్పోతాయి. అలాగే మిథైలేషన్( Methylation ) అనేది మిథైల్ సమూహంగా పిలిచే అణువుల సమూహం.

జీవి డిఎన్ఏ కి అనుగుణంగా మార్చే ప్రక్రియ ఇది. జన్యు వ్యక్తీకరణను నియంత్రించడంలో మిథైలేషన్ కీలక పాత్ర వహిస్తుంది అని పరిశోధకులు చెబుతున్నారు. మనం ఎప్పుడైతే ఎక్కువగా ఫ్రిడ్జ్ లో టమాటాలు పెడతామో వాటి లోపల ఉన్న జల్లి పగిలిపోతుంది. దీని కారణంగా ఇది మృదువుగా మారుతుంది.

. ఒక విధంగా చెప్పాలంటే లోపల అంతా మెత్తగా అయిపోతుంది. దీన్ని మనం ఆహారంగా తీసుకోకపోవడమే చాలా మంచిదని వైద్యనిపుణులు చెబుతున్నారు. టమాటాలు మంచిగా రెడ్ కలర్ లో పండుగా అయినప్పుడు ఇథిలిన్( Ethylene ) విడుదల చేస్తాయి. అయితే ఫ్రిడ్జ్ లో చల్లదనం కారణంగా టమాటాల్లో ఇథిలిన్ ఉత్పత్తి పూర్తిగా ఆగిపోతుంది.

ఈ క్రమంలో టమాటాలు అసలైన రుచిని కోల్పోయి పుల్లగా మారిపోతాయి. కాబట్టి వాటిని ఎల్లప్పుడూ గది ఉష్ణోగ్రత వద్ద నిలువ చేయడమే మంచిదని వైద్యులు చెబుతున్నారు. ఫ్రిడ్జ్ లో పెట్టిన వాటిని వాడడం వలన విషంతో సమానమని వాటిని వాడకపోవడమే మంచిదని పరిశోధకులు చెబుతున్నారు.

Camphor: కర్పూరం తయారవుతుంది ఈ చెట్ల నుండేనని మీకు తెలుసా..? ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు

కర్పూరం కాంఫర్ లారెల్ లేదా సిన్నమొముం క్యాంఫొర అనే చెట్టునుండి లభ్యమవుతుంది. కర్పూరాన్ని ఆ చెట్ల ఆకులు, కొమ్మలనుండి తయారు చేస్తారు. అలాగే కొన్ని రకాలైన తులసి (కర్పూర తులసి) జాతులనుడి కూడా కర్పూరాన్ని తయారుచేస్తారు.

కర్పూరం చెట్టు వంద అడుగుల ఎత్తు వరకూ పెరిగే సుందరమైన నిత్య హరిత వృక్షం. చక్కని సువాసన కలిగి ఉంటుంది. ఆకులు పొడవుగా ఉండి ఫిబ్రవరి, మార్చి నెలల్లో రాలుతుంటాయి. పువ్వులు చిన్నవిగా ఉంటాయి. పండ్లు ముదురు ఆకుపచ్చని రంగులో ఉండి అక్టోబర్‌లో పక్వానికి వస్తాయి.

ఈ చెట్లు చైనా, జపాన్ దేశాల్లో విస్తారంగా పెరుగుతాయి. మన దేశంలో దీనిని నీలగిరి కొండల్లో పెంచుతారు. అలాగే మైసూర్‌లోనూ, మలబార్ ప్రాంతంలోనూ కర్పూరం చెట్లు కనిపిస్తాయి. అయితే ఈ కర్పూరం చాలా రకాలున్నాయి. ఒకొక్కటి ఒక్కోరకంగా మనకి ఉపయోగపడతాయి.

పచ్చకర్పూరం: కర్పూరం చెట్టు వేర్లు, మాను, కొమ్మలను నీళ్లలో వేసి మరిగించి, డిస్టిలేషన్ పద్ధతిలో సేకరించే కర్పూరాన్ని పచ్చకర్పూరం అంటారు. దీనిని ఔషధ ప్రయోగాల్లో కూడా వినియోగిస్తారు. దీనిని ఎక్కువగా వంటలలో వాడతారు. కాటుకని ఈ పచ్చ కర్పూరంతోనే చేస్తారు.

హారతి కర్పూరం, రస కర్పూరం, భీమసేని కర్పూరం, ఇంకా, సితాభ్ర కర్పూరం, హిమవాలుక కర్పూరం, ఘనసార కర్పూరం, హిమ కర్పూరం, ఉదయ భాస్కరము, కమ్మ కర్పూరము, ఘటికము, తురు దాహము, హిక్కరి, పోతాశ్రయము, పోతాశము, తారాభ్రము, తుహినము, రాత్రి కరము, విధువు, ముక్తాఫలము, రస కేసరము, ప్రాలేయాంశువు, చంద్ర నామము, గంబూరము, భూతికము, లోక తుషారము, శుభ్ర కరము, సోమ సంజ్ఞ, వర్ణ కర్పూరం, శంకరావాస కర్పూరం, చీనా కర్పూరం అని చాలా రకాల కర్పూరాలున్నాయి.

కర్పూరంవలన అసంఖ్యాకమైన ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయి. ఆయుర్వేద చికిత్సలో కర్పూరాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. అసలు కర్పూర సువాసన పీలిస్తే చాలు శారీరక రుగ్మతలన్నీ పోయినట్లు, సేద తీరినట్లు ఉంటుంది. మానసిక ప్రశాంతత చేకూరుతుంది.

Health

సినిమా