Thursday, November 14, 2024

Sourav Ganguly Biopic: త్వరలో తెరపైకి దాదా బయోపిక్‌.. హీరో ఎవరంటే?

Sourav Ganguly Biopic Updates: గత కొన్నాళ్లుగా బయోపిక్స్ ట్రెండ్స్ నడుస్తోంది. క్రీడాకారుల జీవితాల ఆధారంగా తెరకెక్కే బయోపిక్స్ బాక్సాఫీస్ వద్ద కోట్లు కొల్లగొట్టాయి.
ఎం.ఎస్. ధోని, మిల్కా సింగ్, మేరీకామ్ బయోపిక్స్ ఎంత పెద్ద హిట్ అయ్యాయో మనందరికీ తెలిసిందే. త్వరలో దిగ్గజ క్రికెటర్ బయోపిక్ త్వరలో వెండితెరపై ఆవిష్కృతం కానుంది. టీమిండియా మాజీ కెప్టెన్, దాదా అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే సౌరవ్ గంగూలీ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. గంగూలీ పాత్రలో నేషనల్‌ అవార్డు విన్నర్, బాలీవుడ్ నటుడు అయుష్మాన్‌ ఖురానా కనిపించబోతున్నాడు. ఈ మూవీకి ప్రముఖ దర్శకుడు విక్రమాదిత్య మోత్వాని దర్శకత్వం వహిస్తున్నాడు. దాదా బయోపిక్ ఈ ఏడాది చివరిలో రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తయిందట. లవ్‌ రంజన్‌, అంకుర్‌ గార్గ్‌లు నిర్మాతలుగా వ్యవహారిస్తున్నారు. ప్రస్తుతం గంగూలీ హావబావాలు, అతడు ఆడే విధానం, తదితర అంశాలపై ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు ఆయుష్మాన్. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ను మెుదలుపెట్టి.. ఈ ఏడాది చివరలో రిలీజ్ చేసేందుకు దర్శక నిర్మాతలు ఫ్లాన్ చేస్తున్నారు. భారత క్రికెట్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్స్ లో గంగూలీ కూడా ఒకరు. దాదా జీవితంలో కాంట్రవర్సీలకు కొదవ లేదు. గంగూలీ బయోపిక్ ను మోత్వానీ ఎలా తెరకెక్కిస్తాడోనని అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే స్పోర్ట్స్ పర్సన్ జీవితాల ఆధారంగా తెరకెక్కిన బయోపిక్స్ ఎంత పెద్ద సక్సెస్ అయ్యాయో మనందరికీ తెలిసిందే.

భారత్‌లోనే కాదు ఈ దేశాల్లోనూ సంక్రాంతి పండుగ.. కానీ పేర్లే వేరు

ఇండియాలో సంక్రాంతి పండుగను అత్యంత వైభవంగా జరుపుకొంటారు. ఈ పండుగను వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో పిలుస్తారు. సూర్యుడు తన దిశను మార్చుకుంటాడు..
కాబట్టి ఈ పండుగ చాలా ముఖ్యమైనది. అయితే ఈ పండుగను ఎక్కడెక్కడ నిర్వహిస్తారో తెలుసా?

చాలా దేశాలు మకర సంక్రాంతిని జరుపుకొంటాయి. కానీ కొన్ని చోట్ల రోజులు మారుతూ ఉంటాయి. భారతదేశంలో చాలా పేర్లు ఉన్నాయి. తమిళనాడులో పొంగల్ అని, గుజరాత్‌లో ఉత్తరాయణం అని, పంజాబ్‌లో మాఘి అని, అస్సాంలో బిహు అని, ఉత్తరప్రదేశ్‌లో ఖిచ్డీ అని పిలుస్తారు. ఈ మకర సంక్రాంతి పండుగను భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని అనేక ఇతర దేశాలలో కూడా ఆనందంగా జరుపుకొంటారు.

శ్రీలంకలో మకర సంక్రాంతి పండుగను ఉజాహవర్ తిరానల్ పేరుతో నిర్వహిస్తారు. అధిక సంఖ్యలో తమిళులు ఇక్కడ నివసిస్తున్నందున దీనిని పొంగల్ అని కూడా పిలుస్తారు. అయితే, శ్రీలంకలో మకర సంక్రాంతిని జరుపుకునే విధానం భారతీయ సంస్కృతికి కొద్దిగా భిన్నంగా ఉంటుంది. ఇక్కడి ప్రజలు వివిధ సంప్రదాయాలను పాటిస్తున్నారు.

కంబోడియాలోని మకర రాశిని మోహ సంక్రాణం అంటారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఈ పండుగను జరుపుకుంటారని నమ్ముతారు. ఇందులో ప్రతి ఒక్కరూ వివిధ పూజలు నిర్వహిస్తారు. సంవత్సరం పొడవునా సంతోషకరమైన వాతావరణం కోసం ప్రార్థిస్తారు.

మకర సంక్రాంతి పండుగను నేపాల్‌లోని అన్ని ప్రావిన్స్‌లలో వివిధ పేర్లతో నిర్వహిస్తారు. ఈ రోజు వివిధ ఆచారాలను అనుసరించి భక్తి, ఉత్సాహంతో జరుపుకొంటారు. మకర సంక్రాంతిని ఇక్కడ మాఘే-సంక్రాంతి అని, తరు సమాజంలో సూర్యోత్తరయన్ మరియు మాఘి అని పిలుస్తారు. ఈ రోజున తీర్థయాత్ర స్థలంలో స్నానం చేసి దానం చేస్తారు. ఇంట్లో నువ్వులు, నెయ్యి, పంచదార, కూరగాయలు తింటారు. ఇక్కడ కూడా లక్షలాది మంది నదుల సంగమంలో స్నానాలు చేసేందుకు వెళుతుంటారు.

భారతదేశం, నేపాల్ కాకుండా, ఆగ్నేయాసియా దేశాల ప్రజలు మకర సంక్రాంతి పండుగను వివిధ రకాలుగా జరుపుకుంటారు. థాయ్‌లాండ్‌లో ఈ పండుగను సంకర్ణ అని పిలుస్తారు. థాయ్‌లాండ్ సంస్కృతి భారతీయ సంస్కృతిలా కాదు, పూర్తిగా భిన్నమైనది. ఇక్కడ కూడా ఈ ప్రత్యేక సందర్భంలో గాలిపటాలు ఎగరేసే సంప్రదాయం ఉంది. వాస్తవానికి, థాయ్‌లాండ్‌లో ప్రతి రాజుకు తన స్వంత ప్రత్యేక గాలిపటం ఉందని నమ్ముతారు. దేశంలో శాంతి, శ్రేయస్సు కోసం శీతాకాలంలో సన్యాసులు, పూజారులు దీనిని ఎగురవేస్తారు. థాయ్‌లాండ్ ప్రజలు తమ ప్రార్థనలను దేవునికి తెలియజేయడానికి గాలిపటాలు ఎగురవేస్తారు.
మయన్మార్‌లో ఈ మకర సంక్రాంతి పండుగ ఒకటి రెండు రోజులు కాదు మూడు నాలుగు రోజులు. మకర సంక్రాంతికి భిన్నమైన రూపాన్ని ఇక్కడ చూడవచ్చు. ఈ రోజున జరుపుకునే పండుగను థినాగ్యాన్ అంటారు. ఇది బౌద్ధులకు సంబంధించిన ఆచారం. కొత్త సంవత్సరం రాకను పురస్కరించుకుని ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా నిర్వహిస్తారు
మకర సంక్రాంతిని పాకిస్తాన్‌లో లాల్ లోయి పేరుతో జరుపుకుంటారు. లాల్ లోయి అనేది పంజాబీ జానపద పండుగ లోహ్రీకి సింధీ పదం. పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని కొన్ని ప్రాంతాలలో హిందువులు దీనిని జరుపుకుంటారు. లాల్ లోయి రోజున, రాత్రిపూట కట్టెలకు నిప్పు పెడతారు. అగ్ని చుట్టూ సంప్రదాయ నృత్యం చేస్తారు.

ఈ ఆలయంలో బొట్టు పెడితే.. కోరిన కోరికలన్నీ తీరుతాయట..

ఈ ఆలయంలోని అమ్మవారికి బొట్టు పెట్టి ఏదైనా కోరుకుంటే కచ్చితంగా నెరవేరుతుందట. అయితే ఆ ఆలయం ఎక్కడ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.. చతుర్భుజాలతో దర్శనమిస్తూ భక్తుల కోరికలను తీర్చే కొంగుబంగారమైన ఇష్టకామేశ్వరి ఆలయం ( Ishtakameshwari Temple ) ఎక్కడ ఉందంటే?
దాని ప్రాముఖ్యత ఏమిటి? అన్న విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ అమ్మవారు అడవిలో కొలువై ఉన్నారు. రాళ్లు, ముళ్ళు దాటి ప్రయాణం చేయాల్సి వచ్చినా కూడా భక్తులు ఈ అమ్మవారి దగ్గరకు వెళుతూ ఉంటారు.

ఎందుకంటే మనసులో ఎంతో భారంతో, కష్టంతో అక్కడికి వెళ్లి అమ్మను దర్శించుకుని వచ్చాక ఆ సమస్యలు వెంటనే తీరిపోతాయని, లేదా వాటిని ఎదుర్కునే శక్తి కూడా వస్తుందని భక్తులు చెబుతున్నారు.

కాబట్టి అమ్మవారిని ఇష్టకామేశ్వరి అని కూడా పిలుస్తారు. ఇక శ్రీశైలం మల్లన్నకు ( Srisailam Mallanna )చేరువలో ఈ అమ్మవారి దేవాలయం కొలువై ఉంది. శ్రీశైలం నుండి దోర్నాల వెళ్లే మార్గానికి సమీపంలో ఈ ఆలయం ఉంది. ఇక దట్టమైన నల్లమల్ల అడవిలో కష్టతరమైన ప్రయాణం చేసి అమ్మవారి ఆలయానికి భక్తులు చేరుకుంటారు.

ఇక పక్షుల కిలకిల రాగాలు, జలపాతాల మధ్య సాగే ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది. అయితే ఈ ఆలయంలో అమ్మవారు 4 చేతులతో దర్శనమిస్తుంది. ఇక రెండు చేతులతో తామర పువ్వులు, మిగిలిన రెండు చేతుల్లో జపమాల, శివలింగం ధరించి కనిపిస్తుంది. ఇక విష్ణు ధర్మోత్తర పురాణంలో పార్వతి దేవి రుద్రాక్ష మల శివలింగాన్ని ధరించి ఉంటుందని పండితులు చెబుతున్నారు.

అయితే ఇష్టకామేశ్వరి పార్వతి దేవి స్వరూపంగా కొలుస్తారు. ఆమెకు కుంకుమ పెట్టి మనసులో కష్టాన్ని, కోరికను చెప్పుకుంటే 41 రోజుల్లో నెరవేరుతుందట. ఇక ఈ ఆలయంలోని అమ్మవారి కి బొట్టు పెట్టినప్పుడు విగ్రహం మామూలుగానే ఉన్నా కూడా నుదురు మాత్రం మెత్తగా అనిపిస్తుందని కూడా చెబుతున్నారు.
సాయంత్రం 5 దాటితే ఎవ్వరిని కూడా ఆలయంలోకి ప్రవేశించరు. ఇక చిన్న గుహలో ఉండే అమ్మవారిని దర్శించుకోవాలంటే పాకుతూ వెళ్ళాలి. ఎందుకంటే గర్భగుడిలో కేవలం నలుగురు మాత్రమే కూర్చునే వీలు ఉంటుంది.

Laxmidevi:రావి,తులసి ఆకులతో ఇలా చేస్తే కోరిక తప్పక నెరవేరుతుంది.!

మన భారతదేశంలో తులసి రావి చెట్లను దేవతల్లా భావిస్తారు. అలాంటి చెట్ల ఆకులతో మనం కోరిన కోరికలను నెరవేర్చుకోవచ్చని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.. మనం ప్రతి రోజు స్నానం చేసే నీళ్లలో నాలుగు తులసి ఆకులు వేసుకుని చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. అలా స్నానం చేసిన తర్వాత ఇంట్లోని తులసి కోట వద్ద మట్టిని తీసుకొని మంచి గంధంతో కలిపి నుదుట బొట్టు లాగా పెట్టుకోవాలి.

అంతేకాకుండా తులసి కోటలో కొన్ని నల్ల ఉమ్మెత్త గింజలను చల్లితే అవి చిన్న చిన్న మొక్కలుగా పెరుగుతాయి. అలా పెరగడం వల్ల మీకు లక్ష్మీదేవి కటాక్షం కలిగి విపరీతమైన ధన ప్రాప్తి లభిస్తుందని అంటున్నారు. అంతేకాకుండా రావి ఆకుతో కూడా మీకున్న కోరికలు నెరవేరుతాయట. గురువారం లేదా శుక్రవారం రోజు ఒక రావి ఆకు తీసుకొని, ఆకును శుభ్రంగా నీళ్లతో కడిగి ఆ తర్వాత రావి చెట్టు పుల్ల తీసుకొని, దాన్ని తడి పసుపులో ముంచి రావి ఆకు పైభాగాన ఓం అని రాసి, ఆ తర్వాత మీ మనసులో ఉన్న కోరికను ఆకుపై రాయండి, ఆ తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ అని రాయండి.
ఆ తర్వాత రావిఆకును మీ పూజ గదిలో సాయంత్రం వరకు పెట్టండి. ఇక సాయంకాల సమయంలో ఆ రావి ఆకుకు దూపం చూపించి, ఆ తర్వాత దాన్ని తీసుకొని చెట్టు మొదట్లో లేదంటే ఏదైనా పారే నీళ్లలో వేయండి. ఇది ఎవరు కూడా తొక్కనిచోట వేస్తే కోరిక తప్పకుండా నెరవేరుతుందని శాస్త్ర పండితులు తెలియజేస్తున్నారు.

Saindhav Movie Review: వెంకటేష్ యాక్షన్ ఎమోషన్ థ్రిల్లర్‌

విక్టరీ వెంకటేష్ (Venkatesh) కెరీర్ మైల్ స్టోన్ 75వ మూవీ సైంధవ్ (Saindhav). హిట్ సీరిస్తో టాలెంటెడ్ డైరెక్టర్గా గుర్తింపు పొందిన శైలేష్ కొలను (Sailesh Kolanu) ఈ సినిమాను తెరకెక్కించడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.
ఇవాళ (జనవరి 13న) సంక్రాంతి కానుకగా థియేటర్లో ప్రేక్షకుల ముందుకొచ్చింది సైంధవ్. యాక్షన్ స్పార్క్..తండ్రి కూతురి ఎమోషన్స్ డ్రామాగా రూపొందిన ఈ మూవీ..అన్ని వర్గాల ఆడియాన్స్ను ఆకట్టుకుందో లేదో రివ్యూలో తెలుసుకుందాం.

కథేంటంటే:

సైంధవ్ ప్రధాన కథ అంతా చంద్రప్రస్థ అనే ఫిక్షనల్‌ టౌన్‌ లో జరిగే డ్రగ్ సరఫరా, గన్ బిజినెస్..వంటి అంశాల చుట్టూ తిరుగుతుంది. చంద్రప్రస్థ లో జరిగే అసాంఘిక కార్యక్రమాలకు కార్టెల్ లీడర్ విశ్వామిత్ర (ముఖేష్ రిషి) నిర్వహణలో ప్రతిదీ జరుగుతుంటుంది. ఇక్కడ చంద్రప్రస్థ లో జరిగే బిజినేస్ ను చూసుకోవడానికి విశ్వామిత్ర దగ్గర పనిచేసే మాఫియా లీడర్‌ వికాస్ మాలిక్(నవాజుద్దీన్ సిద్ధిఖి)కి బాధ్యతలు అప్పగిస్తాడు. వికాస్ మాలిక్ తన అనుచరురాలు జాస్మిన్ (ఆండ్రియా)తో ఈ డీల్‌ పనులన్నిటినీ జరిగేలా చూస్తుంది. అలా ఓ రోజు వారికి పెద్ద బిజినెస్ డీల్ కుదురుతుంది. 20 వేలమంది యువతతో పాటు గన్స్‌, డ్రగ్స్‌ సరఫరా చేసే ఈ డీల్‌ ను సక్రమంగా పూర్తి చేయాలనీ విశ్వామిత్ర వికాస్ కు బాధ్యతలు అప్పగిస్తాడు. అలా డ్రగ్స్ డీల్ జరిగే క్రమంలో సైంధవ్ కోనేరు అలియాస్‌ సైకో(వెంకటేష్‌) చంద్రప్రస్థ టౌన్‌ పోర్టులో ఉద్యోగిగా పనిచేయడానికి వస్తాడు.

అతనికి కూతురు గాయత్రి(సారా పాలేకర్‌) అంటే ఎంతో ప్రాణం. పక్కింట్లో నివాసం ఉంటున్న మనో(శ్రద్ధా శ్రీనాథ్‌) ప్రతిక్షణం ఎప్పుడు తన కూతురిని జాగ్రత్తగా చూసుకుంటుంది. తన కూతురి కోసం కష్టపడే సైంధవ్‌ అంటే మనోకి ఇష్టం. మనో భర్త (గెటప్‌ శ్రీను) తరుచూ కొట్టడంతో.. అతనిపై పోలీసు కేసు పెట్టి, ఒంటరిగా ఉంటుంది. అలా గాయత్రిని సొంత కూతురిలా చూసుకుంటుంది. ఒకసారి అనుకోకుండా స్కూల్ లో కళ్ళు తిరిగి పడటంతో ఆసుపత్రికి తీసుకెళతారు. అపుడు గాయత్రి కి ఉన్న నరాల సంబంధించిన స్పైనల్ మస్కులర్ అట్రోపి అనే అరుదైన వ్యాధి ఉన్నట్లు చెబుతారు డాక్టర్స్.
కూతురి గాయత్రికి అర్జెంటు గా ఒక ఇంజక్షన్ కావాలి. సరైన టైం లో ఇంజక్షన్ ఇవ్వకపోతే బతకడం కష్టం అని డాక్టర్స్ చెబుతారు. కూతురిని కాపాడటానికి 17 కోట్ల ఖరీదైన ఓ ఇంజెక్షన్ అవసరమవుతుంది. చంద్రప్రస్థ లో ఉద్యోగిగా ఉన్న సైంధవ్.. డబ్బు కోసం విశ్వామిత్ర, వికాస్ మాలిక్‌ను చంపడానికి.. మైఖేల్ (జిషు సేన్ గుప్తా)తో బిగ్ డీల్‌ కుదుర్చుకుంటాడు. అలా ఒకరోజు పోర్టులో జరిగే పెద్ద డీల్ ను సైంధవ్ ఆపడంతో..పెద్ద ఫైట్ జరుగుతుంది.అక్కడ జరిగిన వార్ లో సైంధవ్ కాస్తా సైకో అంటూ రివీల్ అవుతాడు. అసలు సైంధవ్‌ ఫ్లాష్‌ బ్యాక్‌ ఏంటి? సైకో..సైంధవ్ గా ఎలా మారాడు? ఐదేళ్ల క్రితం ఏం జరిగింది? ఇంతకు విశ్వామిత్ర, వికాస్ మాలిక్‌లను చంపేందుకు మైఖేల్‌ ఎందుకు ప్రయత్నించాడు? చివరికి సైంధవ్ తన కూతురు ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఏం చేశాడు? కూతుర్ని రక్షించుకున్నాడా? లేదా? అనేదే మిగతా స్టోరీ.

ఎలా ఉందంటే:

తండ్రీకూతుళ్ల అనుబంధానికి.. ఫిక్షనల్ యాక్షన్ అంశాలను జోడించి.. డైరెక్టర్ శైలేష్ కొలను సైంధవ్ కథ రాసుకున్నారు. భారీ యాక్షన్ సీక్వెన్స్‌,స్టైలిష్ మేకింగ్‌తో ఆడియెన్స్‌కు విజువల్ ట్రీట్‌లా సినిమాను మలిచాడు. చంద్రప్రస్థ అనే ఫిక్షనల్ వరల్డ్‌… తమ అక్రమాలకు పిల్లలను పావులుగా వాడుకోవాలని ప్రయత్నించే డేంజరస్‌ గ్యాంగ్‌..వారిని ఎదిరించే ఓ సగటు తండ్రి .. అతడికో పవర్‌ఫుల్ ఫ్లాష్‌బ్యాక్ టెంప్లేట్ స్టోరీలైన్‌ను తీసుకుని వెంకటేష్ క్యారెక్టరైజేషన్‌, ఎలివేషన్స్ పాస్ మార్కులు కొట్టేశారు. ప్రాణాపాయంలో ఉన్న కూతురును రక్షించుకునేందుకు.. అన్నివిధాలుగా సైంధవ్ ప్రయత్నించే సీన్స్ ఆకట్టుకుంటాయి. చివరికి కార్టెల్‌లోకి అడుగు పెట్టాల్సి రావడం.. డబ్బు అందినట్టే అంది, అంతలోనే ఎదురయ్యే చిక్కుముళ్లతో ఫస్టాఫ్ సాగుతుంది. ఇలాంటి క్రమంలోనే ఇంటర్వెల్ లో ఇచ్చే ట్విస్ట్..అక్కడ జరిగే ఫైట్ ఆడియన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తుంది.
ఇలాంటి ఎమోషనల్ యాక్షన్ సినిమాలకు సెకండాఫ్ పై ఇంట్రెస్ట్ పెంచడం ముఖ్యమని డైరెక్టర్ ఆలోచించిన తీరు బాగుంది. సైంధవ్ ఫ్లాష్‌బ్యాక్ మొదలుకుని..తన కూతురు పడే స్ట్రగుల్ చూసి బాధపడే సైంధవ్ కి ఇంకా చాలా మంది చిన్నారులు కూడా ప్రమాదంలో ఉన్నారని తెలియటంతో.. కంటైనర్ల కోసం విలన్ సైంధవ్‌ని వెంటాడటం ఇవన్నీ ఆడియాన్స్ కు ఇంట్రెస్ట్ కలిగిస్తాయి. వెంకీ తన యాక్షన్ ఎపిసోడ్లతో..మాస్ యాక్షన్ ఫ్యాన్స్ కు భలే ఫెస్టివల్ ట్రీట్ ఇస్తాడు. ఎమోషన్ సీన్స్ లో ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పిస్తాడు. విలన్ గా చేసిన నవాజుద్దీన్ సిద్ధిఖీ క్యారెక్టర్ లో.. కామెడీతో పాటు ఇంటెన్స్ చూపించాడు డైరెక్టర్. అతనిపై వచ్చే సన్నివేశాలు ఆడియన్స్ కు భలే అనిపిస్తాయి.

ఎవరెలా చేశారంటే:

సైంధవ్ సినిమా వెంకటేష్ నుంచి వచ్చిన మరో డిఫరెంట్ యాక్షన్ ఎమోషన్ ఫిల్మ్. వెంకీ యాక్టింగ్‌, యాక్షన్, ఎమోషన్ కోసం ఈ సినిమా చూడొచ్చు. సైంధవ్ అలియాస్ సైకో క్యారెక్టర్ లో వెంకటేష్ చెలరేగిపోయాడు. ఒక్కమాటలో చెప్పాలంటే వెంకీ సైంధవ్‌ పాత్రలో ఒదిగిపోయాడు. వెంకటేశ్‌ తర్వాత ఈ సినిమాలో బలంగా ఇంపాక్ట్ చూపించిన క్యారెక్టర్ నవాజుద్దీన్‌. తన వర్సటైల్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. శ్రద్ధా శ్రీనాథ్‌, రుహాణిశర్మ తమ పాత్ర మేరకు మెప్పిస్తారు. జాస్మిన్‌గా ఆండ్రియా యాక్షన్‌ సీన్‌ అదరగొట్టేసింది.

టెక్నీషియన్స్:

మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్‌ నారాయణన్‌ బుజ్జికొండవే సాంగ్ ఆడియన్స్ ను మెప్పిస్తుంది. అంతేకాకుండా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సినిమాటోగ్రఫీ మణికందన్ ఇంద్రప్రస్థను చూపించిన తీరు ఆకట్టుకుంటుంది. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్. డైరెక్టర్ శైలేష్ కొలను జోనర్ లో డిఫరెంట్ ఫిల్మ్ సైంధవ్ అని చెప్పుకోవాలి.

Naa Saami Ranga Twitter Review: నా సామిరంగ ట్విటర్ రివ్యూ.. నాగ్ సినిమాకు ఊహించని పరిస్థితి.. కీరవాణి మ్యూజిక్ అలా!

Naa Saami Ranga Twitter Review: టాలీవుడ్ కింగ్, మన్మథుడు అక్కినేని నాగార్జున నటించిన లేటెస్ట్ మాస్, యాక్షన్, రొమాంటిక్ చిత్రం నా సామిరంగ. మలయాళంలో సూపర్ హిట్ కొట్టిన పొరింజు మరియమ్ జోస్ అనే చిత్రానికి రీమేక్‌గా నా సామిరంగ సినిమాను తెరకెక్కించినట్లు సమాచారం.
అయితే, కథను తెలుగు నెటివిటీకి తగినట్లుగా మార్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ఇదివరకు కొరియోగ్రాఫర్‌గా పని చేసిన విజయ్ బిన్ని తొలిసారి మెగా ఫోన్ పట్టుకుని దర్శకత్వం వహిస్తున్నారు.

అంటే.. నా సామిరంగ సినిమాతో విజయ్ బిన్నీ దర్శకుడిగా తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇలా ఇప్పటికీ నాగార్జున చాలా మంది కొరియోగ్రాఫర్స్‌కి డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చి కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేశారు. ఇదివరకు మాస్ మూవీతో రాఘవ లారెన్స్‌ను దర్శకుడిగా నాగార్జున పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఇక శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్‌తో నా సామిరంగ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పిస్తున్నారు.

నా సామిరంగ సినిమాలో నాగార్జునకు జోడీగా బ్యూటిఫుల్ ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా చేసింది. అలాగే, అల్లరి నరేష్, రాజ్ తరుణ్, రుక్సార్ ధిల్లాన్, మిర్నా మీనన్ సైతం ప్రధాన పాత్రలు పోషించారు. వీరి పాత్రలకు సంబంధించిన పోస్టర్స్, స్పెషల్ గ్లింప్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. నా సామిరంగ చిత్రానికి శివేంద్ర దాశరధి సినిమాటోగ్రఫీ అందించగా.. రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ కథ, మాటలు అందించారు. ఆస్కార్ విన్నర్ ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించారు.

నా సామిరంగ మూవీ భారీ అంచనాలతో సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే, సోషల్ మీడియాలో నా సామిరంగ హడావుడి పెద్దగా కనిపించడం లేదు. గుంటూరుకారం, హనుమాన్, సైంధవ్ మూవీలకు ముందుగా ప్రీమియర్ షోలు పడినట్లుగా నా సామిరంగ సినిమాకు పడనట్లు తెలుస్తోంది. దాంతో నా సామిరంగ సినమాకు షోలు ఇంకా పడలేదా.. ఏంటీ అప్డేట్ లేదు.. సినిమా టాక్ ఎలా ఉంది, ఇంకా ఎవ్వరూ చూడలేదా అని ట్విటర్‌లో నెటిజన్స్ ట్వీట్స్ పోస్ట్ చేస్తున్నారు.

అయితే, ఐదు గంటల సమయంలో మాత్రం ఇప్పుడు షో స్టార్ట్ అంటూ అక్కినేని ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. సినిమా టైటిల్ కార్డ్ వీడియో పోస్ట్ చేసి తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

2 రోజుల్లోనే టార్గెట్ ఫినీష్.. అప్పుడే అన్ని కోట్లా.. గుంటూరు కారం కంటే!

సాధారణంగా ఏదైనా సినిమా దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అవ్వాలంటే పెద్ద పెద్ద స్టార్లు ఉండాల్సిన అవసరం లేదు. కంటెంట్ కరెక్టుగా ఉంటే ఎంతటి చిన్న చిత్రమైనా భారీ స్థాయిలో ప్రభావాన్ని చూపిస్తుంది.
దీనికి చక్కని ఉదాహరణే ‘హనుమాన్’. పేరుకు తెలుగు సినిమానే అయినా దేశ వ్యాప్తంగా ఇది ఎఫెక్టును చూపిస్తోంది. ఫలితంగా భారీ రెస్పాన్స్‌తో అత్యధిక వసూళ్లను సాధిస్తూ సత్తా చాటుతోంది. ముఖ్యంగా ఓవర్సీస్‌లోనూ ఈ సినిమా హవాను చూపిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ అసలైన మైలురాయిని చేరుకుంది. ఆ వివరాలను మీరే చూసేయండి మరి!

హనుమాన్ ఆగమనంతో : తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన రియల్ సూపర్ హీరో మూవీనే ‘హనుమాన్’. ఈ మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా చేయగా.. వరలక్ష్మి శరత్‌కుమార్ సహా పలువురు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి అనుదీప్ దేవ్, హరి గౌర, కృష్ణ సౌరభ్‌లు సంగీతాన్ని సమకూర్చారు.
ఇక్కడి కంటే ఎక్కువగా : తేజ సజ్జా – ప్రశాంత్ వర్మ కలయికలో రూపొందిన ‘హనుమాన్’ సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2000లకు థియేటర్లకు పైగానే తీసుకు వచ్చారు. దీనికి పోటీ వల్ల తెలుగు రాష్ట్రాల్లో పెద్ద స్క్రీన్లు లభించకున్నా.. హిందీతో పాటు ఓవర్సీస్‌లో ఇది అదిరిపోయే రీతిలో గ్రాండ్‌గా రిలీజ్ అయింది.

గుంటూరు కారం కంటే : రియల్ సూపర్ హీరో హనుమంతుడి కథతో రూపొందిన ‘హనుమాన్’ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్‌లో ఈ చిత్రం మొదటి రోజు నుంచే భారీగా పుంజుకుంది. అదే సమయంలో ‘గుంటూరు కారం’ కంటే ఎక్కువ కలెక్షన్లను వసూలు చేస్తోంది.
అప్పుడే అన్ని డాలర్లు : క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన ‘హనుమాన్’ మూవీకి ఓవర్సీస్‌లో సైతం భారీ స్పందన దక్కింది. ఈ సినిమాకు ప్రీమియర్స్ ద్వారానే 386K డాలర్స్ గ్రాస్ వచ్చింది. ఆ తర్వాత మొదటి రోజు ఇది 520K డాలర్లు వరకూ రాబట్టింది. తద్వారా ప్రీమియర్స్ ప్లస్ మొదటి రోజు కలెక్షన్లు కలిపి అక్కడ 900K డాలర్లు వరకూ రాబట్టింది. అంటే రూ. 7.45 కోట్లు వసూలు చేసింది.

రెండో రోజు ఊచకోత : ‘హనుమాన్’ మూవీ ప్రీమియర్స్‌ను పక్కన పెడితే మొదటి రోజు 520K డాలర్ల కంటే ఎక్కువ రాబట్టింది. ఇక, రెండో రోజు ఈ సినిమా ఏకంగా 620K డాలర్ల వరకూ రాబట్టింది. ఇలా ప్రీమియర్స్‌తో కలిపి 1.5 మిలియన్ డాలర్లను ఈ సినిమా వసూలు చేసింది. అంటే భారత కరెన్సీలో ఈ చిత్రం రెండు రోజుల్లోనే ఓవర్సీస్‌లో రూ. 12.43 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.
టార్గెట్ ఫినీష్ చేసేసి : ‘హనుమాన్’ మూవీ పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైంది. ఇది ఓవర్సీస్‌లో 1 మిలియన్ డాలర్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలాంటిది రెండు రోజుల్లోనే ఈ మార్కును చేరుకోవడంతో పాటు లాభాల బాటలో నడుస్తోంది. ఇలా ఈ చిత్రం అప్పుడే అక్కడ కొన్ని కోట్ల లాభాలను అందుకుంది. దీంతో ఎన్నో రికార్డులను సైతం నమోదు చేసుకుంది.

Cyber Crime: అయోధ్యకు వీఐపీ టికెట్లు కావాలా.. లింక్‍లు పంపుతున్న సైబర్ నేరగాళ్లు.. క్లిక్ చేస్తే అంతే..

జనవరి 22 తేదీ కోసం యావత్ భారతదేశం ఎదురు చూస్తోంది. ఆ రోజు అయోధ్య రామమందిరం ప్రారంభం కానుంది. గుడి ప్రారంభోత్సవానికి మరో 9 రోజులే గడువు ఉండటంతో ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
శ్రీరాముడి ప్రతిష్ఠాపన ప్రధాని మోదీ చేతుల మీదుగా నిర్వహించనున్నారు. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు తరలి రానున్నారు. ఈ క్రమంలో అయోధ్యకు ట్రైన్, బస్, విమాన ప్రయాణాలు పెరిగాయి.

రాముడి చూడాలని ఆశతో ఉన్న భక్తులే టార్గెట్ గా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అయోధ్యకు రామమందిర ప్రారంభోత్సవానికి వీఐపీ టికెట్లు కావాలా అంటూ మోసాలకు పాల్పడుతున్నారు. వీఐపీ టికెట్ కావాలా అంటూ సాధారణ మెసేజ్ లు, వాట్సాప్ మెసేజ్ ల్లో లింక్ లు పంపుతున్నారు.

ఇక మరికొందరైతే డైరక్ట్ ​గా ఈ ఏపీకే ఫైల్​ ను డౌన్​లోడ్​ చేసుకుంటే వీఐపీ యాక్సెస్‌ దొరుకుతుందని మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరగాళ్లు పంపిన లింక్ లు క్లిక్ చేస్తే అంతే సంగతి అని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

 

ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రజలను అప్రమత్తం చేశారు. మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంక్​ వివరాలన్నీ తస్కరించి మోసాలకు తెగబడుతారని, జాగ్రత్తగా ఉండాలని కోరారు. కాగా అయోధ్యరామందిరానికి సంబంధించి దర్వాజాలను హైదరాబాద్ కు చెందిన ఓ టింబర్ డిపో వారు తయారు చేశారు. అలాగే శ్రీరాముడి పాదుకలను హైదరాబాద్ కు చెందిన పిట్టంపల్లి రామలింగా చారి తయారు చేశారు. రామ పాదుకల కోసం పంచ లోహాలను ఉపయోగించారు.
అయోధ్యలో ఈ నెల 22న శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకల నేపథ్యంలో ప్రధాని మోదీ శుక్రవారం ప్రత్యేక దీక్షను ప్రారంభించిన సంగతి తెలిసిందే. 11 రోజుల పాటు తాను నియమ నిష్టలతో ఉంటానని మోడీ పేర్కొన్నారు.

పొలాల్లో మాయం.. OLXలో ప్రత్యక్షం! హైదరాబాద్‌ శివారుల్లో సరికొత్త చోరీలు

పొలాల గట్ల వెంట.. వ్యవసాయ బావుల వద్ద సేదతీరే ట్రాక్టర్లే వాళ్ల టార్గెట్‌. గుట్టుచప్పుడు కాకుండా మాయం చేసి.. రాత్రికి రాత్రే రాష్ట్రం దాటించేస్తారు.
ఆపై సెకండ్‌ హ్యాండ్‌ కింద ఆన్‌లైన్‌లోనే దర్జాగా వాటిని అమ్మేస్తారు. అయితే దొంగ ఎప్పటికైనా దొరకాల్సిందే కదా. హైదరాబాద్‌ శివారుల్లో చోటు చేసుకున్న సరికొత్త చోరీల కేసుల్ని పోలీసులు ఎట్టకేలకు చేధించగలిగారు.

ట్రాక్టర్ ట్రాలీలను చోరీ చేస్తున్న ఇద్దరు అంతర్‌ జిల్లా దొంగలను అరెస్ట్‌ చేసినట్లు రాచకొండ సీపీ సుధీర్‌ బాబు తెలిపారు. వ్యవసాయ కూలీలుగా పని చేసే సంపంగి మహేష్.. ఉర్సు వెంకన్నలు ఆర్థిక ఇబ్బందులతో దొంగతనాలకు దిగారు. రాత్రుల్లో బావుల వద్ద ఉంచిన ట్రాక్టర్‌ ట్రాలీలను ఎత్తుకెళ్లి.. రాత్రికి రాత్రే రాష్ట్రం దాటించేవారు. ఆ తర్వాత వాటిని నేరుగా అమ్మితే దొరికిపోతామని ఓఎల్‌ఎక్స్‌ తరహా ఆన్‌లైన్‌ సైట్లలో అమ్మకానికి ఉంచారు. అలా అమ్మేయగా వచ్చిన డబ్బుతో విలాసాలకు అలవాటు పడ్డారు. ఈ క్రమంలో..
మాడ్గుల్ మండలం(రంగారెడ్డి జిల్లా) పరిధిలో డిసెంబర్‌ 31న ట్రాక్టర్‌ దొంగతనం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేయగా దొంగలు దొరికిపోయారు. వాళ్ల దగ్గరి నుంచి సుమారు 20 లక్షలు విలువ చేసే 13 ట్రాక్టర్‌ ట్రాలీలను స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ కమిషనరేట్ లో 10 దొంగతనాలు.. నల్గొండలో ఒకటి.. నాగర్ కర్నూల్లో ఒక కేసు నమోదైనట్టు పోలీసులు వెల్లడించారు.

అలా నమ్మించాడు.. ఇలా ఉడాయించాడు.. కోటి రూపాయలతో పరార్‌

రోజుకో కొత్త మోసాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. కష్టపడి సంపాదించుకున్న డబ్బుల్ని కాజేస్తే ఆ బాధ వర్ణణాతీతం. ఇంతా జరుగుతున్నా కూడా ప్రజల్లో అవగాహన రాకపోవడం శోచనీయం.
అలవల పాడు గ్రామంలో షేక్‌ మస్తాన్‌వలి బాగా నమ్మకం ఏర్పరుచుకున్నాడు. 10 ఏళ్లుగా చీటీ పాటలు కట్టిస్తూ, అవసరమైన వారికి డబ్బులు సాయం చేస్తూ అందరిలో కలిసి పోయాడు. రూ. 50 వేల చీటీ పాటల నుంచి రూ. 2 లక్షల చీటీ వరకు వేసేవాడు. అతడ్ని నమ్మి గ్రామంలో చాలా మంది చీటీలు కట్టారు. బంగారం వ్యాపారం చేస్తున్నానంటూ నమ్మ బలికి లక్షలాది రూపాయలు అప్పులు చేశాడు. వారిలో కొంత మందికి 2,3 నెలల పాటు వడ్డీలు చెల్లించాడు. అది చూసి చాలా మంది ఆశపడి డబ్బులు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. దీన్ని ఆసరాగా తీసుకొని నెల రోజుల నుంచి గ్రామంలో కనిపించకుండా వెళ్లిపోయాడు.

జే.పంగులూరు: మండల పరిధిలోని అలవలపాడు గ్రామానికి చెందిన షేక్‌ మస్తాన్‌వలి గ్రామంలో చీటీ పాటలు నిర్వహిస్తుంటాడు. అతడ్ని నమ్మి 160 మంది వరకు నెలకు రూ. 10 వేలు చొప్పున చీటీ కట్టారు.అందరూ ముస్లిం కాలనీకి చెందిన వారు. చీటీ పాటలు కట్టిన వారంతా కూలీనాలీ చేసుకునే వారే. చీటీ కట్టేవారిలో కొందరు పిల్లల చదువు కోసం, కొందరు కూతురు పెళ్లి నిమిత్తం కట్టినవారు ఉన్నారు. ఇలా ఎంతోమంది కష్టపడి డబ్బులు కట్టుకున్నారు. వారిలో అతి కొద్ది మందికి మాత్రమే తిరిగి అందాయి. ఎనిమిది చీటీ పాటల్లోనూ కొందరికి మాత్రమే డబ్బులు చెల్లించాడు. తప్పుడు చీటీ పాటలు చూపి డబ్బులు మొత్తం అతనే వాడుకున్నాడని బాధితులు వాపోతున్నారు.

రూ. 50 లక్షలు వరకు అప్పులు
చీటీ పాటలే కాక గ్రామంలో కొంత మందికి దొంగ బంగారం కొంటున్నానని షేక్‌ మస్తాన్‌వలి నమ్మబలికించి రూ. 50 లక్షలు వరకు అప్పులు చేశాడు. వారిలో కొంత మందికి నెలనెలావడ్డీ డబ్బులు చెల్లించాడు. అలవలపాడు గ్రామంలో గతంలో కొంత మంది దొంగ బంగారం వ్యాపారం చేసి కోట్లాది రూపాయలు గడించారన్న నానుడి ఉంది. బొంబాయి నుంచి బంగారం కొంటున్నానని, డబ్బులు తగ్గాయని గ్రామంలో ఉన్న కొంత మంది వద్ద అప్పులు చేశాడు. మరికొంత మంది అతడ్ని నమ్మి డబ్బులు ఇచ్చారు. కొంత మంది ఇల్లు, పొలం తనఖా పెట్టి లక్షలు లక్షలు తెచ్చి షేక్‌ మస్తాన్‌వలి చేతిలో పోశారు. గ్రామానికి చెందిన డోలా గోవిందమ్మ అనే వృద్ధురాలు రూ. 13 లక్షలు తెచ్చి ఇచ్చింది. వాటిలో రూ.8 లక్షలు బ్యాంకు నుంచి లోను తీసుకోగా, ఇల్లు కట్టుకోవాలని రూ.5 లక్షలు దాచుకుంది. మొత్తం తెచ్చి మస్తాన్‌వలి చేతిలో పెట్టింది. పారిపోయాడన్న విషయం తెలుసుకున్న గోవిందమ్మ భోరున విలపించింది. ఇలా మస్తాన్‌వలి మోసాలకు బలైన వారు ఎందరో ఉన్నారు.

నమ్మి రూ. 6 లక్షలు ఇచ్చా
మా కాలనీలో అంతా షేక్‌ మస్తాన్‌వలిని పూర్తిగా నమ్మాం. అందరితో పాటు నేను నమ్మి అతని వద్ద రూ. 2 లక్షల చీటి పాటలు రెండు వేశా. రెండు పాటలు చివరికి వచ్చాయి. అదీ కాక బంగారం కొంటానని చెప్తే మరో రూ. 6 లక్షలు ఇచ్చా. వాటికి సంబంధించి నాకు మూడు నెలలు పాటు వడ్డీ చెల్లించాడు. అది చూసి కొంత మంది అతనికి డబ్బులు ఇచ్చారు. నాకు రెండు నెలల నుంచి వడ్డీ డబ్బులు ఇవ్వడం లేదు.
-షేక్‌ నన్నేసా, బాధితుడు

రూ. 5.50 లక్షల చీటీ పాటలు కట్టా
షేక్‌ మస్తాన్‌ వలి గ్రామంలో బాగా నమ్మకం ఏర్పచుకున్నాడు. గత 10 సంవత్సరాల నుంచి చీటీలు వేస్తున్నాడు. అది నమ్మి మేము కొంతమంది కలిసి లక్షలాది రూపాయలు కట్టాం. నేను మూడు పాటలకు గాను ఇప్పటికి రూ. 5.50 లక్షలు చెల్లించాను. పాటలు చివరికి వచ్చాయి. గత నెల 20వ తేదీన డబ్బులు ఇస్తాన్నాడు. చివరికి గ్రామంలోనే లేకుండా పరారయ్యాడు.
-షేక్‌ సైదా, బాధితుడు
రూ. 9.50 లక్షలు మోసపోయా
మస్తాన్‌ వలిని నమ్మి ఎలాంటి నోటు లేకుండా నోటి మాట మీద గత నెల 5న రూ. 9.50 లక్షలు ఇచ్చాను. నేను డబ్బులు ఇచ్చిన తరువాత రెండు రోజులకు గ్రామం వదిలి కుటుంబ సభ్యులతో వెళ్లిపోయాడు. ఫోన్‌ చేస్తే ఫోన్‌ కలవలేదు. దానితో పాటు రూ. 1.50 లక్షల చీటీ పాట డబ్బులు కట్టా. అవి కూడా నాకు ఇవ్వలేదు.
– షేక్‌ దస్తగిరి, అలవలపాడు, బాధితుడు

అలా నమ్మించాడు.. ఇలా ఉడాయించాడు రూ.1 కోటి చీటీ పాట డబ్బులతో పరార్‌ 160 మంది వరకు బాధితులు బంగారం కొనుగోలు పేరుతో బురిడీ కుటుంబ సభ్యులతో పరారైన షేక్‌ మస్తాన్‌వలి

షేక్‌ మస్తాన్‌వలి రాసిన నోటు
షేక్‌ మస్తాన్‌వలి

అతను డ్రైవింగ్‌.. ఆమె స్నాచింగ్‌!

నల్లగొండ: చైన్‌ స్నాచింగ్‌లు మగాళ్లే చేస్తారని భ్రమలో ఉన్నవాళ్లకు ఈ వార్త ఓ కనువిప్పు. ఓ యువతి ఓ యువకుడి సహకారంతో గొలుసు దొంగతనాలకు ప్రయత్నించింది.
ఈ క్రమంలో స్థానికులు కేకలు వేయడంతో వాళ్లిద్దరూ పలాయనం చిత్తగించారు. నల్లగొండ జిల్లా దేవరకొండలో జరిగిన ఈ ఘటన తాలుకా వీడియో ఇప్పడు వాట్సాప్‌లలో వైరల్‌ అవుతోంది.

శుక్రవారం మధ్యాహ్న సమయంలో ఓ వ్యక్తి.. యువతి స్కూటీ మీద వచ్చారు. అక్కడ ఓ మహిళ మెడలో గొలుసును వెనక ఉండే యువతి లాగే యత్నం చేసింది. సదరు మహిళ గట్టిగా కేకలు వేయడంతో.. స్థానికులు బైక్‌పై ఉన్నవాళ్లను వెంబడించే యత్నం చేశారు. ఈ క్రమంలోనే ఛేజ్‌ చేస్తూ వాళ్లను వీడియో తీశారు.అయితే వాళ్లు దొరకలేదు.

ఇక బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మర్రిగూడ పోలీసులు.. ఆ ఇద్దరినీ పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.

హైదరాబాద్: నకిలీ మైసూర్ శాండిల్ సబ్బులు తయారు చేసే ముఠా అరెస్టు!

స్నానం అనేది అందరి జీవితంలో నిత్యకృత్యం. స్నానికి సంబంధించిన సోప్ విషయంలో గతంలోనైతే పెద్దగా ఆప్షన్స్ ఉండేవి కావు. కానీ, ఇప్పుడు లెక్కకు మించిన కంపెనీలు, ఫ్రేగ్రెన్సులు, ఫార్ములాలతో కొత్త కొత్త సబ్బులను మార్కెట్లోకి దించేస్తున్నారు.
అంతేకాకుండా వీపరీతమైన యాడ్స్ తో వాటిని కొనేలా ప్రభావితం చేస్తున్నారు. కానీ, ఇప్పటికీ కొన్ని సబ్బులు ఏళ్ల తరబడి ఈ పోటీ మార్కెట్ ని ఏలేస్తున్నాయి. వాటిలో ప్రధానంగా వినిపించే పేరు మైసూర్ శాండిల్. నిజానికి ఈ సబ్బు చాలామంది ఎమోషన్ అనే చెప్పాలి. అది తప్పితే వేరే సోప్ వాడమన్నా వాడరు. అలాంటి సబ్బును కూడా కల్తీ చేశారు. నకిలీ మైసూర్ శాండిల్ తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.

నకిలీ మైసూర్ శాండిల్ సబ్బుల తయారీ ముఠాను మలక్ పేట పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ నగరంలో పెద్దఎత్తున ఈ నకిలీ మైసూర్ శాండిల్ సబ్బులను తయారు చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. పక్కా సమాచారం అందుకున్న మలక్ పేట పోలీసులు సోదాలు నిర్వహించి ఈ ముఠాను పట్టుకున్నారు. దాదాపు రూ.2 కోట్ల విలువైన తయారీ సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. నగరానికి చెందిన రాకేశ్ జైన్, మహావీర్ జైన్ లను నిందితులగా తేల్చారు. ఈ నకిలీ ముఠాకి సంబంధించిన సమాచారం కర్ణాటక పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ కు సమాచారం అందింది. వెంటనే ఆయన ఈ విషయానికి సంబంధించి దర్యాప్తు చేయాలని తెలంగాణ పోలీసులకు సమాచారం అందించారు. దర్యాప్తు జరపకగా ఈ నకిలీ ముఠా వెలుగులోకి వచ్చింది. అయితే మైసూర్ శాండిల్ సబ్బుకు కర్ణాటక ప్రభుత్వానికి చెందిన కేఎస్ డీఎల్ అనే సంస్థకు పేటెంట్ హక్కులు ఉన్నాయి. కర్ణాటక మంత్రి ఎంబీ పాటిల్ కేఎస్ డీఎల్ సంస్థకు ఛైర్మన్ గా ఉన్నారు. మరి.. నకిలీ మైసూర్ శాండిల్ సబ్బులు తయారు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Ganja Chocolates: హైదరాబాద్ కు కూతవేటు దూరంలో.. కిరాణ షాపుల్లో గంజాయి చాక్లెట్లు.. గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులే టార్గెట్!

Ganja Chocolates: గంజాయి మత్తు దేశాన్ని పట్టి పీడిస్తోంది. మెట్రో నగరాలతోపాటు మారుమూల పల్లెల్లోనూ గంజాయి దందా విచ్చలవిడిగా సాగుతోంది. యువతి, యువకులే టార్గెట్ గా చేసుకుని స్మగ్లర్లు లక్షల్లో సంపాధిస్తున్నారు.
పోలీసులు కట్టుదిట్టమైన నిఘా పెట్టినా.. వివిధ రూపాల్లో సరాఫరా చేస్తున్నారు. ఇందులో భాగంగానే చాక్లెట్ (Chocolate) ల రూపంలో గంజాయిని విక్రయిస్తుండగా ఇది తిన్న స్కూల్ పిల్లలు.. క్లాస్ రూమ్ లోనే రెచ్చిపోయి అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన రంగారెడ్డి (Ranga reddy) జిల్లా కొత్తూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో (School) చోటుచేసుకుంది.

 

క్లాస్‌రూమ్‌లో మత్తెక్కి పడిపోవడం..
ఈ మేరకు పాఠశాల యాజమాన్యం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా కొత్తూరులోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ఈ మధ్య అబ్బాయిలు వింతగా ప్రవర్తించడం గమనించాం. బెంచీలపై పడుకోవటం, క్లాస్‌లోనే మూత్రవిసర్జన చేయటం, బాలికల ముందు అసభ్యంగా ప్రవర్తించటం చేస్తున్నారు. అలా ఒకరిద్దరు చేస్తే బెదిరించి వదిలేశాం. కానీ రోజు రోజుకు చాలా మంది అలాగే ప్రవర్తించటంతో తమకు అనుమానం వచ్చిందని హెడ్‌మాస్టర్‌ అంగూర్‌ నాయక్‌ చెప్పారు.

కదలికలపై నిఘా..
ఈ క్రమంలోనే పిల్లల కదలికలపై నిఘా పెట్టాం. వాళ్లతో ఫ్రెండ్లీగా ఉంటూనే ఏలాంటి పనులు చేస్తున్నారు, ఎక్కడెక్కడ తిరుగుతున్నారో కనుక్కున్నాం. అయితే ఒక అబ్బాయి చాక్లెట్లు తీసుకొచ్చి తింటూ క్లాస్‌రూమ్‌లో మత్తెక్కి పడిపోవడం గుర్తించాం. ఆ చాక్లెట్లు మేము తిని రుచి చూస్తే అసలు విషయం బయటపడింది. గంజాయి కలిపిన చాక్లెట్స్ తింటున్నారని గుర్తించి.. ఎక్కడ దొరుకుతాయో వివరాలు అడిగాం. దీంతో కొత్తురు పోలీసు స్టేషన్‌కు ఆనుకుని ఉన్న ఒక కిరాణాషాపుతో పాటు పాఠశాల పరిసరాల్లో ఉన్న దుకాణాలు, పాన్‌షాప్‌ల్లో మత్తు చాక్లెట్లను విక్రయిస్తున్నట్లు గుర్తించాం. ఒక్కో చాక్లెట్‌ రూ.25కు అమ్ముతుండగా.. ప్రతిరోజు చాలా మంది విద్యార్థులతోపాటు పలువురు కొంటున్నట్లు తెలుసుకున్నామని స్కూల్ యాజమాన్యం వివరించింది.
ఎస్‌వోటీ బృందాలతో ప్రత్యేక ఆపరేషన్‌..
ఇక ఈ విషయంపై వెంటనే డీఈవోతో చర్చించి.. పోలీసు ఉన్నతాధికారుల సహకారంతో నేరుగా శంషాబాద్‌ జోన్‌ డీసీపీ నారాయణరెడ్డికి సమాచారం అందించారు. ఆయన స్థానిక ఎస్‌వోటీ బృందాలతో ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టి గంజాయి చాక్లెట్ల గుట్టు రట్టుచేసినట్లు తెలిపారు. ఒడిశాకు చెందిన వీరేంద్ర బెహరా (33), సోమనాథ్‌ బెహరా(35), సురిజ్యామిని సాహూ(35) కొత్తూరు మున్సిపాలిటీలో వివిధ ప్రైవేట్‌ కంపెనీల్లో పనిచేస్తూ, ఒడిశాలో రూ.9కి గంజాయి చాక్లెట్లను కొని, ‘చార్మినార్‌ మునక్కా గోల్డ్‌’ పేరుతో ఇక్కడికి తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు వెల్లడించిన పోలీసులు..నిందితులు అరెస్టు చేసిన రిమాండ్‌కు తరలించారు.

సంతోష్‌ కిరాణ అండ్‌ జనరల్‌ స్టోర్‌..
కొత్తురు పోలీస్‌ స్టేషన్‌ ప్రహరీ గోడకు ఆనుకొని ఉన్న’సంతోష్‌ కిరాణ అండ్‌ జనరల్‌ స్టోర్‌’లో ఏడాది కాలంగా మత్తు చాక్లెట్లను వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. కిరాణ షాపుల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టగా 8 కిలోల గంజాయి చాక్లెట్లు దొరికాయి. పరిసర ప్రాంతాల్లో మరికొన్ని దుకాణాల్లో సైతం పోలీసులు తనిఖీలు నిర్వహించగా మరికొందరు నిందితులు పరారవగా పోలీసులు గాలిస్తున్నారు.
48 గంటల మత్తు..
ఒక చాక్లెట్‌ తీసుకుంటే సుమారు 48 గంటల వరకు మత్తు ఉంటుందని బాధితులు చెప్తున్నారు. అయితే తాము ఒక చాక్లెట్‌ను నలుగురు షేర్‌ చేసుకుని తింటే.. కనీసం 12 గంటలపాటు మత్తుగా ఉంటుందని చెప్పారు. విద్యార్థులే కాకుండా ఆ ప్రాంతంలో ఉండే కార్మికులు, యువత ఈ చాక్లెట్లు తింటున్నట్టు పోలీసులు గుర్తించారు. హెడ్‌మాస్టర్‌ అంగూర్‌ నాయక్‌ గుర్తించకపోతే తమ బిడ్డల పరిస్థితి ఏమయ్యేదోనని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలల కిందటే ఈ పాఠశాలకు వచ్చిన ఆయన తమ పిల్లల భవిష్యత్తు, ప్రాణాలు కాపాడినందుకు ఆనందం వ్యక్తం చేస్తూ అంగూర్ కు థాంక్స్ చెబుతున్నారు.

Post Office MIS Scheme: ఒక్కసారి పెట్టుబడితో నెలనెలా రాబడి.. పోస్టాఫీసు అందించే అద్భుత పథకం ఇదే..!

ధనం మూలం ఇదం జగత్‌.. అంటే ప్రపంచంలో డబ్బు ఉంటేనే మనిషికి విలువ ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ పొదుపు మంత్రాన్ని పాటిస్తూ ఉంటారు. అంటే నెలనెలా వారికి వచ్చిన సొమ్మును కొంత మేర పొదుపు చేస్తూ ఉంటారు.
అయితే అనుకోకుండా ఓ మరింత ఎక్కువ సొమ్ము చేతికి వచ్చినప్పుడు ఆ సొమ్మును వృథా చేయకుండా పొదుపు చేయడానికి వివిధ పథకాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా అనేక రకాల పథకాలు పోస్ట్ ఆఫీస్ ద్వారా అమలు చేస్తారు. వీటిలో ఒకటి నెలవారీ ఆదాయ పథకం (ఎంఐఎస్‌). ఇది డిపాజిట్ స్కీమ్. దీనిలో మీరు ఒకసారి పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రతి నెలా సంపాదించవచ్చు. పీఓఎంఐఎస్‌లో ఒకే ఖాతాలో గరిష్టంగా రూ. 9 లక్షలు, ఉమ్మడి ఖాతాలో గరిష్టంగా రూ. 15 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. మీరు ఎంత మొత్తాన్ని డిపాజిట్ చేసినా మీకు ప్రతి నెలా వడ్డీ ఇస్తారు. ప్రస్తుతం పోస్టాఫీసు ఎంఐఎస్‌లో వడ్డీ రేటు 7.4 శాతంగా ఉంది. ఈ పథకం గురించి వివరాలను తెలుసుకుందాం.

పోస్ట్ ఆఫీస్ ఎంఐఎస్‌లో మొత్తం ఒకేసారి 5 సంవత్సరాల పాటు డిపాజిట్ చేస్తారు. అంటే మీరు వరుసగా 5 సంవత్సరాలు వడ్డీ తీసుకోవడం ద్వారా మీ ఆదాయాన్ని పొందవచ్చు. మెచ్యూరిటీ తర్వాత డిపాజిట్ చేసిన మొత్తం మీకు తిరిగి వస్తుంది. అయితే మీకు ఐదేళ్లలోపు డబ్బు అవసరమైతే మరియు దానిని ఉపసంహరించుకోవాలనుకుంటే లేదా నెలవారీ సంపాదన పథకాన్ని ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం కొనసాగించాలనుకుంటే నియమాలను చూద్దాం.

ఐదేళ్లలోపు సొమ్ము విత్‌డ్రా చేస్తే..?

ఒకవేళ ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీరు మెచ్యూరిటీ వ్యవధి పూర్తయ్యేలోపు మొత్తాన్ని విత్‌డ్రా చేయాలనుకుంటే మీరు మొదటి సంవత్సరం వరకు సదుపాయాన్ని పొందలేరు.
ఒక సంవత్సరం తర్వాత మీరు ఖాతా నుండి డబ్బును విత్‌డ్రా చేసుకునే సదుపాయాన్ని పొందుతారు. కానీ ఇందులో మీరు డిపాజిట్ చేసిన మొత్తం నుంచి కొంత డబ్బు పెనాల్టీగా తీసివేస్తారు కాబట్టి మీరు నష్టపోతారు.
మీరు ఒక సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల మధ్య డబ్బును విత్‌డ్రా చేస్తే డిపాజిట్ మొత్తంలో 2 శాతం తీసేస్తారు.
మీరు ఖాతా తెరిచిన 3 సంవత్సరాల తర్వాత, 5 సంవత్సరాలలోపు డబ్బును విత్‌డ్రా చేయాలనుకుంటే, డిపాజిట్ చేసిన మొత్తంలో 1 శాతం తీసివేసిన తర్వాత డిపాజిట్ మొత్తం మీకు తిరిగి వస్తుంది.
ఎంఐఎస్‌ స్కీమ్‌ పొడిగింపు నియమాలు

సాధారణంగా మీరు ఎఫ్‌డీ, పీపీఎఫ్‌ మొదలైన అన్ని పథకాలలో మీ ఖాతాను పొడిగించే సదుపాయాన్ని పొందుతారు. కానీ మీరు పోస్ట్ ఆఫీస్ మంత్లీ సేవింగ్ స్కీమ్‌లో ఈ సదుపాయాన్ని పొందలేరు. మీరు పథకానికి సంబంధించిన ప్రయోజనాలను మరింత పొందాలనుకుంటే మీరు మెచ్యూరిటీ తర్వాత కొత్త ఖాతాను తెరవవచ్చు.
నెలవారీ ఆదాయం ఇలా

పోస్టాఫీస్ మంత్లీ సేవింగ్స్ స్కీమ్‌లో ఒకే ఖాతాలో రూ.9 లక్షలు డిపాజిట్ చేస్తే, 7.4 శాతం వడ్డీతో ప్రతి నెలా రూ.5,500 నెలవారీ ఆదాయం పొందవచ్చు. కాగా జాయింట్ అకౌంట్‌లో రూ.15 లక్షలు డిపాజిట్ చేస్తే ప్రతి నెలా రూ.9,250 ఆదాయం పొందవచ్చు.

చాలాసేపు కదలకుండా కూర్చుంటున్నారా.. అయితే జాగ్రత్త!

–ప్రసవం ముందు కాళ్ల వాపులు.. ఎందుకు?
కాళ్లవాపులు వస్తుంటే దృష్టి పెట్టాల్సిన మెడికల్‌ సమస్యలు

దేహనిర్మాణ పరమైన (అనటామికల్‌) కారణం

‘చాలాసేపు కదలకుండా కూర్చున్నా, అలా కూర్చుని చాలాసేపు ప్రయాణాలు చేసినా కాళ్లవాపులు రావడం మామూలే.
గర్భవతుల్లోనైతే ప్రసవానికి ముందు చివరి మూడు నెలల్లో (చివరి ట్రైమిస్టర్‌లో) కాళ్ల వాపు రావడం ఇంకా సాధారణం. గర్భవతుల్లో కాళ్ల వాపు వచ్చే ఈ కండిషన్‌ను వైద్య పరిభాషలో ‘జెస్టెషనల్‌ అడిమా’ అంటారు. ఇలా కాళ్లవాపులు రావడానికి కారణాలేమిటి, వాటితో వచ్చే సమస్యలూ – పరిష్కారాలపై అవగాహన కోసం ఈ కథనం.’

గర్భవతుల్లో ప్రసవం ముందరి నెలల్లో కాళ్ల వాపులు రావడం.. అందునా అవి ఉదయం పూట కొద్దిగా ఉండి, క్రమంగా సాయంత్రానికి వాపులు పెరుగుతుండటం చాలామందిలో జరుగుతుంటుంది. కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటల విశ్రాంతితో ఆ నొప్పులు వాటంతట అవే తగ్గిపోతాయి.

దేహనిర్మాణ పరమైన (అనటామికల్‌) కారణం..
గర్భవతుల్లో ప్రసవానికి ముందు రోజుల్లో గర్భసంచి కుడి వైపునకు కాస్తంత ఒరుగుతుంది. కాళ్ల నుంచి గుండెకు రక్తాన్ని తీసుకుపోయే పెద్ద రక్తనాళమైన ఇన్ఫీరియర్‌ వీన కేవా శరీరానికి కుడివైపునే ఉంటుంది. గర్భసంచి కుడి వైపునకు ఒరగడం వల్ల.. అది ఇన్ఫీరియర్‌ వీన కేవాపై ఒత్తిడిని కలిగిస్తుంది. దాంతో కాళ్ల నుంచి గుండె వైపునకు రక్తప్రవాహం సాఫీగా సాగక కాళ్లవాపులు వస్తుంటాయి. అందువల్ల గర్భవతులు విశ్రాంతిగా పక్కమీద ఒరిగినప్పుడు తమ ఎడమవైపునకు తిరిగి పడుకోవడం మంచిది.

కాళ్లవాపులు వస్తుంటే దృష్టి పెట్టాల్సిన మెడికల్‌ సమస్యలు..

గర్భవతుల్లో కాళ్ల వాపు వస్తున్నప్పుడు ముందుగా హైబీపీ ఉందేమోనని పరీక్షించుకోవాలి.
మనదేశ మహిళల్లో రక్తహీనత (అనీమియా) చాలా ఎక్కువ. కాళ్ల వాపులు రావడానికి ఈ అంశం కూడా ఒక ప్రధాన కారణం. కంప్లీట్‌ బ్లడ్‌ పిక్చర్‌/కౌంట్‌ (సీబీపీ/సీబీసీ) వంటి రక్తపరీక్షలు నిర్వహించినప్పుడు మహిళల్లో హిమోగ్లోబిన్‌ మోతాదు కనీసం 11 ఉండాలి. కొందరిలో ఇది 7 కంటే తక్కువగా ఉన్నప్పుడు కాళ్ల వాపు రావడం సాధారణం.
మహిళల్లో గుండెజబ్బులు, కాలేయవ్యాధులు, కిడ్ని సమస్యలు ఉన్నవారు గర్భం దాల్చినప్పుడు కూడా కాళ్లవాపులు రావచ్చు.
కాళ్లవాపు తగ్గడానికి చేయాల్సిందిదే..

మామూలుగానైతే ఈ కాళ్లవాపుల గురించి పెద్దగా ఆందోళన పడాల్సిందేమీ లేదు.
వాపు ఎక్కువగా ఉంటే పక్క మీద ఒరిగి పడుకున్న గర్భవతులు మడమల కింద తలగడను పెట్టుకుని, కాళ్లను కాస్త ఎత్తుగా ఉండేలా చూసుకోవాలి.
కంప్యూటర్‌ ముందుగాని, డెస్క్‌ ముందుగాని అదేపనిగా కూర్చుని పనిచేసే వారు తమ కాళ్ల కింద ఏదైనా పీటగానీ, స్టూల్‌గాని వేసుకుని, కాళ్లు కాస్తంత ఎత్తు మీద ఉండేలా చూసుకోవాలి.
ప్రతి రెండు మూడు గంటలకు ఒకమారు లేచి, కాస్తంత నడవాలి. దాంతో కాళ్ల వాపు తగ్గుతుంది.
పైన పేర్కొన్న జాగ్రత్తలు ΄ాటించాక కూడా కాళ్ల వాపులు తగ్గని వారూ,.. అలాగే ఆ సమస్యతో పాటు చేతులు, ముఖంలో వాపు కనిపిస్తున్నవారూ, ఆరేడు గంటల విశ్రాంతి తర్వాత కూడా కాళ్ల వాపులు తగ్గని వారు.. తప్పనిసరిగా హైబీపీ, అనీమియాతో పాటు థైరాయిడ్‌ వంటి సమస్యలు ఏవైనా ఉన్నాయేమోనని డాక్టర్ల చేత పరీక్ష చేయించుకోవాలి.

 - డాక్టర్‌ రమ్యతేజ కడియాల, సీనియర్‌ గైనకాలజిస్ట్‌ అండ్‌ ఆబ్‌స్టెట్రీషియన్‌
– డాక్టర్‌ రమ్యతేజ కడియాల, సీనియర్‌ గైనకాలజిస్ట్‌ అండ్‌ ఆబ్‌స్టెట్రీషియన్‌

గర్భవతుల్లో కాళ్ల వాపు వస్తున్నప్పుడు ముందుగా హైబీపీ ఉందేమోనని పరీక్షించుకోవాలి.
మామూలుగానైతే ఈ కాళ్లవాపుల గురించి పెద్దగా ఆందోళన పడాల్సిందేమీ లేదు.

 

The world’s largest airport ప్రపంచంలోనే అతి పెద్ద విమానాశ్రయం

ఇది ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం. సౌదీ అరేబియాలోని దమ్మమ్‌ నగరానికి 31 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ విమానాశ్రయం విస్తీర్ణం 483 చదరపు కిలోమీటర్లు.
అంటే ప్యారిస్‌ నగరం విస్తీర్ణానికి ఎనిమిది రెట్లు ఉంటుంది. ఇక్కడి నుంచి 37 విమానయాన సంస్థలు తమ విమానాలను నడుపుతున్నాయి. ఇవి తమ ప్రయాణికులను ఇక్కడి నుంచి 43 గమ్యాలకు చేరవేస్తున్నాయి.

విస్తీర్ణంలో ఈ విమానాశ్రయం అతిపెద్దదే అయినా, ఇక్కడి నుంచి ఏటా రాకపోకలు జరిపే ప్రయాణికులు మాత్రం దాదాపు కోటి మంది మాత్రమే! దీనికంటే చిన్నదైన లండన్‌ హిత్రూ విమానాశ్రయం నుంచి ఏటా దాదాపు ఎనిమిది కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు జరుపుతుంటారు. సౌదీ అరేబియా ఇదివరకటి రాజు ఫాహద్‌ తన పేరుతో నిర్మించిన ఈ విమానాశ్రయం 1999 నవంబర్‌ 28 నుంచి ప్రయాణికులకు సేవలందిస్తోంది.


గల్ఫ్‌యుద్ధం జరిగినప్పుడు ఇది అమెరికన్‌ వైమానిక దళాలకు విమాన స్థావరంగా కూడా ఉపయోగపడింది. కళ్లు చెదిరే ఈ విమానాశ్రయంలో ప్రయాణికుల కోసం విలాసవంతమైన వసతులు ఉన్నాయి. ఇందులోని పార్కింగ్‌ స్పేస్‌లో ఏకకాలంలో ఐదువేల కార్లు నిలిపి ఉంచడానికి తగిన సౌకర్యం ఉంది. విస్తీర్ణంలో అతిపెద్దదే అయినా, ప్రయాణికుల రద్దీలో మాత్రం ఈ విమానాశ్రయం వెనుకబడే ఉండటం గమనార్హం.

AP Politics: జనసేన – టీడీపీ మేనిఫెస్టో రెడీ.. ప్లాన్ ఇదే!

ఈ సారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా.. నిధుల కొరత పెద్ద సవాల్ కానుంది. తెలంగాణలో కాంగ్రెస్ భారీ హామీలు ఇచ్చి, తీరా అధికారంలోకి వచ్చాక, వాటి అమలు చెయ్యడానికి మనీ లేకపోవడంతో చాలా ఇబ్బంది పడుతోంది.
మాగ్జిమం ట్రై చేస్తోంది. తెలంగాణ కంటే ఏపీ గొప్పగా ఏమీ లేదు కదా. అక్కడా నిధుల కొరత ఇప్పటికే ఉంది. ఎన్నికలకు అటు వైసీపీ, ఇటు టీడీపీ+జనసేన కూటమి భారీ హామీలు ఇచ్చేందుకు రెడీ అవుతున్నాయి. అందువల్ల ఎన్నికల తర్వాత ఎవరు అధికారంలోకి వచ్చినా, ఖజనాలో నిధుల కొరత సమస్య బాగా ఉంటుంది. కొత్తగా ఆదాయం వచ్చే ప్రయత్నాలు చేస్తే తప్ప ప్రభుత్వం సాగని పరిస్థితి ఉంటుంది.

భోగి పండుగకు ముందురోజు.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దాదాపు 3న్నర గంటలపాటూ భేటీ అయ్యి.. చాలా విషయాలపై చర్చించుకున్నారు. ఇందుకోసం చంద్రబాబు ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్లారు. ప్రధానంగా టీడీపీ ఆల్రెడీ 6 గ్యారెంటీ హామీలు, జనసేన షణుఖ వ్యూహంలోని 6 అంశాలపై చర్చించారని తెలిసింది. ఇలా మొత్తం 12 అంశాలతో ఉమ్మడి మేనిఫెస్టో రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ నెలాఖరు నాటికి ఈ మేనిఫెస్టోని ప్రకటించేసి, ఆ తర్వాత సీట్ల సర్దుబాటుపై ఫోకస్ పెట్టబోతున్నట్లు తెలిసింది. ఇందుకోసం జనవరి 18 లేదా 21న తిరుపతి లేదా ఇంకెక్కడైనా భారీ బహిరంగ సభను ఏర్పాటుచేసి, మేనిఫెస్టోని ప్రకటిస్తారని టాక్ వినిపిస్తోంది.
ఉమ్మడిగా ముందుకు:

ఇప్పటివరకూ జనసేన, టీడీపీ విడివిడిగా సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నాయి. త్వరలో ఉమ్మడిగా ముందుకు సాగుతాయని తెలుస్తోంది. అలాగైతే, రెండు పార్టీల అభిమానులూ, కార్యకర్తలూ పెద్ద సంఖ్యలో వస్తారని అంచనాలున్నాయి. దీనిపై రూట్ మ్యాప్ రెడీ చేస్తున్నారని తెలుస్తోంది.

అవతల వైసీపీ.. అసెంబ్లీ, పార్లమెంట్ సెగ్మెంట్లకు ఇంఛార్జులను నియమించేస్తోంది. తద్వారా ఎన్నికలకు రెడీ అవుతోంది. త్వరలోనే జగన్ రాష్ట్రవ్యాప్త టూర్ కూడా ఉంటుందని తెలిసింది. అందువల్ల టీడీపీ+జనసేన కూడా స్పీడ్ పెంచుతున్నాయి. ఓ అంచనా ప్రకారం.. గోదావరి జిల్లాల్లో ప్రధానంగా జనసేన పోటీ చేస్తుందనీ, మిగతా జిల్లాల్లో టీడీపీ పోటీ చేస్తుందని తెలుస్తోంది. కాపు వర్గం ఓట్లే టార్గెట్‌గా జనసేన ప్లాన్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే.. కాపు వర్గం నేత ముద్రగడ పద్మనాభంను జనసేన ఆహ్వానించినట్లు తెలుస్తోంది.మొత్తంగా రాజకీయాలు ఆసక్తిగానే ఉన్నాయి. ఈ మూడు నెలల్లో ఇంకా ఎన్నెన్ని మార్పులు జరుగుతాయో చూస్తూ, చర్చించుకుందాం.

Sunday Motivation: విజయానికి దగ్గర దారి ఒక్కటే… కష్టపడి పనిచేయడం

Sunday Motivation: ఒక మారుమూల గ్రామంలో ఒక రైతు నివసించేవాడు. అతనికి బంగారం పండే చక్కటి పొలాలు ఉన్నాయి. ఆయన కష్టపడి పనిచేసి చాలా సంపాదించాడు. అతనికి ముగ్గురు కొడుకులు ఉన్నారు.
శక్తివంతులై ఉండి కూడా వారు ఏ పనీ చేసేవారు కాదు. రైతుకు వయసు పెరుగుతున్న కొద్దీ పిల్లల భవిష్యత్తుపై బెంగ పట్టుకుంది. వారు పని చేయడానికి ఇష్టపడకపోవడం వల్ల వారి భవిష్యత్తు ఏమైపోతుందోనని చాలా ఆందోళన చెందాడు.

వయసు మీద పడడంతో ఒకరోజు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. మరణం సమీపిస్తుందని ఆయనకి అర్థం అయింది. వెంటనే తన ముగ్గురు కొడుకుల్ని పిలిచాడు. ‘నాకు మరణం సమీపిస్తున్నట్టు అర్థం అవుతోంది. అందుకే మీతో ఒక రహస్యాన్ని చెప్పాలని పిలిచాను. మన పొలాల కింద ఎక్కడ ఒక మూల నిధి దాచి పెట్టాను. ఎక్కడ దాచి పెట్టానో మర్చిపోయాను. మీరు ఆ పొలం మొత్తం తవ్వి వెతుక్కోండి. మీకు ఆ నిధి దొరికితే అదృష్టవంతులే’ అని చెప్పాడు.
అంతవరకు పొలం జోలికి వెళ్ళని కొడుకులు పొలాన్ని తవ్వడం ప్రారంభించారు. పది ఎకరాల పొలాన్ని తవ్వారు. కానీ వారికి నిధి దొరకలేదు. నాన్న అబద్ధం చెప్పారంటూ తిట్టుకున్నారు. ఎలాగూ తవ్వారు కాబట్టి, కొన్ని విత్తనాలు జల్లితే మంచిదని చెప్పింది వారి తల్లి. దాంతో వారు తవ్విన పొలంలోనే విత్తనాలను చల్లారు. కొన్ని రోజులకే వర్షాలు పడి ఆ విత్తనాలు మొలకెత్తి పంట విరగ కాసింది. దాన్ని అమ్మితే లక్షల కొద్ది డబ్బు వచ్చింది. కొడుకులు చాలా సంతోషించారు. వారి తల్లి ఆ ముగ్గురుని పిలిచి మీ నాన్న చెప్పిన నిధి మీకిప్పుడు దొరికింది… అని చెప్పింది. కొడుకులు తండ్రి మాటల వెనుక ఉన్న భావాన్ని అప్పుడు అర్థం చేసుకున్నారు. ఏదైనా సరే… కష్టపడితేనే దక్కుతుందని వారికి అర్థమైంది.
ఈ కథలో నీతి ఒక్కటే… కష్టానికి ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుంది. శ్రమ వల్ల దక్కిన ఫలితం ఎప్పుడూ తీపిగానే ఉంటుంది. విజయం దక్కాలంటే కష్టపడి పని చేయాలి. కష్టపడకుండా విజయం కావాలంటే దొరకదు.

Salaar: బ్లాక్ బస్టర్ ‘సలార్’.. గ్రాండ్‏గా పార్టీ ఇచ్చిన హోంబలే ఫిల్మ్స్.. అందరి చూపు ఆ ముగ్గురిపైనే..

డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం సలార్. డిసెంబర్ 22న విడుదలైన ఈ మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో చెప్పక్కర్లేదు.
బాహుబలి తర్వాత డార్లింగ్ కెరీర్‏లోనే బ్లాక్ బస్టర్ హిట్‏గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ.700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ సలార్ సక్సెస్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా నిర్వహించింది. శుక్రవారం సాయంత్రం బెంగుళూరులోని ఓ ప్రముఖ రెస్టారెంట్‏లో ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈవేడుకలకు డైరెక్టర్ నీల్, ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతిహాసన్, జగపతి బాబు, ఈశ్వరీ.. టెక్నికల్ టీం, మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్, డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడాని తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకలలో నీల్, పృథ్వీ, ప్రభాస్ నవ్వుతూ ఎంతో సరదాగా కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియోస్, ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

అలాగే ఇదే వేడుకలలో ‘హలో మేడమ్.. మమ్మీ.. బ్యూటీఫుల్ మమ్మీ’ అంటూ ఈశ్వరీరావును ప్రభాస్ ఆత్మీయంగా పలకరిస్తున్న వీడియో సైతం నెట్టింట వైరలవుతుంది. సలార్ హిట్ అయిన సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంది చిత్రయూనిట్. బాహులి తర్వాత ప్రభాస్ నటించిన రాధేశ్యామ్, ఆదిపురుష్, సాహో చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అభిమానులను నిరాశపరిచాయి. దీంతో ఈ పైనే అడియన్స్ ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే పోస్టర్స్, టీజర్, ట్రైలర్ తో ఎప్పటికప్పుడు అంచనాలు పెంచేశారు నీల్. విడుదలైన మొదటి రోజే ఈ కు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వచ్చేసింది. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‏కు ప్రభాస్ పక్కా మాస్ యాక్షన్ హిట్ అందించాడు నీల్. ఇక ఈ కు మ్యూజిక్ మరో హైలెట్ అనే చెప్పాలి. రవి బస్రూర్ అందించిన సంగీతం శ్రోతలను ఆకట్టుకుంది.

సలార్ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే సలార్ ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్ కాగా.. త్వరలోనే ఈ మూవీ సెకండ్ పార్ట్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. రెండవ భాగానికి శౌర్యంగ పర్వం అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా సలార్ క్లైమాక్స్ లోనే రివీల్ చేశాడు డైరెక్టర్. ఇక ఈ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ చిత్రానికి స్క్రిప్ట్ వర్క్ సిద్ధమైందని.. త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్లు గతంలో డార్లింగ్ వెల్లడించారు.

Antim Naqvi | జింబాబ్వే తరఫున తొలి ట్రిపుల్ సెంచరీ.. చరిత్రను తిరగరాసిన యువకెరటం

Antim Naqvi : జింబాబ్వే యవ క్రికెటర్ అంతిమ్ నక్వీ(Antim Naqvi) చరిత్ర సృష్టించాడు. ఆండీ ఫ్లవర్(Andy Flower), గ్రాంట్ ఫ్లవర్(Garnt Flower) వంటి దిగ్గజాలకు సైతం సాధ్యం కాని రికార్డు నెలకొల్పాడు.
జింబాబ్వే తరఫున తొలి ట్రిపుల్ సెంచరీ నమోదు చేశాడు. మిడ్ వెస్ట్ రైనోస్(Mid West Rhinos) కెప్టెన్ అయిన అంతిమ్ రెండో సీజన్‌లోనే తడాఖా చూపించాడు. జింబాబ్వే తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ కొట్టాడు.

లోగన్ కప్(Logan Cup) మ్యాచ్‌లో భాగంగా మెటాబెలెలలాండ్ టస్కర్స్(Matabeleland Tuskers) జట్టుతో జరిగిన మ్యాచ్‌లో అంతిమ్ దంచికొట్టాడు. క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచి ఊచకోతకు దిగిన 24 ఏండ్ల అంతిమ్.. 295 బంతుల్లోనే 30 ఫోర్లు, 10 సిక్సర్లతో ట్రిపుల్ సెంచరీకి చేరువై రికార్డులు బద్ధలు కొట్టాడు. అయితే.. గతంలో గ్రేమ్ హిక్‌(Greame Hick), ముర్రే గుడ్‌విన్‌(Murray Goodwin)లు కూడా ఫస్ట్ క్లాస్‌లో మూడొందలు కొట్టారు. కానీ, వాళ్లు జింబాబ్వేకు కాకుండా ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించారు.

అంతిమ్ 265 పరుగుల స్కోర్ వద్ద లోగన్ కప్ ఫస్ట్ క్లాస్ రికార్డును బ్రేక్ చేశాడు. ఇక 280 రన్స్ దాటిన అంతిమ్ 1967-68 మధ్య రే గ్రిప్పర్ 279 రన్స్‌తో నెలకొల్పిన రికార్డును అధిగమించాడు. జింబాబ్వే గడ్డపై ఇప్పటివరకూ అత్యధిక వ్యక్తిగత స్కోర్ 306. అది కూడా న్యూజిలాండ్ ఆటగాడు మార్క్ రిచర్డ్‌సన్(Mark Richardson) పేరిట ఉంది. రిచర్డ్‌సన్ 2000-01లో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఈ రికార్డు సాధించాడు. అయితే.. రైనోస్ జట్టు ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడంతో అంతిమ్ ఈ రికార్డును బద్ధలు కొట్టలేకపోయాడు.

మాది చిన్న దేశమే.. బెదిరించడం తగదు: మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు

We are a small country.. It is not appropriate to threaten: President of Maldives Muijju
బీజింగ్‌/ మాలె: ”భౌగోళికంగా మాది చిన్న దేశమే కావచ్చు. అంతమాత్రాన మమ్మల్ని బెదిరించడం మాత్రం తగదు. దానికి ఎవరికీ లైసెన్సు ఇవ్వలేదు” అని మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు పేర్కొన్నారు.

చైనాలో అయిదు రోజుల పర్యటనను ముగించుకుని శనివారం ఆయన స్వదేశానికి చేరుకున్నారు. భారత ప్రధాని నరేంద్రమోదీపై మాల్దీవుల మంత్రుల వ్యాఖ్యలతో దౌత్య వివాదాలు నెలకొన్న నేపథ్యంలో ముయిజ్జు విలేకరులతో మాట్లాడారు. నేరుగా ఏ దేశం పేరూ ప్రస్తావించకుండానే కొన్ని వ్యాఖ్యలు చేశారు. ‘..ఈ మహా సముద్రంలో మావి చిన్న ద్వీపాలే.

కానీ మాకు సముద్రంలో 9 లక్షల చదరపు కి.మీ. ప్రత్యేక ఆర్థిక మండలి (ఈఈజడ్‌) ఉంది. ఇంతపెద్ద వాటా ఉన్న దేశాల్లో మాది ఒకటి. ఈ మహా సముద్రం ఏ ఒక్క దేశానికో చెందదు.

ఇది దీనిచుట్టూ ఉన్న దేశాలన్నింటిది. మేం ఎవరి పెరడులోనో లేం. ఓ స్వతంత్ర, సార్వభౌమ దేశం మాది’ అని చెప్పారు. మరోవైపు మాల్దీవుల అంతర్గత వ్యవహారాల్లో ఏ దేశం జోక్యం చేసుకున్నా గట్టిగా వ్యతిరేకిస్తామని చైనా ప్రకటించింది.

PM Kisan: మహిళలకు ‘పీఎం కిసాన్‌’ సాయం డబుల్‌!

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రైతులకు పీఎం కిసాన్‌ సాయాన్ని పెంచేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు కసరత్తు చేస్తోంది. 2019 ఎన్నికలకు ముందు తీసుకొచ్చిన ఈ పథకం ద్వారా ప్రస్తుతం దేశవ్యాప్తంగా 11 కోట్ల మంది రైతులకు ఏడాదికి రూ.6 వేలు అందుతోంది.

– ప్రస్తుతం లబ్ధిదారులకు ఇస్తున్నది రూ.6 వేలు
– దీన్ని 10 వేలు లేదా 12 వేలకు పెంచే యోచన
– మిగతా రైతులకు రూ.8 వేలు.. కేంద్రం కసరత్తు

న్యూఢిల్లీ, జనవరి 13: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రైతులకు పీఎం కిసాన్‌ సాయాన్ని పెంచేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు కసరత్తు చేస్తోంది. 2019 ఎన్నికలకు ముందు తీసుకొచ్చిన ఈ పథకం ద్వారా ప్రస్తుతం దేశవ్యాప్తంగా 11 కోట్ల మంది రైతులకు ఏడాదికి రూ.6 వేలు అందుతోంది. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. అయితే మహిళా రైతులకు ఈ మొత్తాన్ని రెట్టింపు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. వారికి రూ.10 వేలు లేదా 12 వేలు.. మిగతా రైతులకు రూ.8 వేలు లేదా రూ.9 వేలకు పెంచాలని యోచిస్తున్నారు. ఈ మేరకు ఫిబ్రవరి 1న సమర్పించే మధ్యంతర బడ్జెట్‌లో ప్రతిపాదనలు చేయనున్నట్లు సమాచారం.

Inspirational Success Story : మాది మారుమూల గ్రామం..డబ్బు కోసం రెస్టారెంట్‌లో పనిచేశా.. నేడు లక్షల కోట్ల కంపెనీకి సీఈవోగా పనిచేస్తున్నా.. నా సక్సెస్ సీక్రెట్ ఇదే..

విజయానికి కేరాఫ్ అడ్రస్‌ భారత సంతతికి చెందిన యామిని రంగన్. రెస్టారెంట్‌లో సర్వర్‌గా కరియర్‌ను ప్రారంభించిన యామిని ఈరోజు రూ.2.11లక్షల కోట్లకు పైగా విలువైన కంపెనీగా సీఈవోగా సేవలందిస్తున్నారు.
ఈఏడాది టాప్‌ 100 టెక్‌ మహిళల్లో చోటు సంపాదించుకున్నారు. యామిని రంగన్ యుఎస్‌లోని అతి పిన్నవయస్కురాలైన అత్యుత్తమ వ్యాపార కార్య నిర్వాహకులలో ఒకరు. ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చాలనే లక్ష్యంతో తక్కువ కాలంలోనే ఆమె ఎన్నో పేరు ప్రఖ్యాతులు, సంపదను కూడబెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో యామిని సక్సెస్ జర్నీ..

కుగ్రామం నుంచి వచ్చి.. పిన్న వయసులోనే..

టెక్ ప్రపంచంలో అత్యంత గౌరవనీయమైన సీఈవీల్లో ఒకరుగా ఉన్నారు యామిని. భారతదేశంలోని కుగ్రామం నుంచి వచ్చి పిన్న వయసులో గ్లాస్‌ సీలింగ్‌ను బ్రేక్‌ చేసి తానేంటో నిరూపించుకుంది. మల్టీ బిలియన్ డాలర్ల టెక్ కంపెనీకి నాయకత్వం వహించే కొద్దిమంది మహిళల్లో ఒకరుగా పేరు తెచ్చుకోవడం విశేషం. హబ్‌స్పాట్‌ కంపెనీలో చేరి రెండేళ్లు పూర్తి కాకముందే సీఈవోగా బాధ్యతలు చేపట్టిన ఘనత ఆమెది. జనవరి 2020 నుంచి ఆగస్టు 2021 వరకు చీఫ్ కస్టమర్ ఆఫీసర్‌గా, సెప్టెంబర్ 2021 నుంచి ఇప్పటి వరకు సీఈవోగా సేవలందిస్తున్నారు. 25.66 బిలియన్ డాలర్ల మార్కెట్‌ క్యాప్‌తో కంపెనీ దిన దినాభివృద్ది చెందుతోంది. 2023లో యామినీ రంగన్ నికర విలువ దాదాపు 32 మిలియన్‌ డాలర్లు.
21 ఏళ్ల వయస్సులోనే..
21 ఏళ్ల వయస్సులో, చాలా పరిమితమైన నగదుతో యామిని ఇండియా వదిలి భయం భయంగా అమెరికాకు పయనమైంది. జీవితం అంత సులభం కాదని ఆమె వెంటనే గ్రహించింది. యూఎస్‌లో జీవించడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో యామిని అద్దె చెల్లించిన తర్వాత ఆమె జేబులో మిగిలింది. కేవలం 150 డాలర్లు మాత్రమే. దీంతో ఉద్యోగం సంపాదించడం ఒక్కటే మార్గమని నిర్ణయించుకుంది.

ఫుట్‌బాల్ స్టేడియం రెస్టారెంట్‌లో ఫుడ్‌, డ్రింక్స్ అందించా..

అలా అట్లాంటాలోని ఫుట్‌బాల్ స్టేడియం రెస్టారెంట్‌లో ఫుడ్‌, డ్రింక్స్‌ అందించడం తొలి ఉద్యోగమని యామిని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. తానెప్పుడూ స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటాననీ, అందుకే తల్లిదండ్రుల వద్దకు తిరిగి వెళ్లి డబ్బు అడగడానికి ఇష్టపడ లేదని చెప్పారు. యామిని యూఎస్‌లో మాస్టర్స్ చేయడానికి ముందు కోయంబత్తూరులో బీటెక్‌, తరువాత బెర్కిలీ నుంచి ఎంబీఏ పట్టా పుచ్చుకుంది.సుదీర్ఘ కెరీర్‌లో సాప్‌, లూసెంట్, వర్క్‌డే, డ్రాప్‌బాక్స్ లాంటి ఐటీ దిగ్గజ కంపెనీల్లో నిచేశారు. 2019లో శాన్ ఫ్రాన్సిస్కోలో వ్యాపారంలో అత్యంత ప్రభావవంతమైన మహిళగా ప్రశంసలందుకున్నారు. యామిని ఇప్పుడు ఇద్దరు అబ్బాయిలు.

Business Woman Success Story: అమ్మాయివై ఇలాంటి వ్యాపారం చేస్తావా అన్నారు.. కానీ నేడు వందల కోట్లు సంపాదిస్తున్నా.. ఎలా అంటే..

ముఖ్యంగా పీరియడ్స్, లోదుస్తుల గురించి మాట్లాడాలంటే స్త్రీలకు భయం. ఎవరిదైనా బ్రా, పెట్టీకోట్‌లు కొద్దిగా బయటకు కనిపిస్తుంటే.. చెప్పడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు.
కానీ రిచాకర్ అనే అమ్మాయి ఇలా మాట్లాడ్డానికి ఇబ్బంది పడే అంశాన్నే కెరీర్‌గా ఎంచుకుంది. అమ్మాయిల నుంచి మహిళలు ధరించే ‘బ్రా’ల బ్రాండ్‌ను ఎంతో ధైర్యంగా మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఎటువంటి బిడియం లేకుండా తీసుకొచ్చిన ఈ బ్రాండ్‌ నేడు కోట్ల టర్నోవర్‌తో దూసుకెల్తోంది.

రిచాకర్ జంషెడ్‌పూర్‌లోని ఓ మధ్య తరగతి కుటుంబంలో పుట్టింది. ఈమె తండ్రి టాటా స్టీల్‌ కంపెనీ ఉద్యోగి, తల్లి గృహిణి. రిచాది చిన్నప్పటి నుంచి విభిన్నంగా ఆలోచించే మనస్తత్వం. డిగ్రీ అయ్యాక ఐటీ కంపెనీలో కొన్నేళ్లపాటు ఉద్యోగం చేసింది. సొంతంగా వ్యాపారం చేయాలన్న కోరికతో శాప్‌ రిటైల్‌ కన్సల్టింగ్, స్పెన్సర్స్‌లో ఉద్యోగం చేశాక నర్సీ మోంజీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్‌ డిప్లొమా చేసింది.

ఓ పక్క ఉద్యోగ అనుభవం, మరోపక్క మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ ద్వారా నేర్చుకున్న జ్ఞానంతో సొంతంగా వ్యాపారం పెట్టడానికి పూనుకుంది. ఇందుకోసం మహిళల లోదుస్తుల వ్యాపారం ఎంచుకుంది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. ”సమాజంలో లోదుస్తుల గురించి మాట్లాడాలంటే భయడతారు. ఈ వ్యాపారం అవసరమా..? వద్దు..” అని నిరుత్సాహపరిచారు. తల్లిదండ్రులు అలా చెప్పినప్పటికీ రిచా ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. తన వ్యాపారం ప్రారంభ పనుల్లో మునిగిపోయింది.
బ్రా బ్రాండ్ తయారు..
మహిళలు ధరించే బ్రాలను సొంతంగా డిజైన్‌ చేసి, తయారు చేసి, విక్రయించడంపై దృష్టిపెట్టింది. కొన్ని రోజులకి తన పని మీద నమ్మకం ఏర్పడడంతో 2011లో ‘జివామే’ పేరుతో బ్రా బ్రాండ్‌ను ఏర్పాటు చేసింది. జివామే అంటే హిబ్రూలో ‘రేడియంట్‌ మి’ అని అర్థం. కాలేజీ అమ్మాయిల నుంచి పిల్ల తల్లుల వరకు అందరూ సౌకర్యంగా ధరించే బ్రాలను విక్రయించడం మొదలు పెట్టింది. కస్టమర్ల నుంచి మంచి స్పందన వస్తుండడంతో ఐదు వేల డిజైన్లు, యాభై బ్రాండ్‌లు వంద రకాల సైజుల్లో లోదుస్తులను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ స్టోర్‌ల ద్వారా అందిస్తోంది జివామే.

లాభాల్లో దూసుకుపోతున్న బ్రాండ్‌..
రిచాకర్ కోట్ల టర్నోవర్‌తో దూసుకుపోతోన్న సమయంలో కొన్ని కారణాలతో 2017 సీఈవో పదవి నుంచి తప్పుకుని, డైరెక్టర్‌గా కొనసాగుతోంది. ప్రస్తుతం రిచా నెట్‌ వర్త్‌ దాదాపు 750 కోట్లు ఉండొచ్చని అంచనా. మంచి లాభాల్లో దూసుకుపోతున్న జివామే బ్రాండ్‌ను 2020లో రిలయన్స్‌ రిటైల్‌ కొనుగోలు చేసింది. తన కలను నిజం చేసుకున్న 43 ఏళ్ల రిచాకర్‌ ప్రస్తుతం తన భర్త కేదార్‌ గవాన్‌తో కలిసి అమెరికాలో నివాసం ఉంటుంది.
అమ్మాయిలు దేనిలోనూ.. తక్కువ కాదు..
‘ఓ స్త్రీ మనసును మరో స్త్రీ మాత్రమే అర్థం చేసుకుంటుంది. అందుకే మూసపద్ధతులను దాటుకుని మహిళలు సౌకర్యంగా ధరించే లో దుస్తుల బ్రాండ్‌ను తీసుకొచ్చాను. జివామేను మార్కెట్లోకి తేవడానికి, దానికి బ్రాండ్‌ ఇమేజ్‌ తీసుకు రావడానికి చాలా సవాళ్లను, ఒత్తిళ్లనూ ఎదుర్కోవాల్సి వచ్చింది. వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొనబట్టే ఇవాళ ఈ స్థాయికి రాగలిగాను. ఇంటిలో, సమాజంలో మనల్ని వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తారు. అయినా మన మీద మనం ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. అప్పుడు అమ్మాయిలు దేనిలో తక్కువ కాదు. మనసులో ఏదైనా నిర్ణయించుకుంటే అది కచ్చితంగా సాధించ గలుగుతారు” అని చెబుతూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది రిచాకర్‌.
కొన్ని కోట్ల టర్నోవర్‌తో..
లోదుస్తులు ధరించిన మహిళలు సౌకర్యంగా, కాన్ఫిడెంట్‌గా ఉండడమే లక్ష్యంగా లోదుస్తులను అందుబాటులో ఉంచుతుండడంతో జివామే బ్రాండ్‌ మార్కెట్లోకి వచ్చిన ఏడాదిలోనే పెట్టుబడిదార్లను ఆకర్షించింది. దీంతో 2012లో మూడు మిలియన్ల డాలర్లు, మరుసటి ఏడాది ఇది రెట్టింపు అయ్యింది. 2015 నాటికి నలభై మిలియన్‌ డాలర్లు పెట్టుబడులు వచ్చాయి. దీంతో కంపెనీ ఆరు వందల కోట్లపైకి ఎగబాగి ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Inspirational Success Story : ఊహించని విజయం.. ఆఫీసు బాయ్ నుంచి రెండు కంపెనీలకు సీఈవో స్థాయికి వచ్చానిలా.. కానీ..

చిన్న ఉద్యోగంచేస్తూనే అతి పెద్ద లక్ష్యంపై గురిపెట్టి ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు. ఈ యువకుడే దాదాసాహెబ్ భగత్. ఇంతకి దాదాసాహెబ్ భగత్ ఏమి సాధించాడు..?
లక్ష్యసాధనకు ఎలా కష్టపడ్డాడు..? ఈ యువకుడి విజయ గాథ మీకోసం..

మహారాష్ట్రలోని బీడ్‌కు చెందిన దాదాసాహెబ్ భగత్ 1994లో జన్మించారు. భగత్ ఉన్నత పాఠశాల పూర్తి చేసిన తర్వాత వృత్తిని కొనసాగించేందుకు తన గ్రామం నుండి పూణేకు వచ్చారు. ITI డిప్లొమా ప్రోగ్రామ్‌ను పూర్తి చేసిన తర్వాత రూమ్ సర్వీస్ బాయ్‌గా నెలకు రూ.9000లకు ఉద్యోగంలో చేరారు. కానీ దాన్ని వదిలేసి ఇన్ఫోసిస్ గెస్ట్ హౌస్‌లో చేరారు. అదే ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది.
టీ , వాటర్ అందిస్తూ..

ఇన్ఫోసిస్ గెస్ట్ హౌస్‌లో అతిథులకు రూమ్ సర్వీస్, టీ ,వాటర్ అందించడం భగత్‌ డ్యూటీ. ఇక్కడే సాఫ్ట్‌వేర్ విలువను తెలుసుకుని పరిశ్రమపై ఆసక్తి పెంచుకున్నారు. కార్పొరేట్ ప్రపంచం పట్ల ఆకర్షితుడయ్యారు. యానిమేషన్ అండ్‌ డిజైన్‌ను చేయాలన్నపెద్దల సలహా మేరకు రాత్రి ఉద్యోగం, పగటిపూట యానిమేషన్‌లో చదువును కొనసాగించారు. కోర్సు పూర్తి చేసిన భగత్ ముంబైలో ఉద్యోగంలో చేరి, కొంతకాలం తర్వాత హైదరాబాద్‌కు మకాం మార్చారు.

దురదృష్టవశాత్తు..

హైదరాబాద్‌లోని డిజైన్ అండ్‌ గ్రాఫిక్స్ సంస్థలో ఉద్యోగం చేస్తూనే పైథాన్, C++ కోర్సులు చేశారు. విజువల్ ఎఫెక్ట్స్‌, టెంప్లేట్‌ల లైబ్రరీని సృష్టించడం దృష్టి పెట్టారు. ఈ డిజైన్ టెంప్లేట్‌లను ఆన్‌లైన్‌లో మార్కెట్ చేయడం ప్రారంభించాడు. అయితే దురదృష్టవశాత్తు, భగత్ కారు మంచానికే పరిమితం కావాల్సి వచ్చింది. అయినా కుంగి పోలేదు. ఉద్యోగం మానేసి ఫుల్‌టైమ్ స్టార్టప్‌ని ప్రారంభించారు. అలా 2015లో Ninthmotion ఆవిష్కృతమైంది. బీబీసీ స్టూడియోస్, 9XM మ్యూజిక్ ఛానెల్ వంటి ప్రసిద్ధ కంపెనీలతో సహాతన సేవల్ని అందిస్తూ, తక్కువ వ్యవధిలోనే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6వేల మంది క్లయింట్‌లను సాధించారు.
మలుపు తిప్పిన..కాన్వా వంటి ఆన్‌లైన్ గ్రాఫిక్ డిజైనింగ్ ప్లాట్‌ఫారమ్‌ను రూపొందించాలని భగత్ నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా రెండో బిజినెస్‌ డూగ్రాఫిక్స్ అవతరించింది. ఈ ప్లాట్‌ఫారమ్ సాధారణడ్రాగ్-అండ్-డ్రాప్ ఇంటర్‌ ఫేస్‌ను కలిగి ఉంది. దీనిద్వారా యూజర్లు టెంప్లేట్‌లు, డిజైన్‌లను రూపొందించడానికి వీలు కల్పిస్తుంది. అయితే COVID-19 సంక్షోభం, లాక్‌డౌన్ కారణంగా పూణేలో వ్యాపారాన్ని వదులుకుని, బీడ్‌లోని తన గ్రామానికి మకాం మార్చవలసి వచ్చింది.

సొంత గ్రామం నుంచే..

తన గ్రామంలో మంచి మౌలిక సదుపాయాలు లేనందున తాత్కాలిక ఏర్పాట్లు చేయడానికి, భగత్ మంచి 4G నెట్‌వర్క్ రిసెప్షన్‌తో పశువుల కొట్టంలో దుకాణాన్ని ఏర్పాటు చేశారు. భగత్ స్వయంగా యానిమేషన్ అండ్‌ డిజైన్‌లో శిక్షణ పొందిన కారణంగా కొంతమంది స్నేహితులకు శిక్షణ ఇచ్చి, వారితో కలిసి ఆ షెడ్‌లోనే పని ప్రారంభించారు. అలా గ్రామం నుంచి చాలా మందికి తక్షణమే వెంటనే డూగ్రాఫిక్స్ శిక్షణ ఇవ్వడం, కార్యకలాపాలు మొదలు కావడం జరిగిపోయింది.
కేవలం ఆరు నెలల్లో 10వేల క్రియాశీల వినియోగదారులను సాధించింది. వీరిలో మహారాష్ట్ర, ఢిల్లీ, బెంగుళూరుతోపాటు, జపాన్, ఆస్ట్రేలియా యూకే నుంచి కూడా ఉన్నారు. విశేష సేవలందిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అలాగే ప్రధాని మోదీ “ఆత్మనిర్భర్ భారత్” విజన్‌కు మద్దతుగా డూ గ్రాఫిక్స్, పూర్తిగా భారతీయ నిర్మిత సాఫ్ట్‌వేర్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద డిజైన్ పోర్టల్‌గా మార్చాలనేది భగత్ ఆశయం. ఇన్ఫోసిస్‌లో ఆఫీస్ బాయ్‌గా పనిచేసిన భగత్ ఇప్పుడు తన సొంత స్టార్టప్‌లకు సీఈఓగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలందుకున్నారు. షెడ్ నుంచి “మేడ్-ఇన్-ఇండియా” కాన్వా దాకా తన టాలెంట్‌తో రెండు కంపెనీలకూ సీఈఓగా ఉన్నాడు. మనలో టాలెంట్ ఉండాలే కానీ.. అనుకున్న లక్ష్యం సాధించడం ఈజీనే అంటున్నాడు భగత్. భగత్ సక్సెస్ జర్నీ నేటి యువతకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది

Inspirational Success Story : బతుకుదెరువు కోసం రిక్షా తొక్కిన.. చివరికి ప్యూన్ ఉద్యోగం కూడా రాలేదు.. ఈ ఐడియాతో కొట్ల రూపాయలు సంపాదించానిలా..

జీవితంలో ఎదగాలనే కసి నీకుంటే తప్పకుండా గొప్ప స్థాయికి చేరుకుంటావు. దీనికి నిలువెత్తు నిదర్శనమే ‘దిల్‌ఖుష్ సింగ్’ సక్సెస్ జర్నీ.

ఒకసారి ప్యూన్ ఉద్యోగం కోసం వెళ్తే..
సహర్సాలోని ఒక చిన్న గ్రామానికి చెందిన ‘దిల్‌ఖుష్ సింగ్’ ఇంటర్ మీడియట్ మాత్రమే చదివి ఈ రోజు ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నాడు. ఈ రోజు అతని సంవత్సరాదాయం సుమారు రూ.20 కోట్లు వరకు ఉంటుందని అంచనా. ఈ స్థాయికి రావడానికి దిల్‌ఖుష్ ఎంతో కష్టపడ్డాడు. రిక్షా లాగించేవాడు, బతుకుదెరువు కోసం పాట్నాలో కూరగాయలు కూడా అమ్మేవాడు. ఒకసారి ప్యూన్ ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళితే యాపిల్ లోగోను గుర్తించమని అడిగారని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.

ఈ ఐడియాతోనే..

దిల్‌ఖుష్ సింగ్ రాడ్‌బెజ్ అనే కంపెనీ ప్రారంభించి బీహార్‌లో క్యాబ్‌లను అందించడం మొదలెట్టాడు. అయితే ఇది ఓలా, ఉబర్ సంస్థలకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఓలా, ఉబర్ కంపెనీలు నగర ప్రయాణాలపై మాత్రమే దృష్టి పెడుతుంటే.. ఈ కంపెనీ నగరం నుంచి 50 కిమీ దూరం వెళ్లి కూడా సర్వీస్ చేస్తుంది. రాడ్‌బెజ్ కంపెనీ ట్రావెల్ కంపెనీలతో పాటు వ్యక్తిగత క్యాబ్ డ్రైవర్లతో టై-అప్లను కలిగి ఉంది. అయితే వారి ప్రయాణం ముగించుకుని తిరిగి వచ్చేటప్పటికి ప్రయాణీకులను ఎంపిక చేసుకోమని వారు క్యాబ్ డ్రైవర్లను అడుగుతారు. వారు తిరుగు ప్రయాణాలలో ప్రయాణికులు లేకుండా వస్తారు కాబట్టి, మార్కెట్ ధరల కంటే తక్కువ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. దీని ద్వారా ప్రతి వినియోగదారుడు ఒక్కో ట్రిప్పుకు కనీసం రూ.1500 ఆదా చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.
కేవలం ఆరు నెలల్లోనే..
ఆ తరువాత ఆర్య గో క్యాబ్స్‌గా తన బిజినెస్ ప్రారంభించాడు. టాటా నానో కారుతో కంపెనీని ప్రారభించి, కేవలం ఆరు నెలల్లో కోట్ల రూపాయల సంపాదించగలిగాడు. ఇప్పటికి అతని సంపాదన రూ. 20 కోట్లకి చేరింది. అతని లక్ష్యం రూ. 100 కోట్లకి చేరుకోవడమే అని గతంలో వెల్లడించారు. తన కంపెనీలో పనిచేసే డ్రైవర్లకు ఎటువంటి నష్టం జరగకుండా చూడటానికి నష్టపరిహారం వంటివి కూడా అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఒక డ్రైవర్ తన ప్లాట్‌ఫామ్ ద్వారా నెలకు రూ.55,000 నుంచి రూ. 60,000 వరకు సంపాదించవచ్చని చెబుతున్నారు. ఐఐటీ గౌహతి నుంచి, ఐఐఎంల నుంచి చాలా మంది తమ ప్లాట్‌ఫామ్‌లో పార్ట్‌టైమ్‌గా పనిచేస్తున్నారని దిల్‌ఖుష్ చెప్పుకొచ్చారు. ఉద్యోగం రాలేదు.. నా వల్ల కాదు.. అనే నిరుత్సాహంతో ఉండే వారికి.. దిల్‌ఖుష్ సింగ్ సక్సెస్ జర్నీ ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది.

Inspire Success Story : కఠిన పేదరికం నుంచి వచ్చి.. రూ.1000 కోట్లలకు పైగా సంపాదించానిలా.. కానీ..

ఇందులో కొంత మంది డబ్బున్న కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి సక్సెస్ కొట్టిన వారు ఉన్నారు. అయితే ఇప్పుడు కఠిన పేదరికం నుంచి వచ్చి రూ.1000 కోట్లు సామ్రాజ్యం సృష్టించాడు ‘విజయ్ సుబ్రమణియమ్’ .
ఈ నేపథ్యంలో విజయ్ సుబ్రమణియమ్ సక్సెస్ జర్నీ మీకోసం..

కుటుంబ నేపథ్యం.. ఎడ్యుకేషన్‌ :
ఈ రోజు ‘రాయల్ ఓక్’ ఫర్నిచర్ కంపెనీ గురించి ప్రత్యేకంగా పరిచయమే అవకాశం లేదు, కానీ దాన్ని స్థాపించిన విజయ్ గురించి మాత్రం తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే సుమారు ఇరవై సంవత్సరాలు కష్టపడి ఉన్నత శిఖరాలను అధిరోహించాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరులో ఒక ప్రభుత్వ కళాశాలలో బీకామ్‌ చేశారు. కుటుంబాన్ని పోషిచే ఒకే వ్యక్తి విజయ్ కావడంతో మాస్టర్ డిగ్రీ చేయలేకపోయాడు.
బంధులలోనే ఒకరు తనని మోసం చేశారు.. కానీ..

బీకామ్ పూర్తయిన తరువాత సింగపూర్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని వారి బంధులలోనే ఒకరు తనని మోసం చేసారని ఒక సందర్భంలో వెల్లడించారు. ఆ తరువాత కేరళలోని మున్నార్‌కు వెళ్లి అక్కడ క్రెడిట్ కార్డు ఏజెంట్‌గా పని చేయడం ప్రారంభించాడు. ఆ తరువాత 1997లో చెన్నై వెళ్లి ప్లాస్టిక్ వస్తువుల వ్యాపారం ప్రారంభించి ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా 10 రోజులలో రూ.2800 విలువైన వస్తువులను విక్రయించగలిగాడు.
నా జీవితంలో మలుపు ఇదే..

విజయ్ సుబ్రమణియమ్ 2001లో బెంగళూరులోని సఫీనా ప్లాజాలో స్టాల్‌ ప్రారంభించడం ఆయన జీవితానికి పెద్ద మలుపుగా మారింది. ఆ తరువాత బిగ్ బజార్ తమ అవుట్‌లెట్‌లో స్టోర్‌ను ఏర్పాటు చేయమని కోరింది. ఆ తరువాత కారు కొనుగోలు చేసి ఇల్లు కట్టుకుని పెళ్లి కూడా చేసుకున్నాడు. విజయ్ సుబ్రమణియమ్ 2004లో మొదటి షాప్ ఓపెన్ చేసాడు. 2005 నాటికి చైనీస్ ఫర్నిచర్ దిగుమతి చేసుకోవడం ప్రారంభించాడు. 2010 నాటికి మరొక షాప్ ఏర్పాటు చేసాడు. ఇదే రాయల్ ఓక్ ప్రారంభానికి నాంది పలికింది.

నా లక్ష్యం ఇదే..
ప్రస్తుతం ఈ సంస్థ కింద 150 స్టోర్లు ఉన్నాయి. అంతే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 280 కర్మాగారాల నుంచి తాను ఉత్పత్తులను పొందుతున్నట్లు తెలిపాడు. కాగా 2024 ఆర్థిక సంవత్సరంలో మరో 100 స్టోర్లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఎదగాలనే సంకల్పం ఉన్న వాడికి విజయం దాసోహమవుతుందని చెప్పడానికి ఇదో చక్కని నిదర్శనం.

Diabetic Health: మీకు డయాబెటిస్‌ ఉందా? స్వీట్‌నెస్‌ కోసం షుగర్స్‌కు బదులు ఇవి తీసుకోండి!

Diabetic Health: ఈ మధ్య కాలం చాలా మందిలో ఎక్కువగా కనిపిస్తున్న సమస్య మధుమేహం. ఈ సమస్య ఉన్నవారు వారు తినే ఆహారపు అలవాట్ల పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం తప్పనిసరి.
హై షుగర్, ఫ్రైడ్ ఫుడ్స్, హై సాచురేటెడ్, ట్రాన్స్ ఫ్యాట్స్ కలిగిన ఫుడ్స్ కు వీలైనంత దూరంగా ఉంటేనే ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే మధుమేహం ఉన్నవారు స్వీట్స్, లేదా ఏదైనా షుగర్ ఐటమ్స్ తీసుకోవడానికి చాలా భయపడతారు. ఎందుకంటే ఇవి రక్తంలోని చక్కర స్థాయిలను మరింత పెంచే ప్రమాదం ఉంటుంది.

అందుకని ఈ సమస్య ఉన్నవారు షుగర్ ఐటమ్స్ తినేటప్పుడు వాటిలో షుగర్ బదులు ఈ నేచురల్ స్వీట్నర్స్ వాడితే బ్లడ్ షుగర్ లెవెల్స్ పై మంచి ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

మాంక్ ఫ్రూట్ షుగర్

మాంక్ ఫ్రూట్ షుగర్ FDA( ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) సంస్థ నుంచి సురక్షితమైనదిగా గుర్తింపు పొందింది. మధుమేహం ఉన్నవారు వారి డైట్ లో దీనిని తీసుకుంటే రక్తంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ ను స్థిరంగా ఉంచుతుంది. డయాబెటీస్ రోగులకు ఇది సరైన ఎంపిక.

అడ్వాంటేమ్

అడ్వాంటేమ్.. ఇది మధుమేహ రోగులకు సరైన ఎంపిక. ఇది సాధారణ చక్కర కంటే 20,000 టైమ్స్ ఎక్కువ స్వీట్ గా ఉంటుందని FDA సంస్థ తెలిపింది. అందుకే దీన్ని కొంచం వాడిన సరిపోతుంది.

Also Read: Bay leaves Tips: ఈ ఆకుతో.. డాన్డ్రప్ సమస్య దెబ్బకు మాయం

స్టీవియా

ఇది నేచురల్ స్వీట్నర్. స్టీవియా లో తక్కువ కేలరీలతో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బయోటిక్ గుణాలను కలిగి ఉంటుంది. డైయాబెటీస్ రోగుల పై ఇది మంచి ప్రభావం చూపుతుంది. స్టీవియా ప్లాస్మా గ్లూకోజ్ స్థాయిలను తగ్గించి.. గ్లూకోస్ టాలరెన్స్ పెంచుతుంది.

ఎరిథ్రిటాల్

ఇది సహజంగా లభించే షుగర్. దీన్ని ఎక్కువగా ఫుడ్ ఇండస్ట్రీస్ లో క్యాండీస్, బేకరీ ఐటమ్స్ ఉత్పత్తుల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ చక్కెరలో తక్కువ కేలరీస్ ఉంటాయి. మధుమేహం ఉన్నవారు ఆర్టిఫీషియల్ షుగర్స్ బదులు వీటిని తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.

జిలిటోల్ షుగర్

మధుమేహం సమస్య ఉన్నవారు వారి డైట్ లో జిలిటోల్ షుగర్ తీసుకుంటే మంచి ప్రభావం ఉంటుంది. దీనిలోని తక్కువ గ్లైసెమిక్ వాల్యూ.. రక్తంలోని గ్లూకోజ్, ఇన్సులిన్ స్థాయిలను పెరగడాన్ని తగ్గిస్తుంది. అంతే ఇది బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది.

Viral Video: మెషిన్ కంటే వేగంగా డబ్బులు లెక్కిస్తున్న యువతి.. నమ్మక పొతే ఈ వీడియోపై ఓ లుక్ వేయండి..

ఒకప్పుడు బ్యాంకులో పనులన్నీ దాదాపు చేతులతో జరిగేవి. కొన్ని ఏళ్ల క్రితం వరకూ యంత్రాల వినియోగం తక్కువ. డబ్బు లెక్కపెట్టినా, ఖాతాదారుల రికార్డులు భద్రపరచుకోవాలన్నా, బ్యాంకు ఉద్యోగులు మాన్యువల్‌గానే పని చేసేవారు.

అయితే ఇప్పుడు బ్యాంక్ లో పని చేసేందుకు ఇప్పుడు మెషీన్లు వచ్చాయి. దీనివల్ల ఉద్యోగుల పని చాలా తేలికైంది. ఎక్కువ డబ్బులు లెక్కించాల్సి వచ్చినప్పుడు బ్యాంకు ఉద్యోగులు మెషీన్లు వాడడం సర్వసాధారణం. అయితే ప్రస్తుతం ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ప్రజల మెదడుకు పని చెప్పి ఆలోచించమని చెబుతోంది. ఎందుకంటే ఈ వీడియోలో ఒక మహిళ మనీ మెషిన్ కంటే స్పీడ్ గా డబ్బులను లెక్కిస్తోంది. ఈ వీడియో చైనాకు చెందినదిగా చెబుతున్నారు.

సాధారణంగా ఎక్కువ మొత్తంలో నోట్ల కట్టలను లెక్కించాల్సి వచ్చినప్పుడు వాటిని మెషీన్‌లో పెడతారు. అప్పుడు ఆ యంత్రం కొన్ని సెకన్ల వ్యవధిలో మొత్తం డబ్బును లెక్కించి ఎంత ఉందో చెబుతుంది. ఈ వీడియోలో కనిపిస్తున్న యువతి కూడా అలాంటిదే చేయడం కనిపిస్తుంది. అయితే ఈ యువతి డబ్బులను చేతితోనే యంత్రం వేగంతో సమానంగా లెక్కిస్తోంది. కొన్ని సెకన్ల వ్యవధిలోనే డబ్బుల కట్టలను లెక్కిస్తోంది. ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా షాక్ తింటారు.. లేదా ఈ యువతి మనిషా.. లేక యంత్రమా అని కూడా ఆలోచిస్తారు. ఎందుకంటే సాధారణంగా ఏ మనిషి నోట్ల కట్టలను అంత వేగంగా లెక్కించలేరు. అయితే కొంతమందికి కొన్ని రకాల ప్రతిభ ఉంటుంది.. వారికీ

సులభమైన పని ఇతరులకు చాలా కష్టం.

హ్యూమన్ మనీ కౌంటింగ్ వీడియో చూడండి..

మనసును హత్తుకున్న ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో @crazyclipsonly IDతో భాగస్వామ్యం చేయబడింది. ‘హ్యూమన్ మనీ కౌంటర్’ అనే క్యాప్షన్ ఇచ్చారు దీనికి. కేవలం 15 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 2.3 మిలియన్లు అంటే 23 లక్షల వ్యూస్ ను వేలాది లైక్స్ ను సొంతం చేసుకుంది.అదే సమయంలో, వీడియో చూసిన తర్వాత, ప్రజలు వివిధ రకాల రియాక్షన్లు ఇచ్చారు. కొంతమంది వినియోగదారులు ఈ యువతి నిజంగా ఎంత వేగంగా డబ్బును లెక్కిస్తోందో.. నేను అస్సలు నమ్మలేకపోతున్నాను అని అంటే మరొకరు.. ఈ యువతి మనీ కౌంటింగ్ మెషీన్‌ను అస్సలు నమ్మదలా ఉంది అని వ్యాఖ్యానిస్తుంటే.. చెప్పాలంటే ఆమెకు డబ్బుల లెక్కింపులో ఎన్ని సంవత్సరాల అనుభవం ఉందని మరొకొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

Health

సినిమా