2 రోజుల్లోనే టార్గెట్ ఫినీష్.. అప్పుడే అన్ని కోట్లా.. గుంటూరు కారం కంటే!

సాధారణంగా ఏదైనా సినిమా దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అవ్వాలంటే పెద్ద పెద్ద స్టార్లు ఉండాల్సిన అవసరం లేదు. కంటెంట్ కరెక్టుగా ఉంటే ఎంతటి చిన్న చిత్రమైనా భారీ స్థాయిలో ప్రభావాన్ని చూపిస్తుంది.
దీనికి చక్కని ఉదాహరణే ‘హనుమాన్’. పేరుకు తెలుగు సినిమానే అయినా దేశ వ్యాప్తంగా ఇది ఎఫెక్టును చూపిస్తోంది. ఫలితంగా భారీ రెస్పాన్స్‌తో అత్యధిక వసూళ్లను సాధిస్తూ సత్తా చాటుతోంది. ముఖ్యంగా ఓవర్సీస్‌లోనూ ఈ సినిమా హవాను చూపిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ అసలైన మైలురాయిని చేరుకుంది. ఆ వివరాలను మీరే చూసేయండి మరి!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

హనుమాన్ ఆగమనంతో : తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన రియల్ సూపర్ హీరో మూవీనే ‘హనుమాన్’. ఈ మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా చేయగా.. వరలక్ష్మి శరత్‌కుమార్ సహా పలువురు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి అనుదీప్ దేవ్, హరి గౌర, కృష్ణ సౌరభ్‌లు సంగీతాన్ని సమకూర్చారు.
ఇక్కడి కంటే ఎక్కువగా : తేజ సజ్జా – ప్రశాంత్ వర్మ కలయికలో రూపొందిన ‘హనుమాన్’ సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2000లకు థియేటర్లకు పైగానే తీసుకు వచ్చారు. దీనికి పోటీ వల్ల తెలుగు రాష్ట్రాల్లో పెద్ద స్క్రీన్లు లభించకున్నా.. హిందీతో పాటు ఓవర్సీస్‌లో ఇది అదిరిపోయే రీతిలో గ్రాండ్‌గా రిలీజ్ అయింది.

గుంటూరు కారం కంటే : రియల్ సూపర్ హీరో హనుమంతుడి కథతో రూపొందిన ‘హనుమాన్’ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్‌లో ఈ చిత్రం మొదటి రోజు నుంచే భారీగా పుంజుకుంది. అదే సమయంలో ‘గుంటూరు కారం’ కంటే ఎక్కువ కలెక్షన్లను వసూలు చేస్తోంది.
అప్పుడే అన్ని డాలర్లు : క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన ‘హనుమాన్’ మూవీకి ఓవర్సీస్‌లో సైతం భారీ స్పందన దక్కింది. ఈ సినిమాకు ప్రీమియర్స్ ద్వారానే 386K డాలర్స్ గ్రాస్ వచ్చింది. ఆ తర్వాత మొదటి రోజు ఇది 520K డాలర్లు వరకూ రాబట్టింది. తద్వారా ప్రీమియర్స్ ప్లస్ మొదటి రోజు కలెక్షన్లు కలిపి అక్కడ 900K డాలర్లు వరకూ రాబట్టింది. అంటే రూ. 7.45 కోట్లు వసూలు చేసింది.

రెండో రోజు ఊచకోత : ‘హనుమాన్’ మూవీ ప్రీమియర్స్‌ను పక్కన పెడితే మొదటి రోజు 520K డాలర్ల కంటే ఎక్కువ రాబట్టింది. ఇక, రెండో రోజు ఈ సినిమా ఏకంగా 620K డాలర్ల వరకూ రాబట్టింది. ఇలా ప్రీమియర్స్‌తో కలిపి 1.5 మిలియన్ డాలర్లను ఈ సినిమా వసూలు చేసింది. అంటే భారత కరెన్సీలో ఈ చిత్రం రెండు రోజుల్లోనే ఓవర్సీస్‌లో రూ. 12.43 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.
టార్గెట్ ఫినీష్ చేసేసి : ‘హనుమాన్’ మూవీ పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైంది. ఇది ఓవర్సీస్‌లో 1 మిలియన్ డాలర్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలాంటిది రెండు రోజుల్లోనే ఈ మార్కును చేరుకోవడంతో పాటు లాభాల బాటలో నడుస్తోంది. ఇలా ఈ చిత్రం అప్పుడే అక్కడ కొన్ని కోట్ల లాభాలను అందుకుంది. దీంతో ఎన్నో రికార్డులను సైతం నమోదు చేసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *