Thursday, November 14, 2024

The world’s largest airport ప్రపంచంలోనే అతి పెద్ద విమానాశ్రయం

ఇది ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం. సౌదీ అరేబియాలోని దమ్మమ్‌ నగరానికి 31 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ విమానాశ్రయం విస్తీర్ణం 483 చదరపు కిలోమీటర్లు.
అంటే ప్యారిస్‌ నగరం విస్తీర్ణానికి ఎనిమిది రెట్లు ఉంటుంది. ఇక్కడి నుంచి 37 విమానయాన సంస్థలు తమ విమానాలను నడుపుతున్నాయి. ఇవి తమ ప్రయాణికులను ఇక్కడి నుంచి 43 గమ్యాలకు చేరవేస్తున్నాయి.

విస్తీర్ణంలో ఈ విమానాశ్రయం అతిపెద్దదే అయినా, ఇక్కడి నుంచి ఏటా రాకపోకలు జరిపే ప్రయాణికులు మాత్రం దాదాపు కోటి మంది మాత్రమే! దీనికంటే చిన్నదైన లండన్‌ హిత్రూ విమానాశ్రయం నుంచి ఏటా దాదాపు ఎనిమిది కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు జరుపుతుంటారు. సౌదీ అరేబియా ఇదివరకటి రాజు ఫాహద్‌ తన పేరుతో నిర్మించిన ఈ విమానాశ్రయం 1999 నవంబర్‌ 28 నుంచి ప్రయాణికులకు సేవలందిస్తోంది.


గల్ఫ్‌యుద్ధం జరిగినప్పుడు ఇది అమెరికన్‌ వైమానిక దళాలకు విమాన స్థావరంగా కూడా ఉపయోగపడింది. కళ్లు చెదిరే ఈ విమానాశ్రయంలో ప్రయాణికుల కోసం విలాసవంతమైన వసతులు ఉన్నాయి. ఇందులోని పార్కింగ్‌ స్పేస్‌లో ఏకకాలంలో ఐదువేల కార్లు నిలిపి ఉంచడానికి తగిన సౌకర్యం ఉంది. విస్తీర్ణంలో అతిపెద్దదే అయినా, ప్రయాణికుల రద్దీలో మాత్రం ఈ విమానాశ్రయం వెనుకబడే ఉండటం గమనార్హం.

AP Politics: జనసేన – టీడీపీ మేనిఫెస్టో రెడీ.. ప్లాన్ ఇదే!

ఈ సారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా.. నిధుల కొరత పెద్ద సవాల్ కానుంది. తెలంగాణలో కాంగ్రెస్ భారీ హామీలు ఇచ్చి, తీరా అధికారంలోకి వచ్చాక, వాటి అమలు చెయ్యడానికి మనీ లేకపోవడంతో చాలా ఇబ్బంది పడుతోంది.
మాగ్జిమం ట్రై చేస్తోంది. తెలంగాణ కంటే ఏపీ గొప్పగా ఏమీ లేదు కదా. అక్కడా నిధుల కొరత ఇప్పటికే ఉంది. ఎన్నికలకు అటు వైసీపీ, ఇటు టీడీపీ+జనసేన కూటమి భారీ హామీలు ఇచ్చేందుకు రెడీ అవుతున్నాయి. అందువల్ల ఎన్నికల తర్వాత ఎవరు అధికారంలోకి వచ్చినా, ఖజనాలో నిధుల కొరత సమస్య బాగా ఉంటుంది. కొత్తగా ఆదాయం వచ్చే ప్రయత్నాలు చేస్తే తప్ప ప్రభుత్వం సాగని పరిస్థితి ఉంటుంది.

భోగి పండుగకు ముందురోజు.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దాదాపు 3న్నర గంటలపాటూ భేటీ అయ్యి.. చాలా విషయాలపై చర్చించుకున్నారు. ఇందుకోసం చంద్రబాబు ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్లారు. ప్రధానంగా టీడీపీ ఆల్రెడీ 6 గ్యారెంటీ హామీలు, జనసేన షణుఖ వ్యూహంలోని 6 అంశాలపై చర్చించారని తెలిసింది. ఇలా మొత్తం 12 అంశాలతో ఉమ్మడి మేనిఫెస్టో రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ నెలాఖరు నాటికి ఈ మేనిఫెస్టోని ప్రకటించేసి, ఆ తర్వాత సీట్ల సర్దుబాటుపై ఫోకస్ పెట్టబోతున్నట్లు తెలిసింది. ఇందుకోసం జనవరి 18 లేదా 21న తిరుపతి లేదా ఇంకెక్కడైనా భారీ బహిరంగ సభను ఏర్పాటుచేసి, మేనిఫెస్టోని ప్రకటిస్తారని టాక్ వినిపిస్తోంది.
ఉమ్మడిగా ముందుకు:

ఇప్పటివరకూ జనసేన, టీడీపీ విడివిడిగా సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నాయి. త్వరలో ఉమ్మడిగా ముందుకు సాగుతాయని తెలుస్తోంది. అలాగైతే, రెండు పార్టీల అభిమానులూ, కార్యకర్తలూ పెద్ద సంఖ్యలో వస్తారని అంచనాలున్నాయి. దీనిపై రూట్ మ్యాప్ రెడీ చేస్తున్నారని తెలుస్తోంది.

అవతల వైసీపీ.. అసెంబ్లీ, పార్లమెంట్ సెగ్మెంట్లకు ఇంఛార్జులను నియమించేస్తోంది. తద్వారా ఎన్నికలకు రెడీ అవుతోంది. త్వరలోనే జగన్ రాష్ట్రవ్యాప్త టూర్ కూడా ఉంటుందని తెలిసింది. అందువల్ల టీడీపీ+జనసేన కూడా స్పీడ్ పెంచుతున్నాయి. ఓ అంచనా ప్రకారం.. గోదావరి జిల్లాల్లో ప్రధానంగా జనసేన పోటీ చేస్తుందనీ, మిగతా జిల్లాల్లో టీడీపీ పోటీ చేస్తుందని తెలుస్తోంది. కాపు వర్గం ఓట్లే టార్గెట్‌గా జనసేన ప్లాన్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే.. కాపు వర్గం నేత ముద్రగడ పద్మనాభంను జనసేన ఆహ్వానించినట్లు తెలుస్తోంది.మొత్తంగా రాజకీయాలు ఆసక్తిగానే ఉన్నాయి. ఈ మూడు నెలల్లో ఇంకా ఎన్నెన్ని మార్పులు జరుగుతాయో చూస్తూ, చర్చించుకుందాం.

Sunday Motivation: విజయానికి దగ్గర దారి ఒక్కటే… కష్టపడి పనిచేయడం

Sunday Motivation: ఒక మారుమూల గ్రామంలో ఒక రైతు నివసించేవాడు. అతనికి బంగారం పండే చక్కటి పొలాలు ఉన్నాయి. ఆయన కష్టపడి పనిచేసి చాలా సంపాదించాడు. అతనికి ముగ్గురు కొడుకులు ఉన్నారు.
శక్తివంతులై ఉండి కూడా వారు ఏ పనీ చేసేవారు కాదు. రైతుకు వయసు పెరుగుతున్న కొద్దీ పిల్లల భవిష్యత్తుపై బెంగ పట్టుకుంది. వారు పని చేయడానికి ఇష్టపడకపోవడం వల్ల వారి భవిష్యత్తు ఏమైపోతుందోనని చాలా ఆందోళన చెందాడు.

వయసు మీద పడడంతో ఒకరోజు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. మరణం సమీపిస్తుందని ఆయనకి అర్థం అయింది. వెంటనే తన ముగ్గురు కొడుకుల్ని పిలిచాడు. ‘నాకు మరణం సమీపిస్తున్నట్టు అర్థం అవుతోంది. అందుకే మీతో ఒక రహస్యాన్ని చెప్పాలని పిలిచాను. మన పొలాల కింద ఎక్కడ ఒక మూల నిధి దాచి పెట్టాను. ఎక్కడ దాచి పెట్టానో మర్చిపోయాను. మీరు ఆ పొలం మొత్తం తవ్వి వెతుక్కోండి. మీకు ఆ నిధి దొరికితే అదృష్టవంతులే’ అని చెప్పాడు.
అంతవరకు పొలం జోలికి వెళ్ళని కొడుకులు పొలాన్ని తవ్వడం ప్రారంభించారు. పది ఎకరాల పొలాన్ని తవ్వారు. కానీ వారికి నిధి దొరకలేదు. నాన్న అబద్ధం చెప్పారంటూ తిట్టుకున్నారు. ఎలాగూ తవ్వారు కాబట్టి, కొన్ని విత్తనాలు జల్లితే మంచిదని చెప్పింది వారి తల్లి. దాంతో వారు తవ్విన పొలంలోనే విత్తనాలను చల్లారు. కొన్ని రోజులకే వర్షాలు పడి ఆ విత్తనాలు మొలకెత్తి పంట విరగ కాసింది. దాన్ని అమ్మితే లక్షల కొద్ది డబ్బు వచ్చింది. కొడుకులు చాలా సంతోషించారు. వారి తల్లి ఆ ముగ్గురుని పిలిచి మీ నాన్న చెప్పిన నిధి మీకిప్పుడు దొరికింది… అని చెప్పింది. కొడుకులు తండ్రి మాటల వెనుక ఉన్న భావాన్ని అప్పుడు అర్థం చేసుకున్నారు. ఏదైనా సరే… కష్టపడితేనే దక్కుతుందని వారికి అర్థమైంది.
ఈ కథలో నీతి ఒక్కటే… కష్టానికి ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుంది. శ్రమ వల్ల దక్కిన ఫలితం ఎప్పుడూ తీపిగానే ఉంటుంది. విజయం దక్కాలంటే కష్టపడి పని చేయాలి. కష్టపడకుండా విజయం కావాలంటే దొరకదు.

Salaar: బ్లాక్ బస్టర్ ‘సలార్’.. గ్రాండ్‏గా పార్టీ ఇచ్చిన హోంబలే ఫిల్మ్స్.. అందరి చూపు ఆ ముగ్గురిపైనే..

డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం సలార్. డిసెంబర్ 22న విడుదలైన ఈ మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో చెప్పక్కర్లేదు.
బాహుబలి తర్వాత డార్లింగ్ కెరీర్‏లోనే బ్లాక్ బస్టర్ హిట్‏గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ.700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ సలార్ సక్సెస్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా నిర్వహించింది. శుక్రవారం సాయంత్రం బెంగుళూరులోని ఓ ప్రముఖ రెస్టారెంట్‏లో ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈవేడుకలకు డైరెక్టర్ నీల్, ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతిహాసన్, జగపతి బాబు, ఈశ్వరీ.. టెక్నికల్ టీం, మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్, డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడాని తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకలలో నీల్, పృథ్వీ, ప్రభాస్ నవ్వుతూ ఎంతో సరదాగా కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియోస్, ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

అలాగే ఇదే వేడుకలలో ‘హలో మేడమ్.. మమ్మీ.. బ్యూటీఫుల్ మమ్మీ’ అంటూ ఈశ్వరీరావును ప్రభాస్ ఆత్మీయంగా పలకరిస్తున్న వీడియో సైతం నెట్టింట వైరలవుతుంది. సలార్ హిట్ అయిన సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంది చిత్రయూనిట్. బాహులి తర్వాత ప్రభాస్ నటించిన రాధేశ్యామ్, ఆదిపురుష్, సాహో చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అభిమానులను నిరాశపరిచాయి. దీంతో ఈ పైనే అడియన్స్ ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే పోస్టర్స్, టీజర్, ట్రైలర్ తో ఎప్పటికప్పుడు అంచనాలు పెంచేశారు నీల్. విడుదలైన మొదటి రోజే ఈ కు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వచ్చేసింది. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‏కు ప్రభాస్ పక్కా మాస్ యాక్షన్ హిట్ అందించాడు నీల్. ఇక ఈ కు మ్యూజిక్ మరో హైలెట్ అనే చెప్పాలి. రవి బస్రూర్ అందించిన సంగీతం శ్రోతలను ఆకట్టుకుంది.

సలార్ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే సలార్ ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్ కాగా.. త్వరలోనే ఈ మూవీ సెకండ్ పార్ట్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. రెండవ భాగానికి శౌర్యంగ పర్వం అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా సలార్ క్లైమాక్స్ లోనే రివీల్ చేశాడు డైరెక్టర్. ఇక ఈ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ చిత్రానికి స్క్రిప్ట్ వర్క్ సిద్ధమైందని.. త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్లు గతంలో డార్లింగ్ వెల్లడించారు.

Antim Naqvi | జింబాబ్వే తరఫున తొలి ట్రిపుల్ సెంచరీ.. చరిత్రను తిరగరాసిన యువకెరటం

Antim Naqvi : జింబాబ్వే యవ క్రికెటర్ అంతిమ్ నక్వీ(Antim Naqvi) చరిత్ర సృష్టించాడు. ఆండీ ఫ్లవర్(Andy Flower), గ్రాంట్ ఫ్లవర్(Garnt Flower) వంటి దిగ్గజాలకు సైతం సాధ్యం కాని రికార్డు నెలకొల్పాడు.
జింబాబ్వే తరఫున తొలి ట్రిపుల్ సెంచరీ నమోదు చేశాడు. మిడ్ వెస్ట్ రైనోస్(Mid West Rhinos) కెప్టెన్ అయిన అంతిమ్ రెండో సీజన్‌లోనే తడాఖా చూపించాడు. జింబాబ్వే తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ కొట్టాడు.

లోగన్ కప్(Logan Cup) మ్యాచ్‌లో భాగంగా మెటాబెలెలలాండ్ టస్కర్స్(Matabeleland Tuskers) జట్టుతో జరిగిన మ్యాచ్‌లో అంతిమ్ దంచికొట్టాడు. క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచి ఊచకోతకు దిగిన 24 ఏండ్ల అంతిమ్.. 295 బంతుల్లోనే 30 ఫోర్లు, 10 సిక్సర్లతో ట్రిపుల్ సెంచరీకి చేరువై రికార్డులు బద్ధలు కొట్టాడు. అయితే.. గతంలో గ్రేమ్ హిక్‌(Greame Hick), ముర్రే గుడ్‌విన్‌(Murray Goodwin)లు కూడా ఫస్ట్ క్లాస్‌లో మూడొందలు కొట్టారు. కానీ, వాళ్లు జింబాబ్వేకు కాకుండా ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించారు.

అంతిమ్ 265 పరుగుల స్కోర్ వద్ద లోగన్ కప్ ఫస్ట్ క్లాస్ రికార్డును బ్రేక్ చేశాడు. ఇక 280 రన్స్ దాటిన అంతిమ్ 1967-68 మధ్య రే గ్రిప్పర్ 279 రన్స్‌తో నెలకొల్పిన రికార్డును అధిగమించాడు. జింబాబ్వే గడ్డపై ఇప్పటివరకూ అత్యధిక వ్యక్తిగత స్కోర్ 306. అది కూడా న్యూజిలాండ్ ఆటగాడు మార్క్ రిచర్డ్‌సన్(Mark Richardson) పేరిట ఉంది. రిచర్డ్‌సన్ 2000-01లో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఈ రికార్డు సాధించాడు. అయితే.. రైనోస్ జట్టు ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడంతో అంతిమ్ ఈ రికార్డును బద్ధలు కొట్టలేకపోయాడు.

మాది చిన్న దేశమే.. బెదిరించడం తగదు: మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు

We are a small country.. It is not appropriate to threaten: President of Maldives Muijju
బీజింగ్‌/ మాలె: ”భౌగోళికంగా మాది చిన్న దేశమే కావచ్చు. అంతమాత్రాన మమ్మల్ని బెదిరించడం మాత్రం తగదు. దానికి ఎవరికీ లైసెన్సు ఇవ్వలేదు” అని మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు పేర్కొన్నారు.

చైనాలో అయిదు రోజుల పర్యటనను ముగించుకుని శనివారం ఆయన స్వదేశానికి చేరుకున్నారు. భారత ప్రధాని నరేంద్రమోదీపై మాల్దీవుల మంత్రుల వ్యాఖ్యలతో దౌత్య వివాదాలు నెలకొన్న నేపథ్యంలో ముయిజ్జు విలేకరులతో మాట్లాడారు. నేరుగా ఏ దేశం పేరూ ప్రస్తావించకుండానే కొన్ని వ్యాఖ్యలు చేశారు. ‘..ఈ మహా సముద్రంలో మావి చిన్న ద్వీపాలే.

కానీ మాకు సముద్రంలో 9 లక్షల చదరపు కి.మీ. ప్రత్యేక ఆర్థిక మండలి (ఈఈజడ్‌) ఉంది. ఇంతపెద్ద వాటా ఉన్న దేశాల్లో మాది ఒకటి. ఈ మహా సముద్రం ఏ ఒక్క దేశానికో చెందదు.

ఇది దీనిచుట్టూ ఉన్న దేశాలన్నింటిది. మేం ఎవరి పెరడులోనో లేం. ఓ స్వతంత్ర, సార్వభౌమ దేశం మాది’ అని చెప్పారు. మరోవైపు మాల్దీవుల అంతర్గత వ్యవహారాల్లో ఏ దేశం జోక్యం చేసుకున్నా గట్టిగా వ్యతిరేకిస్తామని చైనా ప్రకటించింది.

PM Kisan: మహిళలకు ‘పీఎం కిసాన్‌’ సాయం డబుల్‌!

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రైతులకు పీఎం కిసాన్‌ సాయాన్ని పెంచేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు కసరత్తు చేస్తోంది. 2019 ఎన్నికలకు ముందు తీసుకొచ్చిన ఈ పథకం ద్వారా ప్రస్తుతం దేశవ్యాప్తంగా 11 కోట్ల మంది రైతులకు ఏడాదికి రూ.6 వేలు అందుతోంది.

– ప్రస్తుతం లబ్ధిదారులకు ఇస్తున్నది రూ.6 వేలు
– దీన్ని 10 వేలు లేదా 12 వేలకు పెంచే యోచన
– మిగతా రైతులకు రూ.8 వేలు.. కేంద్రం కసరత్తు

న్యూఢిల్లీ, జనవరి 13: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రైతులకు పీఎం కిసాన్‌ సాయాన్ని పెంచేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు కసరత్తు చేస్తోంది. 2019 ఎన్నికలకు ముందు తీసుకొచ్చిన ఈ పథకం ద్వారా ప్రస్తుతం దేశవ్యాప్తంగా 11 కోట్ల మంది రైతులకు ఏడాదికి రూ.6 వేలు అందుతోంది. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. అయితే మహిళా రైతులకు ఈ మొత్తాన్ని రెట్టింపు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. వారికి రూ.10 వేలు లేదా 12 వేలు.. మిగతా రైతులకు రూ.8 వేలు లేదా రూ.9 వేలకు పెంచాలని యోచిస్తున్నారు. ఈ మేరకు ఫిబ్రవరి 1న సమర్పించే మధ్యంతర బడ్జెట్‌లో ప్రతిపాదనలు చేయనున్నట్లు సమాచారం.

Inspirational Success Story : మాది మారుమూల గ్రామం..డబ్బు కోసం రెస్టారెంట్‌లో పనిచేశా.. నేడు లక్షల కోట్ల కంపెనీకి సీఈవోగా పనిచేస్తున్నా.. నా సక్సెస్ సీక్రెట్ ఇదే..

విజయానికి కేరాఫ్ అడ్రస్‌ భారత సంతతికి చెందిన యామిని రంగన్. రెస్టారెంట్‌లో సర్వర్‌గా కరియర్‌ను ప్రారంభించిన యామిని ఈరోజు రూ.2.11లక్షల కోట్లకు పైగా విలువైన కంపెనీగా సీఈవోగా సేవలందిస్తున్నారు.
ఈఏడాది టాప్‌ 100 టెక్‌ మహిళల్లో చోటు సంపాదించుకున్నారు. యామిని రంగన్ యుఎస్‌లోని అతి పిన్నవయస్కురాలైన అత్యుత్తమ వ్యాపార కార్య నిర్వాహకులలో ఒకరు. ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చాలనే లక్ష్యంతో తక్కువ కాలంలోనే ఆమె ఎన్నో పేరు ప్రఖ్యాతులు, సంపదను కూడబెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో యామిని సక్సెస్ జర్నీ..

కుగ్రామం నుంచి వచ్చి.. పిన్న వయసులోనే..

టెక్ ప్రపంచంలో అత్యంత గౌరవనీయమైన సీఈవీల్లో ఒకరుగా ఉన్నారు యామిని. భారతదేశంలోని కుగ్రామం నుంచి వచ్చి పిన్న వయసులో గ్లాస్‌ సీలింగ్‌ను బ్రేక్‌ చేసి తానేంటో నిరూపించుకుంది. మల్టీ బిలియన్ డాలర్ల టెక్ కంపెనీకి నాయకత్వం వహించే కొద్దిమంది మహిళల్లో ఒకరుగా పేరు తెచ్చుకోవడం విశేషం. హబ్‌స్పాట్‌ కంపెనీలో చేరి రెండేళ్లు పూర్తి కాకముందే సీఈవోగా బాధ్యతలు చేపట్టిన ఘనత ఆమెది. జనవరి 2020 నుంచి ఆగస్టు 2021 వరకు చీఫ్ కస్టమర్ ఆఫీసర్‌గా, సెప్టెంబర్ 2021 నుంచి ఇప్పటి వరకు సీఈవోగా సేవలందిస్తున్నారు. 25.66 బిలియన్ డాలర్ల మార్కెట్‌ క్యాప్‌తో కంపెనీ దిన దినాభివృద్ది చెందుతోంది. 2023లో యామినీ రంగన్ నికర విలువ దాదాపు 32 మిలియన్‌ డాలర్లు.
21 ఏళ్ల వయస్సులోనే..
21 ఏళ్ల వయస్సులో, చాలా పరిమితమైన నగదుతో యామిని ఇండియా వదిలి భయం భయంగా అమెరికాకు పయనమైంది. జీవితం అంత సులభం కాదని ఆమె వెంటనే గ్రహించింది. యూఎస్‌లో జీవించడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో యామిని అద్దె చెల్లించిన తర్వాత ఆమె జేబులో మిగిలింది. కేవలం 150 డాలర్లు మాత్రమే. దీంతో ఉద్యోగం సంపాదించడం ఒక్కటే మార్గమని నిర్ణయించుకుంది.

ఫుట్‌బాల్ స్టేడియం రెస్టారెంట్‌లో ఫుడ్‌, డ్రింక్స్ అందించా..

అలా అట్లాంటాలోని ఫుట్‌బాల్ స్టేడియం రెస్టారెంట్‌లో ఫుడ్‌, డ్రింక్స్‌ అందించడం తొలి ఉద్యోగమని యామిని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. తానెప్పుడూ స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటాననీ, అందుకే తల్లిదండ్రుల వద్దకు తిరిగి వెళ్లి డబ్బు అడగడానికి ఇష్టపడ లేదని చెప్పారు. యామిని యూఎస్‌లో మాస్టర్స్ చేయడానికి ముందు కోయంబత్తూరులో బీటెక్‌, తరువాత బెర్కిలీ నుంచి ఎంబీఏ పట్టా పుచ్చుకుంది.సుదీర్ఘ కెరీర్‌లో సాప్‌, లూసెంట్, వర్క్‌డే, డ్రాప్‌బాక్స్ లాంటి ఐటీ దిగ్గజ కంపెనీల్లో నిచేశారు. 2019లో శాన్ ఫ్రాన్సిస్కోలో వ్యాపారంలో అత్యంత ప్రభావవంతమైన మహిళగా ప్రశంసలందుకున్నారు. యామిని ఇప్పుడు ఇద్దరు అబ్బాయిలు.

Business Woman Success Story: అమ్మాయివై ఇలాంటి వ్యాపారం చేస్తావా అన్నారు.. కానీ నేడు వందల కోట్లు సంపాదిస్తున్నా.. ఎలా అంటే..

ముఖ్యంగా పీరియడ్స్, లోదుస్తుల గురించి మాట్లాడాలంటే స్త్రీలకు భయం. ఎవరిదైనా బ్రా, పెట్టీకోట్‌లు కొద్దిగా బయటకు కనిపిస్తుంటే.. చెప్పడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు.
కానీ రిచాకర్ అనే అమ్మాయి ఇలా మాట్లాడ్డానికి ఇబ్బంది పడే అంశాన్నే కెరీర్‌గా ఎంచుకుంది. అమ్మాయిల నుంచి మహిళలు ధరించే ‘బ్రా’ల బ్రాండ్‌ను ఎంతో ధైర్యంగా మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఎటువంటి బిడియం లేకుండా తీసుకొచ్చిన ఈ బ్రాండ్‌ నేడు కోట్ల టర్నోవర్‌తో దూసుకెల్తోంది.

రిచాకర్ జంషెడ్‌పూర్‌లోని ఓ మధ్య తరగతి కుటుంబంలో పుట్టింది. ఈమె తండ్రి టాటా స్టీల్‌ కంపెనీ ఉద్యోగి, తల్లి గృహిణి. రిచాది చిన్నప్పటి నుంచి విభిన్నంగా ఆలోచించే మనస్తత్వం. డిగ్రీ అయ్యాక ఐటీ కంపెనీలో కొన్నేళ్లపాటు ఉద్యోగం చేసింది. సొంతంగా వ్యాపారం చేయాలన్న కోరికతో శాప్‌ రిటైల్‌ కన్సల్టింగ్, స్పెన్సర్స్‌లో ఉద్యోగం చేశాక నర్సీ మోంజీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్‌ డిప్లొమా చేసింది.

ఓ పక్క ఉద్యోగ అనుభవం, మరోపక్క మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ ద్వారా నేర్చుకున్న జ్ఞానంతో సొంతంగా వ్యాపారం పెట్టడానికి పూనుకుంది. ఇందుకోసం మహిళల లోదుస్తుల వ్యాపారం ఎంచుకుంది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. ”సమాజంలో లోదుస్తుల గురించి మాట్లాడాలంటే భయడతారు. ఈ వ్యాపారం అవసరమా..? వద్దు..” అని నిరుత్సాహపరిచారు. తల్లిదండ్రులు అలా చెప్పినప్పటికీ రిచా ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. తన వ్యాపారం ప్రారంభ పనుల్లో మునిగిపోయింది.
బ్రా బ్రాండ్ తయారు..
మహిళలు ధరించే బ్రాలను సొంతంగా డిజైన్‌ చేసి, తయారు చేసి, విక్రయించడంపై దృష్టిపెట్టింది. కొన్ని రోజులకి తన పని మీద నమ్మకం ఏర్పడడంతో 2011లో ‘జివామే’ పేరుతో బ్రా బ్రాండ్‌ను ఏర్పాటు చేసింది. జివామే అంటే హిబ్రూలో ‘రేడియంట్‌ మి’ అని అర్థం. కాలేజీ అమ్మాయిల నుంచి పిల్ల తల్లుల వరకు అందరూ సౌకర్యంగా ధరించే బ్రాలను విక్రయించడం మొదలు పెట్టింది. కస్టమర్ల నుంచి మంచి స్పందన వస్తుండడంతో ఐదు వేల డిజైన్లు, యాభై బ్రాండ్‌లు వంద రకాల సైజుల్లో లోదుస్తులను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ స్టోర్‌ల ద్వారా అందిస్తోంది జివామే.

లాభాల్లో దూసుకుపోతున్న బ్రాండ్‌..
రిచాకర్ కోట్ల టర్నోవర్‌తో దూసుకుపోతోన్న సమయంలో కొన్ని కారణాలతో 2017 సీఈవో పదవి నుంచి తప్పుకుని, డైరెక్టర్‌గా కొనసాగుతోంది. ప్రస్తుతం రిచా నెట్‌ వర్త్‌ దాదాపు 750 కోట్లు ఉండొచ్చని అంచనా. మంచి లాభాల్లో దూసుకుపోతున్న జివామే బ్రాండ్‌ను 2020లో రిలయన్స్‌ రిటైల్‌ కొనుగోలు చేసింది. తన కలను నిజం చేసుకున్న 43 ఏళ్ల రిచాకర్‌ ప్రస్తుతం తన భర్త కేదార్‌ గవాన్‌తో కలిసి అమెరికాలో నివాసం ఉంటుంది.
అమ్మాయిలు దేనిలోనూ.. తక్కువ కాదు..
‘ఓ స్త్రీ మనసును మరో స్త్రీ మాత్రమే అర్థం చేసుకుంటుంది. అందుకే మూసపద్ధతులను దాటుకుని మహిళలు సౌకర్యంగా ధరించే లో దుస్తుల బ్రాండ్‌ను తీసుకొచ్చాను. జివామేను మార్కెట్లోకి తేవడానికి, దానికి బ్రాండ్‌ ఇమేజ్‌ తీసుకు రావడానికి చాలా సవాళ్లను, ఒత్తిళ్లనూ ఎదుర్కోవాల్సి వచ్చింది. వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొనబట్టే ఇవాళ ఈ స్థాయికి రాగలిగాను. ఇంటిలో, సమాజంలో మనల్ని వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తారు. అయినా మన మీద మనం ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. అప్పుడు అమ్మాయిలు దేనిలో తక్కువ కాదు. మనసులో ఏదైనా నిర్ణయించుకుంటే అది కచ్చితంగా సాధించ గలుగుతారు” అని చెబుతూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది రిచాకర్‌.
కొన్ని కోట్ల టర్నోవర్‌తో..
లోదుస్తులు ధరించిన మహిళలు సౌకర్యంగా, కాన్ఫిడెంట్‌గా ఉండడమే లక్ష్యంగా లోదుస్తులను అందుబాటులో ఉంచుతుండడంతో జివామే బ్రాండ్‌ మార్కెట్లోకి వచ్చిన ఏడాదిలోనే పెట్టుబడిదార్లను ఆకర్షించింది. దీంతో 2012లో మూడు మిలియన్ల డాలర్లు, మరుసటి ఏడాది ఇది రెట్టింపు అయ్యింది. 2015 నాటికి నలభై మిలియన్‌ డాలర్లు పెట్టుబడులు వచ్చాయి. దీంతో కంపెనీ ఆరు వందల కోట్లపైకి ఎగబాగి ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Inspirational Success Story : ఊహించని విజయం.. ఆఫీసు బాయ్ నుంచి రెండు కంపెనీలకు సీఈవో స్థాయికి వచ్చానిలా.. కానీ..

చిన్న ఉద్యోగంచేస్తూనే అతి పెద్ద లక్ష్యంపై గురిపెట్టి ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు. ఈ యువకుడే దాదాసాహెబ్ భగత్. ఇంతకి దాదాసాహెబ్ భగత్ ఏమి సాధించాడు..?
లక్ష్యసాధనకు ఎలా కష్టపడ్డాడు..? ఈ యువకుడి విజయ గాథ మీకోసం..

మహారాష్ట్రలోని బీడ్‌కు చెందిన దాదాసాహెబ్ భగత్ 1994లో జన్మించారు. భగత్ ఉన్నత పాఠశాల పూర్తి చేసిన తర్వాత వృత్తిని కొనసాగించేందుకు తన గ్రామం నుండి పూణేకు వచ్చారు. ITI డిప్లొమా ప్రోగ్రామ్‌ను పూర్తి చేసిన తర్వాత రూమ్ సర్వీస్ బాయ్‌గా నెలకు రూ.9000లకు ఉద్యోగంలో చేరారు. కానీ దాన్ని వదిలేసి ఇన్ఫోసిస్ గెస్ట్ హౌస్‌లో చేరారు. అదే ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది.
టీ , వాటర్ అందిస్తూ..

ఇన్ఫోసిస్ గెస్ట్ హౌస్‌లో అతిథులకు రూమ్ సర్వీస్, టీ ,వాటర్ అందించడం భగత్‌ డ్యూటీ. ఇక్కడే సాఫ్ట్‌వేర్ విలువను తెలుసుకుని పరిశ్రమపై ఆసక్తి పెంచుకున్నారు. కార్పొరేట్ ప్రపంచం పట్ల ఆకర్షితుడయ్యారు. యానిమేషన్ అండ్‌ డిజైన్‌ను చేయాలన్నపెద్దల సలహా మేరకు రాత్రి ఉద్యోగం, పగటిపూట యానిమేషన్‌లో చదువును కొనసాగించారు. కోర్సు పూర్తి చేసిన భగత్ ముంబైలో ఉద్యోగంలో చేరి, కొంతకాలం తర్వాత హైదరాబాద్‌కు మకాం మార్చారు.

దురదృష్టవశాత్తు..

హైదరాబాద్‌లోని డిజైన్ అండ్‌ గ్రాఫిక్స్ సంస్థలో ఉద్యోగం చేస్తూనే పైథాన్, C++ కోర్సులు చేశారు. విజువల్ ఎఫెక్ట్స్‌, టెంప్లేట్‌ల లైబ్రరీని సృష్టించడం దృష్టి పెట్టారు. ఈ డిజైన్ టెంప్లేట్‌లను ఆన్‌లైన్‌లో మార్కెట్ చేయడం ప్రారంభించాడు. అయితే దురదృష్టవశాత్తు, భగత్ కారు మంచానికే పరిమితం కావాల్సి వచ్చింది. అయినా కుంగి పోలేదు. ఉద్యోగం మానేసి ఫుల్‌టైమ్ స్టార్టప్‌ని ప్రారంభించారు. అలా 2015లో Ninthmotion ఆవిష్కృతమైంది. బీబీసీ స్టూడియోస్, 9XM మ్యూజిక్ ఛానెల్ వంటి ప్రసిద్ధ కంపెనీలతో సహాతన సేవల్ని అందిస్తూ, తక్కువ వ్యవధిలోనే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6వేల మంది క్లయింట్‌లను సాధించారు.
మలుపు తిప్పిన..కాన్వా వంటి ఆన్‌లైన్ గ్రాఫిక్ డిజైనింగ్ ప్లాట్‌ఫారమ్‌ను రూపొందించాలని భగత్ నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా రెండో బిజినెస్‌ డూగ్రాఫిక్స్ అవతరించింది. ఈ ప్లాట్‌ఫారమ్ సాధారణడ్రాగ్-అండ్-డ్రాప్ ఇంటర్‌ ఫేస్‌ను కలిగి ఉంది. దీనిద్వారా యూజర్లు టెంప్లేట్‌లు, డిజైన్‌లను రూపొందించడానికి వీలు కల్పిస్తుంది. అయితే COVID-19 సంక్షోభం, లాక్‌డౌన్ కారణంగా పూణేలో వ్యాపారాన్ని వదులుకుని, బీడ్‌లోని తన గ్రామానికి మకాం మార్చవలసి వచ్చింది.

సొంత గ్రామం నుంచే..

తన గ్రామంలో మంచి మౌలిక సదుపాయాలు లేనందున తాత్కాలిక ఏర్పాట్లు చేయడానికి, భగత్ మంచి 4G నెట్‌వర్క్ రిసెప్షన్‌తో పశువుల కొట్టంలో దుకాణాన్ని ఏర్పాటు చేశారు. భగత్ స్వయంగా యానిమేషన్ అండ్‌ డిజైన్‌లో శిక్షణ పొందిన కారణంగా కొంతమంది స్నేహితులకు శిక్షణ ఇచ్చి, వారితో కలిసి ఆ షెడ్‌లోనే పని ప్రారంభించారు. అలా గ్రామం నుంచి చాలా మందికి తక్షణమే వెంటనే డూగ్రాఫిక్స్ శిక్షణ ఇవ్వడం, కార్యకలాపాలు మొదలు కావడం జరిగిపోయింది.
కేవలం ఆరు నెలల్లో 10వేల క్రియాశీల వినియోగదారులను సాధించింది. వీరిలో మహారాష్ట్ర, ఢిల్లీ, బెంగుళూరుతోపాటు, జపాన్, ఆస్ట్రేలియా యూకే నుంచి కూడా ఉన్నారు. విశేష సేవలందిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అలాగే ప్రధాని మోదీ “ఆత్మనిర్భర్ భారత్” విజన్‌కు మద్దతుగా డూ గ్రాఫిక్స్, పూర్తిగా భారతీయ నిర్మిత సాఫ్ట్‌వేర్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద డిజైన్ పోర్టల్‌గా మార్చాలనేది భగత్ ఆశయం. ఇన్ఫోసిస్‌లో ఆఫీస్ బాయ్‌గా పనిచేసిన భగత్ ఇప్పుడు తన సొంత స్టార్టప్‌లకు సీఈఓగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలందుకున్నారు. షెడ్ నుంచి “మేడ్-ఇన్-ఇండియా” కాన్వా దాకా తన టాలెంట్‌తో రెండు కంపెనీలకూ సీఈఓగా ఉన్నాడు. మనలో టాలెంట్ ఉండాలే కానీ.. అనుకున్న లక్ష్యం సాధించడం ఈజీనే అంటున్నాడు భగత్. భగత్ సక్సెస్ జర్నీ నేటి యువతకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది

Inspirational Success Story : బతుకుదెరువు కోసం రిక్షా తొక్కిన.. చివరికి ప్యూన్ ఉద్యోగం కూడా రాలేదు.. ఈ ఐడియాతో కొట్ల రూపాయలు సంపాదించానిలా..

జీవితంలో ఎదగాలనే కసి నీకుంటే తప్పకుండా గొప్ప స్థాయికి చేరుకుంటావు. దీనికి నిలువెత్తు నిదర్శనమే ‘దిల్‌ఖుష్ సింగ్’ సక్సెస్ జర్నీ.

ఒకసారి ప్యూన్ ఉద్యోగం కోసం వెళ్తే..
సహర్సాలోని ఒక చిన్న గ్రామానికి చెందిన ‘దిల్‌ఖుష్ సింగ్’ ఇంటర్ మీడియట్ మాత్రమే చదివి ఈ రోజు ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నాడు. ఈ రోజు అతని సంవత్సరాదాయం సుమారు రూ.20 కోట్లు వరకు ఉంటుందని అంచనా. ఈ స్థాయికి రావడానికి దిల్‌ఖుష్ ఎంతో కష్టపడ్డాడు. రిక్షా లాగించేవాడు, బతుకుదెరువు కోసం పాట్నాలో కూరగాయలు కూడా అమ్మేవాడు. ఒకసారి ప్యూన్ ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళితే యాపిల్ లోగోను గుర్తించమని అడిగారని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.

ఈ ఐడియాతోనే..

దిల్‌ఖుష్ సింగ్ రాడ్‌బెజ్ అనే కంపెనీ ప్రారంభించి బీహార్‌లో క్యాబ్‌లను అందించడం మొదలెట్టాడు. అయితే ఇది ఓలా, ఉబర్ సంస్థలకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఓలా, ఉబర్ కంపెనీలు నగర ప్రయాణాలపై మాత్రమే దృష్టి పెడుతుంటే.. ఈ కంపెనీ నగరం నుంచి 50 కిమీ దూరం వెళ్లి కూడా సర్వీస్ చేస్తుంది. రాడ్‌బెజ్ కంపెనీ ట్రావెల్ కంపెనీలతో పాటు వ్యక్తిగత క్యాబ్ డ్రైవర్లతో టై-అప్లను కలిగి ఉంది. అయితే వారి ప్రయాణం ముగించుకుని తిరిగి వచ్చేటప్పటికి ప్రయాణీకులను ఎంపిక చేసుకోమని వారు క్యాబ్ డ్రైవర్లను అడుగుతారు. వారు తిరుగు ప్రయాణాలలో ప్రయాణికులు లేకుండా వస్తారు కాబట్టి, మార్కెట్ ధరల కంటే తక్కువ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. దీని ద్వారా ప్రతి వినియోగదారుడు ఒక్కో ట్రిప్పుకు కనీసం రూ.1500 ఆదా చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.
కేవలం ఆరు నెలల్లోనే..
ఆ తరువాత ఆర్య గో క్యాబ్స్‌గా తన బిజినెస్ ప్రారంభించాడు. టాటా నానో కారుతో కంపెనీని ప్రారభించి, కేవలం ఆరు నెలల్లో కోట్ల రూపాయల సంపాదించగలిగాడు. ఇప్పటికి అతని సంపాదన రూ. 20 కోట్లకి చేరింది. అతని లక్ష్యం రూ. 100 కోట్లకి చేరుకోవడమే అని గతంలో వెల్లడించారు. తన కంపెనీలో పనిచేసే డ్రైవర్లకు ఎటువంటి నష్టం జరగకుండా చూడటానికి నష్టపరిహారం వంటివి కూడా అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఒక డ్రైవర్ తన ప్లాట్‌ఫామ్ ద్వారా నెలకు రూ.55,000 నుంచి రూ. 60,000 వరకు సంపాదించవచ్చని చెబుతున్నారు. ఐఐటీ గౌహతి నుంచి, ఐఐఎంల నుంచి చాలా మంది తమ ప్లాట్‌ఫామ్‌లో పార్ట్‌టైమ్‌గా పనిచేస్తున్నారని దిల్‌ఖుష్ చెప్పుకొచ్చారు. ఉద్యోగం రాలేదు.. నా వల్ల కాదు.. అనే నిరుత్సాహంతో ఉండే వారికి.. దిల్‌ఖుష్ సింగ్ సక్సెస్ జర్నీ ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది.

Inspire Success Story : కఠిన పేదరికం నుంచి వచ్చి.. రూ.1000 కోట్లలకు పైగా సంపాదించానిలా.. కానీ..

ఇందులో కొంత మంది డబ్బున్న కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి సక్సెస్ కొట్టిన వారు ఉన్నారు. అయితే ఇప్పుడు కఠిన పేదరికం నుంచి వచ్చి రూ.1000 కోట్లు సామ్రాజ్యం సృష్టించాడు ‘విజయ్ సుబ్రమణియమ్’ .
ఈ నేపథ్యంలో విజయ్ సుబ్రమణియమ్ సక్సెస్ జర్నీ మీకోసం..

కుటుంబ నేపథ్యం.. ఎడ్యుకేషన్‌ :
ఈ రోజు ‘రాయల్ ఓక్’ ఫర్నిచర్ కంపెనీ గురించి ప్రత్యేకంగా పరిచయమే అవకాశం లేదు, కానీ దాన్ని స్థాపించిన విజయ్ గురించి మాత్రం తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే సుమారు ఇరవై సంవత్సరాలు కష్టపడి ఉన్నత శిఖరాలను అధిరోహించాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరులో ఒక ప్రభుత్వ కళాశాలలో బీకామ్‌ చేశారు. కుటుంబాన్ని పోషిచే ఒకే వ్యక్తి విజయ్ కావడంతో మాస్టర్ డిగ్రీ చేయలేకపోయాడు.
బంధులలోనే ఒకరు తనని మోసం చేశారు.. కానీ..

బీకామ్ పూర్తయిన తరువాత సింగపూర్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని వారి బంధులలోనే ఒకరు తనని మోసం చేసారని ఒక సందర్భంలో వెల్లడించారు. ఆ తరువాత కేరళలోని మున్నార్‌కు వెళ్లి అక్కడ క్రెడిట్ కార్డు ఏజెంట్‌గా పని చేయడం ప్రారంభించాడు. ఆ తరువాత 1997లో చెన్నై వెళ్లి ప్లాస్టిక్ వస్తువుల వ్యాపారం ప్రారంభించి ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా 10 రోజులలో రూ.2800 విలువైన వస్తువులను విక్రయించగలిగాడు.
నా జీవితంలో మలుపు ఇదే..

విజయ్ సుబ్రమణియమ్ 2001లో బెంగళూరులోని సఫీనా ప్లాజాలో స్టాల్‌ ప్రారంభించడం ఆయన జీవితానికి పెద్ద మలుపుగా మారింది. ఆ తరువాత బిగ్ బజార్ తమ అవుట్‌లెట్‌లో స్టోర్‌ను ఏర్పాటు చేయమని కోరింది. ఆ తరువాత కారు కొనుగోలు చేసి ఇల్లు కట్టుకుని పెళ్లి కూడా చేసుకున్నాడు. విజయ్ సుబ్రమణియమ్ 2004లో మొదటి షాప్ ఓపెన్ చేసాడు. 2005 నాటికి చైనీస్ ఫర్నిచర్ దిగుమతి చేసుకోవడం ప్రారంభించాడు. 2010 నాటికి మరొక షాప్ ఏర్పాటు చేసాడు. ఇదే రాయల్ ఓక్ ప్రారంభానికి నాంది పలికింది.

నా లక్ష్యం ఇదే..
ప్రస్తుతం ఈ సంస్థ కింద 150 స్టోర్లు ఉన్నాయి. అంతే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 280 కర్మాగారాల నుంచి తాను ఉత్పత్తులను పొందుతున్నట్లు తెలిపాడు. కాగా 2024 ఆర్థిక సంవత్సరంలో మరో 100 స్టోర్లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఎదగాలనే సంకల్పం ఉన్న వాడికి విజయం దాసోహమవుతుందని చెప్పడానికి ఇదో చక్కని నిదర్శనం.

Diabetic Health: మీకు డయాబెటిస్‌ ఉందా? స్వీట్‌నెస్‌ కోసం షుగర్స్‌కు బదులు ఇవి తీసుకోండి!

Diabetic Health: ఈ మధ్య కాలం చాలా మందిలో ఎక్కువగా కనిపిస్తున్న సమస్య మధుమేహం. ఈ సమస్య ఉన్నవారు వారు తినే ఆహారపు అలవాట్ల పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం తప్పనిసరి.
హై షుగర్, ఫ్రైడ్ ఫుడ్స్, హై సాచురేటెడ్, ట్రాన్స్ ఫ్యాట్స్ కలిగిన ఫుడ్స్ కు వీలైనంత దూరంగా ఉంటేనే ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే మధుమేహం ఉన్నవారు స్వీట్స్, లేదా ఏదైనా షుగర్ ఐటమ్స్ తీసుకోవడానికి చాలా భయపడతారు. ఎందుకంటే ఇవి రక్తంలోని చక్కర స్థాయిలను మరింత పెంచే ప్రమాదం ఉంటుంది.

అందుకని ఈ సమస్య ఉన్నవారు షుగర్ ఐటమ్స్ తినేటప్పుడు వాటిలో షుగర్ బదులు ఈ నేచురల్ స్వీట్నర్స్ వాడితే బ్లడ్ షుగర్ లెవెల్స్ పై మంచి ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

మాంక్ ఫ్రూట్ షుగర్

మాంక్ ఫ్రూట్ షుగర్ FDA( ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) సంస్థ నుంచి సురక్షితమైనదిగా గుర్తింపు పొందింది. మధుమేహం ఉన్నవారు వారి డైట్ లో దీనిని తీసుకుంటే రక్తంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ ను స్థిరంగా ఉంచుతుంది. డయాబెటీస్ రోగులకు ఇది సరైన ఎంపిక.

అడ్వాంటేమ్

అడ్వాంటేమ్.. ఇది మధుమేహ రోగులకు సరైన ఎంపిక. ఇది సాధారణ చక్కర కంటే 20,000 టైమ్స్ ఎక్కువ స్వీట్ గా ఉంటుందని FDA సంస్థ తెలిపింది. అందుకే దీన్ని కొంచం వాడిన సరిపోతుంది.

Also Read: Bay leaves Tips: ఈ ఆకుతో.. డాన్డ్రప్ సమస్య దెబ్బకు మాయం

స్టీవియా

ఇది నేచురల్ స్వీట్నర్. స్టీవియా లో తక్కువ కేలరీలతో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బయోటిక్ గుణాలను కలిగి ఉంటుంది. డైయాబెటీస్ రోగుల పై ఇది మంచి ప్రభావం చూపుతుంది. స్టీవియా ప్లాస్మా గ్లూకోజ్ స్థాయిలను తగ్గించి.. గ్లూకోస్ టాలరెన్స్ పెంచుతుంది.

ఎరిథ్రిటాల్

ఇది సహజంగా లభించే షుగర్. దీన్ని ఎక్కువగా ఫుడ్ ఇండస్ట్రీస్ లో క్యాండీస్, బేకరీ ఐటమ్స్ ఉత్పత్తుల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ చక్కెరలో తక్కువ కేలరీస్ ఉంటాయి. మధుమేహం ఉన్నవారు ఆర్టిఫీషియల్ షుగర్స్ బదులు వీటిని తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.

జిలిటోల్ షుగర్

మధుమేహం సమస్య ఉన్నవారు వారి డైట్ లో జిలిటోల్ షుగర్ తీసుకుంటే మంచి ప్రభావం ఉంటుంది. దీనిలోని తక్కువ గ్లైసెమిక్ వాల్యూ.. రక్తంలోని గ్లూకోజ్, ఇన్సులిన్ స్థాయిలను పెరగడాన్ని తగ్గిస్తుంది. అంతే ఇది బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది.

Viral Video: మెషిన్ కంటే వేగంగా డబ్బులు లెక్కిస్తున్న యువతి.. నమ్మక పొతే ఈ వీడియోపై ఓ లుక్ వేయండి..

ఒకప్పుడు బ్యాంకులో పనులన్నీ దాదాపు చేతులతో జరిగేవి. కొన్ని ఏళ్ల క్రితం వరకూ యంత్రాల వినియోగం తక్కువ. డబ్బు లెక్కపెట్టినా, ఖాతాదారుల రికార్డులు భద్రపరచుకోవాలన్నా, బ్యాంకు ఉద్యోగులు మాన్యువల్‌గానే పని చేసేవారు.

అయితే ఇప్పుడు బ్యాంక్ లో పని చేసేందుకు ఇప్పుడు మెషీన్లు వచ్చాయి. దీనివల్ల ఉద్యోగుల పని చాలా తేలికైంది. ఎక్కువ డబ్బులు లెక్కించాల్సి వచ్చినప్పుడు బ్యాంకు ఉద్యోగులు మెషీన్లు వాడడం సర్వసాధారణం. అయితే ప్రస్తుతం ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ప్రజల మెదడుకు పని చెప్పి ఆలోచించమని చెబుతోంది. ఎందుకంటే ఈ వీడియోలో ఒక మహిళ మనీ మెషిన్ కంటే స్పీడ్ గా డబ్బులను లెక్కిస్తోంది. ఈ వీడియో చైనాకు చెందినదిగా చెబుతున్నారు.

సాధారణంగా ఎక్కువ మొత్తంలో నోట్ల కట్టలను లెక్కించాల్సి వచ్చినప్పుడు వాటిని మెషీన్‌లో పెడతారు. అప్పుడు ఆ యంత్రం కొన్ని సెకన్ల వ్యవధిలో మొత్తం డబ్బును లెక్కించి ఎంత ఉందో చెబుతుంది. ఈ వీడియోలో కనిపిస్తున్న యువతి కూడా అలాంటిదే చేయడం కనిపిస్తుంది. అయితే ఈ యువతి డబ్బులను చేతితోనే యంత్రం వేగంతో సమానంగా లెక్కిస్తోంది. కొన్ని సెకన్ల వ్యవధిలోనే డబ్బుల కట్టలను లెక్కిస్తోంది. ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా షాక్ తింటారు.. లేదా ఈ యువతి మనిషా.. లేక యంత్రమా అని కూడా ఆలోచిస్తారు. ఎందుకంటే సాధారణంగా ఏ మనిషి నోట్ల కట్టలను అంత వేగంగా లెక్కించలేరు. అయితే కొంతమందికి కొన్ని రకాల ప్రతిభ ఉంటుంది.. వారికీ

సులభమైన పని ఇతరులకు చాలా కష్టం.

హ్యూమన్ మనీ కౌంటింగ్ వీడియో చూడండి..

మనసును హత్తుకున్న ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో @crazyclipsonly IDతో భాగస్వామ్యం చేయబడింది. ‘హ్యూమన్ మనీ కౌంటర్’ అనే క్యాప్షన్ ఇచ్చారు దీనికి. కేవలం 15 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 2.3 మిలియన్లు అంటే 23 లక్షల వ్యూస్ ను వేలాది లైక్స్ ను సొంతం చేసుకుంది.అదే సమయంలో, వీడియో చూసిన తర్వాత, ప్రజలు వివిధ రకాల రియాక్షన్లు ఇచ్చారు. కొంతమంది వినియోగదారులు ఈ యువతి నిజంగా ఎంత వేగంగా డబ్బును లెక్కిస్తోందో.. నేను అస్సలు నమ్మలేకపోతున్నాను అని అంటే మరొకరు.. ఈ యువతి మనీ కౌంటింగ్ మెషీన్‌ను అస్సలు నమ్మదలా ఉంది అని వ్యాఖ్యానిస్తుంటే.. చెప్పాలంటే ఆమెకు డబ్బుల లెక్కింపులో ఎన్ని సంవత్సరాల అనుభవం ఉందని మరొకొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

Viral News : అంబులెన్స్ కుదుపు.. చచ్చాడనుకున్న వృద్ధుడు బతికాడు

ఆసుపత్రిలో మరణించిన వృద్ధుడిని అంత్యక్రియల కోసం అంబులెన్స్‌లో తరలిస్తుండగా.. అతడు తిరగబడి ప్రాణాలతో బయటపడ్డాడు. హర్యానాలో జరిగిన ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన వ్యక్తిని దర్శన్ సింగ్ బ్రార్ (80)గా గుర్తించారు.
అతడు గుండె సంబంధిత సమస్యతో ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతున్న దర్శన్ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించడంతో అంబులెన్స్‌లో పాటియాలా నుంచి కర్నాల్‌లోని అతని ఇంటికి తీసుకుని బయలు దేరారు. ఆయనకు తోడుగా వస్తున్న దర్శన్ మనవడు తన తాత శరీరంలో కదలిక గమనించాడు. తర్వాత గుండె కొట్టుకోవడం గమనించి డ్రైవర్‌కు చెప్పాడు. అంబులెన్స్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు దర్శన్ బతికే ఉన్నట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

దర్శన్ చనిపోయాడని తాము చెప్పలేదని గతంలో దర్శన్‌కు చికిత్స అందించిన రీవల్ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ నేత్రపాల్ వెల్లడించారు. తమ వద్దకు తీసుకువెళ్లే సరికి కొన ఊపిరి పీల్చుకోవడంతోపాటు బీపీతో బాధపడుతున్నట్లు తెలిపారు. సాంకేతిక లోపమో, మరేదైనా సమస్యతో మరో ఆసుపత్రిలో ఏం జరిగిందో తెలియడం లేదని వాపోయారు. అయితే ప్రస్తుతం ఆ వృద్ధిడి పరిస్థితి విషమంగానే ఉందని డాక్టర్స్ చెబుతున్నారు.

Viral Video : గ్యాస్ స్టవ్‌ను ఇలా వెలిగించాలని తెలియక.. ఎన్ని లైటర్లు కొన్నామో..!

ప్రపంచంలో ఏ మూలన ఏ ఘటన జరిగినా కూడా సోషల్ మీడియా ద్వారా క్షణాల్లో తెలిసిపోతున్నాయి. ఇక రోజు ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని సరదాగా ఉంటే మరికొన్ని సృజనాత్మకతను కలిగి ఉంటాయి.
ఇంకొన్ని ఆలోచింపజేసే విధంగా, మరికొన్ని ఆశ్చర్యపోయేలా ఉంటాయి. ఆశ్చర్యకరమైన వీడియోలు చూసిన సందర్భంలో మన కళ్లను మనమే నమ్మలేము. అలాంటి ఓ వీడియోనే ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

సాధారణంగా మనం గ్యాస్ స్టవ్‌ను వెలిగించాలంటే లైటర్ లేదా అగ్గిపెట్టెను వాడుతుంటాం. ఈ రెండింటి ద్వారా కాకుండా కేవలం చేతి వేలి ద్వారా మాత్రమే ఓ వ్యక్తి గ్యాస్ స్టవ్‌ను వెలిగించాడు.

దీని కోసం అతడు ఎలాంటి వస్తువులను వాడలేదు. వంట గదిలో కుర్చీపై కూర్చున ఓ యువకుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేశాడు. ఆ తరువాత తన కుడి చేతి వేలును బర్నర్ పై ఉంచాడు. మరో వ్యక్తి యువకుడి తలపై టవల్‌ను ఉంచి దానిని కొంచెం గట్టిగా లాగాడు. ఆ వ్యక్తి అలా చేసిన వెంటనే గ్యాస్ స్టవ్ మండడం ప్రారంభమైంది.
ఈ వీడియో @Madan_Chikna అనే ఖాతా ద్వారా ఎక్స్‌లో షేర్ చేశారు. స్టాటిక్ ఎనర్జీని ఉత్పత్తి చేయడం ద్వారా ఆ యువకుడు ఈ పనిని చేసినట్లుగా రాసుకొచ్చాడు. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

https://x.com/Madan_Chikna/status/1745496256636686517t=Wdkrh6d9bnqD8ywEmZCVYQ&s=09

Viral News: మీకు పెళ్లయ్యిందా? అక్కడికి వెళితే ఫుడ్, హోమ్ అన్నీ ఫ్రీ! డబ్బు సంపాదించే మార్గమూ చెబుతారు.. కండీషన్స్ అప్లై!

ప్రతి ఒక్కరూ ప్రయాణాలను ఇష్టపడతారు.. కొంతమంది తమ సమీపంలోని ప్రాంతాలను చూస్తే , మరికొందరు దేశంలోని అందమైన ప్రదేశాలకు వెళ్ళడానికి ఆసక్తిని చూపిస్తారు.
అయితే విదేశాలకు వెళ్లి అందమైన ప్రాంతాలను ముఖ్యంగా బీచ్ లను చూడలని ఉన్నా ఆర్ధిక పరిస్థితిని బట్టి తమ కోరికను చంపుకుంటారు. కొత్త ప్రదేశాలను చూడాలని.. అందమైన బీచ్ లో ఎంజాయ్ చేయాలనే కోరిక ఉన్నవారైతే ఈ వార్త మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే తమ ప్రదేశానికి రండి అందమైన ప్రాంతాలను వీక్షిస్తూ ఎంజాయ్ చేయండి అంటూ ఓ దేశంలోని ద్వీప వాసులు పిలుస్తున్నారు. మీరు అక్కడికి వెళ్తే.. అన్ని ఏర్పాట్లు ఉచితంగానే ఇస్తారు. ఎటువంటి సమస్యా ఉండదు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మీరు మీతో పాటు భాగస్వామిని కూడా తప్పని సరిగా తీసుకుని వెళ్ళాలి.

ఆంగ్ల వెబ్‌సైట్ న్యూయార్క్ పోస్ట్‌లో ప్రచురించబడిన నివేదిక ప్రకారం.. ఐర్లాండ్‌లోని అత్యంత సుందరమైన గ్రేట్ బ్లాస్కెట్ ద్వీపం పర్యాటకులకు ఒక బంపర్ ఆఫర్ ని ప్రకటించింది. ఈ ద్వీపంలో ఎన్నో బీచ్‌లు, అద్భుతమైన ప్రకృతి అందాలున్నాయి. దీంతో ప్రతి సంవత్సరం ముఖ్యంగా వేసవి కాలంలో మిలియన్ల మంది ప్రజలు ఇక్కడకు వస్తారు. అయితే ఇలా పర్యాటకులు పోటెత్తిన సమయంలో వారికి సర్వ్ చేయడం కొంచెం కష్టమైన పనిగా మారుతుంది అక్కడ హోటల్ సిబ్బందికి. దీంతో ఇప్పుడు సరికొత్త ప్రపోజల్ తో ముందుకు వచ్చింది.

జంటగా వెళ్లే వారు ఏమి చెయ్యాలంటే..

ఈ ద్వీపానికి వచ్చే పర్యాటకులకు టీ , కాఫీలు అందించడం.. వారి అవసరాలను గమనిస్తూ తీర్చడం. ఇలా చేసినందుకు జీతం కూడా ఇస్తారు. అంతేకాదు. ఈ జంటలకు తమ షాప్ పైన ఉండే అపార్ట్మెంట్లో ఉచిత వసతి కల్పిస్తారు. అక్కడ అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. మీడియా నివేదికల ప్రకారం ఈ ఆఫర్ 2024 ఏప్రిల్ నుండి అక్టోబర్ 2024 వరకు నడుస్తుంది ఎందుకంటే జూన్, జూలై, ఆగస్టులలో పర్యాటకుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది.
ఈ ద్వీపానికి చెందిన వెబ్‌సైట్ ప్రకారం.. ఈ ఆఫర్‌లు ఉద్యోగం కోసం చూస్తున్న వారి కోసం. అనుభవం ఉన్న వారికే ఇక్కడ తొలి ప్రాధాన్యత.. ముఖ్యమైన విషయం ఏమిటంటే.. దంపతులిద్దరికీ ఇంగ్లీషు మాట్లాడడం వచ్చి ఉండాలి. అంతేకాదు ఈ ఉద్యోగానికి ముఖ్యమైన కండిషన్ ఏమిటంటే.. ఇక్కడ ఉన్నన్ని రోజులు ఒక్క రోజు కూడా సెలవు ఇవ్వరు. ఉద్యోగార్ధుల వయస్సు 40 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి.

Credit Cards: క్రెడిట్ కార్డు వాడుతున్నారా..? ఫ్లైట్ టిక్కెట్‌ ఉచితంగా పొందండిలా..!

ప్రస్తుతం అన్ని బ్యాంకులు తమ కస్టమర్లకు సులభంగా క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి. ఆదాయం, ఖర్చులు, క్రెడిట్ స్కోర్ ఆధారంగా వీటిని కస్టమర్లకు జారీ చేస్తారు.
అయితే క్రెడిట్ కార్డులను ఎక్కువగా యూజ్ చేసే వారికి రివార్డ్ పాయింట్లు లభిస్తాయి. వీటిని ప్రయాణాల్లో యూజ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఫ్లైట్లలో లగ్జరీ బిజినెస్ క్లాస్ జర్నీకి ఈ పాయింట్లను రిడీమ్ చేసుకోవచ్చు. ఈ హాలిడేస్ సీజన్‌లో కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లేవారికి ఇవి డబ్బును భారీగా ఆదా చేస్తాయి.

ప్రస్తుతం ట్రావెలింగ్ ఖర్చులు పెరిగాయి. కుటుంబంతో కలిసి బిజినెస్ క్లాస్‌లో ప్రయాణాలు చేసేవారికి ఈ భారం మరింత పెరిగింది. అయితే ట్రావెలింగ్ కాస్ట్‌ను తగ్గించుకునే మార్గాలు ఉన్నాయంటున్నారు అమెరికాకు చెందిన జిమ్మీ, పౌలిన్. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ టిక్‌టాక్‌లో వీరు తమ ట్రావెల్ డైరీని పంచుకుంటూ, నెటిజన్లను ఆకర్షిస్తున్నారు. ట్రావెలింగ్ కాస్ట్‌ను ఎలా తగ్గించుకోవచ్చో వీరు సలహాలు, సూచనలు ఇస్తూ ఇంటర్నెట్లో పాపులర్ అయ్యారు.
ఖర్చులను తగ్గించే మార్గం

న్యూయార్క్ పోస్ట్ రిపోర్ట్ ప్రకారం, జిమ్మీ మిచెల్ మాట్లాడుతూ బిజినెస్ క్లాస్ ట్రావెలింగ్ ఖర్చులను ఎలా తగ్గించుకోవాలో వివరించారు. ఫ్లైట్ సీటు కోసం తాము డబ్బు చెల్లించమని, అందుకు క్రెడిట్ కార్డు రివార్డు పాయింట్లను ఉపయోగిస్తామని జిమ్మీ చెప్పారు. క్రెడిట్ కార్డుల నుంచి పాయింట్లను పొందడానికి ‘పాయింట్ హ్యాకింగ్’ ఉత్తమ మార్గం అని అతడు చెప్పాడు. పాయింట్ హ్యాకింగ్ అనేది.. ఫ్లయర్ పాయింట్లను రిడీమ్ చేయడం, ఆ పాయింట్లను లగ్జరీ ఫ్లైట్ జర్నీల కోసం వినియోగించడం. వ్యక్తులు ట్రావెలింగ్ కోసం చేసే ఖర్చులను ఇలా కవర్ చేసుకొని లబ్ధి పొందుతారు.

మంచి ప్లాన్

“ఒక క్రెడిట్ కార్డుతో $3000 ఖర్చు చేస్తే, కంపెనీ సగటున 1,00,000 రివార్డు పాయింట్లను అందించవచ్చు. అందుకే మీరు క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోండి, లిమిట్‌కు తగ్గట్లు ఖర్చు చేయండి. తర్వాత లక్ష పాయింట్లను పొందండి. ఈ రివార్డు పాయింట్లతో మీరు పెర్త్ నుంచి లాస్ ఏంజెల్స్‌కు బిజినెస్ క్లాస్ టిక్కెట్‌ ఉచితంగా పొందవచ్చు. కొంతమంది వ్యక్తులు 10-12 క్రెడిట్ కార్డులను వాడతారు. రివార్డు పాయింట్లను పొందడానికి, వాటితో ప్రయోజనం పొందడానికి మాత్రమే వాటిని ఉపయోగిస్తారు. అంతకు మించి క్రెడిట్ కార్డులను ఉపయోగించరు.” అని జిమ్మీ టిక్‌టాక్ వీడియోలో చెప్పారు.

ఇది నిజమేనా?

అయితే జిమ్మీ చెప్పినది నిజమేనా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దానికి ఒక టిక్‌టాక్ యూజర్ సమాధానమిచ్చారు. అతడు ‘పాయింట్ హ్యాకింగ్’ గురించి మాట్లాడాడు. బ్యాంకులు, కార్డ్ కంపెనీలు తమ క్రెడిట్ కార్డుల కోసం పాయింట్లను అందిస్తాయి. వెలాసిటీ కంపెనీ 1,20,000 పాయింట్ల వరకు అందిస్తుందని సదరు నెటిజన్ చెప్పినట్లు న్యూయార్క్ పోస్ట్ నివేదించింది. అయితే ముందు పాయింట్ హ్యాకింగ్‌ లాభనష్టాలను తెలుసుకోవాలని, తర్వాత వాటి వినియోగంపై దృష్టి పెట్టాలని ఆ వ్యక్తి సలహా ఇచ్చాడు.

ED Job: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆఫీసర్ అవ్వాలని ఉందా? ఈ డీటెయిల్స్ మీకోసమే

మనం తరచుగా వార్తల్లో ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్)పేరు వింటుంటాం. ప్రధానంగా మనీలాండరింగ్,విదేశీ మారక చట్టాల ఉల్లంఘనలకు సంబంధించిన నేరాలను అరికట్టేందుకు ఈడీ పనిచేస్తుంటది.
అయితే చాలామందికి ఈడీలో జాబ్ చేయాలని కోరిక ఉంటుంది కానీ అసలు ఈడీలోకి ఎలా ఎంటర్ అవ్వాలనేదానిపై అవగాహన తక్కువ ఉంటుంది. ED అధికారులను SSC CGL పరీక్ష ద్వారా నియమిస్తారు. అసిస్టెంట్ ED ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ పరీక్ష ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. ఈ పోస్టుల నియామకం టైర్ 1 మరియు టైర్ 2 అనే రెండు ఎంపిక ప్రక్రియల కింద జరుగుతుంది. అభ్యర్థులు ఈ రెండు శ్రేణి పరీక్షలకు అర్హత సాధించిన తర్వాత, మార్కులు, అర్హత ప్రకారం వారిని నియమించుకుంటారు.

సాధారణంగా, అసిస్టెంట్ ED అధికారులకు దాదాపు రూ. 44900 నుండి రూ. 142400 వరకు జీతం ఇస్తారు. నియమించబడిన తర్వాత, అసిస్టెంట్ ED అధికారులు ప్రధాన కార్యాలయం, జోనల్ కార్యాలయాలు లేదా సబ్-డివిజనల్ కార్యాలయాలలో పోస్ట్ చేయబడతారు.

ED ఆఫీసర్ ఉద్యోగాన్ని ఎలా పొందాలి
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ లేదా రెవెన్యూ డిపార్ట్‌మెంట్ ద్వారా ఏదైనా డిపార్ట్‌మెంట్‌లో ED అధికారి లేదా అసిస్టెంట్ ED అధికారిని నియమిస్తారు. ED అధికారి కావడానికి ఎంపిక ప్రక్రియను SSC నిర్వహిస్తుంది. SSC ఈ పోస్ట్‌లను SSC CGL ద్వారా పునరుద్ధరిస్తుంది.

ED అధికారి కావడానికి వయోపరిమితి ఎంత?

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు అధికారిక వయోపరిమితి 21 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. కానీ రిజర్వ్‌డ్ కేటగిరీకి చెందిన అభ్యర్థులకు కూడా వయస్సులో కొంత సడలింపు లభిస్తుంది. OBCలకు వయోపరిమితి 3 సంవత్సరాలకు పెంచబడింది, అయితే SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, PWDకి 10-15 సంవత్సరాల వయస్సు సడలింపు ఉంటుంది. అయితే మాజీ సైనికులకు వారి సర్వీస్ సంవత్సరాలను 3 సంవత్సరాలకు తగ్గించారు. అదనంగా, జనరల్ కేటగిరీలో ఆపరేషన్ల సమయంలో వికలాంగులైన రక్షణ సిబ్బందికి 3 సంవత్సరాలు పొడిగింపు లభిస్తుంది, అయితే SC/ST కేటగిరీలో ఉన్న వారికి 8 సంవత్సరాల సడలింపు లభిస్తుంది.

ED ఆఫీసర్ ఉద్యోగం పొందడానికి అర్హత

అసిస్టెంట్ ED ఆఫీసర్ తప్పనిసరిగా ఏదైనా రాష్ట్ర గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్శిటీ నుండి కనీస అర్హత మార్కులతో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. ఈ పోస్ట్‌కి ఎంపిక కావడానికి మీకు ఏ ఇతర విద్యార్హత అవసరం లేదు.

ఇలా ఈడీ అధికారులను ఎంపిక చేస్తారు

ఎంపిక ప్రక్రియ రెండు భాగాలుగా నిర్వహించబడుతుంది:

టైర్ 1 ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ప్రధానంగా నాలుగు సబ్జెక్టులపై ప్రశ్నలు అడుగుతారు. వీటిలో జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్,ఇంగ్లీష్ కాంప్రహెన్సివ్ ఉన్నాయి.

టైర్ 2 అభ్యర్థులు పేపర్ 1, పేపర్ 2,పేపర్ 3 అనే 3 పేపర్లలో హాజరు కావాలి. మొదటి పేపర్ అభ్యర్థులందరికీ తప్పనిసరి అయితే రెండవ,మూడవ పేపర్లు ASOలు AAOలకు ఆప్షన్.
ED అధికారి పని

అసిస్టెంట్ ED ఆఫీసర్‌.. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (FEMA), ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA)ని అమలు చేయాలి. రెండు చట్టాలలో ఒక దానిని ఉల్లంఘించే వారి కోసం వెతకాలి. ఏదైనా తప్పు జరిగితే, పోలీసులు అనుమానితులను, కార్లు,ప్రదేశాలను సెర్చ్ చేయవచ్చు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలను కూడా అసిస్టెంట్ ED అధికారులు సెర్చ్ చేయవచ్చు, ఏదైనా అక్రమ నగదు లావాదేవీలు లేదా అదనపు ఆస్తులను కూడబెట్టడం వంటి విషయాల్లో జోక్యం చేసుకుంటారు.

Replace Mattress: పడుకునే పరుపులు పనికిరానివిగా మారాయని ఎలా తెలుస్తుంది.. ఈ విషయాలు గమనించండి..!

Replace Mattress: మనిషి రోజు మొత్తం పనిచేసి అలిసిపోయి ఇంటికి వస్తాడు. ఇలాంటి సమయంలో మంచి నిద్ర మాత్రమే అతడి బాడీని రీఛార్జ్‌ చేస్తుంది. ఒకవేళ నిద్ర సరిగ్గా లేకుంటే మళ్లీ మరునాడు అతడు పనిచేయలేడు.
అందుకే ఇంట్లో పడుకునే బెడ్‌, దానిపై ఉండే పరుపు సరిగ్గా ఉండాలి. లేదంటే నిద్రభంగం జరుగుతుంది. భారతదేశంలో చాలామంది పరుపులను ఏళ్ల తరబడి వాడుతుంటారు. దీనివల్ల నడుం నొప్పి, వెన్ను నొప్పి లాంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఇవి రావొద్దంటే పరుపును సకాలంలో మార్చడం అవసరం. అయితే పరుపు దెబ్బతిందని ఎలా తెలుస్తుందో ఈ రోజు తెలుసుకుందాం.

పరుపులు పాడైపోయినప్పుడు కొన్ని సంకేతాలు ఇస్తాయి. ముందుగా వాటినుంచి చెడువాసన వస్తుంది. ఇలాంటి సమయంలో దానిని మార్చాల్సిన అవసరం ఉందని గుర్తించండి. కొన్నిసార్లు నిద్రలేకపోవడం లేదా పరుపు మొత్తం గుంటలు పడడం అది చెడిపోయిందనడానిక అర్థం. రోజంతా అలసిపోయిన తర్వాత మీకు నిద్ర రాకపోతే వెంటనే పరుపులు మార్చండి.
మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే వెన్ను లేదా నడుము నొప్పి ఉంటే వెంటనే పరుపు కారణమని గుర్తించండి. వెంటనే కొత్తది తెప్పించుకోండి. మనం లేటెస్ట్ ఫోన్‌ని డిమాండ్ చేసినట్లే బెడ్‌పై ఉన్న పరుపుల విషయంలోనూ అలాగే ఉండాలి. నేటికీ భారతదేశంలో ప్రజలు పాత పరుపుపై సంవత్సరాల తరబడి పడుకుంటారు. నిజానికి వాటిని తరచూ మారుస్తూ ఉండాలి.

పరుపును ఎక్కువ రోజులు ఉపయోగించాలంటే ముందుగా దాని కవర్‌ను కొనుగోలు చేయండి. దీని కారణంగా ఇది త్వరగా చెడిపోదు. ఇది కాకుండా ప్రతిరోజూ పరుపును తిప్పి వేసుకోండి. పరుపుకు ఒకే వైపు ఎక్కువ రోజులు పడుకుంటే అది దెబ్బతింటుంది. బెడ్ షీట్లు, కుషన్ల మాదిరిగా మురికి బ్యాక్టీరియా పరుపులో స్థిరపడుతుంది. దానిని తొలగించడానికి పరుపు, బొంతలను 15 రోజులకు ఒకసారి ఎండలో వేయాలి.

పిల్లల ఎత్తు పెరగాలంటే ఈ 5 సూపర్ ఫుడ్స్ ఇవ్వండి

ఆహారం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. చాలా మంది పిల్లలు పొట్టిగా ఉంటారు, ఎంత వ్యాయామం చేసినా వారి ఎత్తు పెరగదు. చాలా సందర్భాలలో, పిల్లలు తినే ఆహారాల వల్ల ఇది సంభవిస్తుంది.
పిల్లల ఎత్తు పెరగడానికి కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు ఇవ్వాలి.

ఎందుకంటే వాటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

పాలు – పిల్లల ఎత్తు పెరగడానికి క్రమం తప్పకుండా పాలు ఇవ్వండి. పాలు తాగడం వల్ల పిల్లల ఎత్తు త్వరగా పెరుగుతుంది, శరీరం కూడా బలపడుతుంది.

గుడ్డు- శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి గుడ్డు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది పిల్లల ఆహారంలో చేర్చాలి. గుడ్లు తినడం వల్ల పిల్లల ఎత్తు కూడా చాలా త్వరగా పెరుగుతుంది.

క్యారెట్- పిల్లలు ప్రతిరోజూ క్యారెట్ తినాలి. ఎందుకంటే క్యారెట్‌లో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఎముకల త్వరిత పెరుగుదలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
సోయాబీన్ – సోయాబీన్‌లో అధిక మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది. ఎత్తు పెంచడం లాభదాయకం.

బీన్స్ – బీన్స్ మన శరీరాన్ని బలపరుస్తాయి, ఎముకలను బలోపేతం చేస్తాయి. బీన్స్‌లో ప్రోటీన్, కాల్షియం, ఫైబర్ మరియు ఐరన్ ఉంటాయి. కాబట్టి బీన్స్ తింటే పిల్లల ఎత్తు పెరుగుతుంది.

Tea Recipe : టీని ఎంతసేపు మరిగిస్తే బాగుంటుంది? ఎక్కువసేపు అయితే హానికరమా?

చాలా మందికి ఇష్టమైన పానీయం టీ. చాలా మంది టీతో తమ రోజును ప్రారంభిస్తారు. టీ తాగకపోతే ఆ రోజు వాళ్లకు ఏదీ తోచదు. టీ అంటే చాలా మందికి ఇష్టం. రోజులో చాలా సార్లు టీ తాగుతారు.
కేవలం ఒక గ్లాసు టీ తాగితే తలనొప్పి పోతుందని నమ్ముతారు. తలనొప్పి వచ్చినప్పుడల్లా టీ తాగుతుంటారు. చాలా మంది టీని ఉత్తేజపరిచే, రిఫ్రెష్‌గా భావిస్తారు. టీ అంటే పిచ్చి ఉన్నవాళ్లు సమయానికి టీ తాగకపోతే నెర్వస్ గా ఫీల్ అవుతారు. అతిగా టీ తాగడం వల్ల దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. టీ తాగే అలవాటును మానుకోవడం అంత సులభం కాదు. అయితే ఇంట్లో టీ చేసేప్పుడు కొన్ని చిట్కాలు పాటించాలి. అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది.

టీ ప్రేమికులు చాలా రకాలుగా ఉంటారు. కొందరు అలసిపోయినప్పుడే టీ తాగుతారు. కొందరు మాత్రం స్ట్రాంగ్ టీ తాగుతారు. కొందరు టీని ఎక్కువ సేపు మరిగించి తాగుతుంటారు. కానీ టీని ఎక్కువ సేపు మరిగించడం చేస్తే శరీరానికి హాని కలుగుతుంది. అందుకే టేస్టీ టీ ఎలా తయారు చేయాలో తెలుసుకోండి.
ముందుగా పాలను మరిగించాలి. ఆ తర్వాత అందులో చక్కెర వేసుకోవాలి. గ్యాస్ మీద నుంచి కిందకు దించడానికి రెండు నిమిషాల ముందు టీ పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. చాలా మంది పాలు పొయ్యి మీద పెట్టగానే టీ పౌడర్ వేస్తారు. కానీ ఇలా చేస్తే టీ రుచిగా ఉండదు. ఎక్కువసేపు మరిగించడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు.

బ్లాక్ టీ చేసే సమయంలోనూ ఇలానే చేయాలి. ముందుగా టీ పొడిని నీళ్లలో వేసి మరిగించాలి. టీ పౌడర్ నీటిలో పడితే, అది రంగు మారుతుంది. నీటి రంగు మారిన రెండు నిమిషాలు మాత్రమే మరిగించాలి. ఇలా చేయడం వల్ల మంచి, బలమైన టీ లభిస్తుంది. టీని అంతకంటే ఎక్కువ సేపు ఉడకబెట్టడం ఆరోగ్యానికి హానికరం అంటున్నారు నిపుణులు. చాలా మంది టీ రుచి కోసం టీ పొడిలో లవంగాలు, యాలకులు కలుపుతారు. ఎక్కువసేపు మరిగిస్తే వీటి వాసన రాదు.
చక్కెర టీ మధుమేహ వ్యాధిగ్రస్తులకు హానికరం. అలాంటి వారు టీ తయారీలో చక్కెరకు బదులు తేనె, బెల్లం వంటివి వాడవచ్చు. ఇది టీని తీయగా, సాధారణ టీ కంటే భిన్నమైన రుచిని తెస్తుంది. అల్లం, ఏలకులు, తులసి టీకి రుచిని జోడిస్తాయి. ఈ పదార్థాలను కలిపి మెత్తగా చేసి వేడినీళ్లలో కలిపితే రుచి బాగుంటుంది. మీకు తులసి టీ నచ్చకపోతే రెండు లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క పొడిని జోడించవచ్చు.

White Hair:తెల్ల జుట్టు శాశ్వతంగా నల్లగా మారాలంటే ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు

White Hair Turn Black Home Remedies:ఈ మధ్య కాలంలో తెల్లజుట్టు సమస్య చాలా చిన్న వయస్సులోనే వచ్చేస్తుంది. దాంతో కంగారు పడిపోయి మార్కెట్ లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు.
అలా వాడటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు.

కొబ్బరి నూనె,ఉసిరి రెండూ కూడా తెల్లజుట్టును నల్లగా మార్చటంలో చాలా బాగా సహాయపడతాయి. పొయ్యి వెలిగించి పాన్ పెట్టి 150 Ml కొబ్బరి నూనెను పోసి దానిలో 12 ఎండు ఉసిరికాయ ముక్కలను వేసి ముక్కలు బాగా ఉడికే వరకు మరిగించాలి. ఈ నూనె చల్లారక వడకట్టి ఓ గాజు సీసాలో నిల్వ చేయాలి.

ఈ నూనెను ప్రతి రోజు రాసుకుంటూ ఉంటె తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారుతుంది. చాలా తక్కువ ఖర్చులో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్లజుట్టు నల్లగా మారుతుంది. ఎండిన ఉసిరి ముక్కలు మార్కెట్ లో లభ్యం అవుతాయి. లేదంటే ఉసిరికాయల సీజన్ లో కాయలను ముక్కలుగా కట్ చేసి ఎండబెట్టి నిల్వ చేసుకుంటే సంవత్సరం పొడవునా నిల్వ ఉంటాయి.
తెల్లజుట్టు నల్లగా మారటమే కాకుండా జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. జుట్టు కుదుళ్ళు బలంగా మారి జుట్టుకు అవసరమైన పోషణ కూడా లభిస్తుంది. కాబట్టి ఈ చిట్కాను ఫాలో అవ్వటానికి ప్రయత్నం చేయండి.

Benefits Of Guava: జామతో దగ్గు, జలుబు, గొంతు నొప్పి నుంచి ఉపశమనం..నమ్మట్లేదా?

Guava in Cough And Cold: చలి కాలంలో ఎక్కువగా లభించే పండ్లలో జామ ఒకటి..వీటిని ప్రతి రోజు తినడం వల్ల శరీరానికి తగిన పరిమాణంలో యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి.
దీంతో పాటు ఇందులో ఉండే గుణాలు శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. అయితే చలి కాలంలో జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడేవారు జామ పండ్లను తినొచ్చా? వీటిని తింటే దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుందా? జామను నీటిలో ఉడకబెట్టి తినడం వల్ల శరీరానికి తగిన పరిమాణంలో విటమిన్‌ సి లభిస్తుంది. దీని కారణంగా దగ్గు, జలుబు నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

జామపండ్ల నుంచి ఎలా ఉపశమనం లభిస్తుంది?
ఉడికించిన జామ తీసుకోవడం వల్ల వాటి నుంచి వచ్చే ఆవిరి శ్వాసనాళాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దీంతో పాటు ఇందులో సహజ చక్కెర పరిమాణాలు లభిస్తాయి. కాబట్టి మధుమేహంతో బాధపడేవారు వీటిని తీసుకోవడం వల్ల కూడా సులభంగా మంచి ఫలితాలు పొందుతారు. తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు, ముఖ్యంగా అలసట ఉన్నవారు ఈ ఉడికించిన జామ పండ్లను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా గొంతు నొప్పి, నిరంతర దగ్గు, చికాకు వంటి సమస్యలను కూడా సులభంగా దూరం చేస్తుంది.
జామలో ఉండే క్వెర్సెటిన్ శరీరానికి చాలా రకాలుగా సహాయపడుతుంది. అంతేకాకుండా ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీవైరల్ లక్షణాలు లభిస్తాయి. ఈ లక్షణాలు జలుబు లక్షణాలను తగ్గించేందుకు కీలక పాత పోషిస్తుంది. అంతేకాకుండా ఇందులో అధిక ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు కూడా ప్రభావంతంగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు రోగనిరోధక శక్తికి పెంచేందుకు కూడా సహాయపడుతుంది. కాబట్టి తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఉడికించిన జామను తీసుకోవాల్సి ఉంటుంది.

జామ పండును ఇలా ఉడికించండి:
ముందుగా జామను చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేయాల్సి ఉంటుంది.
ఆ తర్వాత ఒక పాత్ర తీసుకుని అందులో నీటిని పోసుకుని..ఆ కట్‌ చేసిన ముక్కలను వేసుకోవాల్సి ఉంటుంది.
ఇలా కట్ చేసుకున్న ముక్కలను సుమారు 10-15 నిమిషాలు తక్కువ మంట మీద ఉడికించాలి.
ఇందులోనే బ్లాక్ సాల్ట్‌ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుతన్న తర్వాత తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు.

Income Tax Calendar: ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ కట్టేవారికి అలెర్ట్‌.. ఈ మూడు నెలలు చాలా కీలకం

భారతదేశంలో సంపాదించిన సొమ్ముపై పన్ను కట్టడం అనేది చాలా కీలకం. ముఖ్యంగా నియమిత ఆదాయం దాటిన వారు పన్ను కట్టకపోతే ప్రభుత్వం తీసుకునే చర్యలకు బాధ్యులు కావాల్సి వస్తుంది.
అందువల్ల ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ పేయర్స్‌ పెనాల్టీలు, జరిమానా వడ్డీ, ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్‌) ఫైల్ చేయడం వంటి వాటిని నివారించడంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఇలాంటి వారు గడవు తేదీల విషయంలో చాలా కరెక్ట్‌గా ఉంటారు. అయితే 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన చివరి త్రైమాసికంలో ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఈ మూడు నెలల్లో వచ్చే ముఖ్యమైన గడవు తేదీలపై జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం. కాబట్టి 2023-24ల్లో గడువు తేదీ గురించి వివరాలను తెలుసుకుందాం

జనవరి 2024

జనవరి 7:

డిడక్టర్లు డిసెంబరు 2023కి మూలం వద్ద మినహాయించిన పన్నును, మూలం వద్ద వసూలు చేసిన పన్నును జమ చేయడానికి గడువు తేదీగా ఉంది. జనవరి 7 అనేది సెక్షన్ 192 (జీతాల కోసం) కింద అక్టోబర్-డిసెంబర్ 2023 కాలానికి టీడీఎస్‌ డిపాజిట్ చేయడానికి కూడా జనవరి 7 గడువు తేదీగా ఉంది. సెక్షన్ 194ఏ (సెక్యూరిటీలపై వడ్డీ కాకుండా ఇతర వడ్డీపై), 194ఏ (ఇన్సూరెన్స్ కమీషన్‌పై),, 194 హెచ్‌ (కమీషన్, బ్రోకరేజ్‌పై) జనవరి 7 గడువు తేదీ

జనవరి 14

ఇది సెక్షన్ 194-ఏఏ (వ్యవసాయ భూమిని మినహాయించి స్థిరాస్తిని కొనుగోలు చేసినందుకు చెల్లించిన చెల్లింపుపై టీడీఎస్‌), 194-ఐబీ (రూ. 50,000 దాటిన ఇంటి నెలవారీ అద్దెపై), 194 ఎం కింద టీడీఎస్‌ సర్టిఫికేట్‌లను జారీ చేయడానికి గడువు తేదీగా ఉంది.

జనవరి 15

డిసెంబర్ 31, 2023తో ముగిసే త్రైమాసికానికి డిపాజిట్ చేసిన టీసీఎస్‌ త్రైమాసిక స్టేట్‌మెంట్‌ను ఫైల్ చేయడానికి ఇది చివరి తేదీ.

జనవరి 30

డిసెంబర్ 31, 2023తో ముగిసే త్రైమాసికంలో వసూలు చేసిన పన్నుకు సంబంధించి టీసీఎస్‌ సర్టిఫికేట్‌లను జారీ చేయడానికి చివరి తేదీ జనవరి 30గా ఉంది. అలాగే ఇది సెక్షన్ 194-ఐఏ కింద తీసేసిన టీడీఎస్‌ కోసం చలాన్ స్టేట్‌మెంట్‌ను ఫైల్ చేయడానికి గడువు తేదీగా ఉంది.

జనవరి 31

డిసెంబర్ 31, 2023తో ముగిసే త్రైమాసికానికి డిపాజిట్ చేసిన టీడీఎస్‌ త్రైమాసిక స్టేట్‌మెంట్‌ను ఫైల్ చేయడానికి చివరి తేదీ జనవరి 31, 2024గా ఉంది.

ఫిబ్రవరి 2024

ఫిబ్రవరి 7

జనవరి 2024కి ఇది టీడీఎస్‌/టీసీఎస్‌ డిపాజిట్ చేయడానికి గడువు తేదీ.

ఫిబ్రవరి 14

డిసెంబర్ 2023లో మినహాయించిన పన్ను కోసం సెక్షన్ 194-ఐఏ, సెక్షన్ 194-ఐబీ, సెక్షన్ 194 ఎం కింద టీడీఎస్‌ సర్టిఫికేట్ జారీ చేయడానికి ఫిబ్రవరి 14 గడువు తేదీగా ఉంది.

ఫిబ్రవరి 15

డిసెంబర్ 31, 2023తో ముగిసే త్రైమాసికంలో జీతాలు కాకుండా ఇతర ఆదాయంపై పన్ను మినహాయించే త్రైమాసిక టీడీఎస్‌ సర్టిఫికేట్‌లను జారీ చేయడానికి గడువు ఫిబ్రవరి 15తో ముగియనుంది.

మార్చి 2024

2023-24 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగుస్తున్నందున ఈ నెలలో అనేక గడువులు ఉన్నాయి. ఆదాయపు పన్ను శాఖ నిర్దేశించిన గడువులతో పాటు, 2023-24 ఆర్థిక సంవత్సరానికి వ్యక్తులు తమ పన్ను ఆదా కార్యకలాపాలను ఖరారు చేయడానికి మార్చి 31 గడువుగా పనిచేస్తుంది. ముఖ్యంగా కొత్త పన్ను విధానం ఏప్రిల్ 1, 2023 నుంచి డిఫాల్ట్ ఎంపికగా మారింది. అందువల్ల పాత పన్ను విధానాన్ని ఎంచుకున్న వ్యక్తులు, సెక్షన్ 80 సీ, డీ మొదలైన వాటి కింద మినహాయింపులను క్లెయిమ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న వ్యక్తులు ముగింపునకు ముందు నిర్దిష్ట పెట్టుబడులు, ఖర్చులు చేయాల్సి ఉంటుంది.

మార్చి 2:

జనవరి 2024లో సెక్షన్ 194-ఐఏ, సెక్షన్ 194 ఐబీ, సెక్షన్ 194 ఎం కింద మినహాయించిన పన్ను కోసం చలాన్ స్టేట్‌మెంట్‌ను ఫైల్ చేయడానికి మార్చి 2 గడువు తేదీగా ఉంది.

మార్చి 7

ఫిబ్రవరి 2024లో తీసేసిన టీడీఎస్‌/టీసీఎస్‌ డిపాజిట్ చేయడానికి మార్చి 7 చివరి తేదీగా ఉంది.

మార్చి 15

2023-24 ఆర్థిక సంవత్సరానికి నాలుగో విడత అడ్వాన్స్ ట్యాక్స్ డిపాజిట్ చేయడానికి ఇది చివరి తేదీని సూచిస్తుంది. అలాగే ఊహాజనిత పన్నుల పథకం (సెక్షన్లు 44ఏడీ, 44ఏడీఏకింద) కింద కవర్ చేసిన స్వయం ఉపాధి పొందిన వ్యక్తులు వారి ముందస్తు పన్ను చెల్లింపు చేయడానికి ఇది గడువు తేదీగా ఉంటుంది.

మార్చి 17

జనవరి 2024 కోసం సెక్షన్ 194-ఐఏ, సెక్షన్ 194-ఐబీ, సెక్షన్ 194 ఎం కింద మినహాయించిన పన్ను కోసం టీడీఎస్‌ సర్టిఫికేట్‌లను జారీ చేయడానికి ఇది చివరి తేదీ.

మార్చి 30

ఫిబ్రవరి 2024లో సెక్షన్ 194-ఐఏ, సెక్షన్ 194-ఐబీ, సెక్షన్ 194 ఎం కింద మినహాయించిన పన్ను కోసం చలాన్ స్టేట్‌మెంట్‌ను ఫైల్ చేయడానికి మార్చి 30 గడువు తేదీగా ఉంది.

మార్చి 31

2023-24 ఆర్థిక సంవత్సరానికి పన్ను ఆదా కార్యకలాపాలను ముగించడానికి గడువు సమీపిస్తోంది. పాత పన్ను విధానాన్ని ఎంచుకున్న వ్యక్తులకు ఇది చాలా కీలకం. ఈ గడువును చేరుకోవడం వలన వ్యక్తులు సెక్షన్ 80సీ కింద అర్హులైన పెట్టుబడులు, ఖర్చులలో పాల్గొనడం ద్వారా పన్ను ఆదా ప్రయోజనాలను పొందగలుగుతారు.
మీరు అద్దె నివాసాన్ని కలిగి ఉండి నెలవారీ అద్దె రూ. 50,000 లేదా అంతకంటే ఎక్కువ చెల్లిస్తుంటే ఆర్థిక సంవత్సరంలో చెల్లించిన అద్దెపై టీడీపీ మినహాయించాల్సిన అవసరాన్ని గుర్తుంచుకోవడం చాలా అవసరం. ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం వ్యక్తులు ఇంటిని ఖాళీ చేసిన తర్వాత లేదా ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఇంటి అద్దెపై టీడీఎస్‌ను మినహాయించాల్సి ఉంటుంది.
2020-21 ఆర్థిక సంవత్సరానికి (అసెస్‌మెంట్ ఇయర్ 2021-22) అప్‌డేట్ చేసిన రిటర్న్‌ను ఫైల్ చేయడానికి గడువు సమీపిస్తున్నందున ఈ తేదీ తర్వాత ఎఫ్‌వై 2020-21 కోసం అప్‌డేట్ చేసిన రిటర్న్‌ను ఫైల్ చేయడానికి వ్యక్తులు అనుమతించబడరు. అయితే మార్చి 31లోపు 25 శాతం పెనాల్టీని చెల్లించడం ద్వారా 2021-22 ఆర్థిక సంవత్సరానికి (అసెస్‌మెంట్ ఇయర్ 2022-23) అప్‌డేట్ చేసిన రిటర్న్‌లను ఫైల్ చేయడానికి అవకాశం ఉంది.

Bhakthi: భోగి పండుగ విశిష్టత.. గోదాదేవి కథ..

The specialty of Bhogi festival.. the story of Godadevi..

రేపటి నుండి సంక్రాంతి మొదలవుతుంది. మూడు రోజులు సాగే ముచ్చటైన ఈ పండుగ నేపథ్యంలో ఇప్పటికే ప్రజల సంబరాలు అంబరాన్ని అంటాయి. అయితే మకర సంక్రాంతి భోగి పండుతో మొదలవుతుంది అనే విషయం అందరికి సుపరిచితమే.

అయితే భోగి పండుగ జరుపుకోవడం వెనుక కొన్ని పురాణ కథలు దాగి ఉన్నాయి. ఆ కథల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం తమిళనాడు లోని శ్రీవిల్లిపుత్తూరులో భట్టనాథుడు అనే విష్ణు భక్తుడు ఉండేవాడు. అయితే భట్టనాథుడు ప్రతి నిత్యం క్రమం తప్పకుండా శ్రీ కృష్ణుడికి పుష్పాలను సమర్పించి భక్తి శ్రద్దలతో పూజించేవాడు.

దీనితో అక్కడి వారంతా భట్టనాథుడుని విష్ణుచిత్తుడు అని పిలిచే వారు. (విష్ణుచిత్తుడు అంతే విష్ణువును చిత్తశుద్ధితో ఆరాధించేవాడు అని అర్ధం. ) ఇక అయన భక్తి శ్రద్ధలను చూసిన ప్రజలు ఆయనకు పెరియాళ్వారు అనే బిరుదును కూడా ఇచ్చారు. అయితే ఒకసారి ఆ విష్ణుచిత్తుడు తులసి వనం పెంచాలని నిర్ణయించుకుని తోలసి మొక్కలను నాటడానికి పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది. పిల్లలు లేని తనకు ఆ దైవమే ఆ పాపను ప్రసాదించాడని భావించి ఆ పాపకు కోదై అని పేరుపెట్టి గారాబంగా పెంచుకోసాగాడు. కోదై అంతే తమిళంలో పూలమాల అని అర్ధం. అయితే కోదై అనే పేరు కాలక్రమేణా గోదాగా మారింది.

అయితే చిన్నతనం నుండే శ్రీ కృష్ణుడిని ఆరాధిస్తూ పెరిగింది గోదా. తన వయసు తో పాటుగా గోదా దేవికి శ్రీకృష్ణుని పై ఉన్న భక్తి పెరిగి అది ప్రేమగా మారింది. ఆ ప్రేమ తనను తాను మరిచిపోయేలా చేసింది.. ప్రస్తుతం తాను నివసిస్తున్న విల్లిపుత్తూరే ఒక్కప్పుడు ఆ బాల గోపాలుని గోపాలం(గోకులం) అని, తన స్నేహితురాళ్లంత గోపికలని, తాను గోపాలుని ప్రేయసిని అనుకోవడం ప్రారంభించింది. అప్పటి నుండి విష్ణుమూర్తి కోసం తన తండ్రి విష్ణుచిత్తుడు రోజూ తాయారు చేసే పూల మాలలను మొదటగా తాను ధరించడం మొదలు పెట్టింది.

అయితే ఒకసారి గోదాదేవి అలా దేవుని మాలలు మొదటగా తాను ధరించడం చూసిన ఆమె తండ్రి, ఇన్నాళ్లు తన కూతురు ఇలా మొదట తాను ధరించిన పూల మాలలను ఆ భవంతునికి ధరిస్తున్ననా అనుకుని.. అపచారం చేశానని భాదపడుతూ నిద్రలోకి జారుకున్న విష్ణుచిత్తుడి కలలో ఆ విష్ణుమూర్తి కనిపించి.. తన కుమార్తె గోదాదేవి సాక్షాత్తు భూదేవి అని.. ఆమె ధరించిన మాలలను తనకి ధరించడం వల్ల

ఎలాంటి అపచారం జరగదని.. ఇంకా తాను సంతోషిస్తానని చెప్పారు.

ఇలాంటి ఘటనలతో గోదాదేవి ప్రేమ మరింత పెరిగింది. దీనితో తనకు పెళ్లంటూ జరిగితే అది శ్రీకృష్ణునీతో మాత్రమే జరగాలని దృఢ నిర్ణయం తీసుకున్న గోదాదేవి అత్యంత కష్టమైన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది. అలానే తన స్నేహితురాళ్లను కూడా ఆ వ్రతం ఆచరించేలా ప్రోస్తాహిస్తూ 30 పాశురాలను పాడింది గోదా. ఆ పాశురాలే ప్రస్తుతం ధనుర్మాసంలో ప్రతి వైష్ణవభక్తుని ఇంట్లోనూ వినిపిస్తున్న తిరుప్పావై. ఇక ఆ పరమభక్తురాలు గోదాదేవి భక్తికి, ప్రేమకి ఆ భగవంతుడు కూడా కరగిపోయాడు.

పాత పెన్షన్ పునరుద్ధరణకు తమ వంతు కృషి చేస్తాం

ఖైరతాబాద్ : వృద్ధాప్యంలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఎంతగానో దోహదపడే పాత పెన్షన్ ను సమిష్టిగా కృషి చేసి పునరుద్ధరించుకుందామని రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు పేర్కొన్నారు.

సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో పాత పెన్షన్ సాధన సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ కోదండరాం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ మల్లు రవి, సాధన సమితి కో-ఆర్డినేటర్ కృష్ణమూర్తి, వివిధ జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులు, ఉద్యోగులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ ఎంతో శ్రమించి ప్రభుత్వ ఉద్యోగాన్ని పొంది సుమారు 30 ఏళ్ల పాటు విధులు నిర్వహించిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు పెన్షనే కీలకమని అన్నారు. జీవిత చరమాంకంలో ఓవైపు వృద్ధాప్యం మరోవైపు పెరిగిన ధరలకు అనుగుణంగా రావాల్సిన పెన్షన్ సక్రమంగా రాకపోతే తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని అన్నారు. కంట్రీబుటరి పెన్షన్ విధానం ఉద్యోగ, ఉపాధ్యాయులకు భరోసా ఇవ్వడంలేదని, ఎన్నేళ్లు పనిచేసినా వృద్ధాప్యంలో తమ జీవితాలు ఎలా వెళ్లదీయాలని భయాందోళనకు గురికావాల్సి వస్తుందన్నారు. ఈ నేపథ్యంలో నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి పాత పెన్షన్ విధానాన్నిప్రవేశపెట్టడం ద్వారా ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఎంతో భరోసా ఉంటుందని అన్నారు. మల్లు రవి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకునేలా తమ వంతు కృషి చేస్తామని, ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తూ పాత పెన్షన్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయ నాయకులు కురుమన్న యాదవ్, సాయిబాబు, స్వామి, బాలచెనయ్య, కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మీ లక్ష్యాలను చేరుకోవడానికి ఉత్తమ మార్గాలు..

సక్సెస్ ఫుల్ లైఫ్ ఎంజాయ్ చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ, కొన్ని పొరపాట్ల కారణంగా అనుకున్న విజయాన్ని దక్కించుకోడంలో విఫలమవుతారు.
అయితే.. మీ లక్ష్యాలను చేరుకోవాలంటే ఈ మార్గలను అనుసరించండి. సక్సెస్ మీ వెంటే ఉంటుంది.

– జీవితంలో ఏదైన ఒక గోల్, లేదా పనిని ఎంచుకున్నప్పుడు దానిపై స్థిరంగా ఉండగలగాలి.

– మీరు దేనిమీదైతే నైపుణ్యం కలిగి ఉంటారో ఆ దిశగా అడుగులు వేసినట్లయితే సక్సెస్ మీ వెంట ఉంటుంది.

– ఏదైనా చేయగలం అని మీ మీద మీకు నమ్మకం ఉన్నట్లు అయితే విజయం సాధించ గలుగుతారు.

– ఏ వ్యక్తికి అయిన కొన్ని లక్ష్యాలు అవసరం. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా గోల్స్ పెట్టుకున్న వాళ్లే జీవితంలో ముందుకు వెళ్లగలుగుతారు.

– మనం ఒక దారిని ఎంచుకున్నప్పుడు ఖచ్చితంగా ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. వాటిని దాటుకుని ముందుకెళ్లే మనోధైర్యం ఉండాలి.
– ఒక పని ప్రారంభించినప్పుడు ఇది అవుతుందా, అవ్వదా అని అనుకోకుండా.. ఓ సవాలుగా పూర్తి చేయగలగాలి.
– నువ్వు ఒక టార్గెట్ అనుకుప్పుడు.. మొదటగా దాన్నే ‘ఎందుకు’ ఎంచుకున్నానని నీకు నువ్వే ప్రశ్నించుకోవాలి. క్లారిటీ వచ్చాకే గోల్స్ నిర్ణయించుకోవాలి.

ఆరోగ్యవంతమైన జీవితం మరియు దీర్ఘాయువు కోసం చాణక్యుడి సూత్రం ఇదే..!

చాణక్యుని నీతిలో ఇటువంటి అనేక సూత్రాలు ఉన్నాయి, వాటిని స్వీకరించి సాధించవచ్చు.
ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని ప్రత్యేక విషయాలను కూడా ఆయన ప్రస్తావించారు.
మనకు తెలిసినట్లుగా, మంచి ఆరోగ్యం మనిషి యొక్క గొప్ప సంపద. ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉంటే, అతను జీవితంలో అన్ని విజయాలు సాధించగలడు. కాబట్టి, మనం ఎల్లప్పుడూ మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.

ఈ రోజుల్లో మనిషి శరీరం వ్యాధులకు నిలయంగా మారింది. మానవులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆచార్య చాణక్యుడు చెప్పిన కొన్ని విషయాలను గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా ఆరోగ్యంగా జీవించవచ్చు. ఆరోగ్యం గురించి చాణక్యుడు ఏం చెప్పాడో చూద్దాం.

ఆహారం మరియు నీరు

ఆహారం జీర్ణం కానప్పుడు నీరు తాగడం ఔషధం లాంటిది. ఆహారం జీర్ణమైన అరగంట తర్వాత నీరు తాగడం శరీరానికి మంచిదని భావిస్తారు. భోజనాల మధ్య తక్కువ నీరు త్రాగడం అమృతం లాంటిది. ఇదిలా ఉంటే తిన్న వెంటనే నీళ్లు తాగడం విషం లాంటిది. కాబట్టి మీరు భోజనం చేసేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి. ఇది మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.

మంచి ఆహారాలు

పొడి ఆహారం కంటే పొడి ఆహారం ఎక్కువ పోషకమైనది. పొడి ధాన్యాల కంటే పాలు 10 రెట్లు ఎక్కువ ప్రయోజనకరమైనవి. ఇంతలో, మాంసం పాలు కంటే 10 రెట్లు ఎక్కువ పోషకమైనది. మాంసం కంటే నెయ్యి 10 రెట్లు ఎక్కువ పోషకమైనది అని చాణక్యుడు చెప్పాడు. ఇవన్నీ మీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

ఈ శరీర భాగం చాలా ముఖ్యమైనది

అన్ని ఆనందాలలో ఆహారం గొప్పది. ఆహారం తీసుకోవడం వల్ల మనసుకు ప్రశాంతత కూడా లభిస్తుంది. శరీరంలోని అన్ని ఇంద్రియాలలో కళ్ళు చాలా ముఖ్యమైనవి. అన్ని అవయవాలలో మెదడు చాలా ముఖ్యమైనదని చాణక్యుడు చెప్పాడు.

శరీర మసాజ్

చాణక్యుడు ప్రకారం, మంచి ఆరోగ్యం మరియు ఆరోగ్యకరమైన శరీరం కోసం మీరు వారానికి ఒకసారి పూర్తి శరీర మసాజ్ చేయాలి. ఇది రంధ్రాలను తెరుస్తుంది మరియు లోపల ఉన్న మురికి బయటకు వస్తుంది. మసాజ్ తర్వాత మీరు స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

ధాన్యం వినియోగం

ఆరోగ్యంగా ఉండాలంటే తృణధాన్యాలు తీసుకోవాలి. ధాన్యాలు తినడం వల్ల మనిషి శక్తివంతం అవుతాడు మరియు జీర్ణవ్యవస్థ బలపడుతుంది. బలమైన జీర్ణవ్యవస్థ ఉన్న వ్యక్తి ఆరోగ్యంగా ఉంటాడు.

పాల వినియోగం

పాలు తాగడం ఆరోగ్యానికి మంచిది. ధాన్యాల కంటే పాలు పదిరెట్లు బలమైనవి. రోజూ పాలు తీసుకోవడం వల్ల మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. పాలు తీసుకోవడం ఎముకలకు మేలు చేస్తుంది.

నెయ్యి వినియోగం

పాల కంటే నెయ్యి ఎక్కువ మేలు చేస్తుంది. రోజూ క్రమం తప్పకుండా నెయ్యి తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. వ్యాధులకు దూరంగా ఉండాలంటే రోజూ నెయ్యి సేవించాలి.

Health

సినిమా