Monday, December 15, 2025

కొత్త లేబర్ కోడ్స్‌తో టేక్ హోమ్ శాలరీ తగ్గుతుందా? పీఎఫ్ డిడక్షన్ ఎలా ఉంటుంది? క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.

కేంద్ర ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి 29 పాత కార్మిక చట్టాలను కలిపి మొత్తం నాలుగు చట్టాలుగా మార్చింది. ఈ మేరకు నూతన లేబర్ కోడ్స్ అమల్లోకి తెచ్చింది.

వేతనాల కోడ్- 2019, సామాజిక భద్రత కోడ్- 2020, పారిశ్రామిక సంబంధాల కోడ్- 2020, వృత్తి భద్రత,ఆరోగ్య, పని పరిస్థితుల కోడ్- 2020 అనే నాలుగు కొత్త లేబర్ కోడ్‌లను అమల్లోకి తెచ్చింది.

కొత్త లేబర్‌ కోడ్స్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో టేక్ హోమ్ శాలరీ తగ్గుతుందా? అనే విషయంపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేసింది.

” PF డిడక్షన్ చట్టబద్ధమైన వేతన పరిమితిలో ఉంటే కొత్త లేబర్ కోడ్‌లు టేక్ హోమ్ శాలరీని తగ్గించవు. PF డిడక్షన్‌లు రూ.15,000 వేతన పరిమితిపై ఆధారపడి ఉంటాయి , ఈ పరిమితికి మించి చేసిన కాంట్రిబ్యూషన్స్ స్వచ్ఛందంగా ఉంటాయి, తప్పనిసరి కాదు ” అని పోస్టులో పేర్కొంది. దీనితో పాటు కొత్త లేబర్ కోడ్స్ ద్వారా మరికొన్ని ప్రయోజనాలు ఉద్యోగులకు లభించనున్నాయి.

ఒకే సంవత్సరానికి గ్రాట్యుటీ
కొత్త లేబర్ కోడ్స్ ప్రకారం, గ్రాట్యుటీ విషయంలో కూడా కీలక మార్పులు ఉంటాయి.పాత నిబంధనల ప్రకారం ఒక ఉద్యోగి కనీసం 5 సంవత్సరాలు పనిచేసినప్పుడే గ్రాట్యుటీ పొందేందుకు అర్హత పొందుతాడు.అయితే కొత్త లేబర్ కోడ్ ప్రకారం, ఫిక్స్‌డ్ టర్మ్ ఎంప్లాయిస్(FTE) ఒక సంవత్సరం పనిచేసినా సరే గ్రాట్యుటీ పొందే అవకాశం ఉంది. అంతే కాదు సెలవులు, మెడికల్,సోషల్ సెక్యూరిటీ వంటి పర్మనెంట్ వర్కర్స్ పొందే అన్ని రకాల ప్రయోజనాలు వీరు కూడా పొందవచ్చు.

కొత్త లేబర్ కోడ్‌ల ప్రకారం, దేశవ్యాప్తంగా ఉన్న 40 ఏళ్లు పైబడిన ఉద్యోగులకు ఉచితంగా హెల్త్ చెకప్‌లు పొందవచ్చు. కొత్త లేబర్ కోడ్‌ల ప్రకారం, ఉద్యోగుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం వార్షిక ఆరోగ్య పరీక్షలకు సంబంధించిన నియమాలలో పెద్ద మార్పులను చేసింది. గతంలో, ఉద్యోగులకు సంవత్సరానికి ఒకసారి ఉచిత హెల్త్ చెకప్ అనేది చట్టపరంగా తప్పనిసరి కాదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం 40 ఏళ్లు పైబడిన ఉద్యోగులందరికీ సంవత్సరానికి ఒకసారి ఉచిత హెల్త్ చెకప్‌లను తప్పనిసరి చేసింది. దీని ద్వారా ఉద్యోగులకు సంబంధించిన వ్యాధులు లేదా ఏవైనా ఆరోగ్య సంబంధిత సమస్యలను సకాలంలో గుర్తించవచ్చు. ఉద్యోగుల ఆరోగ్యాన్ని కాపాడే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకుంది.

ఇది ఎవరికి వర్తిస్తుంది?
కాంట్రాక్ట్ వర్కర్క్, మైనింగ్ విభాగంలో పనిచేసే ఉద్యోగులకు, ప్రమాదకరమైన పరిశ్రమ కార్మికులు, డాక్ వర్కర్స్ వంటి ఉద్యోగులకు ఈ హెల్త్ చెకప్ సంవత్సరానికి ఒకసారి తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది.

రాత్రి నిద్రలో కాలు నరాలు లాగుతున్నాయా..?? దీనికి గల కారణం

రాత్రి నిద్రలో కాలు నరాలు అకస్మాత్తుగా లాగుతున్నాయా (తొడ లేదా పిక్క కండరాలు పట్టేస్తున్నాయా)? దీనికి పరిష్కారం ఏమిటి?

నిద్రలో కాళ్ళలో కండరాల తిమ్మిరి (Calf muscle cramps) రావడానికి చాలా కారణాలు ఉండవచ్చు…

పగలంతా ఎక్కువగా నడవడం, పరిగెత్తడం లేదా ఎక్కువసేపు నిలబడటం వంటి కారణాల వల్ల కండరాలు అలసిపోతాయి. రాత్రిపూట అవి హఠాత్తుగా లాగేస్తాయి (పట్టేస్తాయి). కాళ్ళను ఎక్కువసేపు ఒకే స్థితిలో ఉంచి నిద్రిస్తే రక్త ప్రసరణ తగ్గుతుంది – ఇది కూడా తిమ్మిరిని కలిగిస్తుంది.

కాళ్లు కొంచెం కూడా కదలకుండా కూర్చుని పనిచేయడం, ప్రయాణం చేయడం కూడా రాత్రిపూట కండరాల తిమ్మిరిని కలిగించవచ్చు. తగినంత నీరు తాగకపోవడం, పొటాషియం పోషక లోపం వంటివి కారణాలుగా చెబుతున్నారు.

అయితే, చాలావరకు ఇటువంటి కండరాల తిమ్మిరి నిద్రిస్తున్నప్పుడే ఎందుకు వస్తుంది అని అడిగితే… (నా అనుభవంలో నాకు తెలిసిన ఒక ఆలోచనను చెబుతున్నాను).

చిన్నతనంలో నిద్రపోయే సమయంలో మన పక్కన పడుకున్న సోదరుడి దగ్గర నుంచి (నిద్రలో) ఎన్ని దెబ్బలు, తన్నులు తిని ఉంటాం లేదా వాడికి ఇచ్చి ఉంటాం… నేను ఇది ఎందుకు చెబుతున్నానంటే… నిద్రపోయేటప్పుడు ఒక వ్యక్తి కదలిక లేకుండా నిశ్శబ్దంగా ఉన్నట్లు కనిపించినా, కొన్నిసార్లు నిద్రలో అతని కదలికలు వేగంగా, బలంగా, ఆందోళనగా ఉంటాయి. ఆంగ్లంలో దీనిని స్లీప్ మూవ్‌మెంట్ ఇంటెన్సిటీ (నిద్రలో అధిక కదలికలు) అంటారు. నిద్రలో ఒక వ్యక్తి యొక్క కదలికలు కొన్నిసార్లు వేగంగా మరియు బలవంతంగా (jerky & forceful) ఉంటాయి.

ఉదాహరణకు, ఒక వ్యక్తి నిద్రలో తనను తాను గోకుతున్నట్లయితే, అది కాస్త గట్టిగా ఉంటుంది, ఉదయం చూసినప్పుడు చిన్న గోరు గీతలు కూడా ఉండవచ్చు. దీనికి కారణం నిద్రలో సహజ స్థాయి కంటే ఎక్కువ కదలిక ఉండటమే.

అదేవిధంగా, రోజంతా పనిచేసి కండరాలు అలసిపోయిన స్థితిలో… రాత్రి ఎక్కువసేపు కాలు మడచి నిద్రించే వ్యక్తి అకస్మాత్తుగా వేగంగా కాళ్ళ వేళ్ళను గరిష్టంగా మడచడం లేదా చాచడం చేస్తాడు, దీనివల్ల అతని కాలు కండరాలు సంకోచించి (చురుక్కుమని)పిక్క కండరాల తిమ్మిరి (calf muscle cramps) ఏర్పడుతుంది. సాధారణంగా ఉన్నదాని కంటే నిద్రలో మన కదలికలు కొన్నిసార్లు వేగంగా, బలంగా ఉండటమే దీనికి కారణం (కావచ్చు… ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే).

ఇదే కండరాల సంకోచం మేల్కొని ఉన్నప్పుడు కూడా జరుగుతుంది. కానీ మనం మేల్కొని ఉన్నప్పుడు శరీర స్థితిని వెంటనే మార్చుకుంటాము. అందువల్ల ఆ సంకోచం తేలికపడిపోతుంది. కానీ నిద్రలో వెంటనే స్థితిని మార్చుకోలేకపోవడం వల్ల, ఆ సంకోచం పూర్తిగా పనిచేసి కండరాల తిమ్మిరి చాలా తీవ్రంగా అనిపిస్తుంది.

  • మొదటి చిత్రం – కాలు కండరం సాధారణ స్థితిలో ప్రశాంతంగా ఉంది.
  • రెండవ చిత్రం – కాలు వంగినప్పుడు (నిద్రలో కాళ్ళను వేగంగా ముందుకు తోసినప్పుడు) కండరం సంకోచిస్తుంది.
  • మూడవ చిత్రం – కండరం సంకోచించిన తర్వాత కూడా వదలకుండా ఉంటుంది. అందుకే నొప్పి వస్తుంది.

అప్పుడప్పుడు వచ్చే ఇటువంటి కండరాల తిమ్మిరి చాలా తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది.

ఈ బాధ కొన్ని సెకన్ల పాటు లేదా కొన్ని నిమిషాల వరకు ఉండవచ్చు. తక్షణ పరిష్కారం:

ఆ సమయంలో కాలు కదలకుండా ఉంచితే, కొన్ని సెకన్లలో అదే తగ్గిపోతుంది. తిమ్మిరి కొనసాగితే… పాదాన్ని నిటారుగా ఉంచి, కాలి వేళ్ళను నెమ్మదిగా మీ వైపు లాగండి (రెండవ చిత్రంలో ఉన్నదానికి వ్యతిరేక దిశలో). ఇది కండరాన్ని సాగదీసి (stretch చేసి) తిమ్మిరిని తొలగిస్తుంది. తిమ్మిరి తగ్గిన తర్వాత కూడా నొప్పి ఉంటే, వేడి నీటితో కాపడం ఇవ్వడం, నొప్పి నివారణ ఆయింట్‌మెంట్లు ఉపయోగించడం ఫలితం ఇస్తుంది.

శాశ్వత పరిష్కారం వంద శాతం లేనప్పటికీ… రోజూ తగినంత నీరు తాగడం, తరచుగా కొబ్బరి నీరు తాగడం, పొటాషియం, మెగ్నీషియం ఉన్న ఆహారాలను (అరటిపండ్లు, నట్స్ వంటివి) తీసుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుంది.

కండరాల తిమ్మిరి తరచుగా వస్తున్నట్లయితే, వైద్యుడిని సంప్రదించి సలహా తీసుకోవడం ఉత్తమం.

ఇంట్లో దోరికేదేగా అని తీసిపడేసేరు.. డయాబెటిస్ సహా ఆ సమస్యలను తరిమికొట్టే ఛూమంత్రం

యాబెటిస్ అనేది దీర్ఘకాలిక వ్యాధి.. మధుమేహం చాలా కాలం పాటు రక్తంలో అధిక చక్కెర స్థాయిల వల్ల కలిగే వ్యాధి. క్లోమం ద్వారా ఇన్సులిన్ హార్మోన్ విడుదల ఆగిపోతుంది లేదా తక్కువగా విడుదల అవుతుంది.

కార్బోహైడ్రేట్ ఆహారాల వినియోగం నుండి పొందిన గ్లూకోజ్ శక్తిగా మార్చబడదు. ఇది రక్తంలోనే ఉంటుంది. దీని కారణంగా, ఒక వ్యక్తి తన రోజువారీ పనికి చాలా ముఖ్యమైన శక్తిని పొందలేకపోతుంటాడు.. డయాబెటిస్ కు జీవితకాల నిర్వహణ అవసరం.. ప్యాంక్రియాస్ తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయనప్పుడు లేదా శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించుకోనప్పుడు ఇది వస్తుంది.

డయాబెటిక్ రోగులకు రక్తంలో చక్కెరను నియంత్రించడం అంత సులభం కాదు. దీని కోసం, డయాబెటిక్ రోగులు వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీరు డయాబెటిక్ అయితే.. రక్తంలో చక్కెరను నియంత్రించాలనుకుంటే, మీరు ఏలకులు తినవచ్చు. అనేక అధ్యయనాల ఫలితాలు యాలకులకు రక్తంలో చక్కెరను నియంత్రించే సామర్థ్యం ఉందని చూపించాయి.

వాస్తవానికి వంటకాల రుచిని పెంచడానికి మసాలా దినుసు యాలకులను ఉపయోగిస్తారు. ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. దీని వినియోగం మలబద్ధకం, రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధుల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. ncbi.nlm.nih.govలో ప్రచురించబడిన పరిశోధనలో యాలకులను వివరంగా అధ్యయనం చేశారు. ఈ పరిశోధన డయాబెటిక్ రోగులకు యాలకులు ప్రయోజనకరంగా ఉంటుందని నిరూపించింది.

ఈ అధ్యయనంలో టైప్ 2 డయాబెటిస్ ఉన్న 80 మంది రోగులు పాల్గొన్నారు. ఈ వ్యక్తులు పది వారాల పాటు భోజనం తర్వాత ప్రతిరోజూ 3 గ్రాముల ఏలకులు తినాలని సూచించారు. ఈ అధ్యయనం రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో ఏలకులు ప్రభావవంతంగా ఉంటుందని చూపించింది. డయాబెటిక్ రోగులు భోజనం తర్వాత ప్రతిరోజూ కనీసం 3 గ్రాముల ఏలకులు తినాలి. ఇది రక్తంలో చక్కెరను నియంత్రణలో ఉంచుతుంది.

యాలకులు ఎలా తినాలి?

యాలకుల పోషక ప్రయోజనాలను పొందడానికి ఉత్తమ మార్గం ఏమిటంటే, 4 నుండి 5 యాలకులను తొక్క తీసి రాత్రంతా 1 లీటరు నీటిలో నానబెట్టడం. మరుసటి రోజు ఉదయం, ఈ నీటిని మరిగించి, వడకట్టి, ఒక గిన్నెలో పోయాలి. కొంచెం చల్లబరచండి.. ఆ తర్వాత ఉదయం ఖాళీ కడుపుతో త్రాగండి. లేదా, నల్ల యాలకుల గింజలను నమిలి తినండి.

బరువు తగ్గడానికి యాలకులు:

బరువు తగ్గడానికి మీరు యాలకులను కూడా ఉపయోగించవచ్చు. దీనిలోని ఫైబర్ మీ జీవక్రియను పెంచుతుంది. ఇది మీ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మీరు బరువు తగ్గాలనుకుంటే, ప్రతి ఉదయం నిద్రలేచిన వెంటనే ఖాళీ కడుపుతో యాలకుల నీరు త్రాగాలి.

జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.

యాలకులలో ఉండే ఫైబర్ మీ జీర్ణవ్యవస్థకు కూడా మేలు చేస్తుంది. ఇది ఆహారం సరిగ్గా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. కడుపు సమస్యలను నివారిస్తుంది. మీరు మలబద్ధకంతో బాధపడుతుంటే, యాలకులు తినడం వల్ల మీకు ఉపశమనం లభిస్తుంది.

రక్తపోటు అదుపులో ఉంటుంది.

యాలకులలో పొటాషియం లభిస్తుంది. అటువంటి పరిస్థితిలో, యాలకుల నీరు తీసుకోవడం వల్ల మీ రక్తపోటు నియంత్రణలో సహాయపడుతుంది. ఇది మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను పెంచదు. గుండె సంబంధిత అన్ని వ్యాధుల నుండి మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతుంది.

చక్కెర స్థాయిలు కూడా పెరగవు..

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో యాలకుల నీరు సహాయపడుతుంది. మీరు డయాబెటిస్‌తో బాధపడుతుంటే, ఇది మీకు చాలా ప్రభావవంతంగా ఉంటుందని పేర్కొంటున్నారు.. అయితే.. చక్కెర స్థాయిలు పెరిగితే.. వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.

భారత్ కు క్యూ కడుతున్న కంపెనీలు.. అమెజాన్ భారీ పెట్టుబడులు..10 లక్షల ఉద్యోగాలు

మెరికా కంపెనీలన్నీ భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇండియా నుంచి ఉద్యోగస్థులను తీసుకెళ్ళడం కాదు…అక్కడే వారికి ఉద్యోగాలు ఇస్తామని చెబుతున్నాయి.

నిన్న మైక్రోసాఫ్ట్ ఏఐ మీద బారత్ లో ఇన్వెస్ట్ చేసేందుకు ముందు వచ్చింది. ఇప్పుడు అమెజాన్ వంతు. భారత్ లో ఈ దిగ్గజ ఈ కామర్స్ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధం అయింది. 2030 నాటికి ఇండియాలో వివిధ వ్యాపారాల్లో దాదాపు 35 బిలియన్ డాలర్లు అంటే రూ. 3.14 లక్షల కోట్లు పెట్టుబడులు పెడతామని అమెజాన్ ప్రకటించింది. వ్యాపార విస్తరణతో పాటూ ఉపాధి కల్పన కోసం ప్రణాళికలు రచిస్తామని చెప్పింది. ఢిల్లీలో జరిగిన అమెజాన్ సంభవ్ సమ్మిట్‌లో దీనికి సంబంధించి ప్రకటనను చేసింది. వచ్చే 5ఏళ్ళల్లో 10 లక్షల ఉద్యోగాలను కల్పించడమే తమ లక్ష్యమని చెప్పింది. గడిచిన 15 సంవత్సరాల కాలంలో భారత్‌లో అమెజాన్ సంస్థ 40 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టినట్లు తెలిపింది.

ఏఐ, డిజటలైజేషన్ లక్ష్యంగా..

భారత్‌లోని విస్తృత డిజిటల్, ఆర్థిక ప్రాధాన్యతలకు అనుగుణంగా ఏఐ ఆధారిత డిజిటలైజేషన్, ఉద్యోగాల సృష్టి, ఎగుమతుల్లో వృద్ధి లక్ష్యంగా ఈ పెట్టుబడులను పెడతామని అమెజాన్ చెబుతోంది. ఈ సంస్థ ఇప్పటి వరకు భారత్ లో 12 లక్షల వ్యాపారాలను డిజిటలైజ్ చేసిందని..2024లో దాదాపు 2.8 మిలియన్ల మందికి ప్రత్యక్ష, పరోక్ష, సీజనల్ వారీగా ఉపాధి అవకాశాలు కల్పించినట్లు చెప్పింది. 2030 నాటికి మరిన్ని పెంచడమే లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపింది. గడిచిన 15 సంవత్సరాల్లో భారత్ డిజిటల్ ప్రయాణంలో మేము భాగమైనందుకు సంతోషంగా ఉంది. మా కంపెనీ వృద్ధి అనేది భారత ప్రభుత్వ ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగానే ఉందని అమెజాన్ నిర్వాహకులు చెప్పారు. భారత్‌లో చిన్న వ్యాపారాలకు డిజిటల్ మౌలిక సదుపాయాలను అందించడం, లక్షలాదిగా ఉద్యోగాలు సృష్టించడం, మేడ్ ఇన్ ఇండియాను ప్రపంచ వ్యాప్తంగా తీసుకెళ్లే దిశగా భారీగా పెట్టుబడులు ఇప్పటికే పెట్టామని..భవిష్యత్తులో ఆ దిశగా మరిన్ని పెడతామని అమెజాన్ ఎమర్జింగ్ మార్కెట్స్ సీనియర్ ఉపాధ్యక్షుడు అమిత్ అగర్వాల్ తెలిపారు.

 

ఏం ఫోన్ భయ్యా ఇది.. కేవలం రూ.12 వేలకే లాంచ్.. ఫీచర్లు చూస్తే మతిపోతుంది..

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ పోకో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో తాజాగా లాంచ్ చేసింది. సీ సీరిస్‌ వెర్షన్లలో భాగంగా పోకోసీ 85 5జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది.

పెద్ద డిస్‌ప్లేతో పాటు ఫాస్ట్ ఛార్జింగ్, ఎక్కువ గంటలపాటు మ్యూజిక్ ప్లేబ్యాక్‌తో పాటు అనేక అదిరిపోయే ఫీచర్లు ఈ ఫోన్‌లో అందుబాటులో ఉన్నాయి. అత్యంత తక్కువ ధరకే ఈ ఫోన్ వస్తోంది. ఈ ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయో చూద్దాం.

6.9-అంగుళాల HD+ డిస్‌ప్లే, MediaTek Dimensity 6300 చిప్‌సెట్‌తో ఈ ఫోన్ రూపొందించారు. 6,000mAh బ్యాటరీ సామర్థ్యం ఉంది. ఇక 106 గంటలకు పైగా మ్యూజిక్ ప్లేబ్యాక్‌ వస్తుందని కంపెనీ చెబుతోంది. అలాగే 33W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్, 10W వైర్డు రివర్స్ ఛార్జింగ్‌ సపోర్ట్ ఈ ఫోన్‌లో లభిస్తుంది.

ఈ ఫోన్ బేస్ వేరియెంట్ 4 జీబీ ర్యామ్ + 128 జీబీ ప్రారంభ ధర రూ.11,999గా ఉంది. ఇక 6 జీబీ ర్యామ్ + 128 జీబీ వేరియెంట్ ధర రూ.12,999గా ఉండగా.. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ ధర రూ. 14,499గా కంపెనీ నిర్ణయించింది. డిసెంబర్ 16 నుంచి ఈ ఫోన్ సేల్స్ ప్రారంభం కానున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ కొనుగోలు చేయొచ్చు. మిస్టిక్ పర్పుల్, స్ప్రింగ్ గ్రీన్, పవర్ బ్లాక్ కలర్ ఆఫ్షన్లతో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది.

డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. 50-మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్, QVGA కెమెరా ఉన్నాయి. ఇక 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా హైపర్‌ఓఎస్ 2.2పై ఈ ఫోన్ పనిచేస్తుంది. రెండుసార్లు ఆండ్రాయడ్ అప్‌గ్రేడ్, నాలుగు సంవత్సరాలు సెక్యూరిటీ అప్‌గ్రేడ్‌లను అందించనుంది.

ఈ ఫోన్‌కు ఐపీ 64 రేటింగ్ ఉంది. అంటే మీ ఫోన్‌ను దుమ్ము, వాటర్ నుంచి రక్షిస్తుంది. ఇక 8జీబీ వరకు LPDDR4x RAM, 128GB UFS 2.2 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌ ఉంది. మైక్రో ఎస్డీ కార్డుతో మీరు దీనిని విస్తరించుకోవచ్చు.

 

రైళ్లల్లో ఉచిత వాటర్ బాటిల్ బంద్..! రైల్వేశాఖ ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది

రోనా తర్వాత రైళ్లల్లో భారతీయ రైల్వే అనేక మార్పులు తీసుకొచ్చింది. ముఖ్యంగా ఫుడ్ సర్వీసుల విషయంలో కీలక మార్పులు చేసింది. గతంలో ప్రీమియం ట్రైన్లలో ఫుడ్‌ను ట్రైన్ టికెట్‌తో పాటే అందించేవారు.

కానీ కరోనా తర్వాత ప్రయాణికులు టికెట్‌తో పాటు ఫుడ్‌ను ప్రత్యేకంగా ఎంచుకోవాల్సి ఉంటుంది. ఫుడ్ కావాలా..? వద్దా? అనేది ఎంచుకునే ఆప్షన్‌ను ప్రయాణికులకే ఐఆర్‌సీటీసీ వదిలేసింది. ఈ ఆప్షన్ రాజథాని, శతాబ్ది, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ లాంటి ప్రీమియం రైళ్లల్లో అమలు చేస్తున్నారు. మీరు ఫుడ్ ఆఫ్షన్‌ను ఎంచుకుంటే టికెట్‌తో పాటు డబ్బులు వసూలు చేస్తారు. అదే వద్దనుకుంటే ఛార్జీ నుంచి ఫుడ్ ఆప్షన్‌ను తొలగిస్తారు.

ఉచిత వాటర్ బాటిల్ ఉండదా..?

అయితే ఫుడ్ ఆప్షన్‌ను ఎంచుకునే అవకాశం ప్రయాణికులకే వదిలేయడంతో ప్రీమియం రైళ్లల్లో ఫ్రీ లీటర్ వాటర్ బాటిల్ అందిస్తారా.. లేదా అనే దానిపై ప్రయాణికుల్లో అయోమయం నెలకొంది. నో ఫుడ్ ఆఫ్షన్ ఎంచుకుంటే వాటర్ బాటిల్ ఇవ్వరనే ప్రచారం జరగుతోంది. ఈ క్రమంలో దీనిపై ఐఆర్‌సీటీసీ అధికారులు క్లారిటీ ఇచ్చారు. మీల్ ఆప్షన్ ఎంచుకున్నా.. ఎంచుకోకపోయినా ఉచితంగా వాటర్ బాటిల్ అందిస్తామని తెలిపారు.

నో ఫుడ్ ఆప్షన్ తొలగించిందా..?

ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా యాప్‌లో ప్రీమియం రైళ్లల్లో టికెట్లు బుక్ చేసుకునే సమయంలో ఫుడ్ ఆఫ్షన్‌ను ఎంచుకోవాల్సిందిగా బలవంతపెడుతున్నట్లు ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిపై స్పందించిన అధికారులు.. ఆ వార్తలన్నీ అవాస్తమవని, నో ఫుడ్ ఆప్షన్‌ను తాము తొలగించలేదని అన్నారు. బుకింగ్ పేజీలో దాని స్థానాన్ని సవరించడం వల్ల ప్రయాణికులు కన్‌ప్యూజన్ అవుతున్నారని తెలిపారు.

నో ఫుడ్ ఆఫ్షన్ ఎక్కడ..?

-ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో మీరు బుక్ చేసుకోవాలనుకుంటున్న ట్రైన్‌ను ఎంచుకోండి

-ప్రయాణికుల వివరాలు పేజీకి వెళ్లండి

-క్యాటరింగ్ సర్వీస్‌లోకి వెళ్లి నో ఫుడ్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి

-ఆ తర్వాత మీ బుకింగ్ ప్రక్రియను పూర్తి చేయండి

లిక్విడ్ Vs పౌడర్ డిటర్జెంట్.. వాషింగ్ మెషీన్‌కు ఏది బెస్ట్..? తప్పక తెలుసుకోండి..

ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్: ఫ్రంట్ లోడ్ మెషీన్లు మరకలను తొలగించడంలో అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఇవి టంబుల్-లోడ్ చర్యను ఉపయోగిస్తాయి. వీటి వల్ల బట్టలు సున్నితంగా ఉతకడం జరుగుతుంది.

అంతేకాకుండా ఇవి తక్కువ నీరు, విద్యుత్తును మాత్రమే ఉపయోగిస్తాయి. ఈ మెషీన్లు బట్టల నుండి ఎక్కువ నీటిని తీయడం వలన బట్టలు ఆరబెట్టే సమయం కూడా తగ్గుతుంది. ముఖ్యంగా ఫ్రంట్ లోడ్ మెషీన్లు ఎక్కువ శబ్దం చేయకుండా చాలా నిశ్శబ్దంగా పనిచేస్తాయి.

టాప్ లోడ్ వాషింగ్ మెషీన్: టాప్ లోడ్ వాషింగ్ మెషీన్లు తక్కువ ధరకు లభిస్తాయి. వీటిలో సైకిల్ మధ్యలో కూడా బట్టలు జోడించే సౌలభ్యం ఉంటుంది. అలాగే ఓపెన్ టాప్ వల్ల తేమ సులభంగా ఆవిరైపోతుంది. దీని కారణంగా బూజు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అయితే టాప్ లోడ్ మెషీన్లు బట్టలను బలంగా, వేగంగా ఉతుకుతాయి. ఇవి ఫ్రంట్ లోడ్ మెషీన్ల కంటే కొంచెం కఠినంగా ఉతుకుతాయి.

మీరు ఏ వాషింగ్ మెషీన్ ఉపయోగించినా.. సరైన డిటర్జెంట్ లేదా లిక్విడ్‌ను ఎంచుకోవడం ముఖ్యం. ఎందుకంటే ఇది శుభ్రపరిచే పనితీరు, ఫాబ్రిక్ సంరక్షణ, మెషీన్ జీవితకాలంపై ప్రభావం చూపుతుంది. మీరు మీ మెషీన్‌కు తప్పు డిటర్జెంట్‌ను ఉపయోగిస్తే.. అది దాని జీవితకాలంపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉంది. మీది ఫ్రంట్ లోడ్ లేదా టాప్ లోడ్ మెషీన్ అనే దానిపై ఆధారపడి మీరు డిటర్జెంట్‌ను ఎంచుకోవాలి.

డిటర్జెంట్ తేడాలు: టాప్ లోడ్ – ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్ల మధ్య తేడా వాటి నీటి వినియోగంపై ఆధారపడి ఉంటుంది. ఫ్రంట్ లోడ్ మెషీన్లు చాలా తక్కువ నీటిని ఉపయోగిస్తాయి.. కాబట్టి వాటికి డిటర్జెంట్ ఎక్కువ గాఢంగా ఉండాలి. టాప్ లోడ్ మెషీన్లు ఎక్కువ నీటిని ఉపయోగిస్తున్న నేపథ్యంలో వాటికి కరిగే స్వభావం ఉన్న డిటర్జెంట్ అవసరం.

ప్రస్తుతం అనేక పర్యావరణ అనుకూలమైన లాండ్రీ డిటర్జెంట్లు వాటి నీటి సామర్థ్యం కారణంగా ప్రత్యేకంగా ఫ్రంట్-లోడింగ్ వాషింగ్ మెషీన్ల కోసం తీసుకొచ్చారు. అయితే టాప్ లోడింగ్ మెషీన్లకు అనుకూలంగా ఉండే గ్రీన్ డిటర్జెంట్లు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. స్థిరత్వం, పనితీరులో రాజీ లేకుండా ఉతకడానికి వీటిని ఎంచుకోవచ్చు.

మద్యం కన్నా డేంజరస్ డ్రింక్ ఇదే.. తాగారంటే మీ కిడ్నీలు గుల్లగుల్లే..

న శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో మూత్రపిండాలు ఒకటి.. కిడ్నీలు ఫిల్టర్లుగా పనిచేసి.. ఆరోగ్యాన్ని కాపాడుతాయి. శరీరం నుండి వ్యర్థాలు, విషాలు, అదనపు ఉప్పును తొలగిస్తాయి.

అలాంటి కిడ్నీలు దెబ్బతినడం వల్ల శరీరంపై వినాశకరమైన ప్రభావం పడుతుంది. ఆరోగ్యకరమైన మూత్రపిండాలు ఆరోగ్యకరమైన శరీరానికి చాలా ముఖ్యమైనవి. ఆల్కహాల్ మాత్రమే మూత్రపిండాల పనితీరును ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని చాలా మంది అనుకుంటారు. అయితే, మద్యం కంటే.. మూత్రపిండాలకు హాని కలిగించే డేంజరస్ పానీయం కూడా ఉంది. ఏ పానీయాలు మూత్రపిండాలకు హాని కలిగిస్తాయో AIIMS యూరాలజిస్ట్ డాక్టర్ పర్వేజ్ ఏం చెప్పారో ఈ కథనంలో తెలుసుకుందాం..

యూరాలజిస్ట్ డాక్టర్ పర్వేజ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో మూత్రపిండాలకు హాని కలిగించే డ్రింక్స్ గురించి వివరించారు.. ఎనర్జీ డ్రింక్స్ మూత్రపిండాలకు చాలా ప్రమాదకరమని.. దీనికి దూరంగా ఉండాలంటూ ఒక పోస్ట్‌ను పంచుకున్నారు. ఈ రోజుల్లో, ఎనర్జీ డ్రింక్స్ ప్రజలలో బాగా ప్రాచుర్యం పొందాయి. ప్రతిరోజూ ఎనర్జీ డ్రింక్స్ తీసుకోవడం వల్ల మూత్రపిండాలు దెబ్బతింటాయని పేర్కొన్నారు. ఎనర్జీ డ్రింక్స్ తీసుకోవడం వల్ల మూత్రపిండాలపై అదనపు ఒత్తిడి పడుతుందని.. దీనివల్ల కిడ్నీల ఆరోగ్యం బాగా దెబ్బతింటుందని తెలిపారు.

WHO హెచ్చరిక జారీ చేసింది..

డాక్టర్ పర్వేజ్ ప్రకారం, ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఎనర్జీ డ్రింక్స్ గురించి హెచ్చరిక జారీ చేసింది. అలాంటి పానీయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. మీరు వాటిని రోజూ తాగితే.. అది ప్రమాదకరం కావచ్చు. ముందుగా కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఎనర్జీ డ్రింక్స్ తీసుకోవడం మానుకోవాలని సూచించారు.

మూత్రపిండాలకు ఏది మేలు చేస్తుంది?

మీ మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి పుష్కలంగా నీరు త్రాగండి. నిమ్మకాయ నీరు కూడా మూత్రపిండాల ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు మీ ఆహారంలో అల్లం నీరు – హెర్బల్ టీని కూడా చేర్చుకోవచ్చు.

అప్డేట్ అయిన టాటా నానో.. అదిరిపోయే లుక్.. ఫీచర్లు.. ధర కూడా చీఫ్.. త్వరపడండి

చిన్న ఫ్యామిలీ సైతం కారును కలిగి ఉండాలననే ఉద్దేశంతో టాటా కంపెనీ నానో కారును తీసుకువచ్చింది. కొన్నాళ్లపాటు.. కొందరికి ఉపయోగంగా ఉన్న ఈ కారు ఆ తర్వాత అనుకున్న విధంగా సేల్స్ ను పొందలేకపోయింది.

దీంతో కొద్ది కాలానికి ఉత్పత్తి ఆగిపోయింది. అయితే చాలా ఏళ్ల తర్వాత నానో కారు ఇప్పుడు కొత్త రూపంలో రాబోతోంది. అప్ గ్రేడ్ వర్షంతో పాటు స్మార్ట్ ఫీచర్లను కలిగిన ఈ కారు అతి తక్కువ ధరకే అందించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా మొదటిసారి కారు కొనాలని అనుకునే వారికి ఇది అనుగుణంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఇప్పటికే ఈ కారు వివరాలను బయటపెట్టి అందరిని ఆకర్షిస్తున్నారు. మరి ఇది ఎలా ఉందంటే?

2025 సంవత్సరంలో టాటా కంపెనీ నుంచి కాంపాక్ట్ మోడల్ తీసుకురావడంలో భాగంగా టాటా అప్గ్రేడ్ నానోను ప్రవేశపెట్టబడుతున్నారు. దీని బాహ్య డిజైన్ చూసి అద్భుతం అని కొనియాడుతున్నారు ఎందుకంటే హెడ్ లాంప్స్, అందంగా ఉండే గ్రిల్, స్పోర్తియర్ బంపర్ తో పాటు సైడ్ ప్రొఫైల్ కంపాక్ట్ గా ఉంటుంది. ట్రాఫిక్ లో సులభంగా వెళ్లేలా డిజైన్ చేయబడింది. అలాగే వీల్స్ తో పాటు ఆకర్షించే కలర్లలో రూపుదిద్దుకుంటుంది. గతంలో మార్కెట్లోకి వచ్చిన నానో కంటే ఇది స్టైలిష్ గా కనిపిస్తూ ప్రీమియం లుక్ ను ప్రదర్శిస్తోంది.

ఈ మోడల్ లో 880 సిసి పెట్రోల్ ఇంజన్ అమర్చారు. అలాగే ఇందులో సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ రెండు పనిచేయడంతో ఇంజన్ సామర్థ్యం మెరుగ్గా ఉంటుందని అంటున్నారు. నగరాల్లో ఉండే వారికి సులభంగా ప్రయాణించేలా స్మూత్ డ్రైవింగ్ ఉంటుందని చెబుతున్నారు. పవర్ డెలివరీ లీనియర్ గా ఉంటూ స్టాప్ అండ్ గో అనే విధంగా ట్రాఫిక్ పరిస్థితులకు అనుగుణంగా ఉంటుంది. గేర్ షిఫ్టులు కూడా సులభంగా మారుతూ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో గేర్ బాక్స్ పనిచేస్తుంది. ఈ ఇంజన్ పై లీటర్ ఇంధనానికి 42 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది. మెరుగైన ఇంజన్ పనితీరు కారణంగా మెయింటెనెన్స్ కూడా తక్కువగానే ఉంటుంది.

ఈ కారు ఇన్నర్లో ఉండే ఫీచర్స్ కూడా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. అప్డేట్ అయినా డాష్ బోర్డు, బ్లూటూత్ కనెక్టివిటీ, స్మార్ట్ ఫోన్ కనెక్ట్ అయ్యే విధంగా ఫీచర్లు ఉన్నాయి. యు ఎస్ బి పోర్టులతో కలిగిన ఇన్ఫోటైన్మెంట్ సిస్టం అలరిస్తుంది. ఎయిర్ కండిషనర్ తో ఉన్న ఈ వాహనంలో భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో డ్యూయల్ ఎయిర్ బాగ్స్, EBD తో కూడిన ABS టెక్నాలజీ, వియర్ పార్కింగ్ సెన్సార్, సీట్ బెల్ట్ రిమైండర్, స్టీల్ బాడీ నిర్మాణం కలిగి ఉంది. భారతీయులకు అనుగుణంగా ఈ కారును రూ.2.99 లక్షల ప్రారంభ ధరతో మార్కెట్లోకి తీసుకురానున్నారు. ఇది మార్కెట్లోకి వస్తే మారుతి ఆల్టో, రెనాల్ట్ క్విడ్ కు గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది.

ఇంట్లో ఉండేకంటే ఉద్యోగానికి వెళితే తగ్గుతున్న ఒత్తిడి.. అధ్యయనంలో వెల్లడి

సాధారణంగానే ఇంట్లో ఉండేవారికంటే ఉద్యోగాలు చేసేవారు అధిక ఒత్తిడికి గురవుతుంటారని అందరూ అనుకుంటారు. కానీ జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్ (JAMA) నెట్‌వర్క్ ఓపెన్‌లో పబ్లిషైన ఒక అధ్యయనం మాత్రం అందుకు భిన్నమైన ఫలితాలను వెల్లడించింది.

జాబ్స్‌కు వెళ్లేవారికంటే, ఇంట్లో ఉండేవారే ఎక్కువ స్ట్రెస్ అనుభవిస్తుంటారని పేర్కొన్నది. ముఖ్యంగా ఇంటి పనులు, పిల్లల సంరక్షణ, కుటుంబ బాధ్యతలు చూసుకోవడం, తమ వృత్తి పరమైన బాధ్యతలకంటే చాలా కష్టమని పలువురు అభిప్రాయపడినట్లు అధ్యయనం స్పష్టం చేసింది. చిన్న పిల్లలున్న తల్లిదండ్రులపై ఈ ప్రభావం మరింత అధికంగా ఉంటుందని తెలిపింది.

అధ్యయనం ప్రకారం.. ఇంట్లో ఉండేవారే కాదు, ఇంటి నుంచి పనిచేసే (Work from home) వారిలో కూడా ఒత్తిడి ఎక్కువ. ముఖ్యంగా చిన్న పిల్లలు కలిగి ఉన్న తల్లిదండ్రుల్లో 40 శాతం మంది పిల్లల పెంపకంతో ముడిపడిన అధిక ఒత్తిడిని అనుభవిస్తున్నారు. అదే బయట ఉద్యోగం చేసే వారు కేవలం 27 శాతం ఒత్తిడిని మాత్రమే ఎదుర్కొంటున్నారు. ఇక పూర్తిగా ఇంట్లోనే ఉండి కేవలం పిల్లల్ని చూసుకునే తల్లులు (Stay-at-home moms) కూడా, ఉద్యోగం చేసే తల్లుల కంటే ఎక్కువ మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని పరిశోధనలు తేల్చాయి. ఈ ఒత్తిడి కేవలం శారీరక శ్రమతో ముడిపడి ఉండటం లేదు. పిల్లల భావోద్వేగ అవసరాలు, నిరంతరం శ్రద్ధ అవసరమైన పనులు, ఇంట్లో ఉండేవారికి శ్రమకు తగిన గుర్తింపు లభించకపోవడం, సమాజం నుంచి ఆశించిన గౌరవం లభించకపోవడం వంటి అంశాలు కూడా దీనికి కారణం అవుతున్నాయని అధ్యయనం స్పష్టం చేసింది. మొత్తానికి పిల్లల సంరక్షణ, ఇంటి బాధ్యతలు అనేవి హెవీ మెంటల్ అండ్ ఎమోషనల్ బర్డన్‌తో కూడినవి కావడం ఒత్తిడికి దారితీస్తున్నాయి. అయితే సమాజం కూడా ఈ కృషిని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం, ఇంట్లో ఉండే వారిని తరచుగా తక్కువ అంచనా వేయడం మరింత అధిక ఒత్తిడికి కారణం అవుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

ఒత్తిడి నుంచి రిలీఫ్ కోసం ..

*ఇంట్లో పిల్లలతో ఉండే తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లులు (Especially stay-at-home moms) ఒత్తిడి తగ్గించుకోవడానికి రోజుకు 10-15 నిమిషాలు మెడిటేషన్ లేదా డీప్ బ్రీతింగ్ (4-7-8 టెక్నిక్) ఫాలో అవడం బెటర్ అంటున్నారు నిపుణులు. పిల్లలు నిద్రపోయినప్పుడు లేదా ఉదయం త్వరగా లేచినప్పుడు ఇలా చేయవచ్చు.

*రోజులో కనీసం 20-30 నిమిషాలు నడక, యోగా వంటివి చేయవచ్చు. పిల్లలు కాస్త పెద్దవారైతే వారిని కూడా వాకింగ్‌కు తీసుకెళ్లవచ్చు. వారితో కలిసి గ్రౌండ్‌లో వివిధ ఆటలు ఆడటంవల్ల కూడా స్ట్రెస్ రిలీఫ్ అవుతారు.

*ఇంట్లో పనులు చేసుకుంటూ పిల్లలను చూసుకోవడం చాలా ఒత్తిడితో కూడిన పని కాబట్టి ముందుగా ప్లాన్ చేసుకోండి. అన్ని పనులు ఒకేసారి చేయాలనుకోవడం ఆందోళనకు కారణం అవుతుంది. కాబట్టి పనులను చిన్న చిన్న భాగాలుగా విడగొట్టండి. మీరు ఏ పనిచేస్తున్నా 25 నిమిషాలు పని తర్వాత 5 నమిషాలు విరామం తప్పక తీసుకోండి.

*పిల్లలు నిద్రపోయిన తర్వాత వీలైతే పుస్తకం చదవడం, సీరిస్ చూడటం, హాట్ షవర్ చేయడం, ఇంకా ఏదైనా హాబీని అనుసరించడం కూడా ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

*రోజులో 2-3 సార్లు కూడా 2 నిమిషాల “మైండ్‌ఫుల్ బ్రేక్” తీసుకోవచ్చు. కళ్లు మూసుకొని శ్వాస మీద దృష్టి పెట్టడం, ఇష్టమైన వ్యక్తులను, దృశ్యాలను, ప్రదేశాలను ఊహించుకోవడం కూడా ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

*ఇంట్లోనే చిన్న “రిలాక్స్ కార్నర్” ఏర్పాటు చేసుకోవచ్చు. కుషన్స్, మ్యూజిక్, అరోమా క్యాండిల్స్ లేదా ఎసెన్షియల్ ఆయిల్ డిఫ్యూజర్ వంటివి. ముఖ్యంగా స్క్రీన్ టైమ్ తగ్గించి మనసును ఆహ్లాద పరిచే పనులను చేయడం, ప్రకృతిని ఆస్వాదించడం, కుటుంబ సభ్యులతో, ఆత్మీయులతో మాట్లాడటం ఒత్తిడి నుంచి రిలీఫ్ అందిస్తుంది.

2 గంటల వరకు మెట్రో, సిటీ బస్సులు,,,,ఇకపై అర్థరాత్రి కూడా దర్జాగా తిరగొచ్చు

ఫ్యూచర్ సిటీ వేదికగా జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తోంది. అలానే హైదరాబాద్‌ను విశ్వ నగరంగా అభివృద్ధి చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.

ఈ గ్లోబల్ వేదిక సాక్షిగా.. రాష్ట్రంలోని నాలుగు కోట్ల ప్రజల కలలు, ఆకాంక్షల సాకారం చేసేందుకు ‘తెలంగాణ రైజింగ్ -2047’ విజన్ డాక్యుమెంట్‎ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీనిలో భాగంగా దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్రాన్ని భౌగోళికంగా మాత్రమే కాకుండా.. అభివృద్ధి ప్రామాణికంగా 3 విభిన్న జోన్లుగా (క్యూర్, ప్యూర్, రేర్) ఈ విజన్ డాక్యుమెంట్ విభజించింది.

గ్లోబల్ సమ్మిట్ వేదికగా మొత్తం 83 పేజీల డాక్యుమెంట్‌ను రాష్ట్ర ప్రజల ముందు ఉంచింది. ఇప్పటికే మెరుగైన మౌలిక సదుపాయాలతో.. ప్రపంచ స్థాయి ప్రధాన నగరాలతో పోటీ పడుతున్న తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ నగరాన్ని ఇకపై.. ‘నెట్-జీరో సిటీ’గా మార్చేందుకు రేవంత్ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

పర్యాటక రంగంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన రేవంత్ సర్కార్.. గ్రామాల నుంచి నగరాల వరకు.. ఆలయం నుంచి అడవి వరకు.. ప్రతి దాన్ని అనుసంధానిస్తూ.. టూరిజం సర్క్యూట్లకు శ్రీకారం చుట్టబోతున్నది. దీని ద్వారా రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడం ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలను పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. స్థానిక కళలు, సంస్కృతిని.. విశ్వ వ్యాప్తం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న రేవంత్ సర్కార్ అందుకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంది.

ఈక్రమంలో హైదరాబాద్‌ను దక్షిణ ఆసియాలోనే ‘నైట్ టైమ్ క్యాపిటల్’గా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనిలో భాగంగా ఆర్టీసీ, మెట్రో రైలు వంటి వాటిని అర్థరాత్రి 2 గంటల వరకు అందుబాటులో ఉంచేలా ప్రణాళికలు రెడీ చేస్తున్నారు. దీనిలో భాగంగా మాదాపూర్, ట్యాంక్‌బండ్, ఓల్డ్ సిటీ, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, విమానాశ్రయ ప్రాంతాలను నైట్ జోన్లుగా మార్చనున్నారు.

చార్మినార్ నుంచి గోల్కొండ వరకు వయా ట్యాంక్ బండ్ మీదుగా.. ‘ హైదరాబాద్ ఆఫ్టర్ డార్క్ మైల్’ పేరుతో రాత్రి పూట నిర్వహించే బజార్లు, ఫుడ్ ఫెస్టివల్స్ నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. అలానే తెలంగాణవ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రాంతాలను కలుపుతూ 27 ప్రత్యేక పర్యాటక ప్రదేశాలను గుర్తించారు. పర్యాటకుల సౌకర్యార్థం.. హోటల్ బుకింగ్స్, టికెట్లు, ప్రయాణం అన్నీ ఒకే కార్డుతో జరిగేలా ‘తెలంగాణ పాస్’ (యూనిఫైడ్ డిజిటల్ పాస్) తీసుకురానున్నారు.

వీటితో పాటు ఆకాశం నుంచి సోమశిల, రామప్ప, నాగార్జునసాగర్, కాళేశ్వరం అందాలను చూసేందుకు హెలికాప్టర్ రూట్లను ఏర్పాటు చేయనున్నారు. భువనగిరిని.. ‘రాక్ క్లైంబింగ్ డెస్టినేషన్’గా.. అమ్రాబాద్, కవ్వాల్ అడవుల్లో ఎకో ట్రయల్స్ ఏర్పాటు చేస్తారు. టైగర్ రిజర్వ్ జోన్లలోనూ రిసార్టులు రానున్నాయి.

బీ అలర్ట్.. ఈ సంకేతాలు కనిపిస్తే మీ వాట్సప్ హ్యాక్ అయినట్లే.. వెంటనే జాగ్రత్త పడండి

ఇటీవల ఫోన్ హ్యాకింగ్, సోషల్ మీడియా అకౌంట్ల హ్యాక్ ఘటనలు ఎక్కువగా చూస్తున్నాం. తమ ఫోన్ హ్యాక్ అయిందని, సోషల్ మీడియా అకౌంట్లను కూడా హ్యాక్ చేశారంటూ చాలామంది పోస్ట్‌లు పెడుతున్న ఘటనలు మనం ఇటీవల చూస్తున్నాం.

ఫోన్‌ను హ్యాక్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు.. వారి నెంబర్ల ద్వారా స్నేహితులు, కుటుంబసభ్యులకు డబ్బులు రిక్వెస్ట్ చేస్తూ మెస్సేజ్‌లు పెడుతున్నారు. ఇది నిజమేననుకుని కొంతమంది డబ్బులు కొడతున్నారు. ఆ తర్వాత సైబర్ నేరగాళ్లు ఫోన్ హ్యాక్ చేశారని తెలుసుకుని ఖంగు తింటున్నారు. ఇటీవల వాట్సప్ హ్యాక్ చేసి ఫ్రెండ్స్, కుటుంబసభ్యుల ద్వారా డబ్బులు కొల్లగొడుతున్న ఘటనలు తరచూ చూస్తున్నాం. మీ వాట్సప్ హ్యాక్ అయననట్లు ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

వాట్సాప్ లాగౌట్

మీరు వాట్సప్ వాడుతున్నప్పుడు మీకు విచిత్ర సంఘటనలు ఎదురైతే హ్యాక్ అయినట్లు లెక్క. మీరు వాట్సప్ యాక్సెస్ చేస్తున్నప్పుడు సడెన్‌గా “Your phone number is no longer registered” అనే మెస్సేజ్ స్క్రీన్‌పై కనిపిస్తే జాగ్రత్త పడాలి. అలాగే మీ వాట్సప్ అకౌంట్ ప్రతీసారి మీరు ఏం చేయకుండానే లాగౌట్ అవుతుంటే అలర్ట్ అవ్వాల్సిందే. మీ ఫోన్‌లో లాగౌట్ అయిందంటే మీ నెంబర్‌పై వేరేవాళ్లు వాట్సప్ వాడుతున్నట్లు అర్థం చేసుకోవాలి.

మీరు పంపకపోయినా మెస్సేజ్‌లు

మీరు మెస్సేజ్‌లు పంపకపోయినా మీ ఫ్రెండ్స్ నుంచి ఏదైనా మెస్సేజ్‌కి రిప్లై వస్తే మీరు జాగ్రత్త పడండి. మీ వాట్సప్ హ్యాక్ చేసినవారు ఆ మెస్సేజ్ పంపి ఉండొచ్చు. ఇక రోజుకు ఒకసారైనా మీ వాట్సప్‌తో కనెక్ట్ అయిన డివైస్‌లను చెక్ చేసుకోండి. లింక్డ్ డివైస్‌ ఆప్షన్‌లోకి వెళ్లి చెక్ చేసుకోవడం మంచిది. వేరేవాళ్లు వేరే డివైస్‌లో లాగిన్ చేస్తే మీకు దీని ద్వారా వెంటనే తెలిసిపోతుంది. ఒకవేళ మీ ప్రమేయం లేకుండా వాట్సప్ ఫోన్ బ్యాగ్రౌండ్‌లో వర్క్ అవుతుంటే డౌట్ పడాల్సిందే. వాట్సప్‌లోకి మాల్‌వేర్ లేదా స్పైవేర్స్ ఎంటర్ అయినప్పుడు ఇలా బ్యాగ్రౌండ్‌లో వర్క్ అవుతూ ఉంటుంది. ఈ సమయంలో మీ బ్యాటరీ త్వరగా వేడెక్కడంతో పాటు ఛార్జింగ్ పడిపోతుంది.

గ్రూపుల్లో యాడ్ అయితే..?

ఒక్కొక్కసారి మీ ప్రమేయం లేకుండా మీ నెంబర్ వాట్సప్ గ్రూపుల్లో యాడ్ అవుతూ ఉంటుంది. అలాగే వాట్సప్ కాంటాక్ట్ లిస్ట్‌లోకి కొత్త నెంబర్లు యాడ్ అయినా మీరు జాగ్రత్త పడాలి. ఈ సంకేతాల ద్వారా మీరు వాట్సప్ హ్యాక్ అయినట్లు గుర్తించవచ్చు.

కాంక్రీట్ కన్నా స్ట్రాంగ్.. ఈ మెటీరియల్ తో ఇళ్లు కడితే 80 శాతం డబ్బులు ఆదా!

ప్రతి సంవత్సరం ప్రపంచ కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలలో దాదాపు 8 శాతం సిమెంట్ ఉత్పత్తి కారణంగానే జరుగుతుంది. దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో, ఆస్ట్రేలియాలోని ఆర్‌ఎంఐటీ యూనివర్శిటీ పరిశోధకులు ఒక విప్లవాత్మక ప్రశ్నకు సమాధానం వెతికారు.

కాంక్రీట్ వాడకుండా, వృథాగా పడి ఉన్న వనరులను ఉపయోగించి నిర్మాణం చేయగలమా?

ఈ పరిశోధనలో రెండు కొత్త నిర్మాణ పదార్థాలు తయారయ్యాయి. అవి సిమెంట్‌ను పూర్తిగా తొలగించడమే కాక, ఎక్కువ బలంగా, చౌకగా, కాలుష్యం చాలా తక్కువగా ఉంటాయి. చిన్నప్పుడు మనం ఉపయోగించే పల్ప్ (papier mache) పద్ధతిని ఇది గుర్తు చేస్తుంది.

ర్యామ్డ్ ఎర్త్: పురాతన పద్ధతి

ఈ రెండు పదార్థాలు ‘ర్యామ్డ్ ఎర్త్’ అనే ఒకే ఆధారం నుంచి వచ్చాయి. అంటే, కొద్దిగా నీటితో మట్టిని గట్టిగా కుదించడం. ఇది ప్రపంచంలో పురాతనమైన నిర్మాణ పద్ధతి. దీనికి ఒక అద్భుతమైన ప్రయోజనం ఉంది. ఈ పద్ధతిలో కట్టిన ఇళ్లు వేసవిలో వాటంతట అవే చల్లగా, చలికాలంలో వేడిగా ఉంటాయి. అంటే శక్తి ఖర్చు (Energy expenditure) లేకుండా ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉంటాయి. అయితే, సిమెంట్ రాకతో ఈ పద్ధతి వెనుకబడిపోయింది.

వాతావరణ మార్పుల కారణంగా చౌకగా, సమృద్ధిగా, సమర్థవంతంగా ఉండే ఈ పద్ధతిని తిరిగి ఉపయోగించాలనే ఆలోచన వచ్చింది. ర్యామ్డ్ ఎర్త్ సాంకేతికతలో ఉన్న ప్రధాన సమస్య ఏమిటంటే, ఎక్కువ బరువును మోస్తే అది పగుళ్లు (Cracks) వచ్చే అవకాశం ఉంది.

‘కవచం’లా పనిచేసే ట్యూబ్‌లు

పరిశోధకులు ఈ సమస్యను అధిగమించడానికి ఒక తెలివైన పరిష్కారాన్ని కనుగొన్నారు. బరువు మోసే మట్టిని ట్యూబ్‌ల లోపల ఉంచడం. ఈ ట్యూబ్‌లు ‘కవచం’లా పనిచేస్తాయి. మట్టిని బయటికి విస్తరించకుండా నిరోధిస్తాయి. దీనివల్ల ర్యామ్డ్ ఎర్త్ పగిలిపోకుండా బలంగా ఉంటుంది. దీన్ని బలోపేతం చేయడానికి సిమెంట్‌ను ఉపయోగించాల్సిన అవసరం లేదు.

రెండు రకాల కొత్త పదార్థాలు

రీసైకిల్ కార్డ్‌బోర్డ్ ట్యూబ్‌లు: ఇది చిన్న నిర్మాణాల కోసం రూపొందించారు. కుదించిన మట్టిని రీసైకిల్ చేసిన కార్డ్‌బోర్డ్ ట్యూబ్‌లతో కలుపుతారు. ఈ ట్యూబ్‌లు అచ్చుగా, నిర్మాణంలో భాగంగా పనిచేస్తాయి. ఇది కాంక్రీట్ కన్నా బలంగా ఉండటమే కాక, సాంప్రదాయ కాంక్రీట్‌తో పోలిస్తే కార్బన్ పాదముద్రను 80 శాతం తగ్గిస్తుంది.

కార్బన్ ఫైబర్ ట్యూబ్‌లు: రెండో రకం అత్యంత బలంగా ఉంటుంది. మట్టిని విమానాలు లేదా ఖరీదైన కార్లలో వాడే కార్బన్ ఫైబర్ ట్యూబ్‌ల లోపల ఉంచుతారు. ఈ స్తంభం (Column) అత్యుత్తమ కాంక్రీట్ వలె బలంగా పనిచేస్తుంది. కానీ బరువు తక్కువగా, పర్యావరణ ప్రభావం తక్కువగా ఉంటుంది. ఇది కొంచెం ఖరీదైనది అయినప్పటికీ, భూకంప ప్రమాదం ఉన్న ప్రాంతాలలో తేలికదనం చాలా కీలకం. కాబట్టి అక్కడ దీన్ని ఉపయోగించడం మంచిది.

పరిశోధనల ప్రారంభ ఫలితాలు చాలా ఆశాజనకంగా ఉన్నప్పటికీ, రాబోయే సంవత్సరాలలో వాతావరణం, మన్నిక, అరుగుదల వంటి అంశాలపై ఈ పదార్థాలు ఎలా పనిచేస్తాయో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. అయితే, సిమెంట్ మాత్రమే ఏకైక మార్గం కాదు అనే విషయం స్పష్టమైంది. నిర్మాణం అంటే కాలుష్యం కాదు అనే సరళమైన, శక్తివంతమైన ఆలోచనను ఈ ప్రాజెక్ట్ అందిస్తోంది.

గమనిక: ఈ కథనం కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే రూపొందించబడింది. ఏదైనా నూతన నిర్మాణ సాంకేతికతను అమలు చేయడానికి ముందు, దయచేసి సంబంధిత నిపుణులను సంప్రదించి, పూర్తి పరిశోధన చేయండి.

నెల రోజుల పాటు టీ మానేసి చూడండి.. షాకవుతారు

భారతీయులు రిఫ్రెషింగ్ కోసం తీసుకునే పానీయాలలో టీ చాలా ముఖ్యమైనది. ఉదయం లేవగానే బ్రష్ చేసి టీ తాగాలి, టిఫిన్ తినగానే టీ తాగాలి, స్నేహితులతో బయట కలిస్తే టీ తాగాలి, ఆఫీసు వర్క్ లో కాసింత బ్రేక్ కావాలంటే టీ తాగాలి, అన్నింటికి మించి తలనొప్పి వచ్చినా, ఫుడ్ లేటయినా కనీసం టీ అయినా తాగాలి.

ఇలా టీ అనేది పానీయంలా కాకుండా ఒక ఎమోషన్ లా మారిపోయింది. అయితే టీ తాగడం పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేస్తారు ఆరోగ్య నిపుణులు. మరీ ముఖ్యంగా నెలరోజుల పాటు టీ తాగడం మానేయండి, ఫలితాలు చూసి మీరే షాకవుతారు అని అంటున్నారు. ఇంతకూ నెలరోజుల పాటు టీ తాగడం మానేయడం వల్ల కలిగే మార్పులేంటో తెలుసుకుంటే..

నెలరోజులు టీ తాగడం మానేస్తే.. ఒక నెల పాటు టీ తాగడం మానేయడం వల్ల శరీరం నుండి హానికరమైన సమ్మేళనాలను తొలగించడంలో సహాయపడుతుందట. ఇది కడుపులో యాసిడ్ ఎఫెక్ట్, ఉబ్బరాన్ని తొలగించడమే కాకుండా,శరీర శక్తి స్థిరంగా ఉండేలా చేస్తుందట. ఇలా శరీరంలోపల శుద్ది కావడం శరీరానికి రీసెట్ బటన్ గా పనిచేస్తుంది.

నెల రోజుల పాటు టీ తాగడం మానేస్తే నాలుగు ముఖ్యమైన మార్పులు ప్రధానంగా చోటు చేసుకుంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. జీర్ణక్రియ.. టీ మానేయడం వల్ల కలిగే మొట్టమొదటి, అత్యంత ప్రయోజనకరమైన విషయం జీర్ణక్రియ ఆరోగ్యం మెరుగవ్వడం. టీలోని కెఫిన్, టానిన్లు కడుపులో ఆమ్ల ఉత్పత్తిని పెంచుతాయి.

ఒక నెల పాటు టీ తాగకుండా ఉండటం వల్ల కడుపులో ఆమ్ల స్థాయిలు నార్మల్ అవుతాయి. ఆమ్లత్వం, గుండెల్లో మంట, అజీర్ణం దాదాపుగా తొలగిపోతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఐరన్ శోషణ..

టీలోని టానిన్లు ఆహారం నుండి ఐరన్ ను గ్రహించడంలో ఆటంకం కలిగిస్తాయి. టీ మానేసిన తర్వాత శరీరం ఆహారం నుండి ఐరన్ ను పూర్తి స్థాయిలో గ్రహిస్తుంది. రక్తహీనత లేదా అలసటతో బాధపడేవారికి ఇది చాలా మెరుగైన ఫలితాలు ఇస్తుంది. టీ మానేయడం వల్ల ఐరన్ గ్రహించే సామర్ఱ్యం పెరుగుతుంది.

మానసిక ఆరోగ్యం.. టీలో కెఫిన్ ఉంటుంది. ఇది నిద్ర హార్మోన్ మెలటోనిన్ ఉత్పత్తిని నిరోధిస్తుంది. ఒక నెల పాటు టీ తాగకుండా ఉండటం వల్ల నిద్ర చక్రం తిరిగి రికవర్ అవుతుంది.

గాఢంగా, నాణ్యమైన నిద్రను పొందడంలో సహాయపడుతుంది. మంచి నిద్ర నేరుగా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మానసిక కల్లోలం, ఒత్తిడిని తగ్గిస్తుంది. చర్మం, దంతాల ఆరోగ్యం..

టీలోని టానిన్లు దంతాల మీద మరకలుగా మారి దంతాల రంగు మారుస్తాయి. టీ తాగడం మానేయడం వల్ల సహజంగా దంతాలు శుభ్రంగా, ప్రకాశవంతంగా కనిపిస్తాయి. శరీరం హైడ్రేషన్ గా ఉండటం, వాపు తగ్గడం మొదలైన వాటి వల్ల పొడిబారడం తగ్గుతుంది. చర్మానికి సహజమైన మెరుపు వస్తుంది.

*రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి.

వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు…

టీటీడీలో మరో కుంభకోణం.. పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల స్వాహా

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసేలా.. ఒక పెద్ద స్కామ్ వెలుగులోకి వచ్చింది. 2015 నుండి 2025 వరకు, భక్తులకు పట్టు పేరుతో అందించిన శాలువాలు..

వాస్తవానికి పాలిస్టర్ అని తాజా నివేదికలు స్పష్టం చేశాయి. ఈ సంఘటనలో ముఖ్యంగా నగరానికి చెందిన వీఆర్‌ఎస్ ఎక్స్‌పోర్ట్స్ అనే సంస్థ పేరు ప్రస్తావనలోకి వచ్చింది.

తిరుమల ఆలయానికి పట్టు శాలువాలు ప్రత్యేక గుర్తింపు. వీఐపీలకు, దాతలకు, ముఖ్య అతిథులకు అందించే ఈ శాలువాలు సంప్రదాయం, భక్తిగా భావిస్తారు. అయితే ఈ విశ్వాసాన్నే కాపాడాల్సిన కాంట్రాక్టర్లు.. దీన్ని డబ్బు సంపాదనే మార్గంగా మార్చినట్టు విచారణల్లో తేలింది.

టీటీడీ విజిలెన్స్ విభాగం చేసిన పరిశీలనలో గత పదేళ్లుగా పట్టు పేరుతో.. అందించిన ఎక్కువ శాలువాలు పూర్తిగా పాలిస్టర్ అని బయటపడింది. ధర్మవరం, సిల్క్ బోర్డు నిర్వహించిన నాణ్యత పరీక్షలలో ఈ నిజం వెలుగులోకి వచ్చింది. మొత్తం రూ. 54 కోట్లకు పైగా ఈ పాలిస్టర్ శాలువాల కొనుగోళ్లు జరిగి ఉండొచ్చని అంచనా.

టీటీడీకి సరఫరా చేసే పట్టు శాలువాలపై స్పష్టమైన టెండర్ నిబంధనలు ఉన్నప్పటికీ, వాటిని బేఖాతరు చేస్తూ తక్కువ ధరపై పాలిస్టర్ శాలువాలను అసలు పట్టు అన్నట్లుగా సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు.

విజిలెన్స్ నివేదికలో మరో సంచలన అంశం బయటపడింది. పట్టు పేరుతో పాలిస్టర్ శాలువాల మోసం ప్రత్యేకంగా వీఐపీలకు, పెద్ద దాతలకు అందించే శాలువాల్లోనే ఎక్కువగా జరిగిందని గుర్తించారు.

విజిలెన్స్ శాఖ ఇప్పటికే ముందుగా కూడా కొన్ని అసాందర్యాలను గుర్తించింది. కానీ తాజాగా చేపట్టిన విస్తృత తనిఖీల్లో అయితే స్పష్టమైన ఆధారాలు లభించాయి.

విజిలెన్స్ నివేదికను పరిశీలించిన తరువాత టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏసీబీకీ విచారణకు పంపాలని ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్‌లో టెండర్ ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా మార్చాలని సిఫారసు చేసినట్టు సమాచారం.

ఈ వ్యవహారంపై భక్తులు, హిందూ సంస్థలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. పట్టు పేరుతో పాలిస్టర్ ఇవ్వడం అంటే కేవలం నాణ్యత మోసం మాత్రమే కాదు, భగవంతుని పట్ల చేసిన అవమానం కింద పరిగణించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ 7 ప్రదేశాలలో మీ క్రెడిట్ కార్డును అస్సలు వాడకండి.. లేకుంటే మీ అంతటి మీరే గోతిలో పడినట్లే..

ఈ రోజుల్లో క్రెడిట్ కార్డ్ వాడకం వేగంగా పెరుగుతోంది. కానీ ఒక చిన్న పొరపాటు కూడా గణనీయమైన హాని కలిగిస్తుంది. క్రెడిట్ కార్డులను చాలా జాగ్రత్తగా వాడాలి.

క్రెడిట్ కార్డ్ కలిగి ఉండటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నప్పటికీ, దాని వల్ల అనేక నష్టాలు కూడా ఉన్నాయి. క్రెడిట్ కార్డులు తరచుగా దాచిన ఛార్జీలతో వస్తాయి. అవి మనకు పెద్దగా కనిపించకపోయినా నష్టాలు కలిగించేలా ఉంటాయి. వీటి గురించి ప్రజలకు సాధారణంగా తెలియదు. ప్రజలు పొరపాటున కూడా క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించకుండా ఉండవలసిన కొన్ని ప్రదేశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం.

  1. పెట్రోల్ పంపులు: మన వాహనాలకు డీజిల్, పెట్రోల్ లేదా CNG ఇంధనం నింపేటప్పుడు తరచుగా క్రెడిట్ కార్డులతో చెల్లిస్తాము. కానీ అలా చేయడం ద్వారా మనకు మనం హాని కలిగించుకుంటున్నాము. పెట్రోల్ పంపులలో క్రెడిట్ కార్డులతో చేసే చెల్లింపులకు సర్వీస్ ఛార్జీలు, జీఎస్టీ వంటి ఛార్జీలు విధిస్తారు. ఇది ఇంధన ధరను మరింత పెంచుతుంది. అదనంగా మీరు కూడా స్కిమ్మింగ్ బాధితులు కావచ్చు. స్కిమ్మింగ్ అనేది ఒక కొత్త రకమైన స్కామింగ్. ఇందులో పెట్రోల్ పంప్ లేదా దుకాణంలో కార్డ్-స్వైపింగ్ POS మెషిన్ లేదా ATM లోపల దాచిన చిన్న పరికరాన్ని ఉంచుతారు. మీరు మీ కార్డును స్వైప్ చేసిన వెంటనే, ఈ యంత్రం మీ కార్డు వివరాలను రికార్డ్ చేస్తుంది. ఈ సమాచారాన్ని ఉపయోగించి స్కామర్లు నకిలీ కార్డులను సృష్టించి మీకు తెలియకుండానే మీ ఖాతా నుండి డబ్బును విత్‌డ్రా చేసుకునే ప్రమాదం ఉంటుంది. పెట్రోల్ పంపుల వద్ద స్కిమ్మింగ్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కార్డ్ స్వైప్ యంత్రాలు బహిరంగంగా ఉంటాయి. దీనివల్ల వాటిని సులభంగా ట్యాంపర్ చేయవచ్చు.
  2. IRCTC వెబ్‌సైట్: IRCTC వెబ్‌సైట్‌లో టిక్కెట్లు బుక్ చేసుకునేటప్పుడు క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించకూడదు. ఎందుకంటే చెల్లింపు గేట్‌వే రుసుము కాకుండా జీఎస్టీలో ఒకటి లేదా రెండు శాతం అదనపు ఛార్జీ విధిస్తారు.
  3. ATM: మీరు ATM నుండి నగదు తీసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో క్రెడిట్ కార్డును ఉపయోగించకూడదని గుర్తించుకోండి. క్రెడిట్‌ కార్డు నుంచి ఏటీఎం ద్వారా డబ్బులు విత్‌డ్రా చేసినట్లయితే మీరు డ్రా చేసిన డబ్బులకు భారీ ఎత్తున వడ్డీ విధిస్తారు. చాలా మందికి ఇది తెలియదు. పొరపాటున కూడా క్రెడిట్‌ కార్డు నుంచి విత్‌డ్రా చేస్తే రెట్టి స్థాయిలో వడ్డీ వసూలు చేస్తాయి. అందుకే ఈ పని అస్సలు చేయకండి. లేకుంటే దారుణంగా నష్టపోవాల్సి వస్తుందని గుర్తించుకోండి. అయినా సరే ఎంత వడ్డీ అయినా భరిస్తామని అనుకుంటే మీ ఇష్టం.
  4. వాలెట్: పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే లేదా అమెజాన్ పే వాలెట్లకు డబ్బును జోడించడానికి క్రెడిట్ కార్డును ఉపయోగించకూడదు. ఎందుకంటే సౌలభ్య రుసుములతో పాటు, జీఎస్టీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ డబ్బులు అవసరం ఉన్నందున ఛార్జీలను పెద్దగా పట్టించుకోరు.
  5. బీమా: బీమా ప్రీమియం చెల్లించడానికి క్రెడిట్ కార్డును ఉపయోగించకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు. ఎందుకంటే మీరు 1-2% అదనపు ఛార్జీ చెల్లించాల్సి రావచ్చు.
  6. అసురక్షిత వెబ్‌సైట్‌లు: వెబ్‌సైట్‌లలో షాపింగ్ చేయడం, క్రెడిట్ కార్డ్‌తో చెల్లించడం అనేది మనం తరచుగా తెలిసి లేదా తెలియకుండా చేసే ఆర్థిక తప్పులలో ఒకటి. ఇది మోసాల ప్రమాదాన్ని పెంచడమే కాకుండా కొనుగోలు చేసిన వస్తువులపై అనవసరమైన ఛార్జీలు విధించబడటానికి దారితీస్తుంది.
  7. బ్యాలెన్స్ బదిలీ: ఒక క్రెడిట్ కార్డు నుండి మరొక క్రెడిట్ కార్డుకు బ్యాలెన్స్ బదిలీ చేయడంలో పొరపాటు కూడా మనకు నష్టాన్ని కలిగించవచ్చు ఎందుకంటే అలా చేస్తున్నప్పుడు మీరు వడ్డీ రేటు మరియు ప్రాసెసింగ్ రుసుము చెల్లించాలి, కాబట్టి అలా చేయకపోవడమే మంచిది.

డయాబెటిస్ ఉన్నవారు స్వీట్‌ పొటాటో తింటే ఏమౌతుంది.. లాభమా, నష్టమా..?

చిలగడదుంపలు కాన్వోల్వులేసి కుటుంబానికి చెందిన వేరు కూరగాయలు. ఇవి తీపి, పిండి రుచిని కలిగి ఉంటాయి. నారింజ, ఊదా రంగులో ఉంటాయి. వాటి బయటి చర్మం గోధుమ నుండి ఊదా రంగు వరకు ఉంటుంది.

చిలగడదుంపలు వాటి గొప్ప పోషక విలువల కారణంగా చాలా ఆరోగ్యకరమైనవిగా పరిగణిస్తారు. అవి ఫైబర్, విటమిన్లు విటమిన్లు A, C, B6 వంటివి ఖనిజాలు పొటాషియం, మాంగనీస్ వంటివి అద్భుతమైన మూలం. దీర్ఘకాలిక వ్యాధులకు దారితీసే ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడే యాంటీఆక్సిడెంట్లు కూడా వీటిలో ఉన్నాయి. అయితే, డయాబెటిస్‌ ఉన్నవారు చిలగడ దుంప తింటే ఏమౌతుందో తెలుసా..?

విటమిన్ ఏ పుష్కలంగా లభించే ఈ చిలగడదుంపల్లో విటమిన్ B-6, మెగ్నీషియం, విటమిన్ సీతోపాటు, అధిక ఫైబర్, తక్కువ కొవ్వు , కేలరీలతో నిండి ఉంటుంది. చిలగడదుంపల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇందులోని పీచు రక్తంలోని చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది. జీర్ణక్రియని మెరుగ్గా చేస్తుంది. చిలగడదుంపలు మన శరీరానికి అవసరమయ్యే ముఖ్యమైన విటమిన్లతో నిండి ఉన్నాయి. చిలకడదుంపలు డైటరీ ఫైబర్ ను అధిక మొత్తంలో కలిగి ఉంటాయి.

జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఇది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ప్రేగు కదలికలను మృదువుగా చేసి మలబద్ధకాన్ని సమర్థవంతంగా నివారిస్తుంది. బరువు తగ్గడానికి సహయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలలో క్రమంగా పెంచుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు బెస్ట్‌ ఫుడ్‌గా కూడా స్వీట్‌ పోటాలో తీసుకోవచ్చు. ఇందులో ఉండే ఫైబ్రినోజేన్ కూడా రక్త గడ్డకట్ట కుండా సహాయపడుతుంది. అలాగే ఈ దుంపలలోని అధిక స్థాయి పొటాషియం హార్ట్ బీట్‌ను క్రమబద్ధీకరిస్తుంది. చిలగడదుంపలు వివిధ యాంటీఆక్సిడెంట్లను మన శరీరానికి అందిస్తాయి, ఇవి కొన్ని రకాల కాన్సర్ల నుండి మనలని రక్షించడంలో సాయపడతాయి. చిలకడదుంపలను తినడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది.

చిలగడదుంపలోని ఆంథోసైనిన్లు మంటను తగ్గించి ఫ్రీ రాడికల్ డామేజ్ ను తగ్గిస్తాయి. తక్కువ మోతాదులో షుగర్ ఉన్నవారికి మంచిదని చెబుతున్నారు. ఇందులో ఉండే మెగ్నీషియం ఆరోగ్యకరమైన ధమనులకు, గుండె కండరాలకు చాలా మంచిది. రక్తపోటును నియంత్రిస్తుంది. చిలగడదుంపలో ఉండే ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు గట్ ఆరోగ్యానికి చాలా మంచిది. చిలగడదుంపలో కరిగే, కరగని లాంటి రెండు రకాల ఫైబర్ ఉంటుంది. మన శరీరంలోని జీర్ణ వ్యవస్థ ఏ రకమైన ఫైబర్ ను జీర్ణం చెయ్యదు. అందువల్ల, ఫైబర్ మీ జీర్ణవ్యవస్థలోనే ఉంటుంది. ఇది అనేక రకాల గట్ సంబంధిత ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

అనంతపూర్ జిల్లాలో ఆపిల్ సాగు

రాయలసీమలోని అనంతపురం అంటే మనకు ఠక్కున గుర్తొచ్చేసి కరువు.. ఎండలు.. ఎడారీకరణ జరుగుతున్న పల్లెలు.. అక్కడక్కడా కనిపించే గుళ్ళు గోపురాలు.. కొండల మాటున అక్కడప్పడా సాగయ్యే వేరుశెనగ…

బెంగళూరుకు వలస వెళ్లే కూలీలు.. చలికాలంలో కూడా భగ్గున మండే ఎండలు.. ఇదంతా అనంతపురం సొంతం.. దాని బ్రాండ్.. కానీ ఇప్పుడు అనంతపురం తన రూటు మార్చుకుంటోంది. ఎక్కడో ఎముకలు కొరికే చలిలో .. మంచుకురిసే ప్రాంతాల్లో పాండే యాపిల్స్ ఇప్పుడు అనంతపురం జిల్లాల్లో పండుతున్నాయి. అదేంటి.. మంచుకురిసే ప్రాంతాల్లో పండాల్సిన యాపిల్స్ నిప్పులు కురిసే అనంతపురంలో పండుతున్నాయి.. కాలం మారింది..

అనంతపురం వాతావరణం అంటే దక్షిణభారతదేశంలోనే ఒక ప్రత్యేకమైనది. ఇది భారతదేశంలోనే అత్యల్ప వర్షపాతం గల ప్రాంతం. దారుణమైన నీటి కొరతను ఎదుర్కొనే వ్యవసాయ ప్రాంతాల్లో ఒకటి. ఈ జిల్లాలో 90% కంటే ఎక్కువ భూములు .. రైతులు వాననీటిపై ఆధారపడి సేద్యం చేస్తున్నారు. ఇక్కడ వర్షం తక్కువ.. బావులు.. బోర్లు.. కాలువలు కూడా మృగ్యమే. దీంతో ఇక్కడ అంతటి వర్షాభావ పరిస్థితుల్లో మనగలిగే పత్తి, మామిడి, పొద్దు తిరుగుడు వంటి పంటలను సాగు చేస్తారు. కానీ ఇప్పుడు ఇక్కడ పరిస్థితులు మారాయి. హార్టికల్చర్ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ద్రాక్ష, యాపిల్ వంటి పళ్ళను సైతం పండేలా శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు.

ఇందులో భాగంగా రైతులు, పరిశోధకులు ఏమాత్రం తక్కువ ఉష్ణోగ్రత ఉన్నా మనగలిగే యాపిల్ రకాలను అన్వేషిస్తున్నారు. ఇవి వేడి వాతావరణంలో కూడా పెరగగలవు. అయితే వీటికి సాగునీరు అందించాల్సి ఉంటుంది. దీంతోబాటు డ్రిప్ ద్వారా నీరు అందిస్తే యాపిల్ మరింత ఆరోగ్యకరంగా పెరుగుతుంది. ప్రయోగాత్మకంగా ఇక్కడ యాపిల్స్ పంట సక్సెస్ కావడంతో ఇక ఇక్కడ మున్ముందు మరింతగా దీని సాగు పెరుగుతుందని ఆశిస్తున్నారు. ఒక మొక్క అద్భుతంగా కాపునివ్వడంతో శాస్త్రవేత్తలు, రైతుల్లో సంతోషం మిన్నంటింది. మున్ముందు ఇక్కడ కూడా యాపిల్ సాగు సాధ్యమే అనే విశ్వాసం పెంపొందింది. దీంతో ఈ యాపిల్ సాగుపై అధికారులు, రైతుల్లో అసలు పెరిగి.. ఈ దిశగా కృషి మొదలైంది.

విశాఖ మన్యంలోనూ యాపిల్ సాగు..
అనంతపురంలోనే కాకుండా అల్లూరి జిల్లా చింతపల్లి జీకే వీధి మండలాల్లో యాపిల్ సాగు మంచి ఫలితాలను ఇస్తోంది. సముద్ర మట్టానికి 1200 అడుగుల ఎత్తులో ఉండే చింతపల్లి జీకేవీధి, పాడేరు, అరకులోయల్లోని ఏజెన్సీ ప్రాంతాలు యాపిల్ సాగుకు అనువైన ప్రాంతంగా నిలుస్తున్నాయి. దీంతోబాటు ఆంధ్రప్రదేశ్ కాశ్మీరుగా చెప్పే లంబసింగిలో యాపిల్ సాగుకు అనుకూలం అని తేలింది. దీంతో ఐదేళ్ల క్రితం విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో యాపిల్ సాగు మొదలవగా నేడు అవి మంచి ఫలితాలను ఇస్తున్నది.

ఇక రెండు వెరైటీల యాపిల్ చెట్లు ఇక్కడ పెరిగాయని సాగు చేసిన రైతులు చెబుతున్నారు. ఇక్కడ పండుతున్న ఒక్కో యాపిల్ బరువు 300 – 400 గ్రాములు ఉన్నట్లు తేలింది. విశాఖ ఏజెన్సీలోని దమనపల్లి పంచాయతీ కింద ఉన్న మడెం అనే గిరిజన గ్రామంలో యాపిల్ తోటను పెంచారు. ఒక్కో చెట్టుకు 30 నుంచి 34 యాపిల్ పండ్లు వచ్చాయి. కొన్నేళ్ల క్రితం పాడేరు ఐటీడీఏలో అధికారులు యాపిల్ మొక్కలను కొంతమంది రైతులకు అందజేసి యాపిల్ పెంపకాన్ని ప్రోత్సహించారు. ఇవి మంచి ఫలితాలను ఇచ్చినట్లు అక్కడి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ యాపిల్ సాగు విశాఖ ఏజెన్సీలోని మండలాల్లో 60 నుంచి 70 ఎకరాల్లో సాగులో ఉంది. దీన్ని కనీసం 200 ఎకరాలకు విస్తరించాలన్నది అధికారుల ప్లాన్. మొత్తానికి ఏపీ ఇప్పుడు ఒక యాపిల్స్ అడ్డాగా మారింది.

ఫ్రీ బస్సు అమలు వేళ ఆర్టీసీ కీలక నిర్ణయం, నేటి నుంచి.

హాలక్ష్మీ పథకానికి ఆదరణ పెరుగుతోంది. ప్రభుత్వం ఈ పథకం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోంది. పెద్ద సంఖ్యలో మహిళలు ఈ పథకం వినియోగించుకుంటున్నారు. ఉచిత బస్సు పథకం రెండేళ్లు పూర్తి చేసుకుంది.

ఇదే సమయంలో గ్రేటర్ పరిధిలో ఆర్టీసీ ప్రయాణీకుల కోసం తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. దశల వారీగా ఎలక్ట్రిక్ బస్సులను విస్తరించాలని డిసైడ్ అయ్యారు. ఆ బస్సుల్లోనూ క్రమేణా ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించే ఆలోచన చేస్తున్నారు. గ్రేటర్ పరిధి లో కొత్త ఎలక్ట్రిక్ బస్సులు ఈ రోజు నుంచి అందుబాటులోకి రానున్నాయి.

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మీ పథకం ద్వారా ఇప్పటివరకు 251 కోట్ల మంది మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేసి.. 8459 కోట్ల విలువైన ప్రయాణాన్ని ఉచితంగా పొందినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఉచిత బస్సు ప్రయాణం పైన తొలి రోజుల్లో కొన్ని సమస్యలు వచ్చినా.. ఆ తరువాత వినియోగం భారీగా పెరిగింది. ఈ సమయంలోనే ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ఎలక్ట్రిక్ బస్సుల్లోనూ ఈ పథకం అమలు చేయాల ని నిర్ణయించింది. కాగా, గ్రేటర్‌లో బుధవారం కొత్తగా 65 ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కనున్నాయి. ఈవీ ట్రాన్స్‌ సంస్థ నిర్వహణలో నడిచే ఈ బస్సులను రాణిగంజ్‌ డిపోలో ప్రారంభిస్తున్నారు. కాగా.. గ్రేటర్‌లో రెండేళ్లలో మొత్తం 2,800 ఎలక్ర్టిక్‌ బస్సులు నడపాలని ఆర్టీసీ లక్ష్యంగా పెట్టుకుంది.

గ్రేటర్‌లో ఇప్పటికే 297 ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ పలు రూట్లలో నడుపుతోంది. రాణిగంజ్‌ డిపోకు వచ్చిన 65 ఈవీలతో వాటి సంఖ్య 362కు చేరనుంది. జనవరి, ఫిబ్రవరి నాటికి గ్రేటర్‌కు మరో 178 ఎలక్ర్టిక్‌ బస్సులు వస్తాయని ఆర్టీసీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. కూకట్‌పల్లి బస్‌డిపోను ఈవీబస్‌ డిపోగా మార్చే దిశగా ఆర్టీసీ చర్యలు చేపడుతోంది. ఎలక్ట్రికల్ బస్సులను డిపోల వారీగా కేటాయించారు. హెచ్‌సీయూ 90, హయత్‌నగర్‌ 65, కంటోన్మెంట్‌ 66, మియా పూర్‌-2 76, , రాణిగంజ్‌ 65 కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా బస్సుల్లో పథకం అమలు పైన సమస్యలు వస్తే వెంటనే పరిష్కరించేలా కొత్త విధానం అమల్లోకి తెస్తోంది. కాగా, మహిళలు ప్రస్తుతం ఆధార్ కార్డు చూపించి ఉచిత ప్రయాణం వినియోగించుకుంటున్నారు. త్వరలోనే ఆర్టీసీ స్మార్ట్ కార్డులను ప్రవేశ పెడుతోంది. దీని ద్వారా ఈ కార్డులతోనే మహిళలు ఉచిత ప్రయాణం చేసే అవకాశం అందుబాటులోకి రానుంది.

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పాము ఇదే.. ఒక్క కాటుతో 20 మందిని చంపగలదట

 ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన జీవులలో పాము ఒకటి. కానీ వాటిలో కూడా దాని పరిమాణంతో పాటు, ఒకేసారి అధిక మొత్తంలో విషాన్ని విడుదల చేసే పాము కూడా ఒకటి ఉంది.

పైగా ఇది చాలా ప్రసిద్ధి చెందింది. ఆ పాము పేరే కింగ్ కోబ్రా(King Cobra). ఒకే కాటుతో ఈ పాము 500 మిల్లీగ్రాముల వరకు విషాన్ని విడుదల చేయగలదు. ఈ విషం 20 మంది మనుషులను లేదా ఒక పెద్ద ఏనుగును కూడా కొన్ని గంటల్లో చంపడానికి సరిపోతుందట. ఈ పాము గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం.

ప్రపంచంలోనే పొడవైన విషపూరిత పాము

కింగ్ కోబ్రా ప్రపంచంలోనే పొడవైన విషపూరిత పాము. మూడు నుంచి నాలుగు మీటర్లు, కొన్ని అరుదైన సందర్భాల్లో 5.8 మీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉండటం వల్ల ఇది మరింత భయాన్ని కలిగిస్తుంది. ఇది ఆలివ్ ఆకుపచ్చ నుంచి ముదురు గోధుమ లేదా నలుపు రంగులో ఉంటుంది. ఈ పాము తరచుగా లేత రంగు చారలను కలిగి ఉంటుంది. ప్రమాదం అనిపించినప్పుడు.. అది తన పొడవైన, సన్నని పడగను విప్పి నిల్చొంటుంది. దీనికి శాస్త్రీయ నామం కూడా ఉంది. శాస్త్రీయంగా దీనిని ఓఫియోఫాగస్ అని పిలుస్తారు. అంటే పాము తినేది అని అర్థం. ఇతర పాములు.. ఎలుకలు లేదా పక్షులను వేటాడతాయి. కాని కింగ్ కోబ్రా.. ఇతర పాములను కూడా వేటాడుతుంది.

ఒక్క కాటుతో అంతా మటాష్..

కింగ్ కోబ్రా విషం ఒక శక్తివంతమైన న్యూరోటాక్సిన్. ఇది తన వేట నాడీ వ్యవస్థను మూసివేస్తుంది. ఒకసారి ఇంజెక్ట్ చేసిన తర్వాత.. టాక్సిన్ మెదడు, ముఖ్యమైన అవయవాల మధ్య సిగ్నల్స్ నిరోధిస్తుంది. దీని తరువాత పక్షవాతం వస్తుంది. తరువాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడి గుండెపోటు వస్తుంది. చాలా పాములకు భిన్నంగా.. కింగ్ కోబ్రా ఒకేసారి చాలా ఎక్కువ మొత్తంలో విషాన్ని విడుదల చేస్తుంది. ఈ విషం సాధారణంగా 200 నుంచి 500 మిల్లీగ్రాముల మధ్య ఉంటుంది. ఈ పాము ఏనుగు తొండానికి కాటు వేస్తే.. ఏనుగు కొన్ని గంటల్లోనే చనిపోయిన సందర్భాలు చాలా చోట్లనే జరిగాయి.

అయితే కింగ్ కోబ్రా విషం ప్రాణాంతకం మాత్రమే కాదు.. వైద్యపరంగా కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు పరిశోధకులు. కింగ్ కోబ్రా విషంలో ఓహానిన్ అనే ప్రత్యేకమైన ప్రోటీన్ను పరిశోధనల్లో కనుగొన్నారు. ఇది నొప్పి నివారిణిగా చాలా ఉపయోగకరంగా ఉంటుందని గుర్తించారు. ఇది మార్ఫిన్ కంటే 100 రెట్లు ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుంది. అదే సమయంలో ప్రారంభ అధ్యయనాలు దీనివల్ల ఎలాంటి దుష్ప్రభావాలు లేవని వెల్లడించాయి. దీనిగురించి మరిన్ని స్టడీలు జరగాల్సి ఉంది.

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

వెంకటేష్‌-త్రివిక్రమ్ సినిమా టైటిల్ ఇదే.. ‘ఆదర్శ కుటుంబం’.. హౌస్ నెం 47, ఏకే 47..

 మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా కొద్ది రోజుల క్రితం ఓ చిత్రాన్ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ చిత్ర టైటిల్ ఇదే అంటూ సోషల్ మీడియాలో పలు పేర్లు ప్రచారం అయ్యాయి. వాటి అన్నింటిని పటా పంచలు చేస్తూ తాజాగా ఈ చిత్ర టైటిల్‌ను ప్రకటించారు. ఈ చిత్రానికి ‘ఆదర్శ కుటుంబం’ అనే పేరును ఫిక్స్ చేశారు. ఈ మేరకు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.

ఈ పోస్టర్‌లో వెంకటేష్ బ్యాగ్ పట్టుకుని నవ్వుతూ కనిపిస్తున్నాడు. ఇక ఈ టైటిల్ లోనే హౌస్ నెం 47, ఏకే 47 అంటూ కూడా హైలెట్ చేయడం గమనార్హం. ఈ రోజు నుంచే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుండగా.. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు చెప్పేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతోంది.

శ్రీనిధి శెట్టి కథానాయిక గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతకంపై ఎస్. రాధాకృష్ణ(చినబాబు) ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. గతంలో వెంకీ, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో (Venkatesh-Trivikram) వచ్చిన ‘మల్లీశ్వరీ’, ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాలు ఘన విజయాలను సాధించడంతో తాజా చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

చాట్‌జీపీటీ సహా ఏఐ చాట్‌బాట్‌లతో అసలు షేర్ చేసుకోకూడని విషయాలేంటో తెలుసా..

టెక్నాలజీ పెరిగే కొద్దీ మనం మరింత జాగ్రత్తగా ఉండాల్సి వస్తోంది. ఎందుకంటే టెక్నాలజీతో ప్రయోజనాలే కాదు కొన్నిసార్లు దుష్ప్రరిణామాలు కూడా ఉంటాయి.

ప్రస్తుతం చాలావరకు చాట్జీపీటీ (ChatGPT) వంటి కృత్రిమ మేధస్సు (Artificial intelligence) చాట్బాట్లు మనుషులతో సంభాషించి సమాధానాలు చెబుతున్నాయి. అయితే సాధారణ విషయాలకు సమాధానాలు చెప్పడం, మీకు కావాల్సిన చిన్న పనుల్లో మద్దతు తీసుకోవడం వరకు ఓకే. కానీ అన్ని వేళలా, అన్ని విషయాలలో ఏఐ చాట్బాట్లతో విషయాలు షేర్ చేసుకోవద్దు. ఏఐతో వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకోవడం ప్రైవసీ ఉల్లంఘనకు, డేటా చోరీ, ఐడెంటిటీ చోరీ లాంటి వాటికి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కనుక కింద పేర్కొన్న పది విషయాలను మీరు చాట్ జీపీటీతో పాటు ఇతర ఏఐ టెక్నాలజీ టూల్స్తో షేర్ చేసుకోవద్దు అని తెలుసుకోండి.

ఏఐ చాట్బాట్లతో అస్సలు షేర్ చేసుకోకూడదని 10 విషయాలివే..
ఆర్థిక అంశాలు: మీ బ్యాంక్ ఖాతా వివరాలు, క్రెడిట్ కార్డ్ వివరాలు లేదా సోషల్ సెక్యూరిటీ నెంబర్స్ లాంటి వాటిని సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేసే అవకాశముంది. కనుక బీరు ఏఐ చాట్బాట్లో నమోదు చేస్తే, ఈ డేటా సైబర్ నేరాళ్లచేతికి వెళ్లి ఇబ్బంది పడతారు. మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావొచ్చు. మీ క్రెడిట్, డెబిట్ కార్డులతో ఇతరులు షాపింగ్ చేసే మోసాలు జరుగుతాయి. కనుక మీ బ్యాంకు ఖాతాలు, కార్డుల వివరాలను అధికారిక సంస్థలు, అధికారులతో మాత్రమే షేర్ చేసుకోవాలి, కానీ చాట్ జీపీటీ లాంటి వాటితో కాదని గ్రహించండి.

వ్యక్తిగత సమాచారం: మీ పూర్తి పేరు, ఇంటి అడ్రస్, మీ ఫోన్ నంబర్ ఈమెయిల్ వంటి వివరాలు, పనిచేసే ఆఫీసు వివరాలు లాంటివి మీ ఆన్లైన్ గుర్తింపును ట్రాక్ చేయడానికి ఉపయోగిస్తారు. కనుక ఈ విషయాలు అపరిచితులతో పాటు ఏఐ టూల్స్ తో సైతం షేర్ చేసుకోవడం సరికాదు. సైబర్ నేరాల బారిన పడే అవకాశం ఉంది. మీ లొకేషన్ ట్రాక్ చేసి ఇబ్బందులకు గురిచేయవచ్చు. ప్రైవసీ మెయింటైన్ చేయాలి.

చట్టపరమైన అంశాలు: కాంట్రాక్టులు, కోర్టు కేసులు, లేదా వ్యక్తిగత వివాదాల విషయంలో ఏఐ చాట్బాట్ను సహాయం అడగకూదు. వాటికి వివరాలు అందిస్తే మీ డేటా లీక్ అయ్యి, మీకే హాని జరగవచ్చు. ఏఐ ఎప్పటికీ లాయర్లకు ప్రత్యామ్నాయం కాదు. మిమ్మల్ని తప్పుదారి పట్టించే అవకాశాలున్నాయి. విషయం ముందే లీక్ అయితే కేసులు ఓడిపోయే అవకాశం ఉంది.

ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు: మీ ప్రైవేట్ ఫోటోలను, ఐడీలు, పాస్పోర్ట్లు, డ్రైవింగ్ లైసెన్స్లను చాట్బాట్లో ఎప్పుడూ అప్లోడ్ చేయవద్దు. వాటిని రిమూవ్ చేసినా డిజిటల్ గా ఎక్కడైనా సేవ్ అవుతాయి. మీ వ్యక్తిగత ఫైల్స్ హ్యాక్ చేసి, దుర్వినియోగం చేయవచ్చు. వ్యక్తిగత డాక్యుమెంటేషన్ను ఎల్లప్పుడూ ఆఫ్లైన్లో, ఎన్క్రిప్టెడ్ స్టోరేజ్లో ఉంచాలి. లేకపోతే భవిష్యత్తులో చిక్కులు తప్పవు.

పాస్వర్డ్లు: ఏ ఏఐ చాట్బాట్కు మీ లాగిన్ వివరాలు చెప్పకూడదు. సాధారణ చాటింగ్ లో కూడా పాస్వర్డ్లను షేర్ చేసుకున్నా మీ ఈమెయిల్, బ్యాంకింగ్, సోషల్ మీడియా ఖాతాలు, ఆఫీసు అకౌంట్లు హ్యాకింగ్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఏఐ చాట్లలో పాస్వర్డ్స్, ఫైల్స్ ఎప్పుడూ ఉంచకూడదని సైబర్ సెక్యూరిటీ నిపుణులు సూచిస్తున్నారు.

ఆరోగ్యం, మెడికల్ సమాచారం: మీ అనారోగ్య లక్షణాలు లేదా చికిత్సల గురించి ఏఐ చాట్బాట్లను అడగటం సరికాదు. దానిద్వారా మీకు తప్పుడు రోగ నిర్ధారణ జరగవచ్చు. కనుక డాక్టర్ రికార్డులు, మెడికల్ ప్రిస్కిప్షన్ వంటివి, ఇన్సూరెన్స్ పాలసీ నెంబర్ వివరాలు లీక్ అయితే ప్రమాదకరం. డాక్టర్లను మాత్రమే సంప్రదించి చికిత్స తీసుకోవాలి.

సీక్రెట్ రివీల్ చేయవద్దు: కొంతమంది తమ బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియక ఏఐ చాట్బాట్కు తమ బాధను లేదా రహస్యాలను చెబుతుంటారు. కానీ థెరపిస్ట్తో, మీ సన్నిహితులతో చెప్పినంత సురక్షితం కాదని గుర్తుంచుకోండి. మీ సిక్రెట్స్ ను చాట్ బాట్ రివీల్ చేస్తే వాటిని సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసి మీకు మరింత నష్టాన్ని కలిగించే అవకాశాలున్నాయి.

వర్క్ సంబంధిత సమాచారం: ఉద్యోగులు సీక్రెట్ పేపర్లు, డాక్యుమెంట్స్, లేదా కంపెనీ ప్లాన్ వివరాలను ఏఐ టూల్స్, చాట్ జీపీటీ లాంటి చాట్బాట్ లలో కాపీ చేసి పేస్ట్ చేయవద్దని కంపెనీలు హెచ్చరిస్తున్నాయి. కంపెనీ వ్యూహాలు, అంతర్గత నివేదికలు వేరే ఆఫీసులకు లీక్ కావచ్చు. ఆఫీస్ డేటా, ఆఫీస్ ప్లాన్స్, బిజినెస్ టార్గెట్స్ షేర్ చేసుకోవడం కార్పొరేట్ భద్రతకు ప్రమాదకరం.

ప్రైవసీ కోరుకునే విషయాలు: మీరు చేస్తున్న పని, మీ అలవాట్లు గానీ ఇతరులకు తెలియకూడదంటే వాటిని ఎప్పుడూ ఏఐ టూల్స్, చాట్బాట్లతో అసలు షేర్ చేసుకోవద్దు. ఒకసారి మీరు ఏఐ చాట్బాట్లకు చెప్పారంటే ఏదో ఒకరోజు ఆ విషయం బహిర్గతం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కనుక ఒకసారి రెండుసార్లు ఆలోచించి విషయాలను ఏఐ టూల్స్ తో షేర్ చేసుకోవాలి. మీ డేటా స్టోర్ అవుతుంది. మీరు డిలీట్ చేసినా ఏదో ఓ రోజు మరో కొత్త టూల్, కిట్ ద్వారా విషయం లీకయి మీరు ఆందోళన చెందవచ్చు. డిప్రెషన్ బారిన పడే అవకాశాలు సైతం లేకపోలేదు.

అనుచిత వీడియో, అస్పష్టమైన కంటెంట్: సాధారణంగా అశ్లీల లేదా చట్టవిరుద్ధమైన విషయాలను బ్లాక్ చేసినప్పటికీ ఏఐ ప్లాట్ఫారమ్లు మీరు షేర్ చేసిన వివరాలు రికార్డు చేసే ప్రమాదం ఉంది. ఇందులో ముఖ్యంగా లైంగిక వీడియోలు, సమాచారం, అభ్యంతరకర వ్యాఖ్యలు లేదా చట్టవిరుద్ధమైన విషయాలు ఉంటే మరిన్ని చిక్కులు తప్పవు. కనుక అలాంటి పనులు మీరు రికార్డ్ చేయకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

బిగ్ బ్యాటరీ.. ఆకట్టుకోనే ఫీచర్లు.. బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే

కొన్నేళ్ల కిందటి నుంచి స్మార్ట్‌ఫోన్‌లలో చాలా మార్పులు వస్తున్నాయి. కంపెనీలు పోటీపడి మరీ కొత్త మోడల్స్ మార్కెట్లోకి తెచ్చి సక్సెస్ అవుతున్నాయి.

పెద్ద డిస్‌ప్లేతో కొన్ని ఫోన్లు సక్సెస్ కాగా, అధిక బ్యాటరీతో కొన్ని, స్టోరేజీ కెపాసిటీ, గేమింగ్ కోసం ఫాస్టెస్ట్ ప్రాసెసర్ వల్ల కొన్ని స్మార్ట్‌ఫోన్లు విక్రయాలలో రాణించాయి. ఓవైపు డిస్‌ప్లే పెరగడం, డౌన్‌లోడ్ చేసే యాప్స్, గేమింగ్ ఫీచర్ల కారణంగా పలు కంపెనీలు తమ స్మార్ట్‌ఫోన్‌లలో జంబో బ్యాటరీ ప్యాక్‌లను ఇవ్వడం ప్రారంభించాయి. మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం ప్రారంభం కానున్న తరుణంలో ఈ ఏడాది విడుదలైన 7,000mAh కంటే పెద్ద బ్యాటరీ కలిగిన ఫోన్‌ల వివరాలపై ఓ లుక్కేయండి.

వివో టీ4 5జీ

ఈ వివో ఫోన్ 6.77 క్వాడ్-కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేతో ప్రారంభించారు. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. Snapdragon 7s Gen 3 ప్రాసెసర్ ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో 50MP (OIS) + 2MP డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. దీని ముందు భాగంలో సెల్ఫీలు, వీడియోల కోసం 32MP సెన్సార్ ఇచ్చారు. ఈ ఫోన్ 7300 mAh బ్యాటరీతో వచ్చింది. వివో టీ4 5జీ ఫోన్ 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఇది రూ. 24,999కి లిస్ట్ చేయబడింది.

వన్‌ప్లస్ 15

ఈ ప్రీమియం ఫోన్ 6.78 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లేతో ప్రారంభించబడింది. ఇందులో Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్ ఉంది. ఇది 50MP ట్రిపుల్ కెమెరా సెటప్ మరియు ముందు భాగంలో 32MP లెన్స్‌తో వస్తుంది. ఇది 7,300mAh శక్తివంతమైన బ్యాటరీని కలిగి ఉంది, ఇది 120W సూపర్ ఫ్లాష్ ఛార్జ్ వైర్డ్ ఛార్జింగ్ మరియు 50W వైర్‌లెస్ ఫ్లాష్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 72,999.

ఐక్యూ 15

ఐక్యూ 15 స్మార్ట్ ఫోన్ కూడా తన ఫీచర్లతో OnePlus 15కి పోటీనిస్తుంది. iQOO 15లో 6.85 అంగుళాల M14 LEAD OLED డిస్‌ప్లే ఇచ్చారు. ఇది పవర్‌ఫుల్ Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్‌తో వచ్చింది. ఫోన్ వెనుక భాగంలో ఫొటోలు, వీడియోల కోసం 50MP ట్రిపుల్ కెమెరా సెటప్ ఇచ్చారు. అయితే ఐక్యూ 15 ముందు భాగంలో 32MP కెమెరా ఉంది. ఈ ఫోన్ 100W ఫ్లాష్‌ఛార్జ్‌కు సపోర్ట్ చేసే 7,000mAh సిలికాన్ యానోడ్ బ్యాటరీ ప్యాక్‌ కలిగి ఉంది. ఐక్యూ 15 ఫోన్ ప్రారంభ ధర రూ. 72,999గా ఉంది.

ప్రస్తుతం యువత సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడుపుతున్నారు. తమకు తెలియకుండానే గంటలపాటు రీల్స్, షార్ట్స్ చూస్తూ కూర్చునే వారు కొందరైతే.. గంటల తరబడి ఆన్‌లైన్ గేమ్స్ ఆడే జెన్ జెడ్ యువత ఉన్నారు. ఆఫీసు పనిమీద బయటకు వెళ్లేవారు, ఎక్కువ గంటలపాటు ఫోన్‌లోనే బిజినెస్ చక్కబెట్టే వారికి ఇలాంటి బిగ్ బ్యాటరీ ఫోన్లతో ప్రయోజనం ఉంటుంది. ఎక్కువ mah బ్యాటరీ అనే ఫీచర్లతో కొన్ని కంపెనీలు మార్కెట్లో తమ స్థానాన్ని నిలబెట్టుకుంటున్నాయి.

హైదరాబాద్‌లోని కోచింగ్ సెంటర్‌లో అగ్నిప్రమాదం

హైదరాబాద్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నగరంలోని అమీర్ పేట మైత్రీవనం సమీపంలో ఉన్న శివమ్ టెక్నాలజీస్ కోచింగ్ సెంటర్ లో ఈ ప్రమాదం సంభవించింది.

అన్నపూర్ణ బ్లాక్ లో ప్రమాదం జరగటంతో రెండో అంతస్తు నుండి దట్టంగా పొగలు వ్యాపించాయి. ప్రమాదం తరవాత విద్యార్థులను బయటకు పంపించారు. వెంటనే స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అదించారు. వెంటనే అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నారు. బ్యాటరీలు పేలడం వల్లనే మంటలు వ్యాపించినట్టు ప్రాథమిక సమాచారం అందుతోంది. అయితే ప్రమాదం ఎలా జరిగింది అనేదానిపై ఇంకా పూర్తిస్థాయిలో స్పష్టత రాలేదు.

వణికించే చలికి చెక్ పెట్టండి.. ఎలక్ట్రిక్ దుప్పట్లు తక్కువ ధరకే.

లి గాలులతో దేశంలో నార్త్, సౌత్ అనే తేడా లేకుండా పోయింది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో చలి గజగజ వణికిస్తోంది. దీంతో ప్రజలు హీటింగ్ ఉపకరణాలను కొనడం పై దృష్టి పెడుతున్నారు.

హీటర్లు, గీజర్లతో పాటు, ఎలక్ట్రిక్ దుప్పట్లు కూడా వేగంగా ప్రజాదరణ పొందుతున్నాయి. ఎలక్ట్రిక్ దుప్పట్లు సాధారణ దుప్పట్ల కంటే చాలా ఎక్కువ వెచ్చదనాన్ని అందిస్తాయి. తీవ్రమైన చలిలో కూడా శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడతాయి. అవి త్వరగా వేడెక్కుతాయి. అమెజాన్ లో తక్కువ ధరకే ఎలక్ట్రిక్ బ్లాంకెట్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ నాణ్యత విషయంలో రాజీపడటం హానికరం. ఎలక్ట్రిక్ దుప్పటిని కొనుగోలు చేసేటప్పుడు ఈ విషయాలు గుర్తుంచుకోవాలంటున్నారు నిపుణులు.

సెక్యూరిటీ ఫీచర్లు

ఎలక్ట్రిక్ దుప్పటిని కొనుగోలు చేసేటప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం దాని సెక్యూరిటీ ఫీచర్లు. మల్టిపుల్ టెంపరేచర్ కంట్రోల్, ఆటో షట్-ఆఫ్ ఫీచర్ ఉన్నదాన్ని ఎంచుకోవాలంటున్నారు. ఇది నిర్ణీత సమయం తర్వాత ఆటోమేటిక్ గా ఆగిపోతుంది. వేడెక్కడం, మంటల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

BIS లేదా ISI సర్టిఫికేషన్

సేఫ్టీ సర్టిఫికెట్స్ ఏదైనా విద్యుత్ ఉత్పత్తి ప్రమాణాలను సూచిస్తాయి. అందువల్ల, విద్యుత్ దుప్పటిని కొనుగోలు చేసేటప్పుడు, BIS ధృవీకరణ లేదా ISI గుర్తు కోసం చూడండి. ఇది దుప్పటి అవసరమైన ప్రభుత్వ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉందని నిర్ధారిస్తుంది. విద్యుత్ దుప్పట్లను తయారు చేసే కంపెనీలు BIS కింద IS 302 (పార్ట్ 1):2024 ధృవీకరణ పొందవలసి ఉంటుంది.

వైరింగ్, ఫాబ్రిక్ క్వాలిటీ

ఎలక్ట్రిక్ దుప్పటి లోపల వైరింగ్ అనేది అతి ముఖ్యమైన భాగం. ఇది బలంగా, సరళంగా ఉండాలి. తద్వారా నిరంతరం ఉపయోగించడం వల్ల వంగదు లేదా విరిగిపోదు. విరిగిన వైర్ విద్యుత్ షాక్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఇంకా, దుప్పటి, ఫాబ్రిక్ తేలికైనది, మృదువైనది, చర్మానికి అనుకూలంగా ఉండాలి. మీరు ఒకదాన్ని కొనుగోలు చేసే ముందు వైరింగ్, ఫాబ్రిక్ నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

మీరు శుభ్రతను ఇష్టపడితే, తొలగించగల కంట్రోలర్ ఉన్న ఎలక్ట్రిక్ దుప్పటిని ఎంచుకోండి. కంట్రోలర్‌ను తీసివేయడం వల్ల నీటితో కడగడం సులభం అవుతుంది. ఉపయోగించిన తర్వాత ఎలక్ట్రిక్ దుప్పటిని ఎప్పుడూ గట్టిగా మడవకూడదని గుర్తుంచుకోండి. ఇది వైరింగ్‌ను దెబ్బతీస్తుంది. దుప్పటి జీవితకాలాన్ని తగ్గిస్తుంది. అమెజాన్ లో Zennovate బ్రాండ్ కు చెందిన ఎలక్ట్రిక్ బ్లాంకెట్ రూ. 1498కి అందుబాటులో ఉంది.

టాస్కుల ద్వారా ఒకరు..ఆడియన్స్ ఓటింగ్ ద్వారా ఒకరు..ఈ వారం ‘బిగ్ బాస్ 9’ నుండి ఆ ఇద్దరు అవుట్

ఊహించని ట్విస్టులు , ఎమోషన్స్ తో ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) షో బ్లాక్ బస్టర్ టీఆర్ఫీ రేటింగ్స్ తో ఎట్టకేలకు 13 వారాలు పూర్తి చేసుకొని 14వ వారం లోకి అడుగుపెట్టింది.

ఇన్ని వారాలు ఉత్కంఠ భరితంగా సాగింది కదా, చివరి ఈ రెండు వారాలు అయినా కంటెస్టెంట్స్ ని ప్రశాంతంగా ఉంచుతారేమో బిగ్ బాస్ అని అంతా అనుకున్నారు. కానీ ఈ రెండు వారాలు కూడా ఆడియన్స్ కి ఉత్కంఠ తో నరాలు తెగిపోయే రేంజ్ టాస్కులు డిజైన్ చేశారు బిగ్ బాస్ టీం. నిన్న నామినేషన్స్ ప్రక్రియ లాంటివి ఏమి లేకుండా, బిగ్ బాస్ పవన్ కళ్యాణ్ ని మినహా, మిగిలిన కంటెస్టెంట్స్ అందరినీ నామినేట్ చేసాడు. ఇప్పుడు నామినేషన్స్ లో ఇమ్మానుయేల్, తనూజ, భరణి, డిమోన్ పవన్, సంజన మరియు సుమన్ శెట్టి ఉన్నారు.

వీరిలో ఈ వారం ఆడుతున్న టాస్కులలో ఎవరికైతే అత్యధిక పాయింట్స్ వస్తాయో, వాళ్ళు నేరుగా నామినేషన్స్ నుండి సేవ్ అయ్యి, ఫినాలే వీక్ లోకి అడుగుపెడతారు. అదే విధంగా ఎవరికైతే తక్కువ పాయింట్స్ వస్తాయో, వాళ్ళు ఎలిమినేట్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతారు. దమ్ము శ్రీజా ఎలిమినేషన్ మీ అందరికీ గుర్తుంది కదా, అదే తరహా ఎలిమినేషన్ ఈ వారం కూడా జరగబోతుంది. నిన్నటి ఎపిసోడ్ లో జరిగిన టాస్కులో ఇమ్మానుయేల్ గెలిచి 50 పాయింట్స్ సాధించాడు. ఆ తర్వాత భరణి 40 పాయింట్స్ సాధించి రెండవ స్థానం లో ఉండగా, డిమోన్ పవన్ 30 పాయింట్లు, తనూజ 20 పాయింట్లు , సుమన్ శెట్టి 10 పాయింట్స్ సాధించారు. ఇక సంజన కి కంటెస్టెంట్స్ అందరూ జీరో పాయింట్స్ ఇచ్చి జైలు లో వేయడం వల్ల ఆమె మొదటి టాస్కులో ఆడలేకపోయింది. ఇక రెండవ టాస్కు ని కాసేపటి క్రితమే మీరు ప్రోమో లో చూసి ఉంటారు.

ఈ టాస్క్ లో కూడా ఇమ్మానుయేల్ గెలిచి 100 పాయింట్స్ సాధించాడు. మొదటి రెండు టాస్కులు కలిపి 150 పాయింట్స్ ని ఇమ్మానుయేల్ సాధించి నెంబర్ 1 స్థానం లో కొనసాగగా, రెండవ స్థానం లో 120 పాయింట్స్ తో డిమోన్ పవన్, ఇక 90 పాయింట్స్ లో తనూజ, భరణి, సుమన్ శెట్టి మూడవ స్థానం లో 80 పాయింట్స్ తో సంజన నాల్గవ స్థానంలో కొనసాగుతున్నారు. వీరిలో ప్రస్తుతానికి సంజన డేంజర్ జోన్ లో ఉంది. ఆమె ప్రతీ టాస్క్ గెలుస్తూ రావాలి, లేదంటే అందరికంటే తక్కువ పాయింట్స్ ఈమెకే వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈమె ఎలిమినేట్ అవ్వొచ్చు. ఇక ఆడియన్స్ ఓటింగ్ ద్వారా అయితే సుమన్ శెట్టి డేంజర్ జోన్ లో ఉన్నాడు. ఈయన కూడా వీకెండ్ ఎపిసోడ్ లో ఎలిమినేట్ అవ్వొచ్చు. కాబట్టి ఈ వారం ఒక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి తప్ప, మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ టెన్షన్ తోనే ఉండాలి.

ఎలాన్‌ మస్క్‌ సమర్పించు… మెమొరీ ట్రిక్స్‌

‘అదేమిటో… చిన్న చిన్న విషయాలు కూడా గుర్తుపెట్టుకోలేకపోతున్నాను’ అనుకునేవారిలో మీరు కూడా ఉన్నారా? అయితే మీరు అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ అనుసరించే మెమోరీ ట్రిక్స్‌ ఫాలో కావాల్సిందే.

‘ట్రిక్స్‌ టు రిమెంబర్‌ ఎవ్రీథింగ్‌’ అంటున్నాడు మస్క్‌. వాటిలో కొన్ని…

బ్రెయిన్‌ అనేది కొన్నిసార్లు అనవసర సమాచారంతో, అనవసర ఆలోచనలతో చెత్తబుట్టగా మారిపోతుంది. దీంతో అవసరమైన విషయాలకు చోటు ఉండదు. అందుకే అనవసర విషయాలను ఎప్పటికప్పుడూ డిలీట్‌ చేసి మంచి విషయాల కోసం స్పేస్‌
ఏర్పాటు చేసుకోవాలి.

ముఖ్యమైన విషయాలతో ‘మెమోరీ ట్రీ’ నిర్మించాలి. ఈ చెట్టుకు కొమ్మలుగా కొత్త విషయాలను అనుసంధానిస్తూ పోవాలి.

ఎవరికివారు పర్సనల్‌ కోడింగ్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకోవాలి. విషయాలను వేగంగా గుర్తు తెచ్చుకోవడానికి సంఖ్యలు, చిహ్నాలు, చిత్రాలు.. మొదలైన వాటిని ఉపయోగించాలి. ‘ఈ ట్రిగ్గర్‌లు మెదడులోని సంక్లిష్ట సమాచారాన్ని త్వరగా, తక్కువ శ్రమతో తిరిగి పోందడానికి ఉపయోగపడతాయి’ అంటాడు మస్క్‌.

విషయాలు, పేర్లను గుర్తు తెచ్చుకోవడంలో ‘మీనింగ్‌ఫుల్‌ కనెక్షన్‌’ ముఖ్యం అంటాడు ఎలాన్‌ మస్క్‌. ఉదాహరణకు ఒక వ్యక్తి పేరును గుర్తు తెచ్చుకోవడానికి వారి హాబీ, ఫన్నీస్టోరీ, వారి ముఖానికి సంబంధించి యూనిక్‌ ఫీచర్, ఆ వ్యక్తి నవ్వు, మాట్లాడే పద్ధతి… మొదలైన వాటితో పేరును గుర్తు పెట్టుకోవాలి.

మీనింగ్‌ఫుల్‌ కనెక్షన్‌ అనేది ఎందుకు ముఖ్యమైనది అంటే… మన మెదడు ర్యాండమ్‌ ఫ్యాక్ట్స్‌ కంటే స్టోరీలను, ఎమోషన్‌లనూ ఎక్కువగా గుర్తుపెట్టుకుంటుంది.

‘అసోసియేట్‌ ఇన్‌ఫర్‌మేషన్‌’ టెక్నిక్‌ గురించి నొక్కిచెబుతున్నాడు మస్క్‌. అసాధారణ దృశ్యాలతో, సమాచారాన్ని గుర్తు పెట్టుకోవడమే… అసోసియేట్‌ ఇన్‌ఫర్‌మేషన్‌. ఉదాహరణకు… ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు అరటిపండ్లు కొనాలనుకున్నారు. ఇందుకోసం ఒక అసాధారణ దృశ్యాన్ని మదిలో ఆవిష్కరించుకోవాలి. ఏనుగంత సైజులో ఉన్న అరటిపండు సన్‌గ్లాసెస్‌ ధరించి మీ కిచెన్‌లో డ్యాన్స్‌ చేస్తుంటుంది!

‘రిపీట్‌ అండ్‌ రివ్యూ’ మెథడ్‌లో భాగంగా గతంలోకి వెళ్లి మనకు నచ్చిన విషయాలను గుర్తు తెచ్చుకోవాలి. ఇలా తరచుగా చేయడం ద్వారా జ్ఞాపకశక్తి బలోపేతం అవుతుంది.

ఆరు నెలల్లో 20 కేజీలు తగ్గిన వ్యక్తి.. 14 గోల్డెన్ రూల్స్ కచ్చితంగా పాటించాడట, అవేంటంటే..

కొత్త సంవత్సరం వచ్చేస్తుంది. చాలామందికి బరువు తగ్గాలనే కోరిక మళ్లీ రెట్టింపు అవుతుంది. ఎందుకంటే ప్రతి ఇయర్ చాలామంది విష్​ లిస్ట్​లో ఒకటి ఉంటుంది.

అలానే ఓ వ్యక్తి కూడా ఫిట్​నెస్ విషయంలో స్ట్రిక్ట్​గా ఉండాలనుకున్నాడు. 6 నెలలు కష్టపడి 14 విషయాలు ఫాలో అవుతూ 20 కేజీలు తగ్గాడు. అతనే పృథ్వీ చౌదరి. ప్రాజెక్ట్ ప్రోగామ్ మేనేజ్​మెంట్ కన్సల్టెంట్​గా చేస్తోన్న పృధ్వీ తన వెయిట్​లాస్ జర్నీ గురించి.. సోషల్ మీడియాలో పంచుకున్నాడు.

బరువు తగ్గడానికి హెల్ప్ చేసిన 14 గోల్డెన్ రూల్స్..

బరువు తగ్గాలని కోరిక ఉంటే సరిపోదు. కానీకోసం శారీరకంగా, మానసికంగా కొన్ని కమిట్మెంట్స్, ఓపిక, నిబద్ధత ఉండాలన్నారు పృధ్వీ. అయితే తన 20 కేజీల వెయిట్​లాస్ జర్నీలో 14 విషయాలు కచ్చితంగా ఫాలో అయ్యాడట. అవేంటంటే..

1. నో షుగర్ – 6 నెలలు స్వీట్స్​కి పూర్తిగా దూరంగా ఉన్నాడట. అయితే Monk fruit స్వీటనర్​ని రిప్లేస్​మెంట్​గా తీసుకునేవాడట. ఇది క్రేవింగ్స్​ కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేసిందని తెలిపారు.

2. నో మైదా – మైదాతో తయారు చేసిన బిస్కెట్లు, ఇతర వేయించిన పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉన్నట్లు తెలిపారు.

3. బిర్యానీకి బై – ఈ ఆరు నెలలు బిర్యానీ, స్వీట్స్, ఐస్​ క్రీమ్ జోలికి వెళ్లలేదని చెప్పాడు.

4. కార్డియో – ప్రతిరోజూ 45 నిమిషాలు కార్డియో, స్ట్రెంత్ ట్రైనింగ్ 45 నిమిషాలు చేసేవారట.

5. ప్రోటీన్ – ప్రతి భోజనంలో ప్రోటీన్ కచ్చితంగా ఉండేలా చూసుకునేవారట. తన బరువును బట్టి.. ఒక్కో కేజీకి 1.5 గ్రాముల ప్రోటీన్ ఉండేలా చూసుకునేవారట.

6. నీళ్లు – శరీరాన్ని హైడ్రేటెడ్​గా ఉండేందుకు రోజుకు 3 లీటర్ల నీళ్లు తాగేవారట.

7. స్నాక్స్ – బయట దొరికే చిరుతిళ్లకు బదులుగా.. 500 గ్రాముల పండ్లు తీసుకునేవారట.

8. డ్రై ఫ్రూట్స్ – రోజుకు రెండు వాల్​నట్స్, 5 బాదం తీసుకునేవారట. ఉదయం లేదా సాయంత్రం స్నాక్స్​గా వీటిని ఫ్రూట్స్​ని తినేవారట.

9. భోజన సమయాలు – మధ్యాహ్న భోజనం 12.30కి, రాత్రి భోజనం 7లోపు ముగించేవారట.

10. నిద్ర సమయం – రోజూ రాత్రి 9.30కి పడుకుంటే.. ఉదయం 5.30కి లేచేవారట.

11. బ్రేక్​ఫాస్ట్ – ఉదయాన్నే రెండు దోశలు లేదా మూడు ఇడ్లీలు తినేవారట. వాటితో పాటు మూడు ఎగ్ వైట్స్, 125ml పాలు లేదా కాఫీ షుగర్ లేకుండా తీసుకునేవారట.

12. లంచ్ – 120 గ్రాముల అన్నం, వెజ్ లేదా నాన్​వెజ్ కర్రీ. అలాగే 100 గ్రాముల పెరుగు మధ్యాహ్న భోజనంలో తీసుకునేవారట.

13. 250 గ్రాముల తందూరి లేదా గ్రిల్ చేసిన చికెన్ తీసుకునేవారట.

14. కెలరీ ట్రాకింగ్ చేసేవారట.

ఇవన్నీ తాను బరువు తగ్గడంలో హెల్ప్ చేశాయంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. పృథ్వీ ఫాలో అయింది రొటీన్​లో చిన్న చిన్న మార్పులే. కానీ వాటిని సమయానికి ఫాలో అవుతూ.. లైఫ్​స్టైల్ బ్యాలెన్స్ చేసుకోవడం వల్ల భారీ రిజల్ట్స్ చూశారు. మీరు కూడా 2026లో ఫిట్​నెస్ మీ గోల్ అనుకుంటే.. ఈ తరహా లైఫ్​స్టైల్ ప్లాన్ చేసుకోవచ్చు. అన్నీ ఇవే ఫాలో అవ్వాలని లేదు. మీ హెల్త్, మీ బరువు, మీ వర్క్​ లైఫ్​కి తగ్గట్లుగా దీనిని మార్చుకోవచ్చు.

భారతీయులకు బిగ్ షాక్.. డిసెంబర్ 15 నుండి అమలులోకి H-1B వీసా కొత్త నిబంధనలు

H-1B వీసా నిబంధనలు కఠినతరం చేసింది అమెరికా. H-1B వీసా నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించారు. H-1B వీసాలకు సోషల్ మీడియా ప్రొఫైల్ వెరిఫికేషన్ తప్పనిసరి చేయడం ఇదే తొలిసారి.

డిసెంబర్ 15 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి. ట్రంప్ ప్రభుత్వం అన్ని రాయబార కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు నుండి, సోషల్ మీడియా ప్రొఫైల్‌లను పబ్లిక్‌గా ఉంచాలనే నిబంధన F-1, M-1 మరియు J-1 స్టడీ వీసాలతో పాటు B-1, B-2 విజిటర్ వీసాలకు కూడా అమలు చేయడం జరుగుతుంది.

H-1B దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా ఖాతాలను పబ్లిక్‌గా ఉంచాల్సి ఉంటుంది. తద్వారా అమెరికా అధికారులు వారి ప్రొఫైల్‌లు, సోషల్ మీడియా పోస్ట్‌లు, లైక్‌లను పరిశీలిస్తారు. దరఖాస్తుదారుడి సోషల్ మీడియా కార్యకలాపాలు అమెరికా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని భావిస్తే H-1B వీసా జారీ నిలిపివేస్తారు. H-4 వీసాల కోసం H-1B ఆధారపడినవారు (జీవిత భాగస్వాములు, పిల్లలు, తల్లిదండ్రులు) కూడా పబ్లిక్ సోషల్ మీడియా ప్రొఫైల్‌లను నిర్వహించాల్సి ఉంటుందని వైట్ హౌజ్ అధికారులు ప్రకటించారు.

అమెరికా విదేశాంగ శాఖ కొత్త సోషల్ మీడియా పరిశీలన విధానం భారతదేశంలోని H-1B వీసా దరఖాస్తుదారులకు భారీగా ప్రభావం చూపిస్తోంది. అనేక నియామకాల వల్ల వీసా దరఖాస్తులు వచ్చే సంవత్సరానికి వాయిదా పడ్డాయి. భారతదేశంలోని అమెరికా రాయబార కార్యాలయం మంగళవారం రాత్రి వీసా దరఖాస్తుదారులకు ఒక సలహా జారీ చేసింది. ‘మీ వీసా అపాయింట్‌మెంట్ రీషెడ్యూల్ చేసినట్లు మీకు ఇమెయిల్ అందితే, మీ కొత్త అపాయింట్‌మెంట్ తేదీలో మీకు సహాయం చేయడానికి మిషన్ ఇండియా ఎదురుచూస్తోంది’ అని అది పేర్కొంది.

గతంలో షెడ్యూల్ చేసిన ఇంటర్వ్యూ తేదీన కాన్సులేట్‌కు వచ్చే ఏ వీసా దరఖాస్తుదారుడికైనా రీషెడ్యూల్ గురించి తెలియజేసిన తర్వాత ప్రవేశం నిరాకరిస్తామని రాయబార కార్యాలయం హెచ్చరించింది. ‘మీరు గతంలో షెడ్యూల్ చేసిన అపాయింట్‌మెంట్ తేదీకి చేరుకోవడం వలన మీకు రాయబార కార్యాలయం లేదా కాన్సులేట్‌కు ప్రవేశం నిరాకరిస్తాము’ అని రాయబార కార్యాలయం తెలిపింది.

డిసెంబర్ మధ్య నుండి చివరి వరకు జరగాల్సిన ఇంటర్వ్యూలను వచ్చే ఏడాది మార్చికి వాయిదా వేస్తున్నట్లు బ్లూమ్‌బెర్గ్ పేర్కొంది. అయితే, ఖచ్చితమైన సంఖ్య రీషెడ్యూల్‌ వివరాలను వెల్లడించలేదు. ప్రముఖ వ్యాపార వలస న్యాయ సంస్థకు చెందిన న్యాయవాది స్టీవెన్ బ్రౌన్ దీనిపై స్పందించారు. ‘మిషన్ ఇండియా మేము వింటున్న విషయాన్ని ధృవీకరిస్తోంది. రాబోయే వారాల్లో అనేక అపాయింట్‌మెంట్‌లను రద్దు చేసి, సోషల్ మీడియా పరిశీలనకు వీలుగా మార్చికి వాటిని తిరిగి షెడ్యూల్ చేశారు’ అని అన్నారు.

అమెరికా ప్రభుత్వం H-1B వీసా దరఖాస్తుదారులు, వారిపై ఆధారపడిన H-4 వ్యక్తుల కోసం స్క్రీనింగ్, పరిశీలన చర్యలను విస్తరించింది. వారి అన్ని సోషల్ మీడియా ప్రొఫైల్‌లలో గోప్యతా సెట్టింగ్‌లను ‘పబ్లిక్’గా ఉంచాలని వారిని ఆదేశించింది. వీసా దరఖాస్తుదారులలో అనుమతి లేని, అమెరికా జాతీయ భద్రతకు, ప్రజా భద్రతకు ముప్పు కలిగించే వారిని గుర్తించడానికి అధికారులు డిసెంబర్ 15 నుండి వారి ఆన్‌లైన్ ఉనికిని సమీక్షిస్తారు. విద్యార్థులు, సందర్శకులు ఇప్పటికే అలాంటి పరిశీలనకు గురయ్యారు.

ట్రంప్ సర్కార్ నుండి పెరుగుతున్న ఒత్తిడిని ఎదుర్కొంటున్న నైపుణ్యం కలిగిన విదేశీ కార్మికులకు ప్రాథమిక వలస మార్గం అయిన H-1B ప్రోగ్రామ్ తాజా పరిశీలన సోషల్ మీడియా స్క్రీనింగ్. సెప్టెంబర్‌లో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త H-1B వర్క్ వీసాలపై ఒకేసారి $100,000 రుసుమును విధించారు. ఈ ఉత్తర్వు అమెరికాలో తాత్కాలిక ఉపాధిని కోరుకునే భారతీయులను గణనీయంగా ప్రభావితం చేస్తుంది.

ఆల్ టైమ్ రికార్డులు బద్దలు.. బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు రికార్డుల మోత మోగిస్తున్నాయి. ఇటీవల తగ్గినట్లే తగ్గిన వెండి ధర మళ్లీ రాకెట్ వేగంతో దూసుకెళ్తోంది. ఫలితంగా సరికొత్త రికార్డులను నమోదు చేస్తూ..

కిలో వెండి రూ.2లక్షలు దాటేసింది..

బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 870 పెరగ్గా.. 22 క్యారట్ల బంగారంపై రూ. 800 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు పెరిగింది. ఔన్సు గోల్డ్‌పై ఏకంగా 18డాలర్లు పెరిగింది. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,206 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

వెండి ధర రికార్డుల మోత మోగిస్తోంది. కిలో వెండిపై ఇవాళ ఏకంగా రూ.8వేలు పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ.2లక్షలు దాటేసింది. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరలలో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈనెల చివరి నాటికి వెండి రేటు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర పెరిగింది.
హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో.. 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.1,19,450 కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,30,310కు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,19,600 కాగా.. 24క్యారట్ల ధర రూ. 1,30,460కు చేరింది.
ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,20,300 కాగా.. 24క్యారట్ల ధర రూ.1,31,240కు చేరింది.
వెండి ధర ఇలా..
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర భారీగా పెరిగింది. కిలో వెండిపై రూ.8వేలు పెరిగింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.2,07,000 వద్దకు చేరింది.
ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.1,99,000 వద్దకు చేరింది.
చెన్నైలో కిలో వెండి ధర రూ. 2,07,000 వద్దకు చేరింది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

Health

సినిమా