Friday, November 15, 2024

మీ అవివేకానికి, అజ్ఞానానికి ఇదే నిదర్శనం.. జగన్‌కు మళ్లీ కౌంటర్ ఇచ్చిన షర్మిల

అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ దూరంగా ఉండటంపై షర్మిల ఘాటుగా స్పందించారు. మరోసారి జగన్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మీ అవివేకానికి, అజ్ఞానానికి ఇదే నిదర్శనం అని ట్వీట్ చేశారు. అటు కూటమి ప్రభుత్వంపైనా షర్మిల విమర్శలు గుప్పించారు. షర్మిల కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి తన సోదరుడు జగన్‌పై సెటైర్లు వేశారు. వైసీపీ తీరు.. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లుందని విమర్శించారు. అసెంబ్లీ మీద అలగడానికో.. మైకు ఇస్తేనే పోతానని మారం చేయడానికో కాదు ప్రజలు ఓట్లేసింది.. ఇంట్లో కూర్చొని సొంత మైకుల్లో మాట్లాడేందుకు కాదు మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించింది అని ట్వీట్ చేశారు.

‘మీ స్వయం కృతాపరాధం మిమ్మల్ని ప్రతిపక్ష హోదాకి దూరం చేస్తే… ఆ హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతా అనడం మీ అవివేకానికి, అజ్ఞానానికి నిదర్శనం. అసెంబ్లీ అనేది ప్రజాస్వామ్య దేవాలయం. ప్రజల పట్ల, ప్రజా సమస్యల పట్ల అధికార పక్షాన్ని నిలదీసేందుకు ప్రజలు ఇచ్చే గొప్ప అవకాశం’ అని షర్మిల వ్యాఖ్యానించారు.

‘కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలకు దిక్కులేదు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోంది. మహిళలపై దాడులు ఆగడం లేదు. ఇసుక మాఫియా రాజ్యమేలుతోంది. బెల్టు షాపుల దందాను అరికట్టలేదు. 5 నెలలైనా ఒక్క ఉద్యోగం భర్తీ కాలేదు. రోజు రోజుకు నిరుద్యోగం పెరుగుతోంది’ అని షర్మిల ఆరోపించారు.

‘ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజా గొంతుక అయ్యే అవకాశం వైసీపీకి ప్రజలు ఇస్తే… ప్రతిపక్షం ఇస్తేనే వస్తాం అనడం సిగ్గు చేటు. ప్రతిపక్షం లేకుంటే సభలోనే ప్రజాపక్షం అవ్వాలని ఇంగితం కూడా లేకపోవడం బాధాకరం. 1994లో కాంగ్రెస్ పార్టీ 26 సీట్లకే పరిమితం అయినా.. కుంగిపోలేదు. మీ లెక్క హోదా కావాలని మారం చేయలేదు. 26 మంది సభ్యులతో సభలో ప్రజల పక్షంగా నిలబడ్డాం. ఎన్నో సమస్యలపై ఆనాడు టీడీపీ ప్రభుత్వానికి చుక్కలు చూపించింది కాంగ్రెస్ పార్టీ’ అని షర్మిల ట్వీట్ చేశారు.

‘2014లో కేంద్రంలో 44 సీట్లకే పరిమితం అయినా, 2019లో 52 సీట్లే వచ్చినా ప్రతిపక్ష హోదా కావాలని అడగలేదు. హోదా లేకున్నా రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే ప్రజా సమస్యలపై తమ గొంతు వినిపించారు. మోదీ నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. దేశ ప్రజల సమస్యలపై కాంగ్రెస్ గొంతుకగా మారింది’ అని వివరించారు.

‘ఇప్పటికైనా మీ పిచ్చితనాన్ని పక్కన పెట్టి అసెంబ్లీకి వెళ్ళండి. కూటమి నిర్లక్ష్యాన్ని ఎండగట్టండి. అసెంబ్లీకి వెళ్ళే దమ్ము ధైర్యం లేకుంటే వైసీపీ శాసనసభా పక్షం మొత్తం రాజీనామాలు చేయండి. అప్పుడు ఇంట్లో కాదు.. ఎక్కడైనా కూర్చుని తాపీగా మాట్లాడుకోండి’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అటల్ పెన్షన్ యోజన ప్రీమియం సకాలంలో కడుతున్నారా? ఈ విషయాలు మరువకండి..

అసంఘటిత రంగంలోని కోట్లాది మందికి వృద్ధాప్యంలో భరోసా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అటల్ పెన్షన్‌ యోజన పథకాన్ని కేంద్రం ప్రారంభించి పదేళ్లు సమీపిస్తోంది. ఏపీవై స్కీమ్‌లో చందాదారుడే సకాలంలో ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. సకాలంలో ప్రీమియం చెల్లించకపోతే ఏమవుతుందంటే…

దేశంలోని దాదాపు 50 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికుల్లో సగటున 90శాతం మందికి వృద్దాప్యంలో ఎలాంటి పెన్షన్‌ సదుపాయం లేకపోవడంతో వారి జీవనం కష్టంగా మారుతోంది. అసంఘటిత రంగంలో ఉన్న వారికి అవసాన దశలో ఆసరా కోసం 2015లో కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది.

ఎవరికి ఉపయోగం..

18 ఏళ్ల వయసు నుండి 40 ఏళ్ల వయసున్న వారు తమ బ్యాంకు సేవింగ్‌ ఖాతా ద్వారా ఈ పించన్ పథకంలో చేరవచ్చు. ఖాతా లేని వారు కొత్తగా ఖాతా తెరిచి ఈ పథకంలో చేరవచ్చు. గ్రామీణ బ్యాంకులతో పాటు నేషనల్ పెన్షన్ పథకంలో భాగంగా ఏ జాతీయ బ్యాంకులోనైనా ఏపీవై ఖాతాను తెరవొచ్చు.

ప్రభుత్వ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ద్వారా సామాజిక భద్రత సౌకర్యం కలవారు, ఆదాయపు పన్ను చెల్లిస్తున్నవారు ఈ పథకానికి అనర్హులుగా ప్రకటించారు. బ్యాంకు ఖాతాలో మొబైల్ నంబర్ నమోదు తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. ఎన్‌పిఎస్‌ ఖాతాలో జీవిత భాగస్వామి వివరాలు, నామిని పేరు కూడా రాయాల్సి ఉంటుంది. ఒకరికి ఒక పింఛన్ ఖాతా మాత్రమే కలిగి ఉండాలి.
ప్రయోజనాలు ఏమిటి?

చందా దారుడి వయసు, ప్రతి నెల జమ చేసే మొత్తాన్ని బట్టి 60 ఏళ్ల వయసు నుండి ప్రతి నెలా ప్రభుత్వం వేయి రుపాయలు మొదలుకుని ఐదువేల రూపాయల వరకు కనీస పించన్ చెల్లిస్తుంది. చందాదారుడు మరణిస్తే జీవిత భాగస్వామికి పించన్ ఇస్తారు. ఇద్దరి తర్వాత వారసులకు పించన్ నిధిని చెల్లిస్తారు. ఏడాదిలో చందాదారుడు దాచుకున్న మొత్తంలో సగం వరకు (గరిష్టంగా వేయి రూపాయలు) పించన్ ఖాతాలో ప్రభుత్వం అదనంగా జమ చేస్తుంది. ఇలా ఐదేళ్ళ పాటు ప్రభుత్వం నగదు జమ చేస్తుంది. 2015 జూన్ 1 నుండి 2016 మార్చి 31 లోపు ఈ పథకంలో చేరిన వారికి మాత్రమే ప్రభుత్వం ఇలా వేయి రూపాయలు జమ చేస్తుంది.

మధ్యలో ప్రీమియం చెల్లించకపోతే…

బ్యాంకు ఖాతా నుండి ఆటో డెబిట్ విధానంలో ప్రతినెలా వాయిదా మొత్తాన్ని బదిలీ చేసేందుకు చందాదారుడి బ్యాంకు ఖాతాలో తగిన నగదు నిల్వ ఉండేలా చూసుకోవాలి. చందాదారుడి ఖాతా నుండి పెన్షన్‌ నిధికి సొమ్ము మళ్ళిన ప్రతి సారి మొబైల్ ఫోన్ కి సంక్షిప్త సందేశం వస్తుంది. ఖాతా స్టేట్మెంట్‌ను కూడా బ్యాంకు నుంచి పొందవచ్చు.

ఏ నెలలోనయినా తగినంత నిల్వ లేకపోతే పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకును బట్టి ఈ మొత్తం పెనాల్టీ ఉంటుంది. ఇలా వసూలు చేసే అపరాధ రుసుమును నిర్వహణ ఖర్చులకు కేటాయించకుండా మీ పెన్షన్‌ ఫండ్‌లోనే జమ చేస్తారు. 6 నెలల వరకు ప్రీమియం జమ కాకపోతే ఖాతాను స్తంభింపచేస్తారు. 12 నెలల వరకు జమ లేకపోతే ఖాతా డార్మెంట్‌ స్థితిలోకి వెళ్తుంది.

24 నెలల వరకు జమ లేకపోతే అలాంటి ఏపీవై ఖాతాలను ముగిస్తారు, ప్రభుత్వం వేయి రూపాయల చొప్పున జమ చేసిన మొత్తాన్ని కూడా డిపాజిట్టారు కోల్పోవాల్సి వస్తుంది.
ఏపీవై ప్రీమియం జమ చేస్తున్న కాలంలో ఎప్పుడయినా పించన్ పెరిగేలా, తగ్గేలా జమ మొత్తాన్ని మార్చుకోవచ్చు. ఈ మార్పును ఏటా ఏప్రిల్ నెలలో మాత్రమే అనుమతిస్తారు. మరణం, దీర్ఘకాలిక రోగాల వంటి తప్పని పరిస్థితులలో 60 సంవత్సరాలలోపు ఏపీవై పొదుపు చేసిన మొత్తాన్ని ఉపసంహరణకు అనుమతిస్తారు.
నగదు ఉపసంహకరించుకునే సమయానికి ఖాతాలో జమ అయిన డబ్బుకు ప్రభుత్వం ద్వారా చెల్లించిన ప్రోత్సాహకాలు మినహాయించి, చందాదారుడు జమ చేసిన మొత్తానికి వడ్డీతో సహా చెల్లిస్తారు.
60 ఏళ్లలోపు ఖాతాదారు మరణిస్తే ఖాతాదారు భార్య లేదా భర్త జమలు కొనసాగించి 60 ఏళ్ళ తర్వాత పించన్ తీసుకోవచ్చు లేదా ఖాతాలో సొమ్ము తీసుకోవచ్చు. పెన్షన్ ఫండ్ నియంత్రణ అభివృద్ధి అధికారసంస్థ (పి.ఎఫ్.ఆర్.డి.ఏ) ఈ ప్రభుత్వ పథకాన్ని నిర్వహిస్తుంది. ప్రభుత్వం ఐదేళ్ళపాటు 1000 రూపాయలు జమ చేయాలంటే ఈ పథకంలో నెలకి కనీసం 167 రూపాయలు జమ చేయాలి.
ప్రీమియం చెల్లించాల్సిన బాధ్యత చందాదారుడిదే…

ఏపీవై కూడా ఇన్సూరెన్స్ పాలసీ వంటిదే.దీనికి ప్రీమియం చెల్లించమని ఎవరు గుర్తు చేయరు. ఒకసారి పథకంలో చేరిన తర్వాత విధిగా ప్రీమియం చెల్లించాల్సిన బాధ్యత చందాదారుడిపై ఉంటుంది. ఏపీవైలో ప్రీమియం చెల్లించమని గుర్తు చేసే వ్యవస్థ ఏది ప్రత్యేకంగా లేదు. ఆటో డెబిట్‌ సిస్టమ్ కావడంతో ఎప్పుడు నగదు పెన్షన్ నిధికి వెళుతుందో తెలీదు. సమయానికి ఖాతాలో నగదును నిల్వ ఉంచడమే దీనికి పరిష్కారం. ఇక 60ఏళ్లు నిండిన తర్వాత మాత్రమే చందాదారుడు ఏపీవై డబ్బులు అందుకోడానికి వీలవుతుంది.

ఈ వ్యాపారాన్ని తక్కువ డబ్బుతో ప్రారంభించొచ్చు.. ప్రతి నెలా మంచి ఆదాయం

వ్యాపారం చేయాలనే ఆలోచన చాలామందికి ఉంటుంది. కానీ ఎలాంటి బిజినెస్ చేయాలో మాత్రం అర్థం కాదు. అలాంటి వారి కోసం చిన్న వ్యాపారం ఉంది. తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయాన్ని పొందవచ్చు.

ఈ మధ్య కాలంలో చాలా మంది ఉద్యోగాలు సైతం వదిలి.. వ్యాపారాల్లో దిగుతున్నారు. కానీ ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలో అర్థంకాక ఇబ్బంది పడుతున్నారు. కొందరు అధిక వ్యయం కారణంగా వ్యాపారాన్ని ప్రారంభించలేరు. మీరు తక్కువ ఖర్చుతో వ్యాపారం కోసం చూస్తున్నట్లయితే.. మీ కోసం మంచి ఆలోచన ఉంది. తక్కువ పెట్టుబడితో లాభాలను తెస్తుంది. మీరు ప్రతి నెలా అధిక మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు.

ఇప్పుడు చెప్పబోయే వ్యాపారం గురించి గ్రామాలు, నగరాల్లో కూడా మంచి డిమాండ్ ఉంటుంది. సో.. మీకు డిమాండ్ ఉండదేమోనని టెన్షన్ పడాల్సిన పని లేదు. ఈ వ్యాపారం ప్రతి నెలా భారీ ఆదాయాన్ని ఇస్తుంది. ఆ వ్యాపారం ఏదో కాదు.. టమోటా సాస్ వ్యాపారం. ఇటీవలి కాలంలో దీనిని ఎక్కువగా వాడుతున్నారు.

టొమాటో సాస్ చాలా పదార్థాల్లో కలిపి తింటారు. ముఖ్యంగా చిన్న పిల్లలకు ఎక్కువగా ఇష్టం ఇది. టొమాటో సాస్ కొన్ని వంటల్లో, పిజ్జా, బర్గర్లు, ఎగ్ పఫ్,‌ నూడుల్స్‌ లాంటి మొదలైన వాటిలో ఉపయోగిస్తారు. మీకు ఏడాది పొడవునా టొమాటోలు మార్కెట్‌లో అందుబాటులో ఉంటాయి. అందువల్ల మీరు ముడి పదార్థాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ,

టొమాటో సాస్ చేయడానికి మీరు కొన్ని యంత్రాలు, సామగ్రిని కొనుగోలు చేయాలి. దీని ధర దాదాపు రూ. 2 లక్షలు వరకు ఉంటుంది. ఇది కాకుండా మీరు ముడి సరుకులు, కార్మికుల జీతం, ప్యాకింగ్, అద్దెకు కూడా ఏర్పాటు చేసుకోవాలి, దీనితో మొత్తం ఖర్చు రూ. 6 లక్షల వరకు అవుతుంది.

మీరు పచ్చి, పండిన టొమాటోలను చిన్న ముక్కలుగా కట్ చేసి, వాటిని ఆవిరి కెటిల్లో ఉడికించాలి. దీని తరువాత ఈ ఉడకబెట్టిన టమోటాల నుండి గుజ్జును తయారు తీయాలి. విత్తనాలు, పీచు పదార్థం వేరు చేయాలి. ఇందులో ఉప్పు, పంచదార, వెనిగర్, అల్లం, వెల్లుల్లి, లవంగాలు, నల్ల మిరియాలు మొదలైనవి జోడించాలి. దీనితో పాటు అది పాడైపోకుండా కొన్ని రకాల కెమికల్స్ కలపాలి.

ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీ వద్ద డబ్బు లేకపోతే.. ముద్రా పథకం కింద ఆర్థిక సహాయం తీసుకోవచ్చు. ప్రధాన మంత్రి ముద్రా పథకం కింద టమోటా సాస్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్రభుత్వం నుండి లోన్ తీసుకోవచ్చు.

ఈ 4 సేఫ్ సెడాన్ కార్లపై ఓ లుక్కేయండి.. ఫ్యామిలీ సేఫ్టీకి 5 స్టార్ రేటింగ్

మారుతి సుజుకి డిజైర్ ఫేస్ లిఫ్ట్ నవంబర్ 11 న భారత మార్కెట్లోకి రానుంది. లాంచ్‌కు ముందు ఫ్యామిలీ సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ పొందింది. సేఫ్ సెడాన్లు మరికొన్ని ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేయండి.

ఎన్ని లక్షలు పెట్టి కారు కొన్నా.. అందులో ఉండే ఫీచర్ల గురించి కచ్చితంగా ఆరా తీస్తాం. సేఫ్టీ గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తాం. 5 స్టార్ రేటింగ్ ఉన్న కార్లు ఎక్కువ మందిని ఆకర్శిస్తాయి. భద్రతా పరంగా మీరు కొనే కారు బెస్ట్ ఉంటే చాలా ప్రమాదాల నుంచి బయటపడొచ్చు.

నిజానికి కొన్నేళ్లుగా కొత్త కారును కొనుగోలు చేసేటప్పుడు సేఫ్టీ ఫీచర్లను జాగ్రత్తగా చూసుకునే అలవాటు భారతీయ వినియోగదారులలో పెరుగుతోంది. ఇటువంటి పరిస్థితిలో అనేక దిగ్గజ కార్ల తయారీదారులు తమ కొత్త మోడళ్లను విడుదల చేయడానికి ముందు భద్రతా ఫీచర్ల గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటీవల మారుతి సుజుకి రాబోయే సెడాన్ డిజైర్ ఫేస్ లిఫ్ట్‌కు కుటుంబ భద్రత కోసం నిర్వహించిన క్రాష్ టెస్ట్‌లో గ్లోబల్ ఎన్‌సీఏపీ 5 స్టార్ రేటింగ్ ఇచ్చింది.

మీరు కూడా అతి తొందరలో సేఫ్టీ ఫీచర్లతో కూడిన కొత్త సెడాన్ కొనాలని ఆలోచిస్తుంటే మీకోసం కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇండియన్ మార్కెట్లో అమ్మకానికి ఉన్న అలాంటి సెడాన్ కార్ల గురించి తెలుసుకుందాం. ఈ కార్లు ఫ్యామిలీకి బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. సేఫ్టీ పరంగా చాలా బాగుంటాయి.

మారుతి సుజుకి డిజైర్

మారుతి సుజుకి డిజైర్ ఫేస్ లిఫ్ట్ నవంబర్ 11 న భారత మార్కెట్లోకి రానుంది. లాంచ్‌కు ముందు కొత్త మారుతి డిజైర్‌కు కుటుంబ భద్రత కోసం నిర్వహించిన క్రాష్ టెస్ట్‌లో గ్లోబల్ ఎన్‌సీఏపీ 5 స్టార్ రేటింగ్ ఇచ్చింది. ప్రస్తుత మారుతి సుజుకి డిజైర్ వయోజన, పిల్లల భద్రతలో 2 స్టార్ రేటింగ్‌ను మాత్రమే పొందింది. కొత్త మారుతి సుజుకి డిజైర్ ఇప్పుడు 6 ఎయిర్ బ్యాగులతో సహా అనేక భద్రతా ఫీచర్లతో వస్తుంది.

హ్యుందాయ్ వెర్నా

హ్యుందాయ్ వెర్నా ఎల్లప్పుడూ భారతీయ కస్టమర్లలో ప్రసిద్ధ సెడాన్ కారు. హ్యుందాయ్ వెర్నాకు 5 స్టార్ ఫ్యామిలీ సేఫ్టీ రేటింగ్ కూడా లభిస్తుంది. సేఫ్టీ ఫీచర్‌గా హ్యుందాయ్ వెర్నాలో ఏడీఏఎస్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఉన్నాయి.
వోక్స్ వ్యాగన్ విర్టస్

వోక్స్ వ్యాగన్ విర్టస్ భారతీయ వినియోగదారులలో ప్రసిద్ధ సెడాన్ కారు. కుటుంబ భద్రత కోసం నిర్వహించిన క్రాష్ టెస్ట్‌లో వోక్స్ వ్యాగన్ విర్టస్‌కు గ్లోబల్ ఎన్‌సీఏపీ 5 స్టార్ రేటింగ్ ఇచ్చింది. వోక్స్ వ్యాగన్ విర్టస్‌లో టైర్ ప్రెజర్ డిఫ్లెక్షన్ వార్నింగ్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్లతో పాటు పార్క్ డిస్టెన్స్ కంట్రోల్, మల్టీ కొలిషన్ బ్రేకులు అందించారు.
స్కోడా స్లావియా

కొత్త సెడాన్ కొనాలనుకునే కస్టమర్లకు స్కోడా స్లావియా బెటర్ ఆప్షన్. గ్లోబల్ ఎన్‌సీఏపీ కుటుంబ భద్రత కోసం నిర్వహించిన క్రాష్ టెస్ట్‌లో స్కోడా స్లావియాకు 5-స్టార్ రేటింగ్ లభించింది. స్కోడా స్లావియాలో 6-ఎయిర్ బ్యాగ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, మల్టీ-కొలిషన్ బ్రేకింగ్ ఉన్నాయి.

పైన చెప్పిన సెడాన్ కార్లలో మీరు ఏది తీసుకుంటారో సెలక్ట్ చేసుకోండి. అన్ని కార్లు ఎన్‍‌‌సీఏపీ ఫ్యామిలీ సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ పొందాయి.

పోస్ట్ ఆఫీస్ ఎఫ్‌డీ స్కీమ్.. మీ డబ్బులు డబుల్ చేసే ప్లానింగ్.. 5 లక్షలు పెడితే 10 లక్షలు!

ఫిక్స్‌డ్ డిపాజిట్స్ సురక్షితమైన పెట్టుబడి పథకం. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి రిస్క్ ఉండదు. పోస్టాఫీస్‌లో మీరు సరైన ప్లానింగ్‌తో ఎఫ్‌డీ చేస్తే డబ్బులను డబుల్ చేసుకోవచ్చు.

పోస్టాఫీసులో పెట్టుబడి పథకాలు చాలానే ఉంటాయి. అనేక మంది ఇందులో ఇన్వెస్ట్ చేస్తుంటారు. రిస్క్ లేకుండా ఉంటుంది. పోస్టాఫీసులో ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్స్ కూడా ఉంటాయి. చాలా మంది ఎఫ్‌డీలలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే వీటిద్వారా డబ్బులు పెరుగుతాయి. అదే స్టాక్ మార్కెట్‌లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తే కొన్నిసార్లు జేబు ఖాళీ చేసుకోవాల్సి వస్తుంది.

పోస్టాఫీసు ఫిక్స్‌డ్ డిపాజిట్ల చాలా మేలు చేస్తాయని చెప్పవచ్చు. దీనిని పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ అని కూడా అంటారు. మీరు హామీతో కూడిన రాబడితో పెద్ద ఫండ్‌ను తయారు చేసుకోవాలనుకుంటే.. పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ మీకు బెటర్ ఆప్షన్.

పోస్ట్ ఆఫీస్ ఎఫ్‌డీ స్పెషల్ ఏంటంటే.. ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి మీకు వేర్వేరు సమయ పరిమితులు దొరుకుతాయి. అంటే మీరు పోస్టాఫీసు ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో పెట్టుబడి పెట్టే కాలానికి అనుగుణంగా మీకు వడ్డీ లభిస్తుంది. 1,2,3, 5 సంవత్సరాల పాటు డబ్బును పెట్టుబడి పెట్టవచ్చు.

పోస్టాఫీసు ఎఫ్‌డీ కాలపరిమితి ప్రకారం మాత్రమే రిటర్న్‌లు అందుబాటులో ఉంటాయి. మీరు ఒక సంవత్సరంలో పోస్టాఫీసు ఎఫ్‌డీలో 6.9 శాతం రాబడిని పొందుతారు. అదే సమయంలో రెండు సంవత్సరాల ఎఫ్‌డీలో 7 శాతం, మూడేళ్ల ఎఫ్‌డీలో 7.1 శాతం, ఐదేళ్ల ఎఫ్‌డీలో 7.5 శాతం రాబడి లభిస్తుంది. ఈ పథకం కింద మీరు మీ డబ్బును ఎలా రెట్టింపు చేసుకోవచ్చో ప్లానింగ్ చూడండి..

5 సంవత్సరాలు పెట్టుబడి పెడితే మీకు 7.5 శాతం వడ్డీ దొరుకుతుంది. పోస్టాఫీసు ఎఫ్‌డీలో 5 ఏళ్ల పాటు రూ. 5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 7.5 శాతం వడ్డీతో రూ.2,24,974 మీకు వస్తాయి. మెచ్యూరిటీలో రూ. 7,24,974 పొందుతారు. ఇప్పుడు మీరు ఈ డబ్బును రెట్టింపు చేసుకోవచ్చు. అది ఎలా అంటే..

మెచ్యూరిటీ సమయంలో వచ్చిన డబ్బును మరో 5 సంవత్సరాల పాటు పెట్టుబడి పెడితే, 7.5 శాతం చొప్పున 10 సంవత్సరాల తర్వాత రూ. 10,51,175 పొందుతారు. పెట్టుబడిదారులు కోరుకుంటే ఖాతా తెరిచినప్పుడు పోస్ట్ ఆఫీస్ ఎఫ్‌డీ స్కీమ్‌లో వ్యవధి పొడిగింపు కోసం అభ్యర్థించవచ్చు. ఇది కాకుండా వ్యవధి పూర్తయిన తర్వాత కూడా పథకం వ్యవధిని మరో 5 సంవత్సరాలు పొడిగించమని అభ్యర్థించవచ్చు.

ఇలా చేయడం వలన మీ డబ్బులు డబుల్ అవుతాయి. రూ.5 లక్షల ఇన్వెస్ట్ చేస్తే రూ.10 లక్షలు తీసుకెళ్లొచ్చు.

పెట్రోల్ బంక్ పెట్టేందుకు పెట్టుబడి ఎంత కావాలి? భూమి నుంచి లైసెన్స్ దాకా వివరాలు

చాలా మంది ఉద్యోగంతోపాటుగా ఏదైనా బిజినెస్ చేయాలని అనుకుంటారు. కొందరు పెట్రోల్ బంక్ మెుదలుపెట్టాలని ఆలోచిస్తారు. కానీ దాన్ని ఎలా ప్రారంభించాలో తెలియదు. అలాంటివారి కోసం పూర్తి సమాచారం ఇక్కడ ఇస్తున్నాం.

ఒకప్పుడు పెట్రోల్ బంకు అంటే.. ఎక్కడో ఒకటి కనిపించేది. చిన్న చిన్న టౌన్‌లలో ఒకటి మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. పల్లెటూర్లలోనూ పెట్రోల్ బంకులు వచ్చేశాయి. కొందరు రైతులు కూడా పెట్రోల్ బంకులు ప్రారంభించడం వైపు ఆలోచన చేస్తున్నారు. కొత్తగా పెట్రోల్ బంకును మెుదలుపెట్టాలని చాలా మంది అనుకుంటారు. అలాంటి వారి కోసం పూర్తి సమాచారం ఇదిగో..

దరఖాస్తుదారు కనీసం 21 సంవత్సరాలు లేదా 55 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉండాలి. కనీసం పదో తరగతి లేదా ఇంటర్ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థికి రిటైల్ అవుట్‌లెట్ లేదా మరేదైనా రంగంలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి. పెట్రోల్ బంకును ఏర్పాటు చేయాలనుకునే దరఖాస్తుదారుడు కనీసం రూ. 25 లక్షల నికర విలువ ఉండాలి. దరఖాస్తుదారు కుటుంబ నికర విలువ రూ.50 లక్షల కంటే తక్కువ ఉండకూడదని చూపించాలి.

పెట్రోల్ పంపును తెరవడానికి మీరు పెట్రోల్ కంపెనీ నుండి లైసెన్స్ తీసుకోవాలి. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం, రిలయన్స్, ఎస్సార్ సహా ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీలు పెట్రోల్ పంపు కార్యకలాపాలకు లైసెన్స్‌లను జారీ చేస్తాయి. వాటిని కచ్చితంగా తీసుకోవాలి. లేదంటే చట్టపరమైన చర్యలకు మీరు ఎదుర్కోవలసి వస్తుంది.

గ్రామీణ ప్రాంతాల్లోని పెట్రోలు బంకుకు యూనిట్‌కు 800 చదరపు మీటర్ల స్థలం అవసరం అవుతుంది. 2 యూనిట్లకు 1200 చదరపు మీటర్ల స్థలం అవసరం కావచ్చు. అదే పట్టణ ప్రాంతాల్లో ఒక పెట్రోల్ బంకుకు 1 యూనిట్ కోసం 500 చదరపు మీటర్ల స్థలం కావాలి. 2 యూనిట్ల ఏర్పాటుకు 800 చదరపు మీటర్ల స్థలం అవసరం పడవచ్చు. జాతీయ రహదారులపై పెట్రోల్ బంకును తెరిచేందుకు 1 యూనిట్ కోసం 1200 చదరపు మీటర్ల స్థలం అవసరం పడుతుంది. అంటే 2 యూనిట్ల ఏర్పాటుకు 2000 చదరపు మీటర్ల స్థలం ఉండాలి.

భూమి స్థలం, పరిమాణం ఆధారంగా భూమి ధర రూ.30 లక్షల నుండి రూ.1 కోటి వరకు కూడా ఉండవచ్చు. అయితే మీరు కొన్ని సంవత్సరాలపాటు లీజు ప్రాతిపదికన కూడా భూమిని తీసుకోవచ్చు. ఇందుకోసం ప్రాంతాన్ని బట్టి భూమి యజమానికి నెలవారీగా డబ్బులు చెల్లించాలి. కొన్ని ప్రదేశాల్లో ఎక్కువ ధర ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో తక్కువ ధర ఉండవచ్చు.

వాడే మెటీరియల్స్, పెట్రోల్ పంపు సైజును బట్టి రూ.30 లక్షల నుంచి రూ. కోటి వరకు ఖర్చవుతుంది. పెట్రోల్ పంపు ఆపరేట్ చేయడానికి అవసరమైన ఇంధన పంపిణీ యూనిట్, స్టోరేజీ ట్యాంకులు, ఇతర పరికరాల ధర రూ. 20 లక్షల నుంచి రూ.50 లక్షలు వరకు పెట్టుకోవాలి.

ప్రభుత్వ అధికారుల నుండి అవసరమైన అనుమతులను పొందడానికి లైసెన్స్ ఫీజులు రూ. 2 లక్షల నుండి రూ. 5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. పెట్రోల్ స్టేషన్ ఏర్పాటు కోసం మీ దరఖాస్తును ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తుకు రూ. 100 నుండి రూ. 1000 వరకు తీసుకుంటారు. ఎస్సీ ఎస్టీ, ఓబీసీ కేటగిరీలకు దరఖాస్తు ఫీజులో 50 శాతం వరకు తగ్గింపు దొరుకుతుంది.

పైన చెప్పిన వివరాల ఆధారంగా పెట్టుబడి అవుతుంది. అయితే ఆదాయం గురించి మాత్రం గాలిలో మెడలు కట్టవద్దు. ఎందుకంటే.. మీ పెట్రోల్ బంకు ఉన్న ప్రదేశం ఆధారంగానే ఆదాయం ఉంటుంది. మరో విషయం ఏంటంటే.. ఇంధన ధరల పెరుగుతున్న కారణంగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. సో.. మీరు అన్ని లెక్కలు వేసుకుని ఈ బిజినెస్‌లోకి దిగితే మంచిది.

గమనిక : పైన చెప్పిన విషయం కేవలం సమాచారం కోసం మాత్రమే. దేనిలోనైనా పెట్టుబడి పెట్టేముందు కచ్చితంగా చర్చించి నిర్ణయం తీసుకోండి.

ప్రపంచంలోనే మెుట్టమెుదటి ట్రూలీ స్ట్రెచబుల్ డిస్‌ప్లే

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ ఎల్జీ ఒక ప్రత్యేకమైన డిస్‌ప్లేను ప్రవేశపెట్టింది. దీనిని సాగదీయవచ్చు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా 50 శాతం వరకు సాగదీయగలగడం దీని ప్రత్యేకత.

డిస్‌ప్లే అంటే ఎటు కదలదు అని అందరికీ తెలుసు. అయితే ఇకపై డిస్‌ప్లే స్కీన్‌ను సాగదీయవచ్చు. ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ ఎల్జీ ఈ డిస్‌ప్లేను ప్రవేశపెట్టింది. దీన్ని సాగదీయవచ్చు, విస్తరించవచ్చు. దక్షిణ కొరియా కంపెనీ ఎల్జి ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రూలీ స్ట్రెచబుల్ డిస్‌ప్లే ప్రోటోటైప్‌ను పరిచయం చేసింది. 50 శాతం వరకు సాగదీయగలగడం దీని స్పెషాలిటీ. ప్రోటోటైప్ 12-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది 18 అంగుళాలకు విస్తరిస్తుంది. అదే సమయంలో అంగుళానికి 100 పిక్సెల్స్ అధిక రిజల్యూషన్, ఆర్‌జీబీ రంగులను కూడా ఇస్తుంది. అయితే ఎల్జీ స్ట్రెచబుల్ డిస్‌ప్లేతో రావడం ఇదే మొదటిసారి కాదు. కంపెనీ 2022లో కూడా ప్రవేశపెట్టింది. కానీ దాని గరిష్ట పొడిగింపు రేటు 20 శాతం మాత్రమే.

ఎల్జీ తన ఆవిష్కరణను అల్టిమేట్ డిస్‌ప్లే టెక్నాలజీ అని పిలుస్తోంది. వంచడం, మడతపెట్టే ప్రస్తుత ఫ్లెక్సిబుల్ డిస్‌ప్లేల మాదిరిగా కాకుండా.. ఈ డిస్‌ప్లేను సాగదీయవచ్చు. వివిధ పరిమాణాల్లోకి లాగవచ్చు. దీనితో ప్రయోజనం ఏంటంటే వివిధ రంగాలలో అనేక విధాలుగా ఉపయోగించవచ్చు. 2020లో ప్రారంభించిన డిస్‌ప్లే.. వాణిజ్య, పారిశ్రామిక, ఇంధన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే జాతీయ ప్రాజెక్టులో భాగంగా ఈ అభివృద్ధి జరిగింది. ఈ ప్రాజెక్టులో పాలుపంచుకున్న 19 పరిశోధనా సంస్థల కన్సార్టియానికి ఎల్జీ డిస్‌ప్లే నేతృత్వం వహిస్తుంది.

మెుదట్లో ఈ డిస్‌ప్లే లక్ష్యం 20 శాతం ఎలివేషన్ రేటు అయినప్పటికీ ఈ టీమ్ కొత్త పద్ధతుల ద్వారా దానిని విజయవంతంగా రెట్టింపు చేసింది. కాంటాక్ట్ లెన్సులలో సాధారణంగా ఉపయోగించే ప్రత్యేక సిలికాన్ సబ్స్ట్రేట్ మెటీరియల్, వైరింగ్‌ను ప్రదర్శించడానికి ప్రత్యేకమైన విధానం వీటిలో ఉన్నాయి.

ఈ ప్రోటోటైప్ పదేపదే లాగినప్పుడు కూడా 10,000 సార్లు నిలబడగలదని ఎల్జీ డిస్‌ప్లే పేర్కొంది. ఇది కాకుండా డిస్‌ప్లే 40 మైక్రోమీటర్ల మైక్రో-ఎల్ఈడీ లైట్ సోర్స్‌ను కలిగి ఉంది. తీవ్రమైన ఉష్ణోగ్రతలతోపాటుగా ఇతర పరిస్థితుల్లోనూ ఇమేజ్ నాణ్యతను కాపాడుతుంది.

సాగతీతతో పాటు ఈ డిస్‌ప్లే సన్నగా, తేలికగా ఉంటుంది. దుస్తులు లేదా చర్మం వంటి ఉపరితలాలకు అంటించుకోవచ్చు. ఫ్యాషన్, వేరబుల్స్ నుంచి మొబిలిటీ సెక్టార్ వరకు వివిధ పరిశ్రమల్లో ఈ టెక్నాలజీని పెద్ద ఎత్తున వాడుకోవచ్చని ఎల్జీ భావిస్తోంది.

ఈ Schemeలో రూ.45 పెట్టుబడి పెడితే 25 లక్షల లాభం పొందవచ్చు

ఈ రోజుల్లో డబ్బులు సంపాదించడం పెద్ద విషయం ఏమి కాదు. డబ్బులు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. కానీ ఆ డబ్బులను సేవ్ చేసుకోవడం మాత్రం కత్తి మీద సాము లాంటిది. ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో ఖర్చులు ఘోరంగా ఉన్నాయి. కరెంట్ బిల్లు, నీటి బిల్లు, ఇంట్లో సరుకులు, ఇంటి రెంట్, పాల బిల్లు, కూరగాయలు, హాస్పిటల్ ఖర్చులు, పిల్లల స్కూల్ ఫీజులు.. ఇలా ఒక్కటేమిటీ చాలా రకాల ఖర్చులు అమాంతం పెరిగిపోయాయి. ముఖ్యంగా సిటీ లల్లో ఉన్న ఉద్యోగులకు చాలా ఖర్చులు ఉంటాయి. క్రెడిట్ కార్డ్ బిల్లులు, లోన్లు, పెట్రోల్ బిల్లులు లాంటి ఖర్చులు చాలా మందికి ఉంటాయి. ఇన్ని ఖర్చులు ఉన్న సామాన్య ప్రజలకు డబ్బులు మిగిల్చడం చాలా కష్టమే. ఎందుకంటే ఇప్పుడు మనకు వచ్చే జీతాల కంటే ఖర్చులే ఎక్కువ. అయితే మనకు అయ్యే ఖర్చులో కేవలం 45 రూపాయలు తీసి పక్కన పెట్టారంటే భారీగా డబ్బులు మిగిలించుకోవచ్చు. అదెలాగో దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మీరు రోజుకి కేవలం 45 రూపాయలు సేవ్ చేసుకుంటే 25 లక్షల లాభం వచ్చే స్కీమ్ ఒకటి ఉంది. అదే LIC జీవన్ ఆనంద్ పాలసీ. LIC ఎన్నో మంచి మంచి స్కీమ్ లని అందిస్తుంది. వాటిలో ఈ పాలసీ కూడా ఒకటి. పైగా ఇది ప్రభుత్వ రంగ సంస్థ కావడంతో దీనిలో ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. ఇందులో మీ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే ఇంకా చాలా ప్రయోజనాలు పొందవచ్చు. డబ్బులు సేవ్ చేసుకోవాలి అనుకునే వారికి ఇది చాలా మంచి ఆప్షన్ గా చెప్పవచ్చు. ఇక ఈ పాలసీ తీసుకోవడం వల్ల మనకు కలిగే బెనిఫిట్స్ గురించి పూర్తిగా ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టర్మ్ ప్లాన్ లాగా, ఈ పాలసీకి కూడా ప్రీమియం కట్టాలి. ఈ స్కీమ్ లో మాక్సిమం లిమిట్ అంటూ ఏమి లేదు. కాకుంటే కొంచెం పేషన్స్ ఉండాలి. అది ఉంటే ఎక్కువ లాభాలు పొందవచ్చు.

ఇందులో 35 ఏళ్ల పాటు ఏడాదికి రూ.16,300 కట్టాల్సి ఉంటుంది. అంటే నెలకు రూ.1,358 కట్టాలి. ఇందులో బీమా మొత్తం రూ.5 లక్షలు, బోనస్ రూ.8 లక్షలు, ఎఫ్‌ఏబీ రూ.11.5 లక్షలు కలిసి ఉంటాయి. అలాగే ఈ పాలసీ మెచ్యూరిటీ తర్వాత కూడా లైఫ్ కవర్ అనేది కంటిన్యూ అవుతూ వస్తుంది. ఒకవేళ పాలసీ టర్మ్‌లో పాలసీదారుడు చనిపోయినట్లయితే డెత్ క్లెయిమ్ కూడా వస్తుంది. ఇందులో బీమా డబ్బులు, బోనస్ ఎఫ్‌ఏబీ కలిపి ఇస్తారు. అలాగే ఈ పాలసీలో మీకు ఎల్ఐసీకి వచ్చే లాభాల్లో వాటా కూడా వస్తుంది. అంతే కాదండోయ్ ఇందులో మీకు ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంటుంది. అంటే ఇందులో మీకు వచ్చే డబ్బు పై ట్యాక్స్ కట్ అవ్వదు.

మీ ఇల్లు డ్యామేజ్ అయ్యిందా? ఇలా చేస్తే ఖర్చులకు డబ్బులు వస్తాయి

సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి జీవితకాల కల. ప్రతి మనిషి జీవితంలో ఎక్కువగా ఖర్చయ్యేది దీనికే. కాయ కష్టం చేసి రాత్రింబవళ్ళు కష్టపడి పని చేసి సంపాదించి కూడబెట్టిన డబ్బుతో ఇల్లు కొంటాం లేదా కట్టుకుంటాం. అలాంటి ఇంటిని కంటికి రెప్పలా కాపాడుకోవడం చాలా ముఖ్యం. కానీ కొన్ని కారణాల వల్ల మన ఇంటికి డ్యామేజ్ జరగవచ్చు. మనం కష్టపడి ఇటుక ఇటుక పేర్చి కట్టుకున్న ఇల్లు కూలిపోవచ్చు. దొంగతనాలు, అగ్ని ప్రమాదాలు, ఊహించని ఇతర విపత్తులు ఎదురైన సమయంలో మన ఇల్లు డ్యామేజ్ అవ్వొచ్చు. మనం పెట్టిన ఖర్చు వృధా కావొచ్చు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా రావొచ్చు. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనకు డబ్బులు వచ్చే మార్గం ఒకటి ఉంది. మన ఇంటిని హోం ఇన్సూరెన్స్ కాపాడుతుంది. మన ఇల్లు డ్యామేజ్ అయినప్పుడు మనకు భరోసాగా నిలుస్తుంది. ఇంతకీ ఆ ఇన్సూరెన్స్ ఏంటి? దాని గురించి పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఆన్‌లైన్‌లో మనకు ‘భారత్ గృహ రక్షా పాలసీ’ అనే స్కీమ్ అందుబాటులో ఉంది. అది తీసుకుంటే రెసిడెన్షియల్ బిల్డింగ్స్‌కు వివిధ రకాల విపత్తుల నుంచి ఇన్సూరెన్స్ కవరేజీ వస్తుంది. అగ్నిప్రమాదం, ప్రకృతి వైపరీత్యాలు, దొంగతనం వంటి ప్రమాదాలకు ఈ పాలసీ కవరేజీని అందిస్తుంది. దీన్ని Insurance Regulatory and Development Authority of India(IRDAI) అప్రూవ్ చేసి ప్రతి జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉండే విధంగా చేసింది. తక్కువ ధరకే ఈ పాలసీ ఇచ్చే ఇన్సూరెన్స్ కంపెనీలు చాలానే ఉన్నాయి. పాలసీ బజార్ వెబ్ సైట్ ఓపెన్ చేస్తే కేవలం 800/- ప్రీమియంకే ఇన్సూరెన్స్ ఇచ్చే ఫేమస్ కంపెనీలు ఉంటాయి. వాటిలో బెస్ట్ ఏదో తెలుసుకొని ఈ ఇన్సూరెన్స్ తీసుకోవడం బెటర్. సొంతిల్లు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా భారత్ గృహ రక్ష పాలసీ తీసుకోవడం చాలా మంచిది.

మీరు పాలసీ తీసుకుంటున్న సమయంలో కంపెనీ రివ్యూస్ కూడా కచ్చితంగా చెక్ చేయండి. అది ఫేమస్ కంపెనీ అయితే పర్లేదు. చిన్న కంపెనీ అయితే దాని హిస్టరీ గురించి తెలుసుకోండి. ఈ పాలసీని తీసుకునేటప్పుడు తప్పకుండా క్లెయిమ్ చేసే ప్రాసెస్ గురించి తెలుసుకోవాలి. క్లెయిమ్‌లను సెటిల్ చేసే విషయంలో కంపెనీకి ఉన్న ట్రాక్ రికార్డ్‌ గురించి తెలుసుకోవాలి. గతంలో ఇలాంటి హోం ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లను ఎలా ఇచ్చారు? కస్టమర్ల నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏమిటి? కచ్చితంగా తెలుసుకోవాలి.

బాలకృష్ణ 109 అప్డేట్స్

2026 సంక్రాంతికి గట్టి పోటీ ఉందన్న సంగతి తెలిసిందే . ఇప్పటికే ఆ లిస్ట్ లో రామ్ చరణ్ తో పాటు .. బాలయ్య , వెంకటేష్ ల పేర్లు వినిపిస్తున్నాయి. వీటిలో ఆల్రెడీ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ గురించి గట్టి బజ్ వినిపిస్తుంది. ప్రమోషనల్ ప్లాన్స్ కూడా రెడీ చేసేస్తున్నారు. అటు వెంకటేష్ మూవీ టైటిల్ ను కూడా అనౌన్స్ చేశారు. త్వరలోనే ఆ సినిమా నుంచి కూడా అప్డేట్స్ వచ్చే అవకాశం లేకపోలేదు. ఈ రెండు సినిమాల నుంచి ఎదో ఒక అప్డేట్ అయినా ఉంది. కానీ బాలకృష్ణ సినిమా నుంచి మాత్రం ఏ అప్డేట్ లేదు. వరుస బ్లాక్ బస్టర్స్ తో ఊపు మీద ఉన్నాడు బాలయ్య. పండగ సెంటిమెంట్ బాలయ్య కు బ్రహ్మాండంగా కలిసి వస్తుందని అంతా ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పటివరకు టైటిల్ అనౌన్సుమెంట్ లేకపోవడంతో.. ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.

ముందు ఈ సినిమాను దసరాకు తీసుకురావాలని అనుకున్నారు. ఆ తర్వాత దీపావళి అన్నారు. ఫైనల్ గా సంక్రాంతికి ఫిక్స్ చేశారు. కానీ ఎదురుచూస్తున్న కొద్దీ ప్రొడక్షన్ హౌస్ నుంచి మాత్రం ఎలాంటి సౌండ్ లేదు. అయితే రెండు వారల క్రితం టైటిల్ లీకులు మాత్రం వినిపించాయి. డాకూ మహారాజ్, సర్కార్ సీతారామ్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది. కానీ ఇంకా ఫైనల్ చేయలేదు. ఇంకా ఏ మ్యాటర్స్ బయటకు రాలేదేంటా అని ఆరా తీస్తే.. దర్శకుడు బాబీ పండగ డెడ్ లైన్ ని అందుకునేందుకు తెగ కష్టపడుతున్నాడని తెలిసింది. ఇప్పుడు సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అయినా కానీ ఇంకా ఫస్ట్ కాపీ రెడీ కాకపోవడం ఆశ్చర్యం. ఇంకా సినిమాలోని ఇంపార్టెంట్ సీన్స్ కు సంబంధించిన షూట్ పెండింగ్ ఉందట. వాటిని ఎలా అయినా సరే ఈ నెలలో పూర్తి చేయాలనీ.. దర్శకుడు కంకణం కట్టుకుని కుర్చున్నాడట. సో ఒక్కసారి అది కాస్త పూర్తయితే అప్పుడు సినిమాకు సంబంధించిన అప్డేట్స్ వచ్చేలా ఉన్నాయి.

అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ కొట్టేశాడు బాలయ్య. ఇక ఇప్పుడు రెండో రౌండ్ కు రెడీ అవుతున్నాడు. రీసెంట్ గా అఖండ 2కు సంబంధించిన అప్డేట్ కూడా వచ్చింది. ఈసారి అఖండ 2 లో బాలయ్య విశ్వ రూపం కనిపించబోతుందంటూ టాక్ కూడా నడుస్తుంది. ఇప్పుడు బాలయ్య 109 కంప్లీట్ అయితే.. అఖండ 2 సెట్స్ మీదకు వెళ్తుంది. బాలకృష్ణ ఇంత బిజీ బిజీగా ఉన్నా కానీ అన్ స్టాపబుల్ 4 కోసం తగినంత టైం కేటాయిస్తున్నాడు. ఈ షో తో ఫ్యాన్స్ హ్యాపీగానే ఉన్నారు కానీ.. అసలైన సాలిడ్ అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. టీజర్ ట్రైలర్, లిరికల్ సాంగ్స్ ఇలా బోలెడు లాంఛనాలు పెండింగ్ లో ఉన్నాయి.

మనసంతా పోలీస్‌శాఖపైనే.. అసలు పవన్‌ కల్యాణ్ ఆలోచనేంటి..? సర్వత్రా చర్చ

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజులుగా రాష్ట్ర పోలీసులపై ప్రత్యేక దృష్టి సారించారు. డ్రగ్స్, రోడ్డు భద్రత వంటి అంశాలపై ఆయన వ్యాఖ్యలు, పోలీసుల చర్యలపై ఆయన ప్రతిస్పందనలు చర్చనీయాంశంగా మారాయి. పవన్ కళ్యాణ్ ఈ చర్యల వెనుక ఉద్దేశం ఏంటి..? రాజకీయ వ్యూహమా.. లేక లేదా నిజమైన ఆందోళనా.. ఏమిటనేది ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా హాటటాపిక్ గా మారింది.

ఆడబిడ్డల జోలికొస్తే అంతుచూస్తా.. పిచ్చిపిచ్చి పోస్టులు పెడితే పాతరేస్తా.. మత్తుగాళ్ల తుప్పురేగ్గొడతా. అక్రమాలకు పాల్పడితే అడ్రస్‌ లేకుండా చేస్తా.. ఇలాంటి డైలాగ్స్‌ కామన్‌గా డీజీపీనో లేక హోంమినిస్టర్‌ నోటి నుంచో వింటుంటాం. కానీ ఏపీలో మాత్రం డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ నోట పదేపదే వినిపిస్తున్న డైలాగులివి. గతకొన్ని రోజులుగా పవన్‌.. పోలీస్‌శాఖపైనే ఫుల్‌ ఫోకస్‌ పెట్టినట్లు కనిపిస్తోంది. డ్రగ్స్‌ దగ్గర్నుంచి రోడ్‌ సేఫ్టీ వరకు పోలీస్‌శాఖకు సంబంధించిన ప్రతి అంశంపైనా పవన్‌ మాట్లాడుతున్నారు. తప్పులెత్తి చూపుతున్నారు.. అలాగే ఎవరైనా విమర్శిస్తే సపోర్ట్‌ చేస్తున్నారు. మొత్తంగా.. పవన్‌ మనసంతా పోలీస్‌శాఖపైనే అన్నట్లుగా ఉంది. మరి హోంశాఖలో పవన్‌ ఇన్వాల్వ్‌మెంట్‌ దేనికి..? అసలు పవన్‌ ఆలోచనేంటి.. అనేది ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ ఫుల్‌ స్వింగ్‌లో ఉన్నారు. డిపార్ట్‌మెంట్ ఏదైనా ఐ డోంట్‌ కేర్… తప్పుంటే ప్రశ్నిస్తా… ఫలితం వచ్చేదాకా పనిపడతా అన్నట్లుగా యమా స్పీడు చూపిస్తున్నారు. పవర్‌ కాదు ముఖ్యం… ప్రజాశ్రేయస్సే లక్ష్యమంటూ దూకుడు చూపిస్తున్నారు. అందులోభాగంగానే గతకొన్ని రోజులుగా హోంశాఖపైనే ఫుల్‌ ఫోకస్డ్‌గా మాట్లాడుతున్నారు. ఇటీవల హోంశాఖ మీద కూడా పవన్ ఏ రేంజ్‌లో ఫైర్‌ అయ్యారో…! అందరికీ తెలిసిందే.. తాను హోంమినిస్ట్రీ తీసుకుంటే సిచ్చేవేషన్‌ మరోలా ఉంటుందన్న రేంజ్‌కి వెళ్లారు. ఇక అప్పట్నుంచి హోంశాఖకు సంబంధించిన ప్రతి అంశంపైనా పవన్‌ స్పెషల్‌ ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారు. పొలిటికల్ కొట్లాటల దగ్గర్నుంచి లేటెస్ట్‌గా డ్రగ్స్‌ ఇష్యూ వరకు… ప్రతిదానిపైనా వెంటనే రియాక్ట్‌ అవ్వడమే కాదు పోలీసుల యాక్షన్‌పైనా ఆరా తీస్తున్నారు.

లేటెస్ట్‌గా డీజీపీ ద్వారకా తిరుమలరావుతో పవన్‌ భేటీ అయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న నేరాలు-ఘోరాలపై గ్రౌండ్‌ లెవల్‌లో చర్చించారు. సోషల్‌ మీడియా పోస్టులు, అరెస్టులపైనా ఆరా తీశారు. ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టేందుకు తీసుకున్న చర్యపైనా చర్చలు జరిపారు. ఇలా ఒక్కటేంటి… రాష్ట్రంలో శాంతిభద్రతలపై క్షుణ్ణంగానే డీజీపీతో మాట్లాడినట్లు తెలుస్తోంది.

ఇటు డ్రగ్స్‌పైనా ఘాటుగానే రియాక్ట్‌ అయ్యారు డిప్యూటీ సీఎం. మత్తుగాళ్ల తుప్పురేగ్గొట్టడమే కాదు.. మత్తుపదార్ధాలను సప్లై చేస్తున్న కంత్రిగాళ్ల అంతుచూస్తానంటున్నారు. గంజాయి సాగు చేస్తే గుంజి కొడతాంటూ మాటల మంటలే కాదు.. ట్వీట్లతోనూ మాదకద్రవ్యాలపై మండిపడుతున్నారు. గతంలో విశాఖ పోర్టులో దొరికిన భారీ కొకైన్‌ను గుర్తుచేస్తూ.. డ్రగ్స్‌ కంట్రోల్‌కి సమగ్ర ప్రణాళిక కావాలన్నారు డిప్యూటీ సీఎం.

అంతకుముందు సోషల్‌ మీడియా పోస్టులపై పవన్‌ ఎలా ఫైర్‌ అయ్యారో… అవుతూనే ఉన్నారో ఇప్పటికీ చూస్తున్నాం. మురికి పోస్టులు పెడితే మడపెడతాం అన్న రేంజ్‌లో పవన్‌ వార్నింగులిస్తున్నారు. పోలీసులు కేర్‌ఫుల్‌గా ఉండాలి.. కన్నింగ్‌గాళ్ల కహానీ తేల్చాలంటూ పదేపదే మాట్లాడుతున్నారాయన. అలాగే అంతకుముందు ఆడవాళ్ల అఘాయిత్యాలపైనా నిప్పులు చెరిగారు. పోలీసులు ఏం చేస్తున్నారంటూ ఆగ్రహావేశాలు వెల్లగక్కారు… ఎవరదేని చూడొద్దు… ఎక్కడినుంచి వచ్చారన్నది పట్టించుకోవద్దు… తప్పు చేస్తే తాటతీయాల్సిందేనన్నారు. ఇటు రోడ్డు ప్రమాదాలపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన కేసుల్లో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు బాధ్యతగా వ్యవహరించాలంటూ స్వీట్‌ వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు పోలీసుల తీరుపై మండిపడుతున్న పవన్‌… విపక్షాలు పోలీసులపై విమర్శలు గుప్పిస్తే వాటిని తిప్పికొడుతూ పోలీసులనూ వెనకేసుకొస్తున్నారు కూడా..

మొత్తంగా.. గతకొన్ని రోజులుగా పవన్‌ మాట్లాడుతున్న ప్రతి అంశం హోంశాఖకు సంబంధించిందే. దీంతో పవన్‌ టార్గెట్‌ ఏంటి..? లా అండ్‌ ఆర్డర్‌పై ఎందుకుంతా ఫోకస్డ్‌గా ఉన్నారు..? ఏం చేయాలనుకుంటున్నారు…? అన్న అంశాలు ఆసక్తిగా మారాయి.

ఏపీ వార్షిక బడ్జెట్ రూ. 2.94 లక్షల కోట్లు.. కేటాయింపులు ఇలా

రూ. 2.94 లక్షల కోట్ల బడ్జెట్‌ను ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌కు అంకెలకు మించిన ప్రాధాన్యం ఉందన్నారు. గత ప్రభుత్వ విధానాలతో ఆర్ధిక రంగం కుదేలైందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ స్తంభించిపోయాయని, ముఖ్య పధకాలకు చెల్లింపులు జరగలేదని ఆరోపించారు. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాల్సి ఉందని చెప్పారు.

ఈ సెషన్లో సభ ముందుకు కీలక బిల్లులు రానున్నాయి. — ల్యాండ్ గ్రాబింగ్ నిరోధ‌క చ‌ట్టం 2024 తెచ్చే అవకాశం ఉంది. పాత చట్టాన్ని రద్దు చేయనున్నారు. — దేవాలయాల పాలకమండలిలో మరో ఇద్దరికి అవకాశం కల్పిస్తూ సవరణ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం — గత ప్రభుత్వ జ్యుడీషియల్‌ కమిషన్‌ రద్దు చేస్తూ బిల్లు — జ్యుడీషియల్‌ అధికారుల రిటైర్మెంట్‌ వయసు 61ఏళ్లకు పెంపు — గత సర్కారు తెచ్చిన ప్రభుత్వ మద్యం దుకాణాలు రద్దు చేస్తూ బిల్లు

కేటాయింపులు ఇలా..
రూ.2,94,427 కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్

రెవెన్యూ వ్యయం అంచనా -రూ.2.35 లక్షల కోట్లు

మూలధన వ్యయం అంచనా -రూ.32,712 కోట్లు

రెవెన్యూ లోటు – రూ.34,743 కోట్లు

ద్రవ్యలోటు -రూ.68,743 కోట్లు

GSDPలో రెవెన్యూ లోటు అంచనా 4.19 శాతం

పరిశ్రమలు, వాణిజ్యం- రూ.3,127 కోట్లు

నీటిపారుదల -రూ.16,705 కోట్లు

గృహనిర్మాణం -రూ.4012 కోట్లు

పురపాలక, పట్టణాభివృద్ధి -రూ.11,490 కోట్లు

పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి -రూ.16739 కోట్లు

ఆరోగ్యం -రూ.18,421 కోట్లు

ఉన్నత విద్య -రూ.2326 కోట్లు

ఎస్సీ సంక్షేమం -రూ.18,497 కోట్లు

ఎస్టీ సంక్షేమం -రూ.7,557

బీసీ సంక్షేమం -రూ.39,007 కోట్లు

అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమం -రూ.4,376 కోట్లు

వ్యవసాయ, అనుబంధ రంగాలు -రూ.11,855 కోట్లు

మహిళా, శిశు సంక్షేమం -రూ.4285 కోట్లు

స్కిల్‌ డెవలప్‌మెంట్ -రూ.1215 కోట్లు

పాఠశాల విద్య శాఖకు రూ.29,909 కోట్లు

ఇంధన శాఖ -రూ.8,207 కోట్లు

యాక్టివా నుంచి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ వచ్చేస్తోంది.. ఏం ఫీచర్స్‌ గురూ అసలు

హోండా యాక్టివాకు ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రోడ్డుపై నాలుగు స్కూటీలు కనిపిస్తే అందులో కచ్చితంగా రెండు హోండా యాక్టివాలే ఉంటాయనడంలో సందేహం లేదు.

కేవలం పెద్ద వారిని మాత్రమే కాకుండా యూత్‌ను కూడా ఈ స్కూటీలు తెగ ఆకట్టుకున్నాయి.

ఇదిలా ఉంటే ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న యాక్టివా ఎలక్ట్రిక్‌ వెర్షన్ లాంచింగ్‌కు రంగం సిద్ధమైంది. నవంబర్‌ నెలలోనే ఈ స్కూటీ మార్కెట్లోకి రానుంది. గత కొన్ని రోజులుగా ఈ స్కూటీకి సంబంధించిన వస్తున్న వేళ తాజాగా ఎట్టకేలకు అధికారిక ప్రకటన చేసేశారు. నవంబర్‌ 27వ తేదీన ఈ స్కూటీని మార్కెట్లోకి లాంచ్‌ చేయనున్నారు. కళ్లు చెదిరే ఫీచర్లతో ఈ స్కూటీని తీసుకొస్తున్నట్లు కంపెనీ ఇది వరకే తెలిపింది.

ఇక ఈ స్కూటర్‌ రేంజ్‌ విషయానికొస్తే ఒక్కసారి ఫుల్‌ ఛార్జ్‌ చేస్తే 100 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఈ స్కూటీలో స్వాపబుల్‌ బ్యాటరీని ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక స్కూటీలో సస్పెన్షన్ కోసం స్కూటర్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక భాగంలో మోనోషాక్ యూనిట్‌ను అందించనున్నారని సమాచారం. ముందు భాగంలో డిస్క్ బ్రేకులు, వెనుక భాగంలో డ్రమ్ బ్రేకులు ఏర్పాటు చేయనున్నారు.

ఇప్పటికే ఈ స్కూటర్‌కు సంబంధించి వచ్చిన ఫొటోలు వెహికిల్‌పై అంచనాలను పెంచేసింది. అయితే జపాన్‌లో లాంచ్‌ అయిన స్కూటీనే భారత్‌లో తీసుకొస్తారా.? ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారా అనేది చూడాలి. ఇక ఈ స్కూటీలో 7 ఇంచెస్‌ స్క్రీన్‌ను ఇవ్వనున్నారు. ఎల్ఈడీ లేదా టీఎఫ్టీ స్క్రీన్‌ను ఇవ్వనున్నారు. ఈ స్క్రీన్‌లో రేంజ్‌, మోడ్‌, టైమ్‌, డేట్‌, వెదర్‌, బ్యాటరీ ఇంకెన్ని కిలోమీటర్లు వస్తుంది లాంటి వివరాలను అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ స్కూటర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

అకౌంట్‌ అక్కర్లేదు, పిన్‌ అవసరం లేదు.. యూపీఐలో ఈ ఫీచర్‌

ప్రస్తుతం యూపీఐ పేమెంట్స్‌ పేమెంట్స్‌కు భారీగా ఆదరణ పెరిగిన విషయం తెలిసిందే. పెద్ద పెద్ద లావాదేవీల నుంచి టీ కొట్టు వరకు యూపీఐ పేమెంట్స్‌ను స్వీకరిస్తున్నారు.

స్మార్ట్‌ ఫోన్‌ ఉన్న ప్రతీ ఒక్కరూ యూపీఐ పేమెంట్స్‌ను ఉపయోగిస్తున్నారు. అయతే యూపీఐ సేవలను మరింత సులువు చేసేందుకు పేమెంట్స్‌ యాప్స్‌ రకరకాల ఫీచర్లను జోడిస్తున్నారు.

సాధారణంగా యూపీఐ పేమెంట్స్ చేయాలంటే క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయాలి, అమౌంట్‌ ఎంటర్‌ చేయాలి. చివరిగా పిన్‌ ఎంటర్‌ చేయాలి. యూపీఐ పేమెంట్‌ చేయాలంటే ఇదంతా ప్రాసెస్‌ ఉంటుందనే విషయం తెలిసిందే. అయితే ఇదంతా ప్రాసెస్‌ లేకుండా సింపుల్‌గా పేమెంట్స్‌ చేసుకునే అవకాశం కూడా ఉందని మీకు తెలుసా.? సింపుల్‌గా క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి అమౌంట్‌ ఎంటర్‌ చేసి పే బటన్‌ క్లిక్‌ చేస్తే సరిపోతుంది.

గూగుల్‌ పేతో పాటు ఫోన్‌ పేలో యూపీఐ లైట్‌ అనే ఫీచర్‌ అందుబాటులో ఉంది. యూపీఐ లైట్‌ సేవలు ఉపయోగించుకోవాలంటే ముందుగా యూపీఐ లైట్‌లో కొన్ని డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం మీరు యూపీఐ లైట్‌ ద్వారా పేమెంట్స్‌ చేస్తే యూపీఐ పిన్‌ లేకుండా పేమెంట్స్‌ చేసుకోవచ్చు. తక్కువ సమయంలో పేమెంట్స్‌ చేసుకోవాలనుకునే వారికి ఇది బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. అయితే ఈ ఆప్షన్‌ కేవలం చిన్న, చిన్న పేమెంట్స్‌కు మాత్రమే ఉపయోగపడుతుంది.

ఇదే కాకుండా ప్రీపెయిడ్ కార్డులతో కూడా సింపుల్‌గా లావాదేవీలు చేసుకోవచ్చు. పేటీఎం, అమెజాన్ పే వంటి ప్రీపెయిడ్ కార్డులు ముందుగానే కొనుగోలు చేసి వాటిని ఉపయోగించి పేమెంట్స్ చేసుకోవచ్చు. అలాగే యూపీఐ వర్చువల్‌ కార్డుల ద్వారా సులభంగా చెల్లింపులు చేసుకోవచ్చు.

రెగ్యులర్‌గా బీర్‌ తాగితే శరీరంలో జరిగే మార్పులు ఇవే

ఆల్కహాల్‌ ఆరోగ్యానికి మంచిది కాదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ విషయాన్ని మందు బాటిల్‌పైనే రాసి ఉంటుంది. అయినా ఆ అలవాటును మానుకోవడానికి మాత్రం మందు బాబులు ఇష్టపడరు.

అయితే బీర్‌ తాగితే ఏమవదు, పైగా ఆరోగ్యానికి మేలు చేస్తుందని కొందరు భావిస్తుంటారు. అప్పుడప్పుడు ఒక బీర్‌ తాగితే ఆరోగ్యానికి మంచి జరుగుతుందని తమకు తాము సర్ది చెప్పుకుంటుంటారు. నిజంగానే బీర్‌ తాగితే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా.? ఇందులో ఎంత నిజం ఉంది.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

రెగ్యులర్‌గా బీర్‌ తాగితే మెదడు సామర్థ్యం దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. బీర్‌లోని ఆల్కహాల్ న్యూరోట్రాన్స్‌మిటర్ల పనితీరుకు అడ్డంకిగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనిక కారణంగా జ్ఞాపశక్తి తగ్గుతుందని హెచ్చరిస్తున్నారు. అలాగే బీర్‌ను రెగ్యులర్‌గా తీసుకుంటే.. మానసిక సమస్యలకు దారి తీస్తుందని అంటున్నారు. ఆల్కహాల్‌ డిప్రెషన్‌కు దారి తీస్తుందని అంటున్నారు. సెరటోనిన్, డోపమైన్‌ మధ్య నియంత్రణ పట్టాలు తప్పేలా చేస్తుంది. ఒత్తిడి పెరుగుతుంది.

ఇక బీరును ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆకలి పెరుగుతుంది. దీంతో సహజంగానే ఎక్కువగా తింటుంటాం. ఇది బరువు పెరగడానికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. బీర్‌ వల్ల మెదడులో ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరుగుతుంది. దీర్ఘకాలంలో ఇది అల్జైమర్స్‌కు దారి తీస్తుందని అంటున్నారు. బీర్‌ తాగితే మంచి నిద్ర సొంతమవుతుందని అంతా భావిస్తుంటారు. అయితే నివ్ర వచ్చినట్లే అనిపించినా.. ఆ తర్వాత నిద్రకు ఆటంకం కలుగుతుంది. డీహైడ్రేషన్‌, అతిగా మూత్ర విసర్జన చేయాల్సి రావడం వల్ల నిద్రలేమికి కారణమవుతుంది.

నిత్యం బీర్‌ తాగే వారిలో లివర్‌, గుండె సంబంధిత సమస్యల బారిన పడే అవకాశాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. బీర్‌ రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. దీనికారణంగా చర్మం పొడిబారి కాంతి, నిగారింపు కోల్పోతుంది. ముఖం కూడా ఉబ్బినట్టుగా కనిపిస్తుంది. వృద్ధాప్య ఛాయలు త్వరగా కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

వారంలోనే రెండింతలు పెరిగిన ధరలు

గత కొంత కాలంగా నిత్యవసర ధరలు కొండెక్కి కూర్చున్నాయి. అసలే అత్తెసరు ఆదాయంతో ఈసురోమంటూ కుటుంబాన్ని ఈదే సామాన్యుడు ఈ పెరిగిన ధరలతో బెంబేలెత్తిపోతున్నాడు.

బియ్యం, పప్పు, ఉప్పుల ధరలు అందనంత ఎత్తులో ఉన్నాయి. దీనికి తోడు నిన్నమొన్నటి వరకు కురిసిన వర్షాలకు పంటలు కూడా వరునుడు ఎత్తుకుపోయాడు. దీంతో నిత్యవసర సరుకుల ధరలు మరింత పైపైకి ఎగబాకుతున్నాయి. ఓ పక్క పెరిగిన ధరలతో అల్లాడిపోతుంటే.. మరోవైపు టమాట, ఉల్లి ధరలు కూడా ఠారెత్తిస్తున్నాయి. వారం క్రితం కాస్త పర్లేదు అనేంతగా రూ. వందకు 4 కేజీల వరకు విక్రయించిన వ్యాపారులు హఠాత్తుగా ధరలు పెంచేశారు. కేవలం వారం రోజుల్లోనే రెండు సార్లు ధరలు పైకెగబాకాయి.

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇదే తంతు కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు హోల్‌సేల్‌ మార్కెట్లలో రూ.40 నుంచి 60 వరకు పలికిన కిలో ఉల్లిపాయల ధర ఇప్పుడు రూ.70 నుంచి 80కి చేరింది. శుక్రవారం కొన్ని ప్రాంతాల్లో రూ.80 కంటే అధిక ధర పలికడంతో పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ బడ్జెట్లు తల్లకిందులై వినియోగదారులు అల్లాడిపోతున్నారు. ఇక వ్యాపారులు మాత్రం ద్రవ్యోల్బణంతోపాటు ఉల్లి కొనుగోలు ధరలు పెరగడమే ఇందుకు కారణమని చెప్తున్నారు.

మండీల్లో కిలో ఉల్లి ధర రూ.60 నుంచి రూ.70కి పెరిగిందని, అమ్మకాలపై ప్రభావం చూపుతుండటం వల్లనే విక్రయాలు తగ్గాయని అంటున్నారు. అయినప్పటికీ ఉల్లిపాయలను జనం కొంటూనే ఉన్నారని ఢిల్లీ మార్కెట్‌లోని ఓ వ్యాపారి తెలిపారు. అదుపు లేకుండా పెరిగిపోతున్న ధరలపై వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉల్లితోపాటు వెల్లుల్లి, టమాట ధరలు కూడా రెట్టింపు కావడంతో కొనుగోలుదారులు వాపోతున్నారు. పెరిగిపోతున్న ధరలకు ప్రభుత్వం కళ్లెం వేసి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

మరో బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం

ఆంధ్రాకు అల్పపీడన ముప్పు ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతుందని.. రెండు మూడు రోజుల్లో అదే ప్రాంతంలో.. అల్పపీడనం ఏర్పడవచ్చని వెల్లడించింది.

ఐఎండి సూచనల ప్రకారం నైరుతి బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. దీని ప్రభావంతో రాగల 36 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించారు. ఆ తదుపరి రెండు రోజుల్లో అల్పపీడనం పశ్చిమ దిశగా నెమ్మదిగా కదులుతూ తమిళనాడు/శ్రీలంక తీరాల వైపు కదులుతుందని వెల్లడించారు. మరోపక్క ఆవర్తనం నుండి నైరుతి బంగాళాఖాతం మీదుగా తూర్పుమధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందన్నారు.

దీని ప్రభావంతో మంగళ, బుధ,గురువారాల్లో(12,13,14 తేదీల్లో) రాయలసీమ, దక్షిణకోస్తాలో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

రాబోయే నాలుగు రోజులు వాతావరణం క్రింద విధంగా ఉండనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వివరించారు.

నవంబర్ 11, సోమవారం :
• కాకినాడ, కోనసీమ, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

నవంబర్ 12, మంగళవారం :

• నెల్లూరు, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ , అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

• విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల మరియు ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

నవంబర్ 13 బుధవారం : • కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

• ఎన్టీఆర్, పల్నాడు, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య మరియు చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

నవంబర్ 14 గురువారం :

• తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. • కాకినాడ, కోనసీమ, వైఎస్ఆర్, అన్నమయ్య మరియు చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

సోషల్ మీడియా యాక్టివిస్టులపై ప్రభుత్వం నజర్..సజ్జల భార్గ‌వ్‌కు షాకిచ్చిన పోలీసులు

సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల తర్వాత సోషల్ మీడియా యాక్టివిస్టులపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సజ్జల భార్గ‌వ్‌‌పై పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల తర్వాత సోషల్ మీడియా యాక్టివిస్టులపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కడప జిల్లాలో వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ సజ్జల భార్గవ్ పై అట్రాసిటీ కేసు నమోదైంది. పులివెందుల నియోజకవర్గానికి చెందిన సింహాద్రి పురంలోని హరి అనే వ్యక్తి అట్రాసిటీ కేసును పెట్టాలని పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అయితే సజ్జల భార్గవ్‌తోపాటు అర్జున్ రెడ్డి, రవీంద్రారెడ్డిపై కూడా కేసు నమోదైంది. హరి అనే వ్యక్తి తనను ఈ ముగ్గురు కులం పేరుతో దూషించారని కేసు పెట్టాడు. హరి ఫిర్యాదు మేరకు పులివెందుల పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఇప్పటికే వర్రా రవీంద్ర పలు కేసులలో నిందితుడిగా ఉన్నాడు. అంతేకాకుండా వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్‌ సజ్జల భార్గవ్‌పై కూడా ఫిర్యాదులు ఉన్నాయి. ఇప్పటికే వర్రా రవీంద్ర పోలీసుల అదుపులో ఉన్నాడు.

కడప జిల్లాలో సోషల్ మీడియా యాక్టివిస్టు వార్రా రవీంద్ర అరెస్ట్ తర్వాత పరిస్థితులు చాలా సీరియస్‌గా ఉన్నాయి. వర్రా రవీంద్ర అరెస్టుపై పోలీసులు కొంత అలసత్వం ప్రదర్శించరాని కూటమి ప్రభుత్వం విమర్శలు చేసింది. అయితే అదే స్థాయిలో వైసీపీ నేతలు కూడా కూటమి ప్రభుత్వంపై తమ విమర్శనాస్త్రాలను సంధిస్తూనే ఉన్నారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, కడప ఎంపీ అవినాష్ రెడ్డి సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టులపై స్పందించి ప్రభుత్వం కావాలనే కక్షపూరిత చర్యలకు పాల్పడుతుందని వారు మండిపడ్డారు.

అంతే కాకుండా అరెస్ట్ చేసిన వారిని సకాలంలో కోర్టుకు తీసుకువెళ్లడం లేదని వర్రా రవీంద్రను కర్నూలు డీటీసీలో పెట్టి చిత్రహింసలకు గురి చేస్తున్నారని కడప ఎంపీ అవినాష్ రెడ్డి బాహాటంగానే విమర్శించారు. అంతే కాకుండా ఎంపీ అవినాష్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు రాఘవరెడ్డి ఇంటిదగ్గర కూడా పోలీసులు హల్చల్ చేశారు. అర్ధరాత్రి 11 గంటల సమయంలో రాఘవరెడ్డిని విచారణకు తీసుకువెళ్లేందుకు పోలీసులు సిద్ధమయ్యారు వర్రా రవీంద్ర కేసు విషయంలో రాఘవరెడ్డి వాట్సాప్ చాటింగ్ ఏదో పోలీసుల దగ్గర బహిర్గతమైనట్లు తెలుస్తోంది.

మారిన కేవైసీ నియమాలు.. మీ బ్యాంకు ఖాతాను అప్‌డేట్‌ చేయాలా? వద్దా

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతా ఉంటుంది. అయితే బ్యాంకు ఖాతాలకు కేవైసీ తప్పనిసరి అవసరం. ఏదైనా వివరాలు అవసరమైనప్పుడు పూర్తిగా కేవైసీ చేసుకోవడం మంచిది.

లేకుంటే ఖాతా నిలిచిపోయే అవకాశం ఉంటుంది. బ్యాంకు అకౌంట్‌కు కేవైసీ లేకపోతే మీరు ఎలాంటి లావాదేవీలు చేయలేరు. దీని కోసం మీరు ముందు బ్యాంకును సంప్రదించాల్సి ఉంటుంది. అక్కడ ఆధార్‌, పాన్‌ కార్డు వివరాలు అందించాల్సి ఉంటుంది. అప్పుడు అకౌంట్లో వివరాలు అప్‌డేట్‌ చేసిన తర్వాత మీ ఖాతాను ఉపయోగించుకునేందుకు అవకాశం ఉంటుంది.

అందుకే బ్యాంకు అకౌంట్‌ రిన్నింగ్‌లో ఉండాలంటే KYC అవసరం. కేవైసీ లేకుండా బ్యాంక్ ఖాతా నిష్క్రియం కావచ్చు. లావాదేవీలను కూడా నిరోధించవచ్చు. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ కేవైసీ నియమాన్ని మార్చింది. ఈ నిబంధన నవంబర్ నెల నుంచి అమల్లోకి వస్తుంది.

కేవైసీ నిబంధనలను నవంబర్ 6న ఆర్బీఐ మార్చింది. ఇక నుంచి రిస్క్ బేస్డ్ విధానాన్ని అవలంబిస్తామని ఆర్బీఐ తెలిపింది. ఏదైనా ఖాతాలో సమస్య ఉంటే వెంటనే కేవైసీ చేసుకోవాలని బ్యాంకు సూచిస్తుంది. అకౌంట్‌ అప్‌డేట్‌ చేసిన తర్వాత ఎలాంటి ఇబ్బంది ఉండదు.

అధిక-రిస్క్ కస్టమర్‌లు – కేవైసీ ప్రతి 2 సంవత్సరాలకు అప్‌డేట్‌ చేయాలి.
మీడియం రిస్క్ కస్టమర్ – కేవైసీ ప్రతి 8 సంవత్సరాలకు అప్‌డేట్‌ చేయాలి.
తక్కువ రిస్క్ కస్టమర్లు – కేవైసీని ప్రతి 10 సంవత్సరాలకు అప్‌డేట్‌ అవుతుంది.

అన్ని KYCలు కూడా సెంట్రల్ కేవైసీ రికార్డ్ రిజిస్ట్రీలో అప్‌డేట్ చేయవలసిందిగా ఆర్బీఐ కోరింది. కేవైసీని పదే పదే అప్‌డేట్ చేయమని కస్టమర్‌లను అడగడానికి బదులు, ఈ సెంట్రల్ రిజిస్ట్రేషన్ సైట్ నుండి సమాచారాన్ని అప్‌డేట్ చేయమని కోరతారు.

ఏ సందర్భాలలో కస్టమర్ కేవైసీని అప్‌డేట్ చేయాలి?

ఏదైనా సమాచారం అసంపూర్ణంగా లేదా తప్పుగా ఉంటే.
డౌన్‌లోడ్ చేసిన పత్రం గడువు ముగిసినట్లయితే.
ఏదైనా కారణం కోసం అదనపు ధృవీకరణ అవసరమైతే.

నిజం కాబోతున్న ప్రధాని మోదీ నినాదం.. సామాన్యుడికి అందుబాటులో విమానాశ్రయాలు

విమాన ప్రయాణం ఒకప్పుడు ధనికవర్గాలకు మాత్రమే సాధ్యం. కానీ ఇప్పుడు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాలు సైతం విమాన ప్రయాణాలు చేయగల్గుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ఉడాన్ పథకం ద్వారా ద్వితీయ శ్రేణి నగరాలకు, మారుమూల ప్రాంతాలకు కూడా విమాన సేవలు అందుబాటులోకి వచ్చాయి.

“హవాయి చెప్పులు వేసుకునేవారు కూడా ‘హవాయి జహాజ్’ (విమానం)లో ప్రయాణం చేయాలి” అన్న ప్రధాని నరేంద్ర మోదీ నినాదం దాదాపు నిజమైంది. విమాన సేవల్లో పోటీ కారణంగా టికెట్ ధరలైతే సామాన్యుడికి అందుబాటులోకి వచ్చాయి.. కానీ విమానాశ్రయాల్లో కనీసం మంచి నీళ్లు తాగడానికి కూడా ఆలోచించే పరిస్థితులే ఇంకా కొనసాగుతున్నాయి. ఎందుకంటే.. బయట మార్కెట్లో రూ. 20 ధరకు దొరికే 1 లీటర్ మంచినీళ్ల బాటిల్ కోసం విమానాశ్రయంలో రూ. 100కు పైగా చెల్లించాల్సి వస్తోంది. బయట రూ. 10కి దొరికే సమోసాను విమానాశ్రయాల్లో రూ. 100కు పైగా ధరతో విక్రయిస్తూ ఉంటారు. ఒక కప్పు టీ లేదా కాఫీ తాగాలన్నా రూ. 100కు పైగానే జేబుకు చిల్లు పడుతోంది. ఎయిరిండియా, విస్తారా వంటి సంస్థలు విమాన ప్రయాణంలో ఆహారాన్ని ఉచితంగానే అందిస్తున్నప్పటికీ.. మిగతా విమానయాన సంస్థలు అధిక ధరలు వసూలు చేస్తున్నాయి.

దీంతో చాలామంది సామాన్య మధ్యతరగతి ప్రజలు నోరు కట్టేసుకుని విమాన ప్రయాణాలు చేస్తుంటారు. విమానాల్లో ఎకానమీ, ప్రీమియం ఎకానమీ, బిజినెస్ క్లాస్ పేరుతో ధనిక, మధ్యతరగతి వర్గాలకు తగిన ధరలతో తగిన సేవలు అందజేస్తున్నప్పటికీ.. విమానాశ్రయాల్లో మాత్రం మధ్యతరగతి ప్రయాణికులకు అందుబాటు ధరల్లో లభించే ఒక్క ఫుడ్ స్టాల్ కూడా కనిపించదు. ఈ పరిస్థితికి చెక్ పెట్టేందుకు కేంద్ర పౌరవిమానయాన శాఖ కసరత్తు చేస్తోంది. కేంద్ర మంత్రివర్గంలోనే అత్యంత పిన్న వయస్కుడైన మంత్రి రామ్మోహన్ నాయుడు చొరవతో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) ఈ దిశగా సన్నాహాలు చేస్తోంది.

ఎయిర్‌పోర్టుల్లో ఎకానమీ ఫుడ్ జోన్

విమానాశ్రయాల్లో ప్రపంచవ్యాప్త రుచులు, వంటకాలను అందించే అనేక రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు ఉంటాయి. అక్కడ లభించే ఆహార పదార్థాలకు బయట చెల్లించే ధరలతో పోల్చితే కనీసం 4 రెట్లు అధిక ధరలు వసూలు చేస్తుంటాయి. చివరకు చిన్న ఫుడ్ స్టాల్‌లో ఇడ్లీ, సమోసా వంటి అల్పాహారానికి కూడా బయటి ధరలతో పోల్చితే కనీసం నాలుగింతలు అధిక ధర చెల్లించాల్సి వస్తుంది. ఖరీదైన ఆహారం సాధారణ విమాన ప్రయాణికులపై అధిక భారాన్ని మోపుతోంది. ఈ పరిస్థితిని నివారించడం కోసమే కేంద్ర పౌరవిమానయాన శాఖ సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. ఆ ప్రకారం ప్రతి విమానాశ్రయంలో ఎకానమీ ఫుడ్ జోన్ ఏర్పాటు చేసి, అక్కడ సామాన్యుడికి అందుబాటు ధరల్లో ఆహార పదార్థాలను అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తోంది.

తొలి దశలో కొత్తగా నిర్మిస్తున్న విమానాశ్రయాల్లో వీటిని ఏర్పాటు చేయాలని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా భావిస్తోంది. విమానాశ్రయాల్లో అద్దె చాలా ఎక్కువగా ఉంటుంది. చదరపు అడుగుల్లో అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ప్రయాణికులు కూర్చొనేందుకు వీలుగా సీటింగ్ ఏర్పాటు చేస్తే.. ఆయా రెస్టారెంట్లు మరింత ఎక్కువ అద్దె చెల్లించాల్సి ఉంటుంది. అందుకే అక్కడ రెస్టారెంట్లను ఏర్పాటు చేసే సంస్థలు ఎక్కువ ధరకు ఆహార పదార్థాలను విక్రయించాల్సి వస్తోంది. ఎకానమీ జోన్‌లో సీటింగ్ ఏర్పాటు లేకుండా కేవలం ఫుడ్ స్టాళ్లను ఏర్పాటు చేస్తారు. సెల్ఫ్ సర్వీస్, టేక్ ఎవే తరహాలో ఇక్కడ ఆహారాన్ని అందిస్తారు. ప్రయాణికులు కౌంటర్‌లో ఆహారాన్ని తీసుకుని నిలబడి లేదా కామన్ ఏరియాలో కూర్చుని తినవచ్చు. లేదా తమతో పాటు విమానంలోకి తీసుకెళ్లి తినవచ్చు.

ఈ తరహాలో సేవలు అందించేందుకు AAI విమానశ్రయాలను నిర్వహిస్తున్న సంస్థలు, కొత్త ఏజెన్సీలతో సంప్రదింపులు ప్రారంభించింది. కొత్తగా నిర్మించే విమానాశ్రయాల్లో ఎకో ఫుడ్ జోన్ల కోసం కొంత స్థలాన్ని ప్రత్యేకంగా కేటాయించాలని నిర్ణయించింది. ఇప్పటికే కార్యకాలాపాలు సాగిస్తున్న విమానాశ్రయాల్లో తర్వాతి దశలో ఎకానమీ ఫుడ్ జోన్ల కోసం అవసరమైన స్థలాన్ని గుర్తించి ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

అత్యవసరం ఉందా? ఏటీఎంకు వెళ్లకుండా ఇంట్లో కూర్చొని డబ్బులు డ్రా చేసుకోవచ్చు

మీకు అత్యవసరంగా డబ్బు అవసరమైతే, సమీపంలో ఏటీఎం లేకపోతే డబ్బు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చొని డబ్బులు డ్రా చేసుకోవచ్చు. అవును, మీరు ATMకి వెళ్లకుండానే డబ్బును ఎలా విత్‌డ్రా చేసుకోవచ్చో తెలుసుకొండి.

డిజిటల్ యుగంలో ఎక్కడైనా ఏదైనా కొనాలనుకున్న మొబైల్ ఫోన్ ఉంటే చాలు. ఇప్పుడు మనం ప్రతిదానికీ ఫోన్ పే, గూగుల్ పే చేస్తూ చాలా సులభంగా ట్రాన్సాక్షన్స్ చేసుకుంటున్నాము. అయితే ఒక్కోసారి ఈ ఆన్‌లైన్ తో సైబర్ దొంగలు మన సొమ్మును కాజేస్తున్నారు. అందుకే డిజిటల్‌పై ఆధారపడి ఉండటం అన్నివేళల సాధ్యం కాకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో నగదు చెల్లించాల్సి రావచ్చు. మనకు డబ్బు అవసరమైనప్పుడు ఖచ్చితంగా ATM పై ఆధారపడవలసిందే…లేదా సమీపంలోని బ్యాంకులో డబ్బు డ్రా చేసేందుకు ప్రయత్నిస్తాం. కాని కొన్నిసార్లు అవి అందుబాటులో లేకుంటే ఏం చేయాలో తెలియక చాలా మంది ఆందోళన చెందుతారు.

ఇలాంటి సమయాల్లోనే తపాలా శాఖ ప్రారంభించిన ఆధార్ ATM (AePS) సేవను ఉపయోగించుకోవడం ఉత్తమం. అవును, తపాలా శాఖ ఆధార్ ATM (AePS) సేవను ప్రారంభించింది. దీని నుండి మీరు ఇంట్లో నుంచే డబ్బు డ్రా చేసుకోవచ్చు. ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అందించే ఈ ప్రత్యేక సేవ గురించి మరింత తెలుసుకోండి..

మీకు అత్యవసరంగా డబ్బు అవసరమైతే మరియు బ్యాంక్ లేదా ATMకి వెళ్లడానికి సమయం లేకుంటే, మీరు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) ఆన్‌లైన్ ఆధార్ ATM (AePS) సేవను ఉపయోగించి ఇంటి నుండి డబ్బు తీసుకోవచ్చు… పోస్ట్‌మ్యాన్ మీ ఇంటికి వచ్చి డబ్బును డ్రా చేసి ఇస్తాడు. మీరు సైతం పోస్టాఫీసుకు వెళ్లి డబ్బు డ్రా చేసుకోవచ్చు.

ఈ ఆన్‌లైన్ ఆధార్ ATM (AePS) సేవను ఉపయోగించడానికి మీ ఆధార్ తప్పనిసరిగా మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేయబడి ఉండాలి. మీ బయోమెట్రిక్ కూడా సరిగ్గా నమోదు చేయబడాలి. AePS ద్వారా ఇంట్లో డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. ఖాతాలోని బ్యాలెన్స్‌ను తెలుసుకోవచ్చు. మినీ స్టేట్‌మెంట్‌ను పొందవచ్చు. డబ్బును ఇతర బ్యాంకులకు బదిలీ చేయవచ్చు. ఈ సేవకు ఎటువంటి రుసుము లేదు. కానీ మీ ఇంటికి వచ్చి సేవలు అందించినందుకు పోస్ట్‌మ్యాన్‌కు సర్వీస్ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది.

మీరు డబ్బును ఉపసంహరించుకున్న తర్వాత, మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు నగదు బదిలీ SMSని అందుకుంటారు. ఈ సందేశం ఇండియన్ పోస్టల్ సర్వీస్ మరియు మీ బ్యాంక్ ద్వారా పంపబడుతుంది.

పాన్‌ కార్డు దారులకు అలర్ట్.. డిసెంబర్‌ 31 అందుకు చివరి తేదీ..

పాన్‌కార్డును ఆధార్‌ కార్డుతో లింక్ చేయాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పలుసార్లు తెలిపిన విషయం తెలిసిందే. ఆర్థిక మోసాలను అరికట్టడమే లక్ష్యంగా కేంద్రం ఈ నిర్ణయాన్ని తీసుకుంది.

ఇందుకుగాను గడువు కూడా ముగిసింది. అయితే ప్రస్తుతం ఎవరైనా ఆధార్‌,పాన్‌ లింక్‌ చేసుకోకపోతే జరిమానాతో లింక్‌ చేసుకునే అవకాశం ఉంది.

అయితే తాజాగా ఇందుకు సంబంధించి మరో కీలక ప్రకటన చేశారు. వచ్చే డిసెంబర్‌ 31వ తేదీలోపు పాన్‌ కార్డులను ఆధార్ కార్డులతో కచ్చితంగా లింక్‌ చేసుకోవాలని తేల్చి చెప్పారు. లింక్‌ చేయని పాన్‌ కార్డులు డిసెంబర్ 31వ తేదీ తర్వాత డీయాక్టివేట్‌ అవుతతాయని ప్రకటించారు. ఆ తర్వాత కొత్త పాన్‌ కార్డ్ తీసుకోవడం తప్ప మరో అవకాశం ఉండదని స్పష్టం చేస్తున్నారు. అయితే ఇందులోనూ పలు సమస్యలు ఎదుర్కోక తప్పదని హెచ్చరిస్తున్నారు.

కొన్ని సంస్థలు కస్టమర్ల అనుమతి లేకుండా వారి ప్రొఫైల్‌లను రూపొందించడానికి పాన్‌ సమాచారాన్ని ఉపయోగిస్తున్నాయి. ఇవి ఆర్థిక నేరాలకు దారి తీస్తున్న నేపథ్యంలోనే ఆధార్‌తో లింక్ చేయాలనే నిబంధనను ప్రభుత్వం తీసుకొచ్చింది. పాన్‌ కార్డులను దుర్వినియోగం చేయకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా డిసెంబర్‌ 31లోపు పాన్‌ కార్డు, ఆధార్‌ లింక్ చేయకపోతే పాన్‌ కార్డ్ డీయాక్టివేట్ అవుతుందని చెబుతున్నారు. తదుపరి లావాదేవీలు జరగవు. అలాగే కార్డును మళ్లీ యాక్టివేట్ చేయడం కూడా కష్టమవుతుందని అంటున్నారు.

దేశంలో ప్రబలుతున్న ఫ్యాటీ లివర్ డిసీజ్.. ఈ లక్షణాలు ఉంటే డేంజర్‌లో ఉన్నట్లే

దేశంలో ఫ్యాటీ లివర్ డిసీజ్ ప్రబలుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వైద్య నిపుణులు. ఫ్యాటీ లివర్ డిసీజ్‌ను మహమ్మారిగా గుర్తించాలని కేంద్రానికి లేఖ రాశారు.

డయాబెటిస్, ఊబకాయం రోగులలో 90శాతం మందికి FLD ఉన్నట్లు చెప్తున్నారు. అధిక బరువు గలవారిలో 75% మందిలో, తీవ్ర ఊబకాయుల్లో 90% మందిలో ఇది కనిపిస్తుంటుంది. ఇప్పటికే దేశంలో 30 నుంచి 40 కోట్ల మంది ఫ్యాటీ లివర్‌ బాధితులున్నారని, రెండు, మూడేళ్లలో ఇంకా పెరుగుతారని హెచ్చరిస్తున్నారు.

నాన్ ఆల్కహాలిక్ వ్యక్తుల్లోనూ.. FLD వ్యాపిస్తోందని అంటున్నారు గ్యాస్ట్రో ఎంటమాలజీ డాక్టర్లు. ఫ్యాటీ లివర్‌ మహమ్మారిగా ప్రకటించి.. దాని నివారణపై పనిచేయాలని నేషనల్ హెల్త్ టాస్క్ ఫోర్స్‌కు లేఖ రాశామంటున్నారు వైద్య నిపుణులు. ఫ్యాటీ లివర్‌ అనేది సైలెంట్‌ కిల్లర్‌గా మారిందని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. కాలేయానికి గొప్ప గుణం ఉంది. డ్యామేజ్ అయినా తిరిగి కోలుకోవటానికే ప్రయత్నిస్తుంది. మరి మనం ఆ మాత్రం చాన్స్ కూడా ఇవ్వకపోవడమే ఇప్పుడు ప్రధాన సమస్య.

లివర్ జబ్బుల్లో బాగా గుర్తించాల్సింది- తొలుత పైకి ఎలాంటి సింటమ్స్ కనిపించవు. లక్షణాలు కనిపించటం మొదలయ్యేసరికే జబ్బు బాగా ముదిరిపోతుంది. ఎందుకంటే లివర్ 50-60% డ్యామేజ్ అయినా పైకేమీ తెలియదు. అంతా బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది.

ఫ్యాటీ లివర్ లక్షణాలు:

కడుపులో కుడిభాగంలో బరువుగా అనిపించడం
చిన్నగా కడుపునొప్పి రావడం
అలసట..
పొట్ట అసౌకర్యం
ఆకలి లేకపోవడం..
కామెర్లు..

కాలేయం పనితీరును బట్టి ఎఫ్‌ 0 నుంచి ఎఫ్‌ 4 వరకూ స్కోరింగ్‌ ఇస్తారు. ఈ పరీక్షల్లో ఎఫ్‌4 ఫలితం వస్తే వాళ్లు మూడో దశకు చేరుకున్నట్టు. మూడో దశను లివర్‌ ఫైబ్రోసిస్‌ అంటారు. లివర్‌ ఫైబ్రోసిస్‌ చాలా ప్రమాదకరం. నాలుగో దశలను సిరోసిస్‌ అంటారు. ఈ దశలో కాలేయం పూర్తిగా చెడిపోతుంది. ఈ దశకు చేరుకున్నవాళ్లు 20 నుంచి 30 శాతం వరకూ చనిపోయే ప్రమాదం ఉంది.

తొలిదశ ఫ్యాటీ లివర్ సమస్యను లైఫ్ స్టైల్ మార్పుల ద్వారా సరిచేసుకోవచ్చు. ముఖ్యంగా బరువు తగ్గించుకోవటం ఎంతగానో ఉపయోగపడుతుంది. మంచి ఫుడ్ తీసుకోవాలి. కొవ్వులు, నూనె పదార్థాలు తగ్గించాలి. కూరగాయలు, ఫ్రూట్స్ బాగా క్లీన్ చేసిన తర్వాతే తినాలి. చక్కెర ఎక్కువగా ఉండే కూల్‌డ్రింకులు, ఎనర్జీ డ్రింక్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి. రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

ఏఐతో ఎన్నెన్నో.. క్యాన్సర్‌ వచ్చే ప్రమాదాన్ని ముందే పసిగడుతోన్న టెక్నాలజీ

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌… ఇప్పుడీ పేరు ఓ అద్భుతం. ఈ సరికొత్త టెక్నాలజీ ప్రపంచాన్ని శాసించేందుకు సిద్ధమవుతోంది. ఆ రంగం ఈ రంగం అనే తేడా లేకుండా దాదాపు అన్ని రంగాల్లో ఏఐ వినియోగం అనివార్యంగా మారింది.

ఓవైపు ఏఐతో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోతారన్న వస్తున్నాయి. మరోవైపు ఏఐ టెక్నాలజీ సృష్టిస్తున్న వింతలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

పాటలు రాయడం, పాడడం, మ్యూజిక్‌ అందించడంలో ఇలా ఒక్కటేమిటి ఏఐ చేయలేని పని అంటూ ఏది లేదనే వరకు పరిస్థితులు వెళ్లాయి. కాగా వైద్య రంగంలో కూడా ఏఐ సరికొత్త ఒరరవడి సృష్టించడం ఖాయమని చెబుతున్నారు. వైద్యులకు కూడా సాధ్యంకాని వండర్స్‌ను ఏఐ క్రియేట్‌ చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మనిషికి క్యాన్సర్ వచ్చే విషయాన్ని ఏఐ అత్యంత కచ్చితంగా కొన్నేళ్ల ముందుగానే చెప్పేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.

ఇందులో భాంగానే పరిశోధనలు జరుగుతున్నాయి. బోస్టన్‌లోని మాస్ జనరల్ బ్రిగమ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ మెడిసిన్ ప్రోగ్రామ్ డైరెక్టర్ డానియల్ బిట్టర్‌మాన్ ఈ విషయమై మాట్లాడుతూ.. తాము ఏఐని ఉపయోగించే విషయంలో ఇంకా ప్రారంభదశలోనే ఉన్నామని చెబుతున్నారు. AI చాట్‌బాట్‌లు వైద్య సమాచారాన్ని సింథసైజ్ చేయగలవని ఆయన చెబుతున్నారు. దీని ఆధారంగా మనిషికి క్యాన్సర్‌ వచ్చే అవకాశాలను ఇట్టే చెప్పేస్తుంది.

చాట్‌ జిపిటి వెర్షన్‌ 3.5 వివిధ రకాల క్యాన్సర్‌కు ప్రాథమిక చికిత్స ఇవ్వగలుగుతుందని కనుగొన్నారు. క్యాన్సర్‌ మొదటి దశలోనే ఏఐ గుర్తిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బ్రెస్ట్‌ క్యాన్సర్‌ అభివృద్ధి చెందడానికి 5 సంవత్సరాల ముందు AI ఎలా గుర్తించగలదో ఇప్పటికే ఒక పరిశోధనలో తేలింది. ఈ ఏడాది జూన్‌లో వెలువడిన ఈ పరిశోధనకు సంబంధించిన అంశాలను ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర సైతం ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

ఒక మహిళ రొమ్ము ఎక్స్‌ రే ఆధారంగా ఆమెకు క్యాన్సర్‌ వస్తుందన్న విషయాన్ని ఏఐ ముందుగానే గుర్తించింది. ఈ లెక్కన రానున్న రోజుల్లో ప్రతీ ఒక్క హాస్పిటల్లో ఏఐ ఆధారిత సేవలు అందుబాటులోకి రానున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అమెరికాకు చెందిన డ్యూక్ యూనివర్సిటీ పరిశోధకులు రూపొందించిన ఈ కొత్త టెక్నాలజీతో క్యాన్సర్‌ వచ్చే అవకాశాన్ని ఐదేళ్ల ముందుగానే గుర్తించారు. మరి భవిష్యత్తులో ఏఐ మరెన్ని సంచలనాలకు తెర తీస్తుందో చూడాలి.

తేనెలో వీటికి కలిపి తీసుకుంటున్నారా.? చాలా డేంజర్‌

తేనె ఆరోగ్యానికి ఎంతలా మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్ని రోజులు నిల్వ చేసినా పాడవ్వని వస్తువుల్లో తేనె ప్రధానమైందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

తేనెలో ఉండే ఎన్నో ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చక్కెరకు బదులుగా తేనెను తీసుకోవాలని నిపుణులు సైతం సూచిస్తుంటారు. అయితే తేనెను ఎట్టి పరిస్థితుల్లో కొన్ని రకాల పదార్థాలతో కలిపి తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* వేడి నీటిలో తేనెను కలుపుకొని తీసుకోవడం ఇటీవల ఎక్కువుతోంది. ముఖ్యంగా కరోనా తర్వాత వేడి నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే మరీ వేడి నీటిలో తేనెను కలుపుకోవడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. మరుగుతోన్న నీటిలో తేనెను కలుపుకుని తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

* తేనెను నెయ్యితో కలిపి తీసుకోవడం కూడా మంచి కాదని నిపుణులు అంటున్నారు. సాధారణంగా నెయ్యి, తేనె కలిపి ఎవరు తీసుకుంటారనే సమాధానం రావొచ్చు. కానీ నెయ్యితో చేసిన స్వీట్స్ తిన్న వెంటనే తేనె తీసుకోవడం కూడా మంచిది కాదని చెబుతున్నారు. దీనివల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు.

* స్పైసీ ఫుడ్‌, తేనెను కలిపి తీసుకుంటే మంచిది కాదని అంటున్నారు. బిర్యానీ వంటి స్పైసీ ఫుడ్‌ తీసుకున్న తర్వాత తేనె తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయని అంటున్నారు.

* ఇక కొందరు టీలో తేనె కలుపుకొని తీసుకుంటుంటారు. అయితే ఇది కూడా మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పాలలో తేనె కలుపుకొని తీసుకోవడం వల్ల శరీరంలో వేడి పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు.

* గుడ్లు, నాన్‌వెజ్ వంటి వాటిని తీసుకున్న తర్వాత కూడా తేనె తినడం అస్సలు మంచిది కాదని నిపుణులు అంటున్నారు. ఇలా తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

టూత్‌ పేస్ట్‌ను ఎక్కువగా వాడుతున్నారా.? ఏమవుతుందో తెలుసా.

ఉదయం నిద్రలేవగానే ప్రతీ ఒక్కరం చేసే పని బ్రష్‌ చేసుకోవడం. నోటి ఆరోగ్యం బాగుంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటారనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

అందుకే కేవలం ఉదయాన్నే కాకుండా రాత్రి పడుకునే ముందు కూడా బ్రషింగ్ చేసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. నోటి ఆరోగ్యం, చిగుళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా బ్రషింగ్ చేసుకోవాల్సిందే.

అయితే బ్రషింగ్ విషయంలో మనలో కొందరు తెలిసో తెలియకో కొన్ని తప్పులు చేస్తుంటారు. వీటిలో ప్రధానమైంది టూత్ పేస్ట్‌. సాధారణంగా ఎక్కువ టూత్‌ పేస్ట్‌ వాడితే మంచిదని మనలో చాలా మంది భావిస్తుంటారు. ఇంతకీ టూత్ పేస్ట్‌ ఎక్కువగా వాడడం మంచిదేనా.? అసలు నిపుణుల అభిప్రాయం ప్రకారం ఎంత టూత్‌ పేస్ట్‌ను వాడాలి లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

టూత్‌పేస్ట్‌ ఎక్కువగా ఉపయోగించడం వల్ల లాభం ఉండకపోగా నష్టం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. బఠానీ గింజ పరిమాణం ఉంటే చాలని చెబుతున్నారు. ఇది మొత్తం దంతాలను శుభ్రం చేసుకోవడాఇనకి సరిపోతుంది. అయితే టూత్ పేస్ట్‌ను ఎక్కువగా ఉపయోగించడం హానికరమని నిపుణులు అంటున్నారు. దీనివల్ల దంతాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది.

సాధారణంగా టూత్‌ పేస్టుల్లో సోడియం ఫ్లోరైడ్‌ను ఉపయోగిస్తారు. ఇది దంతాలను బలోపేతం చేయడానికి ఉపయోగపడతాయి. అయితే అధిక మొత్తంలో తీసుకుంటే సోడియం ఫ్లోరైడ్‌ కారణంగా నోటి ఆరోగ్యం దెబ్బతింటుంది. మరీ ముఖ్యంగా చిన్నారుల్లో దంతాల్లో కావిటీస్‌ ఏర్పడి ఫ్లోరోసిస్‌ వంటి సమస్యలు వస్తాయి. అందుకే కొత్త మొత్తంలోనే టూత్‌ పేస్ట్‌ను ఉపయోగించాలి. ఇక నోటి ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే మౌత్‌ ఫ్రెషనర్స్‌న ఉపయోగించాలి. ముఖ్యంగా నోటి దుర్వాసన, నోట్లో బ్యాక్టీరియా తగ్గాలంటే మౌత్ ఫ్రెషనర్స్‌ బాగా ఉపయోగపడతాయి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరి ఇంత దారుణమా.. 9 ఏండ్లకే బాలికలకు పెళ్లి..ఎక్కడో తెలుసా

తొమ్మిదేళ్ల వయసున్న బాలికలను పురుషులు పెళ్లి చేసుకునేందుకు వీలు కల్పించే విధంగా ఇరాక్ వివాహ చట్టానికి చట్టపరమైన సవరణలను ఆమోదించనున్నట్లు తెలుస్తుంది.

ఈ చట్టం చేస్తే మహిళలు విడాకులు, పిల్లల సంరక్షణ, వారసత్వ హక్కులను కూడా కోల్పోతారని సమాచారం. సంప్రదాయవాద షియా ముస్లిం పార్టీల సంకీర్ణం ఆధిపత్యంలో ఉన్న ఇరాక్ పార్లమెంట్ “వ్యక్తిగత స్థితి చట్టం”ను తారుమారు చేసిందుకు రంగం సిద్దం చేసినట్లు వినిపిస్తున్నాయి.

దీనిని 188 చట్టం అని కూడా పిలుస్తారు. ఇది 1959లో ప్రవేశపెట్టారు. ఈ చట్టాన్ని ఇరాక్‌లోని షియా పార్టీలు సవరించడానికి ప్రయత్నించడం ఇదే మొదటిసారి ఏం కాదు – 2014 మరియు 2017లో దీన్ని మార్చడానికి ప్రయత్నాలు చేయగా అవీ విఫలమయ్యాయి. ఒకవేళ ఇరాక్ పార్లమెంట్ “వ్యక్తిగత స్థితి చట్టం”ను సవరిస్తే దేశంలోని మహిళలకు ఉన్న ముఖ్యమైన హక్కులు అన్ని తొలగిపోతాయని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇరాక్ పార్లమెంట్ తాజా సవరణలపై ఓటింగ్‌కు ముందు అధికారికంగా చర్చిస్తుంది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విషయంపై నెటిజన్లు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “పిల్లల అత్యాచారాలను చట్టబద్ధం చేయడానికి” ఇరాక్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు. UNICEF ప్రకారం, అధిక బాల్య వివాహాల రేట్లు ఇప్పటికే ఇరాక్‌లో భారీగా ఉంది. దాదాపు 28% ఇరాక్ అమ్మాయిలు 18 సంవత్సరాల వయస్సులోపు వివాహం చేసుకున్న వారే ఉండడం గమనార్హం. ఆగస్టులో బాగ్దాద్ మరియు దేశవ్యాప్తంగా ఇతర నగరాల్లో ఈ చట్టం సవరణలపై నిరసనలు చెలరేగాయి. వ్యక్తిగత హోదా చట్టాన్ని సవరించడాన్ని వ్యతిరేకిస్తూ ఇరాక్ మహిళాలు నిరసన ప్రదర్శనలు కూడా చేశారు.

ట్విస్టులు.. సీన్ సీన్‌కు గుండె ఆగిపోవాల్సిందే.. ఒంటరిగా అస్సలు చూడకండి..

నిజానికి హారర్ లకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఓవైపు వణుకుపుట్టించే సీన్స్ ఉన్నప్పటికీ ఇలాంటి చిత్రాలను చూసేందుకు అడియన్స్ తెగ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.

ఇక తెలుగులో హారర్ మూవీస్‌కు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. తెలుగు భాషలో ఇప్పటిదాకా వచ్చిన లే కాదు.. ఇతర భాషలలో రిలీజ్ అయిన లను చూసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే జనాలకు నచ్చినట్లుగా సరికొత్త కాన్సెప్ట్స్‌తో హారర్ మూవీస్ తెరకెక్కించాలని మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. అందుకే ఇప్పుడు హారర్ మూవీస్ గురించి ఎక్కువగా సెర్చింగ్ కూడా స్టార్ట్ చేశారు. ఇదిలా ఉంటే.. కొరియన్ భాషలో థ్రిల్లర్ చిత్రాలకు, హారర్ కాన్సెప్ట్‌లకు కొదవలేదు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది కూడా ఆ కోవకు చెందినదే. కొరియన్ .. కానీ తెలుగులోనూ అందుబాటులో ఉంది. దాదాపు గంటన్నర నిడివి ఉన్న ఈ హారర్ మూవీ కథ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ఆ పేరు స్లీప్.. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. కొరియన్ భాషతోపాటు ఈ చిత్రం తెలుగులోనూ అందుబాటులో ఉంది. ఇక ఈ కథ విషయానికి వస్తే.. వైఫ్ అండ్ హస్బండ్.. హ్యాపీ లైఫ్. ఇందులో భార్య ప్రెగ్నెంట్. దీంతో ఇద్దరు ఎంతో సంతోషంగా తమ జీవితాన్ని గడుపుతుంటారు. అయితే సంతోషంగా గడుపుతున్న జీవితాల్లో ఊహించని పరిస్థితులు ఎదురవుతాయి. ఆమె భర్తకు నిద్రలో నడిచే అలవాటు ఉంటుంది. పడుకున్న తర్వాత అతడు ఏం చేస్తాడు.? ఎలా బిహేవ్ చేస్తాడు.? ఎంత భయంకరంగా మారిపోతాడో.? అనేది అసలు ఊహించలేము. పగలంతా బాగానే ఉండే తన భర్త రాత్రి అయ్యేసరికి ఎందుకు ఇలా వింతగా ప్రవర్తిస్తాడు.? అతడికి ఏమైనా దెయ్యం పడుతుందా ? తన భర్తను కాపాడుకోవడానికి ఆమె చేసింది..? అనేది ఈ .

ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. హారర్ కంటెంట్ చిత్రాలను ఇష్టపడేవారు ఈ ను మాత్రం ఒంటరిగా చూడకండి. హారర్ జోనర్‌ వచ్చిన ల్లో కంటే.. ఈ మూవీ కొంచెం డిఫెరెంట్ అని చెప్పొచ్చు. ఎక్కడా కూడా దెయ్యాలు అనేవి చూపించకుండా మొత్తం కేవలం నిద్రలో నడిచే డిజార్డర్‌తో హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. మూవీలో ప్రతీ సీన్ హైలెట్. ఇక క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ అయితే మైండ్ బ్లాంక్.

షర్మిలకు అండగా ఏపీ డిప్యూటీ సీఎం.. వారిపై చిన్న గాటు పడిన ఊరుకోం

తమది మంచి ప్రభుత్వమే కాని మెతక ప్రభుత్వం కాదని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఐఏఎస్‌లకు వార్నింగ్ ఇస్తే సుమోటోగా కేసులు పెడతామని హెచ్చరించారు.

షర్మిల అడిగితే భద్రత కల్పిస్తామని చెప్పారు. మహిళా భద్రత విషయంలో సమాజంలో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అధికారుల మీద చిన్న గాటు పడిన చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు. వైసీపీ ఇరవై ఏళ్ళు అధికారంలో ఉంటామంటూ అధికారులను ఇష్టం వచ్చినట్లు ఉపయోగించుకున్నారని మండిపడ్డారు. గంజాయి మన్యంతో పాటు రెవిన్యూ భూముల్లో కూడా సాగుచేస్తున్నారని, గంజాయిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

ఏలూరులోని ప్రభుత్వ వైద్య కళాశాలకు ప్రఖ్యాత శాస్త్రవేత్త దివంగత డా. యల్లాప్రగడ సుబ్బరావు పేరును ఖరారు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం సంతోషదాయకమని ఆయన పేర్కొన్నారు. డా.యల్లాప్రగడ పేరు ప్రతిపాదించగానే ముఖ్యమంత్రి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌లు సానుకూలంగా స్పందించి పేరు ఖరారు చేసినందుకు పవన్ కృతజ్ఞతలు తెలియజేశారు. క్యాన్సర్‌, ఫైలేరియా, క్షయ వ్యాధుల నివారణకు సంబంధించిన ఔషధాలతో పాటు తొలి టెట్రానెక్లిన్ యాంటీ బయాటిక్ ఆవిష్కరణలతో డా. యల్లాప్రగడ ఖ్యాతి పొందినట్లు చెప్పారు. ఆయన సేవలను, మేలునీ తమ కూటమి ప్రభుత్వం చిరస్మరణీయం చేసిందన్నారు. వర్తమాన, భావితరాలు ఆయన చేసిన పరిశోధనలు, ఆవిష్కరణలు స్పూర్తి పొందుతాయని తెలిపారు. అటవీ అధికారులకు అడవులను రక్షించేందుకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఆటవీ శాఖకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని, వివిధ వర్గాల నుంచి అటవీ శాఖకు రూ.5 కోట్ల విరాళం సేకరించి ఇస్తానని తెలిపారు. ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి అడవులను కాపాడేందుకు ఎలాంటి సహాయం కావాల్సి వచ్చినా తాను అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు.

పిస్తాతో ఆ సమస్యకు కూడా చెక్‌.. పరిశోధనల్లో ఆసక్తికర విషయాలు..

పిస్తా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని తెలిసిందే. ధర ఎక్కువైనా లాభాలు కూడా అదే స్థాయిలో ఉంటాయని నిపుణులు చెబుతుంటారు. ప్రతీ రోజూ పిస్తా తినడం వల్ల జ్ఞాపకశక్తి మొదలు గుండె సంబంధిత సమస్యల వరకు అన్ని రకాల సమస్యలు దూరమవుతాయని అంటున్నారు.

క్యాన్సర్‌ను తరిమికొట్టడంలో కూడా పిస్తా ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులోని ఔషధ గుణాలు ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి.

అంతేకాకుండా పిస్తాలో విటమిన్‌ డి, క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను బలోపేతం చేస్తాయి. బోలు ఎముక వంటి ఎన్నో సమస్యలను దూరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే పిస్తాతో మరో లాభం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. తాజాగా నిర్వహించిన అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. పిస్తా పప్పును ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కంటి సంబంధిత సమస్యలన్నీ దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు.

అమెరికాలోని టఫ్ట్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనల్లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. పిస్తా పప్పుల్లో ల్యూటెన్‌ అనే పదార్థం ఉంటుందని ఇది కంటికి ఎంతగానో మేలు చేస్తుందని చెబుతున్నారు. మాక్యులర్‌ పిగ్‌మెంట్‌ ఆప్టికల్‌ డెన్సిటీ (ఎమ్‌పీఓడీ) అనేది కంటి ఆరోగ్యంలో చాలా కీలకం. వయసు పెరుగుతున్నకొద్దీ ఈ ఎమ్‌పీఓడీ తగ్గి, కళ్లు తీవ్రమైన కాంతిని తట్టుకోలేవు.

మరీ ముఖ్యంగా స్మార్ట్ ఫోన్‌ భారీగా పెరుగుతోన్న ప్రస్తుత తరుణంలో ఫోన్‌ నుంచి వచ్చే నీలి కిరణాలు కంటి సంబంధిత సమస్యలను ఎక్కువ చేస్తున్నాయి. ఈ సమస్యకు పరిష్కారం వెతికేందుకు గాను మధ్యవయస్కులని ఎంచుకున్నారు. వీరికి పన్నెండు వారాలపాటు తగు మోతాదులో పిస్తాలను అందించారు. ఆ తర్వాత పరీక్షించగా వారిలో.. ఎమ్‌పీఓడీ స్థాయిలు మెరుగైనట్టు తేలింది. దాంతోపాటే పిస్తాలోని మంచి కొవ్వులు మెదడు పనితీరుని చురుగ్గా ఉంచడమూ శాస్త్రవేత్తలు గమనించారు. కాబట్టి భవిష్యత్తులో కంటి సంబంధిత సమస్యల బారిన పడకుండడా ఉండాలంటే పిస్తాను తీసుకోవాలని చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

Health

సినిమా