Friday, November 15, 2024

మరికొన్ని గంటల్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. వైసీపీ వ్యూహం ఇదేనా

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు బడ్జెట్‌ను కేబినెట్ ఆమోదించనుంది.

ఆ తర్వాత 10గంటలకు అసెంబ్లీ ప్రారంభం అవుతుంది. 11 గంటలకు సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు మంత్రి పయ్యావుల కేశవ్. ఇక మండలిలో మంత్రి అచ్చెన్నాయుడు బడ్జెట్‌ ప్రవేశపెడతారు. బడ్జెట్ ప్రసంగం ముగిసిన తర్వాత.. స్పీకర్‌ అధ్యక్షతన మధ్యాహ్నం బీఏసీ సమావేశం జరుగుతుంది. సభ ఎన్ని రోజులు నిర్వహించాలి.. ఏయే అంశాలపై చర్చించాలనే అంశాలను బీఏసీలో నిర్ణయిస్తారు. అయితే పది రోజుల పాటు సభను నిర్వహించే యోచనలో ఉంది ప్రభుత్వం.

అప్పులు, ఆదాయ లెక్కలు ఎలా ఉండబోతున్నాయి?

సూపర్ సిక్స్‌తో పాటు పలు కీలక హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే ఈ బడ్జెట్‌లో అప్పులు, ఆదాయ లెక్కలు ఎలా ఉండబోతున్నాయి? సంక్షేమ పథకాలకు ప్రభుత్వం ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వబోతోంది? అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్ట్‌లకు ఎంత మేరకు నిధులు కేటాయించబోతుందనేది ఆసక్తిగా మారింది.

అసెంబ్లీకి హాజరుకాకూడదని వైసీపీ నిర్ణయం

మరోవైపు ఈ సమావేశాలకు వైసీపీ హాజరుకావడం లేదు. ప్రతిపక్ష హోదా ఇవ్వనప్పుడు, మాట్లాడే అవకాశం ఇవ్వనప్పుడు అసెంబ్లీకి ఎందుకు వెళ్లాలని ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ ప్రశ్నించారు. ప్రజల తరపున మీడియా ముందు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని అంటున్నారు మాజీ సీఎం జగన్. జగన్ వ్యాఖ్యలకు హోం మంత్రి అనిత కౌంటర్‌ ఇచ్చారు. బాధ్యత ఉంటే సభకు వస్తారన్నారు ఆమె. మైక్ ఇస్తేనే వస్తా.. ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తా అని ఎవరూ అనరన్నారు.

అయితే మండలి సమావేశాలకు మాత్రం వైసీపీ ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. మండలిలో ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణ ఉండడంతో పాటు అక్కడ సంఖ్యాపరంగా వైసీపీకి ఆధిక్యత ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

అసెంబ్లీ ముందుకు పలు కీలక బిల్లులు

ఇక వైసీపీ వచ్చినా.. రాకపోయినా సభా సమయాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. పలు కీలక బిల్లులను అసెంబ్లీ ముందుకు తెచ్చే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ అంశంతో పాటు అనేక అంశాలు.. కొత్తగా చేపట్టబోయే అభివృద్ధి ప్రాజెక్ట్‌లపై సభలో చర్చించే ఆలోచనలో ఉంది కూటమి సర్కార్. అదే సమయంలో కొత్త ఎక్సైజ్ పాలసీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇసుక పాలసీ సహా పలు పాలసీలు, బిల్లులపై అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది.

ఐటెల్‌ నుంచి అదిరిపోయే స్మార్ట్ ఫోన్స్‌.. ధర చాలా తక్కువ

తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లతో ఫోన్‌లు తీసుకొచ్చే వాటిలో ఐటెల్ ముందు వరుసలో ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా మార్కెట్లోకి ఐటెల్ రెండు కొత్త ఫోన్‌లను లాంచ్‌ చేసింది.

ఐటెల్‌ ఎస్25, ఐటెల్‌ ఎస్‌ 25 అల్ట్రా పేర్లతో ఈ రెండు ఫోన్‌లను మార్కెట్లోకి లాంచ్‌ చేశారు. ఇంతకి ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఐటెల్‌ ఎస్‌25, ఐటెల్ ఎస్‌25 అల్ట్రా రెండు ఫోన్‌లు కూడా ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇక ఈ ఫోన్‌లో 6.78 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ స్క్రీన్‌ను అందించారు. 120Hz రిఫ్రెష్ రేట్‌తో స్టాండర్డ్ మోడల్‌ను తీసుకొచ్చింది. అయితే అల్ట్రా వేరియంట్‌లో కూడా సేమ్‌ స్క్రీన్‌ను ఇచ్చారు. ఈ రెండు ఫోన్‌లలో గొరిల్లా గ్లాస్‌ 7ఐ ప్రొటెక్షన్‌తో తీసుకొచ్చారు. ఇక ఎస్‌25 అల్ట్రా యూనిసోక్‌ టీ620 చిప్‌సెట్‌ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. కెమెరా విషయానికొస్తే ఈ రెండు స్మార్ట్‌ ఫోన్‌లలోనూ 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్పీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు.

ఇక ఈ ఫోన్‌లో 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ఇక ఈ ఫోన్‌లో ఐటెల్ S25 డస్ట్, స్ప్లాష్ ప్రొటెక్షన్​తో IP54 రేటింగ్‌ను కలిగి ఉంది. అయితే ఐటెల్ S25 అల్ట్రా కొంచెం మెరుగైన IP64 రేటింగ్‌ను కలిగి ఉంది. సెక్యూరిటీ పరంగా ఈ రెండు ఫోన్‌లలో ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్ స్కానర్‌ను ఇచ్చారు. కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో 4జీ ఎల్‌టీఈ, వైఫై, బ్లూటూత్‌, జీపీఎస్‌, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్‌ సీ పోర్ట్‌ వంటి ఫీచర్లను అందించారు. ఈ ఫోన్‌లను స్మార్ట్​ఫోన్ బ్రోమో బ్లాక్, మంబో మింట్, సహారా గ్లామ్ కలర్స్‌లో తీసుకొచ్చారు.

ధర విషయానికొస్తే ఐటెల్ ఎస్‌25 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ వేరియంట్‌ ధర రూ. 8400 కాగా ఐటెల్‌ అల్ట్రా ధర రూ. 10,999గా నిర్ణయించారు. ఈ ఫోన్‌ ప్రీ ఆర్డర్స్‌ మొదలయ్యాయి. ఫిలిప్పీన్స్‌లోని కస్టమర్‌లు Shopee ద్వారా ఐటెల్ S25ని ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు. మరోవైపు ఐటెల్ S25 అల్ట్రా ప్రీ-ఆర్డర్స్ నేటి నుంచి ప్రారంభమయ్యాయి.

ఈ ఆకుల రసం రోజుకో స్పూను తాగితే చాలు..! శరీరంలో ఊహించలేని మార్పులు చూస్తారు..

బొప్పాయి పండు తినడం వల్ల ఎన్ని లాభాలో..బొప్పాయి ఆకులతో కూడా అంతే ప్రయోజనం అంటున్నారు నిపుణులు. బోప్పాయి ఆకుల నిండా ఔషధ గుణాలే ఉన్నాయంటున్నారు నిపుణులు.

అందుకే ఆయుర్వేద మందుల్లో దాన్ని వాడుతారు. ఈ బొప్పాయి ఆకుల రసాన్ని రోజుకో స్పూన్‌ చొప్పున తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారని చెబుతున్నారు. బొప్పాయి ఆకుతో కలిగే లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

బొప్పాయి ఆకులను జ్యూస్‌ చేసి తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బొప్పాయి జ్యూస్‌ తాగడం వల్ల జ్వరాలు రాకుండా రక్షిస్తుంది. బొప్పాయి ఆకుల రసంలో విటమిన్లు ఎ, ఇ, సి, కె, బి లు అధికంగా ఉంటాయి. ఈ జ్యూస్‌ తాగడం వల్ల జ్వరాలు రాకుండా రక్షిస్తుంది.

కొంత మందికి తినే ఆహారం సరిగ్గా అరగదు. దీంతో కడుపు ఉబ్బరంగా ఉంటుంది. ఈ సమస్యకు బొప్పాయి రసం ఓ టేబుల్ స్పూన్ తాగితే సరిపోతుంది. పొట్టలో గ్యాస్, అల్సర్, నొప్పి వంటివి మటుమాయం అవుతాయి. మహిళల్లో రుతుక్రమ సమస్యల్ని సరిచెయ్యడంలో బొప్పాయి ఆకుల రసం బాగా ఉపయోగపడుతుంది. శరీరంలో హార్మోన్లను ఇది క్రమబద్ధీకరిస్తుంది.

బొప్పాయి ఆకుల రసాన్ని తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. మలబద్దకం సమస్యలతో బాధపడుతున్నవారు ఈ బొప్పాయి ఆకు జ్యూస్‌ తీసుకోవడం వల్ల సమస్య తగ్గుతుంది. బొప్పాయి ఆకుల రసం తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

చుండ్రు, జుట్టు రాలిపోవడం, జుట్టులో దురద వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు బొప్పాయి ఆకుల రసాన్ని తలకు పట్టిస్తే ప్రయోజనం ఉంటుంది. జుట్టు తెల్లబడటం, సన్నగా అయిపోవడం వంటి సమస్యలకు కూడా ఇది బాగా పనిచేస్తుంది. జుట్టు మెరుస్తుంది కూడా… షాంపూ కండీషనర్‌లా ఇది పనిచేస్తుంది.

వన్‌ప్లస్‌ 12పై భారీ డిస్కౌంట్‌.. అమెజాన్‌లో అదిరిపోయే ఆఫర్‌

వన్‌ప్లస్‌ 12 స్మార్ట్‌ ఫోన్‌పై మంచి ఆఫర్‌ అందిస్తున్నారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ అసలు ధర రూ. 64,999కాగా అమెజాన్‌లో ఏకంగా రూ. 5,500 వరకు డిస్కౌంట్‌ లభిస్తోంది.

అంటే ఈ పోన్‌ను రూ. 59,500కి సొంతం చేసుకోవచ్చు.

ఆఫర్లు ఇక్కడితోనే ఆగిపోలేదు. మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్‌ చేసుకోవడం ద్వారా కూడా భారీగా డిస్కౌంట్‌ పొందే అవకాశం కల్పించారు. ఈ పాత ఫోన్‌ కండిషన్‌ ఆధారంగా ఈ డిస్కౌంట్‌ ఆధారపడి ఉంటుంది.

ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్‌ను అందించారు. అలాగే ఇందులో 6.1 ఇంచెస్‌తో కూడిన ProXDR డిస్‌ప్లేను అందించారు. 120 Hz రిఫ్రెష్ రేట్‌కు ఈ స్క్రీన్‌ సపోర్ట్‌ చేస్తుంది.

ఇందులో యాప్ లాక్, హైడ్ యాప్‌ల వంటి ఉపయోగకరమైన ఫీచర్లను ఇన్‌బిల్ట్‌గా అందించారు. నాలుగేళ్ల పాటు కొత్త ఆండ్రాయిడ్ వెర్షన్‌లను, 5 సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందిస్తుంది.

ఇక బ్యాటరీ విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 80 వాట్స్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సోపర్ట్‌ చేసే 5400 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. వేగంగా ఛార్జింగ్ కావడం ఈ ఫోన్‌ ప్రత్యేకతగా చెప్పొచ్చు.

భారత మార్కెట్లోకి వస్తోన్న ఐక్యూ 13.. లాంచింగ్

చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం ఐక్యూ 13 ఫోన్‌ను భారత మార్కెట్లోకి కూడా లాంచ్‌ చేసేందుకు సిద్ధమవుతోంది. డిసెంబర్‌లో భారత మార్కెట్లోకి ఈ ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది.

ఐక్యూ ఇండియా ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఎక్స్‌ వేదికగా ప్రకటించారు. అయితే డిసెంబర్‌లో కరెక్ట్‌గా ఏ తేదీన తీసుకొస్తున్నారన్నదానిపై మాత్రం ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఈ ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 ఎలైట్‌ చిప్‌సెప్‌ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

ఇక ఈ ఫోన్‌లో క్యూ2 సూపర్‌ గేమింగ్ చిప్‌ను అందించారు. ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 2కే రిజల్యూషన్‌, 144 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌ స్క్రీన్‌ను అందించారు. చైనాలో ఈ ఫోన్ వైట్, గ్రీన్, బ్లాక్, గ్రే కలర్స్‌లో తీసుకొచ్చారు.

అయితే భారత్‌లో ఈ ఫోన్‌ను వైట్ లెజెండ్ ఎడిషన్, గ్రే షేడ్స్‌లో తీసుకొచ్చే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ ఫోన్‌లో 6.82 ఇంచెస్‌తో కూడిన స్క్రీన్‌ను ఇవ్వనున్నారు. 4500 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ఈ స్క్రీన్‌ సొంతం.

ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 50 ఎంపీతో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. సెక్యూరిటీ కోసం ఇందులో అల్ట్రాసోనిక్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను అందించారు.

ఎస్‌బీఐకు లాభాల పంట.. రెండో త్రైమాసికంలో లాభం ఎన్ని కోట్లంటే

స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా మూడు నెలల కాలంలో అంచనాలకు మించిన లాభాల పెరుగుదలను చవి చూసింది. ముఖ్యంగా నికర లాభం 28 శాతం పెరిగింది. దేశంలోని ప్రజల ఆదరాభిమానాలు పొందిన బ్యాంకులలో స్టేట్ బ్యాంకు (ఎస్ బీఐ) ఒక్కటి.

పల్లెల నుంచి పట్టణాల వరకూ దీనికి బ్రాంచ్ లున్నాయి. అలాగే సామాన్య ప్రజలకు సైతం ఈ బ్యాంకు బాగా దగ్గరైంది. కాగా. ఎస్ బీఐ 2024-25 ఆర్ఠిక సంవత్సరంలోని రెండో త్రైమాసికానికి (జూలై – సెప్టెంబర్) సంబంధించిన ఫలితాలను వెల్లడించింది. వాటి ప్రకారం లాభాలలో గణనీయమైన పురోగతి కనిపించింది. అంచనాలకు మించి ఆదాయాన్ని సంపాదించింది. స్టాండలోన్ ప్రతిపదికను నికర లాభం 27.92 శాతం పెరిగి, రూ.18,331 కోట్లకు చేరింది.

గతేడాది ఇదే సమయంలో ఈ ఆదాయం రూ.14,331 కోట్లు మాత్రమే ఉంది. సెప్టెంబర్ లో ముగిసిన త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయమే రూ.41,620 కోట్లుగా నమోదైంది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఈ సమయానికి రూ.39,500 కోట్ల మాత్రమే నమోదైంది. ఈ నేపథ్యంలో 5.37 శాతం ఆదాయం పెరిగింది.స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు సంబంధించి ఆపరేటింగ్ ప్రాఫిట్ జూలై – సెప్టెంబర్ లో 29.294 కోట్లకు చేరింది. గతంతో పోల్చితే 51 శాతం పెరిగింది. అంతకు ముందు ఈ మొత్తం 19,417గా ఉండేది. అయితే బ్యాంకు డిపాజిట్లు మాత్రం ఇదే సమయంతో పోల్చితే 9 శాతం తగ్గగా, వీటి విలువ రూ.51.17 లక్షల కోట్లుగా నమోదైంది.

బ్యాంకు కు చెందిన అనుబంధ సంస్థలకు సంబంధించి జీవిత బీమా విభాగ నికర లాభం ప్రథమార్థంలో రూ.1049 కోట్లు, క్రెడిట్ కార్డు విభాగంలో రూ.999 కోట్లు, ఫండ్ నిర్వహణ విభాగంలోరూ.1374 కోట్లు, సాధారణ బీమాకు సంబంధించి రూ.414 లాభాలు వచ్చాయి. గతేడాది ఇదే సమయానికి వీటి లాభాలు రూ761 కోట్లు, రూ.1196 కోట్లు, 940 కోట్లు, 60 కోట్లు మాత్రేమే ఉన్నాయి. బ్యాంకు చైర్మన్ సి.శ్రీనివాసులు శెట్టి మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రుణవృద్ధి లక్ష్యాన్ని 14 నుంచి 16శాతం కొనసాగిస్తున్నామన్నారు. డిపాజిట్ల వృద్ధి లక్ష్యాన్ని మాత్రం 10 శాతానికి తగ్గించినట్టు వివరించారు. పండగల సమయంలో రిటైల్ రుణాలు పెరుగుతాయన్నారు. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.లక్ష కోట్ల లాభాన్ని సాధించాలని బ్యాంకు భావిస్తోందన్నారు.

మూతపడుతున్న ఏటీఎంలు.. కారణం ఏంటో తెలుసా

డబ్బు విత్‌డ్రా చేసేందుకు ఉపయోగించే ఏటీఎం మిషన్ల సంఖ్య తగ్గుతోంది. దీనికి ప్రధాన కారణం ఆన్‌లైన్ లావాదేవీలే. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేసి ఆన్‌లైన్‌లో లావాదేవీలు జరుపుతున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఏటీఎం ఉండడం బ్యాంకులకు నష్టదాయకంగా మారుతోంది. భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని ATMలు ఇన్‌స్టాల్ చేశారు? ఇప్పటి వరకు ఎన్ని ఏటీఎంల సంఖ్య తగ్గిందో తెలుసుకుందాం.

ఎన్ని ఏటీఎంలు తగ్గాయి?

సెప్టెంబర్ 2024ని సెప్టెంబర్ 2023తో పోల్చినట్లయితే, ATMల సంఖ్య తగ్గింది. ఆర్బీఐ నివేదిక ప్రకారం, సెప్టెంబర్ 2023లో మొత్తం ఏటీఎంల సంఖ్య 2,19,281, సెప్టెంబర్ 2024 నాటికి 2,15,767కి తగ్గింది. అంటే 1.6% ఏటీఎంలు తగ్గాయి. ఇందుకు కారణం లేకపోలేదు. ప్రస్తుతం డిజిటల్‌ టెక్నాలజీతో ప్రతి ఒక్కరు ఆన్‌లైన్‌ లావాదేవీలకు అలవాటు పడిపోయారు. యూపీఐ చెల్లింపులు కూడా భారీగా పెరుగుతున్నాయి. దీంతో ఏటీఎంలకు వెళ్లి డబ్బులు విత్‌డ్రా చేసేవారి సంఖ్య భారీగా తగ్గింది. అంతేకాదు దీని వల్ల బ్యాంకులకు ఏటీఎంల నిర్వహణ ఖర్చు పెరిగిపోతోంది. దీంతో ఏటీఎంల సంఖ్య తగ్గిస్తున్నాయి బ్యాంకులు. కానీ 2023కి ముందు ఏటీఎంల సంఖ్య స్వల్పంగా పెరిగి, ఆ తర్వాత ఇప్పుడు తగ్గుముఖం పట్టింది.

బ్యాంకు ప్రకారం.. రెండు రకాల ఏటీఎంలు ఉన్నాయి. ఆన్-సైట్‌లోఒకటి. అంటే బ్యాంక్ బ్రాంచ్ ఉన్న ప్రతిచోటా ఏటీఎం ఉంటుంది. రెండవది, ఆఫ్-సైట్ ఏటీఎం ఇవి మాల్స్ లేదా బ్యాంకులు కాకుండా మరెక్కడైనా ఏర్పాటు చేసిన ఏటీఎంలు. గత నాలుగేళ్లుగా ఆఫ్‌సైట్ ఏటీఎంల సంఖ్య తగ్గుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. సెప్టెంబర్ 2021 నాటికి ఆఫ్-సైట్ ఏటీఎంల సంఖ్య 97,383. అదే ఆఫ్-సైట్ ఏటీఎంలు సెప్టెంబర్ 2022లో 97,072కి పెరిగాయి. సెప్టెంబర్ 2020 నాటికి ఆఫ్-సైట్ ఏటీఎంల సంఖ్య 93,751. సెప్టెంబర్ 2024 నాటికి కేవలం 87,838 ఆఫ్-సైట్ ఏటీఎంలు మాత్రమే ఉన్నాయి. అంటే 2021లో కంటే 2024లో ఆఫ్‌సైట్ ATMల సంఖ్య 10% వరకు తగ్గాయి.

ఏటీఎంని ఇన్‌స్టాల్ చేయడానికి స్థలాన్ని తీసుకోవడానికి, భద్రతను నిర్వహించడానికి, దానిని నిరంతరం నోట్లను చేయడానికి బ్యాంక్ చాలా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడి నుంచి ఏటీఎం కథ ముందుకు సాగుతుందా లేక తగ్గుముఖం పడుతుందా అనేది చూడాలి. మరోవైపు ఆన్‌లైన్ చెల్లింపుల ట్రెండ్ వేగంగా పెరుగుతోంది.

ఆన్‌లైన్ లావాదేవీలు ఎంత పెరిగాయి?

ఏటీఎంలో ఎంత మంది డబ్బు విత్‌డ్రా చేసారు? ఎంత మంది ఆన్‌లైన్‌లో చెల్లించారు? యూపీఐని ప్రవేశపెట్టిన తర్వాత ఆన్‌లైన్ చెల్లింపుల్లో విపరీతమైన వృద్ధి నమోదైందని ఆర్‌బీఐ గణాంకాలు చెబుతున్నాయి.

2019-20లో 3,40,026 లక్షల కోట్ల ఆన్‌లైన్ లావాదేవీలు జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇది 2020-21లో 4,37,445 లక్షల కోట్ల లావాదేవీలకు పెరిగింది. 2021-22లో 7,19,531 లక్షల కోట్ల లావాదేవీలు పెరిగాయి. అలాగే ఈ లావాదేవీ 2022-23లో రూ.11,39,476 లక్షల కోట్లు అవుతుంది. 2023-24లో లావాదేవీలు రూ.16,44,302 లక్షల కోట్లకు పెరిగాయని, ఇందులో 13,11,295 లక్షల కోట్ల లావాదేవీలు, యూపీఐ ద్వారానే జరిగాయని తెలుస్తోంది. జూలై 2024 నాటికి, UPI ద్వారానే రూ. 20 లక్షల కోట్ల లావాదేవీలు జరిగినట్లు ఆర్బీఐ నివేదికలు చెబుతున్నాయి.

హైదరాబాద్‌లో అమెరికా అధ్యక్షుని టవర్స్.. ట్రంప్ ప్లాట్ చాలా కాస్ట్లీ గురూ

హైదరాబాద్‌లో అమెరికా అధ్యక్షుని టవర్స్ రానున్నాయి. డోనాల్డ్ ట్రంప్ టవర్స్ హైదరాబాద్ లో ఏంటి అనుకుంటున్నారా..? ఎస్ నిజమే ట్రంప్ టవర్స్ ఇప్పుడు హైదరాబాద్ లో కూడా నిర్మించబోతున్నారు.

మాదాపూర్‌లో ఖానామెట్‌లో ట్రంప్ ట్విన్ టవర్ల నిర్మాణం భారీ స్థలంలో చేయడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి.

హైదరాబాద్‌ లో టవర్స్‌ నిర్మాణానికి 2022లోనే ఈ ప్రాజెక్ట్‌ కోసం భూమి కొనుగోలు చేశారు. భారత్‌లో ఇప్పటికే పలు నగరాల్లో నిర్మించిన ట్రంప్‌ కంపెనీ, ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా ట్రంప్ టవర్ల నిర్మాణానికి అడుగులు వేస్తోంది. ముంబై, కోల్‌కతా, గుర్గావ్‌, పుణెల్లో ఇప్పటికే ట్రంప్ టవర్లు ఉన్నాయి. తాజాగా మరో ఆరు ప్రాంతాల్లో టవర్ల నిర్మాణం చేయాలని ఈ సంస్థ నిర్ణయించింది, ఇందులో హైదరాబాద్, నోయిడా, బెంగళూరు, పుణే కూడా ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే, భారత్‌లోని ట్రంప్ టవర్ల సంఖ్య 10కి చేరుకోనుంది, ఇది అమెరికా వెలుపల అత్యధికంగా ఉన్న ట్రంప్ టవర్ల సంఖ్య కానుంది.

జాయింట్ వెంచర్‌లో ట్రంప్ టవర్స్

హైదరాబాద్‌లో స్థానిక మంజీరా గ్రూప్‌తో కలిసి ఈ సంస్థ జంట టవర్ల నిర్మాణాన్ని చేపట్టనుంది. 2022లో మాదాపూర్‌లోని ఖానామెట్ ప్రాంతంలో 2.92 ఎకరాల స్థలాన్ని హెచ్ఎండీఏ వేలంలో కొనుగోలు చేశారు. ఈ టవర్లు 27 అంతస్తులతో 4 – 5 బెడ్‌రూం ల అపార్టుమెంట్లుగా నిర్మించనున్నారు. 4 బెడ్‌రూం అపార్టుమెంట్ల విస్తీర్ణం 4,000 నుండి 5,000 చదరపు అడుగులు ఉండగా, 5 బెడ్‌రూం అపార్టుమెంట్ల విస్తీర్ణం 6,000 చదరపు అడుగులు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్ లో కొన్ని అపార్ట్‌మెంట్స్ మాత్రమే ఇంత పెద్ద విస్తిర్ణంలో జరిగింది. ఇప్పుడు ట్రంప్ టవర్స్‌లో ఇంత పెద్ద విస్తిర్ణం రావడం హైదరాబాద్ మార్కేట్ లో కొత్త అనే చెప్పాలి..!

ట్రంప్ టవర్స్ లో ప్లాట్ చాలా కాస్ట్లీ..!

ఇక అంతర్జాతీయ సంస్థ కావడం ఆ పేరే ఓ బ్రాండ్ కావడంతో ప్రైస్ కూడ అలానే ఉండబోతుంది. చదరపు అడుగుకు రూ.13 వేల ధరను నిర్ణయించనున్నారు. దీనితో 4 బెడ్‌రూం అపార్టుమెంట్‌ ధర సుమారు రూ.5.5 కోట్లు అవుతుంది. అలాగే, ఇతర నగరాల్లో ట్రిబెకా డెవలపర్స్‌తో కలిసి నిర్మించబోయే టవర్లలో అపార్టుమెంట్లతో పాటు కార్యాలయాలు, విల్లాలు, గోల్ఫ్‌ కోర్స్‌లు వంటి ప్రత్యేక వసతులు కూడా ఉండనున్నాయి.

వాట్సాప్‌లో డేటా మిస్ కాకుండా వేరే నంబర్‌కు బదిలీ చేయడం ఎలా

చాలా మందికి తరచూ తమ మొబైల్ నంబర్ మార్చుకునే అలవాటు ఉంటుంది. ఈ విధంగా వాట్సాప్ నంబర్‌ను మార్చే సమయంలో అందులో ఉన్న ముఖ్యమైన సమాచారం డిలీట్‌ అయ్యే అవకాశం ఉంటుంది.

ముఖ్యంగా సర్టిఫికేట్స్‌, ఆడియోలు, వీడియోలు, ఫోటోలు వంటి ముఖ్యమైన సమాచారం వాట్సాప్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ సందర్భంలో డేటాను కోల్పోకుండా ఉండాలంటే కొన్ని మార్గాలు ఉన్నాయి.

ముందుగా మీ ప్రస్తుత స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. సెట్టింగ్‌ విభాగానికి వెళ్లండి. అక్కడ, ‘అకౌంట్‌’పై క్లిక్ చేసి, ‘నంబర్ మార్చు’పై క్లిక్ చేయండి. అప్పుడు స్క్రీన్‌పై కనిపించే సమాచారాన్ని జాగ్రత్తగా గమనించాలి.

తర్వాత ‘Next’పై క్లిక్ చేసి మీ పాత, కొత్త మొబైల్ నంబర్లను నమోదు చేయండి. మొబైల్ నంబర్లు సరిగ్గా ఉన్నాయో లేదో తనిఖీ చేసుకోవడం చాలా ముఖ్యం.

మొత్తం సమాచారాన్ని తనిఖీ చేసి, ‘Done’పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీ డేటా మొత్తం కొత్త నంబర్‌కి బదిలీ అవుతుంది.

ఆపిల్ ఉత్పత్తులకు కీలకంగా భారత్

ఆపిల్ ఉత్పత్తుల అభివృద్ధి లో మన దేశం కూడా త్వరలో ప్రధాన పాత్ర పోషించనుంది. పరిశోధన, డిజైన్, టెస్టింగ్ తో సహా ఆపిల్ కు చెందిన కొత్త ఉత్పత్తుల అభివద్ధిలో కీలకంగా మారునుంది.

ఈ కంపెనీ ఆపిల్ ఆపరేషన్స్ ఇండియా పేరుతో అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్ వోసీ)కి గత వారం ఆపిల్ ఐఎన్ సీ ఒక ఫైల్ దాఖలు చేసింది. ఆపరేషనల్, ఫైనాన్సియల్ సపోర్టు అందజేస్తుందని హామీ ఇస్తూ కంఫర్ట్ లెటర్ అందజేసింది. ఎంటీటీ, ఇతర అంశాలతో పాటు ఇంజినీరింగ్ పరికరాలు, లీజు సౌకర్యాలు, హార్డ్‌వేర్ డెవలప్‌మెంట్ కోసం ఇంజినీర్లను నియమించుకోవడానికి, ఆపిల్ గ్రూప్ కంపెనీలకు వైఫల్య విశ్లేషణ సేవలను ఇక్కడి నుంచే అందించాలని యోచిస్తోంది.

ఆపిల్ కంపెనీ ప్రస్తుతం తన పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలను అమెరికా, చైనా, జర్మనీ, ఇజ్రాయెల్‌ దేశాలలో నిర్వహిస్తోంది. ఒక వేళ మన దేశంలో హార్డ్‌వేర్ డిజైన్, టెస్టింగ్‌ చేపడితే ఇదే ప్రథమం అవుతుంది. మనదేశంలో ప్రస్తుతం సామ్సంగ్, ఎల్జీ, సోనీ తదితర ఎలక్ట్రానిక్స్ బ్రాండ్లు పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్ డీ) కార్యకలాపాలను కలిగి ఉన్నాయి. ఒప్పో,వీవో తదిరత చైనీస్ ఫోన్ల తయారు దారులు కూడా ఈ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. అమెరికా, చైనాల మధ్య కొనసాగుతున్న ఆర్థిక వైరుధ్యం వల్ల కూడా ఆపిల్ మన దేశంలో కొత్త సంస్థను ఏర్పాటు చేయడానికి కారణమని తెలుస్తోంది. దీనితో దేశంలోని సాంకేతిక నైపుణ్యాలను సద్వినియోగం చేసుకునే వీలు కలుగుతోంది.

భారత దేశంలో ఆపిల్ ఉత్పత్తుల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఆ కంపెనీ ప్రస్తుతం రెండు స్టోర్లను నిర్వహిస్తోంది. వీటికి అదనంగా మరో తెరవాలని భావిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ లో మ్యాప్ ల అభివద్ధి చేపట్టింది. ఆపిల్ ఉత్పత్తులకు సంబంధించి మన దేశం దాదాపు 14 శాతం సహకారం అందజేస్తోంది. ఆ సంస్థ 2017 లో విస్ట్రోన్ ద్వారా మన దేశంలో ఐఫోన్ అను అసెబ్లింగ్ చేయడం ప్రారంభించింది. కోవిడ్ తర్వాత ఉత్పత్తిని మరింత వేగవంతం చేసింది.

Ola S1xపై క్రేజీ ఆఫర్.. రూ. 59 వేలకే.. 190KM రేంజ్

పెట్రోల్ ఖర్చులకు భయపడుతున్న వారు ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరిగిపోయింది. వరల్డ్ వైడ్ గా ఈవీలను యూజ్ చేసే వారి సంఖ్య ఎక్కువైంది. భవిష్యత్ అంతా ఈవీలదే అనడంలో సందేహం లేదు. ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్ లు, కార్లు రోడ్లపై దూసుకెళ్తున్నాయి. ఆటో మొబైల్ రంగంలో ఈవీలు సంచలనం సృష్టిస్తున్నాయి. డ్రైవ్ చేసేందుకు ఈజీగా ఉండడం, ప్రయాణ ఖర్చులు కూడా తగ్గుతుండడంతో ఈవీల సేల్ పెరుగుతున్నది. ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీలు లేటెస్ట్ టెక్నాలజీతో ఈవీలను రూపొందించి మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నాయి. అడ్వాన్స్డ్ ఫీచర్లతో ఎలక్ట్రిక్ వెహికల్స్ వాహనదారులను ఆకర్షిస్తున్నాయి.

సింగిల్ ఛార్జ్ తో వందల కిలోమీటర్లు ప్రయాణించే వీలుండడంతో ఈవీలకు డిమాండ్ పెరిగింది. మరి మీరు కూడా ఈమధ్యకాలంలో కొత్త ఈవీ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి. ప్రముఖ ఈవీ కంపెనీ ఓలా కస్టమర్లకు బంపరాఫర్ ప్రకటించింది. బాస్ ఆఫ్ ఆల్ సేవింగ్స్ పేరుతో ఆఫర్ ను తీసుకొచ్చింది. కస్టమర్లను ఆకర్షించేందుకు సేల్స్ పెంచుకునేందుకు తక్కువ ధరకే ఈవీని అందిస్తోంది. కంపెనీల మధ్య నెలకొన్న పోటీతో ఓలా కంపెనీ ఈవీల ధరలను తగ్గిస్తోంది. ఆఫర్లో భాగంగా ఓలాకు చెందిన S1x ఈవీని కేవలం 59 వేల 999కే అందిస్తోంది. S1x అసలు ధర రూ. 75 వేలుగా ఉంది. ఆఫర్లో భాగంగా S1xపై 15 వేలు తగ్గించినట్లు సంస్థ వెల్లడించింది.

ఓలా కేవలం S1 x సిరీస్ వెహికల్ మీదే కాకుండా మరో రెండింటిపై కూడా డిస్కౌంట్ ప్రకటించింది. s1 proపై రూ.15,000, అలాగే S1 air స్కూటర్‌పై రూ.7,000 వరకు తగ్గింపు అందిస్తోంది. S1x సింగిల్ ఛార్జ్ తోనే 190 కి. మీలు ప్రయాణించొచ్చని కంపెనీ తెలిపింది. ఎస్‌1 ఎక్స్‌ 4kWh ఈవీ కేవలం 3.3 సెకన్లలోనే 0-40 కిలోమీటర్ల వేగాన్ని పుంజుకుంటుందని కంపెనీ వెల్లడించింది. ఎస్‌1 ఎక్స్‌ 4kWh రెడ్‌ వెలాసిటీ, మిడ్‌నైట్‌, వోగ్‌, స్టీలర్‌, ఫంక్‌, పోర్స్‌లెయిన్‌ వైట్‌, లిక్విడ్‌ సిల్వర్‌ రంగుల్లో లభిస్తుంది. ఎస్1 ఎక్స్ టచ్​స్క్రీన్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​కి బదులుగా 3.5 ఇంచ్​ ఎల్​సీడీ స్క్రీన్​ని కలిగి ఉంటుంది. ఫిజికల్ కీతో వస్తుంది. ఓలా ఈవీ కొనాలనుకునే వారు సమీప షోరూంలో సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. బెస్ట్ ఈవీ కావాలనుకునే వారు ఓలా ఆఫర్ ను మిస్ చేసుకోకండి.

బ్యాంక్ కి వెళ్ళే పనిలే.. ఇలా Phone Peలో ఈజీగా లోన్ తీసుకోవచ్చు.

మనకి ఏదైనా లోన్ కావాలంటే కచ్చితంగా బ్యాంకులకి వెళతాము. కానీ ఆ అవసరం లేకుండా ఈజీగా లోన్ పొందే మార్గం ఒకటి ఉంది. అది కూడా మన చేతిలోనే ఉంది. అదే ఫోన్ పే. మనం చాలా కాలంగా PhonePe వాడుతున్నాము. కానీ మనలో చాలా మందికి కూడా ఫోన్ పే లోన్ ఆఫర్ చేస్తుందనే విషయం తెలీదు. అందువల్ల ఈ ఫీచర్ ని సరిగ్గా వినియోగించుకోలేక పోతున్నారు. మీరు ఎలాంటి బ్యాంక్స్ ,ఫైనాన్స్ కంపెనీలకు వెళ్ళకుండా ఫోన్ పే లో పర్సనల్ లోన్ తీసుకోవచ్చు. లోన్ అంటే ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 5 లక్షల వరకు మీరు పర్సనల్ లోన్ తీసుకోవచ్చు. చాలా స్పీడ్ గా మీరు లోన్ పొందవచ్చు. కేవలం 5 నిమిషాల్లోనే లోన్ పొందవచ్చు. ఇంకో మంచి విషయం ఏమిటంటే.. ఇందులో ఈజీగా EMI కట్టుకునే ఆప్షన్ కూడా ఉంది. ఇక ఫోన్ పే లో ఎలా లోన్ తీసుకోవాలి? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ముందుగా మీ స్మార్ట్ ఫోన్ లో ఫోన్ పే యాప్‌ని ఓపెన్ చేయండి. మీరు ఫోన్‌పే యాప్ ఓపెన్ చేయగానే పైన మీకు కొన్ని స్లైడ్స్ కనిపిస్తాయి. అందులో మీకు “loans” అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాంట్లోకి వెళ్లి, ప్రిఫర్ Personal Loan ఆప్షన్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోని క్లిక్ చేయండి. మీకు ఎంత లోన్ కావాలో అంత లోన్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తరువాత మీకు అనుకూలంగా మీకు సరిపోయే EMI ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. లోన్ తీసుకునేటప్పుడు కచ్చితంగా రూల్స్ , కండిషన్స్ గురించి కచ్చితంగా తెలుసుకోండి. వాటిని పూర్తిగా చదివిన తరువాత మాత్రమే లోన్ తీసుకోండి. అందులో అడిగిన వివరాలను కచ్చితంగా ఇవ్వండి. అలాగే ఏవైనా అవసరమైన డాక్యుమెంట్స్ ని కూడా ప్రూఫ్ గా ఇవ్వండి. అవి వెరిఫై అయ్యాక మీకు లోన్ మీ బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది.ఈ ఫీచర్ PhonePe వినియోగదారులకు చాలా ఉపయోగ పడుతుందనే చెప్పాలి. దీని వల్ల మనకు అవసరం అయినప్పుడు బ్యాంకుకి వెళ్ళే అవసరం లేకుండా చాలా ఈజీగా లోన్ పొందవచ్చు.

ఈ ఇన్స్టంట్ లోన్ ఆప్షన్ ద్వారా మనం 25 వేల నుంచి 5 లక్షల దాకా లోన్ పొందవచ్చు. దీని కోసం ఫోన్‌పే ప్రిఫర్ అనే సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ప్రిఫర్ అనే సంస్థ హీరో ఫిన్ కార్ప్ సహా పలు ఇతర లెండింగ్ సంస్థలతో టై అప్ అయ్యింది. వీటి ద్వారా కస్టమర్లకు లోన్లు అందిస్తోంది. ఇలా ఫోన్ పేలో మీకు లోన్ ప్రాసెస్ ఉంటుంది. ఇందులో మీరు లోన్ తీసుకున్నాక 6 నెలల నుంచి 48 నెలల దాకా టెన్యూర్ పెట్టుకోవచ్చు. ఇక వడ్డీ రేటు విషయానికి వస్తే 18 శాతం నుంచి 36 శాతం వరకు పడుతుంది.

ఏపీలో రెండో దశ నామినేటెడ్ పదవుల భర్తీకి రంగం సిద్ధం

రెండో దశ నామినేటెడ్ పదవుల భర్తీపై సీఎం చంద్రబాబు కసరత్తు చివరి దశకు చేరుకుంది. రెండు రోజులుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, కూటమి నేతలతో విస్తృత చర్చలు జరుపుతున్నారు.

రెండు రోజుల క్రితం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తోనూ సమావేశమైన చంద్రబాబు.. నామినేటెడ్ పదవులపై చర్చించారు. అలాగే.. బీజేపీ కూడా తమ నేతల పేర్లతో జాబితా అందజేసింది. దాంతో.. అసెంబ్లీ సమావేశాల కంటే ముందే రెండో విడత నామినేటెడ్ పదవుల లిస్ట్ రిలీజ్‌ చేసే యోచనలో ఉన్నారు సీఎం చంద్రబాబు. ఇక.. కూటమి నేపథ్యంలో నామినేటెడ్ పోస్టులకు సంబంధించి చంద్రబాబుపై సహజంగానే ఒత్తిడి ఉంటుంది. అయితే.. పార్టీ కోసం, ఎన్నికల్లో కూటమి విజయం కోసం పని చేసిన అనేక మంది నేతలు నామినేటెడ్ పదవులు ఆశిస్తున్నారు. కానీ.. నామినేటెడ్ పోస్టులను మూడు పార్టీలకు ఇవ్వాల్సి ఉండడంతో ప్రాధాన్యత క్రమంలో ఎవరికి ఏ పోస్టు ఇవ్వాలనేదానిపై సీఎం చంద్రబాబు.. మిగతా రెండు పార్టీలతోనూ కూలంకషంగా చర్చలు చేశారు. దాంతో.. రెండో విడత నామినేటెడ్‌ పోస్టుల జాబితా దాదాపు ఫైనల్‌ అయినట్లు కూటమి పార్టీల్లో ప్రచారం జరుగుతోంది. రెండో విడతలో జనసేనకు ఎన్ని ఇవ్వాలి?.. బీజేపీకి ఎన్ని ఇవ్వాలి?.. టీడీపీకి ఎన్ని కేటాయించాలి?.. అనే దానిపై ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది.

నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న నేతలు

ఇక.. రెండో విడత నామినేటెడ్‌ పదవులకు సంబంధించి కొన్ని ముఖ్యమైన పోస్టులు ఉన్నాయి. దానికి సంబంధించి టీడీపీ నేతల నుంచి చంద్రబాబుపై ప్రెజర్‌ ఉంది. గతంలో పార్టీ కోసం అనేకమైన కేసులు ఎదుర్కొని పని చేసిన వారంతా నామినేటెడ్ పోస్టుల ద్వారా తమకు న్యాయం చేయాలని అధినేతకు విజ్ఞప్తి చేశారు. అలాగే.. పార్టీలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతల నుంచి కూడా ఒత్తిళ్లు ఉన్నాయి. తమ వర్గానికి చెందిన వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. దాంతో.. ఆ కోణంలోనూ కసరత్తు చేసినట్లు టీడీపీ వర్గాల్లో టాక్‌ నడుస్తోంది. దాదాపు లిస్ట్‌ ఫైనలేజ్‌ అవుతుండడంతో.. ఎవరికి ఏ పదవి ఇస్తే బాగుంటుందనేదానిపైనా ముఖ్యనేతలతో సీఎం చంద్రబాబు చర్చించారు. అయితే.. ఈ సారి కూటమి పక్షాలకే ప్రాధాన్యత అని ముందే ప్రకటించిన నేపథ్యంలో ముందుగా జనసేనకు.. ఆ తర్వాత బీజేపీకి చాన్స్‌ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేసమయంలో.. ముఖ్యమైన పోస్టులను ఆయా ప్రాంతాలను బట్టి, ప్రభావితం చేసే నేతలను దృష్టిలో పెట్టుకుని కేటాయించే చాన్స్‌ ఉంది. మొత్తంగా.. రెండో దశ నామినేటెడ్‌ పదవుల భర్తీపై సీఎం చంద్రబాబు క్లారిటీకి వచ్చిన నేపథ్యంలో ఇవాళ, రేపట్లో ఎప్పుడైనా.. ఏ క్షణమైనా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎల్లుండి నుంచి అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభం కానుండడంతో సెకండ్‌ ఫేజ్‌ నామినేటెడ్ లిస్ట్‌ రిలీజ్‌పై ఆసక్తి నెలకొంది. రెండో దశలో కూటమి పార్టీల్లో ఎవరెవరికి చాన్స్‌ దక్కుతుందో?.. ఎవరిని నామినేటెడ్‌ పదవులు వరిస్తాయో చూడాలి.

ప్రైవేట్‌ టెలికాం కంపెనీలకు దడ పుట్టిస్తున్న బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి 4 ప్లాన్స్‌

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL గత కొన్ని నెలలుగా దూకుడుగా ప్రవర్తిస్తోంది. జూలై నుంచి లక్షలాది మంది కొత్త కస్టమర్లు కంపెనీలో చేరారు. ఇప్పుడు బీఎస్ఎన్‌ఎల్‌ వినియోగదారులను నిలుపుకోవడానికి తన నెట్‌వర్క్‌ను మరింతగా పెంచుకునేందుకు నిరంతరం బిజీగా ఉంది.

దీనితో పాటు, ఖరీదైన రీఛార్జ్ ప్లాన్‌ల నుండి ఉపశమనం కలిగించడానికి బీఎస్‌ఎన్‌ఎల్‌ కూడా చౌకైన, సరసమైన ప్లాన్‌లను జాబితాకు జోడిస్తోంది.

బీఎస్ఎన్‌ఎల్‌ జాబితాలో ఇలాంటి అనేక రీఛార్జ్ ప్లాన్‌లు ఉన్నాయి. ఇది కాకుండా మీరు కంపెనీ చౌక ప్లాన్ కారణంగా మీ డబ్బును కూడా ఆదా చేసుకోవచ్చు. బీఎస్‌ఎన్‌ఎల్‌ జాబితాలో అందుబాటులో ఉన్న కొన్ని ఉత్తమ దీర్ఘకాలిక, చౌకైన ప్లాన్‌ల గురించి తెలుసుకుందాం.

బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ. 2399 రీఛార్జ్ ప్లాన్: ఈ రీఛార్జ్ ప్లాన్‌లో తన కోట్లాది మంది కస్టమర్‌లకు ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలపరిమితిని అందిస్తుంది. ప్రభుత్వ సంస్థ ఈ రీఛార్జ్ ప్లాన్ ఒకేసారి 400 రోజుల పాటు రీఛార్జ్ ఇబ్బందుల నుంచి విముక్తి చేస్తుంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ. 2399 ప్రీపెయిడ్ ప్లాన్ వినియోగదారులకు 395 రోజుల చెల్లుబాటును అందిస్తుంది. ఈ ప్లాన్‌లో మీరు రోజుకు 2GB డేటా పొందుతారు. ఇందులో కంపెనీ వినియోగదారులకు జింగ్ మ్యూజిక్, బీఎస్ఎన్‌ఎల్‌ ట్యూన్స్, హార్డీ గేమ్స్, ఛాలెంజర్ అరేనా గేమ్స్, గేమన్ ఆస్ట్రోటెల్‌తో పాటు రోజుకు 100 ఉచిత SMSలను అందిస్తోంది.

రూ. 1899 ప్లాన్: తన కస్టమర్ల కోసం రూ. 1899 ప్లాన్‌ను తన జాబితాలో చేర్చింది. ఈ రీఛార్జ్ ప్లాన్ కస్టమర్‌లకు 365 రోజుల సుదీర్ఘ వాలిడిటీని కూడా అందిస్తుంది. ఈ ప్లాన్‌లో మీరు మొత్తం 600GB డేటాను పొందుతారు. మీరు ప్లాన్‌లో రోజుకు 100 ఉచిత SMS కూడా పొందుతారు. ఈ రీఛార్జ్ ప్లాన్‌తో మీరు Challenger Arena, Hardy Games, Gammon Astrotel, Listen Podcast, Gamem, Zing Musicకు ఉచిత సభ్యత్వాన్ని కూడా పొందుతారు.

రూ.1499 ప్లాన్: అలాగే కస్టమర్లకు రూ.1499 ప్లాన్‌ను కూడా అందిస్తోంది. ఈ ప్లాన్‌లో మీరు 336 రోజుల సుదీర్ఘ వాలిడిటీని పొందుతారు. ఈ ప్లాన్ ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత ఉచిత కాలింగ్ అందిస్తుంది. కంపెనీ వినియోగదారులు ఈ ప్లాన్‌లో మొత్తం 24GB డేటాను పొందుతారు. ఇది కాకుండా మీరు రోజుకు 100 ఉచిత SMSలను కూడా పొందుతారు.

రూ 1198 ప్లాన్: బీఎస్ఎన్‌ఎల్‌ వార్షిక ప్లాన్ కోసం అనేక ఆప్షన్లను కలిగి ఉంది. కంపెనీ కేవలం 1198 రూపాయలకే 365 రోజుల లాంగ్ వాలిడిటీని కూడా అందిస్తుంది. ఈ రీఛార్జ్ ప్లాన్ అన్ని నెట్‌వర్క్‌లకు 300 నిమిషాల వాయిస్ కాలింగ్‌ను అందిస్తుంది. అలాగే 12 నెలల పాటు తన వినియోగదారులకు నెలకు 3GB డేటాను అందిస్తుంది. ఇది కాకుండా, ప్లాన్‌లో 30 SMSలు లభిస్తాయి.

ఇప్పుడు వాట్సాప్‌ గ్రూప్‌ క్రియేట్ చేయాలంటే డబ్బులు చెల్లించాల్సిందే.. కొత్త రూల్‌!

జింబాబ్వే ప్రభుత్వం కొత్త నిబంధనను అమలు చేసింది. ఇప్పుడు WhatsApp గ్రూప్ అడ్మిన్‌లందరూ జింబాబ్వే పోస్ట్, టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (POTRAZ)లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

వారి గ్రూప్‌ను క్రియేట్‌ చేయడానికి లైసెన్స్ పొందాలి. ఈ లైసెన్స్ కోసం వారు కూడా డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. లైసెన్స్ కనీసం $50 (సుమారు రూ.4220) ఖర్చవుతుంది. ఈ విషయాన్ని జింబాబ్వే సమాచార, కమ్యూనికేషన్ టెక్నాలజీ, పోస్టల్, కొరియర్ సర్వీసెస్ (ICTPCS) మంత్రి తటెండా మావెటెరా ప్రకటించారు.

కొత్త వాట్సాప్ రూల్ ఎందుకు ప్రవేశపెట్టింది?

తప్పుడు , తప్పుడు పోస్టులు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు దేశంలో శాంతి నెలకొనేందుకు ఈ కొత్త వాట్సాప్ నిబంధనను రూపొందించారు. ఇది దేశ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం కొత్త రూల్స్‌ తీసుకువచ్చింది తెలిపింది. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌ల వద్ద సభ్యుల ఫోన్ నంబర్లు ఉంటాయి. అందుకే ప్రభుత్వం ప్రకారం, వారు డేటా ప్రొటెక్షన్ యాక్ట్ పరిధిలోకి వస్తారు.

మంత్రి ఏం చెప్పారు..

తప్పుడు సమాచారం మూలాలను ట్రాక్ చేయడానికి లైసెన్సింగ్ సహాయపడుతుందని సమాచార మంత్రి మోనికా ముత్స్వాంగ్వా అన్నారు. ఇది చర్చిల నుండి వ్యాపారాల వరకు సంస్థలను ప్రభావితం చేసే డేటా రక్షణపై నియమాలతో పాటు వస్తుంది.

ప్రజలు ఏమంటున్నారు..

ఈ నిబంధన ప్రకారం, ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ తమ గ్రూప్‌ను నడపడానికి ప్రభుత్వం నుండి లైసెన్స్ తీసుకోవాలి. ఈ లైసెన్స్ పొందడానికి, నిర్వాహకుడు తన వ్యక్తిగత సమాచారాన్ని కొంత ప్రభుత్వానికి అందించాలి. అలాగే కొంత రుసుము కూడా చెల్లించాలి. దేశ భద్రతకు ఈ నిబంధన అవసరమని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇది మాట్లాడే స్వేచ్ఛను తగ్గిస్తుందని భావిస్తోంది. వాట్సాప్ కూడా ఫేక్ న్యూస్‌పై పోరాడేందుకు ప్రయత్నిస్తోంది. దీని కోసం అనేక చర్యలు తీసుకుంటోంది. అయితే, ఈ కొత్త నిబంధన చాలా ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఈ నియమం చాలా కఠినమైనదని, ప్రజలపై చెడు ప్రభావం చూపుతుందని ప్రజలు భావిస్తున్నారు.

కొర్రలా.. అని తీసిపారేయకండి. వీటిగురించి తెలిస్తే అస్సలు వదలరు

కొర్రలు పోషకాల గని అని చెప్పవచ్చు. సాధారణంగా అందరూ చపాతీ, రొట్టెల కోసం గోదుమపిండిని వాడుతుంటారు. దీనికంటే కూడా కొర్రపిండి చాలా మంచిదంటున్నారు న్యూట్రిషన్‌ నిపుణులు. ఒక కప్పు కొర్రపిండిలో 10 గ్రాముల ప్రొటీన్‌, 7.4 గ్రాముల డయటరీ ఫైబర్‌ , 83 మిల్లీగ్రాముల మెగ్నీషియమ్‌ ఉంటాయి. అంతేకాదు, ఇంకా చాలా రకాల మైక్రోన్యూట్రియెంట్లు కొర్రలలో ఉంటాయి. కొర్రపిండిలో పీచుపదార్థాల పరిమాణం చాలా ఎక్కువ కాబట్టి దీంతో చేసిన ఆహారాలు తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య ఉండదు. ఒక్క మలబద్ధకాన్ని నివారించుకుంటే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలూ, అనర్థాలూ దూరమవుతాయి. కొర్రల్లోని ప్రోటీన్లు కండరాల్లోని కణజాలానికి మంచి బలాన్ని ఇస్తాయి.

ఈ ప్రోటీన్లే కండరాల్లో తమ రోజువారీ పనుల కారణంగా దెబ్బతినే కండరాలను రిపేర్లు చేస్తుంటాయి. దాంతో దెబ్బలు త్వరగా తగ్గడం, గాయాలు త్వరగా మానడం జరుగుతాయి. బలంగా మారిన ఈ కణజాలాలు మరింత ఎక్కువ ఆక్సిజన్‌ను గ్రహించగలుగుతాయి కాబట్టి మరింత ఆరోగ్యకరంగా ఉంటాయి. అంతేకాదు చాలాసేపు అలసిపోకుండా పనిచేయగలుగుతాయి. ఫలితంగా మనం పనిచేసే సామర్థ్యం, అలసిపోకుండా పనిచేయగల సమయం పెరుగుతాయి. అంతేకాదు, రోగనిరోధక వ్యవస్థ బలోపేతమవుతుంది.

కొర్రల్లో చాలా ఎక్కువ పరిమాణంలో ఉండే పీచు శరీరంలోని గ్లూకోజ్‌ను చాలా మెల్లగా రక్తంలో కలిసేలా చేస్తుంది. దాంతో డయాబెటిస్‌ నివారణకు ఇది బాగా తోడ్పడుతుంది. టైప్‌–2 డయాబెటిస్‌ ఉన్నవారికి కొర్రలు ఆరోగ్యకరమైన ఆహారంగా చెప్పవచ్చు. అంతేకాదు కొర్రలు రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఇందులోని మెగ్నీషియమ్‌ వల్ల ఎముకలు మరింత పటిష్టమవుతాయి. జీవకణాల్లోని ఎంజైములు మరింత సమర్థంగా పనిచేస్తాయి. కొర్రల్లో జింక్‌ మోతాదులూ ఎక్కువే కావడంతో వ్యాధి నిరోధక శక్తి పెరుగుదలకు దోహదపడుతుంది. ఈ జింక్‌ వల్ల జుట్టు ఊడటం కూడా తగ్గుతుంది. థైరాయిడ్‌ పనితీరు క్రమబద్ధంగా మారుతుంది.

కరీజ్మా ఎక్స్ఎంఆర్ 250 నయా వెర్షన్ రిలీజ్.. మతిపోగుడుతున్న సరికొత్త ఫీచర్లు

ఇటీవల ఓ ఈవెంట్‌లో హీరో కంపెనీ ఎక్స్ పల్స్ 2014, కరీజ్మా ఎక్స్ఎంఆర్ 250ను కూడా రిలీజ్ చేసింది. ఫుల్ ఫెయిర్డ్ స్పోర్ట్స్ బైక్ కరిజ్మా ఎక్స్ఎంఆర్ 250 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో వస్తుంది.

ముఖ్యంగా స్పోర్టీ లుక్ యువతన అమితంగా ఆకర్షిస్తుంది. అధునాతన ఫ్యూయల్ ట్యాంక్, సిట్-సీట్ సెటప్ బైక్‌కు నయా లుక్‌ను ఇస్తుంది. తెలుపు, ఎరుపు రంగుల కలయికతో వచ్చే ఈ బైక్ ఫ్యూయల్ ట్యాంక్ మాత్రం కౌల్ నలుపు టోన్‌తో ఆకర్షిస్తుంది. ఎగ్జాస్ట్ సిల్వర్ ట్రిమ్‌తో వచ్చే కరిజ్మా ఎక్స్ఎంఆర్ చుట్టూ ఎల్ఈడీ లైట్లు బైక్‌కు నయా లుక్‌ను ఇస్తాయి.

కరిజ్మా ఎక్స్ఎంఆర్ 250 డీఓహెచ్‌సీ 250 సీసీ సింగిల్-సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ ద్వారా 30 హెచ్‌పీ, 25 ఎన్ఎం గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ముఖ్యంగా ఈ ఇంజిన్‌లో 250 సీసీ మిల్లో స్ట్రోక్ పొడవును 7 ఎంఎం పెంచారు. ఇది ఆరు-స్పీడ్ గేర్బాక్స్‌తో వస్తుంది. ముఖ్యంగా కరిజ్మా ఎక్స్ఎంఆర్ 250 కోసం స్టీల్-ట్రెల్లిస్ ఫ్రేమ్‌తో వస్తుంది. ఈ బైక్ ముందు భాగంలో యూఎస్‌డీ ఫోర్క్‌లను, వెనుకవైపు మోనోషాక్ సెటప్‌తో వస్తుంది.

కరీజ్మా ఎక్స్ఎంఆర్ 250 2025 వెర్షన్‌లో ముందు, వెనుక 17 అంగుళాల చక్రాలు, డిస్క్ బ్రేక్లు ఉన్నాయి. అలాగే ఈ బైక్ డ్యూయల్-ఛానల్ ఏబీఎస్‌తో వస్తుంది. హీరో ఈ 30 హెచ్‌పీ స్పోర్ట్స్ బైక్‌కు అడ్జస్టబుల్ క్లిప్-ఆన్ హ్యాండిలార్బర్లను కూడా ఇస్తుంది. అయితే ఈ ఈవెంట్‌లో భారతదేశంలో కొత్త కరిజ్మా ఎక్స్ టెన్ఆర్‌ను ఎప్పుడు లాంచ్ చేస్తుందో? హీరో ధృవీకరించలేదు. ముఖ్యంగా సుజుకీ జిక్స్ ఎస్ఎఫ్‌-250కు పోటీనిచ్చేలా హీరో కరీజ్మా ఎక్స్ఎంఆర్ 250 ధరను రూ. 2 లక్షలకే అందుబాటులో ఉంచింది.

ముంచుకొస్తున్న మరో గండం.! ఏపీలో ఈ ప్రాంతాలకు భారీ వర్ష సూచన

నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల అవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.6 కిమీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.

ఇది దాదాపు పశ్చిమ దిశగా తమిళనాడు/శ్రీలంక తీరాల వైపు వచ్చే 2 రోజుల్లో నెమ్మదిగా కదలుతుంది. గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు ఉన్న ద్రోణి.. నైరుతి బంగాళాఖాతం మీదుగా పై ఉపరితల అవర్తనం నుంచి తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 కిమీ ఎత్తులో మధ్య ట్రోపోస్పిరిక్ స్థాయిల వరకు విస్తరించి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే 3 రోజులు వాతావరణ సూచనలు ఇలా ఉన్నాయి.

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:-
————-

ఈరోజు, రేపు, ఎల్లుండి:-

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్, రాయలసీమ :-

————

ఈరోజు, రేపు:-

ఎల్లుండి:-

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

ఎఫ్‌డీలపై ఆ బ్యాంకుల్లో అదిరే వడ్డీ.. పెట్టుబడి తక్కువ లాభం ఎక్కువ

స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సీనియర్ సిటిజన్లకు ఐదేళ్ల ఎఫ్‌డీపై 7.50 శాతం వడ్డీ అందిస్తుంటే యాక్సిస్ బ్యాంకు మాత్రం 7.75 శాతం వడ్డీ ఇస్తుంది.

రూ.ఐదు లక్షలు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో డిపాజిట్ చేస్తే రూ. 2,24,974.01 రాబడి వస్తుంది.

యాక్సిస్ బ్యాంకులో ఐదేళ్ల పాటు రూ.5 లక్షలు డిపాజిట్ చేస్తే రూ. 2,33,921.44 రాబడి వస్తుంది.

రూ.10 లక్షలు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో డిపాజిట్ చేస్తే రూ.4,49,948.03 రాబడి వస్తుంది.

యాక్సిస్ బ్యాంకులో ఐదేళ్ల పాటు రూ.10 లక్షలు డిపాజిట్ చేస్తే రూ. 4,67,842.87 రాబడి వస్తుంది.

ఉదయాన్నే ఛాయ్‌, బిస్కెట్‌ తీసుకుంటున్నారా.? హెచ్చరిస్తున్న నిపుణులు

ఉదయం లేవగానే టీ తాగే అలవాటు మనలో చాలా మందికి ఉంటుంది. కేవలం టీ మాత్రమే కాకుండా అందులో బిస్కెట్స్‌ను ముంచుకు తినే వారు కూడా ఎక్కువే. గజిబిజీ జీవితంలో చాలా మంది ఉదయాన్నే బ్రేక్‌ ఫాస్ట్‌కు బదులుగా దీనినే తీసుకుంటున్నారు.

అయితే పరగడుపు ఛాయ్‌, బిస్కెట్‌ తినడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.

టీలో కెఫిన్‌ ఎక్కువగా ఉంటుంది. అలాగే బిస్కెట్‌లో చక్కెరతో పాటు కెఫిన్‌ కూడా ఉంటుంది. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు వేగంగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే బిస్కెట్లలో ప్రాసెస్ చేసిన చక్కెరతో పాటు గోధుమ పిండి అధికంగా ఉంటుంది. ఇందులో సంతృప్తి కొవ్వులు అధికంగా ఉంటాయి. కాబట్టి ఇది శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

బిస్కెట్స్‌లో ఉండే పదార్థాలు వేగంగా బరువు పెరగడానికి కామత్రమే కాకుండా పొట్ట ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. మరీ ముఖ్యంగా ఖాళీ కడపుతో తీసుకుంటే.. గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలకు దారి తీస్తాయని చెబుతున్నారు. దీనివల్ల అజీర్ణం, కడపులో ఇబ్బందిగా ఉండడం వంటి సమస్యలు వేధిస్తుంటాయని నిపుణులు అంటున్నారు.

మరీ ముఖ్యంగా ఉప్ప కంటెంట్‌ ఎక్కువగా ఉండే బిస్కెట్స్‌ను ఖాళీ కడుపుతో తీసుకుంటే అధిక రక్తపోటుకు దారి తీస్తుందని అంటున్నారు. రోజూ ఖాళీ కడుపుతో తీసుకుంటే గుండెపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. అలాగే బిస్కెట్స్‌లో ఉండే సుక్రలోజ్, అస్పర్టమే జీవక్రియను నెమ్మదిస్తుంది. ఇది జీర్ణ సమస్యలకు దారి తీస్తుంది. అందుకే టీతో పాటు బిస్కెట్స్‌ను తీసుకోకూడదని సూచిస్తున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

ఆ ఘనత సాధించిన తొలి మారుతీ సుజుకీ కారు ఇదే

కార్లకు ఇచ్చే సేఫ్టీ రేటింగ్ ప్రకారం వాటి డిమాండ్‌ ఆధారపడి ఉంటుందని తెలిసిందే. అందుకే కారు కొనుగోలు చేసే సేఫ్టీ రేటింగ్‌ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.

అయితే ఈ విషయంలో మారుతీ సుజుకీ ఎప్పటినుంచే పలు విమర్శకుల ఎదుర్కొంటోంది. ఇతర కార్లతో పోల్చితే మారుతి సుజుకీ సేఫ్టీ విషయంలో వెనకబడి ఉంటుందనే వాదన వినిపిస్తూనే ఉంటుంది.

అయితే ఈ విషయంలో తాము తక్కువేం కాదని నిరూపించింది మారుతి. తాజాగా మార్కెట్లోకి తీసుకొస్తున్న మారుతీ సుజుకీకి చెందిన ఫోర్త్‌ జనరేషన్‌ డిజైర్‌ అరుదైన ఘనత సాధించింది. గ్లోబల్‌ ఎన్‌క్యాప్‌ క్రాష్‌ టెస్టులో ఈ కాంపాక్ట్‌ సెడాన్‌ 5 స్టార్‌ రేటింగ్‌ సాధించింది. పెద్దల భద్రత విషయంలో 5 స్టార్‌ రేటింగ్‌, చిన్నారుల భద్రతకు సంబందించి 4 స్టార్‌ పొందిందీ కారు. గ్లోబల్‌ ఎన్‌క్యాప్‌ నుంచి 5 స్టార్‌ రేటింగ్‌ పొందిన తొలి మారుతీ సుజుకీ కారు ఇదే కావడం గమనార్హం.

మారుతీ ఈ వాహనాన్ని స్వచ్ఛంధంగా క్రాష్‌ టెస్ట్‌కు పంపింది. ఇందులో భాగంగానే పెద్దల భద్రతకు సంబంధించి 34 పాయింట్లకు గాను 31.24 పాయింట్లను దక్కించుకుంది. అలాగే చిన్నారుల భద్రత విషయానికొస్తే 42 పాయింట్లకు గాను 39 పాయింట్లు సాధించింది. ఈ కొత్త కారులో ఆరు ఎయిర్‌బ్యాగులు, అన్ని సీట్లకు 3 పాయింట్‌ సీట్‌ బెల్ట్‌ విత్‌ రిమైండర్‌ను అందించారు.

ఇక కొత్త మారుతి డిజైర్‌ విషయానికొస్తే ఈ కారు.. ఇంటీరియర్‌లో అనేక మార్పులు చేశారు. ప్రస్తుతం ఈ కార్లకు సంబంధించి బుకింగ్‌లు కొనసాగుతున్నాయి. ఇంకా కారు ధరలను కంపెనీ నిర్ణయించలేదు. నవంబర్‌ 11వ తేదీన ఈ ధరలను వెల్లడించనున్నారు. ధర ప్రకటించే ముందు ఈ టెస్ట్‌ వివరాలు వచ్చాయి.

ఆ పోస్టాఫీస్ స్కీమ్‌తో అదిరే రాబడి.. మహిళలకు మాత్రమే ప్రత్యేకం

మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్ భారతదేశంలో అన్ని పోస్ట్ ఆఫీసుల్లో అందబాటులో ఉంది. ఈ మహిళల కోసమే రూపొందించిన ప్రత్యేక పథకం. మహిళలు కొద్దిమాత్రం పెట్టుబడి రెండేళ్ల పాటు పెట్టాల్సి ఉంటుంది.

ఈ ప్రభుత్వ పథకంలో పెట్టుబడిపై 7.5 శాతం వరకు వడ్డీ అందిస్తారు. మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్ చిన్న పొదుపు పథకమని నిపుణులు చెబుతున్నారు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టే మహిళలు కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే పెట్టుబడి పెట్టాలి. ఇందులో పెట్టుబడి గరిష్ట పరిమితి రూ. 2 లక్షలుగా ఉంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ పథకాన్ని 2023 సంవత్సరంలో ప్రారంభించారు. అతి తక్కువ సమయంలో ఈ పథకం ప్రజల ఆదరణ పొందిందని నిపుణులు వివరిస్తున్నారు.

మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్‌లో వచ్చిన వడ్డీని లెక్కిస్తే ఈ పథకంలో రెండేళ్ల పాటు రెండు లక్షల పెట్టుబడిపై 7.5 శాతం వడ్డీ ఇస్తారు. ఒక పెట్టుబడిదారు మొదటి సంవత్సరంలో రూ. 15,000, స్థిర వడ్డీ రేటుతో వచ్చే ఏడాది మొత్తంపై వచ్చే వడ్డీతో కలుపుకుంటే రూ. 16,125 అవుతుంది. అంటే రెండేళ్ల వ్యవధిలో కేవలం రూ.2 లక్షల పెట్టుబడిపై మొత్తం రాబడి రూ.31,125గా ఉంటుంది.

బోలెడన్ని పన్ను ప్రయోజనాలు

ప్రభుత్వం అమలు చేస్తున్న ఇటువంటి పోస్టాఫీసు పథకాలు మహిళలను స్వావలంబన చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్‌లో పెట్టుబడిపై 7.5 శాతం బలమైన వడ్డీ ఇవ్వడమే కాకుండా ఆదాయపు పన్ను సెక్షన్ 80 సీ కింద పన్ను మినహాయింపు ప్రయోజనం కూడా ఇందులో పెట్టుబడిగా ఉంది. ఈ పథకంలో మరో ప్రత్యేకత ఏమిటంటే 10 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉన్న బాలికలకు కూడా ఖాతా తెరవవచ్చు.

బరువు తగ్గాలి అనుకునేవారు ఈ పండ్లకు దూరంగా ఉండండి

బరువు తగ్గాలని చాలా మంది తెగ కష్ట పడుతూ ఉంటారు. ప్రస్తుత కాలంలో ఎంత సన్నగా ఉంటే అంత బెటర్ అని ఫీల్ అవుతున్నారు. ఈ క్రమంలోనే సన్నగా అయ్యేందుకు ఎన్నో పనులు చేస్తున్నారు.

అయితే కొన్ని రకాల పండ్లను తినడం వల్ల సన్నగా అయ్యేందుకు బదులు లావు అవుతారు.

మామిడి పండు తినడం వల్ల లావు అవుతారు. మీరు విన్నది నిజమే మామిడి పండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదే అయినా.. వీటిల్లో కేలరీలు అనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని తింటే బరువు బాగా పెరుగుతారు.

అదే విధంగా అరటి పండ్లు తినడం వల్ల కూడా బరువు పెరుగుతారు. ఇందులో షుగర్ కంటెంట్, కేలరీల సంఖ్య ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వెయిట్ లాస్ అయ్యేవారు తీసుకుంటే బరువు పెరిగే అవకాశం ఉంది.

అదే విధంగా ద్రాక్ష ఎక్కువగా తీసుకున్నాకూడా బరువు పెరిగేలా చేస్తాయి. ఇందులో కూడా కేలరీల సంఖ్య ఎక్కువగా ఉంటాయి. పనస పండు తినడం వల్ల కూడా షుగర్ కంటెంటె్, కేలరీలు అధిక మొత్తంలో ఉంటాయి.

పైనాపిల్ తినడం వల్ల కూడా లావు పెరుగుతారు. ఈ ఫ్రూట్‌లో కూడా కేలరీల సంఖ్య ఎక్కువగా ఉంటాయి. ఇక దానిమ్మ పండు తిన్నా కూడా బరువు పెరుగుతారు. ఇందులో కూడా కేలరీల సంఖ్య ఎక్కువగా ఉంటాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. )

నిరసనల్లో ఈ నిరసన వేరయా.! నడిసంద్రంలో ప్లకార్డుల ప్రదర్శన.. ఎందుకో తెలుసా

ఆసియా గ్యాస్‌ విస్తరణ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విశాఖలో పడవలతో ప్రదర్శన చేశారు. నడి సముద్రంలో పడవలతో వెళ్లి గ్యాస్‌ ప్రాజెక్టులు వద్దు అని సముద్రంలో ప్లాస్టిక్‌ నివారించాలంటూ నినాదాలు చేశారు.

ప్లకార్డులను ప్రదర్శించారు. ఆసియా గ్యాస్‌ విస్తరణ వ్యతిరేక దినోత్సవాన్ని సందర్భంగా విశాఖ జిల్లా మత్స్యకారులు సముద్రంలో పడవలపై ర్యాలీ నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ సంస్థలైన సమతతో పాటు పలు సంస్థల ఆధ్వర్యంలో పడవల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మత్స్యకారులు, దళిత, గిరిజన సంఘాల నాయకులు పడవలపై ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకొని సముద్రంలో పడవల ర్యాలీ నిర్వహించారు.

ప్లాస్టిక్ వాడకం వల్ల సముద్రంలో ప్లాస్టిక్‌ గణనీయంగా పెరుగుతోందని ప్రదర్శనకారులు ఆందోళన వ్యక్తం చేశారు. పర్యాటక ప్రదేశాల్లో ప్లాస్టిక్‌ నియంత్రణ కొరవడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్లాస్టిక్‌తో సముద్రం కలుషితమవ్వడమే కాకుండా సముద్ర జీవరాసులకు జీవనానికి తీవ్ర విఘాతం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వాటితో పాటు సముద్రాల్లో వెలికితీస్తున్న గ్యాస్‌ విస్తరణ ప్రాజెక్టులను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. భూతాపం ఉష్ణోగ్రతలను తగ్గించేందుకు ప్రపంచ దేశాలు కలిసి రావాలని.. ప్రపంచ వ్యాప్తంగా బొగ్గు, చమురు, గ్యాస్‌ ఉత్పత్తిని వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేశారు.

ఈ సీజన్‌లో పెదాలు పగులి చిరాకుగా అనిపిస్తుందా.. ఇలా చేయండి

ఇతర సీజన్ల కంటే చలి కాలంలే ఆడవారికి అస్సలు ఇష్టం ఉండదు. చలి కాలంలో చర్మం, పెదాలు పగులుతూ ఉంటాయి. ఈ సీజన్‌లో స్కిన్ డ్యామేజ్ ఎక్కువగా ఉంటుంది.

ఖచ్చితంగా మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. చలి కారణంగా స్కిన్ పగిలి తెల్ల తెల్లగా కనిపిస్తుంది. చేతులు, కాళ్లపై గీతలు ఏర్పడతాయి. పెదాలు కూడా పగులుతాయి. పొరలు పొరలు ఊడి వస్తాయి. ఈ క్రమంలో స్కిన్ పరంగా ఖచ్చితంగా కేర్ తీసుకోవాలి. బయట వాటిని కొనే వాటి కంటే ఇంట్లో రెమిడీస్ కూడా ఫాలో చేయవచ్చు. ఇవి ఎంతో చక్కగా హెల్ప్ చేస్తాయి. బయట కొనడం కంటే ఇంట్లో రెమిడీలు ఫాలో చేస్తే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పెదాలు మళ్లీ మెత్తగా, మృదువుగా మారతాయి. మరి ఆ చిట్కాలు ఏంటో ఇప్పుుడు చూద్దాం.

నూనె రాయండి:

చలి కాలం మొదలవగానే ముందు పెదాలపై శ్రద్ధ వహించాలి. రాత్రి పడుకునే ముందు పెదాలపై కొబ్బరి నూనె రాస్తూ ఉండాలి. కొబ్బరి నూనె రాయడం వల్ల పెదాలు మెత్తగా మారతాయి. అలాగే కొబ్బరి నూనెలో కూడా పోషకాలు ఉంటాయి కాబట్టి.. ఆరోగ్యంగా మెరుస్తాయి.

వెన్న:

పెదాలు బాగా పగిలి పొరలు ఊడేవారు వెన్న రాయవచ్చు. వెన్న రాయడం వల్ల పెదాలు మృదువుగా, మెత్తగా మారతాయి. చక్కగా మెరుస్తాయి. వెన్న చాలా మంచిది. రాత్రి పడుకునే ముందు లేదా ఉదయం పెదాలపై వెన్న రాసి కాసేపు మర్దనా చేసి.. ఆ తర్వాత గోరు వెచ్చటి నీటితో కడగాలి. నెయ్యి కూడా పెదాలపై రాయడం వల్ల మెత్తబడతాయి.

తేనె:

పెదాలు పగిలి ఒక్కోసారి రక్తం కూడా కారుతుంది. అలాంటి సమయంలో తేనె చక్కగా పని చేస్తుంది. తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. కాబట్టి తేనె రాస్తే త్వరగా తేమగా మారతాయి. తేనె రాయడం వల్ల పెదాలు కోమలంగా తయారవుతాయి.

పచ్చి పాలు:

పెదాలు మెత్తగా, మృదువుగా మెరుస్తూ ఉండాలంటే.. పచ్చి పాలు రాస్తూ ఉండండి. కాటన్ సహాయంతో పెదాలపై పాలను రాస్తూ ఉండాలి. ఇలా తరచూ చేస్తే.. పెదాలు అస్సలు పగలవు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

మీ ఫోన్ స్లో అవుతుందా.. అయితే ఈ సెట్టింగ్స్ మార్చుకోండి చాలు

మీరు కొన్నేళ్లుగా ఒక్కటే ఫోన్‌ని ఉపయోగిస్తున్నారా? మీ ఫోన్ స్లో అవుతుందా? అయితే ఆందోళన చెందాల్సిన పని లేదు. ఎక్కువ కాలం ఒక్కే ఫోన్‌ని ఉపయోగిస్తున్నప్పుడు, కొన్నిసార్లు ఫోన్ స్లో అవుతూ ఉంటుంది.

బ్యాటరీ డ్రైన్ అవ్వడం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి సమస్యలను చిటికెలో పరిష్కరించవచ్చు.

మొబైల్ స్లో కాకుండా ఉండడానికి ఏం చేయాలి?

స్టోరేజ్‌ని క్లియర్ చేయండి: ఫోన్ స్లో అయితే ఫోన్‌ని బూస్ట్ చేయాలనుకుంటే, ముందుగా మీరు ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. స్టోరేజ్ ఫుల్ కావడం వల్ల ఫోన్ హ్యాంగ్ అవ్వడంతోపాటు స్లో అవుతుంది. ఈ సమస్యను అధిగమించాలంటే పనికిరాని ఫోటోలు, వీడియోలు, యాప్స్ వంటివి డిలీట్ చేయండి.

కాష్ మెమరీని క్లియర్ చేయండి: ఫోన్ కాష్ మెమరీని క్రమం తప్పకుండా క్లియర్ చేయండి, తద్వారా ఫోన్ వేగంగా పని చేస్తుంది. మీరు బ్రౌజర్, యాప్‌ల కాష్ ఫైల్‌లు, కుక్కీలను సకాలంలో క్లియర్ చేయకపోతే, ఫోన్ స్లో అవుతుంది.

వైరస్‌ స్కాన్ చేయండి: మీరు APK ద్వారా తెలియని సైట్ లేదా ఏదైనా యాప్ నుండి ఏదైనా ఫైల్‌ను ఇన్‌స్టాల్ చేసి ఉంటే, అప్పుడు యాంటీవైరస్ సహాయంతో, ఫోన్‌లో వైరస్ ఉందో లేదో తనిఖీ చేయండి.. వైరస్ కారణంగా ఫోన్ కూడా స్లో అవుతుంది. అలా అయితే, యాంటీవైరస్ సహాయంతో వైరస్‌ను తొలగించండి.

సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయండి: ఫోన్ నెమ్మదిగా నడుస్తుంటే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కూడా ఒక కారణం కావచ్చు. ఫోన్ సెట్టింగ్‌లకు వెళ్లి, ఫోన్‌కు ఏదైనా అప్‌డేట్ పెండింగ్‌లో ఉందో లేదో తనిఖీ చేయండి, అప్‌డేట్ చేయకుంటే వెంటనే ఫోన్‌ను అప్‌డేట్ చేయండి.

మూడేళ్లలో మూసీనదిని తెలంగాణ ఐకాన్‌గా మారుస్తా.. సీఎం రేవంత్ ఎమోషనల్ స్పీచ్

సీఎం రేవంత్‌రెడ్డి 55వ పుట్టినరోజు. ముఖ్యమంత్రి హోదాలో ఆయనకు ఇదే తొలి పుట్టినరోజు. కానీ.. పర్సనల్ సెలబ్రేషన్ల సంగతేమో గాని.. బర్త్‌డే మొత్తం జనం మధ్యనే గడిపారు.

నల్గొండ జిల్లాలో సుడిగాలి పర్యటనతో బిజీగా గడిపారు సీఎం రేవంత్‌రెడ్డి. పుట్టిన రోజు సందర్భంగా యాదగిరి లక్ష్మీ నరసన్నను దర్శించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. స్వామివారి దర్శనం తర్వాత వైటీడీఏ అధికారులతో సమీక్ష నిర్వహించారు. యాదాద్రి ఆలయ అభివృద్ధి, పనుల పురోగతిపై చర్చించారు. యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని నెక్ట్స్‌ లెవెల్‌కు తీసుకు వెళతా.. అని హింట్ ఇచ్చారు సీఎం రేవంత్‌ రెడ్డి.

ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. యాదాద్రి పేరు యాదగిరిగుట్టగా మార్చాలని, టీటీడీ తరహాలో ప్రత్యేక పాలక మండలి ఏర్పాటు చేయాలని, గోశాలలో గోసంరక్షణ కోసం ప్రత్యేక పాలసీ తీసుకురావాలని, విమాన గోపురానికి 60 కిలోల బంగారంతో తాపడం పనులు వేగవంతం చేయాలని.. నిర్ణయించారు. యాదగిరిగుట్ట సందర్శన తర్వాత.. మూసీ పునరుజ్జీవ పాదయాత్ర చేపట్టారు రేవంత్‌రెడ్డి. సంగెం దగ్గర మూసీ కాలువను పరిశీలించి.. భీమలింగానికి ప్రత్యేక పూజలు చేశారు. బోటులో ప్రయాణిస్తూ మూసీ ప్రవాహాన్ని పరిశీలించారు. ధర్మారెడ్డికాలువ వెంట నేతలు, కార్యకర్తలు, రైతులతో కలిసి రెండున్నర కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. కాలువ వెంట పొలాల్లోని రైతులతో ముచ్చటించి, వారి సమస్యలు విన్నారు. అక్కడే రైతులను, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు సీఎం రేవంత్‌రెడ్డి.

ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఉత్తమ్‌కుమార్‌.. పార్టీ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొన్నారు. మూసీ నది పునరుజ్జీవాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రేవంత్‌రెడ్డి.. ఇటీవలే స్పెషల్ టీమ్‌ని సియోల్ పంపి.. అనేక అధ్యయనాలు చేయించారు. మరో మూడేళ్లలో మూసీ నదిని తెలంగాణ ఐకాన్లలో ఒకటిగా మారుస్తానని మాటిచ్చారు. అందులో భాగంగానే.. పుట్టినరోజున మూసీలో పడవ ప్రయాణం చేసి.. తన కమిట్‌మెంట్‌ను చాటుకున్నారు సీఎం రేవంత్‌రెడ్డి.

పోలవరం ప్రాజెక్టుపై విస్తృతంగా మేథోమథనం.. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి టార్గెట్ ఫిక్స్

ఆంధ్రుల జీవనాడి.. పోలవరం ప్రాజెక్ట్‌.. నిర్మాణ దశను దాటలేక దశాబ్దాల తరబడి అపసోపాలు పడుతూనే ఉంది. ప్రభుత్వాలు మారినా కొత్తకొత్త సమస్యలతో నిర్మాణంలో అంతులేని జాప్యం తప్పడం లేదు.

కొత్త సమస్యల్లో అతికొత్త సమస్య ఏంటంటే.. ప్రాజెక్టు దగ్గర గోదావరి లోపల నిర్మించిన డయాఫ్రం వాల్ భారీ వరదలకు దెబ్బతినడం..! 2018లో ఉభయగోదావరి జిల్లాల పరిధిలో గోదావరి నదీ గర్భంలో 93.5 మీటర్ల లోతులో నిర్మించిన డయాఫ్రమ్ వాల్ ఇది. రెండు సీజన్లలో 412 రోజుల కాల వ్యవధిలో పూర్తయినప్పటికీ 2020 తర్వాత వచ్చిన వరదల కారణంగా దెబ్బతినింది. దీంతో దీని మీద నిర్మించాల్సిన మెయిన్ డ్యామ్ పనులు ఆగిపోయాయి. ఇటీవలే మళ్లీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న చంద్రబాబు కొత్త డయాఫ్రమ్‌ వాల్‌పై దృష్టి పెట్టారు. విదేశీ నిపుణుల సలహాలు-సూచనలతో ముందుకెళ్లాలని నిర్ణయించారు.

కేంద్ర జలసంఘం సీఈ విజయ్ శరన్ అధ్యక్షతన ముగ్గురు విదేశీ నిపుణులతో పరిశీలన బృందం ఏర్పాటైంది. ఇటీవలే రాష్ట్రానికి వచ్చిన విదేశీ నిపుణుల బృందం.. పోలవరంపై మేథోమథనం చేసింది. రెండురోజుల పాటు ఎగువ-దిగువ కాపర్ డ్యామ్ నిర్మాణాలను పరిశీలించింది. దీనికి సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్‌ చూసి, పోలవరం ఆధారిటీ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపింది. గ్యాప్‌-2లో డయాఫ్రం వాల్‌ ప్లాట్‌ఫాం, వాల్‌ నిర్మాణానికి అవసరమైన ఓడోమీటర్లు, కొత్త వాల్‌ నిర్మాణం కోసం ఎర్త్‌ కమ్ రాక్‌ఫిల్‌ డ్యామ్ కుడివైపు జరుగుతున్న మట్టి పనులు, దిగువ కాఫర్‌ డ్యాం వద్ద డీవాటరింగ్‌ పనులు.. అన్నిటినీ నిశితంగా పరిశీలించారు. ఢిల్లీ నుంచి వర్చువల్‌ విధానంలో కేంద్ర జలసంఘం ఛైర్మన్‌ కూడా ఈ సంప్రదింపుల్లో పాల్గొన్నారు. అటు.. ఆఫ్రి సంస్థ సిద్ధం చేసిన కొత్త డయాఫ్రమ్ వాల్, ప్రధాన డ్యామ్ డిజైన్లపై చర్చించింది. పాత డయాఫ్రం వాల్‌కు ఎగువన 6 మీటర్ల దూరంలో కొత్త డయాప్రం వాల్ నిర్మించాలని, ఇసుక సాంద్రత పెంచి మరింత గట్టిదనం తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చారు.

కానీ.. డిజైన్‌పై విదేశీ నిపుణులు అనేక సందేహాలు లేవనెత్తారు. కొన్ని వివరణలూ కోరారు. అన్నిటిపై క్లారిటీ ఇస్తామంటోంది ఆఫ్రి సంస్థ. డ్యామ్ ప్రాంతంలో నీళ్లు లేనప్పుడు, తక్కువ నీళ్లు ఉన్నప్పుడు, గరిష్ట స్థాయిలో నీళ్లు ఉన్నప్పుడు… ఇలా వివిధ కోణాల్లో డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై చర్చించారు. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి దాదాపు 15 నెలల టైమ్ పడుతుందని ఒక అంచనాకొచ్చారు. యంత్రసామగ్రిని పెంచుకుంటే నిర్మాణ గడువు తగ్గే ఛాన్స్ కూడా ఉందట. నిపుణుల భేటీ తర్వాత సీఎం చంద్రబాబు క్షేత్ర స్ధాయిలో పోలవరం పర్యటనకు వస్తారు. పనుల పరిశీలన ముగిశాక అధికారులతో సమావేశమై కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై ఫైనల్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

చెట్టినాడ్ స్టైల్‌ ఫిష్ ఫ్రై.. అదిరిపోయిందంటారు

నాన్ వెజ్ అంటే ఎంత ఇష్టమో మాంసాహార ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొందరికి ప్రతి రోజూ ఏదో ఒక స్పెషల్ ఉండాలి. అయితే ఎప్పుడూ తినే ఒకే లాంటి ఐటెమ్స్‌ కాకుండా కొత్తగా కూడా ట్రై చేస్తూ ఉండాలి.

ఫిష్ ఫ్రై అంటే చాలా మందికి ఇష్టం. కానీ ఫ్రై చేసేటప్పుడు మాత్రం కాస్త ఓపిక కావాలి. మీడియం మంట మీద జాగ్రత్తగా ఫ్రై చేయాలి. సాధారణంగా ఎప్పుడూ చేసే ఫిష్ ఫ్రై కంటే.. ఈ చెట్టినాడ్ స్టైల్‌లో ఫిష్ ఫ్రై చేయండి. ఖచ్చితంగా అదిరింది అంటారు. అంత రుచిగా ఉంటుంది. మరి ఈ చెట్టినాడ్ స్టైల్ ఫిష్ ఫ్రై ఎలా తయారు చేస్తారు? ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

చెట్టినాడ్ స్టైల్ ఫిష్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు:

చేపలు, కారం, పసుపు, ఉప్పు, ఉల్లిపాయ, జీలకర్ర, ఎండు మిర్చి, అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు, మెంతులు, ధనియా పొడి, శనగపిండి, బియ్యం పిండి, ఆయిల్.

చెట్టినాడ్ స్టైల్ ఫిష్ ఫ్రై తయారీ విధానం:

ముందుగా చేపల ముక్కలను నీచు వాసన రాకుండా శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక మిక్సీ తీసుకుని అందులో.. ఉల్లిపాయ, జీలకర్ర, ఎండు మిర్చి, అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు, మెంతులు, ధనియా పొడి వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఓ బౌల్‌లోకి తీసుకోవాలి. ఇందులో కొద్దిగా ఉప్పు కూడా వేసి మిక్స్ చేయాలి. ఆ తర్వాత శనగ పిండి, బియ్యం పిండి కూడా వేసి ఉండలు లేకుండా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం చేపలకు పట్టించండి. ఆ తర్వాత ఓ అరగంట పాటు మ్యారినేట్ చేయడానికి ఫ్రిజ్‌లో ఉంచండి.

నెక్ట్స్ పొయ్యి మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి వేడి చేయాలి. చేప ముక్కలను వేసి రెండు వైపులగా ఎర్రగా మీడియం మంట మీద వేయించాలి. పెద్ద మంట పెడితే పైన మాడిపోయి.. లోపల ఉడకవు. కాబట్టి జాగ్రత్తగా ఫ్రై చేయాలి. లేదంటే పాన్ తీసుకుని.. కొద్దిగా ఆయిల్ వేసి షాలో ఫ్రై కూడా చేయవచ్చు. చివరంగా నిమ్మరసం పిండి కొత్తి మీర చల్లితే ఎంతో రుచికరమైన చెట్టినాడ్ స్టైల్ ఫిష్ ఫ్రై సిద్ధం.

7 ఫోర్లు, 9 సిక్స్‌లు.. 200లకుపైగా స్ట్రైక్‌రేట్‌తో శాంసన్ తుఫాన్ సెంచరీ.. ధోని రికార్డ్ బ్రేక్

దక్షిణాఫ్రికాపై సంజూ శాంసన్ 47 బంతుల్లో సెంచరీ సాధించాడు. అతను వరుసగా రెండో టీ20లో సెంచరీ సాధించాడు. దీనికి ముందు హైదరాబాద్‌లో బంగ్లాదేశ్‌పై శాంసన్ సెంచరీ చేశాడు.

వరుసగా రెండు టీ20ల్లో సెంచరీలు సాధించిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు.

వరుసగా రెండు టీ20ల్లో సెంచరీలు బాదిన ప్రపంచంలో నాలుగో ఆటగాడిగా శాంసన్ నిలిచాడు. అతనికి ముందు, ఇంగ్లాండ్‌కు చెందిన ఫిల్ సాల్ట్, దక్షిణాఫ్రికాకు చెందిన రిలే రూసో, ఫ్రాన్స్‌కు చెందిన గుస్తావ్ మాకాన్ మాత్రమే ఇలా చేశారు.

దీంతో భారత్ ప్రస్తుతం 16.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. జట్టులో హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్ క్రీజులో ఉన్నారు. శాంసన్ వరుసగా రెండో T-20లో సెంచరీ సాధించి, 107 పరుగుల వద్ద ఔటయ్యాడు.

తిలక్ వర్మ 33 పరుగులు చేసిన తర్వాత కేశవ్ మహరాజ్‌కు బలయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ 21 పరుగుల వద్ద డీప్ మిడ్ వికెట్ వద్ద ప్యాట్రిక్ క్రూగర్ చేతికి చిక్కి ఔటయ్యాడు. 8 బంతుల్లో 7 పరుగులు చేసి అభిషేక్ శర్మ ఔటయ్యాడు. నాలుగో ఓవర్లో గెరాల్డ్ కూట్జీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

Health

సినిమా