Tuesday, December 16, 2025

Explanation on Implementation of 30 Year Scale (SPP II B). 30 సం౹౹ల స్కేల్(SPP II B) అమలుపై వివరణ

Explanation on Implementation of 30 Year Scale (SPP II B).

30 సం౹౹ల స్కేల్(SPP II B) అమలుపై వివరణ..

పదోన్నతి లేక ఒకే క్యాడర్ లో కొనసాగుతున్న ఉద్యోగులకు 2022 పీఆర్సీలో కొత్తగా 30 సం౹౹ల స్కేల్ మంజూరు చేస్తు GO Ms No. 1 Finance (PC-TA) dept dt. 17.01.2022 ఉత్తర్వులు ఇచ్చారు. అయితేఈ 30 సం౹౹ల స్కేల్ అమలుపై అనేక అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండగా డిటిఏ గారు Lr No. FIN02-18069/ 65/2022-H SEC-DTA dt.02.09.2022 లేఖ ద్వారా వివరణ ఇవ్వడం జరిగింది. అందులో 2011 లో కొత్తగా మంజూరు చేసిన 18 సం౹౹ల స్కేల్ అమలుపై ఇచ్చిన Cir. 020091ని అనుసరించాలని సూచించారు.

2010 పీఆర్సీకి మునుపు 8/16/24 సం౹౹ల స్కేల్స్ అమలులో ఉండగా GO 96 తేదీ 20.05.2011 మేరకు 8/16/24కు బదులుగా 6/12/24 స్కేల్స్ గా మారుస్తు కొత్తగా 18 స్కేల్ మంజూరు చేయడం జరిగింది. 18 స్కేల్ అమలుపై ఆనాడు 11 అంశాలపై వివరణలు ఇస్తు Cir.Memo No.020091/ 125/PC.II/2011 Finance dept dt.17.08.2011 ఉత్తర్వులు ఇచ్చారు. ఆ వివరణలు 30సం౹౹ల స్కేల్ అమలుకు అన్వయించుకోవాలి. అందులోని వివరణల మేరకు

1) 01.07.2018నాటి కన్నా ముందు ఒకే క్యాడర్ లో 30సం౹౹ల సర్వీస్ పూర్తి చేసుకుని 01.07.2018 నాటికి అదే క్యాడర్ లో కొనసాగుతున్న ఆ ఉద్యోగికి 1.7.2018 నుండి మాత్రమే 30సం౹౹ల స్కేల్ మంజూరు చేయవచ్చు.

2) 01.07.2018 తేదీ నాటి కన్నా ముందు 30స౹౹ల సర్వీసు పూర్తయి 01.07.2018 నాటికి క్యాడర్ మారిన వారికి ఈస్కేల్ వర్తించదు.

3) 01.07.2018 తర్వాత 30 సం౹౹ల సర్వీసు పూర్తయి తర్వాత పదోన్నతి పొందిన వారికి కూడా 30 సం౹౹ల స్కేల్ వర్తిస్తుంది.

4) 24/30 సం౹౹ల స్కేల్స్(SPP II) పొందిన తర్వాత పదోన్నతి పొందిన వారికి FR22(B) వర్తించదు. అనగా FR 22(a)(1) మేరకు ఒక్క ఇంక్రిమెంట్ మాత్రమే మంజూరు చేస్తారు.

5) 24/30 సం౹౹ల స్కేల్ పొందిన తర్వాత పదోన్నతి పొందిన క్యాడర్ లో AAS వర్తించదు.

6) 30 సం౹౹ల స్కేల్ వేతన స్థిరీకరణ 01.01.2022 నుండి మాత్రమే నగదుగా చెల్లిస్తారు.

ROSA – Recognition of Service Association – ఇక రోసా కత్తి… ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తే వేటు వేయడమే…అసలు ఏమిటీ రోసా..

????ఇక రోసా కత్తి

????ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తే వేటు వేయడమే

????ఏపీజీఈఏతో మొదలుపెట్టిన జగన్‌ సర్కారు

????భవిష్యత్తులో ఇతర సంఘాలపైనా అదే తీరు!?

????మీడియాతో మాట్లాడటమే నేరమట..

????పెన్షన్లు, జీతాలు ఇవ్వకున్నా అడగొద్దు!

????దశాబ్దాలుగా ఉన్న ‘రోసా’ నిబంధనలు..

????తొలిసారి ప్రయోగించిన జగన్‌ ప్రభుత్వం..

(ఆంధ్రజ్యోతి – అమరావతి): అనుకున్నదే జరుగుతోంది! ఉద్యోగుల సమస్యలపై గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించి… సర్కారు తీరును ఎండగట్టిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ)పై జగన్‌ ప్రభుత్వం ‘రోసా’ కత్తి దూసింది. ‘జీతం ఠంచనుగా ఇవ్వండి’ అని అడగడమే నేరమైనట్లుగా దశాబ్దాల కిందట రూపొందించిన ‘రోసా’ (రికగ్నిషన్‌ ఆఫ్‌ సర్వీస్‌ అసోసియేషన్‌) నిబంధనలను బయటికి తీసింది. సంఘం గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ నోటీసు జారీ చేసింది. జీతాలు, డీఏలు, జీపీఎ్‌ఫలు ఇచ్చినప్పుడే తీసుకోవాలని, కాదూ కూడదని ప్రశ్నిస్తే సహించేది లేదని అన్ని ఉద్యోగ సంఘాలకూ హెచ్చరికలు పంపింది.

దెబ్బతిన్న సర్కార్‌ అహం

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు సూర్యనారాయణ, ఆస్కార్‌రావు, ఇతర ప్రతినిధులు గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ను నేరుగా కలిశారు. ప్రభుత్వం ఒకటో తేదీన జీతాలు ఇచ్చేలా చట్టం చేయాలని, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేలా ఆదేశించాలని వినతిపత్రం అందజేశారు. దీనిపై గవర్నర్‌ కూడా స్పందించారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రశ్నించారు. ఈ పరిణామాలు జగన్‌ సర్కారును ఇరకాటంలోకి నెట్టాయి. ప్రభుత్వ పెద్దల ఆగ్రహానికి కారణమయ్యాయి. అయితే… గవర్నర్‌ను కలిసినందుకు అని కాకుండా, ‘మీడియాతో మాట్లాడి, ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేసినందుకు’ అని నోటీసులో పేర్కొనడం గమనార్హం. రాష్ట్రంలో గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలు 104 ఉన్నాయి. వాటి ప్రతినిధులు సందర్భం వచ్చినప్పడల్లా మీడియాతో మాట్లాడుతుంటారు. తమ డిమాండ్లు వినిపిస్తుంటారు. ఈ క్రమంలో ప్రభుత్వాన్ని నిలదీయడమూ సహజమే. ఏపీజీఈఏ నేతలు కూడా గతంలో అనేక పర్యాయాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కానీ… ఇప్పుడే ‘రోసా’ కింద ఈ సంఘానికి నోటీసులు జారీ చేయడం గమనార్హం. ఇప్పుడు ఏపీజీఈఏకు ఇచ్చిన నోటీసులు… భవిష్యత్తులో ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఇతర ఉద్యోగ సంఘాలకూ ఇవ్వొచ్చు. వెరసి… అందరి మీదా ‘రోసా’ కత్తి వేలాడుతూనే ఉంటుందని ఉద్యోగ నేతలు పేర్కొంటున్నారు.

కానరాని ఉద్యోగ సంఘాల ఐక్యత….

ఉద్యోగుల సమస్యలపై ఉద్యోగ సంఘాలు ఐక్యంగా పోరాడిన సందర్భాలు గతంలో ఎన్నో ఉన్నాయి. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ నుంచి చంద్రబాబు వరకు ఎన్నో సందర్భాల్లో ఉద్యోగులు తమ సమస్యల కోసం ఉమ్మడి ఉద్యమాలు చేపట్టారు. ఇప్పుడు దీనికి పూర్తి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఐక్యంగా ప్రభుత్వంపై పోరాడే సంగతి పక్కనపెడితే… వాళ్లే ఒకరిమీద ఒకరు పోరాడుకుంటున్నారు. ‘‘ఏపీజీఈఏ అధ్యక్షుడు సూర్యనారాయణతో ఇతర ఉద్యోగ సంఘాలకు అభిప్రాయ భేదాలు ఉండవచ్చు. కానీ ఆయన మాట్లాడింది ఉద్యోగ సమస్యలపైనే. గవర్నర్‌ను కలిసింది ఉద్యోగుల కోసమే! ప్రభుత్వం దీనిని జీర్ణించుకోలేక ఏపీజీఈఏకు నోటీసులు జారీ చేసింది. ఇతర సంఘాలు దీనిని ఖండించాల్సిందే. అలాకాదని వదిలేస్తే… భవిష్యత్తులో వారి వంతూ వస్తుంది. దీనివల్ల అంతిమంగా నష్టపోయేది సాధారణ ఉద్యోగులే’’ అనే దిశగా ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది.

అసలు ఏమిటీ రోసా..

సర్వీసు అసోసియేషన్లకు గుర్తింపు, రద్దుకు సంబంధించి1962లో రికగ్నిషన్‌ ఆఫ్‌ సర్వీస్‌ అసోసియేషన్‌ (రోసా) నిబంధనలు రూపొందించారు. తర్వాత 2001 సంవత్సరంలో అప్పటి ఉమ్మడి ఏపీలో రూల్స్‌ను సవరించారు. ఏ అసోసియేషన్‌కు గుర్తింపు ఇవ్వాలన్నా, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలన్నా, రద్దు చేయాలన్నా ఈ నిబంధనలే వర్తిస్తాయి. రోసా నిబంధనల ప్రకారం… ఉద్యోగ సంఘ సమావేశాల వివరాలను సభ్యులకు మాత్రమే చెప్పాలి. ఇతరులకు, మీడియాకు వెల్లడించకూడదు అని మాత్రమే రోసా రూల్స్‌లో ఉంది. ఏపీజీఏఈపై ఈ నిబంధననే ప్రభుత్వం ప్రయోగించింది. ‘రోసా క్లాజ్‌ 2 బీ అండ్‌ 3 ప్రకారం… పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా మీ సంఘం గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదు?’ అని ఏపీజీఈఏను ప్రభుత్వం ప్రశ్నించింది. నిజానికి… రోసా నిబంధనలు ఎప్పటి నుంచో ఉన్నాయి. కానీ… ఏ ప్రభుత్వమూ వీటిని అమలు చేయలేదు. ఇప్పుడు ప్రశ్నించే గొంతులను అణచివేయడమే లక్ష్యంగా ‘రోసా’ రూల్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం బయటికి తీసిందని, దీనిని అమలు చేస్తే ఏ సంఘమూ నోరెత్తే పరిస్థితి ఉండదని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

Work Distribution Between MEO 1 & MEO 2

Work Distribution Between MEO 1 & MEO 2

Work Distribution Between MEO 1 & MEO 2
Work Distribution Between MEO 1 & MEO 2

UPDATED DIKSHA APP – Install Android App – Platform for School Education updated

UPDATED DIKSHA APP – Install Android App – Platform for School Education updated

❖ New Features :
●To improve your discovery experience we bring to you-
a. Sections (on the home) with their customized landing pages according to your need
b. My-learning section with sorted courses as per enrollment dates
c. Also have fixed few bugs
2. Now Schools heads & officials can
a. Receive notifications once a new program or resource targeted to them is added
b. Access projects on Diksha directly by opening projects link
c. Discover & consume observation, surveys & survey’s reports on Home
Download Diksha Updated version

Download…. Latest DIKSHA- దీక్ష యాప్

TaRL Baseline Midline Endline Test Assessment Results Entry App Download here

TaRL Baseline Midline Endline Test Assessment Results Entry App Download here

Acadamic Monitoring App -SIMS – AP

This Application will capture the Student Assessment in all Schools in Andhra Pradesh by teachers and Head Master in the school by simply capturing the Language ( Telugu /Hindi/Urdu/Tamil/Kannada ) , Mathematics , English Subjects performance along with Basic Questions for monitoring the Students Performance in the school. This application will help the teachers and Head Masters for understanding the students’ performance class wise . After this Base line survey students teaches specially by teachers and end line survey with same parameters will be measured in this app.

AP School Education Department has developed the AP Academic Monitoring System APP in which All Techers should upload the Lesson Plans, Approve or Reject Lesson Plans, Upload Teacher Dairy activities, Upload PC Committee Meeting Details in the AP Academic Monitoring System APP. Download the AP Academic Monitoring APP Latest version from Play Store and see the further details below. Academic Monitoring System APP Download Latest Version from Play Store -AP Lesson Plans Upload APP

This APP Contains the following Sections:

School Data Entry Section

Lesson Plans Approval Section

Parents Committee Meeting Section

Student Teacher Interaction Section

Capture Important Events Section

Capture Cultural Competitions Section

Baseline assessment Section

TARL TEST ASSESSMENT RESULTS ENTRY ANDROID APP DOWNLOAD CLICK HERE

 

Telugu Keyboard for Android -Typing in తెలుగు (Telugu) on your phones

Telugu Keyboard for Android

Typing in తెలుగు (Telugu) on your Android Mobile phones and tablets just got easier with Lipikaar’s Telugu typing keyboard for Android. Lipikaar’s Telugu Keyboard is now available for FREE on Google Play for all Android devices.

Telugu Keyboard with English to Telugu typing. Now with funny GIFs and emojis.

Telugu Keyboard is an English to Telugu keyboard app that makes typing Telugu faster than ever before!

– Type in English to get Telugu letters

– Works inside all apps on your phone – a Telugu typing keyboard app for all social media and messaging apps

– Saves time compared to handwriting input or other Indic Telugu input tools.

– Chat with your friends and family with this Telugu Keyboard English to Telugu

– Easily search and open apps installed on your phone and discover new apps relevant to you with our App Search feature

Installation and set up is easy.

– Download the app and open it.

– Enable Telugu Keyboard in Step 1 and choose it in Step 2.

– Change settings and choose from colourful Telugu keyboard themes.

– That’s all! You can type Telugu everywhere now.

– To change keyboard easily, press and hold the space key.

Built in India. Amazing features.

– Type in Telugu faster. Start typing the letters and choose Telugu predictions from the list. This is the easiest app for English to Telugu typing

– Top words are available offline in the fast keyboard. Turn on internet for additional words.

– A phonetic Telugu transliteration keyboard that works on Android phones and tablets. Telugu text typing made faster.

– No need to learn Telugu keypad and layout.

– The best rated Telugu typing app that works as Telugu English keyboard

– This English to Telugu key board is easier to use than any other keyboard

Simple and easy to use.

– Use the language button to switch between English and Telugu. English word suggestions are also available.

– For GIFs and emojis, click the button on top left side of the keyboard. Make your conversations even more amazing with popular animated GIFs

– Press and hold the emoji key to view all emojis from the Telugu emoji keyboard

– Telugu GIF keyboard lets you share interesting good morning messages, funny animations and more.

– Color themes can be changed from settings. Choose from 21 interesting color combinations

Download…. Telugu Key Board ….Telugu typeing App

Jagananna Vidya Kanuka Latest JVK APP APK DOWNLOAD

Jagananna Vidya Kanuka Latest JVK APP APK DOWNLOAD

JVK Stock Register and Registers.

Front Page Stock Register

JVK Issue Front Page Register

JVK Complex Stock Register

JVK Stock Receiver Register

JVK Issue Student wise Register

JVK Note Book Issue Register

JAGANANNA VIDYA KANUKA Latest JVK APP APK DOWNLOAD CLICK HERE

https://nadunedu.se.ap.gov.in/JVK/APK/JVK_P_1.4.6.apk

USER ID : IMMS APP OLD DISTRICT USER ID, PASSWORD :1234 (ALL SCHOOLS SAME DEFAULT PASSWORD)

Download AP E-CHALLAN App – you can search for all pending challans on your vehicles

Download AP E-CHALLAN App – you can search for all pending challans on your vehicles

Create your profile with your vehicles to get notified on New Challans Raised against your vehicles. So never miss a payment on your challans

Who wants to buys someone else’s challans along with their vehicle or keep track of how obedient their dear ones are obeying traffic rules

So now you can search for all pending challans on your vehicles and pay right then and there through the App or to list all the violation history of a particular vehicle.

We offer a lot of FAQ’s and Driver education is definitely our Forte for betterment of road safety on our roads.

We also keep track of all MV Act Sections and the Fines being levied by the Police department live

This official E-Challan application is for the Andhra Pradesh Police units
You can also pay online from
https://apechallan.org

You can also pay your E-Challan from any APOnline or MeeSeva centers across the state with your RC number or Challan number that you received.

Download….. TS E challan App (Not Official but Good Data …)

DOWNLOAD…..AP E-CHALLAN App

Pay Your Traffic Challan

DOWNLOAD…..AP E-CHALLAN App

GSWS – Consistent Rhythms App Latest Version Download

GSWS – Consistent Rhythms App Latest Version Download Consistent Rhythms Android Mobile Application Updated Version GSWS – Consistent Rhythms In Schools User Manual

Inspection Forms, Surveys for GSWS functionaries – Govt of Andhra Pradesh

The application hosts inspection forms and surveys that would help GSWS staff members conduct school visits weekly, and during school events.

Consistent Rhythms is an attempt to improve school facilities and education through
periodically identifying and reporting on any issues at the field level.

The application is built by GSWS department and is supposed to be used by the following
Secretariat Staff:

❖ GSWS Functionaries
➢ Welfare Education Assistant
➢ Ward Education & Data Processing Secretary
➢ Mahila Police
➢ Engineering Assistant
➢ Ward Amenities Secretary
❖ School Head Masters

GSWS – Consistent Rhythms Application Installation:

Users can search for ‘GSWS – Consistent Rhythms’ application in Google Play Store or can
download the application using the link:
https://play.google.com/store/apps/details?id=com.cr_app.vsws_cr_android_app

GSWS – Consistent Rhythms Application Usage:

Please note that the application can be access through “Username” and “Password” provided to you
by the respective district level/mandal level authorities. Username is of the format: “SECRETARIAT
CODE + SHORT FORM” of village secretariat functionary.

Please note that for WEDPS functionaries passwords won’t be provided. They need to either use
their password set for VSWS HMS portal – vsws.co.in or reset the password. This is because both the
applications follow a unified login management.

As a WEDPS user, if you don’t remember your password, you can reset your password using the
email associated with your profile in VSWS HMS Portal – vsws.co.in. District authorities will provide
the email along with the username. If your email is wrongly mapped, please contact
support@vsws.co.in

Once you login the first time, it will ask you to change your password, setup your profile which includes adding your mobile number and email address.

GSWS - Consistent Rhythms App Latest Version Download
GSWS – Consistent Rhythms App Latest Version Download

Consistent Rhythms App download

Ayodhya Ram Mandir : అయోధ్యలో హై అలర్ట్ … ముగ్గురు ఉగ్ర అనుమానితుల అరెస్ట్

అయోధ్య : ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు, ఇతర రంగాలకు చెందిన సెలెబ్రిటీలు జనవరి 22న ఒక్కచోటికి చేరనున్నారు.
అతిరథ మహారథుల సమక్షంలో రామ జన్మభూమి అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మందిర ప్రాణప్రతిష్ట (ప్రారంభోత్సవ) కార్యక్రమం జరగనుంది. ఇలాంటి సమయంలో అయోధ్యలో ముగ్గురు ఉగ్రవాద అనుమానితుల అరెస్ట్ ఒక్కసారిగా కలకలం రేపింది. ఇప్పటికే అయోధ్యను తమ ఆధీనంలోకి తీసుకున్న భద్రతా బలగాలు గురువారం రాత్రి చేపట్టిన తనిఖీల్లో ముగ్గురు అనుమనితులు పట్టుబడ్డారు.

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా యూపీ పోలీసులతో పాటు కేంద్ర బలగాలు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేసాయి. రామమందిర ప్రాంగణం, ప్రముఖులు బసచేసే ప్రాంతాల్లోనే కాదు అయోధ్య మొత్తం బద్రతా బలగాల పహారా కాస్తున్నాయి. ఈ క్రమంలోనే ముగ్గురు అనుమానితులను యూపీ యాంటి టెర్రరిస్ట్ స్వాడ్ అదుపులోకి తీసుకుంది. వీరికి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలేమైనా వున్నాయేమోనని అనుమానిస్తున్నారు.

పట్టుబడిన వారిలో ఒకరు రాజస్థాన్ కు చెందిన ధర్మవీర్ గా గుర్తించారు. మిగతా ఇద్దరు అనుమానితుల వివరాలు తెలియాల్సి వుంది. వీరు అయోధ్యకు ఎందుకు వచ్చారు? ఏమైనా అలజడి సృష్టించేందుకు కుట్రలు పన్నారా? వీరి వెనకున్నది ఎవరు? తదితర విషయాలు తెలుసుకునేందుకు ఏటిఎస్ తో పాటు వివిధ విభాగాలకు చెందిన భద్రతా సిబ్బంది విచారణ చేపట్టారు.
ఇదిలావుంటే అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమంకోసం ఇప్పటికే భద్రతా చర్యలు చేపట్టారు. పదివేలమందికి పైగా రాష్ట్ర, కేంద్ర బలగాలు అయోధ్యలో విధులు నిర్వహిస్తున్నారు. 100 మందికి పైగా డిఎస్పీలు, 320 మంది సిఐలు, 800 మంది ఎస్సైలు, వేలాదిమంది కానిస్టేబుల్స్ అయోధ్యలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ భద్రతా వ్యవహారాలను యూపీ స్పెషల్ డిజిపి ప్రశాంత్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు.
ఇక హ్యూమన్ ఇంటెలిజెన్స్ తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే దాదాపు 10వేలకు పైగా సిసి కెమెరాలను అయోధ్య మొత్తం ఏర్పాటుచేసారు. అలాగే డ్రోన్ కెమెరాలను కూడా భద్రత కోసం ఉపయోగిస్తున్నారు. ఇక ఎలాంటి పరిస్థితులను అయినా ఎదుర్కొనేందుకు ఎయిర్ ఫోర్స్ ను సిద్దం చేసారు. ఇలా అయోధ్యలో చీమ చిటుక్కుమన్నా తమకు తెలిసేలా యూపీ పోలీసులు, కేంద్ర బలగాలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.

TANA 2024 elections : తానా ఎన్నికల్లో కొడాలి టీం విజయం..

TANA 2024 elections : అమెరికాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) 2023 ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడ్డాయి. ఎన్నికల కమిటీ అధ్యక్షుడు ఐనంపూడి కనకంబాబు ఫలితాలను ప్రకటించారు.
తానా తదుపరి అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాకు చెందిన వర్జీనియా ప్రవాసుడు డా. నరేన్ కొడాలి ఎన్నికయ్యారు. ఎన్నికల్లో నరేన్‌కు 13,225 ఓట్లు రాగా, ఆయన ప్రత్యర్థి వేమూరి సతీష్‌కు 10,362 ఓట్లు లభించాయి. 20ఏళ్లుగా తానాలో రాజ్యసభ పదవులే గానీ లోక్‌సభ పద్ధతిలో పదవి దక్కలేదని విమర్శించేవారు. కానీ 2023 ఎన్నికల్లో నరేన్‌ ను తొలిసారి విజయం వరించింది. గతంలో నిరంజన్ శృంగవరపు చేతిలో అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే 2023లో సెలక్షన్ పద్ధతిలో అధ్యక్షుడిగా నియమితులయ్యారు. కోర్టు కేసుల నేపథ్యంలో తానాకు మళ్లీ ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల్లో నరేన్ తన అస్త్రాలు అన్నింటినీ ఉపయోగించి సఫలీకృతం అయ్యారు. తన అధ్యక్ష పీఠం అధిరోహించబోతున్నారు.

ప్యానల్ సభ్యుల గెలుపు..

ఎన్నికల్లో నరేన్ విజయం సాధించడమే కాకుండా తన ప్యానెల్ సభ్యులను విజయతీరాలకు చేర్చారు. కోమటి, నాదెళ్ల, వేమన, నన్నపనేని, గోగినేని వంటి మాజీల నుంచి ఆయనకు మద్దతు లభించింది. దీంతో ఎన్నికల్లో విజయం నరేన్ ను వరించింది. నరేన్ ప్యానెల్ నుంచి కార్యదర్శిగా కసుకుర్తి రాజా గెలుపొందారు. ఈ ఎన్నికలకు కారణమైన వేమూరి ప్యానెల్ నుంచి కోశాధికారిగా పోటీ చేసిన తాళ్లూరి మురళీ నరేన్ ప్యానెల్ నుంచి పోటీలో ఉన్న మద్దినేని భరత్ చేతిలో 2,210 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

– కల్చరల్ సర్వీస్ కోఆర్డినేటర్ గా డా.ఉమా ఆరమండ్ల కటికి గెలుపు

తానా ఎన్నికల్లో నరేన్ కొడాలి టీం తరఫున ‘కల్చరల్ సర్వీస్ కోఆర్డినేటర్ గా పోటీ చేసిన డా. ఉమా ఆరమండ్ల కటికి ఘన విజయం సాధించారు. ఉమా గారికి 12638 ఓట్లు రాగా.. ప్రత్యర్థి రజినీకాంత్ కక్కెర్లకు 10854 ఓట్లు వచ్చాయి.

ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల కోసం..

ప్రజాస్వామ్యానికి దాని ఆధారభూతమైన ఎన్నికలకు తాను ఎప్పుడూ వ్యతిరేకిని కానని “విధేయత-విశ్వసనీయత-ప్రభావవంతమైన సేవ” అనే నినాదంతో నరేన్ ఎన్నికల బరిలో నిలిచి విజయ శంఖారావం పూరించారు. ఎన్నికల సందర్భంగా తానాకు అమెరికాలో శాశ్వత భవనం నిర్మించేందుకు తన సొంత నిధులు లక్ష డాలర్లు విరాళంగా అందించారు. రెండున్నర లక్షల డాలర్లు విరాళాలు సమీకరించి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. తానాలో ఎక్కువగా F1-H1 వీసాలపై అమెరికాకు వలస వచ్చినవారు ఉన్నారని తెలిపారు. వీరికి ప్రత్యేకంగా లాయర్లను నియమించే శాశ్వత న్యాయసేవల విభాగాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. దీనికి తన సొంత నిధులు $50వేల డాలర్లు విరాళంగా అందిస్తానని వెల్లడించారు.

అమెరికాలో పుట్టిన యువతకు..

అమెరికాలోనే పుట్టి పెరిగిన యువతకు కూడా తానాకు చేరువ చేసే ప్రణాళికలో భాగంగా పోటీ పరీక్షలకు మార్గనిర్దేశకత్వం, శిక్షణ, సన్నద్ధత వంటి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. దీనికి తన సొంత నిధులు $50వేల డాలర్లను మూలధనంగా విరాళం రూపంలో అందజేస్తానని, ఆచార్యుడిగా తన అనుభవంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తానని పేర్కొన్నారు. ఇక ఈసారి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, ఆశ్రిత పక్షపాతానికి దూరంగా, పారదర్శకంగా జరిగిన ఈ ఎన్నికలు తానాలో నూతన శకమని అభివర్ణించారు.

విజేతల వీరే..

ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ – నరేన్‌ కొడాలి
కార్యదర్శి – రాజా కసుకుర్తి
ట్రెజరర్‌ – భరత్‌ మద్దినేని
జాయింట్‌ సెక్రటరీ…వెంకట్‌ కోగంటి
జాయింట్‌ ట్రెజరర్‌…సునీల్‌ పాంట్ర
కమ్యూనిటీ సర్వీస్‌ కో ఆర్డినేటర్‌…లోకేష్‌ నాయుడు కొణిదెల
కల్చరల్‌ సర్వీస్‌ కో ఆర్డినేటర్‌….ఉమా ఆరమండ్ల కటికి
ఉమెన్‌ సర్వీసెస్‌ కో ఆర్డినేటర్‌…సోహ్ని అయినాల
కౌన్సిలర్‌ ఎట్‌ లార్జ్‌….సతీష్‌ కొమ్మన
ఇంటర్నేషనల్‌ కో ఆర్డినేటర్‌….టాగూర్‌ మల్లినేని
స్పోర్ట్స్‌ కో ఆర్డినేటర్‌…నాగ పంచుమర్తి

 రీజినల్‌ రిప్రజెంటేటివ్‌లు..

సౌత్‌ ఈస్ట్‌ …మధుకర్‌ యార్లగడ్డ
అప్పలాచియాన్‌…రాజేష్‌ యార్లగడ్డ
న్యూఇంగ్లాండ్‌…కృష్ణ ప్రసాద్‌ సోంపల్లి
నార్త్‌…నీలిమ మన్నె
నార్త్‌ సెంట్రల్‌…శ్రీమాన్‌ యార్లగడ్డ
సదరన్‌ కాలిఫోర్నియా….హేమ కుమార్‌ గొట్టి
నార్త్‌ కాలిఫోర్నియా….వెంకట్‌ అడుసుమిల్లి
నార్త్‌ వెస్ట్‌…. సురేష్‌ పాటిబండ్ల
క్యాపిటల్‌…సతీష్‌ చింత
మిడ్‌ అట్లాంటిక్‌…వెంకట్‌ సింగు
సౌత్‌ వెస్ట్‌….సుమంత్‌ పుసులూరి
డిఎఫ్‌డబ్ల్యు…పరమేష్‌ దేవినేని
న్యూజెర్సి….రామకృష్ణ వాసిరెడ్డి
న్యూయార్క్‌…దీపిక సమ్మెట
ఓహాయోవ్యాలీ…శివ చావా

బోర్డ్‌ డైరెక్టర్స్‌..

శ్రీనివాస్‌ లావు
రవి పొట్లూరి
మల్లిఖార్జున వేమన

ఫౌండేషన్‌ ట్రస్టీస్‌..

రామకృష్ణ చౌదరి అల్లు
భక్త బల్ల
శ్రీనివాస్‌ కూకట్ల
రాజా సూరపనేని
శ్రీనివాస్‌ ఎండూరి

ఎప్పుడూ హ్యాపీగా ఉండాలా..? ఇవి తింటే చాలు..!

సంతోషంగా ఉండటం అంటే… కొన్ని రకాల ఫుడ్స్ తినడం వల్ల…మన శరీరంలో హ్యాపీ హార్మోన్లు విడుదల అవుతాయి. వాటిని తినడం ల్ల.. హ్యాపీగా అవుతాయట. మంచి మూడ్ బూస్టింగ్ ట్రీట్ ని అందించే ఆహారాలు ఏంటో ఓసారి చూద్దాం..
ఎప్పుడూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలనే కోరిక ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. అందరూ అదే కోరుకుంటారు. అయితే.. మనం తీసుకునే ఆహారం మీద మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అందంగా కనిపించేలా చేసే ఆహారాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. కానీ మిమ్మల్ని ఎప్పుడూ సంతోషంగా కూడా ఉంచే ఆహారాలు ఉన్నాయంటే నమ్ముతారా? అవును.. మీరు చదివింది నిజమే.. కొన్ని రకాల ఆహారాలు తినడం వల్ల మనం సంతోషంగా ఉంటాం. సంతోషంగా ఉండటం అంటే… కొన్ని రకాల ఫుడ్స్ తినడం వల్ల…మన శరీరంలో హ్యాపీ హార్మోన్లు విడుదల అవుతాయి. వాటిని తినడం ల్ల.. హ్యాపీగా అవుతాయట. మంచి మూడ్ బూస్టింగ్ ట్రీట్ ని అందించే ఆహారాలు ఏంటో ఓసారి చూద్దాం..

1. పుట్టగొడుగులు

పుట్టగొడుగుల్లో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ఈ పుట్టగొడుగుల్లో యాంటిడిప్రెసెంట్ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. మానసిక స్థితిని నియంత్రించడంలో విటమిన్ డి కీలక పాత్ర పోషిస్తుంది. సెరోటోనిన్ సంశ్లేషణతో సంబంధం కలిగి ఉంటుంది, ఇది మీ భావోద్వేగ స్థితిని సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. సూప్‌ల నుండి రుచికరమైన స్టైర్-ఫ్రైస్ వరకు చాలా వంటలు చేసుకోవచ్చు. వీటిని తినడం వల్ల.. హ్యాపీ హార్మోన్లు పెరుగుతాయి.

2. అవకాడో

అవకాడోలు కూడా పోషకాలతో నిండి ఉంటాయి. వీటిలో విటమిన్ బి3, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలతో నిండిన అవకాడోలు సెరోటోనిన్ ఉత్పత్తికి దోహదం చేస్తాయి. మానసిక స్థితి మెరుగుదలకు శాస్త్రీయంగా అనుసంధానించారు. అవోకాడోలను సలాడ్‌లు, శాండ్‌విచ్‌లు లేదా స్వతంత్ర చిరుతిండిగా చేర్చి మీ రోజులో ఆనందాన్ని నింపండి.

3. చెర్రీ టమోటాలు

చిన్నదైన ఇంకా శక్తివంతమైన, చెర్రీ టొమాటోలు లైకోపీన్‌ను కలిగి ఉంటాయి, ఇది మూడ్-బూస్టింగ్ లక్షణాలతో అనుబంధించబడిన ఫైటోన్యూట్రియెంట్. లైకోపీన్ యాంటీ ఆక్సిడెంట్ ప్రభావాలను కలిగి ఉంటుంది. డిప్రెషన్ లక్షణాలను తగ్గించడంలో దోహదపడుతుంది, చెర్రీ టొమాటోలను మీ ఆహారంలో రంగుల, ప్రయోజనకరమైన అదనంగా చేస్తుంది. వాటిని సలాడ్‌లు, పాస్తా లేదా రిఫ్రెష్ స్నాక్‌లో ఆస్వాదించండి.

4. డార్క్ చాక్లెట్

డార్క్ చాక్లెట్‌తో మీ స్వీట్ టూత్‌ను సంతృప్తి పరచండి, ఇది కోరికలను తీర్చడంతో పాటు మీ ఉత్సాహాన్ని పెంచుతుంది. డార్క్ చాక్లెట్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు మీ మూడ్‌ని పెంచే సహజ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అదనంగా, ఇది ట్రిప్టోఫాన్‌ను కలిగి ఉంటుంది, ఇది సెరోటోనిన్‌కు పూర్వగామి, ఆనందం, విశ్రాంతి భావాలకు దోహదం చేస్తుంది. అపరాధం లేని రిఫ్రెష్‌మెంట్ కోసం మీకు ఇష్టమైన డార్క్ చాక్లెట్‌ని ఎంచుకోండి.

5. నట్స్

కొన్ని బాదం లేదా వాల్‌నట్‌లు సంతృప్తికరమైన క్రంచ్‌ను అందించడమే కాకుండా సెరోటోనిన్‌కు పూర్వగామి అయిన ట్రిప్టోఫాన్‌ను కూడా అందిస్తాయి. ఈ గింజలు యాంటీఆక్సిడెంట్లతో కూడా నిండి ఉంటాయి, ఇది నిరాశ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పోషకమైన మరియు మూడ్-బూస్టింగ్ కాటు కోసం భోజనం మధ్య వాటిని అల్పాహారం లేదా సలాడ్‌లలో జోడించండి.

6.పాలకూర..

పాలకూర దాని పోషక విలువలకు మించి ఉంటుంది. ఫైబర్, విటమిన్ ఇ, ఇతర ముఖ్యమైన పోషకాలతో నిండిన బచ్చలికూర ఆరోగ్యకరమైన హార్మోన్ ఉత్పత్తి, పనితీరుకు మద్దతు ఇస్తుంది. సలాడ్‌లు, స్మూతీలు లేదా సాట్‌లలో అయినా, మీ భోజనానికి మూడ్-పెంచే పోషకాలను పెంచడానికి పాలకూర తినాలి.

7. బెర్రీలు

స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్ , రాస్ప్బెర్రీస్తో సహా బెర్రీలు రుచికరమైనవి మాత్రమే కాకుండా యాంటీఆక్సిడెంట్లు , విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు మెరుగైన మానసిక స్థితి , డిప్రెషన్ తగ్గిన లక్షణాలతో ముడిపడి ఉంటాయి, బెర్రీలు మీ ఆహారంలో రంగుల , సంతోషకరమైన అదనంగా ఉంటాయి. వాటిని స్నాక్‌గా, స్మూతీస్‌లో లేదా మీ మార్నింగ్ ఓట్స్‌కి టాపింగ్స్‌గా ఆస్వాదించండి.

8. అరటిపండ్లు

అరటిపండ్లు విటమిన్ B6 అనుకూలమైన , రుచికరమైన మూలం, సెరోటోనిన్ , డోపమైన్ ఉత్పత్తికి అవసరమైన పోషకం. మానసిక స్థితి , ఆనందాన్ని నియంత్రించడంలో ఈ న్యూరోట్రాన్స్మిటర్లు కీలక పాత్ర పోషిస్తాయి. అరటిపండుతో మీ రోజును ప్రారంభించండి, స్మూతీస్‌లో మిళితం చేయండి లేదా మీ ఉత్సాహాన్ని పెంచుకోవడానికి త్వరిత మరియు పోషకమైన అల్పాహారంగా ఆనందించండి.
9. ఓట్స్

ఓట్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్, కేవలం హృదయపూర్వక అల్పాహారం కంటే ఎక్కువ అందిస్తుంది. అవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి, రోజంతా శక్తి స్థిరమైన విడుదలను అందిస్తాయి. అదనంగా, వోట్స్‌లో మెగ్నీషియం ఉంటుంది, ఇది మానసిక స్థితిని ప్రభావితం చేసే జీవరసాయన ప్రతిచర్యలలో పాల్గొంటుంది, ఇది వాటిని ఓదార్పునిచ్చే , మానసిక స్థితిని స్థిరీకరించే ఆహార ఎంపికగా చేస్తుంది. మూడ్-బూస్టింగ్ అనుభవం కోసం రాత్రిపూట ఓట్స్, ఓట్ మీల్ లేదా బేకింగ్‌లో వోట్స్‌తో ప్రయోగం చేయండి.

విటమిన్ డి ఉండే డ్రై ఫ్రూట్స్ ఇవి.. చలికాలంలో వీటిని అస్సలు మిస్ అవ్వకండి

విటమిన్ డి( Vitamin D ).. మన శరీరానికి అత్యంత అవసరమయ్యే పోషకాల్లో ఒకటి. విటమిన్ డిని ప్రధానంగా సూర్యరశ్మి ద్వారా పొందుతాము. అయితే ప్రస్తుత చలికాలంలో ఎండ చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది.
ఈ క్రమంలోనే వింటర్ సీజన్ లో విటమిన్ డి లోపానికి గురవుతుంటారు. ఈ లోపాన్ని పూడ్చాలంటే విటమిన్ డి ఉండే ఆహారాన్ని డైట్ లో చేర్చుకోవాలి. అయితే ఇప్పుడు చెప్పబోయే డ్రై ఫ్రూట్స్( Dry fruits ) లో విటమిన్ డి ఉంటుంది. భారీ మొత్తంలో కాకపోయినా ఈ డ్రై ఫ్రూట్స్ లో చిన్న మొత్తంలో విటమిన్ డి ఉంటుంది.

ఈ డ్రై ఫ్రూట్స్ లో నిత్యం కనుక తీసుకుంటే విటమిన్ డి లోపానికి దూరంగా ఉండవచ్చు. మరి ఇంతకీ విటమిన్ డి కలిగి ఉన్న ఆ డ్రై ఫ్రూట్స్ ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

డ్రై ఆప్రికాట్స్( Apricots ).. విటమిన్ డి లభించే ఆహారాల్లో ఒకటి. రోజుకు రెండు నుంచి మూడు డ్రై ఆప్రికాట్స్ ను తీసుకుంటే విటమిన్ డి తో పాటు పొటాషియం, ఐరన్, ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా లభిస్తాయి. డ్రై ఆప్రికాట్స్ ను డైట్ లో చేర్చుకుంటే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. కంటి చూపు రెట్టింపు అవుతుంది. స్కిన్ హెల్తీ గా మారుతుంది.

అలాగే చలికాలంలో విటమిన్-డి కోసం మీరు డ్రై అంజీర్( Dry fig ) ను ఎంచుకోవచ్చు. నిత్యం రెండు నానబెట్టిన అంజీర్‌ను తీసుకుంటే విటమిన్ డి లోపానికి గురికాకుండా ఉంటారు. అదే సమయంలో అధిక బరువు సమస్య దూరం అవుతుంది. ఎముకలు బలోపేతం అవుతాయి. దంపతుల్లో సంతాన సమస్యలు తగ్గుతాయి. బాదం పప్పులో(almonds ) కూడా కొద్ది మొత్తంలో విటమిన్ డి ఉంటుంది. అందువల్ల నిత్యం 5 బాదం పప్పులను నానబెట్టి తీసుకోవాలి. బాదం పప్పు బ్రెయిన్ ను షార్ప్ గా మారుస్తుంది. మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే రిస్క్ ను తగ్గిస్తుంది. ఎనర్జీ లెవెల్స్ ను రెట్టింపు చేస్తుంది. జీర్ణక్రియను చురుగ్గా మారుస్తుంది. ఇక ఎండు ద్రాక్షలో కూడా విటమిన్ డి ఉంటుంది.
నిత్యం పది ఎండుద్రాక్షలను తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా విటమిన్ డి లోపానికి దూరంగా ఉండవచ్చు. అదే సమయంలో ఎండు ద్రాక్ష మలబద్ధకాన్ని నివారిస్తుంది. చర్మాన్ని యవ్వనంగా కాంతివంతంగా మెరిపిస్తుంది. జుట్టు రాలడాన్ని సైతం నిరోధిస్తుంది.

Beauty Tips పెదవులు నల్లగా ఉన్నాయా? – ఈ టిప్స్​తో గులాబీ రేకుల్లా మారిపోతాయి!

Beauty Tips పెదవులు నల్లగా ఉన్నాయా? – ఈ టిప్స్​తో గులాబీ రేకుల్లా మారిపోతాయి!

Home Remedies for Natural Pink Lips: కారణం ఏదైనా కావొచ్చు.. చాలా మంది పెదవులు నిర్జీవంగా తయారై నల్లగా మారుతుంటాయి. ఆ నలుపుదనం తగ్గించుకోవడానికి ఏవేవో బ్యూటీ ప్రొడక్ట్స్​ వాడతారు.
అయినా నో యూజ్​..! అయితే, ఈ సమస్యకు కేవలం ఇంట్లో ఉన్న పదార్థాలతో చెక్ పెట్టొచ్చని మీకు తెలుసా..?

Tips for Natural Pink Lips: లిప్స్ ఆరోగ్యంగా ఉంటేనే.. అవి అందంగా కనిపిస్తాయి. ముఖ్యంగా అమ్మాయిల అందాన్ని మరింత రెట్టింపు చేసేవి వారి పెదవులే. అయితే.. కొన్ని కారణాలతో పెదాలు నిర్జీవంగా మారుతుంటాయి. మరీ ముఖ్యంగా చలికాలంలో.. పొడిబారడం, పగుళ్లు ఏర్పడటం లాంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఈ కారణంగా నలుగురు ముందుకు వెళ్లాలంటే ఇబ్బంది పడతారు. మీరు కూడా ఈ పరిస్థితిని ఫేస్ చేస్తున్నట్టయితే.. ఈ సింపుల్ టిప్స్ తో గులాబీ రేకుల్లాంటి పెదాలను మీసొంతం చేసుకోండి.

పెదవులు ఎందుకు నల్లగా మారతాయి?: రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవటం, తీవ్ర మానసిక ఒత్తిడి, డ్రగ్స్, స్మోకింగ్ వంటి వాటివల్ల పెదాలు నలుపు రంగులోకి మారుతుంటాయి. హైపర్ పిగ్మెంటేషన్ లేదా మెలస్మా వంటివి కూడా పెదాలు నల్లబడటానికి కారణం కావచ్చు. ఇంకా.. ఎనీమియా అంటే రక్తహీనతతో బాధపడేవారి పెదాలు ఇలా ఉండవచ్చు. వేడి టీ, కాఫీలు అతిగా తాగేవారికి కూడా పెదవులు నల్లబడతాయి. ఈ సమస్యకు పరిష్కారం.. మీరు ఓ 15 నిమిషాలు సమయం కేటాయించడమే!

లిప్​స్టిక్ : రెగ్యులర్‌గా లిప్‌స్టిక్‌ వాడేవాళ్ల పెదాలు నల్లగా మారుతుంటాయి. అందువల్ల లిప్‌స్టిక్‌ను ఎక్కువసేపు ఉంచుకోవద్దు. బయటి నుంచి రాగానే ఆలివ్‌ ఆయిల్‌ లేదా బాదం ఆయిల్‌తో లిప్‌స్టిక్‌ను తొలగించుకోవాలి.

కొబ్బరినూనె, తేనె, చక్కెరతో ఎక్స్ ఫోలియేట్: షుగర్​లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల పెదాలను ఎండ నుంచి కాపాడుతాయి. మాయిశ్చరైజింగ్​తో పాటు తేనెలోని ఎంజైమ్​లు పెదవుల రంగుని ప్రకాశవంతంగా మార్చడంలో సహాయపడతాయి. కొంచెం కొబ్బరినూనె తీసుకుని.. ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక టేబుల్ స్పూన్ బ్రౌన్ షుగర్ లేదా వైట్ షుగర్ వేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని బాగా కలిపి పెదాల మీద స్క్రబ్ చేసుకోవాలి. వారానికి 2-3 సార్లు ఉపయోగించవచ్చు. ఇది పెదవులపై చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. పెదాలను మృదువుగా, అందమైన రంగులోకి మారుస్తుంది.
పాలు పసుపు ప్యాక్: పాలు, పసుపు కలిసి పెదవులు పాలిపోకుండా చేస్తాయి. సహజంగా పింక్ పెదాలను ఇస్తాయి. ఈ పేస్ట్​ని స్క్రబ్ చేయడం వల్ల మృతకణాలు తొలగిపోతాయి. ఒక టీ స్పూన్ పాలు, అర టీ స్పూన్ పసుపు కలపాలి. ఈ మిశ్రమాన్ని పెదాలకు రాసుకుని ఐదు నిమిషాల పాటు ఉంచుకోవాలి. పేస్ట్ ఆరిన తర్వాత సున్నితంగా కడగాలి. గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకున్నాక మాయిశ్చరైజింగ్ లిప్ బామ్​ను అప్లై చేసుకోవాలి.
అలోవెరా జెల్: అలోవెరాలో అధిక మొత్తంలో విటమిన్ ఇ ఉంటుంది. ఇది తేమని తిరిగి నింపడంలో సహాయపడుతుంది. పగిలిన, పొడి బారిన పెదాలను పునరుద్ధరించడంలో సహాయపడుతుంది. పెదాలను పింక్ కలర్​లోకి మార్చేస్తుంది. ఇందుకోసం.. తాజా కలబంద జెల్ బయటకి తీసుకోవాలి. కొబ్బరి లేదా ఆలివ్ నూనె రెండు చుక్కలు అందులో వేసుకోవాలి. ఒక గిన్నెలో పెట్టుకుని దాన్ని ఫ్రిజ్ లో పెట్టుకుని నిల్వ చేసుకోవచ్చు. ప్రతిరోజు ఎన్ని సార్లు అయినా దీన్ని రాసుకోవచ్చు.
రోజ్​ వాటర్​: రోజ్​ వాటర్​ ప్రతిరోజూ పెదాలకు రాసుకోవడం వల్ల లేత గులాబీ రంగులోకి మారతాయి.

నెయ్యి: పెదవులు పగిలి బాధ పెడుతుంటే నెయ్యి కొద్దిగా వేడి చేసి, పెదవులపై మృదువుగా పూయాలి. ఇరవై నిమిషాల పాటు అలానే ఉంచి, గోరువెచ్చని నీటితో కడగాలి. క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల సమస్య తగ్గిపోతుంది.

స్ట్రాబెర్రీ: స్ట్రాబెర్రీని పేస్ట్‌లా చేసి, అందులో కాస్త పాల క్రీమ్ వేసి కలపాలి. దీన్ని పడుకోబోయేముందు పెదవులకు అప్లై చేసి, ఉదయాన్నే శుభ్రంగా కడుక్కోవాలి. నల్లని పెదవులు ఉన్నవారు తరచూ ఇలా చేస్తూ ఉంటే.. నలుపు పోయి, పెదవులు గులాబీ రంగులోకి మారతాయి.

Lungs : ఇలా చేస్తే ఊపిరితిత్తులు కఫము, శ్లేష్మం లేకుండా క్లీన్ గా ఉంటాయి.ముఖ్యంగా ఈ సీజన్ లో.

Lungs clean in Telugu : ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మన ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కరోనా అనేది ఊపిరితిత్తులపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది.
ఊపిరితిత్తులు ఆరోగ్యంగా దృఢంగా ఉంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ద తప్పనిసరిగా పెట్టాలి.

గాలిలో ఉండే విషపదార్థాలు., కాలుష్య కారకాలు, పొగ తాగే అలవాటు, కొన్ని అనారోగ్య ఆహారపు అలవాట్ల కారణంగా ఊపిరితిత్తులు బలహీనంగా మారతాయి.

ఊపిరితిత్తులు ఆరోగ్యంగా బలంగా, ఉండాలంటే ఇలా సింపుల్ గా క్లీన్ చేసుకోవచ్చు. ఊపిరితిత్తులు క్లీన్ గా ఆరోగ్యంగా ఉండాలి అంటే కొన్ని ఆహారాలు తీసుకుంటే మంచిది.

ఆరెంజ్ రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ సి ఊపిరితిత్తుల ఆక్సిజన్ శోషణ సామర్థ్యాన్ని బాగా పెంచుతుంది.

దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వల్ల శ్వాస సమస్యల చికిత్సకు అద్భుతంగా పనిచేస్తుంది. ఉల్లిపాయలు కూడా ఊపిరితిత్తుల ఆరోగ్యానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి.

అలాగే ఆపిల్ లో ఉండే ఫ్లేవనాయిడ్స్, విటమిన్ బి, సి, ఇ ఊపిరితిత్తుల ఆరోగ్యానికి సహాయపడతాయి.

ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగితే ఊపిరితిత్తుల్లో కఫము,శ్లేష్మం లేకుండా శుభ్రం అవుతాయి. ఉదయాన్నే కొన్ని పుదీనా ఆకులను తిన్నా ఊపిరితిత్తులు శుభ్రం అవుతాయి.

వ్యాయామం, ప్రాణాయామం చేయటం వలన లంగ్స్ కెపాసిటీ బాగా పెరిగి శ్వాస సంబంధిత సమస్యలు తొలగిపోతాయి.

కాబట్టి ఇటువంటి ఆహారాలను తీసుకుంటే ఊపిరితిత్తులు క్లీన్ గా ఉంటాయి. ఈ సీజన్ లో తరచుగా ఇన్ ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి.

కాస్త జాగ్రత్తగా ఉండాలి. మందుల జోలికి వెళ్లకుండా ఇలా చిట్కాలను ఫాలో అవ్వవచ్చు.

Sonti Kashayam Recipe : ఊపిరితిత్తులను శుభ్రం చేసే చక్కని ఔషధం ఇది.. చలికాలంలో రోజూ ఒక కప్పు తాగాలి.. ఎలా చేయాలంటే..?

Sonti Kashayam Recipe : ఊపిరితిత్తులను శుభ్రం చేసే చక్కని ఔషధం ఇది.. చలికాలంలో రోజూ ఒక కప్పు తాగాలి.. ఎలా చేయాలంటే..?

Sonti Kashayam Recipe : చలికాలంలో మనకు సహజంగానే అనేక ఊపిరితిత్తుల సమస్యలు వస్తుంటాయి. ఈ సీజన్‌లో చలి అధికంగా ఉంటుంది కనుక ఊపిరితిత్తుల్లో కఫం బాగా చేరుతుంది.
అది మనల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. దీని కారణంగా దగ్గు, జలుబు, ఆస్తమా వస్తాయి. అప్పటికే ఆస్తమా ఉన్నవారికి అయితే చలికాలంలో మరిన్ని ఇబ్బందులు వస్తాయి. ఊపిరి పీల్చడమే కష్టంగా ఉంటుంది. ఇవన్నీ ఒక పట్టాన తగ్గవు. అయితే చలికాలంలో శొంఠి కషాయాన్ని తాగడం అలవాటు చేసుకోవాలి. ఇది ఊపిరితిత్తుల సమస్యలకు చక్కని ఔషధంగా పనిచేస్తుంది. ఈ సీజన్‌లో శొంఠి కషాయాన్ని తాగడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి.

శొంఠి కషాయాన్ని తాగితే ఊపిరితిత్తులు కడిగేసినట్లు శుభ్రమవుతాయి. దెబ్బకు కఫం మొత్తం బయటకు వస్తుంది. దీంతో దగ్గు, జలుబు తగ్గుతాయి. అలాగే ఆస్తమా బాధించదు. శ్వాస కూడా సరిగ్గా ఆడుతుంది. అయితే శొంఠి కషాయాన్ని చేయడం కూడా సులభమే. ఇందుకు పెద్దగా కష్ట పడాల్సిన పనిలేదు. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
శొంఠి కషాయం తయారీకి కావల్సిన పదార్థాలు..

శొంఠి – రెండు అంగుళాల ముక్క, మిరియాలు – 15, తాటి బెల్లం – 4 టీస్పూన్లు, జీలకర్ర పొడి – ఒక టీస్పూన్‌, ధనియాలు – ఒక టీస్పూన్‌, తులసి ఆకులు – గుప్పెడు, నీళ్లు – రెండు కప్పులు.

శొంఠి కషాయాన్ని తయారు చేసే విధానం..

శొంఠి, ధనియాలు, జీలకర్ర, మిరియాలను మెత్తగా దంచుకోవాలి. ఈ మిశ్రమాన్ని బెల్లంతో సహా నీళ్లలో కలిపి అనంతరం ఆ నీటిని స్టవ్‌పై మరిగించాలి. మిశ్రమాన్ని మూడు వంతులు అయ్యే వరకు మరిగించాలి. తరువాత తులసి ఆకులను వేయాలి. అనంతరం 2 నిమిషాల పాటు మరిగించి స్టవ్‌ను ఆఫ్ చేయాలి. తరువాత ఈ మిశ్రమాన్ని వడకట్టి గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి. దీన్ని ఇలా తయారు చేసి రోజుకు ఒక కప్పు మోతాదులో ఎప్పుడైనా తీసుకోవచ్చు. ముఖ్యంగా రాత్రి పూట ఇలా తాగితే కఫం సమస్య అన్నది ఉండదు. ఊపిరి సరిగ్గా అందుతుంది. దగ్గు, జలుబు, ఆస్తమా సమస్యలు ఉండవు. చిన్నారులకు కూడా దీన్ని ఇవ్వవచ్చు. కాకపోతే అందులో కాస్త తేనె కలిపి మిశ్రమాన్ని పలుచగా చేసి ఇవ్వాలి. దీంతో వారిలో కూడా ఊపిరితిత్తుల సమస్యలు ఉండవు. ఊపిరితిత్తులు క్లీన్ అవుతాయి. దీన్ని చలికాలంలో రోజూ తాగితే ఎంతో మేలు జరుగుతుంది.

Drinking Water: పళ్ళు తోముకుండా ఉదయాన్నే నీటిని తాగితే ఏం జరుగుతుంది తెలుసా?

చాలామంది ప్రతిరోజూ ఉదయం లేవగానే పళ్ళు శుభ్రం చేసుకోక ముందే నీటిని తాగడం అలవాటు. కొంతమంది మాత్రం పళ్ళు తోమిన తర్వాత నీళ్లు తాగడం ఏదైనా తినడం కాఫీ తాగడం లాంటివి చేస్తూ ఉంటారు.
కానీ ఉదయాన్నే పళ్ళు తోమకుండా నీటిని తాగడం మంచి అలవాటేనా అన్న సందేహం కొంతమందికి కలుగుతూ ఉంటుంది. అలా చేయడం వల్ల ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తాయా అని ఆలోచిస్తూ భయపడుతూ ఉంటారు.

మన పెద్దలు ఖాళీ కడుపుతో గ్లాస్ గోరువెచ్చని నీళ్లను తాగమని సలహానిస్తుంటారు. రెగ్యులర్ గా నీళ్లను ఇలా తాగితే మన శరీరం నుంచి విషపదార్థాలు తొలగిపోవడంతో పాటుగా జీర్ణక్రియ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మరి నిజంగానే అది నిజమేనా వైద్యులు ఏం చెబుతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కాగా జపనీస్ వారు ఉదయం నిద్ర లేవగానే బ్రష్ చేసుకోకుండా రెండు మూడు గ్లాసుల వేడి నీటిని తాగుతారు. ఈ విధంగా చేయడం వల్ల ఎటువంటి హాని జరగదు. వైద్యులు కూడా ఉదయం నిద్ర లేచిన వెంటనే వేడి నీళ్లను తాగమని చెబుతూ ఉంటారు.

అయితే ఉదయం లేచిన వెంటనే నోటిలో బ్యాక్టీరియా ఉంటుందని అప్పుడు నీళ్లు తాగితే ఆ బాక్టీరియా మన కడుపులోకి చేరుతుందని చాలామంది అనుకుంటూ ఉంటారు.

అయితే ఈ విషయంపై శాస్త్రీయ ఆధారాలు ఏమీ లేవు. పళ్లు తోముకోకుండా నీటిని తాగినప్పుడు నోటిలో ఉండే బ్యాక్టీరియా లాలాజలం ద్వారా కడుపులోకి వెళుతుంది.

కానీ దానిలో ఉండే అధిక అమ్ల కంటెంట్ వల్ల బ్యాక్టీరియా చనిపోతుంది. కాబట్టి పళ్లను తోముకోకున్నా నీళ్లను తాగవచ్చు. ప్రతిరోజు ఉదయాన్నే పళ్ళు శుభ్రం చేసుకోకుండా నీటిని తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

అంతేకాకుండా జలుబు సాధారణ జ్వరం వంటి సమస్యలకు గురి అయ్యే వారు ఈ నీటిని తాగితే చక్కటి ఫలితం లభిస్తుంది. పరగడుపున నీటిని తాగడం వల్ల ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మ సౌందర్యానికి కూడా ఎంతో మంచిది.

చర్మం కూడా కాంతివంతంగా తయారవుతుంది. శరీరంలో తాజా శరీర కణాల పెరుగుదలకు సహాయపడటం మాత్రమే కాకుండా టాక్సిన్స్, మృత కణాలను బయటకు పంపడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది.

అలాగే పళ్ళు తోముకుండా ఉదయాన్నే నీటిని తాగడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి బయటపడవచ్చు.

దాంతో పాటు ఉదర సంబంధిత సమస్యలు అజీర్తి వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. పరిగడుపునే నీళ్లను తాగడం వల్ల నోటిలో బ్యాక్టీరియా పేరుకుపోదు. అలాగే కావిటీస్ ప్రమాదం కూడా తగ్గుతుంది. అధిక రక్తపోటు, డాయబెటీస్ పేషెంట్లు ప్రతిరోజూ నీళ్లను తాగితే వారి ఆరోగ్యం బాగుంటుంది.

Jaggery : రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో చిన్న బెల్లం ముక్కను తింటే.. ఎన్ని అద్భుతాలు జరుగుతాయో తెలుసా..?

Jaggery : రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో చిన్న బెల్లం ముక్కను తింటే.. ఎన్ని అద్భుతాలు జరుగుతాయో తెలుసా..?

Jaggery : మనం వంటింట్లో రకరకాల తీపి వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. వీటిని తయారు చేయడానికి పంచదారతో పాటు బెల్లాన్ని కూడా ఉపయోగిస్తూ ఉంటాం.
తీపి వంటకాల తయారీలో ఉపయోగించి ఈ బెల్లం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పంచదారకు బదులుగా బెల్లాన్ని ఉపయోగించడం వల్ల మనం వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు కూడా చెబుతూ ఉంటారు. బెల్లంలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. పూర్వకాలంలో బెల్లాన్నే ఎక్కువగా ఉపయోగించే వారు. అందుకే వారు అంత దృఢంగా ఉండే వారు. బెల్లంతో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని తెలిసినప్పటికి దీనిని ఎలా తీసుకోవాలో మనలో చాలా మందికి తెలిసి ఉండదు. రోజూ ఉదయం పరగడుపున ఒక చిన్న బెల్లం ముక్కను తిని ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిని తాగాలి. ఇలా తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.

ఈ విధంగా బెల్లాన్ని తీసుకోవడం వల్ల మన శరీరానికి కలిగే మేలు కలుగుతుంది. అయితే ఆహారంగా ఎర్రగా, డార్క్ బ్రౌన్ కలర్ లో ఉండే బెల్లాన్ని మాత్రమే తీసుకోవాలి. తెల్లగా, పసుపు రంగులో ఉండే బెల్లాన్ని ఉపయోగించకూడదు. రోజూ ఉదయం పరగడుపున చిన్న నిమ్మకాయంత బెల్లాన్ని తీసుకోవడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. రక్తంలో మలినాలు ఎక్కువగా ఉండడం వల్ల మన శరీరంలో దాదాపు 150 రకాల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. బెల్లాన్ని తీసుకోవడం వల్ల రక్తంలోని మలినాలు విష వ్యర్థ పదార్థాలు తొలగిపోతాయి. దీంతో మనం షుగర్, రక్తపోటు, థైరాయిడ్, చర్మంపై మొటిమలు, మచ్చలు వంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. చర్మం కాంతివంతంగా తయారవుతుంది. వృద్ధాప్య ఛాయలు మన దరి చేరకుండా ఉంటాయి. రోజూ ఉదయం పరగడుపున బెల్లం ముక్క తీసుకోవడం వల్ల శరీరంలో మెటాబాలిజం రేటు పెరుగుతుంది.
జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. దీంతో మనం తీసుకునే ఆహారంలో ఉండే పోషకాలు మన శరీరానికి చక్కగా అందుతాయి. అంతేకాకుండా మలబద్దకం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. అలాగే బెల్లాన్ని తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా శరీరానికి తగినంత క్యాల్షియం లభిస్తుంది. దీంతో ఎముకలు ధృడంగా మారతాయి. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు వంటి సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా రోజూ బెల్లాన్ని తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. నాడీ మండల వ్యవస్థ చక్కగా పని చేస్తుంది. శరీరంలో ఉష్ణోగ్రతలు అదుపులో ఉంటాయి. ఈ విధంగా బెల్లం మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని దీనిని తీసుకోవడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Tulsi And Turmeric : పసుపు, తులసితో ఇలా చేస్తే.. అంతులేని ఇమ్యూనిటీ.. ఏ రోగమూ రాదు..!

Tulsi And Turmeric : పసుపు, తులసితో ఇలా చేస్తే.. అంతులేని ఇమ్యూనిటీ.. ఏ రోగమూ రాదు..!

Tulsi And Turmeric : మనం రోగాల బారిన పడకుండా ఉండాలంటే మన శరీరంలో తగినంత రోగ నిరోధక శక్తి ఉండడం చాలా అవసరం. తగినంత రోగ నిరోధక శక్తి లేకపోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.
జలుబు, దగ్గు, జ్వరం వంటి వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ల బారిన పడడం, చెవి ఇన్ఫెక్షన్ లు, చర్మ సంబంధిత సమస్యలు, బ్రాంకైటీస్, సైనస్ వంటి సమస్యలు తలెత్తడం జరుగుతుంది. అలాగే శరీరంలో అంతర్గతంగా ఇన్ఫెక్షన్, ఇన్ ప్లామేషన్ తలెత్తడం, డయేరియా, కడుపులో నొప్పి వంటి ఇతర జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తడం జరుగుతుంది. అలాగే రక్తంలో ప్లేట్ లెట్స్ తక్కువగా ఉండడం, రక్తహీనత వంటి అనేక అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఇటువంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండాలంటే మన శరీరంలో తగినంత రోగనిరోధక శక్తి ఉండడం చాలా అవసరం. ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా సహజ సిద్దంగా మన ఇంట్లో ఉండే పదార్థాలను ఉపయోగించి మనం శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. రోగ నిరోధక శక్తిని పెంచే కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి… అలాగే దీనిని ఎలా వాడాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. దీని కోసం ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని తీసుకోవాలి. తరువాత ఇందులో ఒక ఇంచు అల్లం ముక్కను కచ్చా పచ్చాగా దంచుకుని వేసుకోవాలి. అలాగే ఒక ఇంచు దాల్చిన చెక్క, అర టీ స్పూన్ పసుపు, 5 లేదా 6 తులసి ఆకులు వేసి ఈ నీటిని బాగా మరిగించాలి. ఈ నీటిని చిన్న మంటపై అర గ్లాస్ కషాయం అయ్యే వరకు మరిగించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత దీనిని ఒక గ్లాస్ లోకి వడకట్టుకుని తీసుకోవాలి. ఈ కషాయం గోరు వెచ్చగా అయిన తరువాత దీనిలో రుచి కొరకు తేనెను కూడా వేసుకోవచ్చు.

Tulsi And Turmeric

ఇలా తయారు చేసుకున్న కషాయాన్ని రోజూ 3 నుండి 4 టేబుల్ స్పూన్ల మోతాదులో పరగడుపున తీసుకోవాలి. దీనిని పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా తీసుకోవచ్చు. అయితే పిల్లలకు దీనిని ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల మోతాదులో మాత్రమే ఇవ్వాలి. ఈ విధంగా తయారు చేసుకున్న కషాయాన్ని క్రమం తప్పకుండా రోజూ తీసుకోవడం వల్ల కొద్ది రోజుల్లోనే మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో మనం వైరస్, బ్యాక్టీరియాల వల్ల కలిగే అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. ఈ కషాయాన్ని తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు మనం ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Coriander Seeds : గుప్పెడు ధనియాలు చాలు.. శరీరంలో పేరుకుపోయిన చెత్త మొత్తం బయటకు వస్తుంది..

Coriander Seeds : మన వంటింట్లో ఉండే మసాలా దినుసుల్లో ధనియాలు ఒకటి. వంటల్లో వీటిని విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం. ధనియాలను వాడడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ధనియాల్లో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. వీటిని వాడడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. ధనియాల్లో ఉండే ఔషధ గుణాల గురించి అలాగే వీటిని వాడడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సంస్కృతంలో వీటిని ధాన్యకం అంటారు. అలాగే వీటిని శాస్త్రీయంగా కొరియాండ్రం సెటైవం అని పిలుస్తారు. అలాగే వీటిని హిందీలో ధనియా అని పిలుస్తారు. ధనియాల్లో కూడా ఔషధ గుణాలు ఉంటాయని వీటిని వాడడం వల్ల అనేక అనారోగ్య సమస్యల నుండి బయట పడవచ్చని మనలో చాలా మందికి తెలిసి ఉండదు.

జలుబు, దగ్గు వంటి అనారోగ్య సమస్యలు బాధపెడుతున్నప్పుడు చాలా మంది మందులను వాడుతూ ఉంటారు. దీని వల్ల కాలేయం కొంతకాలానికి దెబ్బతినే అవకాశం ఉంది.

జలుబు, దగ్గు వంటి అనారోగ్య సమస్యలను మనం ధనియాలను ఉపయోగించి నయం చేసుకోవచ్చు. ధనియాలు, పసుపు, పటిక బెల్లాన్ని సమానంగా తీసుకుని బరకగా దంచాలి.

ఈ మిశ్రమాన్ని ఒక టీ స్పూన్ మోతాదులో ఒక టీ గ్లాస్ నీటిలో వేసి పావు గ్లాస్ కషాయం అయ్యే వరకు మరిగించాలి. ఈ కషాయన్ని గోరు వెచ్చగా పూటకు నాలుగు టీ స్పూన్ల మోతాదులో మూడు పూటలా తీసుకోవాలి.

ఇలా చేయడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యల నుండి చక్కటి ఉపశమనం కలుగుతుంది. అలాగే ధనియాలను పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని ఒక గ్లాస్ నీళ్లల్లో వేసి అర గ్లాస్ కషాయం అయ్యే వరకు మరిగించి తాగాలి.

ఇలా చేయడం వల్ల కూడా జులబు, దగ్గు వంటి సమస్యలు తగ్గుతాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ప్రేగుల్లో పురుగులు, నులి పురుగులు వంటి సమస్యలతో కూడా మనలో చాలా మంది బాధపడతారు.

Coriander Seeds

ముఖ్యంగా పిల్లలు ఈ సమస్య బారిన ఎక్కువగా పడుతూ ఉంటారు. ఈ సమస్య నుండి బయట పడడంలో ధనియాలు మనకు ఎంతో సహాయపడతాయి. అర టీ స్పూన్ నుండి ఒక టీ స్పూన్ మోతాదులో ధనియాల పొడిని తీసుకోవాలి.

ఈ పొడికి కొద్దిగా బెల్లాన్ని కలిపి రోజుకు రెండు పూటలా ఐదు రోజుల పాటు తీసుకోవడం వల్ల ప్రేగుల్లో పురుగులు నశిస్తాయి. చలికాలం, వర్షాకాలం కూడా చాలా మంది డీహైడ్రేషన్ బారిన పడుతూ ఉంటారు. శరీరాన్ని డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంచడంలో ధనియాలు మనకు ఉపయోగపడతాయి.

ఒక టీ స్పూన్ ధనియాలకు ఒక టీ స్పూన్ పంచదార కలిపి కచ్చా పచ్చాగా దంచాలి. ఒక మిశ్రమాన్ని నాలుగు గ్లాసుల నీటికి కలిపి ఒక గ్లాస్ కషాయం అయ్యే వరకు మరిగించాలి. తరువాత ఈ కషాయానికి కొద్దిగా ఉప్పును కలపాలి.

ఇలా తయారు చేసుకున్న కషాయాన్ని నాలుగు టీ స్పూన్ల మోతాదులో రోజుకు నాలుగు నుండి ఐదు సార్లు తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటాము.

అదే విధంగా ధనియాలను ఉపయోగించి మనం అజీర్తి సమస్య నుండి బయటపడవచ్చు. ఒక టీ స్పూన్ ధనియాలకు చిటికెడు శొంఠి పొడిని కలిపి మెత్తగా దంచాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ఒక గ్లాస్ నీటికి కలిపి పావు గ్లాస్ అయ్యే వరకు మరిగించాలి.

ఇలా తయారు చేసుకున్న కషాయాన్ని పూటకు నాలుగు టీ స్పూన్ల మోతాదులో మూడు పూటలా తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల అజీర్తి సమస్య తగ్గు ముఖం పడుతుంది.

ఈ విధంగా ధనియాలు మనకు ఎంతో ఉపయోగపడతాయని వీటిని వాడడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని వీటిని తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

Income Tax రూ.10 విరాళం ఇస్తే రూ.12,500 పన్ను ఆదా.. ఎలాగో తెలుసా..?

రూ.10 విరాళం ఇస్తే రూ.12,500 పన్ను ఆదా.. ఎలాగో తెలుసా..?

ఇప్పుడు మీరు రూ.10 విరాళం ఇవ్వడం ద్వారా రూ.12,500 పన్ను ఆదా చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఆదాయపు పన్ను నిబంధనలను ఏంటో తెలుసుకోండి. కేవలం రూ.10 విరాళంగా ఇవ్వడం ద్వారా రూ.12,500 పన్ను ఆదా చేసుకోవచ్చని చెబితే మీరు నమ్మకపోవచ్చు.
అయితే ఇది నిజం. ఆదాయపు పన్ను చట్టంలో సెక్షన్ 80G ఉంది, దాని కింద మీరు విరాళంగా ఇచ్చే డబ్బుపై పన్ను మినహాయింపు ఉంటుంది. మీరు విరాళం ఇవ్వడం ద్వారా పన్ను ఆదా చేయడం ఎలాగో చూద్దాం…

మీరు ప్రస్తుత పన్ను స్లాబ్‌ను అర్థం చేసుకుంటే, పాత పన్ను విధానంలో మీకు అనేక మినహాయింపులు లభిస్తాయి.

మీరు ఆ పన్ను పరిధిలో ఉన్నట్లయితే, రూ. 5.5 లక్షల వరకు పన్ను విధించదగిన ఆదాయంపై మీరు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఇందులో రూ.2.5 లక్షల వరకు ఎవరిపైనా ఎలాంటి పన్ను విధించనవసరం లేదు. అదే సమయంలో, ప్రతి ఉద్యోగి రూ. 50 వేల స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనం పొందుతారు. ఈ తగ్గింపులు కలిపిన తర్వాత, మీ మొత్తం ఆదాయం రూ. 5.5 లక్షలు లేదా అంతకంటే తక్కువ, సెక్షన్ 87A కింద రూ. 2.5 లక్షలు మీరు 5% స్లాబ్ కింద రూ.12,500 పన్ను ప్రయోజనం పొందుతారు.

అంటే మీరు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ మీ ఆదాయం రూ.10 కంటే ఎక్కువ ఉంటే, మీకు ఈ రూ.2.5 లక్షల తగ్గింపు లభించదు. రూ.50కే స్టాండర్డ్ డిడక్షన్ తీసుకున్న తర్వాత కూడా మీ ఆదాయం రూ. 5 లక్షలు కొంచెం ఎక్కువ, అటువంటి పరిస్థితిలో మీరు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80G ప్రయోజనాన్ని పొందవచ్చు. దీని కింద మీరు 10 రూపాయలు విరాళంగా ఇవ్వండి. ఇప్పుడు మీరు 80G కింద రూ.10 విరాళం ఇస్తే, అది కూడా పన్ను రహితంగా ఉంటుంది.

ఎందుకంటే మీ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ.5 లక్షల లోపు అవుతుంది. పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ. 5 లక్షలు కాబట్టి, మీకు రూ. 12,500 పన్ను మినహాయింపు లభిస్తుంది, దానిపై మీరు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనము కేవలం 10 రూపాయలను మాత్రమే ఉదాహరణగా తీసుకున్నప్పటికీ, ఈ మొత్తం మీకు ఎక్కువగా ఉండకపోవచ్చు. స్టాండర్డ్ డిడక్షన్ తర్వాత మీ మొత్తం పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ. 5.10 లక్షలు వచ్చిందనుకుందాం.

ఈ విధంగా, మీరు రూ. 2.5-5 లక్షలపై 5 శాతం చొప్పున రూ. 12,500, మిగిలిన రూ. 10,000పై రూ. 1000 అంటే మొత్తం రూ. 13,500 పన్ను చెల్లించాలి. అటువంటి సందర్భంలో, మీరు రూ. 10 వేలు విరాళంగా ఇస్తే, మీ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం మళ్లీ రూ. 5 లక్షలు అవుతుంది అండ్ మీరు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అంటే రూ.10,000 విరాళం ఇస్తే రూ.13,500 పన్ను ఆదా అవుతుంది. ఈ విధంగా మీ మొత్తం లాభం రూ.3,500 అవుతుంది. దానం చేయడం వల్ల డబ్బు ఆదా అవుతుంది.

అయితే మీరు ఐటీఆర్ ఫైల్ చేసే ఆర్థిక సంవత్సరంలోనే విరాళం ఇవ్వాలని గుర్తుంచుకోండి. అంటే, దీని ప్రయోజనాన్ని పొందడానికి, మీరు సంవత్సరం ప్రారంభం నుండి ఆదాయపు పన్ను కోసం ప్రణాళికను ప్రారంభించాలి. అంటే, మీరు రూ.10 విరాళంగా ఇవ్వడం ద్వారా పన్ను ఆదా చేయాలనుకుంటే, మీపై వాస్తవంగా ఎంత పన్ను విధించబడుతుందో తెలుసుకునేందుకు ముందుగానే గణనను ప్రారంభించండి.

Google Maps: మీ ఇల్లు లేదా షాప్‌.. గూగుల్‌ మ్యాప్స్‌లో కనిపించాలా? ఈ సింపుల్‌ టిప్స్‌తో పనైపోతుంది

Google Maps: మీ ఇల్లు లేదా షాప్‌.. గూగుల్‌ మ్యాప్స్‌లో కనిపించాలా? ఈ సింపుల్‌ టిప్స్‌తో పనైపోతుంది

ఇటీవల కాలంలో తెలియని అడ్రస్‌ల వెతుకులాటకు గూగుల్‌ మ్యాప్స్‌ చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉండడంతో మనం ఎక్కడ ఉన్నామో?

అక్కడకు మన స్నేహితులు లేదా బంధువులు రావడానికి లోకేషన్‌ షేర్‌ చేస్తే క్షణాల్లో మన ముందు ఉంటున్నారు. గతంలో గూగుల్‌ మ్యాప్స్‌ లేని సమయంలో అడ్రస్‌ వెతుకులాట అనేది పెద్ద ప్రహసనంలా ఉండేది. గూగుల్‌ మ్యాప్స్‌ను ఉపయోగించుకునే ఆన్‌లైన్‌ ఆర్డర్లు, ఫుడ్‌ డెలివరీలు, బైక్‌, కారు రైడింగ్‌ యాప్స్‌ పని చేస్తున్నాయి. అయితే మీకు ఎప్పుడైనా మ్యాప్స్‌లో మన ఇల్లు లేదా షాపు కనిపిస్తే బాగుంటుందని అనిపించిందా? అలా అనిపించడం సహజం. అయితే గూగుల్‌మ్యాప్స్‌లో మన ఇల్లు లేదా షాపును యాడ్‌ చేయడం మన చేతిల్లో పనేనని టెక్‌ నిపుణులు పేర్కొంటున్నారు. గూగుల్‌మ్యాప్స్ మీ మొత్తం వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడానికి రూపొందించిన అనేక రకాల ఫీచర్లను అందిస్తుంది. లొకేషన్‌లను సేవ్ చేయగల సామర్థ్యం, ​​వినియోగదారులు తమకు ఇష్టమైన లేదా తరచుగా సందర్శించే స్థలాలను అప్రయత్నంగా మళ్లీ సందర్శించడానికి, నిర్వహించడానికి వీలు కల్పిస్తూ ఉంటుంది. ఈ ఫీచర్ ముఖ్యమైన ప్రదేశాలకు మీ మార్గాన్ని కనుగొనే ప్రక్రియను క్రమబద్ధీకరించడమే కాకుండా వ్యక్తిగతీకరించిన ట్రావెలాగ్‌గా కూడా పనిచేస్తుంది. మీ ప్రయాణాన్ని డాక్యుమెంట్ చేసి, మీ జ్ఞాపకాల డిజిటల్ మ్యాప్‌ను సృష్టిస్తుంది. డెస్క్‌టాప్, మొబైల్ పరికరాలలో Google మ్యాప్స్‌లో స్థానాలను ఎలా సేవ్ చేయాలనే విషయాలను ఓ సారి తెలుసుకుందాం.

డెస్క్‌టాప్‌

స్థానాన్ని కనుగొనడం

వ్యాపారం, స్థలం లేదా కోఆర్డినేట్‌ల సెట్ కోసం శోధించండి లేదా మ్యాప్‌లో దానికి నావిగేట్ చేయాలి

సేవ్ చేయిపై క్లిక్‌ చేయడం

స్థలం పేరు లేదా చిరునామా కింద ఉన్న “సేవ్” బటన్ (ఇది బుక్‌మార్క్ లాగా కనిపిస్తోంది) క్లిక్ చేయండి.

జాబితాను ఎంచుకోవడం

ఇప్పటికే ఉన్న జాబితాను ఎంచుకోండి ( “ఇష్టమైనవి,” “వెళ్లాలనుకుంటున్నారు,” “నక్షత్రం ఉన్న స్థలాలు”) లేదా మీ సేవ్ చేయబడిన స్థలాలను నిర్వహించడానికి కొత్తదాన్ని సృష్టించండి.

మొబైల్

స్థానాన్ని కనుగొనడం

స్థలం కోసం శోధించండి లేదా మ్యాప్‌లో మార్కర్‌ను నొక్కాలి. పిన్‌ని సృష్టించడానికి మీరు మ్యాప్‌లోని ఏదైనా స్పాట్‌ను కూడా తాకి, పట్టుకోవచ్చు.

సేవ్ చేయి

స్క్రీన్ దిగువన ఉన్న “సేవ్” బటన్ (ఇది బుక్‌మార్క్ లాగా కనిపిస్తుంది) ఎంచుకోవాలి.

జాబితాను ఎంచుకోవడం

ఇప్పటికే ఉన్న జాబితాను ఎంచుకుని లేదా కొత్తదాన్ని సృష్టించండి. అనంతరం “పూర్తయింది” నొక్కండి: పొదుపు ప్రక్రియను ముగించండి.

స్థానాలను సేవ్ చేయడానికి అదనపు చిట్కాలు

మీరు సేవ్ చేసిన స్థలాలను లేబుల్ చేయడం
మీ ప్లేస్‌లను సులభంగా కనుగొనడానికి, మీరు మీ సేవ్ చేసిన స్థానాలకు అనుకూల లేబుల్‌లను జోడించవచ్చు. సేవ్ చేసిన స్థలాన్ని తెరిచి, దాని పేరును సవరించడానికి “లేబుల్”ను ఎంచుకోవాలి.
ఇతర వెబ్‌సైట్‌ల నుంచి స్థలాలను సేవ్ చేయాలి
మీరు పొందుపరిచిన గూగుల్‌ మ్యాప్‌ని ఉపయోగించే వెబ్‌సైట్‌లో స్థలాన్ని కనుగొంటే, మీరు దానిని నేరుగా మీ జాబితాలకు సేవ్ చేయవచ్చు.
ఆఫ్‌లైన్‌లో యాక్సెస్ చేయడం

మీరు ఆఫ్‌లైన్‌లో ఉన్నప్పుడు కూడా మీరు సేవ్ చేసిన స్థలాలను వీక్షించడానికి ఆ ప్రాంతాలకు సంబంధించిన మ్యాప్‌లను ముందుగానే డౌన్‌లోడ్ చేసుకోండి.

షేర్ చేయడం

మీరు మీ సేవ్ చేసిన స్థలాలను లింక్ ద్వారా లేదా షేర్ చేసిన లిస్ట్‌లో సహకరించడం ద్వారా ఇతరులతో షేర్ చేయవచ్చు.

Chanakya Niti : ఎవరినైనా నమ్మే ముందు ఈ విషయాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి.!

Chanakya Niti : కొన్నిసార్లు వ్యక్తులను నమ్మాలంటే భయం వేస్తుంటుంది. కానీ కొందరిని మాత్రం గుడ్డిగా నమ్మేస్తుంటారు. కానీ వ్యక్తులను నమ్మేటప్పుడు కచ్చితంగా కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకోవాలట.
ఆచార్య చాణక్య నీతి ప్రకారం ఒక వ్యక్తిని నమ్మాలంటే కొన్నింటిని పరీక్షించాలట. అలా చేయడం వల్ల వారి స్వభావం, లక్షణాలను అర్థం చేసుకొనే అవకాశం ఉంటుందట. ఇలా చేయడం వల్ల మోసపోకుండా ఉండవచ్చు. మరి చాణుక్యుడు చెప్పిన ఆ నాలుగు విషయాలు ఏంటో కూడా ఓ సారి చూసేయండి.

త్యాగం.. ఒక వ్యక్తి త్యాగం గుణం కలిగి ఉంటారో ఆ వ్యక్తి మీ లైఫ్ లో ఉంటే.. కచ్చితంగా మీరు సంతోషంగా ఉంటారు. త్యాగం చేసే వారు లైఫ్ లో ఉంటే.. వారి ఆనందాన్ని సైతం పక్కన పెట్టి మీ ఆనందం కోసం ఆలోచిస్తారు. కాబట్టి త్యాగ గుణం ఉందో లేదో పరీక్షించాలి. ఇలాంటి వారు మీ లైఫ్ లో ఉంటే వదులుకోవద్దని చెప్పారు చాణక్యుడు.

డబ్బు.. ప్రస్తుతం సమాజాన్ని నడిపిస్తున్న ఆయుధం ఏంటంటే డబ్బునే చెప్పాలి. ఇదే మనుషులను దూరం చేస్తుంది. దగ్గర చేస్తుంది. అయితే దీని వల్ల దగ్గరయ్యే బంధాలకంటే దూరం అయ్యే అయ్యే బంధాలే ఎక్కువ. ఎందుకంటే మనుషుల కంటే డబ్బు అవసరమే ఎక్కువ ఉందని నమ్మేవారి సంఖ్య పెరిగిపోయింది. ఇక ఈ విషయంలో ఎవరిని అయినా పరీక్షించాలంటే ముందుగా కొంత సొమ్ము అప్పుగా ఇవ్వండి. వారు సరైన సమయంలో రిటర్న్ ఇస్తే పూర్తిగా నమ్మవచ్చు. కానీ కొందరు వ్యక్తులు స్వార్థంగా ఉండి.. తప్పుడు మార్గంలో డబ్బు సంపాదించాలి అనుకుంటారు. వారి తిరిగి ఇవ్వడానికి ఆలోచిస్తారు. ఇలాంటి వారిని నమ్మకండి. అంతే కాదు మీకు అవసరం ఉన్నప్పుడు ఎవరిని అయినా అడిగిచూడండి. అప్పుడు కూడా మనుషుల స్వభావం బయటపడుతుంది.

స్పష్టత.. ఎవరైనా వ్యక్తిని నమ్మడానికంటే ముందు తన పాత్ర ఏంటో తెలుసుకోవాలి. అంటే వారి స్వభావం ఏంటి? ఇంట్లో తన పాత్ర ఏంటి? మంచి పనులను ఎంచుకుంటాడా? చెడు దారిలో నడుస్తాడా? అనే విషయాలను తెలుసుకున్న తర్వాతనే ఆ వ్యక్తిని పూర్తిగా నమ్మాలి.
లక్షణాలు.. ప్రతి మనిషిలో కొన్ని మంచి లక్షణాలు, చెడు లక్షణాలు కూడా ఉంటాయి. అయితే చెడు ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి. ఇక సోమరితనం, చిన్నతనం, గర్వం, తరచు అబద్దాలు చెప్పే అలవాట్లు ఉంటే మాత్రం వారిని అసలు నమ్మకండి. ఎవరైతే ప్రశాంతంగా, గంభీరంగా, వాస్తవాలు మాత్రమే మాట్లాడుతారో వారిని మాత్రమే పూర్తిగా నమ్మండి అని చాణుక్యుడు తెలిపారు.

Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిర నిర్మాణానికి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చయ్యాయో తెలుసా? పూర్తి వివరాలు..

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం ఈ నెల 22న వైభవంగా జరగనుంది. మొత్తం మూడు దశల్లో రామమందిరాన్ని నిర్మిస్తుండగా.. తొలి దశ పనులు పూర్తికావడంతో శ్రీ రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు.
2025 డిసెంబరులోగా మిగతా పనులన్నీ పూర్తవుతాయి. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ఏడు వేల మంది హాజరవుతారు.

రామాలయ నిర్మాణానికి మొత్తం దాదాపు రూ.1,800 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. ఇటీవలి కాలంలో అత్యంత ఖర్చుచేసిన నిర్మాణం ఇదే. గుజరాత్‌లో స్టాట్యూ ఆఫ్ యూనిటీని రూ.2,989 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించారు. కొత్త పార్లమెంట్ భవనాన్ని రూ.836 కోట్ల అంచనా వ్యయంతో కట్టారు. అత్యధికంగా ఖర్చు చేస్తున్న రెండో కట్టడంగా అయోధ్య రామమందిరం నిలిచింది.

అయోధ్యలో ఈ నెల 22న బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన జరగనుంది. సరయూ నదీ తీరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రామమందిరం.. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద హిందూ దేవాలయం. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు రూపం. భవ్యరామ మందిర వైభవం దేశవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌ అయ్యింది. అత్యంత ఖరీదైన మతపర నిర్మాణాల్లో ఈ రామమందిరం ఒకటిగా నిలిచిపోనుంది.

దేశంలో అత్యంత ఖరీదైన మందిరాల్లో అయోధ్య రామమందిరం అగ్రభాగాన నిలిచిపోనుంది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సాంకేతిక సాయంతో ఎల్ అండ్ టీ, టాటా కన్సల్టింగ్ ఇంజినీర్స్ సంస్థలు ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నాయి. రామాలయ సముదాయం 70 ఎకరాల్లో విస్తరించి ఉంది. ప్రధాన ఆలయం సుమారు 3 ఎకరాల్లో.. 161 అడుగుల ఎత్తులో ఉంది. మూడు అంతస్తులు, 12 ద్వారాలతో నిర్మిస్తున్నారు.

విరాళాలు..
రామమందిర నిర్మాణం కోసం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్.. సుమారు 3,500 కోట్ల రూపాయల విరాళాలు సేకరించింది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రూ.11 లక్షలు, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ 5 లక్షల రూపాయలు వ్యక్తిగతంగా విరాళం అందించారు. ఆలయ నిర్మాణానికి మొత్తం సేకరించిన విరాళాల్లో ఇప్పటివరకు దాదాపు 52 శాతం ఖర్చయ్యింది.

మిగతా సొమ్ము రాబోయేకాలంలో ఆలయ నిర్వహణ, ఇతర కార్యకలాపాలకు ట్రస్ట్‌ వినియోగించనుంది. ఆలయంతోపాటు అయోధ్యలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కూడా ఈ విరాళాల నుంచి కొంతభాగం ఖర్చు చేస్తున్నారు.

ఏ కట్టడానికి ఎంత?

అయోధ్య రామమందిర నిర్మాణాన్ని 1,800 కోట్ల రూపాయల అంచనాతో చేపట్టగా… దేశంలోని మిగతా మతపర నిర్మాణాలను పరిశీలిస్తే…

గుజరాత్‌లోని విశ్వ్ ఉమియా ధామ్‌ను వెయ్యి కోట్ల వ్యయంతో నిర్మించారు
బెంగళూరులోని కృష్ణ లీలా థీమ్‌పార్కును రూ.700 కోట్లతో..
పశ్చిమ బెంగాల్‌లోని వేద ప్లానిటోరియం టెంపుల్‌ రూ.622 కోట్లతో..
ఉత్తరప్రదేశ్‌లోని చంద్రోదయ ఆలయం రూ.500 కోట్లతో
బిహార్‌లోని విరాట్‌ రామాయణ టెంపుల్‌ రూ.500 కోట్లతో
గుజరాత్‌లో రూ.800 కోట్లతో నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం
ఢిల్లీలో రూ.306 కోట్లతో ప్రధానమంత్రి సంగ్రహాలయ భవనం
రూ.176 కోట్లతో ఢిల్లీలో జాతీయ యుద్ధ స్మారకచిహ్నం
రామమందిరంలో ప్రతిష్టించనున్న 51 అంగుళాల బాలరాముడి విగ్రహం ఐదేండ్ల బాలుడి రూపంలో ఉండనుంది. మొత్తమ్మీద ప్రపంచంలోనే మూడో అతి పెద్ద హిందూ దేవాలయంగా అయోధ్య రామ మందిరం రూపుదిద్దుకుంది.

నేటి నుంచి ఏపీలో కులగణన

ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి కులగణన ప్రారంభం కానుంది. ప్రతి గ్రామంలో వాలంటీర్లు ఈ కులగణనను నిర్వహించనున్నారు. ఈరోజు నుంచి పది రోజుల పాటు కులగణన జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది.
ఈ నెల 28వ తేదీ వరకూ కులగణన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. గతలో ఆరు జిల్లాల పరిధిలో ఏడు సచివాలయల పరిధిలో ప్రయోగాత్మకంగా కులగణనను చేపట్టారు.

పది రోజుల పాటు…

ఈరోజు నుంచి పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కులగణన జరుగుతుంది. ఆన్ లైన్ లోనే కులగణన వివరాలను నమోదు చేయనున్నారు. ఇంటింటికి వెళ్లి వాలంటీర్లు వివరాలు సేకరించనున్నారు. ఇంటి వద్ద అందుబాటులో లేని వారు ఈ నెల 28వ తేదీ నుంచి వచ్చే నెల రెండో తేదీ వరకూ సచివాలయాల్లో నమోదు చేయించుకునేందుకు అవకాశం కల్పించారు. ఇందుకోసం ప్రత్యేకంగా యాప్ ను రూపొందించి అందులో నమోదు చేస్తున్నారు.

pooja: శ్రీవారిని ఏడు శనివారాలు ఇలా పూజిస్తే..

శ్రీపాదాలు ( venkateswara swami) కొలిస్తే ఐశ్వర్యప్రాప్తి జరుగుతుందనేది పురాణాల మాట. అందుకే శ్రీవారిని పూజ చేస్తే ఇంట్లో ధనానికి లోటు ఉండదు.
ఏం చేస్తే ధనానికి లోటు ఉండదో ..తెలుసుకుందాం.

శనివారం తెల్లవారుజామునే నిద్రలేచి స్నానాదులు ముగించి, పూజగదిని ( pooja) శుభ్రం చేసి వేంకటేశ్వర స్వామిని ( venkateswara swami) అలంకరించాలి. పూజ ప్రారంభించి సంకల్పం చెప్పుకోవాలి. బియ్యపుపిండి, పాలు, బెల్లం, అరటి పండు కలిపి దాంతో ప్రమిదను తయారు చేయాలి. ఇందులో ఏడు వత్తులు వేసి ఆవు నేతితో దీపం వెలిగించాలి. స్వామి వారికి కర్పూరం కలిపిన లడ్డు ఇష్టం . అది కుదిరినంత వరకు మీరే చేసి స్వామికి నైవేధ్యం ఇవ్వండి. స్వామికి ఎంతో ప్రీతికరమైన ఈ రోజున వైష్ణవులు శ్రీహరిని నియమనిష్టలతో పూజించేవారని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి వేకువజామునే స్నానం చేసి తులసి( tulasi) కోట ముందు ఆవునేతితో గాని, నువ్వుల నూనెతో గాని దీపం వెలిగించినవారికి అష్టైశ్వర్యాలు సిద్దిస్తాయి. స్వామి మీద నమ్మకం ఉంచండి.
శనివారం( satuarday) సాయంత్రం వేంకటేశ్వర( venkateswara swami) ఆలయంలో ఆవు నేయితో( ghee diya) దీపం వెలిగించే వారికి బాధలు తొలగిపోయి సుఖసంతోషాలు ప్రాప్తిస్తాయి. ఇలా ఏడు శనివారాలు స్వామిని పూజిస్తే దోషాలన్నీ తొలగిపోయి చేపట్టిన పనులన్నీ నిరాటంకంగా సాగుతాయి. ఈ దీపం వల్ల ఇళ్లు, పెళ్లి అన్ని జరుగుతాయి.

Vastu Tips: చీపురు విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా.? వెంటనే అలర్ట్ అవ్వండి..

భారతీయులు వాస్తును ఎంతలా విశ్వసిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాస్తు అనేది కేవలం ఇంటి నిర్మాణానికి మాత్రమే పరిమితం కాకుండా ఇంట్లో ఉండే వస్తువుల విషయంలోనూ పాటిస్తుంటారు.
టీవీ, ఫ్రిడ్జ్‌, బీరువా ఇలా ప్రతీ వస్తువును ఏ దిశలో ఏర్పాటు చేసుకోవాలన్న అంశాలను వాస్తు శాస్త్రంలో స్పష్టంగా ప్రస్తావించారు. అయితే చివరికి చీపురు కూడా ఏ దిశలో ఉంచాలన్న విషయాన్ని కూడా వాస్తు శాస్త్రంలో తెలిపారు. ఇంతకీ చీపురు విషయంలో ఎలాంటి వాస్తు చిట్కాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంట్లో ఉండే నత్యవసర వస్తువుల్లో చీపురు కూడా ఒకటని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చీపురు లేకపోతే ఇంట్లో పని ముందుకు సాగదు. అలాంటి చీపురుకు సంబంధించి వాస్తు నియమాలు కూడా పాటించాలని వాస్తు పండితులు చెబుతున్నారు. చీపురుని లక్ష్మీ దేవీగా భావిస్తుంటారు. అందుకే చీపురును ఎలా పడితే అలా ఉపయోగించకూడదని ఎప్పుడు పడితే అప్పుడు కొనుగోలు చేయకూడదని చెబుతారు. వాస్తు శాస్త్రం ప్రకారం.. చీపురును ఇంట్లో సరైన దిశలోనే ఉంచాలని వాస్తు నిపుణులు చెబుతుంటారు.
ఇంటిని శుభ్రం చేసిన తర్వాత చీపురుని ఎక్కడపడితే అక్కడ పడేయకుండా కేవలం పశ్చిమదిశలో మాత్రమే ఉంచాలని వాస్తు పండితులు చెబుతున్నారు. అలాగే చీపురుని పెట్టడానికి నైరుతి దిశ కూడా అనువైనదిగా పండితులు చెబుతున్నారు. ఈ దిశలో కాకుండా మరే దిశలో ఉంచినా ఇంట్లో నెగిటివ్‌ ఎనర్జీ పెరుగుతుందిన హెచ్చరిస్తున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం చీపురు ఎవరికీ కనిపించకుండా పెట్టాలి. ముఖ్యంగా బయటి వ్యక్తులకు ఇంట్లో ఉపయోగించే చీపురు కనిపించకూడదని చెబుతున్నారు.

Best Tea : పరిగడుపున ఈ టీ తాగితే ఎసిడిటీ, తలనొప్పి, బిపి, కొలెస్ట్రాల్ ఏమీ దరి చేరవు..!

Best Tea : మనలో చాలామందికి ఉదయం లేవగానే టీ తాగే అలవాటు ఉంటుంది. అలాగే మానసిక ఒత్తిని తగ్గించుకోవడానికి.. తలనొప్పి నుంచి ఉపసమనం పొందడానికి ,పనివత్తిడి తగ్గించుకోవడానికి చాలా మంది టీ తాగుతూ ఉంటారు.
అయితే మామూలుగా మనం చక్కెరతో తయారు చేస్తూ ఉంటాం.. చెక్కర టీ తాగడం వల్ల మనకు ఎటువంటి ఉపయోగం ఉండదు.ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా మనం చక్కటి ఈ విధంగా తాగొచ్చు.. అది బెల్లం టీ.మనకు మానసిక ఆనందాన్ని ఇచ్చే ఈ టి బెల్లంతో కూడా తయారు చేసుకోవచ్చు. బెల్లం టీం తాగడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు పొందవచ్చు.

పాలు విరగకుండా రుచిగా ఈ బెల్లం టీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. తయారీకి కావలసిన పదార్థాలు బెల్లం తురుము నాలుగు టీ స్పూన్లు, కచ్చాపచ్చాగా దంచిన అల్లం ముక్కలు కొద్దిగా, కచ్చాపచ్చా దంచిన యలుకులు నాలుగు కావాలి. పాలు రెండు గ్లాసులు, నీళ్లు రెండు గ్లాసులు టీ పౌడర్ మూడు టీ స్పూన్లు.. ముందుగా ఒక గిన్నెలో నీళ్ళు పోసి వేడి చేయాలి.ఇందులోనే టీ పౌడర్, బెల్లం తురుము యాలకులు, అల్లం ముక్కలు వేసి బాగా మరిగించాలి. డికాషన్ మరిగిన తర్వాత అందులో పాలను పోసి మరికొద్దిసేపు మరిగించాలి. తర్వాత ఈటీ ను వడకట్టి గ్లాస్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బెల్లంటి తయారవుతుంది.

ఇది చాలా రుచిగా ఉంటుంది.రుచి తో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. బెల్లం టీం తాగడం వల్ల రక్తహీనత సమస్య దూరం అవుతుంది. ఉదయం పూట తాగడం వల్ల మలబద్దక సమస్య నివారించబడుతుంది. రక్తపోటుతో బాధపడేవారు బెల్లం టీం తాగడం వల్ల చక్కటి ఫలితాలు పొందవచ్చు.. ఇందులో అల్లం, మిరియాలు వేసి తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి జలుబు, దగ్గు బారిన పడకుండా ఉంటారు. షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా ఈ టీ ను నిర్భయంగా తాగవచ్చు. ఈ విధంగా బెల్లం టీం తయారు చేసుకొని తాగడం వల్ల రుచి తో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు..

Vastu Tips : వాస్తు టిప్స్ : ఇంట్లో ఈ బొమ్మ పెడితే.. పట్టిందల్లా బంగారమే అవుతుంది.. సంతోషంగా ఉంటారు..

Vastu Tips : జీవితంలో ఏ పని చేసినా సక్సెస్ కావాలని ప్రతి ఒక్కరూ పరితపిస్తుంటారు. కానీ కొందరు ఎంత ప్రయత్నించినా.. అనేక అడ్డంకులు వస్తాయి. ఈ అడ్డంకులు రావడానికి కారణమేంటి?
అనేది తెలుసుకునేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అయితే అంతకంటే ముందుగానే సమస్య పరిష్కారం కోసం కొన్ని పనులు చేయాలి. ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉన్నంతసేపు ఏ పని చేసినా సాధ్యం కాదు. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు వస్తాయి. ఎప్పడూ ఎదో ఒక సమస్యతో ఆందోళనతో ఉంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఈ బొమ్మను ఉంచితే అనుకున్న పనులు చేయగలుగుతారు. కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు. ఇంతకీ ఆ బొమ్మ ఏదంటే?

సర్వ జగత్తుకు వెలుగునిచ్చేది సూర్యుడు. సూర్యదేవుడు లేకపోతే జీవన మనుగడ సాధ్యం కాదు. అందువల్ల కొన్ని ప్రాంతాల్లో సూర్యుడిని ప్రత్యేకంగా కొలుస్తారు. ఒక ఇల్లు సంతోషంగా ఉండాలంటే సూర్యుడి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇల్లు తూర్పు వైపు ఉండి.. ఉదయం సూర్యుడి కిరణాలు ఇంట్లో పడినట్లయితే అప్పుడు ఇంట్లో ఏడు గుర్రాల బొమ్మను ఉంచాలి. సూర్యుడి వాహనమైన ఈ బొమ్మను ఉంచడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఆ ఇంట్లో వారు పట్టిందల్లా బంగారమే అవుతుంది.

వెలుగుతో పాటు వేడిని అందించే శక్తి సూర్యుడికి మాత్రమే ఉంది. రాగితో కూడిన సూర్యుడి ప్రతిమను తూర్పు వైపు కనిపించేలా ఉంచాలి. ఇలా ఉంచడం వల్ల ఇంట్లో వ్యక్తుల మధ్య సంబంధాలు బాగుంటాయి. ఒకరికొకరు గౌరవం ఇస్తూ ఆనందంగా ఉంటారు. కొందరి ఇళ్లల్లో పిల్లలు ఎప్పుడూ అనారోగ్యంతో ఉంటారు. ఎన్ని మందులు వాడినా నయం కాని వారు ఉంటారు. అయితే వారి గదిలో సూర్యుడి విగ్రహం ఉంచడం వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతారు.

ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. ఇంట్లో గృహిణి ఆనందంగా ఉంటేనే ఇల్లు సంతోషంగా ఉంటుంది. గృహిణి ఎక్కువ సేపు వంటగదిలో ఉంటుంది. అందువల్ల వంటగదిలో కూడా రాగితో ఉన్న సూర్యుడి ప్రతిమ ఉంచడం వల్ల ఇంట్లో వాళ్లంతా ఆరోగ్యంగా ఉంటారు. వారికి అకారణంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. దేవుడి గదిలో కూడా రాగితో కూడిని సూర్యుడి ప్రతిమను ఉంచవచ్చు. అయితే సూర్యోదయం సమయంలో తలుపులు, కిటికీలు తెరిచి ఉంచడం వల్ల అంతా మంచే జరుగుతుంది.

Wash Clothes: రాత్రిపూట దుస్తులు ఉతకకూడదా.. ఉతికితే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

వాస్తు శాస్త్ర ప్రకారం కొన్ని కొన్ని సమయాలలో కొన్ని పనులు చేయడం నిషిద్ధం. వాటి వల్ల ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అటువంటి వాటిలో రాత్రిపూట దుస్తులు ఉతకకూడదు అన్న నియమం కూడా ఒకటి.
మరి రాత్రిపూట నిజంగానే బట్టలు ఉతకకూడదా? ఒకవేళ ఉతికితే ఏం జరుగుతుందో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వాస్తు శాస్త్రం ప్రకారం రాత్రిపూట దుస్తులు ఉతకకూడదు లేదా ఆరబెట్టకూడదు. అలా చేయడం శ్రేయస్కరం కాదు. ఎందుకంటే ఒక వ్యక్తి రాత్రిపూట దుస్తులు ఉతికితే భవిష్యత్తులో చెడు ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.

కాబట్టి రాత్రిపూట బట్టలు ఉతకడం ఆరేయడం లాంటివి అస్సలు చేయకండి. వాస్తు ప్రకారం, రాత్రిపూట దుస్తులు ఉతకడం వల్ల ఇంట్లో ప్రతికూలత వస్తుంది. అలాగే తడి దుస్తులు రాత్రిపూట బయట ఆరబెట్టకూడదు. అలా చేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అడుగుపెడుతుందట. అంతేకాదు, మరుసటి రోజు ఉదయం ఈ బట్టలు ధరించడం ఒక వ్యక్తి జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అలాగే, చేయాలి అనుకున్న ప్రతి పనికీ అంతరాయం కలిగే అవకాశం ఉంటుందట. రాత్రిపూట దుస్తులు ఉతకడం వల్ల మనస్సు చంచలంగా మారుతుంది. అంతేకాకుండా, ఒక వ్యక్తి అన్ని సమయాలలో ఒత్తిడికి గురవుతాడు.

కాబట్టి రాత్రిపూట దుస్తులు ఉతకడం తప్పు. కొన్ని కారణాల వల్ల మీరు రాత్రిపూట దుస్తులు ఉతకవలసి వస్తే, వాటిని బహిరంగ ప్రదేశంలో అంటే ఆకాశం కింద ఆరబెట్టవద్దు. ఇంటి లోపల ఆరపెట్టుకోవచ్చు. బహిరంగ ప్రదేశంలో ఆరబెట్టడం వల్ల వాటిపై సూక్ష్మక్రిములు వచ్చి చేరుతాయి. లేదా పక్షి మలమూత్రాలు దానిపై పడే అవకాశం ఉంది. ఇది ఖచ్చితంగా సమస్య అవుతుంది.

Health

సినిమా