బ్రహ్మంగారి కాలజ్ఞానం 2025లో జరగబోయే ప్రకృతి సృష్టించే విధ్వంసం ఇదే ..! తెలిస్తే వణికిపోవాల్సిందే.

చిన్నతనం నుండే ఎన్నో మహిమలు చూపిన బ్రహ్మం గారు ప్రస్తుత కాలంలో జరిగే, జరిగిన అనేక విషయాలను మనోనేత్రంతో దర్శిస్తూ ముందే చెప్పారు. ఇప్పటి వరకూ బ్రహ్మం గారు చెప్పినవి చాలా వరకు జరిగాయి.


మరెన్నో సంఘటనలు భవిష్యత్తులో జరగబోతున్నాయి. ఇప్పటికే కాలజ్ఞానంలో చెప్పినట్టే భయంకరమైన భూకంపాలు వచ్చాయి. ప్రకృతి విలయానికి ప్రపంచంలో జన జీవనం అస్తవ్యస్తం అయింది. అంతేకాదు ఇక ముందు కూడా ఇలాంటి అనేక విపత్తులు రానున్నాయని.. అవి ప్రపంచానికి పెను సవాల్ గా మారనున్నాయని.. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉన్నట్లు పండితులు చెప్తున్నారు. అంతేకాదు రానున్న విపత్తులను ఎదుర్కొనేందుకు సమస్త మానవాళి రెడీగా ఉండాలని సూచిస్తున్నారు.

శ్రీ పోతులూరి వీర బ్రహ్మం గారి కాలజ్ఞానానికి తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రాముఖ్యత ఉంది. నాలుగు వందల ఏళ్ల క్రితం బ్రహ్మంగారు భవిష్యత్ లో జరగనున్న ఎన్నో విషయాలను ఊచించి చెప్పారు. మన దేశంలో మాత్రమే కాదు ప్రపంచంలో జరగనున్న ఎన్నో విషయాలను తన కాలజ్ఞానం ద్వారా మానవాళికి అందించారు. ఇప్పటికే బ్రహ్మంగారి కాలజ్ఞానం పేరుతో ఆడియోలు, వీడియోలు, లు వచ్చాయి. అప్పట్లో ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా కాల జ్ఞాన తత్వాలే. చైనా దిక్కులో కొత్త రోగం పుట్టి ప్రపంచాన్ని గడగడలాడిస్తుందని.. మందు లేక ఈ వ్యాధి బారిన పడి ఎంతో మంది చనిపోతారని కాలజ్ఞానంలో ఉందని.. అది కరోనా వైరస్ రూపంలో నిజం అయిందని గుర్తు చేస్తున్నారు.

అంతేకాదు తాజాగా పండితులు బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రస్తావిస్తూ 2025 సంవత్సరంలో జరగనున్న విపత్తుల గురించి చెబుతున్నారు. ఇప్పటికే బ్యాంకాక్‌, మయన్మార్‌లలో వచ్చిన భూకంపమే ఉదాహరణ అని చెబుతున్నారు. అంతేకాదు ఈ ఏడాదిలో విపత్తులు జరగనున్నాయని కాలజ్ఞానంలో ఉన్నట్టు పండితులు చెప్తున్నారు.

ఈ ఏడాది ప్రకృతి విపత్తులతో ప్రపంచంలో గందరగోళ పరిస్థితులు నెలకొంటాయని చెబుతున్నారు. ఓ వైపు యుద్ధాలు, మరోవైపు ఆకలి కేకలు, వర్ష విద్వేషాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారుతుందని అంటున్నారు. అంతేకాదు ముడి చమురు ధరలు భారీగా పెరిగిపోతాయని..దీంతో ప్రజల ఏమి కొనాలి, ఏమి తినాలి అనే స్టేజ్ లో ఆలోచిస్తారు. ఈ ఏడాదిలో మన దేశంలో శ్రావణ, బాద్రపద మాసాల్లో అంటే సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో ఒక వైపు తుపాన్లు దేశాన్ని అల్లకల్లోలం చేస్తే మరో వైపు తాగడానికి చుక్క నీరు తాగడానికి లేక ప్రజలు అల్లాడిపోతారని కాలజ్ఞానంలో ఉన్నట్లు చెబుతున్నారు. భూకంపాలు, వరదలు, కొత్త రోగాలు మరింత పెరుగుతాయని కాలజ్ఞానంలో ఉన్నట్టు చెప్తున్నారు.

అంతేకాదు ఈ ఏడాది సముద్రం ముందుకు చొచ్చుకు వచ్చి తీరప్రాంత నగరాలను ముంచెత్తుతుందట. తిరుపతి వెంకటేశ్వర స్వామి కుడిభుజం కదలడం మొదలవుతుందని.. కొన్ని చోట్ల ఆలయాల్లో వింత శబ్దాలు వినిపిస్తాయని చెప్తున్నారు. కృష్ణా గోదావరి నదులకు వరదలు వస్తాయని కృష్ణా నది మధ్యలో ఈ సంవత్సరం బంగారు రథం కనిపిస్తుంది.. ఆ రథం కాంతిని చూసిన ప్రజల కళ్లు పోతాయని కాలజ్ఞానంలో బ్రహ్మంగారు రాసినట్టు పండితులు చెప్తున్నారు. ఈ సంవత్సరం సౌర తుఫానులు ప్రపంచాన్ని ముంచెత్తనున్నాయని.. దీంతో సమాచార వ్యవస్థ చెల్లా చెదురైపోతుందని.. అంతేకాదు ఈ సంవత్సరం చాలా వింతలు విశేషాలు జరుగుతాయని బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఉన్నట్టు పండితులు తెలియజేస్తున్నారు.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.