ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులతో పాటు మూవీ లవర్స్, ఆడియెన్స్ అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ఫిల్మ్ ‘పుష్ప 2’. ఈ ఏడాది ఆఖర్లో రానున్న ఈ చిత్రం మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ‘పుష్ప’ లాంటి బ్లాక్‌బస్టర్ ఫిల్మ్‌కు సీక్వెల్ కావడం, అల్లు అర్జున్-సుకుమార్ సక్సెస్ఫుల్ కాంబోలో తెరకెక్కుతుండటంతో దీనిపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన సాంగ్స్, టీజర్స్ లాంటి ప్రమోషనల్ మెటీరియల్ కూడా విజయవంతం అవడం ఎక్స్‌పెక్టేషన్స్‌ను అమాంతం పెంచేసింది. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ ఈ మూవీ కోసం ఓ రేంజ్లో వెయిటింగ్ నడుస్తోంది. అందుకే డైరెక్టర్ సుకుమార్, బన్నీలు అన్ని విషయాల్లోనూ ఫుల్ కేర్ తీసుకుంటూ.. హై క్వాలిటీ ఎంటర్టైన్మెంట్ను ఆడియెన్స్‌కు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. ‘పుష్ప 2’ కోసం ఓ విషయంలో వాళ్లు మరింత స్పెషల్ కేర్ తీసుకుంటున్నారని తెలిసింది.
‘పుష్ప’ పార్ట్-1 విషయంలో అన్నింటినీ సూపర్బ్‌గా హ్యాండిల్ చేశాడు డైరెక్టర్ సుకుమార్. మూవీ ప్రమోషన్స్ కూడా బాగానే చేశాడు. రిలీజ్‌కు ముందు ఎక్కువ సమయం లేకపోయినా సినిమాను అందరికీ చేరువ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. మౌత్ పబ్లిసిటీ, సూపర్ హిట్ టాక్ రావడంతో ఇటు తెలుగులో, అటు నార్త్‌లో ‘పుష్ప’ వసూళ్లలో దుమ్మురేపింది. కలెక్షన్స్ ఊచకోత కోసి సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే ‘పుష్ప 2’ మూవీ ప్రమోషన్స్ విషయంలో మాత్రం అస్సలు తగ్గొద్దని బన్నీ చెప్పాడట. ఆల్రెడీ ఆగస్టు 15వ తేదీ నుంచి డిసెంబర్ 6వ తేదీకి ఫిల్మ్ పోస్ట్‌పోన్ అయింది. విడుదలకు చాలా టైమ్ ఉంది. కాబట్టి సాధ్యమైనంత త్వరగా ఫైనల్ కాపీని సిద్ధం చేసి.. పాన్ ఇండియా లెవల్లో గ్రాండ్‌గా ప్రమోషన్స్ చేయాలని భావిస్తున్నారట.
ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ ఇండియాలోనూ ‘పుష్ప 2’పై భారీగా బజ్ ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా భారీగా ప్రమోషన్స్‌ను ప్లాన్ చేస్తున్నారట బన్నీ-సుక్కూ. అందుకోసం ఇప్పటినుంచే ప్రణాళికలు రచిస్తున్నారట. అదే సమయంలో యూఎస్‌తో పాటు పలు ఇతర ఫారెన్ కంట్రీస్‌లోనూ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారని వినిపిస్తోంది. ఒకవేళ ఈ లెవల్లో ప్రమోషన్స్ జరిపి, అవి గనుక సక్సెస్ అయితే బాక్సాఫీస్ షేక్ అవడం గ్యారెంటీ అనే చెప్పాలి. ఇప్పటికే ‘పుష్ప 2’ మీద అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ట్రైలర్‌తో అవి నెక్స్ట్ లెవల్‌కు వెళ్లడం పక్కా. ఇంక ప్రమోషన్స్ కూడా భారీగా చేసి మూవీని అందరికీ మరింత రీచ్ చేస్తే.. ఊహించిన దాని కంటే మరింత భారీగా ఓపెనింగ్స్ రావడం గ్యారెంటీ అని ట్రేడ్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. మొత్తానికి బన్నీ-సుక్కూ ప్లానింగ్‌తో బాక్సాఫీస్ పగిలిపోవడం ఖాయమని చెబుతున్నారు.