కొన్ని ట్రక్కులకు వెనుక భాగాన దిగువన గొలుసు(chain) కట్టి ఉండటాన్ని మీరు చూసే ఉంటారు. ఈ గొలుసు రోడ్డుకు తాకుతూ ఉండటాన్ని కూడా మీరు గమనించే ఉంటారు.
ఇది చూశాక ఈ గొలుసు ఇలా ఎందుకు వేలాడదీశారనే ప్రశ్న మీ మనసులో మెదులుతుంది.
ముఖ్యంగా గుండ్రని ట్యాంక్ ట్రక్కులకు(round tank trucks) ఈ చైన్ కనిపిస్తుంది. అంటే పెట్రోల్, కిరోసిన్ లేదా ఏదైనా గ్యాస్ వంటి ఏదైనా మండే పదార్థాలను(Combustible materials) తరలించే ట్రక్కులకు ఈ గొలుసు కనిపిస్తుంది. ట్రక్కు రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు లేదా రాపిడి(Abrasion) కారణంగా, స్టాటిక్ ఛార్జ్ (ఛార్జ్) వెలువడుతుంది. ఫలితంగా ట్రక్కులో స్పార్క్ వచ్చే ప్రమాదం ఉంది.
అటువంటి పరిస్థితిలో మండే పదార్థాలను తీసుకువెళ్లే ట్రక్కుకు అగ్ని ప్రమాదపు ముప్పు(Fire hazard) ఏర్పడుతుంది. దీనిని నివారించడానికే ఈ గొలుసును ట్రక్కుకు కడతారు. ఈ గొలుసు భూమిని తాకుతున్నందున మొత్తం ఛార్జ్ భూమికి చేరుతుంది. దీంతో ఎటువంటి ప్రమాదం(accident) జరగకుండా ట్రక్కు సురక్షితంగా ఉంటుంది. ఈ చైన్ ట్రక్కుపై వచ్చే మొత్తం చార్జీని భూమికి పంపుతుంది. ఈ గొలుసు ఇనుము(iron) లేదా ఏదైనా ఇతర లోహంతో తయారైవుంటుంది. ఇది మంచి విద్యుత్ వాహకం(Conductor of electricity)గా పనిచేస్తుంది.