కోడి గుడ్డుతో ఎలాంటి వంటలు తయారు చేసినా చాలా రుచిగా ఉంటాయి. గుడ్లను చాలా మంది ఇష్టపడి మరీ తింటూ ఉంటారు. గుడ్లతో ఎన్నో రకాల స్నాక్స్ కూడా తయారు చేయవచ్చు.
గుడ్డుతో చేసేవి కొన్ని వందల రెసిపీలు ఉన్నాయి. గుడ్లతో త్వరగా కూడా వంటలు తయారు చేయవచ్చు. ఇప్పటికే గుడ్లకు సంబంధించి ఎన్నో రకాల వంటలు తెలుసుకున్నాం. లేటెస్ట్‌గా ఇంట్లోనే హెల్దీగా పిల్లలకు నచ్చేలా స్నాక్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అదే టేస్టీ చీజీ ఎగ్ టోస్ట్. చాలా త్వరగా అయిపోతుంది. పిల్లలకు, పెద్దలకు కూడా బాగా నచ్చుతుంది. మరి ఈ చీజీ ఎగ్ రోస్ట్ ఎలా తయారు చేస్తారు? ఇందుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
చీజ్ ఎగ్ టోస్ట్‌కి కావాల్సిన పదార్థాలు:
ఉడికించిన గుడ్లు, ఎండు మిర్చి పేస్ట్, చీజ్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, మిరియాల పొడి, కారం పొడి, పసుపు, చాట్ మసాలా, గరం మసాలా, జీలకర్ర, శనగ పిండి, పెరుగు, బటర్, నిమ్మరసం, కొత్తిమీర.
చీజ్ ఎగ్ టోస్ట్ తయారీ విధానం:
ముందుగా ఒక గిన్నెలో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండు మిర్చి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, మిరియాల పొడి, గరం మాసాలా, చీజ్, చాట్ మసాలా, జీరా పొడి, శనగ పిండి, పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా కలండి. ఆ తర్వాత కోడి గుడ్లను ఉడకబెట్టి పొట్టు తీసి.. గుడ్లపై చాక్‌తో నిలువుగా గాట్లు పెట్టండి. ఇప్పుడు ఈ గుడ్లను ముందుగా కలిపి పెట్టిన మిశ్రమంలో వేసి పావు గంట సేపు మ్యారినేట్ చేయాలి. ఇప్పుడు స్టవ్ మీద నాన్ స్టిక్ గ్రిల్ పాన్ పెట్టి చేయండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా బటర్ వేసి.. గుడ్లను వేయండి.
చిన్న బంట మీద రెండు, మూడు నిమిషాలు ఉడికించండి. చివరగా మళ్లీ బటర్ వేసి అటూ ఇటూ తిప్పండి. ఇలా అన్నీ గుడ్లతో చేయాలి. పైనుంచి కూడా కొద్దిగా చీజ్ తురుము కోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే చీజ్ ఎగ్ టోస్ట్ సిద్ధం. ఇది చాలా రుచిగా ఉంటుంది. చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. పై నుంచి కొద్దిగా చాట్ మసాలా చల్లితే చాలా రుచిగా ఉంటుంది. అంతే పెద్దగా నూనె అవసరం లేకుండా లైట్‌గా ఈ ఎగ్ రోస్ట్ తయారు చేసుకోవచ్చు. పిల్లలకు బాగా నచ్చుతుంది. ఎప్పుడూ చేసే టోస్టుల కంటే ఇది బ్రెడ్ అవసరం లేకుండా నేరుగా గుడ్లతోనే చేస్తారు.