డొనేట్ చేసిన ఫుడ్ తిన్న బాయ్స్ హాస్టల్ పిల్లలు.. కాసేపటి తర్వాత

తిరుపతిలోని రేణిగుంట బీసీ బాయ్స్ హాస్టల్‌లో ఫుడ్‌ పాయిజన్‌ కలకలం రేపింది. ఆదివారం రాత్రి తిరుపతికి చెందిన వారు ఫుడ్‌ డొనేట్ చేయగా.. ఆ ఫుడ్‌ తిన్నవారిలో 12 మంది విద్యార్థులు వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఘటనపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆరా తీశారు. ప్రస్తుతం హాస్టల్‌లో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. బాయ్స్ హాస్టల్‌లో మొత్తం 42 మంది విద్యార్థులు ఉన్నారు.


👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.