Clove Tea : చలికాలంలో ఊపిరితిత్తుల్లో కఫాన్ని కరిగించే లవంగం టీ!

Clove Tea : లవంగం.. ఇది ఔషదగుణాలు కలిగిన ఒక మసాలా దినుసు. ఉంది. ప్రతి ఇంటి వంటగదిలో తప్పనిసరిగా ఉంటుంది. బిర్యానీ వంటి వంటకాలలో తయారీలో ఉపయోగిస్తారు.
లవంగాలలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. చలికాలంలో లవంగం టీని క్రమం తప్పకుండా తాగడం వల్ల జలుబు, దగ్గుతో సహా అన్ని సమస్యల నుంచి రక్షించుకోవచ్చు.


లవంగాలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలం. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి . బరువు తగ్గాలనుకుంటే లవంగం టీ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. శీతాకాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. గొంతు నొప్పి, మంట, దగ్గు, జలుబు మొదలైన సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. వీటిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి . బరువు తగ్గాలనుకుంటే లవంగం టీ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
దంతాలలో నొప్పి ఉంటే, చిగుళ్ళలో వాపు ఉంటే, మీరు లవంగం టీ తాగాలి. ఈ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. నోట్లోని బ్యాక్టీరియాను చంపడంతో పాటు, ఊపిరితిత్తుల్లోని కఫాన్ని కరిగించి, బయటకు వచ్చేలా చేసే గుణం లవంగాలకు ఉంటుంది. లవంగాలు రోగనిరోధకశక్తిని బలపరుస్తాయి. దగ్గు, జలుబు, ఛాతీలో ఇబ్బంది లాంటి శ్వాసకోశ సమస్యలు తలెత్తినప్పుడు లవంగ టీ తీసుకోవచ్చు.

లవంగం టీ తయారీ ;

లవంగం టీ చేయడానికి ఒకటిన్నర కప్పు నీటిలో రెండు లవంగాలను బాగా దంచి మెత్తని పొడిగా చేసుకోవాలి. పొయ్యి పైన ఉంచి కొద్దిసేపు మరిగించాలి. తర్వాత టీని ఫిల్టర్ చేసి అందులో ఒక చెంచా తేనె కలపాలి. ఆ తర్వాత దానిని తాగాలి. ఉదయం లవంగం టీని తీసుకోవటం మంచిది.