కరివేపాకు వలన అనేక ఆరోగ్యలాభాలున్నాయి.. అయితే ఎలా తీసుకోవాలంటే

www.mannamweb.com


వంట రుచిని పెంచడానికి లేదా మంచి సువాసన తీసుకురావడానికి మాత్రమే కాదు ఈ కరివేపాకు అనేక ఔషధ గుణాలు కలిగి ఉండి ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ వంటి వివిధ ఉపయోగకరమైన పదార్థాలున్నాయి.

దక్షిణాది వంటల్లో కరివేపాకు విశిష్ట స్థానం ఉంది. కూరల్లో, పులుసు, ఫ్రై, పచ్చళ్ళ పోపు, ఉప్మా ఏదైనా సరే వంటలో కొన్ని కరివేపాకులను కలుపుకుంటే అద్భుతమైన రుచి వస్తుంది. ఈ పదార్ధం వండినప్పుడు సుగంధ వాసన వస్తుంది.

కరివేపాకు ఆహారానికి అదనపు రుచిని ఇవ్వడమే కాదు శరీరంలోని వివిధ వ్యాధులకు మంచి మెడిసిన్. కడుపు నొప్పి, జీర్ణక్రియ సమస్యల నుండి, కొవ్వును తొలగిస్తుంది. వంటకే కాదు, నీళ్లలో కలిపి డిటాక్స్ డ్రింక్ కూడా తయారు చేసుకోవచ్చు. కరివేపాకును రోజూ తింటే ఎన్ని లాభాలో తెలుసా?

గుండె సమస్యలు: నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించబడిన ఒక నివేదిక ప్రకారం కరివేపాకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో ‘చెడు’ కొలెస్ట్రాల్ , ట్రైగ్లిజరైడ్‌ల స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు. అయితే దీన్ని నిర్ధారించడానికి మరింత పరిశోధన అవసరం.

డిటాక్సిఫికేషన్: కరివేపాకులో నానబెట్టిన నీరు తాగడం వలన శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్‌ను సహజ పద్ధతిలో తొలగించడానికి సహాయపడుతుంది. శరీరంలో పేరుకుపోయిన ఈ విషపదార్థాలను తొలగించగలిగితే పొట్ట, చర్మం, జుట్టు మొదలుకుని అన్ని సమస్యలూ నయమవుతాయి. అధిక శరీర బరువు కూడా తగ్గుతుంది.

జీర్ణక్రియ సహాయం: కొంతమంది జీర్ణ రుగ్మతల సమస్యతో బాధపడుతూ క్రమం తప్పకుండా మందులు వాడుతూ ఉంటారు. అయితే కరివేపాకు నానబెట్టిన నీళ్లను తీసుకుంటే రకరకాల కడుపు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు కరివేపాకు మలబద్ధకాన్ని నయం చేయడంలో సహాయపడుతుంది.

బరువు నియంత్రణ: కరివేపాకులో కార్బజోల్ ఆల్కలాయిడ్స్ ఉంటాయి. ఇది శరీరం నుండి అదనపు కొవ్వును తొలగించడానికి ప్రత్యేకంగా పనిచేస్తుంది. ఆహారం, వ్యాయామంతో పాటు, కరివేపాకులను క్రమం తప్పకుండా ఉదయం ఖాళీ కడుపుతో లేదా వంటలో తినడం వల్ల కొవ్వు త్వరగా తగ్గుతుంది.

బ్లడ్ షుగర్ కంట్రోల్ – కరివేపాకు కూడా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది. ఈ ఆకుల్లో ఉండే వివిధ సమ్మేళనాలు మధుమేహం వల్ల వచ్చే కిడ్నీ సమస్యలను కూడా నివారిస్తాయని వైద్యుల అభిప్రాయం.