అపరిచితుల నుంచి వచ్చే ఫోన్‌లపై అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ముఖ్యంగా +94777 455913, +37127913091, +56322553736, +37052529259, +255901130460 ఇలాంటి నంబరుతో ఫోన్ వస్తే ఎత్తరాదన్నారు. ప్రధానంగా +371 (లాత్వియా), +375 (బెలారస్), +381 (సెర్బియా), +563 (లోవా), +370 (లిథువేనియా), +255 (టాంజానియా) వంటి కోడ్‌లతో మొదలయ్యే నంబరుతో రింగ్ చేసి ఎత్తిన తర్వాత హ్యాంగ్ చేస్తారన్నారు. తిరిగి ఫోన్ చేస్తే కాంటాక్ట్ జాబితాతోపాటు బ్యాంకు, క్రెడిట్ కార్డు ఇతర వివరాలు మూడు సెకన్లలో కాపీచేసుకునే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా చి 90 లేదా చి09 నంబర్లను నొక్కాలని ఎవరైనా సూచిస్తే ఆ ప్రయత్నం చేయొద్దన్నారు. అలా చేస్తే మీ సిమ్ కార్డుని యాక్సెస్ చేయడానికి, మీ ఖర్చుతో కాల్ చేయడానికి, మిమ్మల్ని నేరస్థుడిగా చేయడానికి కుట్రపన్నుతున్నట్లుగా గుర్తించాలని తెలిపారు.