చేతిలో ఫుల్‌ క్యాష్‌ ఉన్నా ఆరు నెలలు ఆగాల్సిందే.. ఈ కార్లకు డిమాండ్‌

www.mannamweb.com


ప్రముఖ దేశీయ ఆటో మొబైల్ సంస్థ మహీంద్రా భారత మార్కెట్లోకి తీసుకొచ్చిన కొత్త కారు రికార్డు సృష్టిస్తోంది. భారీ అమ్మకాలతో దూసుకుపోతోంది. మహీంద్ర ఇటీవల విడుదల చేసిన ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ, మహీంద్ర ఎక్స్‌యూవీ300 కార్ల అమ్మకాలు జోరందుకున్నాయి.

ఈ మోడల్‌ కార్లు నెలకు సగటును ఏకంగా 9000 నుంచి 10000 వరకు అమ్ముడు పోతున్నాయి.

అంతకు ముందు 4 వేలుగా ఉన్న ఈ సంఖ్య ఇప్పుడు ఏకంగా 10 వేలకు పెరగడం విశేషం. దీంతో ఈ కార్లు కొనుగోలు చేయాలనుకునే వారు ఎదురు చూడాల్సిందే. చేతినిండా డబ్బులు ఉన్నాయి, ఫుల్ డౌన్‌పేమెంట్‌ చేసి కొనుగోలు చేస్తామన్నా కుదరదు. ఈ కార్లను ముందుగా ఆర్డర్‌ చేసుకుంటే వెయిటింగ్ పీరియడ్‌ వేచి చూడాల్సిందే.

ఈ కారు పెట్రోల్‌ వేరియంట్‌పై గరిష్టంగా ఏకంగా ఆరు నెలల ఆగాల్సిందే. దీనిబట్టే ఈ కార్లకు ఎంత డిమాండ్‌ ఉందో అర్థం చేసుకోవచ్చు. బేస్ MX1 పెట్రోల్ వేరియంట్ ఆరు నెలల వరకు అత్యధిక వెయిటింగ్ పీరియడ్‌ని ఉంది. కాగా ఇతర వేరియంట్స్‌కు రెండు నెలల సమయం పడుతుంది. మిడ్-స్పెక్ AX5 ట్రిమ్ కూడా నాలుగు నెలల పాటు వెయింటింగ్ పీరియడ్ ఉండడం గమనార్హం. ఇంతకీ కార్లకు ఇంత డిమాండ్‌ ఎందుకు ఉంది.? ఈ కారులో ఉన్న ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ కారులో డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్‌ ఫీచర్‌ను ఇచ్చారు. లెవెల్ 2 ADAS టెక్నాలజీ, పనోరమిక్ సన్‌రూఫ్‌ని కూడా అందించారు. 1.2-లీటర్ టర్బో-పెట్రోల్, 1.2-లీటర్ డైరెక్ట్ ఇంజెక్షన్ టర్బో-పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ వేరియంట్స్‌లో ఈ కారును తీసుకొచ్చారు. ఇక పెట్రోల్ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో తీసుకొచ్చారు. అయితే డీజిల్‌ ఇంజన్‌ మాన్యువల్‌, 6-స్పీడ్ AMT వేరియంట్స్‌లో తీసుకొచ్చారు. ధర విషయానికొస్తే మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ ధర రూ. 7.49 లక్షల నుంచి రూ. 15.49 లక్షల వరకు ఉంది.