నైరుతి బంగాళాఖాతం మరియు దానికి ఆనుకుని ఉన్న ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాల మీదుగా నున్న తీవ్ర వాయుగుండం ( నిన్నటి దిత్వా తుఫాను అవశేషము ) క్రమంగా బలహీనపడుతోంది.
గడచిన 6 గంటల్లో 05 కి.మీ వేగంతో ఉత్తరం వైపు నెమ్మదిగా కదులుతూ నైరుతి బంగాళాఖాతం ,సరిహద్దు పశ్చిమ మధ్యబంగాళాఖాతం ,ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి & దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలు మరియు 12.8° ఉత్తర అక్షాంశం మరియు రేఖాంశం 80.6°తూర్పు రేఖాంశం, చెన్నైకి తూర్పు-ఆగ్నేయంగా 50 కిమీ (భారతదేశం), పుదుచ్చేరికి ఈశాన్యంగా 130 కిమీ (భారతదేశం), కడలూర్‌కు ఈశాన్యంగా 150 కిమీ, నెల్లూరు కు దక్షిణ ఆగ్నేయముగా 200 కిమీ దూరములో కేంద్రీకృతమై ఉంది. ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాల నుండి వాయుగుండ కేంద్రానికి కనీసం 40 కి.మీ. దూరంలో మరియు తమిళనాడు-పుదుచ్చేరి మరియు దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకు సమాంతరంగా ఉత్తరం వైపు నెమ్మదిగా ప్రయాణించి , రాగల 12 గంటల్లో వాయుగుండముగా బలహీనపడే అవకాశం ఉంది. ఈ తీవ్ర వాయుగుండం ఈరోజు డిసెంబర్ 01 మధ్యాహ్నం నాటికి చెన్నై తీరం నుండి కనీసం 30 కి.మీ దూరంలో నైరుతి & ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంటుంది.
భారీ వర్ష సూచన
బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాన్ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు రహదారులు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపై వర్షం నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలువలు పొంగిపొర్లుతున్నాయి. తుఫాన్ తీవ్రత తగ్గినా జిల్లాకు భారీ వర్ష సూచనలు ఉండటంతో లోతట్టు ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లాలో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి.
వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల రెండు రోజుల వరకు వాతావరణ సూచనలు :-
—————————————————————
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-
———————————-
రేపు ;-
—–
తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.
భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది .
ఈదురు గాలులు గంటకు 35-45 కీ.మీ గరిష్టముగా 55 కీ.మీ వేగముతో వీచే అవకాశముంది.
ఎల్లుండి ;-
——–
తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.
ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది .
దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ :-
———————————–
రేపు ;-
—–
తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది.
భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది .
ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది .
ఈదురు గాలులు గంటకు 35-45 కీ.మీ గరిష్టముగా 55 కీ.మీ వేగముతో వీచే అవకాశముంది
ఎల్లుండి ;-
———–
తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది.
ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది .
రాయలసీమ:-
—————
రేపు ;-
—–
తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.
భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది .
ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది .
ఈదురు గాలులు గంటకు 35-45 కీ.మీ గరిష్టముగా 55 కీ.మీ వేగముతో వీచే అవకాశముంది
ఎల్లుండి ;-
———–
తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది.
ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది .
ఎగిసిపడుతున్న అలలు
ఇకపోతే దిత్వా తుఫాను ప్రభావంతో బాపట్ల జిల్లాలోని వాడరేవు, రామాపురం సముద్ర తీరాల్లో అలలు ఎగసిపడుతున్నాయి. ఓడరేవు తీరంలో సముద్రం 4 అడుగుల మేర ముందుకు చొచ్చుకొచ్చినట్లు సంబంధిత అధికారులు తెలుపుతున్నారు. తుఫాను కారణంగా వాడరేవు, రామాపురం, కటారివారిపాలెం, పొట్టి సుబ్బయ్యపాలెం బీచ్‌లు మూసివేశారు. సముద్ర తీర మార్గాల్లో పర్యాటకు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు.