Lord Shiva Snake: పరమశివుడి మెడలో పాము ఎందుకు ఉంటుందో తెలుసా..? ఆ పాము మెడలో ఉండటం వల్లే శివుడు ప్రాణసంకటం నుంచి కాపాడబడుతున్నాడన్న విషయం ఎంత మందికి తెలుసు..? ఆ పాము చేసిన మేలు శివుడు ఎప్పటికి మర్చిపోకూడదనే ఉద్దేశంతో అలాగే మెడలో ఉండిపోమ్మన్నాడట. ఇంతకీ ఆ పాము ఎందుకు మెడలో ఉందో ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.
పరమశివుడి విశ్వరూపం:
పరమశివుడు క్లాస్, మాస్ ఎవ్వరైనా సరే ఇట్టే భక్తిలో పడిపోయే దేవుడు. ఎన్నో పేర్లతో ఎన్నో రూపాలతో ఉన్నా లింగాకారంలోని ఆ దేవదేవుడిని భక్తితో కలిస్తే భక్తుల కొంగుబంగారంమై కదిలివస్తాడని భక్తులు విశ్వాసం. అందుకే ఆయనను భోళా శంకరుడు అంటాడు. శ్రీశైలంలో మల్లయ్యగా.. కాశీలో విశ్వేశ్వరుడిగా.. నాసిక్‌లో త్రియంబకేశ్వరుడిగా.. ఇలా దేశంలో పన్నెండు ప్రాంతాల్లో పన్నెండు జ్యోతిర్లింగాలు వెలిసి భక్తులను కాచుకుంటన్నాడు ఈశ్వరుడు. అలాంటి పరమశివుడి మెడలో పాము ఎందుకు ఉంటుందో చాలా మందికి తెలియదు.. కానీ ఆ పాము నాగజాతిలోనే శ్రేష్టమైనది. అ పామే లేకపోతే ఆ బోళాశంకరుడి పరిస్థితి ఎలా ఉండేదో అనే అనుమానం కలగకమానదు. లోక కళ్యాణం కోసం తన ప్రాణసంకటాన్ని కూడా లెక్కచేయని ఆ శివుడినే కాపాడిన పాము వాసుకి గురించి అది పరమశివుడి మెడలోకి ఎలా వచ్చిందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
హాలాహలాన్ని తాగిన శివుడు:
శివుడి మెడలో అసలు పాము ఎందుకు ఉంటుందో మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు. శివయ్య మెడలో కనిపించే ఆ పాము పేరు వాసుకు దేవతలు, రాక్షసుల మధ్య సముద్ర మథనం జరిగినప్పుడు కొండను చిలికి అమృతాన్ని తీయడానికి ఈ పామును ఉపయోగించారట. అప్పుడు హాలాహలం అనే అతి భయంకరమైన కాలకూట విషం సముద్రగర్భం నుంచి ఉద్బవించిందట. ఆ హాలాహలం చూసి దేవతలు, రాక్షసులు భయంతో వణికిపోయారట. ఆ విషం ఒక్క క్షణంలోనే బ్రహ్మాండాన్నే నాశనం చేసే శక్తి. కలిగినదట. అప్పుడు అందరూ పరమ శివుడి వద్దకు వెళ్లి ఆ భయంకరమైన విషం నుంచి బ్రహ్మాండాన్ని కాపాడాలని మొరపెట్టుకున్నారట. శివుడు సమస్త లోకాలను కాపాడేందుకు వెళ్లి ఆ భయంకరమైన విషాన్ని తాగేశాడట.
విషాన్ని అడ్డుకున్న పార్వతిదేవి, వాసుకి:
శివుడు విషం తాగిన విషయం తెలుసుకున్న పార్వతీదేవి భయంతో ఆ విషం శివుడి కంఠం దాటి శరీరంలోకి ప్రవేశిస్తే.. చాలా ప్రమాదకరం అని తెలుసుకుని.. ఆ విషం ఆయన కంఠం నుంచి కిందకు దిగకుండా ఆయన గొంతును గట్టిగా నొక్కి పట్టుకుంటుందట. కానీ పార్వతి శివుడి కంఠాన్ని ఎక్కువ సేపు అలా నొక్కి పట్టుకుని ఉండలేదట. కాబట్టి శివుడి పరమభక్తుడైన వాసుకి వెంటనే శివుడి దగ్గరకు వెళ్లి.. ‘పరమేశ్వర నేను మీ మెడకు చుట్టుకుని ఈ విషం మీ కంఠం నుంచి కిందకు దిగకుండా చూసుకుంటాను. అంతే కాదు. మీ కంఠంలో ఆలంకరణగా మీతోనే ఉండిపోతాను’ అని వేడుకున్నాడట. దీంతో శివుడు చిరునవ్వుతో వాసుకి మాటను అంగీకించాడట. అప్పటి నుంచి వాసుకి శివయ్య మెడలో శాశ్వతంగా నిలిచిపోయాడట.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.




































