TG News: పేలిన రియాక్టర్..ఒకరి మృతి.. పరుగులు తీసిన కార్మికులు

www.mannamweb.com


భారీ శబ్దంతో రియాక్టర్ పేలడంతో భయంతో కార్మికులు బయటకు పరుగులు తీశారు. రియాక్టర్ పేలిన వెంటనే అలెర్ట్ అయిన కంపెనీ యాజమాన్యం వెంటనే ఎమర్జెన్సీ సైరన్ మోగించింది. ప్రమాదవశాత్తు పేలుడు పదార్ధాలు బ్లాస్ట్ అవడంతో భవనం కూలిపోయింది.

జిల్లాలోని యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరులో భారీ పేలుడు సంభవించింది. ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్‌లో కంపెనీలో రియాక్టర్ (Reactor exploded) పేలింది. భారీ శబ్దంతో రియాక్టర్ పేలడంతో భయంతో కార్మికులు బయటకు పరుగులు తీశారు. రియాక్టర్ పేలిన వెంటనే అలెర్ట్ అయిన కంపెనీ యాజమాన్యం ఎమర్జెన్సీ సైరన్‌ను మోగించింది. ప్రమాదవశాత్తు పేలుడు పదార్ధాలు బ్లాస్ట్ అవడంతో భవనం కూలిపోయింది. ఈ ఘటనలో ఒక కార్మికుడు మృతి చెందగా… ఎనిమిది మందికి గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే క్షతగాత్రులను 108లో ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తీసుకుచ్చారు. ఈరోజు ఉదయం ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్ డిటోనేటర్ ప్లాంట్‌లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. పేలు పదార్థాల ధాటికి భవనం కూడా కుప్పకూలింది. కనకయ్య, ప్రకాష్ అనే ఇద్దరు కార్మికుల పరిస్థితి విషమంగా ఉంది. మొత్తం ఎనిమిది మంది కార్మకులకు తీవ్ర గాయాలయ్యాయి.

గాయపడిన వారిని భువనగిరి ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. అయితే చికిత్స పొందుతూ కార్మికుడు కనకయ్య మృతిచెందాడు. మరో కార్మికులు మొగిలిపాక ప్రకాష్ పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే సికింద్రాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. గతంలోనూ ఈ కంపెనీలో జరిగిన పేలుడు ధాటికి ఓ కార్మికుడు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇప్పుడు తాజాగా పెద్దఎత్తున పేలుడు సంభవించింది. దీంతో కార్మికులు ప్రాణభయంతో కంపెనీ నుంచి బయటకు పరుగులు తీశారు.