ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ సర్వీస్‌ పొడిగింపు

www.mannamweb.com


ఆరు నెలలు పొడిగించాలని కేంద్రానికి లేఖ

అమరావతి, జూన్‌ 19 : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ పదవీకాలాన్ని 6నెలలు పొడిగించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.

ఈ మేరకు బుధవారం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. నీరబ్‌ కుమార్‌ కొద్ది రోజుల కిందటే ఏపీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ నెలాఖరులో ఆయన రిటైర్‌ కాబోతున్నారు. కానీ, ప్రభుత్వం ఆయన సేవలు కొనసాగించాలని నిర్ణయించింది.

అందులో భాగం గా కేంద్రానికి లేఖ రాసింది. గత ప్రభుత్వంలోనే ఆయన సీఎస్‌ కావాల్సి ఉంది. కానీ, జగన్‌ ఆయనను పక్కన పెట్టి జూనియర్‌ అయిన జవహర్‌ రెడ్డికి పట్టం కట్టారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే సీనియార్టీకి ప్రయార్టీ ఇచ్చారు.

సీనియారిటీలో ముందున్న నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ను సీఎ్‌సగా ఎంపిక చేశారు. ప్రస్తుతం ఆయనకు 10 రోజుల సర్వీస్‌ మాత్రమే ఉండడంతో మరికొంత కాలం పాటు అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో సర్వీస్‌ పొడిగింపు కోరుతూ కేంద్రానికి లేఖ రాశారు. కేంద్రం ఒకే విడతలో ఆరు నెలలు పొడిగింపు ఇస్తుందా.. లేదంటే మూడు నెలల చొప్పున రెండుసార్లు పొడిగిస్తుందా అన్నది వేచి చూడాలి.