రాయదుర్గం(హైదరాబాద్): ప్రేమ విఫలమై యూట్యూబర్ కోమలి (21) ఆత్మహత్యకు పాల్పడింది. రాయదుర్గం ఇన్‌స్పెక్టర్ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్టణానికి చెందిన కోమలి.. హైదరాబాద్‌లో బీఎస్సీ చదువుతోంది. మణికొండలోని చిత్రపురి కాలనీ ఎల్‌ఐజీలో బంధువుల వద్ద ఉంటోంది. విశాఖపట్నానికే చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, యూట్యూబర్ నిఖిల్ రెడ్డిని ఆమె ప్రేమిస్తోంది. కోమలి నుంచి దూరంగా ఉండేందుకు నిఖిల్ ప్రయత్నిస్తుండటంతో ఆరు నెలల క్రితం ఆమె ఆత్మహత్యకు యత్నించగా.. బంధువులు సర్దిచెప్పారు. ఇటీవల పెళ్లి విషయంలో కోమలి, నిఖిల్‌రెడ్డి గొడవపడ్డారు. ఈ క్రమంలో సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో కోమలి ఉరివేసుకుంది. ఆమె తల్లి మంగళవారం రాయదుర్గం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


































