– ఓ కొరియోగ్రాఫర్.. ఓ అసిస్టెంట్.. కొన్నాళ్లు సాఫీగా సాగిన జర్నీలో ఇప్పుడో బిగ్ ట్విస్ట్.. జానీ మాస్టర్ తనను వేధించారంటూ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టిందో లేడీ కొరియోగ్రాఫర్..
ఆ FIRలో చాలా సంచలన విషయాలు ప్రస్తావించింది. తాను ఎదుర్కొన్న వేధింపులు.. తిన్న దెబ్బలు.. ఓ దశలో పెళ్లి ప్రపోజల్.. ఆ తర్వాత జానీ మాస్టర్ భార్య కూడా ఎంటరవ్వడం.. ఇవన్నీ ఆ FIRలో చెప్పుకొచ్చింది.
టీవీ9 చేతిలో జానీ మాస్టర్ కేసు FIR కాపీ.. బాధితురాలి ఆరోపణల వివరాలు…
— జానీమాస్టర్ పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు
— ఢీ12 షోలో ఇద్దరికి పరిచయం ఏర్పడింది – బాధితురాలు
— 2019లో కాల్ చేసి తన గ్రూపులో చేర్చుకుంటానన్నారు
— ముంబై సహా వివిధ నగరాల్లో అవుట్‌డోర్‌లో ఉన్నప్పుడు..
–జానీ మాస్టర్ నన్ను లైంగికంగా వేధించారు
— ప్రతిఘటిస్తే కొట్టి, హింసించేవారు
— మతం మార్చుకుని పెళ్లిచేసుకోవాలని ఒత్తిడి చేశారు
— లేకపోతే ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని బెదిరించారు
— షూటింగ్ వానిటీ వ్యాన్‌లో ఎన్నొసార్లు వేధించారు
— అందరిముందే అసంబద్ధంగా టచ్ చేసేవారు
— నా ఇంటికి వచ్చి జానీ మాస్టర్ భార్య పలుమార్లు కొట్టారు
ఇవే కాదు.. ఆగస్ట్ 17న గుర్తుతెలియని వ్యక్తి బెదిరించాడని.. ఆగస్టు 28న తన ఇంటి ముందు ఒక పార్సిల్ వచ్చిందని.. అందులో కంగ్రాచులేషన్స్ బట్ బీ వెరీ కేర్‌ఫుల్.. అని రాసి ఉంది లాంటి పలు అంశాలు పోలీసులు నమోదు చేసిన ఫస్ట్ ఇంట్రాగేషన్ రిపోర్ట్‌లో ఉన్నాయి.