భారతదేశంలో ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలు పెట్టుబడులకు గరిష్ట స్థిరత్వాన్ని అందిస్తూ హామీతో కూడిన రాబడిని అందిస్తాయి. అయితే ఈ డిపాజిట్లపై బ్యాంకులను బట్టి వివిధ వడ్డీ రేట్లను అందిస్తూ ఉంటారు. పెట్టుబడిదారులు మెచ్యూరిటీపై రాబడిని పొందవచ్చు లేదా వారు నెలవారీ, త్రైమాసిక, అర్ధ-వార్షిక, వార్షిక ఉపసంహరణలను కూడా ఎంచుకోవచ్చు. ముఖ్యంగా వడ్డీ రేట్లు సాధారణ ప్రజలు ఒకలా, సీనియర్ సిటిజన్లకు మరోలా, సూపర్ సీనియర్ సిటిజర్ల ఇంకోలా ఉంటాయి. ఈనేపథ్యంలో ప్రముఖ బ్యాంకులు అయిన ఎస్బీఐ, కెనరా, ఐసీఐసీఐ బ్యాంకులు ఎఫ్డీలపై అందించే వడ్డీ గురించి మరిన్ని వివరాలను తెలసుకుందాం.
స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా సాధారణ పౌరులు 6.50 శాతం వడ్డీ రేటు, సీనియర్ సిటిజన్లకు ఇది 7.50 శాతం వడ్డీ రేటు అందిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంకు సాధారణ పౌరులకు 7 శాతం వడ్డీ రేటు, సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం వడ్డీ రేటును ఇస్తుంది. కెనరా బ్యాంకు సాధారణ పౌరులకు 6.70 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేటు 7.20 శాతంగా వడ్డీ రేటును ఇస్తుంది.
స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా రూ.6 లక్షలు ఐదేళ్లపాటు ఎఫ్డీ చేస్తే సాధారణ ప్రజలు రూ.2,28,251.86 వడ్డీ అందిస్తారు. రూ. 12 లక్షలు పెట్టుబడి పెడితే వారు రూ. 4,56,503.73 వడ్డీ వస్తుంది. అలాగే సీనియర్ సిటిజన్లు రూ. 6 లక్షలు పెట్టుబడి పెడితే వారురూ. 2,69,968.82 మేర వడ్డీను పొందవచ్చు.
కెనరా బ్యాంకు రూ.6 లక్షల పెట్టుబడిపై సాధారణ పౌరులకు రూ. 2,36,440.15 వడ్డీని అందిస్తుంది. అలాగే రూ. 12 లక్షల పెట్టుబడి పెడితే రూ. 4,72,880.30 వడ్డీను అందిస్తుంది.
ఐసీఐసీఐ బ్యాంకు రూ. 6 లక్షలను పెట్టుబడి పెడితే వడ్డీ రూపంలో రూ. 2,48,866.92 పొందవచ్చు. రూ. 12 లక్షల పెట్టుబడిపై వారు రూ. 4,97,733.83 వడ్డీ వస్తుంది.
కెనరా బ్యాంకు సీనియర్ సిటిజన్లకు రూ.6 లక్షల పెట్టుబడిపై రూ. 2,57,248.65, రూ.12 లక్షలు పెట్టుబడి పెడితే వారికి వడ్డీ రూపంలో రూ. 5,14,497.30 అందిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంకు సీనియర్ సిటిజన్లకు రూ.6 లక్షలు పెట్టుబడి పెడితే వడ్డీ కింద రూ. 2,69,968.82, రూ.12 లక్షలు పెట్టుబడి పెడితే రూ.5,39,937.63 రాబడి వస్తుంది.