ఫ్లాష్.. ఫ్లాష్.. ఫ్లాష్.. డార్క్ వెబ్‌లో ఫోన్ ట్యాపింగ్ కేసు ఆడియోలు

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరో సంచలనాన్ని సృష్టిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల పొలిటికల్ లీడర్లు, ప్రతిపక్ష నాయకులు, పాపులర్ హీరోయిన్లు, ప్రముఖ నిర్మాతలు, దర్శకుల ఫోన్లు ట్యాప్ అయినట్లు కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే.


ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం విచారిస్తున్నది. తాజాగా ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును సిట్ ఎంక్వైరీ చేస్తోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో మరో న్యూస్ తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తోంది.

నాడు ప్రభాకర్ రావు బృందం ట్యాప్ చేసిన ఆడియోలను డార్క్ వెబ్‌లో అమ్మకానికి పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం విచారణను ఎదుర్కొంటున్న ఓ అధికారి ఈ ఫోన్ ట్యాపింగ్ ఆడియాలను అమ్ముకున్నట్లు సోషల్ మీడియా కోడైకూస్తోంది. బిట్ కాయిన్ రూపంలో పెద్ద మొత్తంలో వ్యాపారం జరిగిందని, ఇప్పటికీ దుబాయ్, డల్లాస్ వేదికగా ఇంకా ఫోన్ ట్యాపింగ్ కంటిన్యూ అవుతుందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. మొత్తానికి ఈ టాపిక్ ట్రెండింగ్‌లో ఉండగా.. ప్రముఖులంతా రాజకీయ నాయకుల చేతుల్లో బలయ్యారని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. మరి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న వార్త ఎంత వరకు నిజమో తెలియదు కానీ, కేసు విచారణ కీలక దశలో ఉన్న సమయంలో ఈ న్యూస్ వైరల్ కావడం అటు టాలీవుడ్, ఇటు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.