రూ.80 వేల ఐఫోన్ కేవలం రూ.30,000కే.. Flipkart Super Deal.. త్వరపడండి..

యాపిల్ ఐఫోన్ వాడాలని ఎవరికి ఉండదు చెప్పండి, ఐఫోన్ అంటేనే ఒక కల, ఒక బ్రాండ్ వాల్యూ. కానీ చాలామంది మధ్యతరగతి ప్రజలకు దాని ధర చూస్తేనే గుండె గుభేల్ అంటుంది.


అయితే మీ కల నెరవేర్చుకునే సమయం వచ్చేసింది. ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే ఆఫర్‌తో ఐఫోన్ 15ని మీ ముందుకు తెచ్చింది. ఇంతకుముందెన్నడూ లేనంత తక్కువ ధరకు, అక్షరాలా రూ.30,000లోపే మీ సొంతం చేసుకోవచ్చు.

* రూ.30,000లోపే ఐఫోన్ 15 ఎలా సాధ్యం..

ఐఫోన్ 15 (256GB స్టోరేజ్) అసలు ధర రూ.79,900. కానీ ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు దీనిపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. చాలా రకాల ఆఫర్లతో మీకు ఈ ధరకి లభిస్తుంది. మొదటగా ఫ్లిప్‌కార్ట్ నేరుగా రూ.9,901 డిస్కౌంట్ ఇస్తోంది. అంటే ధర ఒక్కసారిగా రూ.69,999కి పడిపోతుంది.

మీ దగ్గర కొన్ని ప్రత్యేక బ్యాంకుల క్రెడిట్ లేదా డెబిట్ కార్డులు ఉంటే, ఎక్స్‌ట్రా డిస్కౌంట్ పొందొచ్చు. అంతేకాకుండా, పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే, ఏకంగా రూ.39,150 వరకు తగ్గింపు ఇస్తున్నారు. మీ పాత ఫోన్ బాగా పనిచేస్తూ, మంచి కండిషన్‌లో ఉంటే అప్పుడు ఐఫోన్ 15 కేవలం రూ.30,849కే వస్తుంది.

చివరి ధర మీ ఓల్డ్ ఫోన్ మోడల్, దాని పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. ఫోన్ మంచి కండిషన్‌లో ఉంటే, ఐఫోన్ 15ని అతి తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. అయితే ఇప్పటికే ఐఫోన్ 16 సిరీస్ రిలీజ్ అయింది. అది AI ఫీచర్లకు సపోర్ట్ చేసే ప్రాసెసర్‌తో వచ్చింది. డిజైన్ కూడా బాగా మారిపోయింది.

మరి ఐఫోన్ 15 ఇప్పుడు కొనుగోలు చేయొచ్చో లేదో తెలుసుకుందాం. ఐఫోన్ 15 అంటేనే ప్రీమియం ఫోన్. దీంట్లో ఫీచర్లు అన్నీ అదిరిపోతాయి. ఇంకా ఎందుకు కొనాలంటే ఇందులో నాణ్యమైన 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లే ఉంటుంది. ఫొటోలు, వీడియోలు చూడటానికి కళ్లుచెదిరే అనుభూతి లభిస్తుంది. డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంది.

* పర్ఫార్మెన్స్, కెమెరాలు, బ్యాటరీ లైఫ్

ఐఫోన్ 15లో A16 బయోనిక్ చిప్ ఉంటుంది. గేమ్స్ ఆడినా, ఎన్ని పనులు ఒకేసారి చేసినా అసలు ల్యాగ్స్ కనిపించవు. దీనిలో 48MP మెయిన్ కెమెరా ఉంటుంది. ఫొటోలు చాలా క్లారిటీగా వస్తాయి. 12MP అల్ట్రా-వైడ్ లెన్స్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP ఫ్రంట్ కెమెరా మంచి క్లారిటీతో పనిచేస్తుంది.

అలాగే దీనిలో 3349mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. రోజంతా హాయిగా వాడుకోవచ్చు. ఛార్జింగ్ టెన్షన్ ఉండదు. IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ ఉంది. అంటే నీళ్లు పడ్డా, దుమ్ము పడ్డా ఫోన్‌కి ఏమీ కాదు. 256GB స్టోరేజ్, 6GB RAM ఉంటుంది. యాప్స్, ఫొటోలు, వీడియోలకు సరిపోతుంది.

* కొనొచ్చా, లేదా..

మీకు ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కావాలి అనుకుంటే, మంచి కెమెరా, లాంగ్ బ్యాటరీ లైఫ్ ఉండాలి అనుకుంటే, ఐఫోన్ 15 బెస్ట్ ఛాయిస్. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లతో ఇంత తక్కువ ధరకు వస్తుంటే అస్సలు వదులుకోవద్దు. మీ బ్యాంక్ ఆఫర్లు, పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ విలువ చెక్ చేసుకుని నచ్చితే వెంటనే ఆర్డర్ పెట్టేయండి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.