Free Body Culture: విప్పుకుని తిరుగుతామంటూ మహిళలు పోరాటం.. Okay చెప్పిన ప్రభుత్వం!

ఇటీవల నటుడు శివాజీ.. అమ్మాయిలు నిండుగా దుస్తులు ధరించాలని చెప్పినందుకు పెద్ద దుమారమే రేగింది. ఆయన ‘సామాన్లు’ అనే పదం వాడటం వల్ల.. విషయం ఎక్కడికో పోయింది. ఫెమినిస్టులమని చెప్పుకొనే కొందరు శివాజీని తిట్టిపోశారు. శివాజీ సామాన్లు అని అనకుండా ఉంటే.. ఆయనకు మంచిగానే మద్దతు లభించేదేమో. శివాజీ అలా మాట్లాడటానికి కారణం.. ఇటీవల అమ్మాయిల వస్త్రధారణలో వస్తున్న మార్పులే. సోషల్ మీడియా ప్రభావం వారిపై చాలా ఉంది. దానివల్ల కొంతమంది అమ్మాయిలు ఎక్స్‌పోజింగ్‌కు పెద్దగా వెనకాడటం లేదు. పైగా వారికి అది తప్పుగా కూడా అనిపించడం లేదు. వస్త్రధారణ అనేది పూర్తిగా వారి వ్యక్తిగతం. కానీ, అది ఆకతాయిలకు అవకాశం కల్పించేలా ఉండకూడదనేది పెద్దల వాదన. ఏది ఏమైనా.. ‘వస్త్రధారణ’ టాపిక్ ఎప్పటికీ ఎండ్ కానీ డిబేట్. ఇండియాలో పరిస్థితులు ఇలా ఉంటే.. ఆ దేశంలో మాత్రం చాలా భిన్నంగా ఉన్నాయి. మా వస్త్రధారణపై ఆంక్షలు వద్దు.. టాప్‌లెస్‌గా ఉండటానికి స్వేచ్ఛ ఇవ్వండనే మహిళల డిమాండ్‌పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. వారికి వెంటనే ఒకే చెప్పేసింది.


పోరాడారు.. సాధించారు
మహిళల ఆలోచన దోరణి మారుతుంది. పురుషులకో న్యాయం.. మాకో న్యాయమా అంటూ గళమెత్తుతున్నారు. అయితే, ఈ పోరాటం ఉద్యోగం, ఉపాధి వంటి అంశాల్లో కాదు.. దుస్తుల విషయంలో. మగాళ్లు టాప్‌లెస్‌గా తిరగొచ్చు. కానీ, మహిళలు తిరిగితే నేరమా? అనే ప్రశ్న నుంచి ఉద్భవించిన ఈ ఉద్యమం తారాస్థాయికి చేరే లోపే.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మగాళ్లతో సమానంగా మహిళలు కూడా విప్పుకుని తిరగొచ్చంటూ రూల్స్‌ను మార్చేసింది. అయితే, దీనికి అంతటికి కారణం.. ఒక మహిళా స్విమ్మర్.

టాప్‌లెస్‌గా స్విమ్ చేయొద్దు అన్నారని..
అది 2022, డిసెంబర్ నెల. జర్మనీ రాజధాని.. బెర్లిన్‌లో ఓ మహిళ స్విమ్మర్ బికినీ ధరించకుండా టాప్‌లెస్‌గా స్విమ్మింగ్ చేసేందుకు సిద్ధమైంది. దీంతో అక్కడి అధికారులు ఆమెను అడ్డుకున్నారు. పైన ఏమైనా ధరించండి.. మీ రొమ్ములు కనిపించకుండా అని చెప్పారు. దాన్ని ఆమె చాలా అవమానంగా ఫీలయ్యింది. ఆ వెంటనే ఆమె డిపార్ట్‌మెంట్ ఫర్ జస్టీస్‌ను ఆశ్రయించింది. ఆమె వాదన విన్న అధికారులు.. బాధితురాలు వివక్షకు గురైందని ప్రకటించారు. అంతేకాదు.. ఇకపై బెర్లిన్‌లో ఏ స్విమ్మింగ్‌పూల్‌‌లోనైనా మహిళలు టాప్‌లెస్‌గా వెళ్లవచ్చని ప్రకటించారు. ఈ ఘటనకు ముందు 2021లో కూడా గాబ్రియెల్ అనే మహిళకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. బెర్లిన్ వాటర్ పార్కులో బికినీ వేసుకోకుండా తిరిగినందుకు భద్రతా అధికారులు ఆమెను అక్కడి నుంచి బయటకు గెంటేశారు. దీంతో ఆమె ప్రభుత్వంతో పోరాడి ఆర్థిక పరిహారం తీసుకుంది.

విప్పితే తప్పేంటీ?
ఆ ఘటనపై గాబ్రియెల్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఆ రోజు నాతోపాటు ఐదేళ్ల కొడుకు ఉన్నాడు. వాడికి నేను లింగ వివక్ష చూపించకూడదని నేర్పిస్తాను. ఎందుకంటే.. మహిళలకు, పురుషులకు రొమ్ములుంటాయి. కానీ, వాటిని లైంగిక ప్రేరేపణలుగా భావిస్తారు. మరి ఉక్కబోతగా ఉన్నప్పుడు పురుషులకు తమ దుస్తులు తొలగించే స్వేచ్ఛ ఉంది. కానీ, ఆ స్వేచ్ఛ మహిళలకు ఎందుకు లేదు?’’ అని ప్రశ్నించింది.

అమెరికా, యూకే కంటే అడ్వాన్సుడ్..
జర్మనీలో లింగవివక్ష పెద్దగా ఉండదు. అందుకే నగ్నత్వాన్ని ఎవరూ తప్పుబట్టరు. కానీ, కొన్ని టూరిస్టు ప్లేసులు, స్విమ్మింగ్ పూల్స్‌ వద్ద పర్యటకులు ఇబ్బందికి గురికాకూడదనే ఉద్దేశంతో ఆంక్షలు పెట్టారు. ప్రస్తుతం వాటిని ఎత్తేశారు. అక్కడి స్విమ్మింగ్ పూల్స్ వద్ద ఎవరైనా దుస్తులు లేకుండా కనిపిస్తే.. తోటివారు వారిని వింతగా చూడరు. వారి పనివారు చూసుకుంటారు. పైగా జర్మన్ ప్రజలు నగ్నత్వాన్ని ఆరోగ్యంగా భావిస్తారు. దీనిపై లండన్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ కియోన్ వెస్ట్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘నేను యూరప్‌తోపాటు వివిధ దేశాల్లో నగ్నత్వంపై పరిశోధనలు జరిపాను. యూకే, అమెరికా ప్రజలు కంటే.. జర్మన్లు నగ్నత్వం పట్ల చాలా రిలాక్స్‌గా ఉంటారు. నగ్నంగా తిరిగే వ్యక్తులను వింతగా చూడరు.

నగ్నత్వంతో ఆరోగ్యం?
జర్మనీ ప్రజలకు 19వ శతాబ్దం నుంచే నగ్నత్వంపై మక్కువ పెరిగిందట. అప్పట్లో నగ్నంగా ఉండటం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలుసుకున్నారట. అప్పటి నుంచి వారు మెంటల్‌గా నగ్నత్వాన్ని సాధారణ విషయంగా పరిగణించడం మొదలుపెట్టారట. ఇందుకు 1898లోనే బీజం పడిందని పరిశోధకులు చెబుతున్నారు. 1920లో జర్మనీలోని సిల్ట్ ద్వీపంలో న్యూడ్ బీచ్‌ను ప్రారంభించారు. అక్కడ ఆడ, మగా తేడా లేకుండా అంతా టాప్‌లెస్‌గా తిరుగుతారట. అంతా కలిసి వ్యాయామాలు చేస్తారట. ఇందుకు ప్రత్యేకంగా బెర్లిన్ స్కూల్ ఆఫ్ న్యూడిజం అనే సంస్థను కూడా స్థాపించారు.

నగ్నత్వాన్ని వ్యతిరేకించిన నాజీలు, చివరికి..
నైతిక విలువల నేపథ్యంలో నాజీలు మొదట్లో నగ్నత్వాన్ని వ్యతిరేకించారు. ప్రజల తిరుగుబాటుతో వెనకడుగు వేశారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత తూర్పు, పశ్చిమ జర్మనీల్లో నగ్నత్వం విచ్చలవిడిగా మారింది. ముఖ్యంగా తూర్పు జర్మనీలో ఈ ట్రెండ్ విపరీతంగా ఉంది. ప్రస్తుతం న్యూడిటీకి సంబంధించి సుమారు 300కు పైగా క్లబ్బులు ఉన్నాయి. అక్కడ వాటిని FKK (ఫ్రీకోర్‌పెర్‌కల్చర్‌) అని పిలుస్తారు. అంటే ఫ్రీ బాడీ కల్చర్ అని అర్థం. ఈ క్లబ్బుల్లో ఇప్పటికే
సుమారు 600,000 మంది జర్మన్లు ​​తమ పేర్లు నమోదు చేసుకున్నారు. అందుకే, నగ్నత్వాన్ని పాజిటివ్‌గా భావించిన ప్రభుత్వం.. ఆ స్విమ్మింగ్ పూల్ ఘటనలను అంత సీరియస్‌గా తీసుకుంది.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.