Gaami OTT : ఓటీటీలోకి వచ్చేస్తున్న గామి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

www.mannamweb.com


టాలీవుడ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తాజాగా నటించిన సినిమా గామి.. ఈ సినిమాతో ఈ మధ్యనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ భారీ విజయాన్ని అందుకుంది.. ఈ సినిమాతో విధ్యాదర్ కాగిత దర్శకుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.. దాదాపుగా ఆరేళ్ళ పాటు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా పై మొదటి నుంచి అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.. అంచానాలను మించి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.. అలాగే రికార్డు స్థాయిలో కలెక్షన్స్ ను కూడా అందుకుంది..
ఇక ఇప్పుడు ఓటీటీలోకి విడుదలయ్యేందుకు రెడీ అవుతుంది.. ఏప్రిల్ 5న జీ5 ఓటీటీలో ఈ మూవీ రిలీజ్ కాబోతున్నట్లు గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడం భాషల్లో సినిమా స్ట్రీమింగ్ కాబోతుందని తెలుస్తుంది.. ఈ సినిమాలో అఘోర పాత్రలో విశ్వక్‌సేన్ తన యాక్టింగ్‌తో అభిమానులను మెప్పించాడు. విజువల్స్‌, గ్రాఫిక్స్ అన్ని అద్భుతంగా ఉన్నాయని టాక్ ను అందుకుంది..

ఈ సినిమాలో ఓటీటీ అప్డేట్స్ ను మేకర్స్ ప్రకటించానున్నారని తెలుస్తుంది.. ఈ సినిమాను ఏప్రిల్ 12 న ఓటీటీలోకి రాబుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.. దీనిపై త్వరలోనే అధికార ప్రకటన రాబోతుందని సమాచారం.. ఇక ఈ సినిమాతో భారీ సక్సెస్ ను అందుకున్న విశ్వక్ సేన్ ఇప్పుడు వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు.. విశ్వక్‌సేన్ ప్రస్తుతం తెలుగులో నాలుగు సినిమాలు చేస్తున్నాడు.