Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ ధోరణులు, డాలర్ మారకపు విలువ ప్రభావంతో దేశీయ ధరలు హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. గుడ్‌రిటర్న్ వెబ్ సైట్ ప్రకారం..తాజా ఫిబ్రవరి 25వ తేదీన హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,61,790 వద్ద ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,48,310 వద్ద కొనసాగుతోంది. ఇవే ధరలు ఏపీలోనూ కొనసాగుతున్నాయి.
ఇక ఆభరణాల తయారీలో విస్తృతంగా ఉపయోగించే 18 క్యారెట్ల బంగారం ధర రూ. 1,21,350 వద్ద ట్రేడవుతున్నాయి. ఇక వెండి ధర విషయనికొస్తే ఒక రోజు తగ్గితే మరో రోజు ఎగబాకుతోంది. కిలో వెండి ధర రూ. 2,84,900 వద్ద ట్రేడవుతోంది.
ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే..
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,61,940 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,48,460 వద్ద ట్రేడవుతోంది. ఇక ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,61,790 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,48,310 వద్ద ట్రేడవుతోంది. అలాగే చెన్నైలో 10 గ్రాముల బంగారం ధర రూ.1,62,450 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,48,910 వద్ద ట్రేడవుతోంది.
దేశీయంగా బంగారం, వెండి ధరలు ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లపై ఆధారపడి ఉంటాయి. గ్లోబల్ మార్కెట్లో ధరలు పెరిగితే ఇక్కడ కూడా పెరుగుతాయి. అక్కడ తగ్గితే దేశీయంగా కూడా తగ్గుదల కనిపిస్తుంది. భారతదేశం బంగారం అవసరాల్లో ఎక్కువ భాగాన్ని దిగుమతుల ద్వారానే తీర్చుకుంటుంది. అందువల్ల డాలర్ మారకపు విలువ పెరగడం లేదా తగ్గడం కూడా పుత్తడి ధరలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. అయితే ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు. ప్రతి రోజు ఉదయం 10-11 గంటల సమయంలో బంగారం ధరలు అప్‌డేట్ అవుతుంది.
అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు 5,119 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. బంగారం ధర తగ్గడానికి ప్రధానంగా బంగారం మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడును లాభాల రూపంలో వెనక్కి తీసుకోవడంతో బంగారం ధరలు తగ్గాయి దీనికి తోడు అమెరికన్ డాలర్ పడటం కూడా ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు. మరోవైపు యూఎస్ టారిఫ్ విధానాలపై అనిశ్చితి ఏర్పడింది. ఇది కూడా ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో బంగారంలో పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు వెనక్కు తగ్గుతున్నారు. దీంతో పసిడి ధరలు తగ్గడం గమనించవచ్చు.




































