జీహెచ్‌ఎంసీ హైదరాబాద్ నగరం ప్రజలకు భారీ శుభవార్త తెలిపింది. రూ. 5 కే మిల్లెట్ టిఫిన్ అందించనుంది. ఇడ్లీ, పూరీ, ఉప్మా ఇలా ఏ టిఫిన్ అయినా రూ. 5 కే నగరవాసులకు అందించేందుకు సిద్ధమైంది.
ఈ మేరకు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఇందిరమ్మ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ ప్రకటించింది.
జీహెచ్‌ఎంసీ కీలక ప్రకటన చేసింది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఇందిరమ్మ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఇందిరమ్మ క్యాంటీన్ల కోసం కొత్త కంటైనర్లు ఏర్పాటు చేస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ పేర్కొంది. నగర వ్యాప్తంగా 139 ప్రాంతాల్లో రూ.11.43 కోట్లతో కంటనైనర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఈ క్యాంటీన్లలో లంచ్ తో పాటు త్వరలో రూ.5 కే అల్పాహారం కూడా అందించనుంది.
హైదరాబాద్ నగర ప్రజలకు జీహెచ్‌ఎంసీ భారీ శుభవార్త తెలిపింది. నగరంలోని పేద, మధ్య తరగతి ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో ఆకలి తీర్చేందుకు జీహెచ్‌ఎంసీ మరో ముందడుగు వేసింది. నగర వ్యాప్తంగా 139 ప్రాంతాల్లో రూ.11.43 కోట్లతో కంటనైనర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఈ క్యాంటీన్లలో లంచ్ తో పాటు త్వరలో రూ.5 కే అల్పాహారం కూడా అందించనుంది. ఇడ్లీ, ఉప్మా, పూరీ వంటి వివిధ రకాల టిఫిన్‌లు ఉదయం 7 నుండి 10 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. ఈ పథకం ద్వారా ప్రజలకు నాణ్యమైన, శుచిగా ఉండే టిఫిన్‌ను తక్కువ ధరకే అందించాలని జీహెచ్‌ఎంసీ భావిస్తోంది.
జులై 10న జరగనున్న స్టాండింగ్ కమిటీ సమావేశంలో హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఇందిరమ్మ క్యాంటీన్లను ఏర్పాటుపై చర్చించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం రూ.15.33 కోట్లు అవసరమని జీహెచ్‌ఎంసీ అంచనా వేస్తోంది. ప్రస్తుతం గ్రేటర్‌లోని 139 కేంద్రాల్లో మధ్యాహ్నం భోజనం రూ.5కే ఇస్తున్నారు. ఒక్కో భోజనానికి రూ.27.50 ఖర్చవుతోంది. అయితే రూ.22.50లను జీహెచ్‌ఎంసీ భరిస్తూ.. ప్రజల నుంచి రూ.5 తీసుకుంటోంది.
ప్రస్తుతం టిఫిన్ సెంటర్లలో ఏ టిఫిన్ తినాలన్నారూ. 30 నుంచి రూ. 50 వరకు చెల్లించాలి. ఇక కాస్ట్రీ హోటల్స్ లో అయితే రేట్లు రూ. వందల్లో ఉంటాయి. ఈ ధరను నగరంలోని కార్మికులు, శ్రామికులు, పేద, మధ్యతరగతి ప్రజలు భరించలేక ఉన్నారు. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 5 కే మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు ఇక నుంచి రూ. 5 కే మిల్లెట్ టిఫిన్ అందించాలని నిర్ణయించింది. ఇలా ఐదు రూపాయలకు అందించే టిఫిన్ కు వాస్తవానికి రూ.19 ఖర్చు కానుండగా.. ఈ మొత్తంలో రూ.14 జీహెచ్‌ఎంసీ భరించనుంది. ప్రజల నుంచి రూ.5 వసూలు చేయనుంది.
































