ఏప్రిల్ 12న హనుమాన్ జయంతి రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. హనుమాన్ జయంతి రావడంతోనే ఎంతోమంది హనుమాన్ భక్తులు గుళ్ళు గోపురాలు తిరిగి ఆ హనుమంతున్ని నిష్టగా పూజిస్తారు.ఇక కొంత మందేమో హనుమాన్ మాల ధరిస్తారు.అలా కొంతమంది 11 రోజులు,మరికొంతమంది 21 ఇంకొంతమంది 41 ఇలా ఎవరి వీలు తీరు వాళ్ళు హనుమాన్ జపమాల ధరిస్తారు.అయితే హనుమాన్ జయంతి ఏప్రిల్ 12న రాబోతోంది కాబట్టి రేపటినుండి అనగా ఏప్రిల్ 8 నుండి ఈ ఒక్క పని చేస్తే ఖచ్చితంగా ఎంత పెద్ద కోరిక ఉన్నా కూడా నెరవేరుతాయి అని జ్యోతిష్యులు అంటున్నారు.
మరి ఇంతకీ రేపటినుండి చేయాల్సిన ఆ పని ఏంటో ఇప్పుడు చూద్దాం.
హనుమాన్ జయంతి రోజు చాలామంది హనుమాన్ గుళ్లకు వెళ్లి కొబ్బరికాయలు కొట్టి మొక్కలు తీర్చుకుంటూ ఉంటారు. అంతేకాదు తమ కోరికలు ఆ దేవుడు ముందు విన్నవించుకుంటారు. అయితే ఎవరైనా సరే బలమైన కోరికలు లేదా ఎంత పెద్ద కోరికలైనా నెరవేరాలంటే రేపటినుండి అనగా ఏప్రిల్ 8 నుండి రోజు ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తాన అంటే 3:30 గంటల నుండి 5 గంటల లోపు లేచి స్నానం చేసి ఒక గ్లాస్ నీళ్లు తాగి మన ఇంట్లో ఉన్న హనుమాన్ ఫోటో ముందు ఒక చిన్న ప్లేట్ ఉంచి ఆ ప్లేట్ లో బెల్లం అలాగే లడ్డూలు దేవుడికి నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత 11 సార్లు హనుమాన్ చాలీసాని చదువుకున్న తర్వాత దేవున్ని మనం ఏం కోరుకోవాలి అనుకుంటున్నామో ఆ కోరిక ఏంటో కోరుకొని పూజ ముగించాలి.
ఇలా ఏప్రిల్ 8 నుండి ఏప్రిల్ 12 హనుమాన్ జయంతి వరకు ప్రతిరోజు ఉదయాన్నే పూజ చేయాలి.ఆ తర్వాత ఏప్రిల్ 12 న హనుమాన్ జయంతి రోజు దగ్గరలో ఉన్న హనుమాన్ దేవాలయానికి వెళ్లి కొబ్బరికాయ కొట్టి మరోసారి ఆ కోరికను దేవుడు ముందు చెప్పాలి.అలా చేసినట్లయితే ఆ హనుమంతుడు ఏదో ఒక రూపంలో వచ్చి మీరు కోరుకున్న కోరికని కచ్చితంగా నెరవేరుస్తారు.ఇక దేవుడి మీద నమ్మకం ఉన్నవాళ్లు ఈ పూజ ఒకసారి చేసి చూడండి