చనిపోయిన తండ్రి కలలోకి వచ్చి సమాధిని తవ్వమన్నాడు.. తీరా తవ్వి చూడగా

ఎప్పుడూ 20 ఏళ్ల క్రితం చనిపోయిన తండ్రి.. ఆ కొడుకు కలలోకి వచ్చాడు.. కలలోకి వచ్చి తన సమాధిని తవ్వమని ప్రాధేయపడ్డాడు. ఆ కొడుకు, మరో ఇద్దరు పనివాళ్లను తీసుకెళ్లి..


శ్మశానంలో ఉన్న తన తండ్రి సమాధిని తవ్వి చూడగా.. దెబ్బకు షాక్ అయ్యాడు. ఇంతకీ అతడికేం కనిపించింది.? ఆ వివరాలు ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా..

వివరాల్లోకి వెళ్తే.. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో కౌశాంబి జిల్లాలోని దారానగర్‌లో చోటు చేసుకుంది. గతేడాది అక్టోబర్‌లో జరిగింది. స్థానికంగా నివాసముంటున్న అక్తర్ సుభానీ తండ్రి మౌలానా అన్సార్ అహ్మద్ దాదాపు 20 ఏళ్ల క్రితం చనిపోయాడు. అయితే ఇటీవల ఆ తండ్రి అక్తర్ సుభానీ కలలోకి వచ్చి.. తన సమాధిని తవ్వమని.. అది పాడైపోయిన స్థితిలో ఉందని ఆవేదన వ్యక్తం చేసేవాడట. సమాధిలో నీళ్లు వచ్చాయని.. బాగు చేయాలంటూ మొర పెట్టుకున్నాడు. ఇక అక్తర్ తన కుటుంబ సభ్యులు, పనివాళ్లతో కలిసి ఊరి చివరన ఉన్న శ్మశానానికి వెళ్లారు. అతడి తండ్రి సమాధి తవ్వగా.. ఊహించని సీన్ కనిపించింది. అది శిథిలావస్థకు చేరుకోవడం చూసి వారంతా ఆశ్చర్యపోయారు. దీంతో వారంతా ఓ మతపెద్దను కలిసి.. తన తండ్రి సమాధిని మరమ్మత్తు చేశాడు. ఇక్కడ ఇంకో ఆసక్తికర విషయమేంటంటే.. ఆ సమాధిలోని అతడి తండ్రి మృతదేహం.. 20 సంవత్సరాలు క్రితం నాటిదైనా ఏమాత్రం చెక్కుచెదరలేదు. అస్సలు కుళ్లిపోకుండా ఉంది. ఈ విషయం క్షణాల్లో వైరల్ కావడంతో స్థానికంగా వైరల్‌గా మారింది. దీంతో జనాలంతా కూడా ఆ సమాధిని చూసేందుకు పోటెత్తారు.