Health tips | శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగితే ప్రమాదం.. నియంత్రణ ఇలా..!

Health tips : శరీరంలో యూరిక్ యాసిడ్ నిలువలు ఎక్కువైతే గౌట్ అనే సమస్య వస్తుంది. ఫలితంగా కీళ్లలో రాళ్ల లాంటి స్ఫటికాలు ఏర్పడతాయి. ఈ క్రమంలో తీవ్రమైన నొప్పులు వస్తాయి.
యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడేవారికి కీళ్ల వద్ద వాపులు, నొప్పి ఉంటాయి. కీళ్లు ఎరుపుగా మారతాయి. అయితే కొన్ని రకాల ఆయుర్వేద మూలికల ద్వారా శరీరంలో పెరిగిన యూరిక్ యాసిడ్ లెవల్స్ తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ మూలికలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..


1. పునర్నవ

దీనిలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఇది కీళ్లలో వాపులను తగ్గిస్తుంది. యూరిక్ యాసిడ్‌ను బయటకు పంపుతుంది. అందువల్ల వాపులు, నొప్పులు తగ్గుతాయి. పునర్నవ ట్యాబ్లెట్ల రూపంలో, పొడి రూపంలో లభిస్తుంది. ఆయుర్వేద మందుల షాపుల్లో లభ్యమవుతుంది. ప్యాక్‌పై సూచించిన విధంగా లేదా డాక్టర్ సూచన మేరకు వాడుకోవాల్సి ఉంటుంది.

2. గుగ్గులు

మార్కెట్‌లో గుగ్గులుకు సంబంధించిన ట్యాబ్లెట్లు లభిస్తాయి. ఇవి పెయిన్ కిల్లర్‌లుగా పనిచేస్తాయి. వీటివల్ల నొప్పి, వాపులు తగ్గుతాయి.

3. తిప్పతీగ

యూరిక్ యాసిడ్‌ నియంత్రణలో ఇది బాగా పనిచేస్తుంది. శరీరంలో పిత్త దోషాన్ని తగ్గిస్తుంది. యూరిక్ యాసిడ్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. దీని రసాన్ని ప్రతి రోజూ ఉదయం 30 ఎంఎల్‌ మోతాదులో తీసుకోవచ్చు.

4. తుంగ ముస్తలు

గౌట్ సమస్యను తగ్గించడంలో ఇవి బాగా పనిచేస్తాయి. వీటి పొడిని రాత్రి నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయాన్నే మరిగించి అనంతరం వడకట్టి తాగాలి. సమస్య త్వరగా తగ్గుపోతుంది.

5. నల్ల కిస్మిస్‌

నల్ల కిస్మిస్‌ను రోజూ నీటిలో నానబెట్టి 10-15 చొప్పున ఉదయాన్నే తింటుండాలి. రాత్రి నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం తినాలి. యూరిక్ యాసిడ్ లెవల్స్ తగ్గడంలో ఇవి బాగా తోడ్పడుతాయి.

6. వరుణ చూర్ణం

ఈ వరుణ చూర్ణాన్ని రాత్రివేళ నొప్పి ఉన్న చోట రాయాలి. నీటితో కలిపి పేస్ట్‌లా చేసి రాయాల్సి ఉంటుంది. ఈ చూర్ణం రాయడం ద్వారా నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

వంటింట్లో వస్తువులతో..

శొంఠి, పసుపును నీటితో కలిపి పేస్ట్‌లా చేసి ఆ మిశ్రమాన్ని కీళ్లపై రాస్తే నొప్పులు, వాపులు తగ్గుతాయి.

యూరిక్ యాసిడ్ స్థాయి తగ్గాలంటే కనీసం ప్రతి రోజు 10 నుంచి 12 గ్లాస్‌ల నీళ్లు తాగాలి.

మద్యానికి, చక్కెరతో చేసిన పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండాలి. ఇక ప్యూరిన్స్‌ ఎక్కువగా ఉండే మాంసం, చికెన్, పప్పుధాన్యాలు వంటి ఆహారాలను కూడా తగ్గించాలి.

నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ కూడా యూరిక్ యాసిడ్‌ను తగ్గిస్తుంది. రోజుకు రెండుసార్లు నిమ్మరసం తీసుకోవాలి. ఇలా చేయడంవల్ల యూరిక్ యాసిడ్ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.

స్ట్రాబెర్రీలతోపాటు బ్లూ బెర్రీస్ తినడంవల్ల యూరిక్ యాసిడ్ సమస్యను తగ్గించుకోవచ్చు. ఇవి రక్తంలోని గ్లూకోస్‌ని కూడా నియంత్రణలో ఉంచుతాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.