0 రిస్క్‌తో మంచి వడ్డీని సంపాదించే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ గురించి చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే. పలు బ్యాంక్‌లలో ఎఫ్డీలపై అత్యధిక వడ్డీ రేట్లు లభిస్తున్నాయి. ఆ వివరాలు..
టీవీఎస్ స్పోర్ట్
ఇన్వెస్ట్‌మెంట్స్‌లో ఎంత రిస్క్ తీసుకుంటే అంత ఎక్కువ సంపాదిచొచ్చు. కానీ అదే సమయంలో చాలా డబ్బులు పొగొట్టుకోవచ్చు. ఇవన్నీ అనవసరం, ప్రశాంతంగా ఉండాలనుకునే వారు జీరో రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి వెతుకుతుంటారు. వారిలో మీరు ఉన్నారా? అయితే ఇది మీకోసమే! ఇటీవలి కాలంలో పలు బ్యాంక్‌లు ఫిక్స్డ్ డిపాజిట్లపై (ఎఫ్డీ) అత్యధిక వడ్డీని ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకుల్లో 3 సంవత్సరాల ఎఫ్డీలపై లభిస్తున్న అధిక వడ్డీలను ఇక్కడ తెలుసుకోండి.
3ఏళ్ల కాల వ్యవధి ఉండే ఎఫ్డీలపై అధిక వడ్డీ ఇస్తున్న బ్యాంకులు..
1, హెచ్డీఎఫ్సీ బ్యాంక్: దేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్‌గా పేరున్న హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 3 సంవత్సరాల కాలపరిమితి డిపాజిట్లపై 7 శాతం వడ్డీని అందిస్తుంది. సీనియర్ సిటిజన్లకు అదే కాలపరిమితి డిపాజిట్లపై 7.5 శాతం వడ్డీ లభిస్తుంది. 4 సంవత్సరాల 7 నెలల కాలపరిమితి ఉన్నప్పుడు సంవత్సరానికి గరిష్టంగా 7.4 శాతం వడ్డీ లభిస్తోంది. ఈ రేట్లు 2024 జూలై 24 నుంచి అమల్లోకి వచ్చాయి.
2. ఐసీఐసీఐ బ్యాంక్: ఐసీఐసీఐ బ్యాంక్ మూడేళ్ల కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ)పై డిపాజిటర్లకు ఏడాదికి 7 శాతం వడ్డీ, సీనియర్ సిటిజన్లకు 7.5 శాతం వడ్డీని అందిస్తోంది.
15 నెలల నుంచి 2 సంవత్సరాల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై గరిష్టంగా 7.25 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. ఈ రేట్లు 2024 ఆగస్టు 10 నుంచి అమల్లోకి వచ్చాయి.
3. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ): ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ మూడేళ్ల కాలపరిమితి కలిగి ఫిక్స్డ్ డిపాజిట్లపై 6.75 శాతం వడ్డీని అందిస్తోంది. సీనియర్ సిటిజన్లకు అదే కాలపరిమితి డిపాజిట్లపై 7.25 శాతం వడ్డీ లభిస్తుంది. కాలపరిమితి 2-3 సంవత్సరాల మధ్య ఉంటే, వడ్డీ సంవత్సరానికి 7 శాతం. ఈ రేట్లు 2024 జూన్ 15 నుంచి అమల్లోకి వచ్చాయి.
3 సంవత్సరాల కాలపరిమితి కలిగిన ఎఫ్డీలపై అందించే వడ్డీ రేటు:
బ్యాంక్ పేరు వడ్డీలు (%) సీనియర్ సిటీజెన్లకు (%)
4. బ్యాంక్ ఆఫ్ బరోడా: మూడేళ్ల కాలపరిమితి ఎఫ్డీపై బ్యాంక్ ఆఫ్ బరోడా డిపాజిటర్లకు 7.15 శాతం వడ్డీని అందిస్తోంది. సీనియర్ సిటిజన్లకు ఈ డిపాజిట్లపై 7.65 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ రేట్లు 2024 జులై 15 నుంచి అమల్లోకి వచ్చాయి.
5. కోటక్ మహీంద్రా బ్యాంక్: కోటక్ మహీంద్రా బ్యాంక్ 3 సంవత్సరాల ఫిక్స్డ్ డిపాజిట్లపై 7 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. సీనియర్ సిటిజన్లకు 60 బేసిస్ పాయింట్లు అంటే 7.6 శాతం ఎక్కువ వడ్డీ లభిస్తుంది. 390, 391 రోజుల టర్మ్ డిపాజిట్లపై గరిష్టంగా 7.4 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఈ రేట్లు 2024 జూన్ 14 నుంచి అమల్లోకి వచ్చాయి.
(గమనిక :- ఇది కేవలం సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్ ఫైనన్షియల్ అడ్వాజర్ని సంప్రదించడం శ్రేయస్కరం.)