ఈవీ స్కూటర్ ప్రియులకు గుడ్ న్యూస్.. త్వరలోనే మార్కెట్‌లో హోండా ఈవీ స్కూటర్

www.mannamweb.com


ప్రపంచంలో ఇటీవల కాలంలో ఈవీ మార్కెట్ కొత్త పుంతలు తొక్కుతుంది. ప్రజలు పెరుగుతున్న పెట్రో ధరల నుంచి రక్షణకు ఈవీ స్కూటర్లను ఆశ్రయిస్తుండగా ప్రభుత్వాలు కూడా పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈవీ వాహనాలపై ప్రత్యేక సబ్సిడీలను అందిస్తూ ఈవీ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఈవీ వాహనాలకు డిమాండ్ అమాంతం పెరిగింది. ముఖ్యంగా ఈవీ స్కూటర్లను ప్రజలు అమితంగా ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ కంపెనీ హోండా యూ-గో పేరుతో ఈవీ మార్కెట్‌లోకి ఎంటర్ అయ్యింది. ఆకట్టుకునే ఫీచర్లతో మొదటగా యూ-గో ఈవీ స్కూటర్‌ను ప్రకటించింది. హోండా యూ-గో ఈవీ స్కూటర్ గురించి వివరాలను తెలుసుకుందాం.

హోండా యూ-గో డిజైన్, ఫీచర్లు ఈవీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. స్టైలిష్, స్పోర్టీ డిజైన్‌ను యువతను ఆకర్షిస్తుంది. ముఖ్యంగా ఈ ఈవీస్కూటర్ లోని ఫుల్ ఎల్ఈడీ లైటింగ్ సిస్టమ్ విశేషంగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా టైల్‌లైట్ డిజైన్‌ను కలిగి ఉన్న మొదటి బడ్జెట్ స్కూటర్‌లలో ఇది ఒకటని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ స్కూటర్ యొక్క ఆప్రాన్ ఇతర ఉపయోగకరమైన ఉపకరణాలతో పాటు యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్‌తో వస్తుంది. హోండా యూ-గో సౌకర్యవంతమైన అండర్-సీట్ స్టోరేజీని అందిస్తుంది. దాదాపు 26 లీటర్ల వరకు స్టోరేజ్ స్పేస్‌ను అందిస్తుంది. హోండా యు-గో రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది.

హోండా యూ-గో ప్రామాణిక మోడల్ అని ఆ కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. 1.2 కేడబ్ల్యూ నిరంతర-రేటెడ్ హబ్ మోటార్‌తో వస్తుంది. అలాగే ఈ స్కూటర్ గంటకు 53 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. తక్కువ స్పీడ్ వేరియంట్ 800 డబ్ల్యూ హబ్ మోటార్‌తో వస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 43 కిలోమీటర్లు. రెండు వేరియంట్‌లు 48వీ, 30ఏహెచ్ రిమూవబుల్ లిథియం అయాన్ బ్యాటరీతో వస్తాయి. ఈ స్కూటర్ బ్యాటరీ సామర్థ్యం 1.44 కేడబ్ల్యూహెచ్, రెండో బ్యాటరీను ఇన్‌స్టాల్ చేస్తే మైలేజ్ 130 కిలోమీటర్లకు పెరగుతుంది. అయితే హోండా యూ-గో భారతదేశంలో ఎప్పుడు ప్రారంభిస్తారనే విషయం క్లారిటీ లేదు.

హోండా యు-గో గత సంవత్సరం చైనాలో లాంచ్ చేశారు. అయితే భారత్‌లో పెరుగుతున్న మార్కెట్ దృష్ట్యా త్వరలోనే భారతదేశంలో ఈ స్కూటర్‌ను లాంచ్ చేసే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. భారతదేశంలో ఈ స్కూటర్ రూ.91,860కు లాంచ్ చేసే అవకాశం ఉంది. హోండా యూ-గో ఇటీవలి కాలంలో అత్యుత్తమ సరసమైన ఎలక్ట్రిక్ వాహనాల్లో ఒకటిగా ఉంటుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.