ఇది కదా మామ సినిమా అంటే… భయానికి భయం, కామెడీకి కామెడీ

www.mannamweb.com


ఈ రోజుల్లో ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఓపెన్‌ చేసినా లెక్కలేనన్ని సినిమాలు, షోలు అందుబాటులో ఉంటున్నాయి. వీటిలో అన్ని జోనర్స్ మూవీస్ చూడవచ్చు. ఎక్కువ మంది మూవీ లవర్స్‌ యాక్షన్, థ్రిల్లర్, రొమాన్స్, సస్పెన్స్, హారర్ సినిమాలు చూస్తుంటారు.
అయితే హారర్‌ ప్లస్‌ కామెడీ జోనర్‌కి ఉన్న క్రేజ్‌ వేరు. ఓ పక్క భయపెడుతూ, మరో పక్క కడుపుబ్బా నవ్వించే సినిమాలు మంచి కిక్ ఇస్తాయి.

ప్రస్తుతం ఓటీటీలో ఇలాంటి మూవీ ఒకటి ట్రెండింగ్‌లో ఉంది. ఎంగేజింగ్ స్టోరీ, ఇంప్రెసివ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఇది బాక్సాఫీస్‌ వద్ద భారీ హిట్టు కొట్టింది. ఇప్పుడు ఓటీటీలో కూడా ఒక రేంజ్‌లో స్ట్రీమింగ్ మినిట్స్ పెంచుకుంటోంది. ఈ సినిమా చూస్తున్నంత సేపు మీరు ఒక పక్క విపరీతంగా భయపడుతూ, మరోపక్క కడుపుబ్బా నవ్వుకుంటారు. ఆ సినిమా ఏది, ఏ ప్లాట్‌ఫామ్‌లో ఉందో చూద్దాం.

2023లో విడుదలైన మూవీ:
ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న సినిమా రోమాంచం (Romancham). ఇది 2023లో థియేటర్లలో విడుదలై సూపర్‌ హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ఈ మలయాళ హారర్‌ సినిమాకు జీతూ మాధవన్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో సౌబిన్ షాహిర్, అర్జున్ అశోకన్, సజిన్ గూప్, సిజు సన్నీ, అబిన్ బినో, అనంతరామ్ అజయ్, అఫ్జల్ పీహోచ్‌ వంటి యాక్టర్స్ నటించారు. మూవీలో అందరు నటీనటులు తమ యాక్టింగ్‌తో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. ఎందుకంటే వారు వ్యూయర్స్‌ను భయపెట్టడంలో, ఎంటర్‌టైన్‌ చేయడంలో వంద శాతం సక్సెస్ అయ్యారు.

రియల్‌ స్టోరీ ఆధారంగా తీసిన సినిమా:
బెంగుళూరులోని ఓ అద్దె ఇంట్లో కలిసి జీవిస్తున్న ఏడుగురు స్నేహితులు చుట్టూ రోమాంచం కథ తిరుగుతుంది. ఒక రోజు వారు ఆత్మలను పిలవడానికి ‘ఓయిజా బోర్డ్‌ (Ouija board)’ను ఉపయోగిస్తారు. ఆ తర్వాత కథ ఊహించని మలుపులు తిరుగుతుంది. వింత సంఘటనలు మిమ్మల్ని భయపెడతాయి. ఈ సినిమా వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. ఏడుగురు వ్యక్తుల రియల్ ఫొటోను కూడా మీరు చివర్లో చూడవచ్చు.

బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్:
సినిమా బడ్జెట్, వసూళ్ల విషయానికి వస్తే రోమాంచం అందరినీ ఆశ్చర్యపరిచింది. వికీపీడియా ప్రకారం, ఈ సినిమా తీయడానికి రూ.1.75 నుంచి రూ.3 కోట్ల మధ్య ఖర్చు అయింది. అయితే ఇది బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.70 కోట్ల వసూళ్లు రాబట్టింది. సినిమా విజయం అంతటితో ముగియలేదు. ఇప్పటికే సీక్వెల్ వర్క్స్ జరుగుతున్నాయి. షూటింగ్ జరుగుతోంది. విడుదల తేదీని ఇంకా ప్రకటించనప్పటికీ, 2025 నాటికి విడుదల కావచ్చని మీడియా నివేదికలు సూచిస్తున్నాయి. నెక్స్ట్‌ పార్ట్‌ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఓటీటీలో కూడా సూపర్‌ సక్సెస్‌:
మీరు హారర్-కామెడీ మూవీలను ఇష్టపడితే, ఈ మూవీ మీకు కచ్చితంగా నచ్చుతుంది. దీనికి IMDbలో 10కి 7.5 రేటింగ్‌ లభించింది. దీన్ని డిస్నీ+ హాట్‌స్టార్‌లో చూడవచ్చు. హిందీ సహా వివిధ భాషల్లో అందుబాటులో ఉంది.