ఈ సినిమా చూడాలంటే గుండె ధైర్యం ఉండాల్సిందే.. ఓటీటీలోకి హారర్ మూవీ.. ఎప్పుడంటే..

www.mannamweb.com


ఇటీవల హారర్ కంటెంట్ చూసేందుకు జనాలు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అటు థియేటర్లలోనే కాకుండా ఇటు ఓటీటీల్లోనూ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్, మర్డరీ మిస్టరీలకు మంచి రెస్పాన్స్ వస్తుంది.

ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న స్త్రీ 2. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న విడుదలైన హిందీతోపాటు తెలుగు, తమిళం, హిందీ భాషలలో విడుదలైన ఈ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. 2018లో విడుదలైన హారర్ కామెడీ కు సీక్వెల్ గా వచ్చిన ఈ మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.188 కోట్లకు పైగా వసూళ్లు చేయడం విశేషం. ఈ లో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో నటించింది.

అలాగే రాజ్ కుమార్ రావ్, పంకజ్ త్రిపాఠీ, అభిషేక్ బెనర్జీ వంటి స్టార్స్ కీలకపాత్రలు పోషించారు. హారర్ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ స్త్రీ 2 మూవీ నవ్విస్తూ, భయపెడుతూ బాక్సాఫీస్ ను దున్నేస్తోంది. అమర్ కౌశిక్ డైరెక్టర్ చేసిన ఈ మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.188 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. దేశవ్యాప్తంగా రూ.163 కోట్లు రాగా.. ఓవర్సీస్ మార్కెట్ నుంచి మరో రూ.25 కోట్లు వచ్చాయి. ఇక ఆదివారం నాటికి రూ.200 కోట్ల క్లబ్ లోకి చేరింది. తెలుగు, హిందీలో వరుస లు గట్టిపోటీనిస్తున్నప్పటికీ స్త్రీ మంచి విజయాన్ని అందుకుంది.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు థియేటర్లలో కడుపుబ్బా నవ్విస్తున్న స్త్రీ 2 వచ్చే నెలలో ఓటీటీలోకి రానుంది. లేటేస్ట్ అప్డేట్ ప్రకారం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. సెప్టెంబర్ 13, 14 తేదీలలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.