ఇది నిజంగా సాధ్యమా.. బంగాళాదుంపలతో ఫోన్‌కు ఛార్జింగ్ ఎలా పెడుతున్నాడో..

సోషల్ మీడియా ప్రపంచం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. వినోదాత్మక, ఆకర్షణీయ, వినూత్న వీడియోలు నెటిజన్లను ఆకర్షించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. ఆ వీడియోలు సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుని బాగా వైరల్ అవుతున్నాయి.


ఏఐ అందుబాటులోకి వచ్చిన తర్వాత నమ్మశక్యం కాని వీడియోలు కూడా మన కళ్ల ముందుకు వస్తున్నాయి. తాజాగా ఓ వ్యక్తి వెరైటీ ట్రిక్‌కు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది (viral experiment video).

@VijayKushw60161 అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఒక వ్యక్తి రెండు బంగాళాదుంపలతో మొబైల్ ఫోన్‌ను ఛార్జ్ చేస్తున్నాడు. ముందుగా రెండు బంగాళాదుంపల మధ్య ఒక 10 రూపాయల నాణెం ఉంచాడు. తర్వాత ఒక బంగాళాదుంపలో ఛార్జర్‌ను ఉంచి, ఫోన్‌కు తగిలించాడు. ఆశ్చర్యకరంగా ఆ ఫోన్ ఛార్జ్ కావడం ప్రారంభమవుతుంది.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.