ముఖేష్ అంబానీ ఇంటికి కరెంట్ బిల్లు ఎంత వస్తుందో తెలుసా..

www.mannamweb.com


సియాలోనే అత్యంత సంపన్న వ్యక్తి అయిన ముఖేష్ అంబానీ( Mukesh Ambani ) కుమారుడి పెళ్లి వేడుకలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.

ఈ వేడుకలకు సంబంధించిన అద్భుతమైన వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే అంబానీ కుటుంబం నివసించే అద్భుతమైన భవనం ‘యాంటిలియా’ ( Antilia )గురించి కూడా చాలా చర్చ జరుగుతోంది. 27 అంతస్తుల ఈ భవనంలో 50 సీట్ల థియేటర్, 9 భారీ లిఫ్ట్‌లు, స్విమ్మింగ్ పూల్, మూడు హెలిప్యాడ్లు, 160 కార్లకు పార్కింగ్ స్థలం వంటి అద్భుతమైన సౌకర్యాలు ఉన్నాయి. ఈ భవనంలో 600 మందికి పైగా సిబ్బంది పనిచేస్తారు.

ఈ భవన నిర్మాణం, నిర్వహణకు ఎంత ఖర్చు అయ్యిందనే విషయంపై కూడా చాలా ఆసక్తి నెలకొంది.

యాంటిలియా అనేది ముంబైలో ఉన్న ఒక భారీ నివాసం, దీని నిర్మాణానికి 6 సంవత్సరాలు పట్టింది. 15,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చైంది. ఈ భవనం 4 లక్ష చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది.

అద్భుతమైన డిజైన్, సౌకర్యాల కారణంగా దీనిని తరచుగా “రాజభవనం” అని పిలుస్తారు.యాంటిలియా చాలా పెద్దది కావడం వల్ల, దీనికి అధిక-వోల్టేజ్ విద్యుత్ కనెక్షన్ అవసరం. ఈ భవనం చాలా ఎక్కువ విద్యుత్తును వినియోగిస్తుంది, దాదాపు 7,000 మధ్యతరగతి గృహాలు నెలకు వాడేంత కరెంట్‌ను ఈ ఒక్క ఇల్లే వాడుతుంది. యాంటిలియా నెలవారీ విద్యుత్ వినియోగం సుమారు 6,37,240 యూనిట్లు, దీనివల్ల మంత్లీ కరెంట్ బిల్లు ఏకంగా రూ.70 లక్షలు( 70 lakhs of Rs ) వస్తుందట! ఈ భారీ బిల్లును తగ్గించడానికి విద్యుత్ శాఖతో చర్చలు జరపగా, కొంతవరకు రాయితీలు, సర్దుబాట్లు లభించాయట.

యాంటిలియాలో పనిచేసే ఉద్యోగులకు చాలా మంచి జీతాలు లభిస్తాయని చెబుతారు.

కొన్ని నివేదికల ప్రకారం, ప్లంబర్ల వంటి వివిధ పాత్రలకు నెలకు రూ. 2 లక్షల వరకు జీతం లభిస్తుంది, వీరు నెలకు రూ.1.5 నుంచి 2 లక్షల వరకు సంపాదించవచ్చు. జీతాలతో పాటు, సిబ్బంది సభ్యులు ఇతర సౌకర్యాలను కూడా పొందుతారు. యాంటిలియా అంబానీ కుటుంబం అపార సంపద, విలాసవంతమైన జీవితాన్ని కూడా సూచిస్తుంది.