కొత్త ఏడాది మీ ఇంటికి వీటిని తీసుకు వస్తే అదృష్టం అమాంతం పెరుగుతుంది, సంతోషం డబుల్ అవుతుంది!

2026లో అదృష్టం కలిసి రావాలన్నా, ఆనందంగా ఉండాలన్నా, ఆర్థిక సమస్యలు లేకుండా ఉండాలన్నా ఈ వాస్తు నియమాలను పాటించడం మంచిది. వీటిని కొత్త సంవత్సరం మీ ఇంటికి తీసుకువస్తే అన్ని శుభాలే కలుగుతాయి. ఆనందంగా ఉండొచ్చు, ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవు. మరి కొత్త సంవత్సరం ప్రారంభానికి ముందు వేటిని ఇంటికి తీసుకురావాలి?

త్వరలోనే కొత్త సంవత్సరం రాబోతోంది. 2025 పూర్తి అవ్వబోతోంది, 2026 లోకి అడుగు పెట్టబోతున్నాము. అయితే 2026 లో అదృష్టం కలిసి రావాలన్నా, ఆనందంగా ఉండాలన్నా, ఆర్థిక సమస్యలు లేకుండా ఉండాలన్నా ఈ వాస్తు నియమాలను పాటించడం మంచిది. వీటిని కొత్త సంవత్సరం మీ ఇంటికి తీసుకువస్తే అన్ని శుభాలే కలుగుతాయి. ఆనందంగా ఉండొచ్చు, ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవు. మరి కొత్త సంవత్సరం ప్రారంభానికి ముందు వేటిని ఇంటికి తీసుకురావాలి? వేటి వల్ల సమస్యలు రాకుండా ఉంటాయి? అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


2026 రాక ముందే వీటిని ఇంటికి తీసుకురండి.. ఎలాంటి ఇబ్బందులు ఉండవు

1.శ్రీ యంత్రం

శ్రీ యంత్రం లక్ష్మీదేవికి చిహ్నం. శ్రీ యంత్రాన్ని ఇంటికి తీసుకు రావడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. శ్రీ యంత్రాన్ని ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రంలో పెట్టి ఇంట్లో ఉంచండి. పూజ గది లేదా ఆఫీస్ డెస్క్ పై పెట్టుకోవచ్చు. ప్రతిరోజూ శ్రీ యంత్రాన్ని పూజించడం వలన సానుకూల శక్తితో పాటు ఎలాంటి సమస్యలైనా సరే తొలగిపోతాయి.

2.స్వస్తిక్ గుర్తు

స్వస్తిక్ గుర్తు కూడా శుభ సూచకం. ఇది సానుకూల శక్తిని, అదృష్టాన్ని తీసుకు వస్తుంది. ప్రతికూల ప్రభావాన్ని కూడా తొలగిస్తుంది. ఇంటి ముఖద్వారం పై ఎర్ర స్వస్తిక్ గుర్తును పెట్టండి లేదా వాహనం పై పెట్టొచ్చు. ఇలా చేయడం వలన అభివృద్ధి ఉంటుంది, ఆనందంగా ఉండొచ్చు, విజయాలను కూడా అందుకోవచ్చు.

3.శాలిగ్రామం

శాలిగ్రామాన్ని పవిత్రమైన రాయిగా భావిస్తారు. విష్ణువును ఇది సూచిస్తుంది. దీనిని ఇంటికి తీసుకురావడం వలన ప్రశాంతత, సంతోషంతో పాటు చక్కటి ఫలితాలను పొందవచ్చు. శాలిగ్రామాన్ని తులసి మొక్క వద్ద పెట్టుకుంటే మంచిది. ప్రతిరోజూ పంచామృతాలను సమర్పించండి.

ఈ మొక్కలు కూడా ఎంతో మేలు చేస్తాయి

1.స్నేక్ ప్లాంట్

స్నేక్ ప్లాంట్ ఇంట్లో ఉంటే అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఇంట్లో లేదా ఆఫీస్ లో పెట్టుకోవచ్చు. స్నేక్ ప్లాంట్ ఇంట్లో ఉంటే చక్కటి సానుకూల శక్తి కూడా ప్రవేశిస్తుంది.

2.లక్కీ బ్యాంబూ

ఇంట్లో ఉంటే ఈ మొక్క ఉంటే ఎంతో మంచి జరుగుతుంది. ఇంట్లో లేదా ఆఫీస్ డెస్క్ పై పెట్టుకోవచ్చు. ఈ మొక్క ఇంట్లో ఉంటే అదృష్టం వెతుక్కుంటూ రావడంతో పాటు ఆనందం కూడా మీతో ఉంటుంది.

3.ఆర్చిడ్ మొక్కలు

ఆర్చిడ్ మొక్కలను చూసే ఎవరైనా మైమరచిపోతారు. ఈ మొక్క ఇంట్లో ఉంటే అదృష్టం పెరగడంతో పాటు ఇంటి అందం కూడా పెరుగుతుంది. చాలా చక్కటి ఎనర్జీని ఇది అందిస్తుంది.

4.పీస్ లిల్లీ

ఈ మొక్క ఇంట్లో సానుకూల శక్తిని ప్రవహించేలా చేస్తుంది. మానసిక ప్రశాంతతను, సంతోషాన్ని కలిగిస్తుంది. కనుక న్యూ ఇయర్ కి ముందు ఈ మొక్కను కూడా ఇంటికి తీసుకురండి.

5.తులసి మొక్క

తులసి మొక్కను కూడా కచ్చితంగా ఇంట్లో ఉండేటట్టు చూసుకోండి. ఈ మొక్క స్వచ్ఛతకు చిహ్నం. లక్ష్మీదేవి ఈ మొక్క ఉన్న ఇంట్లో ప్రవేశిస్తుంది. ఆనందాన్ని అందిస్తుంది.

6.మనీ ప్లాంట్

కచ్చితంగా న్యూ ఇయర్ కి ముందు ఒక మనీ ప్లాంట్ ఇంట్లో పెట్టండి. ఇది అదృష్టాన్ని పెంచడంతో పాటు ఆర్థిక సమస్యలను కూడా తొలగిస్తుంది. ఒత్తిడి కూడా దూరమవుతుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.