కార్తీక పౌర్ణమి రోజు ఈ చిన్న పని చేస్తే.. కోరిన కోర్కెలు నెరవేరుతాయంట

కార్తీక పౌర్ణమి రోజు ఈ చిన్న పని చేస్తే.. కోరిన కోర్కెలు నెరవేరుతాయంట..కార్తీక పౌర్ణమి సమీపిస్తోంది. 2025 సంవత్సరంలో నవంబర్ 5వ తేదీన ఈ పవిత్ర దినం వస్తుంది.


అన్ని రోజుల్లోనూ ఇది అత్యంత పుణ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజు భక్తులు దేవుడిని శ్రద్ధాభక్తులతో పూజిస్తారు, ఉసిరి దీపం వెలిగించి తమ కోరికలు తీర్చమని ప్రార్థిస్తారు.

ఈ కార్తీక పౌర్ణమి యొక్క శుభ సమయాలను తెలుసుకుంటే, నవంబర్ 5న వచ్చే ఈ తిథి అత్యంత శక్తివంతమైనది. ఈసారి కార్తీక పూర్ణిమ తిథి నవంబర్ 4వ తేదీ రాత్రి 10:36 నిమిషాలకు ప్రారంభమై, నవంబర్ 5వ తేదీ సాయంత్రం 6:48 నిమిషాలకు ముగుస్తుంది. అందువల్ల నవంబర్ 5న సాయంత్రం వరకు పూజలు నిర్వహించవచ్చు.

ఈ కార్తీక పౌర్ణమి అత్యంత శక్తివంతమైనది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈసారి దీనికి ప్రత్యేక విశిష్టత ఉంది. ఎందుకంటే ఈ రోజు శ్రీహరి, శివుడు, లక్ష్మీదేవి – ఈ ముగ్గురు దేవతలకు అంకితమైనది. అంతేకాక, ఈ రోజు దేవతలు భూమిపైకి వచ్చి గంగానదిలో స్నానం చేస్తారని ప్రగాఢ విశ్వాసం.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ రోజు మూడు శుభ యోగాలు ఏర్పడుతున్నాయి: సర్వసిద్ధి యోగం, అమృతసిద్ధి యోగం, అశ్విని నక్షత్రం. ఈ మూడింటి సమ్మేళనం వల్ల ఈ రోజు అత్యంత పవిత్రమైనదిగా మారుతుంది. కోరిన కోరికలు నెరవేరే అవకాశం ఉంటుందని చెబుతారు.

నవంబర్ 5న వచ్చే కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో దీపం వెలిగించినవారి కోరికలు తీరుతాయని నమ్మకం. అలాగే లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా పూజించినవారికి అప్పుల బాధలు తొలగి, ఇంట ధనవర్షం కురుస్తుందని పండితులు సూచిస్తున్నారు.

(నోట్: ఈ సమాచారం మత విశ్వాసాలు, పండితుల సూచనల ఆధారంగా అందించబడింది. ఇందులో శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తి కోసం మాత్రమే.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.