చపాతీలను ఇలా తిన్నారంటే ఖచ్చితంగా బరువు తగ్గుతారు.

www.mannamweb.com


బరువు తగ్గాలని చాలా మంది ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే అన్నం మానేసి చపాతీలు తింటూ ఉంటారు. కేవలం చపాతీలు తిన్నంత మాత్రాన బరువు తగ్గిపోరు.

చపాతీలను ఎలా తింటున్నామన్నది కూడా చాలా ముఖ్యం.

ఎప్పుడూ తినే సాధారణ చపాతీల కంటే ఇలా నెయ్యి వేసుకుని చపాతీలు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది. అలాగే బరువు కూడా తగ్గుతారు. నెయ్యి తింటే చాలా మంది బరువు పెరుగుతారు అనుకుంటారు. ఇందులో ఏ మాత్రం నిజం లేదని నిపుణులు చెబుతున్నారు.

చపాతీని నెయ్యితో తింటే ఇందులో ఉండే గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది చాలా తగ్గుతుంది. కాబట్టి షుగర్ లెవల్స్ కూడా పెరగవు. నెయ్యి, కూర వేసుకుని చపాతీ తింటే.. ఒక్క దానికే కడుపు నిండిపోతుంది. దీంతో ఎక్కువ తినలేరు.

చపాతీ మీద నెయ్యి వేసుకుని తింటే బరువు పెరిగి పోతామన్న అపోహ పక్కన పెట్టండి. ఈ కాంబినేషన్ తినడం వల్ల బరువు తగ్గుతారు. అంతే కాకుండా శరీరానికి సంబంధించిన ఎన్నో ప్రయోజనాలు కూడా కలుగుతాయి.

నెయ్యి రొట్టె తినడం వల్ల శరీరంలోని హార్మోన్లు కూడా బ్యాలెన్స్ అవుతాయి. చెడు కొలెస్ట్రాల్ తగ్గి.. మంచి కొవ్వులు అనేవి పెరుగుతాయి. జీర్ణ సంబంధిత సమస్యలు కూడా ఉండవు. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి ఎలాంటి డౌట్ లేకుండా నెయ్యి చపాతీ తినడం మంచిది.