ఈ ఏరియాల్లో ఇన్వెస్ట్ చేస్తే తిరుగుండదు.. ట్రాఫిక్ సమస్య ఉండదు కాబట్టి ఎగబడతారు!

హైదరాబాద్ లో స్థలం కొనలేకపోతున్నామని బాధపడుతున్నారా? ధరలు తక్కువ ఉన్నప్పుడే హైదరాబాద్ లో స్థలం కొనుక్కుని ఉంటే ఈ పాటికి రిచ్ అయిపోదుమని అనుకుంటున్నారా?
అయితే మీ కోసమే ఈ అవకాశం. హైదరాబాద్ లో కొనలేకపోయినవారికి నగర శివారుల్లో కొనుగోలు చేసి ధనవంతులయ్యే అవకాశం ఉంది. నగర శివారుల్లో స్థలం కొంటే అక్కడ డిమాండ్ ఏముంటుంది అనుకోకండి. ఫ్యూచర్ లో అక్కడ స్థలాలు డైమండ్స్ లా మారిపోతున్నాయి. మరి డిమాండ్ కి తగ్గట్టు డైమండ్ గా మారే ఏరియాలపై ఓ లుక్కేయండి.


ఔటర్ రింగ్ రోడ్ కి రెండు వైపులా మెరుగైన రోడ్ నెట్ వర్క్ ను నిర్మించడమే లక్ష్యంగా హెచ్ఎండీఏ పని చేస్తుంది. నగర శివారు ప్రాంతాల్లో కొత్త రోడ్లను నిర్మిస్తుంది. అది కూడా ఐటీ కారిడార్ కి కనెక్ట్ అయ్యేలా ఈ రోడ్లను నిర్మిస్తుంది. గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ 33 రేడియల్ రోడ్లతో పాటు వాటికి అనుసంధానంగా లింకు రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. దీని వల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో పట్టణీకరణ మరింత వేగవంతమైంది. ఇప్పటి వరకూ 137కి పైగా లింకు రోడ్ల నిర్మాణ పనులు చేపట్టారు. వీటిలో ఐటీ కారిడార్ పరిధిలో ఉన్నవే త్వరగా పూర్తయ్యాయి. ఐటీ కారిడార్ ని ఆనుకుని పెద్ద మొత్తంలో నివాస ప్రాంతాలు విస్తరిస్తున్నాయి. దీని కారణంగా ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని లింక్ రోడ్స్ ని డెవలప్ చేస్తున్నారు. దీని వల్ల ట్రాఫిక్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. కాబట్టి సాఫ్ట్ వేర్ ఉద్యోగులు సిటీకి దూరమైనా గానీ ఈ ప్రాంతాల్లో ఇల్లు కొనడానికి లేదా స్థలం కొనడానికి ముందుకొస్తారు. కాబట్టి ఇప్పుడు కనుక ఆ ఏరియాల్లో స్థలం కొని పెట్టుకుంటే భవిష్యత్తులో మంచి లాభాలను పొందవచ్చు.

ఐటీ కారిడార్ వైపు తెల్లాపూర్, నార్సింగి, మణికొండ ఏరియాలు ఉన్నాయి. అయితే తెల్లాపూర్ నుంచి శంకరపల్లి వరకూ ఒక లింక్ రోడ్డును నిర్మించేందుకు గత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆల్రెడీ తెల్లాపూర్ నుంచి ఈదుల నాగులపల్లి వరకూ ఒక రోడ్డును నిర్మించారు. ఈదుల నాగులపల్లి నుంచి మోకిలా, కొండకల్ ప్రాంతాలను కలుపుతూ శంకరపల్లి వరకూ మరొక రోడ్డు నిర్మిస్తున్నారు. ఇలా శివారు ప్రాంతాల్లో అవుటర్ రింగ్ రోడ్ కి ఇరువైపులా ఉన్న ప్రాంతాలను కలుపుతూ కొత్త రోడ్లను నిర్మిస్తున్నారు. దీనివల్ల ఐటీ కారిడార్ వైపు మెరుగైన రోడ్ కనెక్టివిటీ అనేది అందుబాటులోకి వస్తుంది. ఈ లింక్ రోడ్లు అందుబాటులోకి వస్తే ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ కష్టాలు ఉండవని.. లింక్ రోడ్ల వల్ల ప్రధాన రోడ్ల మీద ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని అంటున్నారు. కాబట్టి తెల్లాపూర్, నార్సింగి, మణికొండ, శంకరపల్లి, మోకిలా, కొండకల్, ఈదుల నాగులపల్లి వరకూ ఈ ఏరియాల్లో ఎక్కడ ప్రాపర్టీ కొనుగోలు చేసినా భారీ లాభాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు.

స్థలాల ధరలు(చదరపు అడుగుల్లో):

తెల్లాపూర్: రూ. 4,200/-
నార్సింగి: రూ. 5,450/- నుంచి రూ. 10,900/-
మణికొండ: రూ. 12,650/-
శంకరపల్లి: రూ. 1900/- నుంచి రూ. 2,500/-
మోకిలా: రూ. 5,500/-
కొండకల్: రూ. 3,900/-
ఈదుల నాగులపల్లి: రూ. 5,000/- నుంచి రూ. 5,600/-
అపార్ట్ మెంట్ ధరలు (చదరపు అడుగుల్లో):

తెల్లాపూర్: రూ. 7,150/-
నార్సింగి: రూ. 9,950/-
మణికొండ: రూ. 7,750/-
శంకరపల్లి: రూ. 2,300/-
మోకిలా: రూ. 3,200/-
కొండకల్: రూ. 6,500/-
గమనిక: ఈ ధరలు పలు వెబ్ సైట్స్ నుంచి సేకరించినవి. ఇవే ధరలు ఉండకపోవచ్చు. గమనించగలరు.