ఒత్తైన పొడుగైన జుట్టు కావాలంటే.. మీ షాంపూలో ఇవి కలపండి

www.mannamweb.com


ఒత్తైన, పొడవైన జుట్టు ఉంటే వచ్చే అందమే వేరు. కానీ ఇప్పుడున్న కాలంలో జుట్టుకు పెరగడం పక్కన పెడితే.. ఉన్న జుట్టే ఊడిపోతుంది. పల్చగా, డల్‌గా అందవిహీనంగా కనిపిస్తుంది.

మగవారికి అయితే బట్ట తలలే కనిపిస్తున్నాయి. ఒత్తిడిని కూడా ఎక్కువగా తీసుకోవడం, పోషకాలు ఉన్న ఆహారాలు తినకపోవడం, కాలుష్యం కారణంగా కూడా జుట్టు రాలుతూ ఉంటుంది. జుట్టును కాపాడు కోవడం కోసం ఎంతో ఖరీదైన షాంపూలు, నూనెలు వాడుతూ ఉంటారు. కానీ వీటి వల్ల ఫలితం పెద్దగా ఉండదు. అన్నీ అందరికీ పడవు. కానీ పెద్దగా ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే వస్తువులు, పదార్థాలు ఉపయోగించి కూడా మనం జుట్టును ఒత్తుగా, పొడుగ్గా, నల్లగా మార్చుకోవచ్చు. ఇప్పటికే జుట్టుకు సంబంధించిన చిట్కాలు ఎన్నో తెలుసుకున్నాం. ఇప్పుడు కొత్తగా మీ కోసం తీసుకొచ్చాం. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.

ఏం కావాలి?

మీరు వాడేది సాధారణ షాంపూ అయినా సరే.. ఇప్పుడు చెప్పే మూడు పదార్థాలు కలిపి ఉపయోగిస్తే మీ జుట్టు బలంగా, దృఢంగా మారుతుంది. రెండు స్పూన్ల కాఫీ పొడి, ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడి, రెండు స్పూన్ల తేనె.. ఈ మూడింటిని మీ షాంపూలో కలిపి ఉపయోగిస్తే ఎంతో పవర్ ఫుల్‌గా పని చేస్తాయి. మీ షాంపూలో వీటిని కలిపి తల స్నానం చేయండి. ఖచ్చితంగా నెల రోజుల్లోనే ఫలితం కనిపిస్తుంది.

ఎలా ఉపయోగించాలి?

ముందు మీరు తలస్నానం చేసే ముందు ఒక గిన్నెలో మీకు ఎంత షాంపూ కావాలో అంత క్వాంటిటీ తీసుకోవాలి. అందులో రెండు స్పూన్ల కాఫీ పొడి, ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడి, రెండు స్పూన్ల తేనె వేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చక్కగా జుట్టు అంతా పట్టించాలి. కాసేపు వేళ్లతో సున్నితంగా మర్దనా చేసుకోవాలి. ఆ తర్వాత తల స్నానం చేస్తే సరిపోతుంది. ఇలా వారంలో రెండు సార్లు అయినా వీటిని ఉపయోగించి తల స్నానం చేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల జుట్టు బలంగా, దృఢంగా తయారవుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)